గర్భవతి ఏనుగు ఆరో భాగం_ Telugu Stories- Stories in Telugu – Panchatantra Kathalu

సీమ లంక అనే గ్రామంలో నాగయ్య అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతను చాలా మంచివాడు అతను ఒక రోజు పక్క ఊరు నుండి అడవి మార్గంలో తన ఊరికి వెళ్తూ ఉండగా. మార్గ మధ్యలో ఒక ఏనుగు చనిపోయి కనిపిస్తుంది దాని పక్కనే ఒక పిల్ల కూడా ఉంటుంది. ఆ పిల్ల ఏనుగు తల్లి కోసం ఎంతో రోదిస్తూ కనిపిస్తుంది. దాన్ని చూసిన నాగయ్య…… అయ్యో పాపం మా తల్లి చనిపోయింది మీ బిడ్డ ఒంటరిగా ఈ అడవిలో ఉంటే ఏదైనా జంతువును దీనిని చంపేస్తుంది ఏమో.అని ఆ ఏనుగు పై జాలిపడి దానిని ఇంటికి తీసుకొని వెళ్తాడు. అక్కడ అతని భార్యకు జరిగిన విషయమంతా చెప్తాడు.

దానిని విన్న భార్య కోపంతో రగిలిపోతూ…..తాను దూర సందు లేదు కానీ మెడకో డోలు అనే సామెత వినే ఉంటారు గా.
అలా ఉంది దీని భాగవతం మనకు తినడానికి మూడు పూటలా తిండి లేదు కానీ. మళ్లీ గజాన్ని మే పోతాడంట. అది ఒక్క రోజు తినే తిండితో మనం వారం రోజులు బ్రతక వచ్చు .
తెలుసా మర్యాదగా దానిని అడవిలో విడిచి పెట్టండి.
నాగయ్య…. వద్దు పార్వతి పాపం తల్లి లేని పిల్ల. అడవిలో ఉంటే ఏదైనా జంతువు తినేసి దాన్ని చంపేస్తుంది అప్పుడు ఆ ఉసురు మనకు తగులుతుంది ఎందుకు చెప్పు. పాపం ఉండనివ్వు నేనే ఎలాగోలా కష్టపడతాను కదా. అని బ్రతిమాలాడు అందుకు ఆమె సరే అని ఒప్పుకుంటుంది. అలా చాలా రోజులు గడిచాయి ఏనుగు పెద్దదయింది. ఇప్పుడు ఆ ఏనుగు గర్భవతి కూడా.నాగయ్య అది గర్భవతి కావడంతో దానికి కావలసిన ఆహార పదార్థాలు ఇస్తూ చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు.
దానిని చూసిన భార్యకు కడుపు అంత రగిలిపోతూ కోపంతో….. ఎందుకు దానికి అలా మేపుతున్నారు. ఇప్పుడు దాంతో సర్కస్ ఏమన్నా చేయిస్తారా. పుట్టబోయే బిడ్డతో ఏమన్నా రోడ్డుపై డాన్స్ చేయిస్తారా.
మీ వాలకం చూస్తుంటే రేపు నలుగురిని పిలిచి దానికి సీమంతం కూడా చేసేలా ఉన్నారు.
మీకు వచ్చే నాలుగు రూపాయలు కూడా దాన్ని తిండి కి ఖర్చు పెడితే మన ఇల్లు ఎలా గడుస్తుంది. అప్పుడు అంటే చిన్న పిల్ల ఏదో పాపం అని ఊరుకున్నా ఇప్పుడు ఈ విధంగా బాగానే పెరిగింది గా ఇంకా ఇక్కడ ఎందుకు పంపించండి దాన్ని. అని కోపంగా అంటుంది.
నాగయ్య…. ఈ ఏనుగు ఎక్కడికి వెళ్ళద్దు నాతోనే ఉంటుంది. అని కోపంగా చెప్తాడు అందుకు తన భార్య….ఓహో అంతవరకు వచ్చిందా ఎలా వెళ్లదు నేను చూస్తాను అని ఒక పెద్ద కర్ర తీసుకొని ఆ ఏనుగు నీ ఇష్టం వచ్చినట్టు గా కొడుతుంది. నాగయ్య ఎంత వద్దు వద్దు అని మొత్తుకున్నా కూడా ఆమె తన కోపం అంతా ఆయనపై తీర్చుకుంటూ ఉంటది పాపం నొప్పిని భరించలేక ఆ ఏనుగు…. అమ్మ నొప్పి వద్దు నన్ను కొట్టొద్దు. మీకు నిన్ను కొట్టాలి అంత కోపం ఉంటే. నా కాళ్ళ మీద తల మీద కొట్టండి. అంతే కానీ నా పొట్ట మీద మాత్రం కొట్టకండి నా బిడ్డ కి నొప్పి కలుగుతుంది. దయచేసి కొట్టొద్దు పొట్టమీద మాత్రం అస్సలు కొట్టొద్దు. అని కన్నీరు కారుస్తోంది ఆ కన్నీరు చూసిన నాగయ్య…. ఒసేయ్ ఒసేయ్ చూడవే అది ఎలా కన్నీరు పెట్టుకుంటుంది. మనిషి లాగా ప్రవర్తించు పశువు లాగా ప్రవర్తించకు పాపం నా వల్ల దీనికి ఇబ్బంది కలుగుతుంది. దీనిని దూరంగా విడిచి పెట్టి వస్తాను అప్పుడు నీ కళ్ళు చల్లబడతాయి కదూ. అంటూ వేణు ని తీసుకొని దూరంగా విడిచిపెట్టి… చూడమ్మా ఎన్ని సంవత్సరాలు నిన్ను జాగ్రత్తగా పెంచుకున్నాను. నా భార్య రాక్షసి లాగా నీ పట్ల ప్రవర్తించిన విధానం నాకస్సలు నచ్చలేదు. నా వల్లే నీకు ఎన్ని కష్టాలు. ఇంక నువ్వు ఇంటికి రాకు జాగ్రత్తగా ఉండు అని చెప్పి దాన్ని విడిచి ఎంతో బాధతో కన్నీరు కారుస్తూ అక్కడినుంచి వెళ్తాడు ఏనుగు…. నేను మిమ్మల్ని విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేను. నాకు ఊహ తెలిసిన దగ్గర్నుంచి మీరు తప్ప నాకు ఎవరు తెలియదు. మీరు నాకు తల్లి తండ్రి లాంటి వారు అమ్మ నన్ను కొట్టింది అని. ఏ బిడ్డ అలిగి వెళ్లదు. నేను కూడా మీ బిడ్డ లాంటి దాన్ని కదా అమ్మ మీద ఎవరైనా అడుగుతారా నేను మీ తోనే వస్తాను అంటూ అతని వెంట పడుతుంది. దానిని చూసిన అతను … వద్దు దయచేసి నువ్వు రావద్దు వస్తే ఆ రాక్షసి నిన్ను బ్రతక నివ్వదు.
అని దానికి దండం పెడతాడు.అప్పుడు ఏనుగు చాలా బాధపడుతూ కన్నీరు కారుస్తూ అక్కడే ఆగిపోతుంది. నాగయ్య ఇంటికి తిరిగి వెళ్తాడు. భార్య… హమ్మయ్య దరిద్రన్ని వదిలి పెట్టి వచ్చారన్నమాట. నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. రండి అన్నం వడ్డిస్తున్న తిందువుగాని.
నాకు ఇప్పుడు ఆకలిగా లేదు కడుపునిండా భోజనం పెట్టావుగా నీ తిట్లతో నాకు కడుపు నిండిపోయింది అని వెళ్లి పడుకుంటాడు.
ఆ మరుసటి రోజు ఉదయాన్నే ఆ ఏనుగు ఇంటిముందు పడుకొని ఉంటుంది. తనని చూసిన అతని భార్య…. చి చి మళ్లీ దాపురించింది. రామేశ్వరం పోయినా శనేశ్వరం వదల్లేదు అన్నట్టుగా. నిన్న వదిలేసి వచ్చిన మళ్ళీ తిరిగి వచ్చావ్ ఏంటి అమ్మ తల్లి. నీకు పడిన దెబ్బలు చాలు లేదనుకుంటా. మరో రెండు తరలిస్తున్న ఆగవే. అంటూ మళ్లీ ఆ దానిని కొట్టడం ప్రారంభిస్తుంది ఆ ఏనుగు ఆ దెబ్బలకి పెద్ద పెద్దగా అరుస్తూ తనలో …. నొప్పి నొప్పి వద్దు వద్దు అమ్మ కొట్టకుండా అమ్మ నేను వెళ్ళిపోతాను అమ్మ. ఒకసారి నా నిన్ను చూసి వెళ్ళిపోతాను అమ్మ కొట్టిందా అమ్మ నువ్వు నాకు పొట్ట మీద కొడుతున్నావ్ అమ్మ లోపల నా బిడ్డకు ప్రమాదం అవుతుంది అమ్మ వద్దమ్మా అంటూ కేకలు వేస్తూ అరుస్తుంది ఆ అరుపులు విన్న నాగయ్య బయటకు వచ్చి… ఒసేయ్ ఒసేయ్ ఆపవే అదేం పొట్టి ఏనుగు కూడా కాదు గర్భవతి ఆ విషయం తెలిసి కూడా దాన్ని ఎలా కొట్టాలనిపిస్తుంది. పాపం దెబ్బ గట్టిగా తగిలితే లోపలున్న బిడ్డకి ప్రమాదం ఆ బిడ్డకే కాదు తల్లి బిడ్డలు ఇద్దరికీ ప్రమాదం అవుతుంది.
భార్య… చూడండి మీరు ఏమన్నా చేసుకోండి ఇది మాత్రం ఇక్కడికి వస్తే నేను దాన్ని చంపేస్తాను. జాగ్రత్త అంటూ కోపంగా లోపలికి వెళ్లి పోతుంది.
నాగయ్య… నువ్వు మళ్ళీ ఎందుకు వచ్చావు. నువ్వు దయచేసి ఇక్కడికి రాకు. వెళ్ళిపో నా మాట విని వెళ్ళిపో.
అందుకు ఏనుగు నేను వెళ్ళను అన్నట్టు తల ఊపుతుంది.
నాగయ్య…. నువ్వు కనక ఇక్కడి నుంచి వెళ్లకపోతే నేను చచ్చినంత ఒట్టు. ఇంకెప్పుడు ఇక్కడికి తిరిగి రాకూడదు నేను చచ్చిపోయే వరకు రాకూడదు. ఒకవేళ వచ్చావో చెప్పాను కదా నేను చచ్చినంత ఒట్టే.
ఏనుగు తనలో ఏడుస్తూ… అంత పెద్ద మాట వద్దు నాన్నా నేను వెళ్ళిపోతాను. ఇంక మీ కంటికి కనబడను. అని ఏడ్చుకుంటూ అక్కడ నుంచి వెళ్లి పోతుంది. రోజులు గడిచాయి నాగయ్యకు ఆ ఏనుగు మీద దిగులు పట్టుకుంది. ఆ దిగులుతో తిండి కూడా సరిగా తినడు. ఎప్పుడు ఆయనను గురించి ధ్యాస దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. పాపం ఒక రోజు ఉండబట్టలేక దాన్ని వెతుక్కొంటూ వెళ్తాడు. కానీ ఆ ఏనుగు ఎక్కడా కనిపించదు.
అతను ఎంతో బాధతో తిరిగి వచ్చి తన లో…
నా బంగారు తల్లి ఎక్కడికి వెళ్ళిపోయింది.నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి నన్ను విడిచి వెళ్లిపోయింది. అసలు బ్రతికి ఉందో లేదో . నాకెందుకు చాలా భయంగా ఉంది. అంటూ కన్నీరు కారుస్తారు. రోజులు గడుస్తున్న వి రోజులు గడిచేకొద్దీ అతని ఆరోగ్యం క్షీణించి పోతుంది ఆ ఏనుగు లేదన్న బాధ తోనే అతడు మరణిస్తాడు.
అక్కడ ఏనుగు ఎంతో బాధపడుతూ…. నాన్న మిమ్మల్ని చూడాలని ఉంది. నేను తిండి తిని ఎన్ని రోజులు అవుతుందో తెలుసా నాన్న నన్ను ఎవరు చూసినా జాలి పడటం లేదు అందరు నన్ను కొడుతున్నారు. నన్ను చూసి భయపడుతున్నారు.నాకు చాలా ఆకలిగా ఉంది నాన్న నాకు తినడానికి ఏమన్నా కావాలి నా కోసం కాదు లోపలున్న నా బిడ్డ కోసం. ఇంకా తినక పోతే నేను చచ్చి పోతాను నా బిడ్డనీ చూడకుండానే చనిపోతాను. నాన్న నాకు ఒకసారి మిమ్మల్ని చూడాలని ఉంది నీ చేతితో తిండి తినాలని ఉంది. అంటూ చాలా ఏడుస్తూ ఇంటికి వస్తుంది. దానిని చూసిన ఆమె…. వచ్చావా మహాతల్లి ఇంకా రాలేదే అని అనుకుంటున్నాను. నీవల్లే నా భర్త చనిపోయాడు. అసలు మా జీవితంలోకి వచ్చి మమ్మల్ని ఇంతలా బాధ పెడతావు అనుకోలేదు. మీ అమ్మ చచ్చిన అప్పుడే నువ్వు కూడా కావాల్సింది. అలా చచ్చిపోయి ఉంటే ఈ రోజు నా భర్త నాకు ఉండేవాడు. అన్యాయంగా నా భర్త నువ్వే పొట్టనపెట్టుకున్న వే. సిగ్గు లేకుండా ఏ మొహం పెట్టుకుని వచ్చావు అంటూ దానిని ఇష్టం వచ్చినట్లుగా తిడుతూ అదిగో చూడు నా భర్తని అంటూ తన భర్త ఫోటో ని దాని ముందు విసిరేసి లోపలకు వెళ్లి తలుపులు వేసుకొని పెద్ద పెద్దగా ఏడుస్తూ ఉంటుంది. ఆ ఏనుగు నాగయ్య ఫోటో ని తీసుకొని…. నాన్న నాకోసం నువ్వు చచ్చి పోయావా నాన్న.ఇలా జరుగుతుంది అనుకుంటే నేను నిన్ను విడిచి పెట్టి వెళ్ళేదాన్ని కాదు. అమ్మ నన్ను ఎన్ని దెబ్బలు కొట్టిన నేను నీకోసం ఉండేదాన్ని. నన్ను ఒక్కసారి రా నాన్నా నాకు ఆకలవుతుంది నాన్న. నాన్న నా కడుపులో బిడ్డ తో నువ్వు ఆడుకో వా నాన్న ఒకసారి లే నన్న. అంటూ ఏడుస్తూ ఆ ఫోటో ని తీసుకొని తనని పూడ్చి వేసిన స్థలం దగ్గరకి వెళ్తుంది. అక్కడ ఫోటో ని ఉంచి …. నాన్న నేను నీ కోసం తిరిగి వచ్చాను. నువ్వు నా వల్లే చనిపోయావని అమ్మ అంటుంది. అమ్మకి నేను ఏం సమాధానం చెప్పాలి నాన్న. ఒకసారి లే నన్న మనం మన ఇంటికి వెళ్దాం. లే నాన్నా అంటూ పెద్ద పెద్దగా ఏడుస్తూ అక్కడే పడుకుంటుంది. పాపం ఆ ఏనుగు గర్భవతి కావడం తో దానికి చాలా నీరసం వస్తుంది పైగా అది తిండి తిని చాలా రోజులు కావడంతో చాలా నీరసపడి పోయి ఆయాసంతో రొప్పుతూ…. నాన్న నా బిడ్డ నేను కూడా నీ దగ్గరికి వచ్చేస్తాము. మనందరం పైన దేవుడి దగ్గర హాయిగా ఉండొచ్చు నాన్న అంటూ పెద్ద పెద్దగా అరుస్తూ గుండె ఆగిపోయి ఆ ఏనుగు కూడా చనిపోతుంది. అక్కడ నాగయ్య భార్య తన భర్త ఫోటో కోసం బయటకు వచ్చి చూసి… ఆ ఏనుగు నా భర్త ఫోటోనీ కూడా తీసుకెళ్లినట్టు ఉంది. బతికున్నప్పుడు నా భర్తను చంపేసింది ఆయన జ్ఞాపకంగా మిగిలిన ఫోటోనీ కూడా తీసుకు వెళ్ళింది అంటూ దాన్ని వెతుక్కుంటూ
పెడుతుంది అది స్మశానంలో తన భర్త స్మశానం పక్కన చనిపోయి ఉండటం చూసి ఆమెకు చాలా ఆశ్చర్యం కలిగింది…. అయ్యో భగవంతుడా ఇలాంటి ప్రేమ నా నేను దూరం చేసుకుంది. నా భర్త కోసం ఏనుగు కన్నీరు కార్చి చనిపోయింది అసలిదంతా నా వల్లే వచ్చింది నా భర్తని ఆ ఏనుగుని నేనే చంపేశాను నేను హంతకురాలిని నన్ను క్షమించండి అంటూ కన్నీరు కారుస్తోంది.
చివరికి ఆమె చేసిన తప్పు తెలిసి ఉంటుంది కానీ తెలుసుకొని ఏం లాభం. చనిపోయిన వాళ్ళిద్దర్నీ తిరిగి తీసుకురాలేము కదా.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *