గర్భవతి ఏనుగు యజమాని_ Telugu Stories- Stories in Telugu – Panchatantra Kathalu

అది ఒక చిన్న గ్రామం ఆ గ్రామంలో సంతోషి అనే ఒక గర్భవతి మహిళ ఉండేది. కొద్దికాలం క్రితమే ఆమె భర్త చనిపోవడంతో ఆమె చాలా ఇబ్బంది పడుతోంది. అప్పుడు ఆమె తన మనసులో…. భగవంతుడా నా భర్తను నా నుంచి దూరం చేసి నన్ను ఒంటరి దాన్ని చేసావు. నేను బ్రతుకుతున్నాను అంటే కేవలం నా కడుపులో పెరుగుతున్న బిడ్డ కారణం. వాడి కోసమే బతకాలి వాళ్ళ నాన్న వాడిపై పెట్టుకున్న కలలను నిజం చేయాలి . దాన్ని చూసి నా భర్త పై లోకంలో సంతోషపడాలి అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. అలా కొన్ని రోజులు గడిచాయి ఒకరోజు ఆమె భోజనం సిద్ధం చేయడం కోసం బియ్యం సంచిని తెరిచి చూస్తుంది. అందులో బియ్యం కొన్ని మాత్రమే ఉంటాయి ఆమె…. అయ్యో నేను అనుకుంటూనే ఉన్నాను బియ్యం అయిపోతున్నాయని.బియ్యం తీసుకురావాలనీ డబ్బుల కోసం ఇల్లంతా వెతుకుతుంది ఆమెకు ఒక్క రూపాయి కూడా దొరకదు. ఆమె చాలా బాధ పడుతూ ….. అయ్యో ఇక లాభం లేదు నేను ఏదో ఒక పని చేయాల్సిందే. ఇంట్లో ఉన్న డబ్బు కాస్త అయిపోయింది. డబ్బు సంపాదించే పోతే నేను నా పుట్టబోయే బిడ్డ ఇద్దరం రోడ్డుపై బిచ్చమెత్తు కోవాల్సి వస్తుంది.

అని పని కోసం వెతుక్కుంటూ వెళ్తుంది. ఒక చోట ఆమెకు కొంతమంది ఇటు రాళ్లు మోస్తూ కనిపిస్తారు అక్కడ ఉన్న ఆ వ్యక్తితో…బాబు నాకు కూడా ఏదో ఒక పని ఇప్పించండి నాలుగు రూపాయలు ఇస్తే నాకు ఇల్లు గడుస్తుంది. అందుకు తను సరే అని ఆమె కొనిస్తాడు ఆమె ఆరోజు ఇటుకలు మోసి డబ్బు సంపాదిస్తుంది.ఆ రోజుతో పని పూర్తవుతుంది ఆమె ఆ డబ్బు తీసుకొని చాలా సంతోషంగా ఇంటికి వెళ్తుంది అలా వచ్చిన డబ్బులతో నాలుగు రోజులు గడిచాయి ఆమె….. వచ్చిన డబ్బు తో నాలుగు రోజులు గడిచాయి ఇప్పుడు మళ్లీ పని వెతుక్కోవాలి. అని అనుకొని మళ్ళీ పని కోసం వెతుకుతూ ఉండగా పెద్ద పెద్ద కట్టెలను మోస్తూ కొందరు వ్యక్తులు కనిపిస్తారు. వెంటనే ఆమె అక్కడ ఉన్న యజమానితో…..
బాబు నాకు ఏదైనా పని ఇప్పించండి. మీకు పుణ్యం ఉంటుంది అని అంటుంది అందుకు అతను…. అమ్మ చూడ్డానికి నువ్వు గర్భవతి లాగా ఉన్నావు నీకు పని ఇస్తే నీకేమన్నా జరగరానిది జరిగితే నలుగురు నన్ను తిడతారు. దయచేసి ఏమనుకోకు తల్లి నీకు నేను పని ఇవ్వలేను.
ఆమె ఏడుస్తూ…. బాబు నా బాధను అర్థం చేసుకోండి. నాది ఒంటరి బ్రతుకు మీరిచ్చే నాలుగు రూపాయలు నేను నా బిడ్డ అ బతకడానికి ఉంటుంది. అని ప్రాధేయ పడుతుంది అయినప్పటికీ అతను….. లేదమ్మా నన్ను అర్థం చేసుకో దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకు తల్లి వెళ్ళిపో. అని అంటాడు అందుకు ఆమె అక్కడినుంచి చాలా బాధతో వెళ్తూ ఉండగా.ఎండ తాకిడికి తట్టుకోలేక మార్గమధ్యలో ఒకచోట సృహ తప్పి పడిపోతుంది. అప్పుడే అక్కడ ఒక గర్భవతి అయిన ఏనుగు ఆమెను చూసి….. అయ్యో పాపం ఆమె గర్భవతిగా ఉంది . అంటూ అటూ ఇటూ చూస్తూ ఉంది అక్కడ దూరంలో మనుషులు ఉంటారు . ఆ ఏనుగు కి ఏం చేయాలో అర్థం కాక అక్కడే ఉన్న ఒక మట్టికుండ తో నీటిని తీసుకొచ్చి ఆమెపై కుమ్మరిస్తుంది వెంటనే ఆమె కు మేలుకువ వచ్చి అటు ఇటు చూస్తుంది ఎదురుగా ఏనుగును చూసి ఆశ్చర్యపోతుంది. ఆ ఏనుగు ఆమెతో….. కంగారు పడకు అమ్మా నీకు ఏం కాదు. నేనున్నా గా బాగా నీరసంగా ఉన్నావు ఇదిగో ఈ పండ్లు తీసుకో అని సైగ చేస్తూ ఆమె కా పండ్లు ఇస్తుంది. ఆమె ఆ పండ్లను తీసుకొని బాగా ఆకలిగా ఉండడంతో వాటిని తినేస్తుంది. ఆ తర్వాత ఏనుగుతో…. మీకు చాలా కృతజ్ఞతలు అమ్మ సమయానికి దేవుడే నిన్ను ఇక్కడికి పంపించినట్లు ఉన్నాడు. నువ్వు లేకపోతే నా పరిస్థితి ఏమైపోయా దొ . అని అనుకుంటూ ఆ ఏనుగుకి కృతజ్ఞతలు చెప్పి అక్కడి నుంచి వెళ్లి పోతుంది. అలా ఆ రోజు గడిచి పోతుంది. ఆ మరుసటి రోజు ఉదయం సంతోషి…. ఈరోజు ఒకసారి మళ్లీ ఆ యజమాని దగ్గరికి వెళ్లి పని గురించి అడగాలి. దేవుడి దయవల్ల పనికి ఒప్పుకుంటే బాగుండు.దేవుడా నా కష్టమైన అర్థమయ్యేలా చెయ్యి అంటూ దేవుని ప్రార్ధించి మళ్లీ అక్కడికి వెళుతుంది.
అక్కడ ఆ యజమాని తో…… అయ్యా నేను నిన్న కూడా వచ్చాను నా బాధను అర్థం చేసుకోండి.ఏదన్నా పని ఇప్పించండి మీకు పుణ్యం ఉంటుంది అని ఎంతో ప్రాధేయ పడుతోంది అతను ….. సరే అమ్మ నువ్వు ఎంతగా బ్రతిమిలాడు తున్నావు అంటే నీ బాధ నాకు అర్థమైంది. సరే పని చేసుకో కానీ తర్వాత ఏమైనా అయితే నాకు సంబంధం లేదు. ముందే చెప్తున్నాను అని అంటాడు.
అందుకు ఆమె సరే అని చెప్పి … అక్కడ ఉన్న కట్టెల్ని మోస్తూ ఒకచోట చేరుస్తూ ఉంటుంది.
అలానే చేస్తూ ఉండగా ఒక్కసారిగా కుప్పకూలి పోతుంది. ఆ యజమాని ఆమెను చూసి…. అయ్యో నేను చెబుతూనే ఉన్నాను . పని వద్దమ్మా వెళ్ళమని . ఇప్పుడు ఏం జరిగిందో చూడు ఇంకా నయ్యం ఏం కాలేదు. దయచేసి నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అమ్మ.
ఆమె…. అది కాదండి అని అతనితో సమాధానం చెప్పబోతున్నాడు గా . ఆ గర్భవతి అయినా నేను అక్కడికి వచ్చి ఆ కట్టెపుల్ల న్ని చేరవేస్తూ ఉంటుంది దాన్ని చూసిన యజమాని ఆమె చాలా ఆశ్చర్యపోతారు. ఆ ఏనుగు పని అంతా చేసిన తర్వాత ఆ యజమాని దగ్గరికి వచ్చి… నేను పని చేశాను నాకు డబ్బులు ఇవ్వండి. అంటూ సైకా చేస్తుంది ఆ యజమాని ఆశ్చర్యం తో నోరెళ్ళ పెట్టుకొని దానికి డబ్బులు ఇస్తాడు. వెంటనే ఆ డబ్బు తీసుకొని ఆ ఏనుగు ఆమెకు ఇస్తుంది. ఆ ఏనుగు అలా ఎందుకు చేస్తుందో ఆమె కూడా అర్థం కాదు. అప్పుడు ఆ ఏనుగుతో….. నిన్న నాకు ఒక విధంగా సహాయం చేశావు మళ్లీ ఈ రోజు ఈ విధంగా సాయం చేశావు. నీకు చాలా కృతజ్ఞతలు నీకు నాకు ఏదో జన్మ బంధం ఉండే ఉంటుంది. అంటూ కంటతడి ఆ పెట్టుకుంటుంది ఏనుగు…. బాధ పడకమ్మా నేను ఉన్నా కదా నీకు ఏమీ కాదు. అంటూ ఓదారుస్తు…. అమ్మ నేను కూడా మీ ఇంటికి వస్తాను నీతోనే ఉంటాను కాదు అనకండి. అంటూ సైగ చేస్తుంది ఆమె…. నాతో పాటుగా నా నేను తినడానికి అంతంతమాత్రంగా ఉంది.
నువ్వు కూడా నాతో వస్తే నాతో పాటు నువ్వు పస్తులు ఉండాల్సిందే.
ఏనుగు…. పస్తులు ఉండాల్సిన అవసరం లేదమ్మా నేను నీకు తోడుగా ఉంటాను అని సైగ చేస్తోంది. అందుకు ఆమె సరే అని చెప్పి ఆ ఏనుగుని తన ఇంటికి తీసుకు వెళుతుంది.
అక్కడ ఏనుగు ఆమెకు ఇంటి పనుల్లో సహాయం చేసి తిరిగి యజమాని దగ్గర కట్టెలు మోస్తూ ఉంటుంది. ఆ రోజు ఆ యజమాని భార్య అతనితో….. ఏవండీ నాకు ఒక మంచి ఆలోచన వచ్చింది.
భర్త….. ఏంటది.
భార్య…. ఆ ఏనుగు మనకి చాలా చక్కగా పనిచేస్తుంది. ఎక్కడున్నా పని వాళ్ళందర్నీ తీసేసి ఆ ఏనుగు చేత పని చేయించుకుంటే మనకి చాలా డబ్బు మిగులుతుంది. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా. ఏమంటారు. అందుకు తను సరే అంటాడు ఆ రోజు అక్కడ ఉన్న వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చి… ఇంక మీరు రేపటి నుంచి పనికి రావాల్సిన అవసరం లేదు. అని చెప్పి వారిని పంపి చేస్తాడు ఆ ఏనుగుతో…..నువ్వు ఒక్కదానివే పనికి రావచ్చు ఒకరికి మాత్రమే పని ఉంది.అని దానికి కూడా డబ్బులు ఇస్తాడు అందుకు ఆ ఏనుగు చాలా సంతోష పడుతూ డబ్బులు తీసుకొని అక్కడినుంచి ఇంటికి వెళ్తుంది. ఆ ఏనుగు ఇంటిదగ్గర ఆమెకు డబ్బులు ఇస్తుంది ఆమె చాలా సంతోష పడుతూ ఆ డబ్బు తీసుకొని…. నాకు ఎలాంటి కష్టం లేకుండా చేస్తున్నావు. నీకు ఈ జన్మంతా రుణపడి ఉంటాను. ఎక్కడి నుంచి వచ్చావు ఎందుకోసం వచ్చావు కానీ నా కోసమే వచ్చినట్టుగా ఉంది తల్లి అంటూ బాధపడుతుంది. అలా ఆ రోజు గడిచి పోతుంది. ఆ మరుసటి రోజు ఉదయాన్నే ఆ ఏనుగు పని లోకి వెళుతుంది అక్కడ పనులు చేస్తూ చాలా అలసిపోతుంది ఎందుకంటే రోజూ పని వాళ్ళు వచ్చే వాళ్ళు. ఆరోజు మాత్రం ఆ పని మొత్తం ఏనుగు చేయడంతో అలిసిపోయి….. భగవంతుడా ఏమైంది ఈరోజు నాకు. ఇంత నీరసంగా అనిపిస్తుంది నేను ఒక్క అడుగు కూడా ముందుకు వేయ లేక పోతున్నాను అంటూ అక్కడే నిలబడి పోతుంది. దానిని చూసిన యజమాని భార్య…. ఏంటి ఏంటి ఉన్నట్టుండి ఆగిపోయింది. అని దాని దగ్గరికి వెళ్లి నడువు నడువు పని ఆగిపోతుంది. అని కేకలు వేస్తోంది కానీ ఆ ఏనుగు మాత్రం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేని స్థితిలో ఉంటుంది అందుకు యజమానురాక్కి కోపం వచ్చి అక్కడే ఉన్న కర్రను తీసుకొని ….. నడవ వే.నడువు ఏమైంది ఈ రోజు నీకు అంటూ దాన్ని ఇష్టం వచ్చినట్లు గా కొడుతుంది.
పాపం ఆ ఏనుగు…..అమ్మ ఒక్క నిమిషం ఆగండి నేను ఎందుకో నడవలేక పోతున్నాను చాలా నీరసంగా ఉంది . దయచేసి నన్ను కొట్టకండి నేను గర్భవతిని ఆసంగతి మర్చిపోతున్నారు అమ్మ మీరు . అయ్యో భగవంతుడా అంటూ దేవుని ప్రార్థిస్తూ కింద పడిపోతుంది. అప్పుడే అటుగా వెళ్తున్న స్వామీజీ ఆ దృశ్యాన్ని చూసి…. అయ్యో గర్భవతి అయిన ఏనుగుని అలాగా వినిపిస్తుంది ఆమె. పాపం ఆ ఏనుగు బాధ ఏంటో నాకు అర్థం అవుతుంది. ఈమెకు ఇలా కాదు. ఈమెకు బుద్ధి చెప్పాలి అని అనుకొని ఆమెని చూపిస్తాడు వెంటనే ఆమెకు తొండం వచ్చి అక్కడున్న కట్టెపుల్లలు నీ మోస్తూ ఉంటుంది ఇది ఆమె బరువు మోస్తూ…. ఇదేందయ్యా ఇది నాకు తెలియకుండానే నేను కట్టెలు మోస్తున్నాన్ను . ఈ తొండం ఎక్కడి నుంచి వచ్చింది అంటూ ఏడుస్తూ. పని చేస్తుంది దాన్ని చూసిన స్వామీజీ నవ్వుకుంటూ …హా..హా..హా అని నవ్వుతాడు దానిని చూసిన యజమాని…. ఇదేంది నీకు తొండం వచ్చింది. ఇదేమన్నా మాయ ఏనుగా అంటూ అటూ ఇటూ చూడగా అతనికి స్వామీజీ కనిపిస్తాడు. వెంటనే అతను స్వామీజీ దగ్గరికి వెళ్లి…. స్వామి స్వామి ఇదంతా మీరే చేశారని నాకు అర్థం అవుతుంది. అదేదో తెలిసో తెలియకో ఆ ఏనుగుని హింసించి ఉంది దయచేసి ఆమెనీ మళ్లీ మామూలు స్థితికి తీసుకురండి అంటూ ప్రాధేయపడతాడు అందుకు స్వామీజీ సరే అని చెప్పి . ఆమెను మళ్ళీ మామూలుగా మారుస్తాడు. ఆమె స్వామీజీతో…. నన్ను క్షమించండి స్వామి ఇంక నావల్ల ఎప్పుడు పొరపాటు జరగదు.
స్వామీజీ…. మీ కుతంత్రాలు కుట్రలు ఏంటో నాకు అర్థమైంది మర్యాదగా ఇప్పటివరకూ చేయించుకున్న పనికి బదులు ఆ ఏనుగుకి డబ్బులు ఇవ్వండి. అని అంటాడు అందుకు వాళ్లు సరే అని ఆయనకి డబ్బులు ఇస్తారు వాటిని తీసుకొని స్వామితో….. మీకు చాలా కృతజ్ఞతలు స్వామి. సమయానికి మీరు వచ్చి నన్ను కాపాడారు. లేదంటే నేను ఏమైపోతానో అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ఆ స్వామీజీ … బాధపడకు పద మీ ఇంటికి వెళ్దాం. అని అని తన ఇంటికి తీసుకు వెళ్తాడు అక్కడ ఆమెతో జరిగిన విషయం చెప్తాడు. ఆమె చాలా బాధ పడుతూ…. పాపం నోరులేని జీవాల్ని కూడా కనికరం లేకుండా అంత పని చేస్తుంది ఆమె. ఎక్కడినుంచో వచ్చి నాకోసం కష్టపడుతుంది ఏనుగు మీరు సమయానికి కాపాడారు స్వామి అంటూ కృతజ్ఞత చెప్పుకుంటుంది.
అప్పుడు స్వామీజీ….. ఈ ఏనుగు ఎందుకు నీ దగ్గరకి వచ్చిందో నాకు తెలుసు.
ఆమె…. ఎందుకు స్వామి.
స్వామీజీ…. ఈ ఏనుగు వల్ల నీ భర్త ప్రాణాలు కోల్పోయాడు కాబట్టి. ఆ మాటలు విన్న ఆమె చాలా ఆశ్చర్యపోయి…. ఏంటి స్వామీ మీరు అంటుంది నాకు అర్థం కావడం లేదు.
స్వామీజీ…. అవునమ్మా నీ భర్త అడవిలో ఉన్న జంతువు ని విదేశాలకు అమ్ముతూ ఉంటాడు ఆ విషయం నీకు తెలియదు. ఒకరోజు ఈ ఏనుగు ని తీసుకెళ్లి బోతుండగా ఏనుగు అతని నుంచి తప్పించుకోవడం కోసం అతను చంపాల్సి వచ్చింది. ఆ మాటలు విన్న ఆమె చాలా బాధ పడుతూ… నా భర్త ఇలాంటి పని చేస్తున్నాడు అని నాకు తెలియదు.
కానీ స్వామి ఈ ఏనుగుకి నా విషయం ఎలా తెలుసు. నా దగ్గరకు వచ్చి నన్ను ఎందుకు కాపాడింది. అప్పుడా ఏనుగు….అమ్మ నన్ను క్షమించండి నేను మీ భర్తని కావాలని చంపలేదు. నన్ను నేను కాపాడుకోవడం కోసం అలా జరిగిపోయింది. నేను నీ భర్తను చంపిన తర్వాత అతని దగ్గరున్న సంచిలో మీ ఇద్దరి ఫోటో ని చూశాను.కొన్ని రోజుల తర్వాత మీరే కనిపించారు అప్పుడు నాకు అర్థమైంది నేను ఎంత పెద్ద తప్పు చేశానో అని ఆ తప్పు సరిదిద్దుకోవడం కోసమే నేను మీకు సహాయం చేస్తున్నాను ఈ నిజం తెలిస్తే నన్ను అసహ్యించుకుంటున్నారని నీకు చెప్పలేదు అంటూ సైగ చేస్తూ కన్నీరు పెట్టుకుంటుంది.
ఆమె…. నా భర్త ప్రతి రోజు బయటికి వెళ్లేటప్పుడు ఫోటోని తీసుకువెళతాడు. ఎందుకండి అంటే నీ ఫోటో నా దగ్గర ఉంటే అదృష్టం కలిసి వస్తుంది అని అనేవాడు. ఆ ఫోటో సహాయంతోనే ఆయన చనిపోయినా నీ రూపంలో నాకు అదృష్టం కలిసొచ్చింది.
బాధపడకు ఎవరూ చేసిన కర్మలకు వారే శిక్ష అనుభవించాలి మా రాత ఇలా రాసి పెడితే ఎవరు ఏం చేయగలరు. బాధపడకు అని అంటుంది స్వామీజీ…. ఈ నిజం చెప్పడం కోసం ఆ ఏనుగు ఎంతో మనోవేదన పడుతుంది. ఆవేదన తొలగించడం కోసమే నేను ఇక్కడ వరకు వచ్చాను. లేదంటే ఎప్పుడో అటు నుంచి అటే వెళ్లిపోయే వాడిని ఇక నేను వెళ్ళొస్తాను. మీరిద్దరూ జరిగిపోయిన వాటిని తలుచుకోకుండా సంతోషంగా జీవించండి అంటూ అక్కడనుంచి వెళ్ళి పోతాడు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *