క్రూరమైన సవతి తల్లి Telugu Kathalu | Telugu Stories | Telugu Moral stories

అది ఒక అందమైన గ్రామం ఆ గ్రామం లో శంభో అనే ఒక వ్యక్తి ఉండేవాడు అతని భార్య ఒట్టి కయ్యాలు పైగా తన కొడుకైన రవి సవతి కొడుకు అని అస్సలు పట్టించుకునేది కాదు. ఆ బిడ్డను ఎప్పుడూ చిత్రహింసలు పెడుతూ ఉండేది ఒక రోజు…. ఏవండి రేపట్నుంచి రవి నీ కూడా పనిలోకి తీసుకొని వెళ్ళండి. ఇక్కడే ఉండి ఏం చేస్తాడు. శంభో…. నాకు ఒక విషయం అర్థం కాలేదు.ఎందుకు నువ్వు ఇలా మాట్లాడుతున్నావు నా బిడ్డనీ నేను బాగా
చదివించుకోవాలనుకుంటున్నాను. ఆమె…. చదువు లేదు ఏమి లేదు ఇప్పటికే డబ్బులను . వాడి ముఖనా వృధాగా పోస్తున్నారు. వాడు చదువుతున్నడా చస్తున్నాడా తను ఎప్పుడు ఆటలు ఆటలు అని చెప్పి తిరుగుతూనే ఉన్నాడు.
భర్త….. చిన్నపిల్లవాడు ఆడుకోకుండా ఏం
చేస్తాడు.
ఆమె…. మీతో వాదన నాకు అవసరం లేదు రేపు నుంచి పిల్లవాడిని పనీకి తీసుకెళ్ళు. అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్లి పోతుంది. అతను తన భార్యకు భయపడి. పిల్లల్ని తనతో పాటు పని తీసుకెళ్తాడు. రవి ఎండలో బట్టలు లేకుండా ఇటుకలు మోస్తూ.
ఎంతో కష్టపడి పనిచేస్తూ ఉంటాడు దాన్ని చూసిన తండ్రి… రవి పని చేయలేకపోతున్నావా.నాన్న .
రవి…. ఎండ చాలా ఎక్కువగా ఉంది నానా.
మీరు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చాతో అర్థం కావట్లేదు నేను బాగా చదువుకుంటున్నాను . కదా నాన్న చదువుకుంటాను నన్ను బడికి పంపించండి.
అంటూ చాలా బాధగా చెప్పాడు.
అతను…. నేను ఏం చేయమంటావు రా నీ తల్లి అలాంటిది. పెళ్లి చేసుకో నేను చాలా తప్పు చేశాను .నీకు తల్లి అవసరం ఉంటుంది అనుకున్నాను కానీ అది నీ పాలిట శాపం అవుతుందని అస్సలు అనుకోలేదు.
అంటూ చాలా బాధపడ్డాడు.
రవి ఏం సమాధానం లేకుండా తండ్రి వైపు దీనంగా చూస్తూ ఉంటాడు.
తండ్రి….. సరేగాని ఎంత ఎండ కొడుతుంది రా చొక్కా ఆయన వేసుకో నిన్ను చొక్కా విప్పమని ఎవరు చెప్పారు.
రవి…. నాన్న నాకు ఉంది ఇదొక చోక్క మరకలు అయితే దాన్ని నేనే ఉతుక్కోవాలి నాకు చేతకాదు. అలా ఉన్న దాన్ని బయటకు తొడుక్కుని వెళ్తే అందరు నవ్వుతారనే భయంతో తీసేసాను అంటాడు.
తండ్రి…. మరి ఏం పర్వాలేదు అనే నేను కొత్త చుక్కాని కొనిపెడతాను. అని చొక్కా వేసుకోమని చొక్కా ఇస్తాడు.
అతను చొక్కాతో పని చేస్తూ ఉంటాడు.
అతను ధరించిన చొక్కా మురికితో పాడైపోతుంది. సాయంత్రం అవుతుంది ఇద్దరు ఇంటికి తిరిగి వెళతారు.
బట్టలు చూసిన ఆమె…. అయ్యో బంగారం లాంటి బట్టలు నాశనం చేసావ్ కదరా. ఇప్పుడు ఎవరు అవుతారు ఉతికి ఉతికి నా చేతిలో పోవాలనే నా . నీకు కొంచెమైనా బుద్ధి
లేదా. చొక్కా తీసేసి పని చేయొచ్చు కదా.
నేను ఉతకను గాని నువ్వే శుభ్రం చేసుకో.
అని అంటుంది భర్త… ఒసేయ్ వాడు చెప్తూనే ఉన్నాడు నువ్వు ఇలా అంటావని. వాడు తక్కువ కాలంలో బాలే నిన్ను అర్థం చేసుకున్నాడు. అయినా వాడికి కొత్త చొక్కా
తీసుకొస్తా అన్నాను నువ్వు అంత కష్టపడాల్సిన అవసరం లేదు వాడిని కష్టపడాల్సిన అవసరం అసలే లేదు.
ఆమె… ఏమిటి కొత్త చొక్కాలు తీసుకొస్తావా. అంతేలే ఏమైనా నీ కొడుకు తర్వాతే కదా .
నాకు ఉన్నవి రెండు చీరలు ఒంటి మీద ఒకటి ఉంటే . దండెం మీద మీద మరొకటి ఉంటుంది . నా గురించి ఆలోచించండి బయటికి వెళ్తే నా పరువు పోతుంది.
వాడికి బట్టలు తీసుకుంటే నాకు కూడా బట్టలు తీసుకొని రావలసి ఉంటుంది.
ఆనీ చెప్పి లోపలికి వెళ్తుంది. భర్త అక్కడినుంచి కోపంగా వెళ్ళిపోతాడు.
రవి చొక్కాని శుభ్రం చేసుకుంటూ ఉంటాడు.
ఇంతలో సౌవతి తల్లి వచ్చి…. ఓహో బలేగా శుభ్రం చేసుకుంటున్నావు. మరి రోజు ఎందుకు రా నా చేత పని పని చూపిస్తున్నావ్వు. ఎటు పనికి మొదలు పెట్టావు కదా. రెండు రోజుల నుంచి నాకు తీరిక లేక బట్టలు ఉతికే లేదు వాటిని కూడా శుభ్రం చెయ్యి. లేదంటే నీకు ఉండదు అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళి. బట్టలు తీసుకొని వచ్చి అతని దగ్గర నుంచి
వీటిని కూడా శుభ్రం చెయ్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. బయటికి వెళ్ళిన భర్త ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆమె ఎదురు చూస్తూ ఉంటుంది. భర్త ఒక చెట్టు దగ్గర కూర్చొని జరిగిందంతా ఆలోచిస్తూ…. లక్ష్మి నువ్వు బ్రతికే ఉన్నట్టు అయితే ఎంత బాగుండేది . నన్ను బిడ్డని ఎంతో ప్రేమగా చూసుకునే దానివి. దీన్ని పెళ్లి చేసుకొని నాకు ఆ పసిగుడ్డుకి నరకం చూపిస్తుంది. భగవంతుడా నా బిడ్డను కూడా నీ దగ్గరికి తీసుకెళ్ళి పో . ఈ నరకంలో మా బ్రతుకులు ఈర్చా లేక పోతున్నాను అంటూ బాధపడతాడు. ఇంటిదగ్గర ఆమె ఎదురు ఉండే తన ఆకలి కావడం తో శుభ్రంగా తిని
విశ్రాంతి తీసుకుంటుంది. పాపం రవి చాలా బట్టలు ఉండటంతో అతను వాటిని శుభ్రం చేస్తూ ఉంటాడు చాలా సమయం తర్వాత వాటిని శుభ్రం చేసి ఇంట్లోకి వెళ్తాడు.
తనకి చాలా ఆకలిగా ఉండటంతో తన సవతి తల్లి దగ్గరికి వెళ్తాడు. ఆమె గాఢంగా నిద్ర పోవడం చూసి…. ఇప్పుడు మా పిన్ని ని లేపితే కచ్చితంగా నన్ను కొడుతుంది. నేనే అన్నం పెట్టుకుని తింటాను అని చెప్పి వంటగదిలోకి వెళ్లి భోజనం కోసం వెతకడం మొదలు పెడతాడు కానీ అక్కడ ఏమీ ఉండదు . అక్కడ వెతుకుతున్న సమయంలో. అక్కడ ఉన్న పచ్చడి జాడి కిందపడి పగిలి పెద్ద శబ్దం వస్తుంది. ఆ శబ్దానికి తల్లి ఉలిక్కిపడి నిద్ర లేచి … ఒరేయ్ ఏం చూశారా అంటూ కోపంగా అక్కడికి వస్తుంది అక్కడ పగిలిపోయిన సీసా చూసి…. అయ్యో ఇక్కడ ఏమి చేయడానికి వచ్చాఉ రా. పచ్చడి జాడీ పగలగొట్టావ్వు కదా .అంత కోపంగా అతన్ని కొట్టడం మొదలు పెడుతుంది. అతని… వద్దు పిన్ని నన్ను కొట్టకు పిన్ని ఆకలవుతుందని వచ్చాను. ఆమె…. మీకు ఆకలైతే నన్ను నిద్ర లేపాలి. అయినా నీకోసం నేను వండి వార్చే లేదు.
రవి ఏడుస్తూ…. నిద్ర పోతున్నావు నిన్ను ఎందుకు నిద్ర లేపడం అని.
ఆమె…. అందుకుని దొంగలాగా వచ్చావు అన్న మాట నోరు మూసుకొని నీళ్లు తాగి పడుకో.
పచ్చడి మొత్తం నాశనం చేసాడు. అతను సరే అని చెప్పి అక్కడ నుంచి వెళ్తూ ఉండగా ఆమె….. ఇదంతా ఎవరు శుభ్రం చేస్తారు . ఇదంతా శుభ్రం చేసిన తర్వాత మాత్రమే నువ్వు. వెళ్లి పడుకో అని అంటుంది . అందుకు అతను సరే అని చెప్పి దాన్ని శుభ్రం చేయడం మొదలు పెడతాడు ఆమె వెళ్ళి విశ్రాంతి తీసుకుంటోంది . అతను శుభ్రంగా కడిగిన తర్వాత వెళ్ళి విశ్రాంతి తీసుకుంటాడు.
తెల్లవారిపోతుంది ఉదయాన్నే ఆమె నిద్రలేచి….. ఒరేయ్ లేకపోతే మీ నాన్న ఇంత వరకు ఇంటికి రాలేదు ఎక్కడికి పోయాడో నాకు కంగారుగా ఉంది. పోయే ఎక్కడికి వెళ్ళాడో చూడు.
అంటూ నిద్ర లేపుతుంది. అప్పుడే భర్త ఇంటికి వస్తాడు ఆమె…. రాత్రి మొత్తం ఎక్కడికి వెళ్లారు మీకు బలాదూరు ఎక్కువైపోయినది.
భర్త…. చచ్చి పోయాననుకున్నావ్ కదా .
అప్పుడే పోన్ లే..
ఆమె…. నన్ను బెదిరిస్తున్నావా పోతే పోండి ఆయన టైం వస్తే ఎవరు ఇక్కడ ఉండరు.అయినా పోయే సమయంలో అందరూ పోవాల్సిందే కొంచెం వెనకాముందు అయినా. అంటూ అక్కడి నుంచి వెళ్తుంది.
రవి…. ఎక్కడికి వెళ్లి పోయారు అమ్మ చాలా కంగారు పడింది. అతను… సరే కానీ నీకు తినడానికి ఏమైనా పెట్టిందా లేదా.
అందుకు రవి ఏం సమాధానం చెప్పడు.
తండ్రి…. నాకు అర్థమైంది పదా పెళ్లి ఏమున్న తిని వద్దాం అంటూ బయటకు తీసుకెళ్లి అక్కడ ఒక ఆమె దోసెలు వేస్తూ ఉంటుంది .
ఆమెతో అతను…. రెండు ప్లేట్లు దోశ ఇవ్వు అని అడుగుతాడు అందుకు ఆమె సరే అంటుంది. కొంచెం సమయం తర్వాత వాళ్ళిద్దరికీ దోశలు ఇస్తుంది. దాన్ని రవి చాలా ఆకలి తింటూ ఉంటాడు. దాన్ని చూసిన తండ్రి… ఏరా నువ్వు తిండి తిని ఎన్ని రోజులు అవుతుంది చెప్పు. రవి ఏడుస్తూ…. నాన్న మొన్న మధ్యాహ్నం తిన్నను నాన్న ఆకలి మండిపోతుంది పిన్ని నా కోసం ఏమి చెయ్యదు. అంటూ ఏడుస్తాడు .
అతను చాలా బాధపడుతు….. బిడ్డ ఆకలి కూడా పట్టించుకోలేని తల్లి ఒక తల్లి కాదు.
అయినా నువ్వు కడుపులో పుట్టలేదు కాబట్టి ఇదంతా చేస్తోంది. అలాంటిదాన్ని నరికి పడేయాలి. లేదంటే నేను నేను చావాలి అంటూ బాధపడతాడు రవి… మన బాధపడకండి అమ్మ ఉన్నట్టయితే ఈ కష్టాలు వచ్చేవి కాదు. అంటూ ఇద్దరు కూడా బాధ పడతారు దాన్నంతా చూస్తున్న దోశలు వేసే ఆమె…. అయ్యో పాపం సవతి తల్లి బిడ్డ ని ఎంత కష్టపడుతుంది అంటూ తన మనసులో అనుకుంటుంది. కొంత సమయం తర్వాత వాళ్ళిద్దరు ఆమెకు డబ్బులు ఇచ్చి పని కి వెళ్తారు అక్కడ వాళ్ళిద్దరూ కష్టపడి పని చేస్తూ ఉంటారు. ఇద్దరూ పని చేసిన తర్వాత
మధ్యాహ్న సమయం అవుతుంది.
రవికి చాలా ఆకలి వేస్తూ ఉంటుంది కానీ అతను ఆ విషయం తండ్రికి చెప్పడం తండ్రి దానిని గమనించి… ఒరేయ్ రవి నీకు ఆకలి అవుతుంది అని నాకు అర్థం అయింది
కానీ ఉన్న డబ్బులు పొద్దున టిఫిన్ చేశాము కదా ఇప్పుడు డబ్బులు లేవ్వు. ఎలాగోలా కొంచెం ఓపిక చేసుకుని పని చెయ్యి డబ్బులు వస్తాయి గా సాయంత్రం ఏదన్నా హోటల్లో భోజనం చేద్దాం మీ అమ్మ నాకు తెలిసి మన కోసం భోజనం కూడా తయారు చేయదు.
రవి…. మరేం పర్వాలేదు నాన్న ఆకలితో ఉండటం అనేది నాకు అలవాటు అయిపోయింది.అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా ఆ దోశలు వేసే ఆమె భోజనం తీసుకొని అక్కడికి వస్తుంది దాన్ని చూసిన వాళ్ళు ఇద్దరు చాలా ఆశ్చర్యపోతారు.
ఆమె అతనితో….. అన్నా ఈ భోజనం తీసుకోండి. అని అంటుంది అందుకు అతను… ఎందుకమ్మా నీకు ఈ శ్రమ. ఎవరు ఇక్కడ తీసుకు రమ్మని చెప్పారు.
ఆమె…. అన్నయ్య మీరు పొద్దున మాట్లాడుకోవడం నేను విన్నాను. ఆమె గయ్యాళి అని తెలుసు కానీ ఇద్దరినీ ఇలా కష్టపడుతుంది అని నాకు ఇవాళ అర్థమైంది.
అయినా నేను ఎవరు అన్నయ్య . వరసకు నీకు చెల్లిన అవుతాను. లక్ష్మీ వదిన ఉన్నట్టయితే ఇదంతా ఉండేది కాదేమో . సరే దాని గురించి మాట్లాడుకోవడం వ్యర్ధమే కదా . తిరిగి రాణి వాటి గురించి ఎంత చెప్పుకొని ఏం లే గాని మీరు ముందు తినండి అని చెప్పి భోజనం వడ్డిస్తుంది వాళ్లు భోజనం చేస్తారు.
ఆ తర్వాత ఆమె…. అన్నయ్య నాకు పెళ్లి అయ్యి చాలా సంవత్సరాలు అవుతుంది కానీ
పిల్లలు లేరు. నాకు రవిని దత్తత ఇచ్చారు అంటే కన్న తల్లి లాగా చూసుకుంటాను. బాగా చదువుకుంటాను. అక్కడే ఉంటే వాడు ఇలాగే పనులకు వెళ్లాల్సి వస్తుంది.
అతను…. నువ్వు చెప్పింది నిజమే అమ్మ కానీ ఆ రాక్షసి ఊరుకోదు. దానికి డబ్బు సంపాదించాలి .వీడు చాలా బాగా చదువుకున్న వాడు వాడి జీవితం నాశనం అయిపోతుందనీ నాకు చాలా బాధగా ఉంది నేను ఏం చేయమంటావ్. దత్తత ఇవ్వడం కుదరదు. ఏమీ అనుకోకు అని అంటాడు అందుకు ఆమె…. పర్వాలేదు లే అన్నయ్య. అంటూ చాలా బాధగా అక్కడి నుంచి వెళ్లి పోతుంది. ఆ తర్వాత వాళ్ళు పని చేసుకొని సాయంత్రానికి ఇంటికి తిరిగి వెళతారు.
ఇక ఇంటికి రాగానే గొడవ. ఏదో ఒక వంకతో ఆమె గొడవ పెట్టుకోవడం అరవడం లాంటివి చేస్తూ ఉంది. అలాగే ప్రతి చిన్నదానికి రవి ని కొట్టడం తిట్టడం లాంటివి చేస్తూ ఉంటుంది .
రోజులు గడిచాయి ఆమె ప్రవర్తన మితిమీరి పోవడంతో బాగా విసుగెత్తిపోయిన. భర్త ఆమెను కొట్టి…. ఒసేయ్ ఎన్ని రోజులు చేతులు ముడుచుకొని కూర్చున్నాను. ఇంక నా వల్ల కాదు. ఈక్కడ ఉంటే నా బిడ్డనీ నువ్వు చంపేస్తావ్. ఆమె ఏడుస్తూ… నన్నే కొట్టే ఒక ధైర్యం వచ్చిందా. ఈ ఇంట్లో నేను ఉండను . అతను… వెళ్ళిపోవే తొందరగా. నేను ఒక్కడినే ఉంటాను నా బిడ్డను చదువుకుంటాను. కాదు నా బిడ్డని నా చెల్లి అన్నపూర్ణ అడిగింది. వాళ్లకి నా బిడ్డను దత్తత ఇస్తాను తల్లి లేని లోటు తీరుతుంది. వాళ్లకి బిడ్డ లేని లోటు తీరుతుంది. అని చెప్పి వాడి తీసుకొని అన్నపూర్ణ దగ్గరికి వెళ్లి జరిగిన విషయం చెప్పి . ఆ బిడ్డను దత్తత ఇస్తాడు. ఆమె ఎంతగానో సంతోషపడుతుంది.
ఇక ఆరోజు నుంచి అన్నపూర్ణ రవి ని సొంత బిడ్డల్లా చూసుకుంటూ ప్రేమ అందిస్తూ బడికి పంపిస్తుంది. అతను చాలా చక్కగా చదువుకుంటాడు. దాన్ని చూసి నా కన్న తండ్రి . అన్నపూర్ణ చాలా సంతోష పడతారు.
అతను…. భగవంతుడా ఆ నరకం నుంచి నా బిడ్డను గట్టెక్కించేందుకు చాలా సంతోషం అనుకుంటూ అక్కడనుంచి వెళ్ళి పోతాడు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *