గర్భవతి ఏనుగు బాధ 10_ Telugu Stories- Stories in Telugu – Panchatantra Kathalu

అది ఒక అందమైన పల్లెటూరు అక్కడ ఒక పెద్ద చెరువు ఉండేది సింగయ్య ఆ చెరువులో తన గర్భవతి అయిన ఏనుగుకి ప్రతి రోజూ స్నానం చేయించి ఆ ఏనుగుని ఎంతో ప్రేమతో చూసుకునేవాడు.

ఆ ఏనుగు కూడా అతన్ని ఎంతో ప్రేమతో చూసుకునేది. అతను బతుకుతెరువు కోసం కూరగాయల వ్యాపారం చేస్తూ ఉండేవాడు.
….. రండి బాబు రండి ఇక తాజా తాజా కూరగాయలు. రావాలమ్మా రావాలి అంటూ ఊర్లో తిరుగుతూ కూరగాయల అమ్ముకుంటూ ఉండేవాడు ఆ కూరగాయల బండి ఏనుగు తోస్తు అతనికి సహాయం గా ఉండేది.అలా వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తూ ఉండేవాళ్ళు అయితే ఒకరోజు సింగయ్య తన ఏనుగుకి ఆహారం తినిపించడానికి వెళ్తాడు. అప్పుడు ఆ ఏనుగు చాలా నీరసంగా కనిపిస్తుంది. దాన్ని చూసిన సింగయ్య…. ఏమైందమ్మా నీకు ఈరోజు రోజు చాలా నీరసంగా కనిపిస్తున్నావు. ఆహారం కూడా తినటం లేదు. ఇలా అయితే ఎలా నీ కడుపులో ఉన్న బిడ్డ కి ఆకలి వేస్తుంది కదా.అంటూ బలవంతంగా తినిపించడానికి ప్రయత్నిస్తాడు కానీ ఆ ఏనుగు ఆహారాన్ని ముట్టక పోవడంతో…. ఏమైంది ఎందుకన్న మంచిది నిన్ను ఒకసారి హాస్పటల్కు తీసుకెలీ చూపిస్తాను
అని చెప్పి ఆ ఏనుగుని చిన్నగా నడిపించుకుంటూ హాస్పటల్ కి తీసుకెళ్ళు ఉంటాడు. మార్గమధ్యలో ఒక కారులో ఉన్న వ్యక్తి మద్యం సేవించి ఆ కారుని వేగంగా రోడ్డుకి అటు ఇటు తిప్పుతూ వస్తూ ఉంటాడు. సింగయ్య దానిని గమనించడు ఇంతలో ఆ ఏనుగు దానిని గమనించి తనలో …. అయ్యో కారు వేగంగా వస్తుంది. నువ్వు తప్పుకో మిత్రమా అంటూ అతని పక్కకి నెట్టి వేస్తుంది. ఇంతలో ఆ వ్యక్తి తన కారుతో ఏనుగు నీ ఢీ కొనడంతో ఆ కారు బోల్తాపడి ఆ కారులో ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మరణిస్తాడు. సింగయ్య దృశ్యాన్ని చూసి చాలా కంగారు పడుతూ ఆ కారు దగ్గరికి వెళ్తాడు అప్పటికే ఆ కారులో ఉన్న వ్యక్తి చనిపోతాడు . అయ్యో ఎంతపని జరిగిపోయింది భగవంతుడా అనుకుంటాడు అక్కడ ఏనుగు కాలికి పెద్ద గాయం తగిలి రక్తం కారుతూ పెద్ద పెద్దగా అరుస్తూ….. భగవంతుడా నా బిడ్డ కి ఏం కాలేదు గా నాకు ఏం కాలేదు గా. నాకు కాలు మాత్రం చాలా నొప్పిగా ఉంది నేను పైకి లేక లేక పోతున్నాను అంటూ చాలా కన్నీరు కారుస్తోంది. దానిని చూసిన అతను కంగారు పడుతూ…. అయ్యో కాలింగ్ గాయమైంది రక్తం కారి పోతుంది. ఏం చేయాలో నాకు ఏమీ అర్థం కావట్లేదు. అంటూ దాన్ని పశువుల హాస్పిటల్ కి తీసుకువెళ్తాడు. అక్కడ డాక్టర్ తో జరిగిన విషయం అంతా చెబుతాడు ఆ డాక్టర్ ఆ ఏనుగుని పరీక్షించి చూసి అతని దగ్గరికి వస్తుంది అతను…. డాక్టర్ నా ఏనుగుకి ఏం కాలేదు కదా ఇప్పుడు ఆ ఏనుగు గర్భవతి లోపల బిడ్డ కి ఏం కాలేదు కదా.
డాక్టర్….తల్లి బిడ్డ ఇద్దరు సురక్షితగానే ఉన్నాయి కానీ ఆ ఏనుగు కాలు నీ తీసివేయాల్సి వస్తుంది.
సింగయ్య…. అయ్యో డాక్టర్ కాలు తీసి వేస్తే నా ఏనుగు ఇక నడవలేదు కదా. మరో మార్గం ఏమైనా చూడండి డాక్టర్.
డాక్టర్….. మరో మార్గం అంటూ ఏం లేదు కాలు తీసి వేయి కపోతే ఇన్ఫెక్షన్ వచ్చి మీ ఏనుగు చని పోతుంది. అని చెప్తుంది అందుకు అతను బాధపడుతూ సరే మేడం చేసేదేముంది ఆ కాలుని తొలగించండి అని చెప్తాడు.డాక్టర్ సరే అని చెప్పి దానికి వైద్యం చేసి ఆ ఏనుగు యొక్క కాలునీ తీసివేస్తుంది కొన్ని రోజులు హాస్పిటల్ లోనే ఉన్న తర్వాత ఏనుగు ని ఇంటికి తీసుకెళ్ళి పోతాడు. అతను చాలా బాధపడుతూ….. అయ్యో నన్ను క్షమించు ఆరోజు నేను అప్రమత్తంగా ఉండాల్సింది. నేను ఏదో ఆలోచిస్తూ న్న ఆ కారుని చూసుకోలేదు నువ్వు నన్ను కాపాడడం కోసం నీ ప్రాణాలు బలి ఇవ్వడానికి సిద్ద పడ్డావు. అంటూ కంటతడి పెట్టుకుంటాడు. దానిని చూసిన ఏనుగు…. అయ్యో నువ్వు బాధపడకు నాకు ఏం బాధ లేదు.నేను నిన్ను కాపాడు కొన్నాను అలాగే నా కడుపులో బిడ్డ కూడా ఏం కాదు అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను నడవలేక పోతే ఏమవుతుంది నీతోనే ఉంటాను కదా. ఏడవద్దు అన్నట్టుగా తల ఊపుతూ చాలా బాధపడుతుంది. పాపం సింగయ్య ఆ ఏనుగు గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అతను ఆ తర్వాత రోజు మధ్యాహ్న సమయంలో డాక్టర్ దగ్గరికి వెళ్లి ఆమెతో…. డాక్టర్ గారు మా ఏనుగుకి మళ్ళీ కాలు వచ్చే మార్గం ఏమీ లేదా
అది ఏమన్నా ఉంటే చెప్పండి.
డాక్టర్… అలాంటి మార్గం అంటూ ఏమీ లేదండి.
అతను…. ఎందుకు ఉండదు డాక్టర్ మనుషులకి కాలు లేకపోతే కృత్రిమ కాలు అమరుస్తున్నారు కదా అలాగే నా ఏనుగుకి కూడా కృత్రిమ కాలు అమర్చండి.
డాక్టర్…హా..హా.. నాకు మిమ్మల్ని చూస్తే నవ్వొస్తుంది. ఏనుగుకి కుత్రిమ కాల అది సాధ్యమే కానీ దానికి చాలా డబ్బు ఖర్చు అవుతుంది.
అతను…. డాక్టర్ గారు ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు. కృత్రిమ కాలు అమర్చండి అదంతా నేను చూసుకుంటాను. దయచేసి ఈ ప్రయత్నం చేయండి. మళ్లీ నా ఏనుగు నడవాలి నాతోపాటు కూరగాయల వ్యాపారం చేయాలి అప్పుడే నాకు సంతోషంగా ఉంటుంది. అంటూ కంటతడి పెట్టుకుంటాడు. అతని బాధ అర్థం చేసుకున్న డాక్టర్…మీ జంతు ప్రేమ ను చూస్తుంటే నాకు చాలా జాలి గా ఉంది. సరే నా వంతు ప్రయత్నం నేను చేస్తాను మీరు డబ్బులు ఏర్పాటు చేసుకోండి అని చెప్తుంది. ఆ మాటలకి అతను చాలా సంతోష పడుతూ మీకు చాలా కృతజ్ఞతలు మేడం నేను డబ్బులు ఏర్పాటు చేసుకుంటాను అని చెప్పి చేతి నమస్కరించి అక్కడి నుంచి తన ఇంటికి వెళ్తాడు. అక్కడ ఏనుగుతో….. నువ్వు ఏమి బాధ పడకు నువ్వు మళ్ళీ తిరిగి నడుస్తావు ఎప్పటిలాగే నాతో పాటే కలిసి వ్యాపారం కూడా చేస్తావు. అంటూ దానికి ఆశలు రేపుతోంది.
అతని మాటలు విన్న ఏనుగు చాలా సంతోషపడుతూ…. నిజంగా అలా జరిగితే నాకంటే అదృష్టవంతులు ఎవరు ఉండరు అనుకుంటా నీకు చాలా కృతజ్ఞతలు మిత్రమా అంటూ కంటతడి పెట్టుకుంటుంది. ఆతర్వాత సింగయ్య ఏనుగుతో నువ్వు జాగ్రత్తగా ఇక్కడే ఉండు నేను ఇప్పుడే అలా వెళ్లి వస్తాను అని చెప్పి తన స్నేహితుడైన హనుమంత్ దగ్గరికి వెళ్లి…. మిత్రమా నాకు కొంచెం డబ్బు కావాలి చాలా అవసరం.
హనుమంతు… ఎందుకు మిత్రమా అంత అవసరం ఏంటి.
సింగయ్య అప్పుడు జరిగిన విషయం అంతా చెబుతాడు.
అందుకు అతను పెద్దగా నవ్వుతూ…. మనుషులు తినడానికి తిండి లేదు. మళ్లీ ఏనుగు కి కాలు పెట్టి ఇస్తావా అంత అవసరం ఏంటి. అలాంటి పిచ్చి ఆలోచనలు మానుకో. అని అంటాడు అందుకే అతను చాలా బాధ పడుతూ….సరే మిత్రమా నువ్వు సహాయం చెయ్ పోయినా పర్వాలేదు కానీ అలా మాట్లాడొద్దు. ఈరోజు నేను ఇలా బతికి ఉన్నానంటే ఆ ఏనుగు చలవే. అని చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోయి మరో స్నేహితుడు దగ్గరికి వెళ్తాడు. అతను కూడా….. ఓరి పిచ్చి వెధవా లేనిపోని ప్రయోగాలు నీకెందుకురా. నా మాట విని కుదురుగా ఉండు. అని చెప్తాడు సింగయ్య చాలా బాధపడుతూ ఉంటాడు అలా చాలామంది సహాయం కోసం అర్థిస్తాడు కానీ ఎక్కడా డబ్బులు అందవు. చీకటి పడుతుంది అక్కడ ఏనుగు అతని కోసం ఎదురు చూస్తూ…. నా మిత్రుడు ఎక్కడికి వెళ్లి పోయాడు ఇంత రాత్రి అవుతుంది. నాకు చాలా భయంగా ఉంది దేవుడా నా మిత్రునికి ఏం కాకుండా చూడు. అంటూ ఉండగా ఇంతలో సింగయ్య అక్కడికి చాలా బాధపడుతూ వస్తాడు. దాన్ని దూరం నుంచి చూసి ఏనుగు… అమ్మయ్య నా మిత్రుడు వచ్చేసాడు. అనుకుంటుంది అతను ఏనుగు దగ్గరకు వచ్చి…. నన్ను క్షమించు మిత్రమా నేను నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకో లేక పోయాను.నేను డబ్బు కోసం ఎంత మందిని అడిగిన ఎవరు నాకు సహాయం చేయలేదు. నన్ను క్షమించు అంటూ బాధపడతాడు.
దాన్ని చూసిన ఏనుగు…. అయ్యో నువ్వు అలా బాధ పడకు మిత్రమా. జరిగేదేదో జరుగుతోంది. నాకు కాలు లేకపోతే ఏమి బతికే ఉన్నా కదా. అది ఒక్కటి చాలు. నా గురించి నువ్వు ఇంతగా బాధ పడడం నాకు అస్సలు నచ్చలేదు. అనుకుంటూ ఆ ఏనుగు కూడా బాధపడుతుంది. పాపం అతను ఆ రాత్రంతా ఏనుగు ని పట్టుకొని ఏడుస్తూనే ఉంటాడు. అప్పుడు ఒక్కసారిగా అతనికి ఒక ఆలోచన వస్తుంది….. నేను ఎందుకు ఇంత బాధపడుతున్నాను నా ఇల్లు ఉంది కదా. దానిని అమ్మి డబ్బు తెచ్చుకొని నా ఏనుగుకి కాలు పెట్టిస్తాను. అని అనుకొని ఆ మరుసటి రోజే ఇల్లుని బేరానికి పెట్టేస్తాడు. మా ఊర్లో ఉన్న పెద్ద జమీందారు ఆ ఇంటిని కొనుగోలు చేసి అతనికి డబ్బు ఇచ్చి వెళ్ళిపోతాడు. ఆ డబ్బు చూసి అతను చాల సంతోషపడుతూ వెంటనే ఆ ఏనుగుని హాస్పిటల్ కి తీసుకు వెళ్తాడు. అక్కడ డాక్టర్ …. సరే నేను పైనుంచి డాక్టర్ని పిలిపిస్తాను. త్వరలోనే మీ ఏనుగుకి కాలు అమ్మరిస్తాము అని చెప్తుంది అతను చాలా సంతోష పడతాడు. కొన్ని రోజుల్లోనే పైనుంచి డాక్టర్ వస్తాడో. ఆ డాక్టర్లు ఇద్దరూ చాలా కష్టపడి ఆ ఏనుగుకి కుత్రిమ కాలుని అమరుస్తారు. ఆ ఆపరేషన్ పూర్తి చేసిన తర్వాత ఆ డాక్టర్ లు ఇద్దరూ సింగయ్య దగ్గరికి దగ్గరకు వచ్చి….. చూడండి మా ప్రయత్నం మేము చేసాము. ఇక నడవడం అనేది మీ చేతిలో ఉంటుంది బలమైన ఆహారాన్ని అందించండి. రోజు అటూ ఇటూ దాన్ని నడిపించండి అంత ఆ దేవుడి కృప తో అంతా మంచి జరుగుతుంది. ఆ తర్వాత అంతా పై వాడి దయ. అని చెప్తాడు.
అందుకు సింగయ్య….. చాలా కృతజ్ఞతలు డాక్టర్ గారు. అప్పుడు ఆ పశు వైద్య రాలు….. డాక్టర్ గారు చెప్పింది అర్థం అయింది కదా ఇంకా నువ్వే ఆ ఏనుగుని జాగ్రత్తగా చూసుకోవాలి. అని చెప్తుంది ఆ తర్వాత ఆ డాక్టర్ ఇక నేను వెళ్లి వస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత సింగయ్య ఏనుగుకి మంచి ఆహారం తినిపించి దాన్ని ప్రతి రోజు అటూ ఇటూ నడుస్తూ ఉంటాడు. నడిచే సమయంలో ఆ ఏనుగు…. అమ్మ ఈ నొప్పిని నేను భరించలేను. నాకు ఈ కాలు లేకపోయినా పర్వాలేదు. ఈ నొప్పిని భరించలేక పోతున్నాను భగవంతుడా. అంటూ కంటతడి పెట్టుకుంటుంది.
దానిని చూసిన సింగయ్య చాలా బాధ పడుతూ…. మా అమ్మ కథ కొంచెం ఓపిక పట్టి నడవడానికి ప్రయత్నించు నువ్వు ఎప్పటిలాగే నడవగలవు. అంటూ దానికి ధైర్యం చెబుతూ చిన్నగా నడిపిస్తాడు. మొదట ఆ ఏనుగు చాలా బాధపడుతూ అడుగులు వేస్తోంది. ఆ తరువాత అలవాటు అయిపోయింది ఇంకా నడవడం మొదలుపెడుతుంది అలా నడవడం మొదలు పెట్టిన తర్వాత సింగయ్య చాలా సంతోష పడుతూ తన కూరగాయల వ్యాపారం తో పాటు ఆ ఏనుగుని కూడా తీసుకు వెళ్తాడు. ఆ ఏనుగు యొక్క కృత్రిమ కాలు చూసిన ప్రజలంతా ఆశ్చర్యపోయి…. సింగయ్య ఎంత పని చేసాడో చూశారా ఉన్న ఇల్లు కాస్త అమ్ముకొని ఆ ఏనుగుకి కాలు పెట్టించాడు. ఎంత విడ్డూరం నేను ఎక్కడా చూడలేదు. ఇంక ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో తెలుసా చిన్న పూరి గుడిసె వేసుకొని ఉంటున్నాడు. అని చెప్పుకుంటూ ఉంటారు మరి కొందరు అతని ముందుకు వచ్చి…. సింగయ్య ఏం అంత బుద్ధి తక్కువ పని చేసావ్. ఇప్పుడు దానికి కాలు కావాలనీ నీన్ను అడిగిందా. ఇల్లు అమ్మి నువ్వు ఎక్కడ ఉంటావు ఆ గుడిలో ఎలా నివసిస్తావ్వి. ఎంత బుద్ధి తక్కువ పని చేశావు అంటూ అందరూ అతన్ని విమర్శిస్తారు.
అతను…. మీరు నా గురించి ఎన్ని అనుకున్నా సరే నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. అసలు నేనంటూ లేకపోతే మీరందరూ నన్ను గుర్తు కూడా పెట్టుకోరు నేనిలా బ్రతికున్నానంటే ఈ ఏనుగు పుణ్యమే. అది నా ప్రాణాలు కాపాడిన కృతజ్ఞతగా చాలా చిన్న పని చేశాను. అని అంటాడు.
ఆ మాటలు విన్న ఏనుగు చాలా సంతోష పడుతూ తన లో…. నీలాంటి స్నేహితుడు నాకు దొరికినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు మరో జన్మంటూ ఉంటే నీ కడుపున మనిషి రూపంలో నీ కూతురు గా
పుట్టే అవకాశం ఇవ్వమని దేవుడిని ప్రార్థిస్తాను అంటూ కంటతడి పెట్టుకుంది.
ఇక ఆరోజు నుంచి అతను ఆ ఏనుగుని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఎంతో సంతోషంతో జీవిస్తాడు అతని గురించి తెలుసుకున్న ఒక ఆమె జంతువుల పట్ల ఆయన చూపించిన ప్రేమను కు ఆశ్చర్యపోయి అతని దగ్గరకు వచ్చి…. మీరు ఆ మూగ జీవి పట్ల చూపించిన ప్రేమ చాలా గొప్పది అందుకే నేను మీకు ఒక చిన్న ఇంటిని బహుమతిగా ఇస్తాను కాదనకుండా మీరు అందులోనే ఉండండి అని చాలా బ్రతిమిలాడు తుంది. అందుకు తను సరే అని చెప్తాడు ఇక ఆ కొత్త ఇంట్లో ఆ ఏనుగుని తో చాలా సంతోషంగా తన జీవితాన్ని సాగిస్తాడు. అలా సింగయ్య ఆ ఏనుగు పట్ల ప్రేమను వ్యక్తం చేశాడు. ఇలాంటి వాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు కదా. ఈ కథ గనుక నీకు నచ్చినట్లైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *