క్రూరమైన సవతి కొడుకు Telugu kathalu |Telugu Stories |Bedtime Dreams Telugu| Kattapa kathalu

కోదండాపురం అనే ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో వరలక్ష్మి , వెంకటేష్అనే భార్య భర్తలు ఉండేవాళ్ళు. వెంకటేష్కి ఇదివరకే పెళ్లి జరిగి చనిపోవడంతో వరలక్ష్మి మరో పెళ్లి చేసుకున్నాడు. మొదటి భార్యతో అతనికి ఒక బిడ్డ ఉన్నాడు అతని పేరు సిద్ధూ.
వరలక్ష్మి సిద్ధుని సరిగా చూసుకునేది కాదు. ఒకరోజు సిద్దు…. అమ్మ నాకు కొత్త బట్టలు కొని పెట్టమ్మా. నేను ఎప్పుడూ ఒకే బట్టలు వేసుకున్న అని అందరు నన్ను ఎగతాళి చేస్తున్నారు . నాకు ఒక చొక్కా , నిక్కర్ కొని పెట్టు. వరలక్ష్మి…. అయ్యో పాపం ఏంటి బాబు నిన్ను ఎగతాళి చేస్తున్నారా. అందుకే రా నువ్వు ఇలాగా కుళ్లిపోయావు.
అని ఎటకారంగా మాట్లాడడం మొదలు పెడుతుంది అతను ఏడుస్తూ…. అమ్మ అది కాదమ్మా ఒకసారి నేను చెప్పేది వినమ్మ.
ఆమె… ఏంటి నువ్వు చెప్పేది నేను వినేది. డబ్బులు ఏమన్నా ఊరికే చెట్లు కాస్తన్న వి అనుకుంటున్నావా మీ నాన్న ఒక్కడు సంపాదిస్తే . మనిద్దరం కూర్చుని తింటున్నాము. నీకు ఏమన్నా కావాలి అంటే నీకు నువ్వుగా వెళ్లి సంపాదించుకో . అంతకంటే చేయగలిగింది ఏదీ లేదు . అని అంటుంది అందుకు అతను ….. సరే అని చెప్పి బయటికి వెళ్లాడు పని కోసం వెతుకుతూ ఉంటాడు.
అతనికి ఒక షాప్ లో పని దొరుకుతుంది. అందులో పని చేసుకుంటూ వచ్చిన డబ్బులు దాచి పెట్టుకుంటూ ఉంటాడు .
అలా రోజులు గడిచాయి ఒక రోజు ఆమె… ఏరా బడుద్దాయి . డబ్బులు బాగా సంపాదించి దాచిపెడుతున్టున్నావు . ఎక్కడ దాచి పడుతున్నారో అర్థం కావట్లే .ఎక్కడ దాచి పెట్టాడు డబ్బులు నాకు ఇవ్వు నేను మంచి పట్టు చీర కనుక్కోవాలి . మీ నాన్న ని అడిగితే నాకు కొన్ని ఇవ్వడం లేదు. అతను…. అమ్మ నా ఒంటి మీద చొక్కా కూడా లేదు . నేను రోజూ ఇలాగే పనికి వెళ్తున్నాను . మొన్న చొక్కా పూర్తిగా చినిగిపోయింది అమ్మ . డబ్బులు దాచి పెట్టుకోండి మంచి చొక్కా పాంట్ కొనుక్కుంటాను . నీకు చీర కావాలంటే ఇంకొక నెల రోజులు ఆగమ్మ . నాకు డబ్బులు వస్తాయి. అని అంటాడు అందుకు ఆమె…. మాటలు బాగానే నేర్చావు లే కానీ డబ్బులు ఇవ్వు . నోరు మూసుకొని డబ్బులు ఇవ్వు.
అంటూ అతన్ని కొట్టి మరీ డబ్బులు లాక్కుంటుంది. అతను చాలా బాధపడతాడు. ఆ రోజు గడిచి పోతుంది ఆ మరుసటి రోజు
ఆమె మంచి వస్త్రాలు ధరించుకొని ఇంట్లో తిరుగుతూ ఉంటుంది. తన సవతి కొడుకు మాత్రం అలాగే ఎంతో కష్టపడుతూ చొక్కా లేకుండా ఉండిపోతాడు. ఇలా ఉండగా ఒకరోజు ఆ భార్యాభర్తలు ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. భార్య… ఉండి సిద్దు ఇప్పుడు డబ్బు సంపాదిస్తున్నాడు.
ఆ సంపాదించిన డబ్బంతా ఏం చేస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు. వాడిని ఒకసారి అడగండి డబ్బులు ఏం చేస్తున్నావు అని .
అతను…. సరే అడుగుతాను అని అంటాడు ఇంతలో సిద్దు అక్కడికి వస్తాడు.
తండ్రి సిద్దు తో…..ఏరా సిద్దు చొక్కా లేకుండా తిరుగుతున్నావు డబ్బు సంపాదిస్తున్నావు గా ఆ డబ్బులు చోక్క కొనుక్కోవచ్చు గా .
వచ్చిన డబ్బులు మొత్తం ఏం చేస్తున్నావ్ రా.
అతను…. వచ్చిన డబ్బులు నేను ఏం చేస్తున్నా ను నాన్న బలవంతంగా అమ్మ వాటిని లాక్కుంది గా. అందుకు ఆమె…. ఏంట్రా నా మీద అబద్ధం చెప్తున్నావ్ నేను ఎప్పుడు తీసుకున్నాను.
సిద్ధూ…. అమ్మ నేను ఎందుకు అబద్దం చెప్తాను నువ్వు అబద్ధం చెబుతున్నావు మొన్ననే కదా చీర కనుక్కుంటాను డబ్బులు తీసుకున్నావు.
ఆమె…. మీ నాన్న నాకు డబ్బులు ఇస్తే నేను నీ దగ్గర ఎందుకు లాక్కుంటాను.మీ నాన్న నాకు చీర కొనుక్కుని రెండు వేల రూపాయలు ఇచ్చాడు. దాన్ని వదిలి పెట్టి నీ దగ్గర ఎలా తీసుకుంటాను . డబ్బులు అన్నీ ఏం చేస్తున్నావో చెప్పమంటే నా మీద నిందలు వేస్తున్నావా.
తండ్రి…. ఏంట్రా ఇదంతా నిజం చెప్పు డబ్బులు ఎక్కడ పెట్టావ్ అంటూ అతన్ని కొట్టడం మొదలు పెడతాడు. సిద్దు ఏడుస్తూ ఆమె తీసుకుందని పదే పదే చెప్తాడు అయినప్పటికీ అతని మాట మాత్రం అస్సలు పట్టించుకోడు.
అతను కొట్టి అక్కడ నుంచి వెళ్లిపోయిన తర్వాత తల్లి …. ఏరా ఎలా ఉంది నా దెబ్బ ఇంకొకసారి డబ్బులు నాకు ఇవ్వు అనగా ఏమి ఇవ్వలేదు అనుకో మరోసారి మీ నాన్న చేత మరో లాగా కొట్టేస్తాను. అర్థమైంది కదా అది అక్కడ నుంచి వెళ్ళిపోతుంది పాపం సిద్దు ఏడుస్తూ ….. అసలు నేను ఇక్కడ ఎందుకు అంటున్నాను నాకు అర్థం కావడం లేదు . వీళ్ళ ఎందుకు ఇలా చేస్తున్నారో కూడా నాకు అర్థం కావడం లేదు.
అనీ అతను చాలా బాధపడుతూ ఉంటాడు.
అలా రోజులు గడుస్తున్నాయి తన పని తాను చేసుకుంటూ ఉంటాడు . సవతి తల్లి…. ఏరా నెల జీతం ఎక్కడ ఉంది. నాకు ఇంకా ఇవ్వలేదు. సిద్ధూ…. నేను బట్టలు తీసుకున్నాను నా దగ్గర డబ్బులు లేవు.
ఆమె… ఎంత ధైర్యం ఉంటే మాట చెప్తాను డబ్బులు నాకు ఇవ్వమని నీకు చెప్పాను కదా మొన్న మీ నాన్న చితక్కొట్టుపిచ్చాను . సిగ్గు లేదా.ఇప్పుడు మళ్లీ ఏ మొఖం పెట్టుకొని ఇలా సమాధానం చెబుతున్నావ్ మళ్లీ మీ నాన్న చేత దెబ్బలు పడాల గాచేయమంటావా .
అని అంటుంది ఇంతలో తండ్రి అక్కడకు వచ్చి ఆమెతో……. దెబ్బలు పడాల్సింది వాడికి కాదు నీకు ఎన్ని రోజులు నీ మాటలు నమ్మి వారిని కొట్టడం తిట్టడం లాంటివి చేశాను నీవల్ల వాడికి చదువు ఆగిపోయింది.
వాడు చదవట్లేదు అని చెప్పి నువ్వే అబద్ధం చెప్పి చదువు మానిపించావు . ఇవన్నీ తెలుసుకోలేని పిచ్చి వాడిని నేను . అంటూ ఆమెను కొట్టడం మొదలు పెడతాడు ఆమె…. వద్దు వద్దు నన్ను కొట్ట కండి వద్దు నన్ను కొట్టకండి . అంటూ కేకలు వేస్తోంది ఆ తర్వాత అతను సిద్దూతో….సిద్దు ఇక నువ్వు రేపటి నుంచి బయటికి వెళ్ళే పని కి వెళ్లాల్సిన అవసరం లేదు నోరు మూసుకొని ఇది ఇంట్లో పని చేస్తూ ఉంటుంది. ఇది ఎప్పుడు నీతో సరిగ్గా ప్రవర్తించలేదని నాకు చెప్పు దీని పని చెప్తాను. అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సిద్ధూ చాలా సంతోష పడుతూ ఉంటాడు ఆమె దాన్ని చూసి…. సంతోష్ పడుకున్నావ్ కదరా . తండ్రి కొడుకులు ఇద్దరూ ఒకటయ్యారా . మీ ఇద్దరి అంతు చూస్తాను. చూస్తూ ఉండండి .
ఆ మాటలకి సిద్దు…. అమ్మ నేను ఒకటి అడుగుతాను చెప్పు నాకు తల్లి లేదు. నేను నీలోనే తల్లిని చూసుకుంటాను కానీ నువ్వు ప్రతిసారి నన్ను ఒక శత్రువు అలాగే చూస్తాను . నాకు తల్లి ప్రేమ కావాలి అమ్మ. నాకు తల్లిలాగా ఉండమ్మా . నువ్వు ఏది చెప్తే అది వింటనమ్మ . నాన్న నిన్ను అన్న మాటలు మనసులో పెట్టుకో వద్దమ్మా. దయచేసి నువ్వు ప్రేమగా నన్ను చేసుకుంటే చూడాలని ఉందమ్మా . అందరూ పిల్లలు తల్లి దగ్గర ఎంత ప్రేమగా ఉంటారు నాకు అదృష్టం లేదు . నాకు అదృష్టం కలిగించు అమ్మా అంటూ ఏడుస్తూ ఆమె కాళ్లు పట్టుకుంటా డో.
ఆమె చాలా కోపంగా….. దూరంగా జరగదా అంటూ అతన్ని కాలితో తన్ని .ఎప్పటికీ నువ్వు నాకు కొడుకు కాలేవు ఎందుకంటే నువ్వు నా సవతి కి పుట్టిన వాడివి. నీ మీద ప్రేమ ఎప్పటికి కలగదు. నీ ముసలి కన్నీటికి నేను కరిగి పోను. అని కోపంగా అక్కడి నుంచి వెళ్లి పోతుంది అలా రోజులు గడిచాయి సిద్దు రోజు బడికి వెళ్తే ఉంటాడు.
కానీ ఆమె వాడికి భోజనం పెట్టేది కాదు.ఆ
విషయాన్ని తన తండ్రికి చెప్పే వాడు కూడా కాదు . ఒకరోజు సిద్దపడి కి వెళ్తూ ఉండగా
తండ్రి….. ఏరా మధ్యాహ్నం బాక్స్ తీసుకెళ్లలేదు ఏంటి.
సిద్దు …. నాన్న బడి ఇక్కడే కదా అందుకే నేను ఇంటికి తిరిగి వస్తున్నాను.
తండ్రి…. మీ స్కూల్లో అలా బయటకు పంపించరు కదరా . నిజం చెప్తావా నాలుగు దెబ్బలు కొట్ట మంటావా. అని గట్టిగా అడగడంతో సిద్దు ఏడుస్తూ….. నాన్న నాన్న అంటూ ఉంటాడు ఇంతలో తల్లి అక్కడికి వచ్చి… ఏంటి వాడిని అడిగితే వాడేం చెప్తాడు నేను చెప్తాను విను . నేను వాణి సరిగా చూసుకోవడం లేదు ఎందుకంటే వాడు నాకు పెట్టలేదు కాబట్టి. పని అంటే నాకు ఇష్టం లేదు మీకు పెళ్లి కి ముందే చెప్పాను పిల్లాడు ఉండదు ఇంట్లో ఉండకూడదనీ . నువ్వు హాస్టల్లో చేర్పిస్తే అన్నావు . కానీ అది చేయలేదు వాడు తిండి తిని రెండు రోజులు అవుతుంది అలాగే ఇంకొక రెండు రోజులు పోతే చచ్చిపోతాడు. వాడిని చంపు కుంటావో లేదా బతికించుకోవడం కోసం హాస్టల్ కి
పంపించు కుంటావో నీ ఇష్టం .
అని సమాధానం చెబుతుంది దాన్ని విన్న అతను చాలా. కోపంగా….. ఒసేయ్ నీకు ఏమైంది అసలు పిల్లాడు అంటేనే మండిపడుతున్నావ్వు.ఇక్కడే ఉంటాడు కావాలంటే నువ్వు బయటికి వెళ్ళు.
ఆమె…. వెళ్తాను వెళ్లి నీ మీద కేసు పెడతాను.
పెళ్లి అయినా అవలేదు అని అబద్ధం చెప్పి నన్ను చేసుకున్నావు అని చెప్తాను . అప్పుడు తండ్రీ కొడుకులిద్దరూ వుసలు లెక్కపెట్టుకుంటూ కూర్చోండి.
అంటూ వెళ్తుండగా అతను ఆమెను పట్టుకుని లోపలికి తీసుకెళ్లి తాళం వేస్తాడు.
ఆ తర్వాత అతను బయటికి పిల్లవాడికి తినడానికి తీసుకొని వస్తాడు.
వాటిని తీసుకొని వచ్చి పిల్ల వాడికి ఇచ్చి…. ఇదిగో సిద్దు మీ బడి కి తీసుకెళ్లి మధ్యాహ్నం తిను. అని సిద్దు నీ బడికి పంపిస్తాడు.
లోపల తలుపులు వేసుకున్న ఆమె….. తలుపు తీయండి మర్యాదగా లేదంటే ఇక్కడ నేను ఉరివేసుకొని చేస్తాను. అంటూ అతన్ని బెదిరిస్తోంది ఆ మాటలు విన్న అతను తలుపు తీసాడు.
ఆమె…. ఈ నరకాన్ని అనుభవిస్తూ ఉండలేను. నాకు కష్టం కలుగుతుందంటే ఎవరైనా నాకు సమానమే వాళ్లని చంపి అయినా సరే నేను సంతోషంగా ఉంటాను.
అని అంటుంది.
అతను…. అయితే విషం కలిపి మా అబ్బా కొడుకులు ఇద్దరం తిని చచ్చిపోతాయి నీకు ఏ గొడవా ఉండదు . అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
ఆ రోజు సాయంత్రం ఒక ఆమె ఇంటికి వస్తుంది ఆమెతో…. విషాన్ని తీసుకురమ్మని చెప్పాను కదా . తీసుకొచ్చావా.
ఆమె…. తీసుకు వచ్చాను. రెండు వేల రూపాయలు అవుతుంది ఇవ్వండి.
ఆమె దాన్ని తీసుకొని…. రెండు వేల రూపాయలకు ఏం లేవు నోరు మూసుకొని వెళ్ళు. ఇంకొక్క క్షణం ఎక్కడ ఉన్నావ్ అంటే మనుషుల్ని చంపే విషన్ని అమ్ముతున్నారని పోలీస్ కేసు పెడతాను జాగ్రత్త వెళ్ళు అంటూ ఆమెను బలవంతంగా బయటకు నెట్టేస్తుంది ఆమె చాలా కోపంగా అక్కడినుంచి వెళ్తూ….. నీ పని చెప్తాను అంటూ అక్కడి నుంచి వెళ్లి పోతుంది. ఆ సంభాషణ అంతా సిద్దు వింటాడు. సిద్ధూ…. అమ్మో మా అమ్మ నన్ను మా నాన్న చంపేసి ఇలాగే ఉంది. అంటూ చాలా బాధపడతాడు. ఇంతలో ఆ విషము వచ్చిన ఆమె అతని దగ్గరికి వచ్చి…. బాబు సిద్ధూ ఎక్కడ జరిగింది అంతా చూసావు కదా . మీ అమ్మ నిన్ను మీ నాన్న చంపేయాలని చూస్తుంది . అసలు మీ అమ్మ మంచిది కాదు. నువ్వు ఇలాగే ఉంటే ఇద్దర్ని చంపేసి సంతోషంగా ఇక్కడే ఉండి పోతుంది అలా జరగడానికి వీలు లేదు మీ అమ్మ అడ్డం ని తొలగించుకో. లేదంటే ఇలాంటి వాళ్ల చేతిలో మరెంతోమంది బలే అవతారం ఏమో . అని చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోతుంది. సిద్ధూ చాలా బాధపడుతూ ఉంటాడు ఇంతలో ఆమె బట్టలు ఆరేయడానికి మేడ మీదకు వెళ్తుంది.
సిద్దు కూడా ఆమె వెనకాలే వెళ్తాడు ఆమె
బట్టలు ఆరవేస్తుండగా . ఆమెను వెనుకనుంచి డాబా పైనుంచి కిందికి తోసేస్తారు.
ఆ పెద్దగా కేక వేసి చనిపోతుంది .
సిద్దు ఏడుస్తూ….. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు కంటే ఎవరు ఎక్కువ కాదు . నువ్వు మా నాన్నని నన్ను చంపాలని చూసావు నువ్వు పెట్టిన కష్టాలకి నువ్వు చేయాలనుకున్న కొట్టడానికి ఇదే సరైన శిక్ష అంటూ ఏడుస్తూ….. భగవంతుడా నేను చేసింది చాలా పెద్ద పొరపాటు నన్ను క్షమించు అంటూ బోర్న్ ఏడుస్తాడు. రోజులు గడిచాయి అందరూ ఆమె కాలుజారి డాబా పై నుంచి పడి పోయింది అని అనుకుంటారు . తండ్రి కూడా అదే నిజం అనుకుంటాడు . ఇక అప్పట్నుంచి తండ్రి సిద్ధుని బాగా చూసుకుంటూ అతనితోనే సంతోషంగా ఉంటాడు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *