క్రూరమైన సవతి కొడుకు 2 Telugu kathalu |Telugu Stories |Bedtime Dreams Telugu| Kattapa kathalu

అతని పేరు బాలు అతను తన తండ్రి అయిన రామయ్య తో నివసిస్తూ ఉండేవాడు. అతను వాళ్ళ చిన్నమ్మ కూతురు బేబీ తో ఆడుకుంటూ ఉండగా. ఆమె బాలుతో…. బాలు ఈరోజు మా అమ్మ నా కోసం హల్వా చేసి పెట్టింది అది ఎంత బాగుందో తెలుసా. అంతే కాదు మా అమ్మ నేను ఏమి అడిగినా చేసి పడుతుంది. నాకు అన్ని నోట్లోనే పెడుతుంది. మా అమ్మంటే నాకు చాలా ఇష్టం. మరి మీ అమ్మ నీ కోసం ఏం చేస్తుంది.
ఆ మాటలు బాలు బాధపడుతూ ఏడవడం మొదలు పెడతాడు. ఆమె…. అయ్యో ఏమైంది బాలు ఎందుకు ఏడుస్తున్నావ్.
బాలు…. మా అమ్మ చచ్చిపోయింది. నాకు అమ్మ ఎవరు లేరు. అంటూ ఏడుస్తాడు.
అప్పుడు ఆమె….. అయ్యో బాలు బాధపడకు. అంటూ ఓదారుస్తుంది ఆ తర్వాత అతను అక్కడనుంచి వెళ్ళి పోతాడు. అతను ఇంటిదగ్గర ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ బాధపడుతూ ఉండగా తండ్రి అప్పుడే అక్కడికి వస్తాడు. పిల్లవాడిని చూసి… ఏమైంది బాబు ఎందుకు ఏడుస్తున్నావు.
బాలు…. నాకు అమ్మ కావాలి. నాకు అమ్మ కావాలి మా అమ్మనీ నాకు తీసుకుని రా .
నా స్నేహితులందరికి వాళ్ళ అమ్మ వాళ్ళకి నోట్ల గోరుముద్దలు పడుతుందట. ఒడిలో పడుకోబెట్టుకొని. లాలి పాటలు పాడుతుందట. కబుర్లు చెబుతుందట కథలు .
చెబుతుందట నాక్కూడా మా అమ్మ కావాలి .
మా అమ్మతో ఆడుకోవాలి. అంటూ ఏడుస్తాడు తండ్రి…. బాలు అలా మాట్లాడకు. మీ అమ్మ ఎక్కడికి వెళ్ళలేదు దేవుడి దగ్గరికి వెళ్లి అతన్ని పలకరించి రావడానికి వెళ్ళింది త్వరలో వచ్చేస్తుంది.
బాలు…. నువ్వు చెప్పేదంతా అబద్ధం మా అమ్మ చనిపోయిందనీ చాలామంది నాతో అన్నారు . ఆమె ఇంక ఎప్పటికీ తిరిగి రాదంట.
నన్ను నువ్వు అని నాకు అబద్దాలు చెప్పకు నాకు అమ్మ కావాలి. మా అమ్మ కాకపోతే నాకు మరో అమ్మ నీ అయినా తీసుకుని రా.
అని పెద్ద పెద్దగా ఏడవడం మొదలు పెడతాడు. అందుకు తండ్రి ఏం చేయాలో అర్థం కాక ఆలోచనలో పడతాడు . బాలు తిండి కూడా సరిగా తినకుండా. ఇంట్లో ఉన్న వస్తువులన్నీ పగలగోడుతూ….. నాన్న అమ్మని తీసుకుని రాకపోతే . నేను అసలు ఇలా గే తినకుండా ఉండిపోతాను. అంటూ అన్నాన్ని కూడా విసిరి కొడుతూ ఉంటాడు.
తండ్రి చాలా కోపంగా అతన్ని కొట్టి…..
ఏరా నీకు ఎంత మదము పడితే ఇలా చేస్తావు. నువ్వు భోజనం లేక ఎంతమంది అల్లాడిపోతున్నారు తెలుసా అంటూ అతన్ని కొట్టడం మొదలు పెడతాడు.
అతను ఏడుస్తూ… అమ్మ అమ్మ hum hum అమ్మ. hum అమ్మ. అరుపులు విని పక్కనే ఉన్న శకుంతల అక్కడకు వచ్చి….. బావ బావ ఆపు బావ ఎందుకు కొడుతున్నావ్ వాడిని.
అతను….. జరిగిన విషయం అంతా చెప్తాడు . అప్పుడు ఆమె… వాడు అడిగిన దాంట్లో తప్పేముంది బావా. ఎంతకాలమని నువ్వు ఇలా ఒంటరిగా ఉంటావు. మీకు వయసు అయిపోలేదు. వాడికి తల్లి అవసరం చాలా ఉంది. నా మాట విని మరో పెళ్లి చేసుకో బావా. అతను…నేను పెళ్లి చేసుకుంటే వచ్చే అమ్మాయి వీడిని సరిగ్గా చూసుకుంటుందని నమ్మకం లేదు శకుంతల.
శకుంతల….. బావ బయట నుంచి వస్తేనే కదా . మన కుటుంబం గురించి తెలిసిన అమ్మాయి అయితే . అలాగే మన కుటుంబంలో అమ్మాయి అయితే కచ్చితంగా మనకి అనుకూలంగా ఉంటుంది బాబుని బాగా చూసుకుంటుంది. అలాంటి అమ్మాయి నేను చూసి పెడతాను అసలు ఎవరో కాదు
నా చెల్లెలు శ్యామల ఉందిగా . దాంతో నేను మాట్లాడుతాను దాన్ని ఒప్పించి పెళ్లి చేస్తాను.
అని అంటుంది. ఆ విషయమే వెళ్లి శ్యామల తో మాట్లాడుతుంది.
ఆ మాటలు విన్న శ్యామల కోపంగా… నువ్వు అసలు నాకు అక్క వేనా. ముందే పెళ్లి ఒక పిల్లోడు ఉన్నా అతనికి నన్ను ఇచ్చి పెళ్లి చేయాలను ఉంటున్నావా.
ఆమె…. ఒసేయ్ బయట వాళ్ళు ఎలా ఉంటారో మనకు తెలియదు. మీ బావనీ పెళ్లి చేసుకొని నేను నరకం అనుభవించాను చివరికి ఏం జరిగింది చెప్పు . బేబీ పుట్టిన తర్వాత వదిలేశాడు వెళ్లిపోయాడు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో కూడా తెలియట్లేదు.
అందుకే నా మాట విను రామయ్య బావ చాలా మంచివాడు. ఎలాంటి చెడు అలవాట్లు లేవు. నా మాట విని కాదనకు పెళ్లి చేసుకో ఉంటుంది. ఎందుకు ఆమె కొన్నిరోజులు నాకు సమయం నేను ఆలోచించుకొని చెప్తాను.
అందుకు శకుంతల సారీ ఉంటుంది శ్యామల ఆలోచనలో పడుతుంది. తన మనసులో…. నేను బాగా ఆలోచించాను రామయ్య నాకు సరైన జోడీ అనుకుంటున్నాను. కానీ బాలు సంగతి ఆలోచించాలి. తర్వాత చిన్నగా ఏదో ఒకటి చెప్పి వాడినీ హాస్టల్ కి పంపిస్తే సరిపోతుంది. అని అనుకో నీ అక్క తో పెళ్లికి సర్వే చెబుతోంది.ఇక ఆ విషయమే ఆమె అమ్మాయితో మాట్లాడుతుంది. కొన్ని రోజులు గడిచాయి వాళ్ళిద్దరికీ పెళ్లి జరుగుతుంది.
ఆ పెళ్లి తో తనకి తల్లి దొరికింది అని బాలు సంతోషానికి హద్దులు లేకుండా ఉంటాయి.
అమ్మ అమ్మ అంటూ ఆమె చుట్టూ తిరుగుతూ ఉంటాడు రోజులు గడిచాయి.
ఒకరోజు బాలు తన తల్లి దగ్గరికి వెళ్లి…. అమ్మ నాకు ఈ రోజు బిర్యానీ తినాలని ఉంది ఎందుకంటే బేబీ వాళ్ళ అమ్మ కూడా బిర్యానీ చేసింది అంట. నాకు కూడా కావాలి.
ఆమె… ఇప్పుడు నాకు చేసే అంత సమయం లేదు. నేను వెళ్లి తీసుకొని వస్తాను ఆగు అని చెప్పి శకుంతల తన దగ్గరకు వెళ్లి…… అక్క ఏంటి ఈ రోజు బిర్యాని చేస్తావా . బేబీ చెప్పిందంతా వాడికి. వాడు బిర్యానీ కావాలి అంటున్నాడు.
శకుంతల…. అవునే చేశాను కానీ అయిపోయింది. ఇప్పుడేమో అవుతుంది కొంచెం సేపు పని ఎక్కువ అవుతుంది అంతేగా వాడికి ఇష్టం అంటున్నాడు గా చేసి పెట్టు.
ఆమె…. ఇలా అడిగిందిల్ల చేసి పెడితే.
వాడు నా మాట వినకుండా నా నెత్తిన ఎక్కి కూర్చుంటాడు. నువ్వు బాగా చెప్పావు.
అంటూ ఉండదా బేబీ ఎక్కడ వస్తుంది.
బేబీ ని చూసి శ్యామల…. ఒసేయ్ బేబీ నువ్వు ఇంట్లో ఏమన్నా తింటే .ఇంట్లోనే తిని దాని సంగతి అక్కడే వదిలి అంతేగాని బాలు దగ్గరకు వచ్చి నేను తిన్నాను మా అమ్మాయి చేసింది అది చేసింది అని మాత్రం చెప్పకు .
ఈసారి అలా చెప్తే చంపల వాయిస్తాను జాగ్రత్త .
అని చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోతుంది.
ఆ మాటలకి బేబీ ఏడవడం మొదలు పెడుతుంది.
శకుంతల…. ఈరోజు మీ పిన్ని ఏదో పిచ్చి పట్టినట్టు ఉంది అలాగే మాట్లాడుతుంది. ఏడవకు బేబీ. అని ఆమెను ఓదారుస్తుంది.
రోజులు గడిచాయి శ్యామల బాలుని పెద్దగా పట్టించుకునే ది కాదు. ఒక రోజు అతను…. అమ్మ నాకు ఏమన్నా కథలు చెప్పమ్మ నువ్వు నాకు గోరుముద్దలు తినిపిస్తూ కథలు చెప్తే వినాలని ఉంది అమ్మ. కథలు చెప్పమ్మా అని చాల ప్రేమగా జాలిగా అడుగుతాడు.
ఆమె కోపంగా అతని వైపు చూస్తూ…. నీకు పని పాట లేదా ఎప్పుడు అమ్మ అమ్మ అని నా చుట్టే తిరుగుతావు కథలు చెప్పే అంత ఓపిక నాకు లేదు మీకు ఆకలైతే వెళ్లి పెట్టుకొని తిను అంతేకాని విసిగించకు మీ నాన్న వచ్చే సమయం అయ్యింది. ఆయనకు నేను రోటీ తయారు చేస్తున్నాను. వెళ్ళు అంటూ అతన్నీ
కసురుకు oటుంది.
అతను చాలా బాధగా అక్కడ్నుంచి వెళ్తాడు
ఇంట్లో బేబీ అక్కడికి వస్తుంది. బేబీ…. బాలు ఏంటి ఇక్కడ కూర్చున్నావు. అతను…. నాకు ఒకసారి అమ్మ చేతి గోరుముద్ద తినాలని ఉంది. కానీ మా అమ్మనీ అడిగితే తిట్టి ఇక్కడికి పంపించింది నన్ను పెట్టుకో అని సమాధానం చెప్పింది. ఇంకేం చేయాలి చెప్పు.
అంటూ చాలా బాధపడతాడు బేబీ… సరే రా మా అమ్మ చేతి నీకు గోరుముద్దలు తినిపిస్తను. అని చెప్పి శకుంతల దగ్గరకు తీసుకు వెళుతుంది.
బేబీ అక్కడ జరిగిన విషయం చెప్తుంది .
శకుంతల….. సరే బాలు అని చెప్పి వాళ్ళ ఇద్దరికీ గోరుముద్దలు తినిపిస్తూ ఉంది. అతను వాటిని చాల సంతోషపడుతూ కంటనీరు పెట్టుకుంటాడు. శకుంతల… ఎందుకు బాలు ఏడుస్తున్నావ్.
బాలు…. నేనెప్పుడూ ఇలాగా తినలేదు . అమ్మ అంటూ ఆమెను కౌగిలించు కుంటాడు.
అప్పుడే అటుగా వెళ్తున్న రామయ్య దాన్ని చూస్తాడు. అతను చాలా బాధపడుతూ ఇంటికి వెళ్లి శ్యామలతో…. అలా నా కొడుకు తల్లి అవసరం ఉందని. నిన్ను పెళ్లి చేసుకున్నాను కానీ నువ్వు వాడి గురించి పట్టించుకోవడం లేదు వాడికి అమ్మ ప్రేమ ని చూపించు. మీకంటే శకుంతలా చాలా మంచిది తన బిడ్డ కాకపోయినా చేరదీసి గోరుముద్దలు తినిపిస్తుంది.
అని చెప్పి లోపలికి వెళ్ళాడు. ఆ మాటలు విన్న శ్యామలా కోపంగా తన అక్క దగ్గరకు వెళ్లి…. అక్క బాలు ఎక్కడ.
శకుంతల… ఇప్పుడే భోజనం చేసి వాళ్ళ అక్క దగ్గర పడుకున్నాడు. పడుకొనిలే రేపు ఉదయాన్నే వస్తాడు.
అందుకు ఆమె …. ఏం అవసరం లేదు అంటూ లోపలికి వెళ్ళే వాణి నిద్రలేపి…. ఏరా కొద్దిసేపు ఆలస్యమైతే చచ్చిపోతావా . ఎప్పుడు తిండి తిండి తిండి కోసం పుట్టావా. అంటూ అతనిని కొట్టడం మొదలు పెడుతుంది . శకుంతల…. శ్యామల ఎందుకు ప్రవర్తిస్తున్నావు. వాడు చిన్నపిల్లోడు తగని చోట తగిలితే వాడి ప్రాణానికి ప్రమాదo
ఆమె… పోతే పోనీ నువ్వు ఏమవుతుంది
మాకు కూడా ఉన్న అడ్డు పోతుంది.
అని వాడిని తీసుకొని వెళుతుంది రోజులు గడిచాయి. ఏదో ఒక వంకతో ఆమె బాలు నేను తిట్టడం కఠినంగా కాలు తో కొట్టడం లాంటివి చేస్తుంది. ఆమె అలా చేయడంతో ఆమె పైన బాలు ద్వేషం పెంచుకుంటాడు. రోజులు గడిచాయి ఆమె గర్భాన్ని ధరిస్తుంది .
ఆ వంకతో ఇక ఇంటి పనులన్నీ బాలు చేత చేయిస్తూ ఉంటుంది. విసిగిపోయిన బాలు
విశ్రాంతి తీసుకుంటున్న ఆమె దగ్గరకు వెళ్లి …. నువ్వు నన్ను కొడుతున్నావ్వు తిడుతున్నావు నువ్వు నా తల్లి వి కాదు. ఆమె…. రేయ్ మదము ఎక్కిందా . చంపి బావిలో పడేస్తా జాగ్రత్త. అప్పుడతను…. నువ్వు చెప్పడం కాదు నేను నిన్ను చంపుతాను అంటూ ఆమెను కర్రతో కొడతాడు.
ఆమె పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటుంది.
ఇందులో అరుపులకి శకుంతలా వస్తుంది.
బాలు కచ్చితంగా తల్లి గర్భం పైన బలంగా కొట్టడానికి కాలును ఎత్తాడు . అప్పుడే శకుంతల వచ్చి అతని పక్కకి లాగుతుంది.
ఆమె….రే బాలు ఎంత పని చేయబోవు మీ అమ్మ ప్రాణాలు తీస్తావా. మీ అమ్మ కడుపులో మీ తమ్ముడు ఉన్నాడు రా.
బాలు… అమ్మ ఈమె అసలు అమ్మే కాదు. నువ్వే నాకు అమ్మ వి. ఇప్పుడైనా గోరుముద్దలు వినిపించిందా. ప్రేమగా పిలిచి కథలు చెప్పిందా. అలాంటివి ఏమీ చేయలేదు అలాంటప్పుడు మా అమ్మ ఎలా అవుతుంది. నా చేత కఠినమైన పనులు చూపిస్తుంది ఇష్టం వచ్చినట్టుగా నన్ను కొడుతుంది చూడమ్మా అంటూ తన గాయాలను చూపిస్తాడు. శకుంతల చాలా బాధ పడుతూ… శ్యామల ఏంటిది నువ్వు కూడా తల్లివి కాబోతున్నవ్వు. నీ కొడుకును కూడా ఇలాగే చూసుకుంటా వా.
వాడు నీ మీద ప్రేమ కు బదులు ద్వేషాన్ని పెంచుకున్నాడు. ఇలా అవ్వడానికి కారణం నువ్వే. నీకు పుట్టబోయే బిడ్డని నువ్వు వీడిని హించినట్టు . బాలు వాడిని హింసిటై ఎలా ఉంటుంది. ఆ మాటలకి ఆమె తలదించుకుంది. శకుంతల బాలు కి అర్థం అయ్యే విధంగా చెప్తుంది. అప్పుడు అతను తన తప్పు తెలుసుకొని…. అమ్మ నన్ను క్షమించు అంటూ శ్యామల దగ్గరికి వెళ్తాడు.
శ్యామల ఏడుస్తూ…. నువ్వే నన్ను క్షమించాలి రా. నువ్వు చేసిన తిరుగుబాటుతో నా కళ్ళు తెరుచుకున్నాయి అంటూ అతనిని హత్తుకుని ఉంది. ఇక ఆరోజు నుంచి ఆ తల్లి చాలా ప్రేమగా ఉంటారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *