గర్భవతి కుక్క బంగారు కోడలు_ Telugu Stories- Stories in Telugu – Panchatantra Kathalu

అది ఒక పల్లెటూరు పల్లెటూరులో శంకర్రావు వందన దంపతులు ఉండేవాళ్ళు. అతని కుమారుడు పేరు వర్ధన్ అతను బాగా చదువుకొని పట్టణంలో ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. అక్కడ కొన్ని రోజులు ఉద్యోగం చేసిన తర్వాత. తిరిగి వాళ్ళ ఊరికి వచ్చాడు.

అప్పుడు వాళ్ల తల్లిదండ్రులతో…. అమ్మానాన్న మీ ఇద్దరికి ఒక మంచి శుభవార్త చెబుతున్నాను వినండి ఇప్పుడు నాకు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది. అది కూడా బ్యాంకులో మన ఊరి బ్యాంకులో నే
ఆ మాటలు విన్న తల్లిదండ్రులు ఇద్దరూ చాలా సంతోషపడుతూ…. హమ్మయ్య ఎంత చక్కటి తీపికబురు చెప్పావు. ఇంకా నువ్వు ఎక్క డో ఉన్నావ్ అన్న దిగులు మాకు ఉండదు. కళ్లముందే ఉంటావు.అంతా భగవంతుని దయ అని చాలా సంతోష పడతారు అలా కొన్ని రోజులు గడిచాయి ప్రతిరోజు అతను ఉద్యోగానికి వెళ్లి తిరిగి వస్తూ ఉంటాడు .
అలా ఉండగా ఒకరోజు తండ్రి… ఏరా బాబు ఉద్యోగం వచ్చింది. ఇంకా పెళ్లి సంగతి ఏంటి. మాకు నీ పెళ్లి ముచ్చట్లు చూడాలని ఉంది. ఏమంటావు. అందుకు అతను సరే అని చెప్పి … సరే చేసుకుంటాను మంచి అమ్మాయిని చూడండి అని అంటాడు.
అందుకు ఆ తండ్రీ చాలా సంతోష పడుతూ… సరే బాబు తప్పకుండా చూస్తాము అని అంటాడు అలాగా మంచి అమ్మాయి కోసం వెతుకుతూ ఉండగా ఒక మంచి సంబంధం వాళ్ళ దగ్గరికి వస్తుంది. ఆ అమ్మాయి పేరు వైష్ణవి. తల్లి ఆమె చిన్నప్పుడే చనిపోవడంతో తండ్రి గారాబంగా పెంచాడు. చాలా మంచిది అమాయకురాలు అందం అణకువ చదువు అన్ని ఉన్నాయి. ఆ అమ్మాయిని చూడగానే
వర్ధన్ పెళ్లికి సరే అని చెప్పాడు. అలా వాళ్ళిద్దరికీ పెళ్లి కూడా జరిగిపోయింది.
వాళ్లు చాలా సంతోషంగా గడుపుతూ హాయిగా జీవిస్తారు అలా ఉండగా ఒకరోజు
వైష్ణవి వాళ్ళ అత్తయ్య వైష్ణవి తో…. అమ్మ నా కోడలు పిల్ల నువ్వు చేసే వంటలు చాలా అద్భుతంగా ఉన్నాయి. చాలా బాగా చేస్తున్నావు. చాలా బాగుంటున్నాయి కానీ ఉదయాన్నే మిగిలిన అన్నాన్ని పడేస్తున్నా వా
అందుకు ఆమె…. లేదు అత్తయ్య నేను అన్నాన్ని వృధా చేయటం లేదు. అన్నని ఎండబెట్టి పప్పు గా రుబీ పొద్దున వడలుగా తయారుచేశాను.
అందుకే ఆమె చాలా ఆశ్చర్యపోతూ….. పొద్దున చేసిన వడలు అన్నంతో తయారుచేసిన ఎంత బాగా చేశావో తల్లి.
అన్నం విలువ తెలిసిన దాని లాగా ఉన్నావు
నిన్ను చూస్తుంటే నాకు చాలా ముచ్చటగా ఉందమ్మా. అంటూ ఆమె ను పొగుడుతూ అక్కడి నుంచి వెళ్లి పోతుంది అలా ఉండగా ఒక రోజు ఉదయాన్నే వైష్ణవి తన ఇంటి ముందు శుభ్రం చేస్తూ ఉండగా ఒక గర్భవతి అయిన కుక్క తన ఇంటి ముందుకు వచ్చి పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటుంది.
దాన్ని చూసిన ఆమె…. వెళ్ళు అటు వెళ్లి అరువు. అంటూ దాన్ని పక్కకు వెళ్లి అంటూనే తన మనసులో ….ఇంటి ముందు అరిస్తే
అరిష్టమని అంటారు ఈ కుక్క ఇలా అరుస్తుంది.
అంటూ కంగారు పడుతూ ఉండగా ఆమె మళ్ళీ…. పాపం దానికి ఎమన్నా గాయమైందా ఆ విధంగా అరుస్తుంది. అంటూ దాన్ని క్షుణ్ణంగా చూస్తుంది.
ఆమె…. ఈ కుక్కకి గాయం కూడా కాలేదు కానీ ఎందుకు అరుస్తుంది. పాపం చూస్తే గర్భవతి లాగా ఉంది. దీనికి వచ్చిన కష్టం ఏమిటో నాకు అర్థం కాలేదు.
అనుకుంటూ ఉండగా ఆ కుక్క…. నాకు చాలా ఆకలిగా ఉంద మ్మ. ఎవరి ఇంటి ముందుకు వెళ్లిన అందరు నన్ను చీదరించు కోని తరిమి కొడుతున్నారు. నా ఆకలి బాధనీ అర్థం చేసుకోండి. నీకు పుణ్యం ఉంటుందనీ అంటూ సైగ చేస్తూ ఉంటుంది దాని భావాన్ని అర్థం చేసుకో న్న కోడలు…. అయ్యో పాపం ఒక్క నిమిషం ఆగు నేను ఇప్పుడే నీ కోసం తినడానికి ఏమైనా తీసుకొస్తాను అని చెప్పి లోపలికి వెళ్లి భోజనాన్ని తీసుకొని వచ్చి
దాని ముందు ఉంచుతుంది. పాపం ఆ కుక్క చాలా ఆకలి మీద ఉండటంతో ఆ మొత్తాన్ని తింటుంది. అలా తిన్న తర్వాత తాను కడుపు నిండి ఆమెతో….. అమ్మ నీకు చాలా చాలా కృతజ్ఞతలు నా ఆకలి బాధను అర్థం చేసుకొని. నువ్వు నాకు సహాయం చేశావు. నీ మేలు మర్చిపోలేనమ్మ అంటూ కృతజ్ఞతలు చెప్పుకుంటుంది.
అప్పుడే వాళ్ళ అత్తయ్య బయటకు వచ్చి …. చాయ్ చాయ్ పో పో . అని దాన్ని తరిమి కొట్టడానికి కర్ర తీసుకుని వస్తూ ఉండగా. వైష్ణవి…. అయ్యో అత్తయ్య అది గర్భవతి పాపం తినడానికి ఏమీ లేక బక్కచిక్కి పోయింది. అరకొర ఊపిరితో ఉన్న దాన్ని మీరు కొడితే దాని ప్రాణాలు గాలిలో కలుస్తాయి. అలా చేయకండి అత్తయ్య అని అంటుంది.
ఇంతలో ఆ కుక్క…. మీకు మరోసారి కృతజ్ఞతలు అమ్మ నాకు చాలా భయంగా ఉంది నేను ఇక్కడినుంచి వెళ్ళిపోతున్నాను అంటూ అక్కడి నుంచి భయంతో పరుగులు తీస్తుంది.
అప్పుడు అత్తయ్య….. చి చి కుక్కల్ని అస్సలు
దగ్గరికి తీయకమ్మ . వాటికి విశ్వాసం ఉండదు. చూశావుగా ఎలా పరిగెడుతుందో
ఒకవేళ ఒక్కసారి అన్నం పెట్టడం మొదలు పెడితే గుంపులుగుంపులుగా వీధి కుక్కలన్ని
ఇక్కడికే వస్తాయి. అయినా అన్నని సరిపడ్డ
వండా కా పోవడం ఇంక నువ్వు నేర్చుకో లేదంటే నాకు ఆశ్చర్యంగా ఉంది ఇక రేపటి నుంచి నేనే భోజనం ని తయారు చేస్తాను అందరికీ సరిపడా కొంచెం కూడా మిగలదు.
అందుకు ఆమె….. సరే అత్తయ్య మీరే తయారు చేయండి కానీ కుక్కలు కి అన్నం పెట్టడం తప్పేమీ కాదని నా అభిప్రాయం అవి చాలా విశ్వాసం గా ఉంటాయి అత్తయ్య.
అందుకు ఆమె…. ఎంత విశ్వాసం గా ఉన్నా కుక్క తోక వంక రే తల్లి. చూస్తూ చూస్తూ ఉండగానే మీద పడి దక్కుతాయి ఎందుకొచ్చిన గొడవ నువ్వు కుక్కల జోలికి వెళ్లకు. ఈసారి అది వస్తే దాని కాళ్లు మాత్రం వేరే కొట్టేది కొట్టేది.
అందుకు ఆమె… అయ్యో తరిమేస్తే పోతుందిలే అత్తయ్య. మనం లోపలికి వెళ్దాం పదండి అంటూ ఆమెను తీసుకుని లోపలికి వెళ్ళి పోతుంది. ఆ రోజు నుంచి వంట పని అంత అత్తయ్య చేస్తూ ఉంటుంది.
ఆ మరుసటి రోజు ఉదయం ఎప్పటిలాగే వైష్ణవి పనులు చేస్తూ ఉండగా ఆ కుక్క అక్కడ వచ్చి….. అమ్మ నాకు కొంచెం అన్నం పెట్టావా ఆకలిగా ఉంది నేను ఇంకా ఇక్కడ ఎవరిని అడగను. మీరు తప్ప నాకు అన్నం పెట్టే వాళ్ళు కూడా ఎవరూ లేరు దయచేసి అన్నం పెట్టండమ్మా.
అందుకు ఆమె…. అయ్యో నువ్వు ఈ రోజు వస్తావని నాకు అస్సలు తెలియదు. అయినా ఇప్పుడు వంట పని అంతా మా అత్తయ్య చూసుకుంటుంది అన్నం అస్సలు లేదు.
ఏమీ అనుకోకు నేను ఇప్పుడు నీకు ఎలాంటి సహాయం చేయలేను.
అందుకు ఆ కుక్క…. మరేం పరవాలేదులే తల్లి నాకు దాహంగా ఉంది నీళ్లు అన్న ఇవ్వండి వాటితో కడుపు నింపు కుంటాను.
అందుకు ఆమె సరే అని చెప్పి వీళ్ళు తీసుకొచ్చి దాని ముందు ఉంచుతుంది పాపం ఆ కుక్క నీటితోనే దాని కడుపు నింపుకుంది దానిని చూసిన వైష్ణవి గుండె తరుక్కుపోయింది….. అయ్యో పాపం నాకు చాలా జాలి గా ఉంది ఈ కుక్కని చూస్తుంటే.
నేనేం చేయగలను అయ్యో భగవంతుడా అసలు నీ సృష్టే విచిత్రమైనది జీవుల్ని సృష్టిస్తావ్వూ.వాటికి జీవనాధారం కూడా ఇస్తే ఎంతో బాగుండేది ఏంటో నీ సృష్టి అంటూ అక్కడినుంచి లోపలికి వెళ్లి పోతుంది. ఆ కుక్క బాధపడుతూ అక్కడి నుంచి వెళ్లి పోతుంది. ఆ కుక్క పాపం ఒక చోట కూర్చుని….. అయ్యా భగవంతుడా ఎందుకు నన్ను ఇలా చేశావు ఎవరి ఇంటికి వెళ్లిన నన్ను చీదరించుకునే టారు. నన్ను కొడతారు. నేను ఎవరికీ ఏమి అన్యాయం చేశాను. కొందరి ధనవంతుల ఇంటిలో అందమైన కుక్కలు ఉంటాయి నన్ను కూడా ఆ జాతి లాగే పుట్టిస్తే వాళ్లు నన్ను కూడా పెంచుకునే వాళ్ళు కదా.
అప్పుడు నాకు ఇలాంటి ఆకలి బాధలు ఉండవు. ఏంటో నువ్వు అందరికీ న్యాయం చేస్తాం అని అందరూ అంటారు కానీ దాన్లో పరమార్ధం ఎవరికీ తెలియదు. నా బ్రతుకు మార్చు దేవుడా అంటూ బాధ పడుతుంది.
అలా ఆ రోజు గడిచి పోతుంది ఆ మరుసటి రోజు ఉదయం ఆ కుక్క వైష్ణవి ఇంటికి దగ్గరలో ఒకచోట పడుకొని నీదిరిస్తూ ఉంటుంది. అప్పుడే వైష్ణవి తన ఇంటి నుంచి బయటకు వచ్చి కొంత ఆహారం తీసుకొని ఆ కుక్క ముందు పెడుతుంది.
దాన్ని చూసిన కుక్క చాలా సంతోష పడుతూ. ఆవురావురంటూ దాన్ని తింటుంది.
వైష్ణవి దాన్ని చూసి చాల సంతోషపడుతూ… త్వరగా తిను మా అత్తయ్య వస్తే మళ్లీ నన్ను అరుస్తారు. అని అంటుంది అప్పుడే వాళ్ళ అత్తయ్య బయటకు వస్తుంది దాన్ని చూసి…. ఏంటమ్మా వైష్ణవి అన్నం దానికి పెడుతున్నావు అంటే రాత్రి నువ్వు తినకుండా వదిలింది దీన్ని కడుపు నింపడం కోసమేనా.
అందుకు ఆమె…. కాదు అత్తయ్య నిన్న ఎటు మిగిలింది కదా. ఆకలితో ఉంది కదా అని పడేసి అన్నాన్ని దీనికి పెట్టాను. అంతే కానీ కావాలని చేసింది మాత్రం కాదు.
అందుకు అత్తయ్య…. సరే త్వరగా ఇంట్లోకి రా పనులు చాలా ఉన్నాయి అని చెప్పి అక్కడ్నుంచి వెళ్లిపోతుంది.
వైష్ణవి సరే అంటుంది అప్పుడు ఆ కుక్క తో…. చూడు నీకు ప్రతిరోజు భోజనాన్ని నేను నీకు అందిస్తాను. నువ్వు ప్రతిరోజు రాత్రిపూట మా ఇంటి దగ్గరికి వచ్చి ఒకే ఒకసారి అరువు నేను కచ్చితంగా బయటకు వచ్చి. నీకు భోజనాన్ని అందిస్తాను .సరేనా ఇంక వెళ్తాను అని చెప్పి ఆమె అక్కడి నుంచి వెళ్లి పోతుంది.
అప్పుడు ఆ కుక్క తన మనసులో…. ఈమె ఎంత మంచిది తన కడుపు నింపుకోవడం కంటే నా కడుపు నింపడానికి ప్రయత్నిస్తుంది. భగవంతుడా వీళ్ళ కుటుంబాన్ని నువ్వే జాగ్రత్తగా చూడు స్వామి అంటూ ఆ భగవంతుని ప్రార్ధిస్తూ.
ఆ రోజు రాత్రి అందరూ భోజనం చేస్తారు వైష్ణవి వాళ్లకి వడ్డిస్తూ ఉంటుంది అలా అందరూ తిన్న తర్వాత వైష్ణవి భోజనం పెట్టుకొని కొంత తిని కొంత ఆ కుక్క కోసం దాచి ఉంచుతుంది.అలా కొంత సమయం తర్వాత ఆ కుక్క తన ఇంటి ముందుకు వచ్చి ఒకసారి పెద్దగా అరుస్తూ ఉంది. దాని అరుపులు విన్న వైష్ణవి బయటకు భోజనం తీసుకొని వచ్చి… ఇదిగో తిను త్వరగా తిని ఇక్కడినుంచి వెళ్ళు. మా అత్తయ్య చూస్తే అస్సలు బాగోదు. అని అంటుంది ఆ కుక్క చాలా అలా తొందరైతే ఆహారం తిని అక్కడి నుంచి వెళ్లి పోతుంది. ఆ తర్వాత వైష్ణవి కూడా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అలా ప్రతిరోజూ రాత్రి సమయం వైష్ణవి అర్థాకలితో ఉండి ఆ కుక్క యొక్క కడుపు నింపుతుంది.
అలా ఉండగా ఒకరోజు వైష్ణవి ఆ కుక్కకి భోజనాన్ని పెట్టి దాన్ని తిన్న తర్వాత ఆ ప్లేటు తీసుకుని ఇంట్లోకి వెళ్లి పోతుంది ఆ కుక్క తన ఆకలి తీర్చి కొన్ని వాళ్ళ ఇంటి దగ్గర్లోనే పడుకుంటుంది. అలా రాత్రి సమయం గడుస్తుంది వైష్ణవి ఇంటికి ఇద్దరు దొంగలు వెళ్తారు. అప్పుడు వైష్ణవి ఇంటి లోపల నుంచి… కాపాడండి ఎవరైనా మమ్మల్ని కాపాడండి దొంగలు దొంగలు వచ్చారు అంటూ కేకలు వేస్తారు. లోపల ఉన్న దొంగలు…. అరిచారు అంటే మీ అందరి నీ పొడి చంపేస్తాను. జాగ్రత్త అంటూ వారిని బెదిరిస్తూ ఉంటాడు అప్పుడే ఆ అరుపులు విన్న కుక్క… అయ్యో ఎవరో దొంగలు అంట వాళ్ళ పని చెప్తాను. అంటూ ఇంటికి వెళ్తుంది అక్కడ పెద్ద పెద్దగా అరుస్తూ వాళ్ళని భయపెడుతుంది ఆ దొంగలు ఆ కుక్కను చూసి…. ఉన్నట్టుండి ఇది ఎక్కడి నుంచి వచ్చింది రా బాబు. పిక్క పట్టుకుంటుంది అంటే బొడ్డు చుట్టూ ఇంజక్షన్లు చేసుకోలేక చావాలి. ఆ పతం నావల్ల కాదు రా బాబు పరిగెత్తు. అంటూ భయంతో అక్కడినుంచి పరుగులు తీస్తారు ఆ కుక్క కూడా వాళ్ల వెంబడి పరుగులు తీస్తూ తరిమికొడుతుంది. ఆ తర్వాత వైష్ణవి… చూశాను అత్తయ్య దానికి అన్నం పెట్టిన విశ్వాసానికి మనల్ని ఎంత ప్రమాదం నుంచి బయట పడే సింధో. సమయానికి అత్తయ్య నా భర్త కూడా లేరు. ఇప్పుడు మన ఇంటికి అదే యజమాని అయింది.
అత్తయ్య… నిజమే అమ్మ అది లేకపోతే ఆ దొంగలు ఎంత దుర్మార్గం చేసే వాళ్లు అని అనుకుంటుండగా . కుక్క అక్కడికి వచ్చి…. భయపడకండి అమ్మ నేను నీకు కాపలా ఉన్నాను. ఎవరు వచ్చినా నేను చూసుకుంటాను అని అంటుంది అత్తయ్య…. నిజంగా నీకు చాలా కృతజ్ఞతలు ఆ రోజు నిన్ను ఛీ కొట్టినా మళ్ళీ తిరిగి సహాయం
చేశావు నన్ను క్షమించు. ఇక ఈ రోజు నుండి చెప్తున్నాను నువ్వు మా ఇంట్లోనే ఉండు నీకు
కడుపునిండా భోజనం మేము అందిస్తాము.
అందుకు ఆ కుక్క చాలా సంతోష పడుతూ… భగవంతుడా ఇన్నాళ్ళకి నా మొర ఆలకించవా. చాలు తండ్రి చాలు . ఇక నేను నా కడుపులో ఉన్న పిల్లలు సంతోషంగా జీవిస్తాను అంటూ కంటతడి పెట్టుకుంటుంది ఇక ఆ రోజు నుంచి ఆ కుక్కని పెంపుడు కుక్క లాగా ఆ ఇల్లు పెంచుకుంటూ ఉంటుంది. అక్కడ వాళ్లతో పాటు ఆ కుక్క కూడా చాలా సంతోషంగా జీవిస్తుంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *