గర్భవతి ఏనుగు రెండవ భాగం._ Telugu Stories- Stories in Telugu – Panchatantra Kathalu

అనగనగా ఒక ఊరిలో లక్ష్మణ్ , శారదా దేవి అనే దంపతులు ఉండేవాళ్ళు.లక్ష్మణ్ రోజూ అడవికి వెళ్ళి కట్టెలు కొట్టు కొచ్చి వాటిని అమ్ముకొని. తన కుటుంబాన్ని పోషించుకునే వాడు లక్ష్మణ్ ఎప్పట్లాగే కట్టెలు కొట్టడానికి అడవికి వెళ్తాడు అక్కడ అతను కట్టెలు కొడుతున్న సమయంలో అక్కడ దూరం లో ఒక ఏనుగు కింద పడుకొని పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటుంది. దానిని చూసిన లక్ష్మణ్…. అని ఏమైనా ఏనుగుకి అంటూ పరుగుపరుగున దాని దగ్గరికి వెళ్తాడు. అక్కడ ఆ ఏనుగు కాలు కి గాజు సీసా దిగబడి ఆ నొప్పి భరించలేక ఎటు కదలలేక. అలా కేకలు వేస్తూ ఉంటుంది. లక్ష్మణ్ ఆ గాజు పెంకు తీసివేసి…. అయ్యో పాపం ఎంత పెద్ద గాయం అయిందో. ఎవరో మందు సీసాని పగలగొట్టిన అంటున్నారు. తాగిన వాళ్ళు కుదురుగా వెళ్ళొచ్చు కదా ఇలా చేయడం ఎందుకు. వాల్ ఇలా చేయడం వల్ల ఇలాంటి జంతువుకి ఇబ్బంది అవుతుంది. అని బాధపడుతూ ఆకుల పసరు కోసం అటూ ఇటూ చూస్తాడు. ఇంతలో అతనికి ఆకులు కనిపిస్తాయి ఆ ఆకుల రసం పిండి ఆ ఏనుగు గాయానికి కట్టు కట్టి ఆ తర్వాత కట్టెపుల్లలు తీసుకొని అక్కడి నుంచి ఇంటికి వెళ్ళి పోతాడు. ఆ మరుసటి రోజు ఎప్పటిలాగే లక్ష్మణ్ అడవికి వచ్చి కట్టెలు కొట్టుకుంటుండగా మళ్లీ ఆ ఏనుగు అక్కడ కుంటుతూ కనిపిస్తుంది . దాన్ని చూసి లక్ష్మణ్…. అరె ఆ ఏనుగు కాలు కొంచెం బాగు పడినట్లు ఉంది. అందుకే పైకి లేచింది పాప o నొప్పిగా ఉన్నట్టు ఉంది అందుకే కుడుతుంది.

ఈరోజు కూడా మందేసి కట్టు మారిస్తే సరి.
అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్లి కట్టునీ మారుస్తాడు అప్పుడు ఏనుగు తనలో…. అయ్యో నాకు చాలా ఆకలిగా ఉంది నా కడుపులో ఒక బిడ్డ ఉన్నాడు.నా కోసం కాకపోయినా వాడి కోసం అయినా నాకు ఆహారం కావాలి నేను ఈ కాలు నీ కుంటుకుంటూ ఎక్కడికి వెళ్ళలేక పోతున్నాను. ఈ మనిషి కనుక నాకు సహాయం చేయకపోయినట్లయితే. కనీసం ఇలా లేచి కుంట డానికి కూడా అవకాశం ఉండేది కాదేమో. అని కన్నీరు కారుస్తోంది ఆ కన్నీటిని గమనించిన లక్ష్మణ్….. ఏమైంది ఈయనకి ఇలా కన్నీరు పెట్టుకుంటుంది పాప o నొప్పి గా ఉన్నట్టుంది. చూడ్డానికి గర్భవతి అని అనుకుంటా. పాపం తిండి తిన్నదో లేదో నిన్నటికి ఈరోజుకి ఈ ఏనుగు ముఖంలో చాలా మార్పు కనిపిస్తుంది. అని అనుకొని తన దగ్గర ఉన్న భోజనం తీసుకువచ్చి దానికి తీనిపిస్తాడు. ఆ ఏనుగు దాన్ని తింటూ…. దేవుడు ఈ మనిషి రూపంలో వచ్చి నాకు సహాయం చేశాడు. ఇతని మంచితనానికి ఏమిచ్చినా తక్కువే అంటూ అనుకుంటుంది.
ఆ తర్వాత అతను అక్కడినుంచి తీసుకొని వెళ్ళి పోతాడు. అలా రోజులు గడిచాయి ఏనుగు లక్ష్మణ్ తో మంచి స్నేహంగా ఉంటుంది వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు అయిపోతారు. ఒకరోజు లక్ష్మణ్ తన భార్యతో ఆ ఏనుగు గురించి చెప్తాడు.
అప్పుడు ఆమె చాలా సంతోషిస్తూ….. మంచి పని చేశారు అండి. ఎందుకంటే ఇప్పుడు నేను కూడా గర్భవతిని.గర్భవతి అయిన ఎన్ని కి సాయం చేస్తే దేవుడు మనకు పుట్టబోయే బిడ్డకు కూడా సహాయం చేస్తాడు. అని అంటుంది అందుకు అతను చాలా సంబరపడిపోతూ….. నువ్వు అన్నది నిజమే పద్మ. మనం ఇతరులకు మంచి చేస్తే దేవుడు మనకు కూడా మంచే చేస్తాడు.మనం మనుషుల పట్ల జంతువుల పట్ల ప్రేమగా చూపిస్తే దేవుడు మనపై ప్రేమను జాలని చూపిస్తాడు. సరే పద్మ నేను అడవి కి వెళ్తాను అని కట్టెలు కొట్టడానికి అడవికి వెళ్తాడు అతను కట్టెలు కొట్టి అలసిపోయి ఒకచోట విశ్రాంతి తీసుకొని తన లో…. ఏంటి ఈరోజు నా స్నేహితురాలు రాలేదు. అనుకుంటుండగా ఆ ఏనుగు అక్కడికి వస్తుంది.దాన్ని చూసి లక్ష్మణ్ రా మిత్రమా ఇప్పుడే నీ గురించే అనుకుంటున్నాను.
అన్నట్టు నీకు ఒక విషయం చెప్పాలి. నీ గురించి నేను నా భార్యకి చెప్పాను ఆమె చాలా సంతోషపడింది. నేను కూడా త్వరలోనే తండ్రినీ కాబోతున్న మిత్రమా.ఆ ఆనందాన్ని తలుచుకుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. మనకి ఇలాంటి ఆనందం ఎన్ని కోట్లు ఇచ్చిన దొరకదు అనుకుంటా.అని చెప్తాడు.
అందుకే ఏనుగు వాటన్నిటికీ సరే అన్నట్టుగా తల ఊపుతూ తనలో… చాలా సంతోషం మిత్రమా దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు. మంచి బిడ్డకీ మీ భార్య జన్మనిస్తుంది. నువ్వు నీ భార్య పిల్లలు ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి అన్నట్టుగా తొండంతో అతని ఆశీర్వదిస్తుంది. ఆ తర్వాత నేను కూడా తన బిడ్డ గురించి ఆలోచిస్తూ…. నేను కూడా నా బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత. నా బిడ్డని ఈ లక్ష్మణ్ దగ్గరే ఉంచుతాను. లక్ష్మణ్ అయితే నా బిడ్డ కి మంచి మాటలు మంచి క్రమశిక్షణ ఇస్తాడు. వాటిని చూసి నేను మురిసిపోవాలి. నా బిడ్డ మేమందరం కలిసి హాయిగా జీవించాలి. నా బిడ్డ ఈ భూమ్మీదికి ఎప్పుడు వస్తాడో అనుకుంటూ ఉంటుంది.
ఇంతలో ఆ ఏనుగు పెద్ద పెద్ద శబ్దంలు చేసుకుంటూ ఒక్కసారిగా కింద పడిపోయి అరుస్తూ ఉంటుంది దాన్ని చూసిన లక్ష్మణ్ ఆశ్చర్యపోయి…… అయ్యో ఏమైంది మిత్రమా. అంటూ కంగారు పడిపోతూ తనలో… అయ్యో బహుశా దీనికి పురిటి నొప్పులు వస్తున్నట్టు ఉన్నాయి. నేనేం చేయాలి దేవుడా అంటూ అతని భార్య దగ్గరికి వెళ్లి ఆమె ని తీసుకొని వస్తాడు.
ఆమె అక్కడకు వచ్చి ఆ ఏనుగు తలపై నిమురుతూ…. కొంచెం ఓపిక పట్టు తల్లి ఏం కాదు. అనీ ఓదార్పు చెప్తూ ఉంటుంది.
పాపం ఆ ఏనుగు నొప్పిని భరించలేక తన లో…. భగవంతుడా నేను ఈ నొప్పిని భరించలేక పోతున్నాను. అమ్మ అయ్యా అనుకుంటూ చాలా బాధపడుతూ కన్నీరు కారుస్తూ పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటుంది.
లక్ష్మణ్…… అయ్యో పద్మ ఇ ఏనుగు మరి ఇంతగా ఎందుకు అరుస్తుంది. ఈ పురిటి నొప్పుల బాధ మరీ అంత ఎక్కువగా ఉంటుందా.
భార్య….. అవునండి ఒక తల్లికి బిడ్డని నవమాసాలు మోయడం ఒక ఎత్తు అయితే.
ఆ బిడ్డని భూమిమీదికి తీసుకు వచ్చే సమయంలో. ఎంత బాధ అనుభవించాలి అంటే. దానిని వర్ణించలేనిది. అందుకే తల్లి ప్రేమకు విలువ కట్టలేము. ఆమె బిడ్డకు జన్మనిచ్చిన అందుకు శతకోటి వందనాలు చెప్తారు. ఈ సమయంలో ఆడవాళ్లకి పునర్జన్మ లాంటిది. అని అంటుంది ఆ మాటలు విన్న లక్ష్మణ్ … భగవంతుడా ఈ ఏనుగుని నువ్వే కాపాడాలి సురక్షితంగా తల్లి బిడ్డని ఉంచు అని దేవుని ప్రార్థిస్తాడు. లక్ష్మణ్ భార్య ఆ ఏనుగు తలపై నిమురుతూ కొంచెం సేపు ఓపిక పట్టు. అంతా కుదుటపడుతుంది. అని అంటుంది ఇంతలో ఆ ఏనుగు పెద్దగా అరిచి ఒక బిడ్డ కి బిడ్డకు జన్మనిచ్చి ఆ తల్లి ఏనుగు కన్ను మూస్తుంది. దాన్ని చూసిన లక్ష్మణ్ అతని భార్య చాలా బాధపడుతూ….. అయ్యో పాపం దేవుడా ఏంటి ఇలా చేశావు. ఈ బిడ్డకి తల్లి లేకుండాచేశావు. నీకసలు న్యాయం అనిపిస్తుందా తండ్రి . అంటూ ఇద్దరు బాధపడతారు. పాప o పుట్టిన పిల్ల ఏనుగు
చనిపోయిన ఆ తల్లి దగ్గర పాలు తాగుతూ ఉంటే. ఆ దృశ్యాన్ని చూసిన వాళ్ల గుండె తరుక్కుపోతుంది.
లక్ష్మణ్…. పద్మ ఇలా అవుతుందని అస్సలు అనుకోలేదు. బిడ్డ పుట్టాడని సంతోష్ పడాల. తల్లి దూరం అయిపోయిందని బాధ పడాలో అర్థం కావట్లేదు. ఏనుగు పరిస్థితి చూసిన తర్వాత నాకు నీ గురించి తలుచుకుంటే భయంగా ఉంది. అంటూ ఆమెని కౌగిలించుకుని బోర్న్ ఏడుస్తాడు.
పద్మ…. అయ్యో ఏంటండీ ఇలా చిన్న పిల్ల వాడిలాగా ఏడుస్తున్నారు. నాకేమీ కాదు.
అయినా ఈ సృష్టి రాతని ఎవరు తప్పించగలరు.దేవుడు మన రాతల్ని ముందే రాసి పెట్టాడు ఏలా జరగాలని ఉంటే అలాగే జరుగుతుంది. మనం దాని గురించి ఎన్ని అనుకున్నా ప్రయోజనం లేదు. అన్నీ సర్ది చెప్తుంది.
పద్మ ఏడుస్తూ ఆ ఏనుగు వైపు చూస్తూ…. పాపం ఈ తల్లి ఆ బిడ్డ గురించి ఎన్ని కలలు కని ఉంటుందో. వాటన్నిటినీ చూడకుండా నిజం కాకుండానే. జాలి లేని భగవంతుడు ఈ బిడ్డకు తల్లి దూరం చేశాడు. ఆ తల్లికి ఈ బిడ్డను చూసుకునే భాగ్యం కూడా లేకుండా చేశాడు. అంటూ చాలా కన్నీరు కారుస్తోంది.
ఆమె కన్నీరు చూసి నా అతను…… ఊరుకో పద్మ ఊరుకో మనం ఏమి చేయలేము అని ఇప్పుడే కదా నువ్వు చెప్పావ్. దేవుడు రాత ని ఎవరు తప్పించుకోలేరు కదా. ఊరుకో ఏది జరగాలని ఉంటే అదే జరుగుతుంది.
ఆ మాటలకి పద్మ సరే అంటూ తల ఊపుతుంది.
లక్ష్మణ్…. పద్మ ఇప్పుడు మనం ఏం చేద్దాం.తల్లి దూరం అయిపోయింది ఆ బిడ్డను మనం ఇంటికి తీసుకెళ్తా మా. ఇక ఆ బిడ్డ మనతో పాటు హాయిగా బతుకుతాడు.
అందుకు ఆమె….. సరే అండి ఇక బిడ్డ కి మనమే తల్లిదండ్రుల o అవుదాం అని అనుకొని ఆ ఏనుగును వెంట పెట్టుకుని వాళ్ళ ఇంటికి తిరిగి వెళ్తారు. ఇక ఆరోజు నుంచి ఆ ఏనుగు కి ఆలనా పాలనా అన్ని వాళ్ళే చూసుకుంటూ ఉంటారు.
ఈ కథలో మనం తెలుసుకుని నీతి ఏంటంటే. తల్లి ఒక బిడ్డను నవమాసాలు మోసి ఎంత కష్టమైనా ఆ బాధ మొత్తాన్ని భరిస్తూ జీవిస్తుంది ఎందుకంటే తన బిడ్డ భూమి మీదకు వస్తే అల్లారుముద్దుగా చూసుకుందామని. ఆమె బిడ్డను కానీ ఈ సమయంలో ఎంత నొప్పి అయినా నా ప్రేమగా భరిస్తూ. తన బిడ్డ కి జన్మనిస్తుంది అలాంటి మాతృమూర్తుల ని కొంతమంది నిర్దాక్షిణ్యంగా నడిరోడ్డుపై వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు మరి కొందరు వారిని వృద్ధాశ్రమంలో చేర్పించి చేతులు దులిపేసుకుoటిన్నారు. నువ్వు కూడా ఒక బిడ్డకి తల్లివే నువ్వు కూడా ఒక బిడ్డ కి తండ్రి మరి నువ్వు ఇప్పుడు ఇలా చేస్తే భవిష్యత్తులో నీ పిల్లలు కూడా నిన్ను అలా చేస్తే అప్పుడు ఆ బాధ ఏంటో నీకు తెలుస్తుంది. అలా కాకుండా తల్లిదండ్రులను ప్రేమగా చూసుకునే వాళ్ళందరికీ ఈ కథ అంకితం చేస్తున్నాం.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *