గర్భవతి ఏనుగు బాధ ఏడో భాగం._ Telugu Stories- Stories in Telugu – Panchatantra Kathalu

గర్భవతి ఏనుగు బాధ ఆరవ భాగం లో పార్వతి సమాధి దగ్గరకు వెళ్లి తను హంతకురాలు నీ అని ఏడుస్తూ బాధపడుతున్న సమయంలో ఆ గర్భవతి అయిన ఏనుగు పొట్ట భాగం కదులుతూ ఉంటుంది. దాన్ని చూసిన పార్వతి ఆశ్చర్యంగా…. ఏనుగు పొట్ట భాగం కదులుతుంది అంటే బిడ్డ ఇంకా బ్రతికే ఉన్నాడు. భగవంతుడా అదే నిజం చెయ్యి?. నేను చేసిన తప్పు నీ సరిదిద్దుకునే అవకాశం ఇవ్వు. అంటూ పరుగు పరుగున అక్కడి నుంచి పశువుల హాస్పిటల్ లో ఉన్న డాక్టర్ శ్రావణి దగ్గరకి వెళ్లి జరిగిన విషయం అంతా చెప్పి ఆమెను వెంట పెట్టుకొని ఆ స్మశానం దగ్గరికి ఆమెను తీసుకొని వస్తుంది. డాక్టర్ శ్రావణి ఆ ఏనుగు శరీరభాగం అంత పరీక్షించి: అవును మీరు అన్నట్లుగానే బిడ్డ బ్రతికే ఉన్నాడు నేను ఇప్పుడే బిడ్డ ని బయటకు తీస్తాను అంటూ కడుపులో ఉన్న బిడ్డ ను బయటకు తీస్తుంది.

దాన్ని చూసిన పార్వతి ఆమెకి చేతులెత్తి నమస్కరించిన: మీకు చాలా కృతజ్ఞతలు నేను ఎంత పెద్ద తప్పు చేశాను. ఆ తల్లిని చంపేశాను నా భర్తని దూరం చేసుకున్నాను. నా తప్పు నీ సరిదిద్దు కోవడానికి దేవుడు నాకు మీ రూపంలో మంచి అవకాశం ఇచ్చాడు ఆ బిడ్డను నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను అని చెప్పి ఉన్నట్టుండి ఆమె స్పృహ తప్పి కింద పడిపోతుంది.
డాక్టర్ శ్రావణి… మేడం ఏమైంది అయ్యో ఏమైంది అంటూ పరీక్షిస్తుంది . వెంటనే తన సిబ్బందికి అయినా మధుకి కాల్ చేసి …. మధుగారు వెంటనే ఊరి చివర ఉన్న స్మశానం
దగ్గరకు ఆంబులెన్స్ తీసుకొని రండి.
మధు… సరే మేడం ఇప్పుడే వస్తాను అని చెప్పి అంబులెన్స్ తీసుకొని స్మశానం దగ్గరికి వస్తాడు.
డాక్టర్ శ్రావణి గారు మధు తో…. మధు గారు ఈమె మీకు తెలుసా.
మధు… మేడం నాకు తెలుసు ఈమె నా స్నేహితుడు నాగయ్య భార్య. పాపం మొన్ననే నాగయ్య చనిపోయాడు.
డాక్టర్ శ్రావణి… సరే నీకు వీళ్ళు ఇల్లు తెలుసు కదా.
మధు… తెలుసు మేడమ్
శ్రావణి…. సరే అయితే వెంటనే ఆ ఏనుగుని ఈమెని అంబులెన్స్లో ఎక్కించి వాళ్ల ఇంటి దగ్గరికి తీసుకెళ్ళు. అందుకు మధు సరే అంటాడు అలా ఆంబులెన్స్ లో వాళ్ళిద్దర్నీ తన ఇంటికి తీసుకు వెళ్తారు. చాలా సమయం తర్వాత పార్వతి సృహ నుంచి మేల్కొని…. నాకు ఏమైంది డాక్టర్ నేను ఎక్కడున్నాను.
శ్రావణి… మీరేం కంగారు పడకండి మీకు అంతా సరిగానే ఉంది మీరు సురక్షితంగా మీ ఇంట్లోనే ఉన్నారు.
పార్వతి… మరి ఈ మంచం మీద ఏంటి.
శ్రావణి…. ఇదా ఏం కాలేదు నీకు ఒక శుభవార్త మీరు ఇప్పుడు గర్భవతి. ఇక నుంచి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. సమయానికి భోజనం తీసుకోండి ఎక్కువ పనులు చేయకండి. మీ ఆరోగ్యం జాగ్రత్త . సరే ఇక నేను వెళ్లి వస్తాను. ఏదైనా అవసరం ఉంటే మా పశువైద్యశాల పక్కనే జనరల్ హాస్పిటల్ ఉంది. అక్కడికి మీరు కూడా రావచ్చు. అని చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోతుంది.
పాపం పార్వతి పెద్ద పెద్దగా ఏడుస్తూ… భగవంతుడా నేను తల్లి కాబోతున్నాను అని
సంబర పడాలో భర్త నీ ఆ ఏనుగును చంపిన హంతకురాలు నేనే అని బాధ పడాలో. తెలియని స్థితిలో ఉన్నాను. అని పెద్ద పెద్దగా ఏడుస్తూ ఉంటుంది అక్కడే ఉన్న ఆ చిన్న ఏనుగు ఆమె వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. ఆమె ఎందుకు దగ్గరకు వెళ్లి … ఇక నుంచి నీకు నేను నాకు నువ్వు . నేను నీకు తల్లి నీ అని ఆ ఏనుగుని నిమురుతూ ఉంటుంది.అలా రోజులు గడిచాయి. ఆ ఏనుగు పెద్దదవుతుంది. పార్వతి ఆ ఏనుగుని చూసి చాల సంతోషపడుతూ దానికి కావలసిన ఆహారాన్ని అందిస్తూ ఉంటుంది. ఆ ఏనుగు తనలో….. మా అమ్మ చాలా మంచిది. నాకు ప్రతిరోజు మంచి ఆహారాన్ని అందిస్తోంది. నేను మా అమ్మ తోనే ఉండి మా అమ్మని చాలా బాగా చూసుకుంటాను. అని ఆ చిన్న ఏనుగు తన మనసులో ముద్దుముద్దుగా పలుకుతూ ఉంటుంది. ఆ తర్వాత పార్వతి ఇంటి పనులు చేసుకుంటూ ఉంటుంది ఇంతలో ఆ ఏనుగు పెద్ద పెద్దగా అరవడం మొదలు పెడుతుంది.
దాన్ని చూసిన పార్వతి…. ఏమైంది ఎందుకు అలా అరుస్తున్నావు. ఇప్పుడే కదా తిన్నావు ఆ కలవడానికి అవకాశమే లేదు నీళ్ళు కావాలా. ఆ మాటలు విన్న ఏనుగు కావాలి అన్నట్టుగా తల ఊపుతుంది.
పార్వతి ఇప్పుడే తీసుకొస్తాను అని చెప్పి ఒక పాత్ర నిండా నీటి నీ తీసుకొస్తుంది.
పార్వతి…. సరే నువ్వు ఎక్కడికి వెళ్ళకు మన ఇంట్లో నీళ్లు అయిపోయాయి. చెరువు దగ్గరికి వెళ్లి నీటిని తీసుకొని వస్తాను. నువ్వు జాగ్రత్త ఎటు వెళ్ళకు అని ఆ ఏనుగు కి చెప్పి ఒక బిందెలు తీసుకొని నీళ్లకు వెళ్తుంది. ఏనుగు ఇంట్లో ఒంటరిగా ఉంటుంది. చాలా సమయం అవుతుంది కానీ పార్వతి ఇంటికి తిరిగి రాకపోవడంతో ఏనుగు తన మనసులో… ఇంత సమయం అయ్యింది మా అమ్మ ఎక్కడికి వెళ్లి పోయింది ఇంతవరకు రాలేదు. నేనే మా అమ్మకి ఎదురు వెళ్తాను. అని చెప్పి తన తల్లిని వెతుక్కుంటూ ఆ ఏనుగు చెరువు దగ్గరకు వెళ్తుంది ఆ చెరువు దగ్గర పార్వతి సృహ తప్పి పడి పోయి ఉంటుంది.
ఏనుగు ఆమెను చూసి… అమ్మ ఏమైంది అమ్మా నీకు అమ్మ ఒక సారి లే అమ్మా ఏమైంది అమ్మా నీకు అంటూ కన్నీరు కారుస్తూ. ఏం చేయాలో అర్థం కాక అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. అప్పుడు దానికి ఒక ఆలోచన వచ్చి చెరువు లోకి వెళ్లి నీటిని తీసుకొచ్చి ఆమె ముఖంపై జల్లు తుంది.
వెంటనే పార్వతి నుంచి మేల్కొని కళ్ళు నడుపుకొని ఏనుగు వైపు చూస్తుంది. అప్పుడు ఆమె కి అంతా అర్ధమయ్యి ఆ ఏనుగుతో ….. నేను పుణ్యాత్మురా లి నో పాపాత్ము లినో నాకు తెలియదు కానీ. నువ్వు మాత్రం అణువణువునా నన్ను కాపాడు కుంటూ వస్తున్నావు. నీ తల్లిని నేను ఎంత చిత్రహింసలు పెట్టానొ నాకు తెలుసు. కానీ నువ్వు మాత్రం నన్ను ఎంత ప్రేమగా చూసుకుంటున్నావో ఆ ప్రేమతో పదేపదే నేను చేసిన తప్పు ని గుర్తు చేస్తున్నావు. అంటూ బోరున ఏడుస్తుంది. ఇంతలో ఆ ఏనుగు ..
అమ్మ ఇంక నువ్వు ఏ పనులు చేయకు. అన్ని పనులు ఇకనుంచి నేనే చేస్తాను. అని కన్నీళ్లు పెట్టుకుంటూ తనలో మాట్లాడుకుంటూ ఉంటుంది. పార్వతి …. ఏడవకు నాన్న ఎందుకు ఏడుస్తున్నావ్.నాకు ఏం కాలేదు అని ఆ బిందె ని తీసుకోబోతుండగా ఏనుగు … వద్దమ్మా నేను తీసుకొస్తాను గా. అంటూ ఆయనకు ఆ బుంగ ని తీసుకుంటుంది అలా ఇద్దరూ కలిసి దారిలో వస్తుండగా ఊరి ప్రజలంతా ఆశ్చర్యంగా ఆ ఏనుగుని చూస్తూ… ఆశ్చర్యంగా ఉందే నాగయ్య భార్య ఎలా ఉంది ఆమె. భర్త చనిపోయిన చాలా సంతోషంగానే ఉంది. అయినా అప్పుడు ఆ ఏనుగుని వద్దు అని వాళ్ళ ఆయనతో గొడవ పెట్టుకుంది. ఇప్పుడు అదే ఏనుగుని పెంచుకుంటుంది. ఆ ఏనుగు లేదు అన్న బాధతోనే కదా తన భర్త చనిపోయింది.
అని ఆమెకు వినపడేలా గా సూటిపోటి మాటలతో ఆమెని కించ పరుస్తూ ఉంటారు.
ఆ మాటలు విన్న ఆమె చాలా బాధపడుతూ ఉంటుంది ఇంటికి చేరుకున్న తర్వాత ఆమె… ఈ మనుషులు ఎందుకు నన్ను ఇలా హింసిస్తున్నారు. వాళ్ల మాటలు నా గుండెనీ గాయ పరుస్తున్నాయి నేను ఒకప్పుడు క్రూరంగా ప్రవర్తించిన మాట వాస్తవమే కానీ ఇపుడు నేను పూర్తిగా మారిపోయాను. మనుషులకి మారే అవకాశం కూడా ఈ జనాలు ఇవ్వడం లేదు. అని ఎంతగానో దుఃఖిస్తూ ఉంటుంది. ఆరోజు ఆ ఏనుగు కూడా ఏడుస్తూ ఎంతో బాధపడుతూ … అమ్మ నువ్వు ఏడవకు అమ్మ . నేను ఉన్నాగా అమ్మ నిన్ను ఎవ్వరు ఏమన్నా నేను అస్సలు ఊరుకోను. ఏడో మా అమ్మా అంటూ తన లో ఏడుస్తూ తన తల్లిని బుజ్జగిస్తూ ఉంటుంది. చీకటి పడిపోయింది ఆ రోజు ఆ ఏనుగు తల్లి ఇద్దరు కూడా ఏమీ తినకుండా అలా ఏడుస్తూనే నిద్రలోకి జారుకున్నారు. అప్పుడే అక్కడికి మా ఊరి వ్యక్తి అయిన సింగయ్య వాళ్లు ఇంటి దగ్గరకు వచ్చి తన మనసులో…. ఒంటరిగా ఉంటుంది ఈ పార్వతి నేను జంటగా చేసుకోవాలను ఆమె వద్దు అన్న సరే ఆమెను ఈరోజు బలత్కారం చేయాల్సిందే. అంటూ తాగిన మత్తులో పిచ్చిపిచ్చిగా మాట్లాడుతూ ఆ ఇంటి దగ్గరికి వచ్చాడు.
పార్వతీ గాఢనిద్రలో ఉంది అతను ఆమె దగ్గరకు వచ్చి ఆమెపై చేయి వేశాడు ఆమె పెద్దగా అరుస్తూ నిద్ర నుంచి లేస్తుంది.
అతను… భయపడకు నేనే నువ్వు ఎంతకాలమని ఒంటరి గా ఉంటావు వయసులో ఉన్నావు నీకు కొన్ని కోరికలు ఉంటాయి కదా. అని మాట్లాడుతుండగా పార్వతి…. ఛీ ఏం మాట్లాడుతున్నావ్ నేను గర్భవతిని. ఒంటరిగా ఉన్న ఆడ వాళ్ళని ఈ విధంగా మాట్లాడతారా దయచేసి ఇక నుంచి వెళ్ళిపొండి. అయినా అతడు ఆమె మీద జాలి చూపించకుండా ఆమె దగ్గరికి రాబోతుండగా ఆమె … కాపాడండి ఎవరైనా నన్ను కాపాడండి. అంటూ కేకలు వేస్తుండగా ఏనుగుకు మెలకువ వచ్చి రేయ్ మా అమ్మ ని వదిలి పెట్టు లేదంటే నిన్ను నా కాళ్ళ కింది తొక్కేస్తా ను అంటూ తన తొండంతో అతన్ని విసిరి కొడుతుంది. అతడు దూరంగా వెళ్ళి పడతాడు. ఏనుగు… మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో లేదంటే నీ ప్రాణాలు తీస్తాను జాగ్రత్త. అని తన తల్లి కి అడ్డంగా నిలబడుతుంది. అతను తాగిన మత్తులో ఏమీ అర్థం కాక పక్కనే ఉన్న ఒక గడ్డ పలుగు ని తీసుకొని ఆ ఏనుగు మీద దాడి చేయడానికి వస్తుండగా పార్వతి…. వద్దు నా బిడ్డ నీ ఏం చెయ్యొద్దు అంటూ ఆయనకి అడ్డుపడుతుంది అతను ఆ గొట్ట పలుకుతూ పార్వతి కడుపులో పొడిచాడు …. ఆమె అమ్మ అంటూ పెద్ద గా అరుస్తుంది. ఆమె శరీరం నుంచి రక్తం కారటం చూసిన అతను భయంతో అక్కడి నుంచి పరుగులు తీస్తాడు. దాన్ని చూసిన ఏనుగు వాడి వెంట పడి…. రేయ్ మా అమ్మని గాయపరచావు కదా నేను నిన్ను వదిలిపెట్టను. అంటూ వెనకనుంచి అతన్ని తన తొండంతో ముందుకు నడుస్తుంది అతను కింద పడిపోతాడు. వెంటనే ఆ ఏనుగు అతని మీద కాలు వేసి తొక్కి అతని చంపేస్తోంది. ఆ తర్వాత అక్కడ్నుంచి పరుగు పరుగున తన తల్లి దగ్గరికి వెళుతుంది. అతన్ని ఎంతో నొప్పిని భరిస్తూ…. అమ్మ నొప్పి నొప్పి అంటూ ఎంతో కన్నీరు కారుస్తూ. నా బిడ్డ నా బిడ్డ. అంటూ పెద్ద పెద్దగా కేకలు వేస్తూ శ్రుహ లోకి వెళ్లిపోతుంది. దాన్ని చూసిన ఏనుగు చాలా భయపడుతూ … అమ్మ లేమ్మా ఒకసారి లే అమ్మ. అమ్మ నీకేం కాదమ్మా అమ్మ లేమ్మా.అమ్మ లేమా అంటూ పెద్ద పెద్దగా ఏడుస్తూ పెద్ద పెద్దగా అరుస్తూ ఆ ఏనుగు అక్కడే ఉండి పోతుంది..

Add a Comment

Your email address will not be published. Required fields are marked *