గర్భవతి ఏనుగు మూడవ భాగం_ Telugu Stories- Stories in Telugu – Panchatantra Kathalu

మహేష్ చిన్నతనంలోనే తల్లిదండ్రులు పోగొట్టుకొని అనాదిగా పెరుగుతున్న సమయంలో అనుకోకుండా ఒక ఏనుగు అతనికి దగ్గరయింది ఆ ఏనుగు తల్లి తండ్రి అన్ని తానేఅయ్యి అతనీ పెంచింది అతను పెద్దవాడయ్యాడు. పెద్దవాడైన తరువాత అతను ఆ ఏనుగు చేత సర్కస్ చేయించడం మొదలు పెడతాడు. అయితే ఆ ఏనుగు చేసే సర్కస్ చూసి చాలా మంది సంతోషపడుతూ అతనికి ఎంతో కొంత డబ్బులు ఇచ్చి వెళ్తూ ఉంటారు ఆ వచ్చిన డబ్బులతో. అతడు తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. అలా రోజులు గడిచాయి ఏనుగు గర్భవతి అయింది. అప్పుడు అతను ఆ ఏనుగుతో…. అమ్మ లక్ష్మి ఇప్పుడు నువ్వు గర్భవతివి తల్లి. మీ చేత నేను పనులు చేయించను సర్కస్ అసలు చేయించను. నువ్వు హాయిగా విశ్రాంతి తీసుకో.అని అంటాడు ఆ మాటలు విన్న యేనుగు సరే అన్నట్టుగా తల ఊపుతుంది.ఆ రోజు నుంచి ఆ ఏనుగుని చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు దానికి కావలసిన ఆహార పదార్థాలు తీసుకొచ్చి. దానికి ఇస్తూ ఉంటాడు. అలా రోజులు గడిచాయి తను సంపాదించిన డబ్బు మొత్తం. అయిపోయి చాలా దిగులుగా కూర్చొని … అయ్యో నా దగ్గర ఉన్న డబ్బులు అన్నీ అయిపోయాయి పాపం మా లక్ష్మికి తినడానికి కూడా ఏం తీసుకు రాలేని పరిస్థితి నాది. ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉండగా. అతనికి ఆ ఊర్లో ఉంటున్నా జమీందారు రంగయ్య గుర్తొస్తాడు. వెంటనే అతని దగ్గరికి పరుగుపరుగున వెళ్తాడు. అప్పుడు జమిందారు…. ఏరా ఏంటి ఇలా వచ్చావు. ఈమధ్య రోడ్లమీద అసలు కనపడడం లేదే. ఏమైంది కొంపదీసి ఆ ఏనుగు తెచ్చిందా ఏంటి.

మహేష్ చాలా జాలిగా….. అయ్యా అలా మాట్లాడకండి అయ్యా మా అమ్మ లక్ష్మి ఇప్పుడు గర్భవతి అందుకే నేను ఆమె చేత సర్కస్ చేయించడం లేదు.
జమీందారు….. ఓయబ్బో కోపం పొడుచుకొచ్చి దే అయినా అమ్మా లక్ష్మీ అంటున్నవ్ ఏంట్రా. మీ అమ్మానాన్న ఎప్పుడో చచ్చారుగా. హా…
మహేష్ చాలా బాధపడుతూ….అయ్యా మా అమ్మ నాన్న చనిపోయిన మా లక్ష్మీ నన్ను చిన్నప్పుడు నుంచి బిడ్డ లాగ పెంచింది. లక్ష్మీ లోనే మా అమ్మా నాన్నా నీ చూసుకుంటున్నాను.
….. సరే సర్లే లే ఒ అసలు వచ్చిన పని ఏంటి చెప్పు. మహేష్…అయ్యా ఇల్లు గడవడానికి చాలా ఇబ్బందిగా ఉంది ఇప్పుడు మా లక్ష్మి గర్భవతి కదా తినడానికి తిండి పెట్టడానికి కూడా డబ్బులు లేవు. మీరు ఏమన్నా కొంత డబ్బు సాయం చేస్తే. మా లక్ష్మి బిడ్డను కన్న తర్వాత మళ్లీ కొన్ని రోజులకి సర్కస్ చేస్తుంది. వచ్చిన డబ్బుతో మీ అప్పు తీరుస్తాను.
అని అంటాడు అందుకు అతను సరే అని కొంత డబ్బుని అతనికి ఇచ్చేస్తాడు.
మహేష్….. చాలా సంతోషం జమిందార్ గారు . అని అతనికి కృతజ్ఞతలు చెప్పుకొని అక్కడనుంచి వెళ్ళి పోతూ ఒక గల అరటికాయలు తీసుకొని. ఇంటికి వెళతాడు.
అక్క డ లక్ష్మి కి అరటి పండ్లు తినిపిస్తూ….. అమ్మ లక్ష్మి వివో గో వీటినిబాగా తినమ్మా తిని పండంటి బిడ్డని ఇవ్వాలి. అని ప్రేమగా దానికి తినిపిస్తాడు ఆ ప్రేమను చూసిన లక్ష్మి కంటతడి పెట్టుకుంటూ తన లో…. చిన్నప్పుడు నేను నిన్ను బిడ్డగా సాగాను. ఇప్పుడు నాకు నువ్వు బిడ్డ అయ్యావా. మనది ఏ జన్మలో ఏ ఋణమో ఈ జన్మలో ఇలా ఒకరినొకరు ఈ రుణాలు తీర్చుకుంటున్నాo. అన్నీ అనుకుంటుంది.
ఆ కన్నీరు చూసి నా అతను…. అయ్యో లక్ష్మి ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు. నువ్వేం భయపడకు నేను ఉన్నా కదా .నీకు కావాల్సిన ఆహారం ఏంది ఇస్తాను నువ్వు మంచిగా బిడ్డను కంటావు సరేనా అని అంటాడు.
అలా చాలా రోజులు గడిచాయి ఆ ఏనుగు ఒక బిడ్డ కి జన్మనిస్తుంది. దాన్ని చూసిన అతను చాలా సంతోషిస్తాడు కానీ. పాపం ఆ బిడ్డను కన్న దగ్గర్నుంచి. లక్ష్మి కి ఒంట్లో సరిగ్గా ఉండదు ఆరోగ్యం క్షీణిస్తుంది. దాన్ని చూసిన అతను చాలా ఏడుస్తూ ఉంటాడు.
అతని చేతిలో చిల్లిగవ్వ ఉండదు. అతడు జమీందారు దగ్గర తీసుకొచ్చిన డబ్బులు అన్నీ లక్ష్మి భోజనానికి , అతను జీవించడానికే ఖర్చు పెడతాడు. అప్పుడు తనలో… అయ్యో భగవంతుడా ఏంటి ఎలా చేశావు. మా లక్ష్మి కి త్వరగా ఆరోగ్యం కుదుట పడేలా చెయ్యి. నా చేతిలో ఒక్క రూపాయి కూడా లేదు. జమీందారు దగ్గర తీసుకొచ్చిన ఇంతవరకు తీర్చలేదు. ఇప్పుడు లక్ష్మికి ఆరోగ్యo కుదుట పడాలి అంటే మందులకి నేను డబ్బుల కోసం ఎవరి దగ్గరికి వెళ్ళాలి.జమీందారు గారి కి కొన్ని రోజులు తిరిగి ఇస్తానని చెప్పాను మళ్లీ అప్పు కోసం వెళ్తే ఆయన ఏమంటాడో. ఏదైతే అదే అయింది నీ పై భారం వేసి మళ్లీ ఆయన దగ్గరికి వెళ్తున్నాను. అని చెప్పి మళ్ళీ జమిందార్ దగ్గరికి వెళ్లి…. అయ్యా నా ఏనుగు పరిస్థితి అస్సలు బాలేదు. అది బిడ్డను కన్న దగ్గర నుంచి దాని ఆరోగ్యం క్షీణించింది. మీ దగ్గర తీసుకున్న డబ్బు మొత్తం అయిపోయింది ఇప్పుడు లక్ష్మి కి వైద్యం కోసం కొంత డబ్బు కావాలి. దయచేసి మీరు దయ చూపిస్తే. లక్ష్మీ కోలుకున్న తర్వాత ఖచ్చితంగా నేను మళ్లీ నీ పని మొదలు పెడతాను. అందుకు జమిందార్ ఓ సరే రా తీసుకో అంటూ కొంత డబ్బులు ఇస్తాడు. మళ్లీ అతను కృతజ్ఞతలు చెప్పుకొని అక్కడినుంచి లక్ష్మీ కోసం మందులు తీసుకొని ఇంటికి వెళ్తాడు.
అలా మరి కొన్ని రోజులు గడిచాయి కానీ లక్ష్మీ పరిస్థితి రోజురోజుకీ దినదినగండంగా నే ఉంది. దాన్ని చూసి నా అతను చాలా బాధ పడుతూ…. అయ్యో భగవంతుడా నా లక్ష్మికి ఏం కాకుండా చూడు.లక్ష్మీ నాకు అమ్మ . ఒకసారి నాకు అమ్మ ప్రేమ అంటే ఏమిటో నేను చూడకుండానే మా అమ్మను తీసుకు వెళ్ళవు. ఇప్పుడు ఈ అమ్మని కూడా తీసుకు వెళ్తావా. అలా చేయొద్దు నీకు పుణ్యం ఉంటుంది అంటూ బాధపడతాడు.
ఆ బాధను చూసి ఏనుగు కూడా అయ్యో నా బిడ్డ నా గురించి ఎంత బాధ పడుతున్నాడు. అంటూ కన్నీరు కలుస్తుంది అప్పుడే జమీందారు ఇంటికి వచ్చి…. ఏరా ఎన్ని రోజులైంది డబ్బులు తీసుకొని. ఇంకా నీ ఏనుగు బ్రతికే తట్టు కనపడలేదు . అది పోతుంది ఆ తర్వాత ఏం చేస్తావ్. నా డబ్బులు నాకు తిరిగి ఎలా ఇస్తావ్. నా అప్పు ని ఎలా తీరుస్తా వు. ఇదిగో ఈ పిల్ల ఏనుగు పెద్ద ఐఏందదాక ఉండమంటావా. చెప్పు మాట్లాడ వేరా అంటూ చొక్కా పట్టుకుంటాడు.
అప్పుడు… అయ్యా మా లక్ష్మి పరిస్థితి అస్సలు బాలేదు. మీరే చూడండి ఎలా అయిపోయిందో. నా బంగారు తల్లి కి ఏం కాకూడదని నేను కోరుకుంటున్నాను అంటూ ఏడుస్తాడు.
అతను…. ఆపరా నీ ఏడుపు. నీ ఏడుపు నీతో నాకు అవసరం లేదు కానీ నేను ఈ పిల్లని తీసుకెళ్తాను. దీనిని అమ్ము మ్ముకుంటే నీ అప్పు పూర్తిగా తీరిపోతుంది. ఇక నీకు నాకు ఏ బాకీ ఉండదు. అని చెప్పి ఆ ఏనుగు పిల్లనీ తీసుకెళ్తుండగా మహేష్….. అయ్యా అలా చేయొద్దు తల్లి బిడ్డని అసలు వేరు చేయొద్దు. తల్లి లేని బాధ ఏంటో నాకు తెలుసు. కావాలంటే నేను మీ ఇంట్లో నేను జీవితాంతం పనిమనిషిగా ఉంటాను. అంతేగాని మీరు అలా చేసి ఆ తల్లిని మరింత బాధ పెట్టకండి. మీకు పుణ్యం ఉంటుంది అని ఏడుస్తూ కాళ్లావేళ్లా పడతాడు. అయినా అతను కనికరం చూపించకుండా ఆ ఏనుగు పిల్లనీ అక్కడి నుంచి తీసుకొని వెళ్ళి పోతాడు.
దాన్ని చూసిన ఏనుగు…. అయ్యో భగవంతుడా నా ఇద్దరు బిడ్డలు ఇలా కన్నీరుమున్నీరవుతున్నారు. నా ఆరోగ్యం పాడవడం వల్ల ఇదంతా జరిగింది. ఇప్పుడు నా కన్న కొడుకు లేడు పెంచిన కొడుకు కళ్ళముందే గుక్కపట్టి ఏడుస్తున్నాడు. అంటూ యేనుగు కన్నీరు కారుస్తోంది.
దాన్ని చూసిన మహేష్….అమ్మ లక్ష్మి నువ్వేం బాధపడకు నేను ఎలాగైనా నీ బిడ్డ నీ నీ దగ్గరికి తీసుకు వస్తాను. అంటూ పరుగుపరుగున. అతని దగ్గరికి వెళ్లి చాలా బ్రతిమిలాడు కానీ అతను కొంచెం కూడా జాలి లేకుండా అతని కొట్టి పంపించు చేస్తాడు.
పాపం మహేష్ చేసేది ఏమి లేక చాలా బాధపడుతూ ఇంటికి తిరిగి వచ్చి… అమ్మ లక్ష్మి నేను ఏంచేయాలి.బిడ్డ కోసం నువ్వు ఎంత తప్పించి పోతున్నావా నాకు అర్థం అయింది. నువ్వు ఆ బిడ్డను చూసుకొని ఊపిరిపీల్చుకున్వన్న సంగతి కూడా నాకు తెలుసు. కానీ ఆ జమీందారీ ఇంత కఠినాత్ముడు అనుకోలేదు.అసలు ఇలా జరుగుతుంది అనుకుంటే వాడి దగ్గర అప్పు తీసుకువచ్చే వాణ్ణి కాదు. అంటూ కన్నీళ్లు పెట్టుకుంటాడు.
ఆ ఏనుగు…. అయ్యో భగవంతుడా ఆ బిడ్డకు అక్కడ పాలు లేవు. ఈ బిడ్డకు ఇక్కడ నా వల్ల ఆహారం లేదు.ఇదంతా నా వల్లే అసలు నా ప్రాణాలు తీసుకెళ్లి పోతే ఏ బాధ ఉండదు. అని కన్నీరు కారుస్తోంది.
ఆ రోజు రాత్రి అతను లక్ష్మీ బాధలు చూడలేక. ఆ ఏనుగు పిల్ల ని దొంగతనంగా తీసుకు వచ్చేద్దాం అనుకొని రాత్రి సమయంలో ఆ ఇంటికి వెళ్తాడు. అప్పుడు అక్కడికి వెళ్ళిన వెంటనే చప్పుడు ఏదో కావడంతో ఆ ఇంట్లో కాపలాగా ఉన్న ఒక వ్యక్తి చూసి…. దొంగ దొంగ అని అరుస్తాడు. వెంటనే లోపల ఉన్నా జమిందార్ కూడా. బైటకు వస్తాడు. అలా దొంగ దొంగ అని అరిచిన వ్యక్తి వెంటనే మహేష్ ని పట్టుకుంటాడు. జమీందారు నడుచుకుంటూ అతని దగ్గరికి వచ్చి… ఏరా ఇంత రాత్రి వేళ నా ఇంట్లో దొంగతనం చేయడానికి వచ్చావా.
మహేష్… జమీందారు గారు లేదు నా లక్ష్మి తన బిడ్డ కోసం చాలా బాధపడుతుంది అందుకే దాన్ని తీసుకెళ్తామని వచ్చాను.
జమీందారు… నా అనుమతి లేకుండా దాన్ని ఎలా తీసుకెళ్ళు దమానుకుంటున్నావ్ రాయ్ వీడిని కట్టేసి కొట్టండి రా అంటూ అతన్ని కట్టివేసి కర్రలతో కొడుతూ ఉంటారు. అయ్యా నన్ను కొట్టినా పర్వాలేదు. దయచేసి ఆ బిడ్డని లక్ష్మీ దగ్గర పంపించండి. అని చాలా బాధ పడుతూ ఏడుస్తాడు. అయినప్పటికీ ఆ జమీందారు అతని మాట పట్టించుకోడు. అతని రక్తం వచ్చేలాగా కొట్టడంతో పాపం ఆ దెబ్బలకు తట్టుకోలేక. మహేష్ చనిపోతాడు.
ఆ చిన్న ఏనుగు పాల కోసం…. పెద్ద పెద్దగా అరుస్తూ. ఏడుస్తూ కేకలు వేస్తూ ఉంటుంది.
అక్కడ ఏనుగు తన లో….. భగవంతుడా నా బిడ్డలు ఇద్దరికీ ఏం కాకుండా నువ్వే చూడాలి. అంటూ ఏడుస్తుంది అది అలా ఏడుస్తూ ఏడుస్తూ. ఆ ఏనుగు కి బాగా దాహం అయ్యి పెద్ద పెద్ద గా అరుస్తుంది. అక్కడ దాని దాహం తీర్చడానికి ఎవ్వరు ఉండరు. ఆ ఏనుగు అలా పెద్ద పెద్దగా అరుస్తూ గొంతు తడి ఆరిపోయి. ఆయన కూడా పాపం మరణిస్తుంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *