గర్భవతి ఏనుగు 8_ Telugu Stories- Stories in Telugu – Panchatantra Kathalu

అది ఒక అందమైన గ్రామం ఆ గ్రామంలో ఒక పెద్ద భవనం. ఆ భవనంలో సుందరయ్య అనే అతని దగ్గర గర్భవతి అయిన ఏనుగు ఉండేది అలా ఉండగా ఒక సాయంకాలం ఈ సమయంలో సుందరయ్య ఆ ఏనుగు దగ్గరకు వచ్చి దాన్ని ఇష్టం వచ్చినట్టుగా కొట్టడం మొదలు పెట్టాడు ఆ ఏనుగు తనలో: అమ్మో భగవంతుడా నొప్పి. భగవంతుడా లోపల ఉన్న నా బిడ్డకు ఏం కాకుండా చూడు. అంటూ కన్నీరు కారుస్తూ పెద్ద పెద్దగా ఏడుస్తూ అరుస్తూ శబ్దాలు చేస్తూ ఉంటుంది. ఆ చుట్టుపక్కల ఉన్న ఇద్దరు స్త్రీలు ఆ దృశ్యాన్ని చూసి….. అయ్యో చూసావా కొంచెం కూడా కనికరం లేకుండా సుందరయ్య ఆ ఏనుగునీ పాపం చిత్రహింసలు పెడుతున్నాడు. రోజూ ఇలాగే కొడుతూ దాని ప్రాణం తీస్తున్నాడు పాపం అసలుకే గర్భవతి భగవంతుడా నువ్వే దాన్ని కాపాడాలి. అంటూ వింతగా చూస్తూ ఉంటారు . ఇంతలో పశువుల డాక్టర్ అయినా మధుప్రియ ఆ దారిలో hospital కి వెళ్తూ ఉండగా వాళ్లు నీ చూస్తు…… ఏమైంది అక్కడ మీరు ఎందుకు అంత వింతగా చూస్తున్నారు. అనుకుంటూ అక్కడికి వచ్చి ఆ దృశ్యాన్ని చూస్తుంది అప్పటికే. సుందరయ్య ఏనుగునీ కొట్టి అక్కడినుంచి ఇంట్లో లి కి వెళ్తాడు.

డాక్టర్….. అయ్యో ఈ ఏనుగు కి చాలా గాయాలయ్యాయి. అసలు ఇతను మనిషి లాగా ప్రవర్తించలేదు. చూడ్డానికి ఈ ఏనుగు గర్భవతి లాగా ఉంది. అని కోపంగా లోపలికి వచ్చి అతనితో మాట్లాడలనుకుంటుంది ఇంతలో అతను పెద్ద కర్రతో అతన్ని అతను గాయపరచు కుంటూ ఉంటాడు. దాన్ని చూసిన డాక్టర్….. పాపం ఆ గర్భవతి అయిన ఏనుగుని ఎందుకు అలా కొట్టారు మిమ్మల్ని మీరు ఎందుకు అలా గాయపరచు కుంటున్నారు. అతను కోపంగా ఆమె వైపు చూడడంతో డాక్టర్ కి భయం వేసి.
అక్కడ నుంచి ఆ ఏనుగు దగ్గరికి వెళ్లి దాన్ని వెంటబెట్టుకుని తన హాస్పిటల్ కి తీసుకు వెళుతుంది. ఆ ఏనుగు గాయాలకి మందు రాస్తూ….. ఛీ ఆ పశువులంటే మనిషి నిన్ను గాయపరిచాడు. ఇక నువ్వు ఇక్కడే సంతోషంగా ఉండొచ్చు నీకు కావాల్సిన ఆహార పదార్థాలు మేము అందిస్తూ ఉంటాము. అని చెప్పి ఏనుగుకి ఆహారం తీసుకోవడానికి లోపలికి వెళ్తుంది. బయట ఏనుగు తన మనసులో….. భగవంతుడా ఎలా అయినా నేను ఇక్కడ నుంచి వెళ్లిపోవాలి. నా బిడ్డ ఆకలితో అల్లాడి పోతుంటాడు. నేను వెళ్ళి తనకి ఆహారం అందించాలి. అని అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడికి ఆ డాక్టర్ ఆహారం తీసుకొని బయటకు వస్తుంది బయటికి వచ్చినా ఆమెకు ఏనుగు ఎక్కడా కనిపించదు. డాక్టర్ అటు ఇటు వెతుకుతూ…. అయ్యో ఈ ఏనుగు ఎక్కడికి వెళ్ళిపోయింది. బహుశా తిరిగి మళ్లీ ఆ నరకంలోకి వెళ్ళలేదు కదా. అనుకుంటూ అతని ఇంటికి బయల్దేరుతుంది. ఇందులో ఆ ఏనుగు చిన్నగా నడుచుకుంటూ దారిలో ఉండగానే చీకటి పడిపోతుంది. అది ఒక చెట్టు దగ్గర అలిసిపోయి నిలబడి….. భగవంతుడా నేను ఎలా అయినా కొంచెం ఓపిక తెచ్చుకొని. నా బిడ్డ ఆకలిని తీర్చాలి. ఎలా అయినా నన్ను ఇంటి దగ్గరికి చేర్చు. అనుకుంటుండగా ఆ చెట్టు పైన ఉన్న చెడ్డి దయ్యం ఆ ఏనుగు మీదకి దూకుతుంది. ఏనుగు పెద్దగా అరుస్తూ… ఎవరు నా పైకి ఎక్కింది త్వరగా కిందకు దిగండి నా కడుపులో బిడ్డ ఉన్నాడు వాడికి ప్రమాదం జరుగుతుందేమో. దయచేసి దిగండి అంటూ అరుస్తుంది. వెంటనే చెడ్డి దయ్యం ఏనుగు ముందుకు వచ్చి….. అయ్యో నన్ను క్షమించు మిత్రమా. నీ కడుపులో బిడ్డ ఉన్న సంగతి నాకు తెలియదు.అయినా నువ్వు ఇందాక నా బిడ్డకు ఆహారం అందించాలి త్వరగా వెళ్లాలి అంటున్నావ్ కదా నీకు మరో బిడ్డకు కూడా ఉన్నాడా.
ఆ ఏనుగు ఏడుస్తూ….. అవును ఉన్నాడు నా కడుపున పుట్టకపోయినా నా బిడ్డ కంటే ఎక్కువ. అంటే అతను నా యజమాని ఒక మనిషి. ఆయన గనుక లేకపోతే నేను ఉండను నా కడుపులో పెరుగుతున్న బిడ్డ ఉండదు.
చెడ్డ దెయ్యం… మిత్రమా అసలు ఏం జరిగిందో నాకు అర్థమయ్యేలాగ చెప్పు.
ఏనుగు …. చెప్తాను విను మిత్రమా ఒకరోజు నేను ఆహారం కోసం అడవిలో ఆట ఇటు తిరుగు తున్నాను. ఇంతలో ఇద్దరు దొంగలు నన్ను పట్టుకొని ఎక్కడకో తీసుకు వెళ్తా అనుకున్నారు. నేను వాళ్ల నుంచి తప్పించుకొని వెళ్తుండగా వాళ్లు నన్ను కర్రలతో గాయపరిచారు. నేను….. ఏడుస్తూ దయచేసి నన్ను వదిలేయండి. నేను ఎవరికీ అపకారం చేయలేదు.మీరు నన్ను ఎందుకు కొడుతున్నారు నాకు అర్థం కావట్లేదు నా కడుపులో బిడ్డ పెరుగుతున్నాడు. వాడికి ప్రమాదం జరుగుతుందేమో దయచేసి నన్ను వదిలేయండి. అంటూ వారిని ఎంతగానో ప్రార్ధించాను అయినా వాళ్లు నన్ను కొడుతూనే ఉన్నారు వాళ్ళు నన్ను ఎందుకు కొడుతున్నారో కూడా నాకు తెలియదు. నేను గర్భవతిని కావడంతో నీరసంతో అక్కడే పడి పోయాను. అప్పుడే అక్కడికి యజమాని అయినా సుందరయ్య దేవుడిలాగా అక్కడికి వచ్చాడు. సుందరయ్య…. రేయ్ ఏం చేస్తున్నారు రా ఏనుగుని. పాపం ఎందుకు అలా చిత్రహింసలు పెడుతున్నారు. అంటూ వాళ్ళని కొట్టి తరిమేశాడు.
నేను….. దాహం ఆకలి దాహం అంటూ బాధపడుతున్న నాకు తన దగ్గర ఉన్న ఆహారాన్ని పెట్టి నన్ను తన ఇంటికి తీసుకు వెళ్ళాడు. సుందరయ్య….. అయ్యో పాపం నీ ఒంటి మీద ఎన్ని గాయాలు. అసలు ఆ మూర్ఖులు నిన్ను ఎందుకు కొడుతున్నారు నాకు అర్థం కాలేదు బహుశా వాళ్లు ఏ zoo కో నిన్ను అమ్ముదాం అనుకున్నారేమో. ఇక నువ్వు భయపడొద్దు నేను ఉన్నా కదా నీకు నీ బిడ్డకు ఏం కానివ్వను నీకు కావాల్సిన ఆహార పదార్థాలు తీసుకొచ్చి ఇస్తాను జాగ్రత్తగా తిని ఇక్కడే ఉండు. అంటూ నాకు తన చేతులతో స్వయంగా ఆహారాన్ని తినిపించాడు. అలాంటి ప్రేమను నేను ఎక్కడ చూడలేదు.
ఆహారం తింటుంన సమయంలో నా మనసులో…. దేవుడు ఒక కీడు చేసినా అది మంచి కోసమే అన్నది నిజం. ఈ వేసవికాలంలో ఆహారం దొరక్క నేను ఎంతో అలమటించి పోతున్నాను.నేను బ్రతక పోయినా నా బిడ్డను బ్రతికించు కుందామని ఎంతో తాపత్రయం పడుతున్న సమయంలో. ఆ దొంగలు రావడం నన్ను కొట్టడం. దాన్ని మీరు చూడడం. నన్ను ఇక్కడికి తీసుకొచ్చి ప్రేమగా ఆహారం అందించడం అనేది అంతా దేవుని కృప.మీకు నేను రుణపడి ఉంటాను ఆ దేవుడికి ఎంతో కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను అని కంటతడి పెట్టుకున్ను. నేను ప్రతిరోజు అక్కడే ఆహారం తింటూ క్షేమంగా ఉన్నాను రోజులు గడిచాయి ఒకరోజు రాత్రి నన్ను తీసుకెళ్లాలి అనుకున్న దొంగలు ఇద్దరూ మా ఇంట్లోకి ప్రవేశించారు. వారిని చూసిన నేను పెద్ద పెద్దగా అరిచాను.
సుందరయ్య బయటకు వచ్చి నాతో….. ఏమైంది నీకు ఎందుకు ఈ రోజు ఇంత పెద్ద పెద్దగా అరుస్తున్నావు.కొంపదీసి నొప్పులు రావడం లేదు కదా భగవంతుడా నేను ఏంచేయాలి. అనుకుంటుండగా ఆ ఇద్దరు దొంగలు వెనుక నుంచి వచ్చి అతని తలపై గాయపరిచారు. అతడు అమ్మ అమ్మా అంటూ పెద్దగా అరుస్తూ రక్తం కారుతూ కిందపడిపోయాడు. అతను చనిపోయాడు ఏమో అనుకొని వాళ్ళిద్దరూ అక్కడినుంచి భయంతో పరిగెత్తారు. నేను వాళ్లకు భయపడి ఏం చేయలేక పోయాను. ఆ రోజు నుంచి అతను పిచ్చివాడిగా మారిపోయి నన్ను కొడుతున్నాడు. అలా కొట్టడం అనేది అతనికి తెలియ చేస్తున్నాడు కాబట్టి అతని కంటికి రెప్పలా నా బిడ్డల చూసుకుంటున్నాను.
చెడ్డి దయ్యం….. నాకు ఇప్పుడు అర్థమైంది అతను నిన్ను కాపాడినందుకు కృతజ్ఞతగా నువ్వు అతని బిడ్డలా చూసుకుంటున్నావ్వూ.
ఏనుగు…. అవును ఆ విషయం తెలియని ప్రజలు అతన్ని తిట్టుకుంటున్నారు. చెడ్డవాడు అని అనుకుంటున్నారు. అతను ఎలాంటి వాడో నాకు మాత్రమే తెలుసు. అని ఈరోజు జరిగిన సంఘటన గురించి కూడా చెబుతోంది.
చెడ్డిదెయ్యం…. సరే మిత్రమా నువ్వు బాధపడకు ఇప్పుడు నువ్వు ఇల్లు మర్చిపోయాను సంగతి నాకు అర్థమైంది నేను ఇప్పుడే మి ఇంటి దగ్గరికి తీసుకెళ్తాను.
ఏనుగు… త్వరగా తీసుకెళ్లి మిత్రమా. నా బిడ్డ ఆకలితో అల్లాడి పోతుంటాడు. అని అని ఏడుస్తుంది చెడ్డి దెయ్యం వెంటనే ఏనుగు తొండాన్ని గట్టిగా పట్టుకుంటుంది. వెంటనే ఆ ఏనుగు మరియు చెడ్డ దెయ్యం గాల్లోకి లెగిసి
సరాసరి వాళ్ళ ఇంటి దగ్గర ఆగుతాయి అప్పటికే అక్కడ డాక్టర్ అతనికి భోజనం తినిపిస్తూ ఉంటుంది. దెయ్యాన్ని చూసిన డాక్టర్ చాలా భయపడిపోతూ…. దెయ్యం దెయ్యం అంటూ అరుస్తుంది.
చెడ్డి దెయ్యం…. ఎందుకు నన్ను చూసి భయపడుతున్నారు నేను మిమ్మల్ని ఏం చేయను. నేను ఈ ఏనుగు కి సహాయం చేయడం కోసమే వచ్చాను.
ఆ మాటలు విన్న డాక్టర్….. మంచి పని చేశావు ఇతని గురించి నేను తప్పుగా ఆలోచించాను. ఏనుగు కనబడటం లేదని వెతుక్కుంటూ వచ్చినప్పుడు నాకు అర్థమైంది ఇతనికి మతిస్థిమితం లేదు అని. అందుకే ఆ ఏనుగు ని అలా హింసిస్తున్నాడు. నేనొచ్చేటప్పటికి పాపం ఆకలి ఆకలి ఉండడంతో భోజనం తినిపిస్తాను అసలు ఇతనికి ఏం జరిగింది. అని అడుగుతుంది అప్పుడు చెడ్డి దయ్యం నేను చెప్పిన విషయం అంతా చెబుతుంది.
దాన్ని విన్నాం డాక్టర్ కూడా చాలా బాధపడుతుంది. డాక్టర్… మరి ఏం పర్వాలేదు నేను ఇతన్ని హాస్పిటల్ కి తీసుకెళ్ళి చికిత్స చేస్తాను.
చెడ్డి దెయ్యం…. మేడమ్ నీకు అంత శ్రమ అవసరం లేదు నాకు ఎన్నో మహా శక్తులు ఉన్నాయి. నేను అతనిని మామూలు స్థితికి తీసుకు వస్తాను. అంటూ అతన్ని నయం చేస్తుంది అతను వెంటనే మామూలు స్థితికి వచ్చేస్తాడు. అలా వచ్చిన వెంటనే అతను ఏనుగుని హత్తుకొని…. నీకేం కాలేదుగా ఆ దొంగ లు నిన్ను తీసుకెళ్లలేదు గా ఏం చేయలేదు గా. అంటూ బాధపడుతూ కన్నీరు కారుస్తోంది అని అడుగుతాడు.
అప్పుడు ఏనుగు తన మనసులో ….. నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది నా బిడ్డకి గతం గుర్తుకు వచ్చింది. అని సంతోషంగా ఆ చెడ్డి దెయ్యం తో…. నీకు ఎంతో కృతజ్ఞతలు మిత్రమా. నా బిడ్డ గురించి నేను ఎంతో బాధపడ్డాను. నిజానికి నా కడుపులో పెరుగుతున్న బిడ్డ కంటే ఎక్కువగా బాధపడింది ఈ విషయం గురించి. నీకు చాలా కృతజ్ఞతలు. అక్కడ అసలు ఏం జరుగుతుందో అర్థం కాని సుందరయ్య అలా చూస్తూ ఉండగా డాక్టర్ అతనికి జరిగిన విషయమంతా చెప్తుంది. దాన్ని విన్న అతను చెడ్డి దెయ్యం తో…. నీకు చాలా కృతజ్ఞతలు. నన్ను మామూలు స్థితికి చేసినందుకు. అలాగే మీకు కూడా మేడం నా ఏనుగు తల్లికి సాయం చేసినందుకు. నావల్ల ఈ బంగారు తల్లి ఎన్నో కష్టాలు పడింది. నేను నీ పట్ల పశువుల ప్రవర్తించాను అమ్మ అంటూ ఏడుస్తాడు.
ఏనుగు….. ఏడవకు అన్నట్టుగా అతన్ని ఓదారుస్తుంది.
చెడ్డి దయ్యం ఏనుగుతో….. అయ్యో మిత్రమా నాకు చీకట్లోనే నీ గాయాలు కనపడలేదు . ఇప్పుడే చూస్తున్నాను నన్ను క్షమించు ఇప్పుడే వాటిని తొలగిస్తాను అంటూ ఏనుగు పై ఉన్న గాయాల్ని కూడా తొలగించి వేస్తుంది.
చెడ్డి దయ్యం…. సరే ఇక నేను వెళ్లి వస్తాను మీరు అందరూ జాగ్రత్తగా ఉండండి. అంటూ అక్కడి నుంచి మాయమైపోతుంది.
డాక్టర్…. మీ మంచి మనసుకి ఆ దేవుడే సహాయం చేశాడు.
సుందరయ్య…. నాదేమీ లేదు మేడం ఇదిగో ఈ తల్లి నన్ను కాపాడింది. ఈ ఏనుగు లేకపోతే నేను ఉండే వాడిని కాదు. అంటూ కంటతడి పెట్టుకుంటాడు.
ఏనుగు దాన్ని చూసి కంటతడి పెట్టుకుంది.
డాక్టర్…. ఇక జరిగిందేదో జరిగిపోయింది అంతా మర్చి పోయి అందరూ సంతోషంగా ఉండండి . ఇక నేను వెళ్లి వస్తాను అంటూ అక్కడి నుంచి ఆమె కూడా వెళ్ళిపోతుంది. ఇక ఏనుగు చాలా సంతోషంతో తన జీవితాన్ని కొనసాగిస్తోంది. ఇది కథ గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *