గర్భవతి ఏనుగు కష్టం preganant Elephant EP1 Telugu Stories | Telugu Moral Stories | Telugu Kathalu

అది ఒక పెద్ద అడవి. ఆ అడవిలో ఒక ఏనుగు తిరుగుతూ ఉండేది. చుట్టుపక్కల దానికి ఆహారం అందకపోవడంతో ఆ ఏనుగు చాలా ఆకలితో ఉంటుంది. పైగా ఆ ఏనుగు ఒక గర్భవతి. అది ఏం చేయాలో తెలియక చాలా నీరసంతో ఒకచోట విశ్రాంతి తీసుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇద్దరు భార్యాభర్తలు అటుగా వెళుతూ ఉంటారు.
వారిని చూసిన ఏనుగు. తన మనసులో….. నాకు ఆహారం ఇవ్వండి . దయచేసి నాకు ఏదైనా ఆహారం వీళ్లు అందిస్తే బాగుండు. అని ఎంతో దుఃఖంతో తన మనసులో అలా తలుచుకుంటూ . ఉంటుంది .
వాళ్లు చూసి చూడనట్టుగా అలా ముందుకు సాగి పోతూ ఉంటారు . ఇంతలో ఆమె ఒక్కసారిగా అక్కడే ఉన్న ఊబిలో పడిపోతుంది .
అతను చాలా కంగారు పడుతూ….. అయ్యో భారతి అంటూ భయంతో ఆమెను తీయ డానికి ప్రయత్నిస్తూ ఉంటాడు .
కానీ పొరపాటున అతను కూడా ఊబిలో పడిపోతాడు. వాళ్ళిద్దరూ ఆ ఊబిలో మునిగిపోతాం పెద్ద పెద్దగా…. కాపాడండి ఎవరైనా ఎవరైనా కాపాడండి.. కాపాడండి ఎవరైనా కాపాడండి అంటూ పెద్ద పెద్ద కేకలు వేస్తూ ఉంటారు ఏనుగు ఆ కేకలు విని.
వాళ్లకు సహాయం చేయడం కోసం అక్కడికి వస్తుంది. ఏనుగు తన తొండంతో ఆమెను పట్టుకుంటుంది. ఆ ఏనుగు ఎంత ప్రయత్నించినా కూడా ఆమెనీ బయటికి తీయలేక పోయింది.
ఆమె భర్త…. భారతి నా వంతు ప్రయత్నం చేస్తాను . నాకేమైనా పర్వాలేదు నువ్వు మన బిడ్డ కీర్తిని బాగా చూసుకో. అంటూ అతని వంతుగా ఆమెను పైకి లేపుతూ ఉంటాడు అతను అలా చేయడం ఏనుగు ఆమెను తీయడం సులభం అవుతుంది.
కానీ దురదృష్టవశాత్తు అతను అందులో మునిగిపోతాడు. భార్య ఏడుస్తూ….. ఏవండీ నన్ను వదిలిపెట్టి వెళ్లిపోయారా. అంటూ ఏడుస్తూ ఉంటుంది ఏనుగు అలా చూస్తూ
ఒక్కసారిగా కుప్పకూలి పోతుంది ఇది ఇలా ఉండగా .
ఇంటిదగ్గర వాళ్ళ కూతురు కీర్తి తన తల్లిదండ్రుల కోసం ఎదురుచూస్తూ….. ఏమైంది మా అమ్మ నాన్న ఇంకా రాలేదు నాకు చాలా భయంగా ఉంది. అంటూ ఏడుస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది.
చాలా సమయం తర్వాత ఏనుగు తన తల్లిని తీసుకొని ఇంటికి వస్తుంది. పాప ఏనుగును చూసి చాల సంతోషపడుతూ….. అమ్మ ఈ ఏనుగు చాలా బాగుందమ్మా. అని దాని తల నిమురుతూ ఉంటుంది తర్వాత పాప….. అమ్మ నాన్న ఎక్కడమ్మా అని అడుగుతుంది అందుకు తన తల్లి తండ్రి చనిపోయిన సంగతి చెప్పకుండా….. నాన్నకి పని ఉంది అని చెప్పి అక్కడే ఉన్నాడు అమ్మ కొన్ని రోజుల తర్వాత వస్తాడు. అని అంటుంది. అందుకు పాపా సరే అంటుంది. భారతి ఇంట్లోకి వెళ్ళి అరటిపండ్లు తీసుకొచ్చి ఆ ఏనుగుకి అందిస్తుంది.
ఏనుగు వాటిని తిని తృప్తి గా అక్కడే పడుకుంటుంది. ఆరోజు గడిచిపోతుంది ఆ మరుసటి రోజు ఉదయం పాప ఏనుగు తో ఆడుకుంటూ ఉంటుంది. భారతీ మాత్రం ఇంట్లో కూర్చొని జరిగిన విషయం తలుచుకుంటూ ఎంతో బాధపడుతూ ఉంటుంది.
ఇక కొంచెం సమయం తర్వాత పాప… అమ్మ నాకు చాలా ఆకలిగా ఉంది అమ్మ. అని తల్లిని అడుగుతుంది
భారతి…. సరే అమ్మ నేను 10 నిమిషాల్లో వంట తయారు చేస్తాను. అని వంట ని తయారు చేస్తుంది.
ఆ తర్వాత పాపకి వాటిని అందిస్తుంది.
కానీ భారతి….. నా దగ్గర ఉన్న డబ్బుతో కొన్ని నెలలు కనిపిస్తాను ఆ తర్వాత పరిస్థితి ఏంటి. నేను ఏదో ఒక పని చేయాలి లేదంటే చాలా కష్టంగా ఉంటుంది.
అని అనుకుంటుంది ఆ తర్వాత రోజు నుంచి ఆమె ఇటికలు మోయడానికి వెళ్ళాలి అని నిర్ణయించుకుంటుంది. ఇక పాపతో ఆ ఏనుగుతో…. చూడమ్మా నేను పనికి వెళుతున్నాను. మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. చూడు ఏనుగు నువ్వు పాప ని కొంచెం జాగ్రత్తగా చూసుకో. అని చెప్పి అక్కడ నుంచి పనికి వెళ్తుంది.
అక్కడ ఆమె పని చేస్తూ ఉంటుంది. కానీ ఆమె పనికి కొత్త కావడంతో చాలా ఇబ్బందిగా అనిపిస్తూ పని చేయలేక అలసిపోతుంది.
అప్పుడే అక్కడున్న యజమాని….. చూడమ్మా ఇలా అయితే నీ వల్ల ఎదుటి వాళ్లకు కూడా ఇబ్బంది కలుగుతుంది . నీకు పని కొత్త కాబట్టి నీకు కష్టంగా ఉంటుంది నా మాట విని నీడ పట్టున ఉండే పని ఉంటే చూసుకో. ఈరోజు అయితే డబ్బులు ఇస్తాను అని చెప్పి డబ్బులు ఇస్తాడు.
భారతి…. లేదు బాబు నేను పనికి వస్తాను.
అందుకు అతను…. అమ్మ దయచేసి నా మాట విను నువ్వు పనికి వస్తే మిగిలిన వాళ్లు కూడా ఇబ్బందిగా ఉంటుంది . ఒక్కడితో పని ఆగిపోతే అందరూ ఆగిపోవాల్సి వస్తుంది.
అని చెప్పి ఆమెను బ్రతిమలాడి డబ్బులు ఇచ్చి పంపించేసాడు.
భారతీ చాలా బాధపడుతూ ఇంటికి వెళ్లిపోతుంది. చాలా బాధపడుతూ కూర్చుంటుంది భారతి. ఆమెను చూసిన పాప… అమ్మా ఏం జరిగింది అమ్మ అంత దిగులుగా ఉన్నావు. అందుకు ఆమె ఏమీ లేదు అని సమాధానం చెబుతుంది.
భారతి. కొన్ని రోజులు గడిచాయి భారతీ పని కోసం వెతుకుతూ చాలా ఆలిసిపోతుంది రోజులు గడిచాయి. భారతికి ఆరోగ్యం సరిగా లేక మంచం పడుతుంది. దాన్ని చూసిన పాప ఎంతగానో ఏడుస్తూ బాధపడుతుంది.
ఇక ఉలుకూ పలుకూ లేకుండా భారతి ఉంటుంది. పాపా తల్లిని చూసి… అమ్మ ఏమైందమ్మా నీకు ఒకసారి లేమ్మా. అమ్మ ఒక్కసారి లేమ్మా. అంటూ ఏడుస్తూ చాలా బాధపడుతుంది. ఏనుగు దాన్ని చూసి చాలా బాధపడుతుంది. కొన్ని రోజుల తర్వాత భారతి మరణిస్తుంది దాన్ని చూసిన పాప విలవిల్లాడిపోతోంది …… అమ్మ ఒకసారి రేపు మా అమ్మ ఒక్కసారి లేమా అంటూ గొంతు తడి ఆరిపోయి అంతవరకు అలా అరుస్తూనే ఉంటుంది. తర్వాత ఏనుగు ఆమె ఒక శవాన్ని తీసుకెళ్లి దహనసంస్కారాలు చేస్తోంది.
పాప కీర్తి తల్లి లేకపోవడంతో ఏడుస్తూ అలాగే ఉండిపోతుంది ఒక రోజు గడిచి పోతుంది ఆ మరుసటి రోజు ఏనుగు ఆహారం తీసుకువచ్చే ఆమెకు అందిస్తుంది.
పాప…. నీకు ఆహారం ఎక్కడి నుంచి వచ్చింది. అయినా నాకు ఆకలిగా లేదు. నాకు నా తల్లి దూరం అయిపోయింది. ఇప్పుడు నాకు కావలసింది నా తండ్రి ఎక్కడున్నాడో తెలుసుకొని ఆయన దగ్గరికి వెళ్లడం.
ఏనుగు… మిత్రమా మొదట నువ్వు ఆహారాన్ని తిను ఆ తర్వాత మీ నాన్న గారి దగ్గరికి నేను తీసుకెళ్తాను మీ నాన్నగారు ఎక్కడున్నారు నాకు తెలుసు. అని అంటుంది అందుకు పాప చాలా సంతోష పడుతూ…. నిజంగా నా అయితే తింటాను.
అని భోజనం తింటుంది తరువాత పాప…. ఏనుగు నేను భోజనం తిన్నాను కదా అయితే వెళ్దాం పదా మా నాన్న ఎక్కడున్నారో అక్కడికి తీసుకు వెళ్ళు మా నాన్నకు జరిగిన విషయం చెప్పాలి. మా అమ్మ దూరమైందని తెలిస్తే మా నాన్న ఎంతగానో బాధ పడతాడు
అయినా చెప్పాల్సిన బాధ్యత ఉంది కదా. అంటూ చాలా ఏడుస్తుంది నేను ఆ మాటలు విని… అయ్యో భగవంతుడా నేను ఇప్పుడు ఏం సమాధానం చెప్పాలి ఈ చిన్న పాప తల్లి చనిపోయింది తండ్రి కూడా చనిపోయాడు అని తెలిస్తే ఈమె పరిస్థితి ఏమై పోతుంది నాకు చాలా భయంగా ఉంది..
అని అనుకుంటూ చాలా బాధపడుతుంది.
పాప….. అయ్యో ఏనుగు నువ్వేం బాధపడకు. అమ్మ చనిపోయింది నువ్వు బాధపడుతున్నావు అని నాకు అర్థం అయింది . నాన్నకి చెబుదాం ఇంకా మనకి అమ్మ అయినా నాన్న అయినా అన్ని ఆయనే. అంటూ ఏడుస్తూ చెబుతుంది ఆ మాటలకి
ఆ ఏనుగుకి ఏం చెప్పాలో అర్థం కాదు.
ఏనుగు…. పాపా రేపు పొద్దున్నే బయల్దేరుదాం అని అంటుంది అందుకు పాపా సరే అంటుంది. ఆ ఉదయాన్నే పాప నిద్ర లెగిసి ఉంది కానీ ఏనుగు అక్కడ ఎక్కడా కనిపించలేదు . పాప చాలా కంగారు పడుతూ ఏనుగు కోసం వెతుకుతూ ఉంటుంది నేను ఒక చోట కట్టెలు మోస్తూ కనిపిస్తుంది దాన్ని చూసిన పాప ఏనుగు దగ్గరకు వెళ్లి….. ఏనుగు నువ్వు ఎందుకు ఇక్కడ పని చేస్తున్నావు. అసలుకే నువ్వు గర్భవతి వి
ఏనుగు…. పాపా మనం బ్రతకాలంటే మనకి డబ్బులు కావాలి కదా . అందుకే నేను డబ్బు సంపాదించడం కోసం ఏ పని చేస్తున్నాను.
పాపా… అయ్యో ఎందుకో నువ్వు కష్టపడాల్సిన అవసరం ఏముంది . మనం నాన్న దగ్గరికి తిరిగి వెళ్తాం కదా. నువ్వు ఈ పని ఆపేసి నాన్న దగ్గరికి వెళ్దాం పద . నేను తొందరగా నాన్న దగ్గరకు తీసుకు వెళ్ళు.
ఏనుగు…. నేను నాన్న దగ్గరికి తీసుకెళ్తాను . కానీ నాన్న గారు ఎక్కడో పని మీద ఊరు వెళ్లారు నాలుగు రోజుల్లో తిరిగి వస్తాడు.
పాపా….. ఆ విషయం నీకు ఎవరు చెప్పారు నీకు ఎలా తెలుసు.
ఏనుగు….. అయ్యో నాన్న ఇప్పుడు ఇక్కడికి వచ్చి వెళ్లారు . ఆ విషయము చెప్పడానికి నాకు చెప్పి వెళ్ళిపోయాడు. పాపా…. అప్పుడు నాన్న నీ నా దగ్గరికి తీసుకు రావాల్సింది. అంటూ పాప చాలా బాధపడుతుంది. ఆ తర్వాత పాప ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్లి పోతుంది ఏనుగు తన పని ముగించుకుని . యజమాని దగ్గర డబ్బులు తీసుకుని కావలసిన సరుకులు తీసుకుని ఇంటికి వెళ్తుంది.
ఏనుగు పాపకి భోజనం తినిపిస్తుంది. అలా రోజులు గడుస్తున్నాయి పాపా ప్రతిరోజు తన తండ్రి గురించి అడుగుతూ అతని దగ్గరకి తీసుకెళమని అడుగుతూ ఉంటుంది.
అందుకు ఏనుగు ఏదో ఒక సమాధానం చెబుతుంది. అలా రోజులు గడిచాయి ఏనుగు ఓ తండ్రి దగ్గరకు తీసుకెళ్ళి కాకపోవడంతో పాప ఏనుగుతో పెద్దగా ఏడుస్తూ…. నువ్వు మా నాన్న దగ్గరికి ఎందుకు తీసుకు వెళ్ళడం లేదు నువ్వు తీసుకెళ్లి పోతే నేను అన్నం తినకుండా ఉంటాను చచ్చిపోతాను.
అని ఏడుస్తూ ఉంటుంది అప్పుడు ఏనుగు ఏం చేయాలో అర్థం కాక ….. నేను నిజం చెబితే పాప ఎలాగా అయిపోతుందో నాకు అర్థం అవటం లేదు కానీ ఇప్పుడు అయితే నిజం చెప్పాల్సిన అవసరం వచ్చింది. అంత నీ మీద భారం వేశాను అని అనుకొని. పాపను తీసుకుని అడవికి వెళుతుంది.
కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అతను చనిపోయిన ఊబి దగ్గర పాపను నిలబెడుతుంది పాపా….. మనం ఎక్కడ ఇక్కడ కి తీసుకొచ్చావు మా నాన్న ఎక్కడ కనపడటం లేదు. అని అంటుంది .
ఏనుగు…. పాపా నేను చెప్పబోయే విషయాన్ని విని గుండె రాయి చేసుకో . మీ నాన్నగారు మీ నాన్నగారు మీ అమ్మగారిని కాపాడుతూ ఈ ఊబిలో పడిపోయాడు .
అంటూ జరిగిన విషయం చెబుతుంది.
దానిని విన్న పాపా…. నాన్న నువ్వు కూడా నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయావా. నాన్న నాన్న.
ఆంటీ ఏడుస్తూ నాకు. అమ్మానాన్న ఎవరు లేరు నేను అనాధ ని. అంటూ ఏడుస్తుంది ఎనుగు ఓదారుస్తూ…. పాప నువ్వేం బాధపడకు . నేను నిన్ను బాగా చూసుకుంటాను. నా మాట నమ్ము. మీ అమ్మగారు నాకు కడుపు నిండా భోజనం పెడతారు . ఆమె రుణాన్ని తీర్చుకుంటాను . అని ధైర్యం చెప్పి పాపను ఇంటికి తీసుకెళ్ళి పోతుంది. ఆ రోజు నుంచి ఎందుకు పని చేసుకుంటూ పాప కి కావాల్సిన అన్నిటినీ అందిస్తూ ఉండండి పాప కూడా ఇంటిపని తానే స్వయంగా చేస్తూ . ఒకరికి ఒకరు తోడుగా ఉంటారు

Add a Comment

Your email address will not be published. Required fields are marked *