గర్భవతి అయిన ఏనుగు బాధ ఏనుగు తల్లి బాధ_ Telugu Stories- Stories in Telugu – Panchatantra Kathalu


అది ఒక అందమైన అడవి. ఆ అడవిలో ఒక గర్భవతి అయిన ఏనుగు. బాగా అలిసిపోయి ఒక చెట్టు దగ్గర పడుకొని విశ్రాంతి తీసుకుంటూ తనలో….. నాకు చాలా సంతోషంగా ఉంది త్వరలో నా బిడ్డ భూమి మీదకి వస్తాడు. ఎంచక్కా ఈ అందమైన ప్రకృతిని చూస్తాడు. వాడిని చూసి నేను ఎంతగా మరిచిపోతానో. అని అనుకుంటూ మెల్లగా నిద్ర లోకి జారుకుంది. అప్పుడు ఆ తల్లికి తన కళ్ళలో తన బిడ్డ పుట్టినట్టుగా కనిపిస్తూ …… అమ్మ నాకు ఇక్కడ చాలా బాగుంది అమ్మ. అంటూ ఆ పిల్ల తన తల్లి తో ఆడుకుంటూ ఉంటుంది.ఆ
ఆటను చూసి ఆ తల్లి ఎంతగానో మురిసిపోతుంది.
ఆ తల్లి బిడ్డ తో…… ఇది చాల తక్కువ నాన్న. ఇంకా ఈ ప్రకృతిలో చూడాల్సింది చాలా ఉంది. ఈ అందమైన సృష్టి దేవుడు మన కోసమే సృష్టించాడు. దానిని అంతా తిప్పి నీకు చూపిస్తాను. సరేనా.
ఆ మాటలకి బిడ్డ చాలా సంతోషంగా….. సరే అమ్మ అన్ని నేనే చూస్తాను. అమ్మతో కలిసి హాయిగా ఆడుకుంటూ ఈ ప్రకృతి మొత్తాన్ని ఆస్వాదిస్తాను. అంటూ ఆనందపడుతూ ఆ బిడ్డ తన తల్లికి చెప్పుకుంటుంది. ఆ తర్వాత ఆ బిడ్డ చాలాసేపు ఆడుకొని బాగా అలిసిపోయి తన తల్లితో…. అమ్మ నాకు చాలా ఆకలిగా ఉంది అమ్మ. నాకు తినడానికి ఏమన్నా తీసుకురా అమ్మ అంటూ జాలిగా అడుగుతుంది అప్పుడు వెంటనే ఆ ఏనుగుకి మెలకువ వచ్చి ….. అరే ఇదంతా కల నా కళ్ళల్లో నా బిడ్డ ఎంత అందంగా ఉన్నాడో. ఇంక నిజంగా ఇంకెంత అందంగా ఉంటాడో పాపం వాడికి ఆకలేస్తుంది. అనుకుంటా వెంటనే నేను ఏమన్నా తినాలి. అని అనుకుంటూ ఆహారం కోసం వెతుక్కుంటూ ఉంటుంది. పాపం అది వేసవి కాలం కావడంతో చుట్టుపక్కల దానికి ఆహారం దొరకలేదు. అప్పుడు తన లో…..అబ్బా ఇక్కడ ఎక్కడ ఆహారం దొరకలేదు.ఈ వేసవి కాలం ఆహారం లేకపోతే మాలాంటి ప్రాణులు ఏం తిని బ్రతకాలి. అయ్యో నా బిడ్డ ఆకలితో అలమటించి పోతుంది. త్వరగా తినాలి లేకపోతే వాడికి సరైన పోషకాలు ఎలా వస్తాయి. వా డిని ఇప్పుడు నుంచి జాగ్రత్తగా చూసుకోవాలి. వాడికి ఏమన్నా అయితే నా ప్రాణం విల విల లాడి పోతుంది. అమ్మో నేను జాగ్రత్తగా ఉండాలి వాణి జాగ్రత్తగా చూసుకోవాలి. ఏం చేయాలి ఇక్కడ ఎక్కడ చుట్టుపక్కల ఆహారం దొరకలేదు భగవంతుడా సరే నేను ఒక పని చేస్తాను దగ్గర్లో ఉన్న గ్రామంలో కి వెళ్తే ఏమన్నా తినడానికి దొరుకుతుందేమో. భగవంతుడా ఆకలవుతుంది ఏమన్నా దొరికేలా చెయ్యి అని అనుకొని గ్రామం వైపు వెళుతూ ఉంటుంది.
అక్కడ మార్గమధ్యలో ఇద్దరు వ్యక్తులు ఒకరితో ఒకరు ఇలా మాట్లాడుకుంటారు.
రామయ్య మన పంట పొలాలో కి పెద్దపెద్ద ఎలుగుబంట్లు వచ్చి పంటను నాశనం చేస్తుంది అని చెప్పి ఇదిగో ఈ బాంబులను తీసుకొచ్చాను. వాటిని దడిపించడం కోసం. ఆ శబ్దాలు వినయ్ అంటే. ఇంకెప్పుడు ఈ పంటపొలాల జోలికి రావు.
మంచి పని చేసావ్ సింగయ్య. రోజురోజుకీ వాటి ఆగడాలు చాలా ఎక్కువైపోతున్నాయి వాటికి అదుపు లేకుండా పోతుంది. అలాగే వదిలేస్తే మనం అమ్ముకోడానికి కాదు కదా కనీసం మనం తినడానికి కూడా పంట చేతికి రాదు. పోనీ వాటి ముందుకు వెళ్లి వాటిని పారదోలే ప్రయత్నం కనుక చేస్తే మ న ప్రాణాలు పోతాయి. ఇలా అయితే ఏ బాధ ఉండదు. చాలా గొప్పగా తెలివిగా ఆలోచించవి అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుండగా సింగయ్య ఆ ఏనుగుని చూసి…. రామయ్య అటు చూడు పెద్ద ఏనుగు గ్రామం వైపుగా వెళుతుంది. అది గ్రామంలో పడి ఏం అల్లకల్లోలం చేస్తుందో ఏమో ఎలా అయినా దాన్ని ఆపాలి రా.
రామయ్య….. ఎలా ఏముందిరా ఈ బాంబులు ఉన్నాయిగా. దానికి కొంచెం ముందుగా ఈ బాంబు ని కనుక వేసాము అనుకో ఆ శబ్దానికి అది పరుగులు తీస్తుంది. ఇంకెందుకు ఆలస్యం త్వరగా బాంబు విసురు అని అంటాడు వెంటనే రామయ్య బాంబుని ఆయనకు ముందు విసురుతాడు కానీ ఆ బాంబు పేల దు.
రామయ్య….. మరి ఏంట్రా ఆ బాంబే పేలలేదు. అనుకుంటుండగా ఆ ఏనుగు దాన్ని చూసి….. ఏంటిది చాలా వింతగా ఉంది కొత్త పండ అని అమాయకంగా దాన్ని తొండంతో తీసుకుని నోట్లో వేసుకుని నమ్ముతుంది. అంతే వెంటనే ఆ బాంబు పేలి ఆ ఏనుగు కి దండం నుంచి రక్తం ధారలుగా ప్రవహిస్తుంది. పాపం ఆ ఏనుగు ఆ బాధలు భరించలేక…… భగవంతుడు ఎందుకు నాకీ బాధ దయచేసి నన్ను కాపాడు . నాకు ఏమన్నా అయితే నా బిడ్డకి చాల ప్రమాదం. వాడు ఇప్పుడే నా లోపల ప్రాణం పోసుకుంటున్నాడు. వాడు కళ్ళు తెరవక ముందే వాడీ కళ్ళు ముయ్యి ఇవ్వకు అని అనుకుంటూ ఎంతో బాధతో పెద్ద పెద్దగా అరుస్తూ గ్రామం వైపుగా పరిగెడుతుంది దాన్ని చూసిన రామయ్య సింగయ్య కూడా దాని వెంట పరుగులు తీస్తారు. ఆ ఏనుగు అలాగే పెద్ద పెద్దగా అరుస్తూ గ్రామంలో అటు ఇటు పరిగెడుతూ ఉంటుంది అక్కడి గ్రామ ప్రజలంతా దానిని అంతా వింతగా చూస్తూ ఒకరితో ఒకరు….. అమ్మో ఎంత పెద్ద ఏనుగు ఎలా అరుస్తుంది చూడండి. పాపం దాని తొండం నుంచి నోటి నుంచి రక్తం ధారగా కారుతుంది. పాపకు ఏం జరిగిందో ఏమో. చూడబోతే గర్భవతిగా కూడా ఉంది. అయ్యో భగవంతుడా ఏం జరిగింది పాపం దానికి అనుకుని బాధపడతారు. అయితే నువ్వు అలా పెద్దగా అరుస్తూ …… నా నోరంతా కాలిపోతుంది నీళ్లు దాహం. నీళ్లు దాహం అని అనుకుంటూ. ఎంతో బాధతో అడవి వైపు పరిగెడుతూ ఉంటుంది అప్పుడే దానికి ఒక పెద్ద నది కనబడుతుంది. వెంటనే ఏనుగు ఆ నీటిలో కి వెళ్లి ఎంతో ఆయాసపడుతూ కన్నీరు కారుస్తూ….. భగవంతుని ఎందుకు నాకు ఇలాంటి పరీక్షను విధించాఉ. నేను మరణిస్తున్నాను నా లోపల ఉన్న బిడ్డ కూడా మరణిస్తాడు. నేను ఎన్నో కలలు కన్నాను నా బిడ్డ ని ఎలా చూసుకోవాలి ఈలా చూసుకోవాలి అని . తల్లి ప్రేమ నీ రుచి చూడకుండా నే నేను చనిపోతున్నాను. అయ్యో నేను ఫలాన్ని తినకుండా ఉండాల్సింది. అది తిన్న అందుకే నా బిడ్డ ని నా చేతిలో నేను చంపుకుని దానిని అయ్యాను. అని అనుకుంటూ చిన్నగా శ్రుహ లోకి వెళ్తుంది అప్పుడు తను ఆవిడతో ఊహించుకున్న కాలని తిరిగి ఊహించుకుంటూ. ఉంటుంది.
బిడ్డ….. అమ్మ నేను బయటకు రాకుండానే చనిపోతున్నాను అమ్మ. నేను అందమైన ప్రకృతిని చూడలేకపోతున్నామ్మ. నువ్వు ఎలా అయినా నన్ను కాపాడమ్మా. అమ్మమ్మ నీకేం కాలేదుగా. నాకు నొప్పి గా ఉందమ్మా. అంటూ ఆ బిడ్డ అరుస్తూ ఉంటుంది.
కొంత సమయానికి ఆ ఏనుగు చనిపోయి ఆ చెరువులో మునిగి పోతుంది.ఆ ఏనుగు చనిపోవడంతో ఆ ఏనుగు కడుపులో ఉన్న బిడ్డ కూడా చనిపోతుంది. అప్పుడే అక్కడికి చేరుకున్న రామయ్య సింగయ్య ఆ దృశ్యాన్ని చూసి చాలా బాధ పడతారు. కొంత సమయానికి ఆ విషయం చాలామందికి పాకిపోతోంది. ఇద్దరి మాపటి వాళ్ళు ఏనుగు ల ను తీసుకొని వచ్చి ఆ ఏనుగుల సహాయంతో నీటిలో పడి మరణించిన ఆ ఏనుగుని బయటికి తీస్తాయి.
అలా బయటకు తీసినప్పుడు ఆ ఏనుగులు కూడా చనిపోయి ఏనుగును చూసి బాధతో కన్నీరు కారుస్తూ దేవుని ప్రార్థిస్తయి..
ఆ దృశ్యాన్ని చూసిన రామయ్య….. సింగయ్య మనం పొరపాటు చేశాము . ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు అన్యాయంగా ఆ ఏనుగు ప్రాణం తీసిన వాళ్ళ మయ్యాము. చ చ్ నా మీద నాకే అసహ్యంగా ఉంది.
సింగయ్య…. నిజమే రామయ్య పాపం అది గర్భవతి అనుకుంటా. అన్యాయంగా ఆ బిడ్డను కూడా చంపిన వాళ్ళo అయ్యాము.
అసలు ఆ ఏనుగు మన కంట్లోనే పడకుండా ఉంటే . పాపం దొరికింది తిని వెళ్ళిపోయే దేమో. చాలా పెద్ద పొరపాటు జరిగిపోయింది.
భగవంతుడా మేము తెలుసో తెలియకో పాపం చేశాము. మమ్మల్ని క్షమించు. అంటూ వాళ్ళు కూడా ఆ దేవుని ప్రార్థిస్తూ చాలా బాధ పడతారు.
అప్పుడు మా పతి వాళ్లలో ఒక అడవిలో ఒక మీరు మా కంటే ముందు ఇక్కడికి ఎలా వచ్చారు. మీకీ విషయం ఎలా తెలిసింది.
అందుకు వాళ్లు కొంచెం మేము ఇప్పుడే ఇటుగా వెళ్తున్నాము అప్పుడు పాపము ఈ ఏనుగు పాపం చాలా పెద్ద పెద్దగా అరుస్తూ చాలా బాధ పడుతూ ఈ నీటిలో కి పరిగెత్తడం చూసాము. అది ఎంతో బహుశా తినకూడని పదార్థం తిన్నట్టు ఉంది . అందుకే దాన్ని అరా ఇంచు కోలేక లేదంటే అది విషయంగా మారో తన ప్రాణం మీదికి తీసుకొచ్చినట్టు పాపం వాటికి మాత్రం ఏం తెలుసు ఏం తినాలో ఏం తినకూడదు అని. వాళ్లతో అంటారు
అప్పుడు సింగయ్య మెల్లగా ఎందుకు ఆయనతో అబద్దం చెప్పావు . దీనంతటికి కారణం మనమే కదా. పాపం మన వల్లే కదా ఇదంతా జరిగింది. నిజం చెబితే ఏమవుతుంది.
అని అంటాడు ఆ మాటలు విన్న అయ్యో మనం కనుక నిజం చెప్పినా వాళ్ళు ఎవరు నమ్మరుఅయ్యో మనం కనుక నిజం చెప్పినా వాళ్ళు ఎవరు నమ్మరు మనం కావాలనే దాన్ని చంపావు అని కొత్త పుకార్లు పుట్టిస్తారు. దయచేసి ఈ విషయాన్ని ఇంకా మర్చిపోదాం. అని అంటాడు.
అందుకు సింగయ్య కూడా సరే అని అంటాడు . అలా వాళ్ళు ఆ నిజాన్ని తన మనసులోనే కప్పిపుచ్చి తారు. ఆ ఏనుగు ని చూడడానికి అక్కడికి వచ్చి ఆ దృశ్యాన్ని చూస్తున్న అక్కడ జనం కూడా….. అయ్యో పాపం ఎంత రక్తం పోయిందో ఎంత అల్లాడి పోయిందో . ఆ బాధ చూడలేము వర్ణించలేము. పైగా కడుపులో ఒక బిడ్డ కూడా ఉంది. అసలు ఏం జరిగిందో ఏమో. పాపం చూస్తే కడుపు తరుక్కుపోతుంది తన బాధని చూస్తుంటే కన్నీరు ఆగడం లేదని అందరు కూడా ఆ ఏనుగుని చూసి కంటతడి పెట్టుకున్నారు.
కానీ ఇదంతా రామయ్య సింగయ్య వల్లే జరిగిందని ఎవరికీ తెలియదు, వాళ్లు తెలివిగా దాన్ని తెలియనివ్వలేదు . అదేదో పండుని తిని ప్రమాదానికి గురై ఉంటుందని అందరూ అనుకుంటారు.అసలు జరిగిన నిజం కూడా వాళ్లు ఎవరికీ చెప్పరు, ఆ నిజాన్ని బయటపెట్టారు. ఆ నిజాన్ని వాళ్లలో నీ దాచుకుని వాళ్లు కూడా బాధపడతారు. అందుకే మనం ఏది చేసినా ముందు ఆలోచించి చేయాలి. ఆలోచన రహితంగా ఏదో చేయాలని తొందరపడితే. అవి ప్రమాదాలకు దారి తీస్తాయి. ఆతర్వాత జరిగిపోయిన వాటి గురించి ఎంత బాధపడినా ఎంత చెప్పుకున్నా నా కాలాన్ని మనం వెనక్కి తిరిగి తీసుకురాలేము. అందుకే మనం చేసే పని ఏదైనా ముందు వెనక ఆలోచించి. ఆ తర్వాత సరైన నిర్ణయం తీసుకోవాలి . వాళ్ళ కనక కొంచెం ఆలోచించి ఆలోచన రహితంగా ప్రవర్తించినట్లయితే . ఇదంతా జరిగేది కాదేమో. వాళ్లు ఆలోచించకపోవడం తోనే ఏం జరిగిందో చూసాముగా.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *