క్రూరమైన సవతి తల్లి Telugu kathalu |Telugu Stories |Bedtime Dreams Telugu| Kattapa kathalu

తొలుత పురమని ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో వర్షిని అనే చిన్న పాప ఉండేది. ఆ పాప చిన్నతనంలోనే తల్లిని పోగొట్టుకుంది. తండ్రి సిద్దయ్య మరో పెళ్లి చేసుకున్నాడు. ఆ సవతి తల్లి పేరు శారద శారద అసలు మంచి వ్యక్తి కాదు . సిద్దయ్యకు లేనిపోని అలవాట్లు అన్నీ తానే స్వయంగా చేయిస్తుంది. అతను ఒకసారి మద్యాన్ని సేవించి ఇంటికి వస్తాడు. పాప అతన్ని చూసి చాలా భయపడుతూ ఉంటుంది. అతడు పాపను చూసి…. ఏంటే ఆ బాధ పడుతున్నావ్. పుట్టినప్పుడే మీ అమ్మని చంపేసావు. ఇప్పుడు మమ్మల్ని సుఖంగా కాపురం కూడా చేసుకొని ఇవ్వట్లేదు .
ఆ మాటలకి ఆమె ఏడుస్తూ….. నా నాకు భయమేస్తుంది నాన్న. అంటూ ఏడుస్తూ మొదలు పెడుతుంది అప్పుడే ఆ సవతి తల్లి అక్కడికి వచ్చి …. ఒసేయ్ ఎందుకు భయమేస్తుంది నువ్వు మమ్మల్ని బాధపెట్టకుండా ఉంటే చాలు. భయమేస్తుంది అంట భయమేస్తుంది మీ నాన్న మనుషులా కనబడటం లేదా . బైమేయడానికి.
ఆమె…. అది కాదమ్మా. అంటూ ఉండగా సవతితల్లి…. ఏది కాదు నోరు మూసుకొని వెళ్ళి ఒక మూల కూర్చో అంటూ కాలితో ఆమెనీ కొడుతుంది. పాప దూరంగా వెళ్లి పడి…. అమ్మా అంటూ పెద్దగా అరిచి ఏడవడం మొదలు పెడుతుంది.
ఆ తర్వాత ప్రసాద్ తల్లి అతన్ని లోపలికి తీసుకు వెళ్తుంది. అతను మద్యం మత్తులో ఉండగా…. ఏవండీ ఇక ఈ అమ్మాయి మనకెందుకు . ఎక్కడికైనా పంపించొచ్చు కదా. బయట ఆశ్రమాలు చాలా ఉన్నాయి అనాధ ఆశ్రమాల్లో చేర్పిస్తే సరిపోతుంది . ఏమంటారు అందుకు అతను అనేది ఏముంది నీకు ఇష్టమైతే నువ్వే చేర్పించి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు నేను ఒక్క మాట కూడా నీకు ఎదురు చెప్పను నువ్వు నా భార్యవి. అంటూ మత్తులోనే ఉండి కింద పడిపోతాడు.
ఆమె సంతోషపడుతూ…. అమ్మయ్య ఎలాగోలా దీన్ని వదిలేసి. వస్తాను ఒక గోల వదిలిపోతుంది అని అనుకుంటుంది ఆరోజు రాత్రి సమయం పాప నిద్ర పోతూ ఉండగా పాప నీ తీసుకొని ఒక అనాధ ఆశ్రమం ముందు వదిలిపెట్టి.అటూ ఇటూ చూసి ఎవరూ లేరని నిర్ధారించుకుని అక్కడి నుంచి వెళ్లి పోతుంది . కొంత సమయం పడుతుంది ఆ ఆశ్రమానికి యజమాని అయిన శివాని అనే ఆమె పాప అక్కడ పడుకోవడం చూసి …. అయ్యో పాపం ఎవరు ఆ పాప అంటూ దగ్గరకు వెళ్తుంది. ఆమె నిద్ర పోతూ ఉండగా ఆమెనీ నిద్ర నుంచి లేపి …. పాప ఎవరమ్మా నువ్వు నిద్ర లే. అని అడుగుతుంది అందుకు పాప నిద్ర లేచి…. నేను ఇక్కడ ఉన్నాను ఏంటి. ఆమె…. పాప ఎవరమ్మా నువ్వు ఎందుకు ఎక్కడ ఉన్నావు నీకు అమ్మ నాన్న ఎవరు లేరా. పాప… నాకు అమ్మా నాన్న ఉన్నారు అంటూ తల్లిదండ్రుల గురించి చెప్తుంది దాన్ని విన్న శివాని…. మరి ఎక్కడ ఎందుకు వచ్చావ్ అమ్మ మీ ఇంటికి వెళ్దాం పద . అని అంటుంది ఆమె సరే అని చెప్పి ఆమెతో పాటు కలిసి ఇంటి దగ్గరకు వెళ్తుంది.
ఇంటికి తలుపులు వేసి ఉండటంతో…. ఎవరండీ లోపల తలుపు తీయండి అంటూ శివాని తలుపు కొడుతుంది
ఇంత రాత్రివేళ ఎవరు అంటూ లోపలున్న సవతి తల్లి బయటకు వస్తోంది. ఆమె ఎదురుగా శివాని మరియు పాపను చూసి ఆశ్చర్య పోతూ ఉంటుంది శివాని… ఏమండీ మీకు కొద్దిగా కూడా బాధ్యత లేదా. పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారో కూడా మీకు అర్థం కావటం లేదా. ఇంత రాత్రి వేళ నా ఆశయం ముందుకు వచ్చి పాప పడుకుంది. నీకు కొంచెం కూడా బాధ్యత లేదనుకుంటా ఇలా చిన్నపిల్లల్ని బయట వదిలేస్తేరా.
ఆ మాటలుకు ఆమెకి ఏం చెప్పాలో అర్థం కాక…. అయ్యో తలుపు తెరిచి ఉంది . ఆ పాపకు నిద్ర లో నడిచే రోగం ఉంది ఆరోగ్యం ఎలా ఉంది అక్కడికి వచ్చి పడుకుంది ఏమో . నేను రోజు కాపలా గానే ఉంటాను ఈ రోజు కొంచెం ఒంట్లో నలత గా ఉండి . బాగా విశ్రాంతి తీసుకోవడంతో ఇలా జరిగింది ఇలాంటి తప్పు మళ్ళీ ఎప్పుడూ జరగదులే రండి. అని చెబుతుంది అందుకు ఆమె సరే అంటూ పాపనీ అక్కడ విడిచిపెట్టి. అక్కడి నుంచి వెళ్లి పోతుంది. ఆ సవతి తల్లి పాప వైపు కోపంగా చూస్తూ… ఆ సవతి తల్లి ఆమె వైపు కోపంగా చూస్తూ చిన్న వయసులో నీకు మీ తెలివితేటలే ఇంటి పేరు , వీధి పేరు అమ్మ నాన్న పేరు అన్నీ తెలుసు అనుకుంటా. ఎక్కడో ఊరి చివర లో ఉన్న అనాధాశ్రమం లో పడి వేస్తే ఎంత గుర్తుగా ఇంటికి తీసుకు వచ్చావే ఇన్ని తెలివితేటలు నీకు అంటూ ఆమెను కొట్టడం మొదలు పెడుతుంది పాప ఏడుస్తూ… అమ్మ కొట్టివద్దు అమ్మ కొట్టవాద్దు
అమ్మా అని ఏడుస్తూ కేకలు వేస్తోంది.
ఆ కేకలకి తండ్రి నిద్ర నుంచి లేచి వస్తాడు…. ఏంటే ఏం చేస్తున్నావ్ ఏంది ఏడుస్తుంది. ఆమె… నీ కూతురు ని చంపేయాలి . ఇంత రాత్రివేళ బయటకు వెళ్లి వచ్చింది. దెయ్యాలు తిరిగే సమయంలో బయట తిరగడం ఏంటి. ఏమన్నా అయితే ఎవరు బాధ్యత అందుకే నేను ఎప్పటి నుంచో ఆశ్రమంలో వదిలిపెట్టండి అని చెప్తున్నాను . అని లేనిపోని చాడీలు చెప్పడం మొదలుపెడుతుంది తండ్రి కోపంగా వైపు చూస్తూ…. ఒసేయ్ ఒక మూలన పడుకోకుండా బయటకి ఎందుకు వెళ్లావు. అంటూ ఆమెను కొట్టి లోపల పంపిస్తాడు.
ఆ తర్వాత భార్య భర్తలు ఇద్దరు వెళ్ళి విశ్రాంతి తీసుకుంటారు . పాప కూడా ఏడుస్తూ విశ్రాంతి తీసుకుంటుంది.
ఆరోజు గడిచిపోతుంది ఆ మరుసటి రోజు ఉదయం భార్య…. ఏవండీ ఆశ్రమం గురించి ఏంటి . పాపను ఆశ్రమానికి పంపించాము ఏం మాట్లాడవేంటి.
అతను…. నా కూతురు నీకు అడ్డం ఏం వచ్చింది. నోరు మూసుకొని ఇంట్లో పడి ఉండు నా కూతురు ఎక్కడికీ వెళ్లదు. మరోసారి ఈ మా విషయం నాతో మాట్లాడావ్వు అంటే. గొంతు పిసికి నిన్ను చంపేస్తాను జాగ్రత్త. అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయారు ఆ మాటలకి చిన్నపిల్ల చాలా సంతోషపడుతు….. మా నాన్నకు నేనంటే ఇష్టమే మా అమ్మకి నేనంటే ఇష్టం లేదు. అని తన మనసులో అనుకుంటూ ఉండగా తల్లి అక్కడకి వచ్చి… ఏంటి సంతోష పడుతున్నావా మీ నాన్నకి తాగితే ఒకలాగా తాగకపోతే ఒకలాగా మాట్లాడుతున్నాడు. నేను తాగుడు అలవాటు చేసింది నాకు చెప్పుచేతల్లో మీ నాన్ననీ ఉంచుకోవడం కోసం మీ నాన్న ఇంకా
పూర్తిగా నా చెప్పు చేతి లోకి రాలేదు. పూర్తిగా వచ్చేలాగా చేస్తాను. అంటూ ఆమెను కొట్టడం మొదలు పెడుతుంది. ఆ రోజు సాయంత్రం అతను మద్యం తాగకుండా ఇంటికి వస్తాడు.
అతని ని చూసి నా భార్య తన మనసులో…. ఏంటి ఈరోజు మధ్యాo తాకకుండా వచ్చాడు
ఏం జరిగిందో కనుక్కోవాలి.
అంటూ ఏం తెలియనట్టు గా అతని దగ్గరికి వెళ్లి…. ఏమండీ ఏమైంది మీకు. అలా ఉన్నారు మీకు అంతా బాగానే ఉంది కదా.
అతను….వెళ్ళవే నా దగ్గర నుంచి నీ వల్ల నాకు మద్యం అలవాటు అయింది
ఒకప్పుడు నంద గౌరవంగా చూసే వాళ్ళు ఇప్పుడు నన్ను అందరూ తాగుబోతులుగా చూస్తున్నారు ఈ తాగుడు నాకు అవసరం లేదు. నేను ఈరోజు నుంచి తాగుడు మానేశాను. అని అంటాడు అందుకు ఆమె…. నేను ఎందుకు నీకు తాగుడు అలవాటు చేశాను. మీరే కదా నా భార్యని మర్చిపోలేక పోతున్నాను అన్నారు మీ బాధను చూడలేక నేను అలా చేశాను. ఆయన ఒక్కసారిగా మధ్యాన్ని తాగడం మానేస్తే మీ ఆరోగ్యం చెడిపోతుంది. నా మాట విని కొంచెం కొంచెం గా తీసుకుంటూ తర్వాత మానేయండి. అన్ని అబద్ధాలు చెబుతూ తనని మోసం చేసి తర్వాత మళ్లీ మద్యానికి బానిసను చేస్తోంది.
అలా రోజులు గడిచాయి అతను ఏ పని చేయకుండా ఇంట్లోనే కూర్చొని మద్యం తాగుతూ ఉంటాడు. దాన్ని చూసిన ఆమె… అనవసరంగా వీడికి మధ్యాన్ని తాగడం నేర్పించాను ఇప్పుడు ఇంట్లో ఉంటూ బయటకి వెళ్లి ఒక పని చేయకుండా ఉన్నాడు నా కొంపకి
నేనే ఎసరు తెచ్చుకొన్నా దాన్ని అయ్యాను.
అనుకుంటూ అతనితో….. ఏవండీ ఎందుకు ఇలా రోజు తాగుతున్నారు మీ ఆరోగ్యం ఏమై పోతుంది. దయచేసి నా మాట వినండి తాగొద్దు. మీరిలా తాగుతూ , ఏ పని చేయకపోతే కుటుంబం ఎలా నడుస్తుంది.
అర్థం చేసుకోండి నా మాట విని తాగుడు ఆపేయండి. అందుకే అతను కోపంగా ఆమెను…. ఏంటి నాకు ఏదో సమాధానం చెప్తున్నావు అంటూ గట్టిగా కొడతాడు. ఆమె పెద్దగా ఏడుస్తూ వద్దు అంటుంది.
ఆ కేకలు విన్న కూతురు…. నాన్న నాన్న అంటూ దగ్గరికి వస్తుంది. అప్పుడు అతను ఆమెను దూరంగా విసిరికొడతాడు. ఆ పాప దూరంగా వెళ్లి గోడకు బలంగా తగిలి తలకు గాయమై కింద పడుతుంది. అతను…. చచ్చిపోతే చచ్చిపో ఒక పీడా వదిలిపోతుంది.
అని వెళ్లి మంచం పై పడుకుంటాడు.
ఉలుకు పలుకు లేకుండా ఉన్న పాపను చూసి తల్లి …. ఏంటిది దీనికి ఉలుకు పలుకు లేకుండా పడిపోయింది కొంపదీసి చచ్చిపోయిందా. అంటూ భయపడుతూనే ఆమె దగ్గరికి వెళుతుంది. పాప తలకు తీవ్రమైన గాయాము కావడంతో రక్తం కారుతూ ఉంటుంది. దానిని చూసి ఆమె చాలా భయపడుతూ….. అయ్యో దీనిని తలకు తీవ్ర గాయమైంది . చనిపోయిందా అంటూ పట్టుకుంటుంది . పాప కొనఊపిరితో కొట్టుకుంటుది. ఆమె హాస్పిటల్ కి తీసుకెళ్దాం అనుకుంటుంది. కానీ తన మనసులో దురుద్దేశం మొదలవుతుంది….ఇప్పుడు దీన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళాను ఎందుకు డబ్బు దండగ ఇదే మంచి అవకాశం. దీని పీక పిసికి చంపేస్తాను. దీన్ని చంపింది నా భర్త అని అతన్ని నమ్మి స్తాను. అని అనుకుంటుంది ఆ రోజు గడిచి పోతుంది ఆ మరుసటి రోజు అతను నిద్ర మంది లేచే సమయానికి .
భార్య పాప శవం ముందు కూర్చుని ఏడుస్తూ…. అయ్యో నా బంగారు తల్లి మీ నాన్న చేసిన పనికి బలి ఐపోయావా. అంటూ ఏడుస్తుంది దాన్ని చూసిన అతను….అయ్యో నా బంగారు తల్లికి ఏమైంది అయ్యా నా బంగారు తల్లి ఏమైంది అంటూ ఏడుస్తాడు భార్య…. మద్యం మత్తులో నన్ను పాప ని కొట్టారు . పాప గోడ కి తగిలి తలకు గాయమై చచ్చిపోయింది. అతను ఆ మాటలకి చాలా ఏడుస్తూ… నా బంగారు తల్లి నీ నేనే చంపేశాను. నీ వల్లే ఈ మద్యానికి అలవాటు చేయడం వల్లే అంటూ ఆమెను కొట్టడం మొదలు పెడతాడు.
ఆమె ఏడుస్తూ…. ఎందుకు నన్ను ఇలా హింసిస్తున్నారు నన్ను కూడా చంపేయండి నేను కూడా వెళ్ళిపోతాను. ఆ మాటలు అతను ఊరుకొని ఏడుస్తూ ఉంటాడు.
భార్య… బాధపడకండి జరిగిందేదో జరిగిపోయింది ఎవరు కావాలని చేయరు కదా. జరగవలసిన కార్యక్రమం ఏమిటో చూడండి. బయటికి ఈ విషయం తెలిస్తే మీరు కచ్చితంగా జైలుకు వెళ్తారు. నా మాట విని ఎవరికీ తెలియకుండా పాపను పెరట్లో పూడ్చి పెడదాము. ఎవరైనా అడిగితే హాస్టల్కు పంపించమని చెప్తాం. ఆ మాటలు అతను ఆలోచిస్తూనే సరే అంటాడు ఆ తర్వాత ఇద్దరూ కలిసి పాపని పెరట్లో పూడ్చి పెడతారు. ఆ తర్వాత తిరిగి ఇంట్లోకి వస్తారు.
రోజులు గడుస్తున్న వి అతను పాపని తానే చంపాను అన్న బాధతో మరింత ఎక్కువ తాగడం మొదలు పెడతాడు. భార్య ఎంత చెప్పినా అసలు వినడు ఆమెను కూడా కొడుతూ ఉంటాడు ఆమె ఏడుస్తూ…. నేను చేసిన పాపానికి శిక్ష నేనే అనుభవిస్తున్నాను.
ఇదంతా నాకు కావాల్సిందే. అంటూ బాధపడుతుంది అతను…. నా బంగారు తల్లి నా చేతులతో నిన్ను చంపేస్తాను అమ్మ. నా బంగారు తల్లి . నిన్ను పెద్ద తప్పు చేశాను . నేను నా కన్న కూతుర్ని చంపు కున్న హంతకుణ్ణి. అంటూ ఏడుస్తూ ఉంటాడు ఇక ఆ దిగులుతో నే అతను తాగి తాగి ఆరోగ్యం చెడిపోయి మంచాన పడ్డాడు. అతను…. నేను కూడా నా భార్య పిల్లలు దగ్గరికి వెళ్ళిపోతున్నాను నువ్వు సంతోషంగా ఉండు అంటూ ఒక్కసారిగా కన్నుమూస్తాడు.
దాన్ని చూసిన ఆమె…. ఏవండీ మీరు లేకపోతే ఇంక నేను ఎవరి కోసం బతకాలి . ఏవండీ ఒక్కసారి లేవండి. అయ్యో భగవంతుడా నేను చేసిన పాపం నాకు అంటుకుంది అన్యాయంగా రెండు ప్రాణాలు తీశాను. అయ్యో అంటూ నెత్తి బాదుకుంటూ పెద్ద పెద్ద గా అరుస్తుంది. ఆమె అలా నెత్తి బాదు కోవడంతో . ఆమెకు పిచ్చి ఎక్కి పిచ్చిదాని లాగా తయారవుతుంది.
ఇక ఆమె అలాగే పిచ్చిదాని లాగా రోడ్లవెంబడి తిరుగుతూ ఉండిపోతుంది. అభం శుభం తెలియని పసి పాప ప్రాణం తీసి నందుకు . తాళి కట్టిన భర్త ని బానిసనీ చేసినందుకు .
ఆ భగవంతుడు ఆమెకు జీవిత కాలం అంతా బాధ పడే లాగా సరైన శిక్ష విధించాడు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *