గర్భవతి కోతి జాలరి_ Telugu Stories- Stories in Telugu – Panchatantra Kathalu

అది ఒక సముద్ర తీరం. ఆ సముద్ర తీరం పక్కన ఒక చిన్న గ్రామం ఉండేది ఆ గ్రామం పేరు గుండవరం. ఆ గ్రామ ప్రజల వృత్తి చేపలు వేట. ఆ సముద్రతీరంలో చేపల వేటకు వెళ్లి చేపల్ని తీసుకొచ్చి వాటిని అమ్మి కుటుంబాన్ని గడిపే వాళ్ళు. అదే ఊర్లో ఉంటున్న రాజు మాత్రం ప్రతి రోజు మా ఊర్లో ఉంటున్నా చెరువు దగ్గరికి తన దగ్గర ఉన్న గర్భవతి కోతిని తీసుకొని అక్కడ చేపల వేటకు వెళ్ళేవాడు. అక్కడ ఆ గర్భవతి కోతి ఆ చెరువులో వలను విసిరి చేపల పడుతుంది రాజు కూడా ఆ చెరువులో వాళ్లను విసిరి చేపలు పడుతాడు. అలా వాళ్ళిద్దరూ ఆ చెరువులో చేపలను పట్టి వాటిని అమ్మి డబ్బు చేసేవాళ్ళు. అలా ఉండగా ఒక రోజు వాళ్ళిద్దరూ ఎప్పటిలాగే ఆ చెరువు దగ్గరికి వెళ్తారు. ఆరోజు వాళ్ళిద్దరికీ చేపలు వలలో పడవు. అందుకు రాజు…. ఏంటి ఈ రోజు ఒక్క చేప కూడా వలలో చిక్క లేదు. కోతి… అవును ఈ రోజు ఒక్క చేప కూడా పడలేదు ఎందుకు నాకు ఆశ్చర్యంగా ఉంది అని సైగ చేస్తుంది. వాళ్ళిద్దరూ అక్కడే చాలా సేపు ఉంటారు. కానీ నీ ఒక్క చేప కూడా ఇద్దరు చాలా నిరాశతో ఇంటికి వెళ్తారు. అక్కడ అతను బాధపడుతూ ఆ కోతితో…. ఏమైంది ఈ రోజు ఆ చెరువుకి చేపలని ఏమైపోయాయి.

కోతి…. నన్ను అడిగితే నాకేం తెలుస్తుంది. అని అంటుంది. ఇంతలో అతని భార్య అక్కడికి వచ్చి…. ఏమండీ ఎందుకు అలా దిగులుగా ఉన్నారు ఈ రోజు కాకపోతే రేపు పడతాయి. అందులో ఏముంది రండి ముందు వచ్చి భోజనం చేయండి. అందుకు అతను సరే అని చెప్పి భోజనం చేస్తాడు. ఆ కోతి కూడా భోజనం చేస్తూ ఉంటుంది అతని భార్య ఆ కోతితో… తిను తిను బాగా తిను నువ్వు బాగా తినాలి. ఎందుకంటే నువ్వు గర్భవతివి. ఎంత బాగా తింటే నీకు మరియు పుట్టబోయే బిడ్డకి అంత మంచిది. ఆ కోతి…. సరే అన్నట్టుగా తల ఊపి తింటూ ఉంటుంది ఆ రోజు గడిచి పోతుంది. ఆ మరుసటిరోజు కూడా ఇద్దరూ ఆ చెరువుకి చేపలు పట్టడానికి వెళ్ళారు. ఆరోజు కూడా ఒక్క చేప కూడా పడదు.వాళ్ళిద్దరికీ అసలు అక్కడ ఎందుకు చెప్పడంలేదు కూడా అర్థంకాక సతమతమవుతు ఇంటికి తిరిగి వస్తారు.
ఇంటి దగ్గర అతని భార్య …. ఏమైందండీ ఈరోజు కూడా ఒక్క చేప కూడా పడలేదా.
భర్త…. లేదు ఒక్క చేప కూడా పడలేదు అసలు ఎందుకిలా జరుగుతుందో నాకు అర్థం కాలేదు. భార్య…. ఏమండీ మీరు ఏమి అనుకోకపోతే నేనొక సలహా చెప్పనా.
భర్త…. చెప్పు రాదా.
రాధా….. ఏమండీ అందరూ సముద్రానికి చేపలవేటకు వెళ్తున్నారు. ఎప్పుడో గొడవ జరిగితే దాన్ని పట్టుకొని మీరు సముద్రానికి వెళ్లకుండా ఉండటం ఏం బాలేదు. ఈ చెరువులో చేపలు ఒకరోజు ఉంటే ఒక రోజు ఉండటం లేదు కదా. నా మాట విని మీరు కూడా సముద్రానికి వేటకి వెళ్ళండి.
అందుకు రాజు చాలా కోపంతో…. రాధా గొడవ సంగతి పక్కన పెడితే. నేను సముద్రానికి వెళ్లాలంటే అందరిలాగా పడవ ఉండాలి. నా స్నేహితుడు వేణు మనల్ని మోసం చేసి ఆ పడవని వా డి సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే కదా. వాడి మీద కోపంతో నేను సముద్రానికి వెళ్ళ నని చెప్పాను. ఎన్నో సంవత్సరాలుగా ఆ చెరువు మీద మనం ఆధారపడి ఉన్నాం. ఉన్నట్టుండి ఈ రెండు రోజుల్లో ఏమైందో నాకు అర్థం కాలేదు.అంటూ వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ఆ గర్భవతి అయిన కోతి ఆ ఇంట్లో నుంచి మళ్ళీ వలని తీసుకొని మళ్లీ ఆ చెరువు దగ్గరికి వెళ్లి వలన విసిరి. వాటి అంచులను ఒడ్డున ఒక కర్ర కట్టేస్తుంది. ఆ తర్వాత ఆ కోతి నడుచుకుంటూ వెళుతూ తన లో… అసలు ఎందుకు చేపల పడటం లేదొ నేను తెలుసుకోవాలి. అంటూ చెరువుకి అవతలిగట్టు వైపు వెళ్తుంది. అక్కడ ఒక వ్యక్తి చేపలకు చెరువులో మేతను వేస్తూ ఉంటాడు. అతను మేతను చెరువులో వేయడంతో చేపలన్నీ. ఆ మేత ని తినడం కోసం అక్కడికి వెళ్తున్నాయి. దానిని చూసిన కోతి చాలా ఆశ్చర్య పోయి తనలో… ఓహో ఇది అంతా నీ పనా. అయినా చేపల కి మేత వేయడం వల్ల మనకు వచ్చే లాభం ఏంటి ఇదంతా ఇతను ఎందుకు చేస్తున్నాడు. అని అనుకుంటూ ఉండగా ఆ వ్యక్తి చేపలన్ని ఆ మీద తింటున్న సమయంలో ఒక వలను వాటిపై విసిరి ఆ చేపలన్ని టిని బయటకు తీస్తాడు. అప్పుడు ఆ కోతి… ఓహో వీడు చేస్తున్న పని ఇదే న మాట. విడీ పని చెప్తా. అనుకుంటూ అతనికి కనపడకుండా ఒక చోట దాక్కుంటుంది. అతను ఆ వలలో చిక్కుకున్న చేపల నీటిని ఒక గోతం లో పెట్టి. మళ్లీ ఆ వలని తీసుకొని చెరువు దగ్గరికి వెళ్తాడు. మళ్లీ అతను మేతను చెరువులోకి వేసి చేపల కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఇంతలో ఆ కోతి ఆ చేపలు ఉన్న గోతం దొంగిలించి తీసుకుని అక్కడ నుంచి తన ఇంటికి వెళ్తుంది. ఇంటి దగ్గర ఆ చేపల్ని చూసిన రాజు అతని భార్య ఆశ్చర్యపోతారు అప్పుడు రాజు ఆ కోతితో… ఈ చేపలు నీకు ఎక్కడి నుంచి వచ్చాయి. అని అడగ్గా ఆ కోతి… ఈ చేపల నీ నేను చెరువు దగ్గర నుంచి తీసుకు వచ్చాను. వీటన్నిటినీ ఒక వ్యక్తి మన కంటే ముందుగా వెళ్లి చెరువులో చేపలు కు మేత వేసి వాటిని పట్టుకుని ఉన్నాడు అని అతనికి పూర్తిగా అర్థమయ్యేలాగా చెప్తుంది.
ఆ మాటలు విన్న రాజు…..అవునా కానీ అందరూ సముద్రంలో వేటకు వెళ్తారు కదా చెరువులో చేపల వేటకు వచ్చే వ్యక్తి ఎవరబ్బా
అని అనుకుంటాడు. అతని భార్య… ఏవండీ ఈ చేపలు మనకెందుకు అతను ఏదో కష్టజీవి లా ఉన్నాడు. లేకపోతే సముద్రం లోకి వెళ్లకుండా చెరువు దగ్గరికి ఎందుకు వస్తాడు.
అతనికి ఇష్టం మనకెందుకు అతని చేపలు అతనికి ఇచ్చేయండి.
భర్త….. నువ్వు అన్నది కూడా నిజమే. ఈ కోతి తెలిసీ తెలియకుండా పాపం అతని దగ్గర నుంచి వీటిని తీసుకొచ్చినట్టు ఉంది. ఇప్పుడు నేను వెళ్లి అతనికి ఇచ్చి వస్తాను. అని చెప్పి ఆ కోతిని కూడా తీసుకొని ఆ చేపలను అతనికి తిరిగి ఇవ్వడానికి ఇద్దరు వెళ్తారు.
వీళ్లిద్దరు అక్కడికి వెళ్లేసరికి ఆ వ్యక్తి అక్కడ ఉండదు. చేసేదేం లేక రాజు ఆ చేపల్ని తీసుకుని అమ్మి డబ్బులు తెచ్చుకుంటాడో.
ఆ మరుసటి రోజు ఉదయం గర్భవతి కోతి మరియు రాజు ఇద్దరు కలిసి మళ్లీ చెరువుకు వెళ్తారు. చెరువుకి అవతల గట్టున నిలబడి ఆ వ్యక్తి చేపలు పడుతూ రాజుకి కనిపిస్తాడు రాజు కోతి తో…. నువ్వు ఇక్కడే ఉండు ఆ వ్యక్తి అక్కడ చేపలు పడుతున్నాడు నేను అతని దగ్గరికి వెళ్లి జరిగింది చెప్పి అతని డబ్బు అతనికి ఇచ్చేస్తాను అని చెప్పి అక్కడికి వెళ్తాడు అప్పుడు ఆ వ్యక్తి తనతో తాను ….. నిన్న ఎవరు నా చేపల ను దొంగిలించి తీసుకువెళ్లారు. వాళ్ళు ఎవరో కానీ నా కంట పడితే. నా చేతిలో చచ్చారే. అనుకుంటూ ఉంటాడు ఇంతలో రాజు అతను సరిగ్గా గమనిస్తాడు అతను ఎవరో కాదు తన బద్ధ శత్రువు అయినా వేణు. రాజు చాలా ఆశ్చర్యంగా వేణు తో….. ఏరా వేణు నువ్వు ఇంకా మారలేదా. అని అంటాడు అందుకు వేణు…. ఓ రాజు నిజమేంటో తెలిసిపోయిందా.
రాజు .. అవును నీ కుట్ర ఏంటో నాకు అంత అర్థమైంది.
వేణు… ఏం అర్థమైంది నీకు.
రాజు…. ఒకసారి ఊరి ప్రజల ముందు నన్ను దొంగని చేశావు. అన్యాయంగా నా పడవ నీది అని చెప్పి పి నీ సొంతం చేసుకున్నావు ఇప్పుడు నాకు వచ్చే నాలుగు రూపాయలు కూడా నీ సొంతం చేసుకోవాలనుకుంటున్నావా.
వేణు…. అవును కావాలనే నేను ఈ చెరువులో మెత్తని వేసి చేపను పడుతున్నాను అప్పుడు ఒక చేప కూడా నీ వల లో చిక్కదు కదా. అప్పుడు నీకు ఆదాయం ఉండదు నీ కుటుంబం రోడ్డును పడుతుంది అదే నాకు కావాలి.
రాజు…. కానీ అలా చేయడం వల్ల నీకేం లాభం
ఎందుకు నాపై ఇంత పగ పట్టావు అసలు నీకు నేను ఏమి అన్యాయం చేశాను.
వేణు … ఎందుకంటే నేను ప్రాణంగా ప్రేమించిన రాదని నువ్వు పెళ్లి చేసుకున్నావు.
రాధ నన్ను కాదని నిన్ను పెళ్లి చేసుకోవడం నాకు నచ్చలేదు. అందుకే మీ ఇద్దరి పై పగ తీర్చుకోవాలి అనుకున్నాను. అందుకే ఆ రోజు
నా చేపల మూటని మరో ఇద్దరి చేపలు మూటని నీ పడవలో పెట్టి అందరి ముందు నిన్ను దొంగలే చేశాను. నా పడవ కి నేనే నిప్పంటించుకొని నువ్వే దానిని అంతా చేసావ్ అని అందరినీ నమ్మించి దానికి బదులుగా నీ పడవ ని నా సొంతం చేసుకున్నాను. ఇంతటితో ఆగను నిన్ను పూర్తిగా అంతం చేసేంతవరకు వాదనను.అని అంటాడు ఆ మాటలు విన్న రాజు కి చాలా కోపం వేసి అతని కొట్టడానికి సిద్ధపడతాడు. అలా ఇద్దరూ గర్షణ పడుతూ ఉండగా. దానిని అంతా చూస్తున్న కోతి చాలా కంగారు పడుతూ…. అయ్యో రాజు అను ఆ వ్యక్తి ఇద్దరు కొట్టుకుంటున్నారు. అయ్యో ఏం జరుగుతుందో నాకు చాలా భయంగా ఉంది అంటూ అతని దగ్గరికి వెళుతుంది. వేణు రాజు ని చంపడం కోసం కత్తిని బయటకు తీస్తాడు. వేణు రాజు ని చంప బోతుండగా. రాజు వేణు చేతిలో ఉన్న కత్తిన తొలగించే ప్రయత్నం చేస్తాడు ఆ ఘర్షణలో ఆ కత్తి వేణు పొట్టలో దిగ బడుతుంది. వేణు…. అమ్మ అంటూ పెద్దగా అరిచి కింద పడి చనిపోతాడు.
ఆ దృశ్యాన్ని చూసిన రాజు చాలా కంగారు పడుతూ…. లేదు నేను హత్య చేయలేదు. నేను హత్య చేయలేదు అంటూ అరుస్తూ ఉంటాడు. ఆ కోతి కి ఏం చేయాలో అర్థం కాదు. ఆ కోతి రాజు తో…. అయ్యో రాజు ఇందులో నీ తప్పేమీ లేదు. పొరపాటున అతన్నీ అత నే పొడుచుకుని చనిపోయాడు. నువ్వు కంగారు పడకు. అని సైకల్ చేస్తూ ఉంటుంది. ఇంతలో ఒక ఆమె నీటికోసం ఒక బుంగ నీ తీసుకుని అక్కడికి వస్తుంది. ఆమె రాకను గమనించిన కోతి వేణు పట్ల ఉన్న కత్తి ని పట్టుకుని బయటకు తీసి మళ్లీ అతని పొట్టలోనే గట్టిగా గుచ్చు తుంది ఆ దృశ్యాన్ని చూసిన ఆమె…. అయ్యబాబోయ్ కోతి మనిషి ని చంపింది అంటూ పెద్ద పెద్దగా అరుస్తూ
అక్క డ నుంచి వెళ్లిపోతుంది.
రాజు…. ఏంటి నువ్వు చేసింది. నాకు ఏమీ అర్థం కావట్లేదు.
కోతి…. నేను నిన్ను కాపాడటం కోసమే ఇలా చేశాను. ఇప్పుడు ఇతని చంపలేదు అని చెప్పిన ఎవ్వరూ నిన్ను నమ్మరు. అందుకే నేను ఇలా చేశాను. అంటూ అక్కడి నుంచి పిచ్చి పట్టిన దానిలాగా కత్తిని తీసుకుని ఊర్లోకి. అప్పటికి ఆమె కోతి మనిషిని చంపడం గురించి అందరికీ చెప్తుంది. ఆ విషయం ఊరిపెద్ద కూడా తెలుస్తుంది.
ఇంతలోనే ఆ కోతి రోడ్డుపైన కత్తి తీసుకుని మనుషుల్ని చంపుతున్ననట్టుగా బెదిరిస్తూ ఉంటుంది. దాన్ని చూసిన ఊరి పెద్ద ప్రజలంతా…. రాజు కోతికి పిచ్చి పట్టి మనుషుల్ని చంపుతుంది. దీనిని ఇట్లాగే వదిలేస్తే చాలా ప్రమాదం. దీన్ని తరిమికొట్టండి
అంటూ కర్రలతో రాళ్లతో ఆ కోతిని ఊర్లో నుంచి తరిమి కొడతారు. ఆ కోతి అక్కడ్నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళి పోయి ఎన్నో గాయాలతో చాలా బాధ పడుతూ ఒక చెట్టు పై కూర్చొని…. భగవంతుడా జరిగిన నిజం ఏంటో నీకు తెలుసు. నేను మా రాజు ని కాపాడటం కోసమే ఇలా చేశాను. నేను చేసింది తప్పు కాదు కదా అంటూ కన్నీళ్లు కారుస్తు ఎంతో బాధపడుతూ ఆ కోతి మరణిస్తుంది. అక్కడ రాజు తన భార్యతో జరిగిన విషయం అంతా చెప్తాడు. అదంతా విన్న రాదా…. భగవంతుడు ఏంటి ఇలా జరిగింది. పాపం అభం శుభం తెలియని ఆ కోతికి ఎన్నో గాయాలయ్యాయి ఎప్పుడు ఎక్కడ ఉందో ఎలా ఉందో స్వామి నువ్వే ఆ కోతిని కాపాడాలి. అంటూ దేవుని ప్రార్ధిస్తుంది.
కొంత సమయం తర్వాత ఆమె అతనితో… కానీ నీ ఆ కోతి చేసిన పని వల్ల నీ ప్రాణం నిలబడింది. ఎందుకంటే ఆ వూరి కట్టుబాట్ల ప్రకారం మిమ్మల్ని కూడా చెట్టుకు ఉరి వేసి చంపేసే వాళ్ళు. అలా కాకుండా ఆ భగవంతుడు ఆ కోతి రూపంలో ఇలా చేశాడు లేదంటే. ఒక్కసారిగా ఆమె అక్కడకు రావడం ఏంటి ఆ కోతి ఆలోచనతో కత్తిని అతని పొట్టలోకి పొడవడం ఏంటి అంతా దేవుని కృప. ఆ దేవుడే కోతి లాగా మనల్ని కాపాడాడు. అని అనుకుంటారు ఆ తర్వాత ఇద్దరు దేవుడికి ఆ కోతికి కృతజ్ఞతలు చెప్పుకుంటారు. ఈ కథ గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *