గర్భవతి ఏనుగు. 4_ Telugu Stories- Stories in Telugu – Panchatantra Kathalu

అనగనగా ఒక అడవి ఉండేది ఆ అడవి చివర ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామంలో శంకర్రావు అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతని దగ్గర రెండు ఏనుగులు ఉండేవి ఒకటి శబరీ ఒకటి సుమతి. శంకర్రావు వాటికి కొంచెం ఆహారం పెట్టి కఠినమైన పనులు చేయిస్తూ ఉంటాడు.

పాపం ఆ రెండు ఏనుగుల లో సుమతి గర్భవతి. ఒకరోజు ఆ రెండు ఏనుగులు పనిచేస్తూ ఉండగా. పాపము సుమతి గర్భవతి కావడంతో ఎక్కువ బరువు మోయలేక నీరసంతో….. అమ్మ నేను ఈ బరువు మోయలేక పోతున్నాను. నాకు చాలా ఆయాసంగా ఉంది భగవంతుడా కొంచెం సేపు
నాకు విశ్రాంతి దొరికేలా చేయి. నీకు పుణ్యం ఉంటుంది అని దేవుడికి మొర పెట్టుకుంటూ అక్కడ కొంచెం సేపు నిలబడుతుంది.
ఇంతలో అక్కడికి శంకరరావు వచ్చి….. ఏంటే తినడం మాత్రం కుంభాల కుంభాలు తింటావు. పని చేయడానికి మాత్రం ఒళ్లు వంగ దే. నీ పని ఇలా కాదే అంటూ ఒక పెద్ద కర్ర తీసుకుని దాన్ని ఇష్టం వచ్చినట్టుగా కొడతాడు.
ఆ ఏనుగు ఎంతో బాధపడుతూ….. అయ్యో భగవంతుడా గర్భవతి అని కూడా చూడకుండా నన్ను ఇలాగా కొడుతున్నాడు.
ఎందుకిలా చేస్తున్నాడు భగవంతుడా. నాకు విశ్రాంతి కలిగించిన అన్నాను కానీ శాశ్వతమైన విశ్రాంతి కలిగించిన లేదు. నేను నా కోసం కాకపోయినా నా బిడ్డ కోసం అయినా బ్రతకాలి. అంటూ కన్నీరుమున్నీరవుతుది.పాపం ఆ ఏనుగు ఆ దెబ్బలకు తట్టుకోలేక మరింత నీరసం తో అక్కడ ఒక్కసారిగా కుప్పకూలి పోతుంది. ఆ తర్వాత శంకరరావు దాంతో….. నువ్వు చచ్చిపోయినా పర్వాలేదు. ఈ పని పూర్తి చేసిన తర్వాతే చచ్చిపో.అంటూ మరో ఎనిమిది దగ్గరికి వెళ్లి ఏంటి దాన్ని చూసి నువ్వు నేర్చుకుంటావా నీకు రెండు దెబ్బలు పడాలి అంటూ అనవసరంగా ఆ ఏనుగుని కూడా కొడతాడు.
తర్వాత తిరిగి వాటితో…. మీకు ఈ మధ్య ఒళ్ళు కొవ్వెక్కి బద్ధకంతో కొట్టుకు లడుతునారు. అప్పుడప్పుడు ఇలాంటి తడి దెబ్బలు పడితే కానీ. మీరు మాట వినరు. నేను వచ్చేసరికి ఈ పనంతా పూర్తి కాకపోతే మీ ఇద్దరి పని చెప్తా అంటూ అక్కడనుంచి వెళ్ళి పోతాడు. ఆ తర్వాత ఆ ఏనుగులు చాలా బాధ పడుతూ ఒకదానితో ఒకటి….. మిత్రమా నువ్వు ఏం బాధపడక నువ్వు ఇప్పుడు గర్భవతివి.నేను నీకు సహాయం చేస్తాను నువ్వు ఏం చెయ్యొద్దు ఈ పనంతా నేనే చేస్తాను. నువ్వు అలాగా కొద్దిసేపు విశ్రాంతి తీసుకో అని చెప్పి ఆ పని అంతా చేస్తూ ఉండగా కొంత సమయానికి. శంకర్రావు తిరిగి మళ్ళీ వస్తాడు. పాపం గర్భవతి అయిన అక్కడ పడుకోవడం చూసి….. ఏంటే బాగా పనంతా దానికి అప్ప చెప్తున్నావ్. సిగ్గు శరం ఉండాలి అని ముఖానికి. మీకు ఇందాక కొట్టిన దెబ్బలు సరిపోయినట్లు ఉన్నాయి. ఇంకో నాలుగు పడితే గాని మాట వినవు అని చెప్పి మళ్లీ కొడతా డు. పాపం ఆ ఏనుగు ఏమి చేయలేక నిస్సహాయ స్థితిలో కన్నీరు పెట్టుకుంటూ ఏడుస్తుంది. ఆ రోజు రాత్రి సమయం ఆ ఏనుగులు ఒకదానితో ఒకటి… మనం ఏ జన్మలో ఏ పాపం చేశామో ఈ జన్మలో ఇలా బాధపడాల్సి వస్తుంది. దేవుడికి కృప కలగటం లేదు మన పైన. కనీసం గర్భవతి అని కూడా జాలి లేకుండా చిత్రహింసలు పెడుతున్నాడు. ఈ మనిషి అంతకుముందు కొన్ని యజమాని ఎంత మంచిగా చూసుకునే వాడు. చాలా ప్రేమతో చూసుకునేవాడు. అలాంటి జంతు ప్రేమికులు ఉన్నంతకాలం ఎంతో బాగుండేది. అని కంటతడి పెట్టుకుని బాధపడుతూ ఉంటాయి.
ఆ ఏనుగు యొక్క బాధను చూస్తున్న ఒక దెయ్యం ఆ ఏనుగు ముందు ప్రత్యక్షమై…. బాధపడకండి నేను మీ బాధను తీర్చడానికే వచ్చాను. అంటూ ఆ రెండు ఏనుగుల మీద చెయ్యి వేసి నిమురుతూ ఉంటుంది ఆ దెయ్యం అలా చేయడంతో వాటి బాధనంతా మరిచిపోయి. కంటతడి పెట్టుకుంటూ ఆ దెయ్యం వైపు అలా చూస్తూ అమ్మా అని ప్రేమగా పిలుస్తాయి. ఆ రెండు ఏనుగులు అమ్మ అని పిలవడంతో ఆ దెయ్యం మనసు చలించిపోతుంది. ఎంత ప్రేమగా పిలిచారు అమ్మ. ఇప్పుడు నాకు అర్థమైంది మీరు ఇక్కడ ఎంత బాధ పడుతున్నారో. ఈ మూర్ఖుడికి నేను సరైన బుద్ధి చెప్తాను. మీరిద్దరూ బాధపడకండి అమ్మా నీవంటి పైన గాయాలను నేను తీసేస్తాను. అంటూ ఆ ఏనుగు వంటిపై ఉన్న గాయాన్ని మాయం చేస్తుంది. ఆ దెయ్యం చూపించే ప్రేమతో ఆ రెండు ఏనుగులు వాటి బాధ అంతా మర్చి పోతాయి. ఆ దెయ్యం మాయలతో వాటి గాయాలు కూడా తొలగించి వేస్తుంది. ఆ మరుసటి రోజు ఆ దెయ్యం వాడి రాక కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఆ సమయంలో ఆ రెండు ఏనుగులు నిద్రిస్తూ ఉంటాయి. వచ్చి… హే లెగండి లెగండి బారెడు పొద్దెక్కిన దాకా పడుకుంటున్నారు. నిన్న సరిగ్గా పని చేయనందుకు ఈరోజు మీకు భోజనం కూడా పెట్టను. లేవండి లేవండి అంటూ ఒక కర్ర తీసుకొని కొడుతూ ఉంటాడు. అప్పుడు ఆ దెయ్యం దాని మాయలతో ఆ కర్ర తిరిగి అతన్ని కొట్టేలా చేస్తుంది. అతను అప్పుడు అతను అమ్మో అయ్యో అనుకుంటూ కేకలు వేస్తాడు. ఆ తర్వాత నీ ముక్కు పెద్దగా ఏనుగు తొండం గా మారిపోతుంది అతనికి తెలియకుండానే. అక్కడున్న కట్టి పిల్లల్ని ఆ తొండంతో తీసుకెళ్తూ ఉంటాడు.
దానిని చూసిన ఆ దెయ్యం పకపకా నవ్వుతూ ఉంటుంది.
అప్పుడు అతను తన మనసులో….. ఇంత బరువుగా ఉన్న యి ఏంట్రా దేవుడా అసలిదంత ఎలా జరుగుతుంది ఇదంతా నా ప్రమేయం లేకుండానే జరుగుతుంది. దేవుడా ఎలాగ దీనిని ఆపాలి. అంటూ కుయ్యో మొర్రో అనుకుంటూ ఆ కత్తి పూల లన్నిటిని సద్దు తాడు . అలా చేసి చేసి అలసిపోయి ఒక్కసారిగా కుప్పకూలి పోయి…. దాహం దాహం ఆకలి ఆకలి అంటూ పెద్ద పెద్దగా కేకలు వేస్తాడు.
అప్పుడు ఆ దెయ్యం వాడి ముందు ప్రత్యక్షమై….. దాహం గా ఉందా ఆకలిగా ఉందా. ఇదిగో నీటిని తాగు అంటూ నీటిని అతని కి అందకుండా కింద పార వేస్తూ ఉంటుంది. ఆ దెయ్యాన్ని చూసిన అతను…. నీకు అసలు బుద్ధి ఉందా ఒక మనిషి దాహం ఆకలి అంటే నువ్వు ఇలా చేస్తావా.అందుకే మిమ్మల్ని దెయ్యాలు అని పిలుస్తారు నీకు కొంచెం కూడా జాలి ఉండదు కాబట్టి.
అప్పుడు ఆ దెయ్యం….హా..హా..హా… ఆహా ఆహా ఎంత బాగా మాట్లాడుతున్నావ్. ఏదైనా తన వరకు వచ్చే వరకు తెలియదు అని సామెత ఊరికే చెప్పలేదు. నీ దగ్గరికి వచ్చేటప్పటికి జాలి దయ గురించి మాట్లాడుతున్నావ్. మరి ప్రతిరోజూ ఆ ఏనుగుకి తిండి పెట్టకుండా. గొడ్డు చాకిరీ చేస్తున్నావు. అప్పుడు నీకు జాలి దయ కనికరం కలగలేదా. పైగా గర్భవతి అని తెలిసినా ఆ ఏనుగుని చిత్రహింసలు పెడుతున్నావు. అప్పుడు నీకు కలగలేదా జాలి దయ.
ఒకసారి వాడి ముఖం చూడు…. అంత అమాయకంగా అంత ముద్దుగా అంత ప్రేమగా చూస్తున్నాయి వాడి మొఖం చూసి వాటిని ఎలా కొట్టాలనిపిస్తుంది. ఒక దెయ్యాన్ని అమ్మ అని పిలిచి నీవి. అంటే అవి ప్రేమను కోల్పోయి ఎన్నో రోజులు అవుతుంది అని అర్థమవుతుంది.నువ్వు మనిషివా యుండి జంతువుల పట్ల ఎంత ప్రేమను చూపించాల్సి ఉంటుంది. మనిషి అన్న సంగతి మర్చిపోయి మృగంలా ప్రవర్తించావి. మరి ఇప్పుడు నీతులు మాట్లాడుతున్నావు.
ఆ మాటలు విన్న అతను…. ఓహో ఇదంతా నువ్వే చేస్తున్నావన్నమాట. నా ముక్కు నీ దండం లా మార్చింది నువ్వే. నా చేత పనులను చేయించింది కూడా నువ్వే. కానీ అలా చేయడం మంచిదయింది. ఎందుకంటే ఇన్ని రోజులు నేను మానవత్వాన్ని మరిచి పోయాను. ఆ జంతువుల పట్ల కఠినంగా ప్రవర్తించాను నువ్వు అన్నది నిజమే. నా వరకు వచ్చిందాకా తెలియలేదు ఆ బాధ ఏంటి అనేది. నాకు బుద్ధొచ్చింది నన్ను క్షమించి నన్ను మామూలు మనిషిగా మార్చు. అని జాలిగా అడుగుతాడు అందుకు దయ్యం సరే అని. అతని మనిషిగా మార్చేస్తుంది.
అప్పుడు అతను పైకి లేచి అక్కడ ఉన్న నీటిని గటగటా తాగి. ఆ రెండు ఏనుగులు దగ్గరకు వచ్చి…. నన్ను క్షమించండి మీ పట్ల నేను కఠినంగా ప్రవర్తించాను. నేను మీ కాళ్లు పట్టుకున్న కూడా నేను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం దొరకదు. మరీ ముఖ్యంగా నీకు. గర్భవతి అని తెలిసి కూడా నీ పట్ల మరింత కఠినంగా ప్రవర్తించాను. అమ్మతనం గురించి అమ్మ ప్రేమ గురించి తెలిసిన నేను ఇలా చేయడం సరైనది కాదు. నన్ను క్షమించండి అంటూ ఆ ఏనుగు కాళ్ళు పట్టుకున్నాడు.
పాపం ఆ యజమాని అలా కన్నీరు పెడుతూ కాళ్ళు పట్టుకోవడం చూసిన రెండు ఏనుగులు కూడా. కన్నీరు పెట్టుకుంటూ వద్దు అన్నట్టుగా తల ఊపుతూ అతని నీ వాటి తొండాలతో ప్రేమగా తలపై నమ్ముతాయి. ఆ జంతువులు తనపై చూపిస్తున్న జాలి ప్రేమకి అతను మరింత బాధపడుతూ బోర్న్ ఏడుస్తూ…. ఇన్ని రోజులు నుంచి ఇలాంటి ప్రేమను నేను కోల్పోయినందుకు సిగ్గు పడుతున్నాను.నేను మిమ్మల్ని ప్రేమగా చూసుకుంటే మీరు నన్ను మరింత ప్రేమగా చూసుకునే వాళ్లు. ఇక మీ పట్ల నేను ఎప్పుడూ తప్పు చేయను. నాకు బుద్ధొచ్చింది. అన్ని అంటాడు.
అదంతా చూస్తున్న దయ్యం …. నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది నేను నిన్ను కష్ట పెట్టినందుకు క్షమించు.నేను అలా చేయబట్టే ఇదంతా జరిగింది దయచేసి ఇంకెప్పుడూ పశువుల పట్ల కఠినంగా ప్రకటించ వద్దు. ఎందుకంటే అద్దంలో నీ మొఖం చూసుకున్నప్పుడు. నువ్వు నవ్వితే అ అద్దం కూడా నవ్వుతుంది నువ్వు ఏడిస్తే అద్దం కూడా ఏడుస్తుంది. అంటే నువ్వు ఏం చేస్తే అది తిరిగి అదే చేస్తుంది. సమాజంలో కూడా అంతే నువ్వు ఏదైతే ఇస్తావో తిరిగి నీకు అదే వస్తుంది. నువ్వు ప్రేమించి చూస్తే నీకు తిరిగి ప్రేమ వస్తుంది. నువ్వు ద్వేషాన్ని ఇస్తే నీకు అదే తిరిగి వస్తుంది.అందుకే బ్రతికి ఉన్నంతకాలం మనుషులతో కానీ జంతువులతో కానీ హాయిగా పలకరించు కుంటూ ప్రేమగా వ్యవహరిస్తే. కష్టాలు అనేవి మన దరి చేరవు.
అని అంటుంది ఆ మాటలు విన్న అతను చాలా సంతోషపడుతూ…. మీరు చెప్పింది అక్షరాల నిజం. నేను ఇకనుంచి నా బుద్ధిని మార్చుకుంటున్నాను.ఆ బుద్ధిని మార్చినందుకు మీకు చాలా కృతజ్ఞతలు అంటూ మరొకసారి కృతజ్ఞతలు చెప్పుకుంటాడు.
ఆ తర్వాత దెయ్యం సరే నేను వెళ్లి వస్తాను మిత్రులారా మీరంతా జాగ్రత్తగా ఉండండి. అంటూ అక్కడి నుంచి మాయమైపోతుంది. ఇక ఆరోజు నుంచి శంకర్రావు ఆ ఏనుగుల్ని తన సొంత బిడ్డలా చూసుకుంటాడు. మంచి భోజనాన్ని అందిస్తూ ఎంతో ప్రేమతో వాటితో కలిసి తన జీవితాన్ని కొత్తగా ప్రారంభిస్తాడు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *