గర్భవతి కోతి తల్లి_ Telugu Stories- Stories in Telugu – Panchatantra Kathalu

అది ఒక చిన్న గ్రామం ఆ గ్రామంలో సంతోష్ సుకన్య అనే దంపతులు ఉండేవాళ్ళు. సుకన్య గర్భవతి ఆమె ప్రసవవేదన పడి ఒక మగ బిడ్డకు జన్మనిచ్చి ఆమె చనిపోతుంది. ఆ బిడ్డకి వినయ్ అని పేరు పెట్టి చాలా చక్కగా చూసుకునేవాడు.

అలా రోజులు గడిచాయి సంతోష్ కి కూడా జబ్బు చేసి అతను మరణిస్తాడు. పాపం ఇప్పుడు వినోద్ ఒక్కడే ఒంటరి వాడై పోతాడు . అందుకొని ఆ గ్రామ ప్రజలందరూ
అతనికి ప్రతిరోజు ఆహారం అందిస్తూ ఉండేవాళ్ళు అలా రోజులు గడిచాయి. అతను కొంచెం పెద్దవాడయ్యాడు. పెద్దవాడు అయిన తర్వాత వినయ్ ని అందరూ వాళ్ల పనుల కోసం వాడుకునే వాళ్ళు. అలా వాళ్ళ అవసరం తీర్చుకొని అతనికి తినడానికి ఏమీ ఇచ్చేవాళ్ళు కాదు. అలా మూడు రోజులు గడుస్తాయి వినయ్ కి తినడానికి తిండి లేని కారణంగా. ఏడుస్తూ తన తల్లిదండ్రుల ఫోటోలు ముందు నిలబడి …. అమ్మ నాన్న
మీరు నన్ను ఒంటరి వాని చేసి వెళ్ళిపోయారు. నాకు ఎవరు ఉన్నారు ఇప్పుడు. ఊరు ప్రజలంతా నేను పెద్దవాడిని నన్ను పట్టించుకోవడం లేదు.వాళ్ల అవసరానికి పనులకు వాడుకుంటున్నారు నేను ఏం చేయాలో అర్థం కావట్లేదు నాకైతే ఆకలిగా ఉంది అమ్మ అంటూ ఏడుస్తూ బాధపడతాడు కొంత సమయం తర్వాత. అతను బయటికి వెళ్లి తన ఊరి పెద్దాయన అమృత రావు దగ్గరికి వెళ్తాడు. అక్కడ అమృత రావు తో….. అయ్యా నాకు చాలా ఆకలిగా ఉంది. నాకు తినడానికి ఏమైనా పెట్టండి. నేను తిండి తిని మూడు రోజులు అవుతుంది ఆకలికి తట్టుకోలేక పోతున్నాను. అందుకు ఆ ఊరి పెద్ద… చూడు వినయ్ నువ్వు చిన్నగా ఉన్నప్పుడు అందరు సహాయం చేశారు ఇప్పుడు పెద్ద వాడివి అయ్యావ్వు. కాబట్టి నువ్వే కష్టపడి తిండి సంపాదించుకోవాలి. అర్థమైందా.
అందుకు అతను అర్థమైంది అంటూ పని కోసం వెళతాడు. కానీ ఎక్కడా పని దొరకదు. ఇంతలో ఒక ఆమె వినయ్ దగ్గరకు వచ్చి…. చూడు వినయ్ మా ఇంట్లో పని ఉంది. కట్టలు కొట్టాలి. నువ్వు గనక ఆ కట్టెలు కొట్టి నాకు ఇచ్చావు అంటే నీకు తినడానికి నేను ఆహారం అందిస్తాను. అందుకు వినయ్ చాలా సంతోషపడుతూ….. తప్పకుండా చేస్తాను అమ్మ అంటూ ఆమెతోపాటు ఇంటికి వెళ్తాడు.
అక్కడ చాలా కట్టెలు కొట్టి అక్కడ పెట్టి తిరిగి ఆమెతో….. అమ్మ కట్టెలు అన్నిటినీ కొట్టేశాను. నాకు తినడానికి ఏమన్నా ఇవ్వండి ఏమైనా పర్వాలేదు.
అందుకు ఆమె సరే అని చెప్పి ఇంట్లో ఉన్న భోజనం తీసుకువచ్చి పెడుతుంది. ఆకలి మీద ఉన్న వినయ్ ఆ భోజనం నీ నోట్లో పెట్టుకున్నాడు. అతను నోట్లో పెట్టుకుని వెంటనే…. తు ఛి అమ్మ ఈ ఆహారం పాడైపోయింది తినడానికి చాలా ఇబ్బందిగా ఉంది. అస్సలు బాలేదమ్మా.
అందుకు ఆమె….. నా దగ్గర అదే ఉంది నీకు ఇష్టమైతే తిను లేదంటే ఇక్కడి నుంచి వెళ్ళిపో. నాణ్యంగా కావాలంటే ఎక్కడ నుంచి వస్తుంది అని కోపంగా విసుక్కుంటుంది.
అందుకే అతను చాలా బాధపడుతూ అక్కడనుంచి వెళ్ళి పోతాడు. అతను నడుచుకుంటూ ఊరి చివర ఉన్న అడవి లోకి వెళ్తాడు. అక్కడ ఒక అందమైన ఇల్లు ఒక పెద్ద చెట్టు ఉంటుంది. ఆ ఇంట్లో వినయ్ ఎవరన్నా ఉన్నారేమో అని చెప్పి తలుపులు కొడుతూ…. అమ్మ ఎవరైనా ఉన్నారా అమ్మ ఎవరైనా ఉన్నారా అంటూ పిలుస్తాడు కానీ అక్కడ ఎవరూ ఉండరు. వినయ్….. ఇక్కడ కూడా ఎవరూ లేరు. అనుకుని ఏడుస్తూనే ఉంటాడు ఇంతలో అక్కడే ఉన్న ఒక గర్భవతి అయిన కోతి అతని దగ్గరకు వచ్చి…. ఎవరు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు. ఏం కావాలి నీకు. ఎందుకు ఏడుస్తున్నావ్ అంటూ సైగ చేస్తుంది. ఆ కోతి సైకల్ ని అర్థం చేసుకున్నా వినయ్ ఏడుస్తూ….. నాకు చాలా ఆకలిగా ఉంది తిండి తిని మూడు రోజులు అవుతుంది. అందుకు ఆ కోతి….. అదేంటి ఎందుకు మీ అమ్మ నాన్న నిన్ను ఏమన్నా అన్నారా.
వినయ్…. లేదు లేదు మా అమ్మానాన్న ఏమీ అనలేదు ఎందుకంటే అసలు వాళ్ళు ఏమన్నా అనడానికి ఉంటేనే కదా. వాళ్లు నా చిన్నప్పుడే చనిపోయారు. అందుకే ఆ కోతి చాలా బాధ పడుతూ…. అయ్యో పాపం అలా అడిగినందుకు ఏమీ అనుకోకు.
వినయ్…. ఇందులో అనుకోడానికి ఏం లేదు. చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోయారు ఊరు వాళ్ళు నాకు చాలా వాటికి సహాయం చేశారు కానీ ఇప్పుడు ఎవరు నాకు సాయం చేయడం లేదు. నాకు చాలా ఆకలిగా ఉంది నువ్వు అన్న నాకు సహాయం చెయ్యి అని అంటాడు.
అందుకు ఆ కోతి అతనిపై జాలిపడి….. ఒక్క నిమిషం ఆగు అంటూ ఆ ఇంటి లోపలికి వెళ్లి అక్కడ ఉన్న రకరకాల పండ్లను తీసుకొచ్చి ఇస్తుంది. ఆకలి మీద ఉన్న వినయ్ వాటిని ఆవురావురుమంటూ తింటాడు. తిన్న తర్వాత అతను ఆ కోతితో…. నీకు చాలా కృతజ్ఞతలు నీకు ఈ జన్మంతా రుణపడి ఉంటాను. నువ్వు నా ఆకలి తీర్చిన తల్లి వి. అంటూ కంటతడి పెట్టుకుంటాడు అందుకు ఆ కోతి…. బాధపడకు నీకు ఎప్పుడు ఏ అవసరం ఉన్నా. ఇక్కడికి రా .
అందుకు వినయ్….. తప్పకుండా వస్తాను నాకు ఇప్పుడు మీరు తప్ప ఎవరు సహాయం చేసే వారు లేరు.
అందుకే ఆ కోతి…. సరే సరే బాధపడకు. ఇకనుంచి నేను పున్నాగా అని సైగ చేస్తూ సద్దు చెప్తుంది. అందుకు వినయ్ సరే అని…. అవును ఈ ఇల్లు ఎవరిది ఈ ఇంట్లో ఎవరు ఉండేవాళ్ళు. అందుకా కోతి చాలా ఏడుస్తూ… ఇల్లు మా యజమాని ది అతను నన్ను చాలా బాగా చూసుకునే వాడు. ఈ మధ్యన కన్నుమూసాడు నేను ఒంటరి దాన్ని గా మిగిలిపోయాను అంటూ సైగ చేస్తుంది. అందుకు వినయ్…. అవునా బాధపడకు నేనున్నా కదా. ఈరోజు నుంచి నువ్వే నాకు తల్లి తండ్రి స్నేహితుడు అన్ని. అంటాడు అలా వాళ్లిద్దరూ చాలాసేపు మాటలు చెప్పుకొన్న తర్వాత రాత్రి సమయం కావడంతో అతను అక్కడనుంచి వెళ్ళి పోతాడు. వినయ్ ప్రతిరోజు ఆ అడవిలోకి వెళ్లి ఆ కోతి ఇచ్చే ఆహార పదార్థాలు తింటూ తన జీవితాన్ని గడుపుతూ ఉంటాడు అలా రోజులు గడిచాయి. ఆ కోతి కి వినయ్ పైన చాలా ప్రేమ కలుగుతుంది. వినయ్ ని సొంత కొడుకు లాగే భావిస్తూ. ఎంతో ప్రేమతో చూసుకునేది అలా రోజులు గడిచాయి ఒకరోజు వినయ్ ఆ కోతి దగ్గరికి రాడు. అప్పుడు ఆ కోతి అతని కోసం ఎదురు చూస్తూ తనలో……. ఏమైంది ఈరోజు వినయ్ కి ఇంకా రాలేదు. ఒకసారి ఇంటికి వెళ్లి చూస్తే సరిపోతుంది అని అనుకొని తన ఇంటికి బయలు దేరుతుంది. ఆ ఇంట్లో వినయ్ జ్వరం తో పడుకుని ఉంటాడు. అతన్ని చూసిన కోతి చాలా బాధ పడుతూ….
అయ్యో వినయ్ నీకు జలుబు చేసిందా అంటూ బాధపడుతుంది. ఆ కోతి అక్కడే ఉంటూ అతని చూసుకుంటూ తనకు కావలసిన ఆహారాన్ని తీసుకొచ్చి అతనికి తినిపిస్తూ ఉంటుంది. అలా ఆ కోతి అక్కడే ఉంటూ ఇంటి బయట శుభ్రం చేయడం వినయ్ యొక్క బట్టలు ఉతకడం. లాంటి పనులు చేస్తూ ఉంటుంది. దాన్నంతా చూస్తున్నా ఊరి ప్రజలు….. అరే ఎక్కడిది ఈ కోతి వినయ్ ఇంట్లో ఉంటూ చక్కగా ఇంటి పని చేస్తుంది ఇది అంటూ ఆశ్చర్యపోతారు. ఆ పని చేసిన తర్వాత ఆ కోతి తిరిగి మళ్ళీ తన ఇంటికి వెళ్లి పోతుంది.వినయ్ కొంచెం ఆరోగ్యం కుదుటపడి ఇంటి నుంచి బయటికి వస్తాడు అప్పుడు అతన్ని…. వినయ్ ఆ కోతినీ ఎక్కడనుంచి తీసుకొచ్చావు భలే చక్కగా ఇంటి పనులన్నీ చేస్తుంది. ఏదో మాయ మంత్రం వేసావే. నిజం చెప్పు మంత్రాలు కూడా నేర్చుకుంటున్నావా ఏంటి.
అని అడుగుతాడు అందుకు అతను….. మాయా లేదు మంత్రం లేదు ఆ కోతి నన్ను కన్న బిడ్డ లాగా చూసుకుంటుంది. ఊరివాళ్లంతా నా అవసరం ఉన్నంత వరకే నాతో ఉంటున్నారు. ఆ తరువాత నన్ను పట్టించుకోవడం లేదు. ఇప్పుడు ఆ కోతి నన్ను బాగా చూసుకుంటుందని మళ్లీ నాపై మాయలు మంత్రాలు అని చెప్పింది వేస్తున్నారా. మీకంటే ఆ నోరులేని జీవ మే చాలా గొప్పది అంటూ కోపంగా అక్కడినుంచి కోతి దగ్గరికి వెళ్తాడు. దీనిని చూసిన కోతి చాలా సంతోష పడుతూ….. రా వినయ్ నీ ఆరోగ్యం అంతా కుదుట పడింది కదా. ఇన్ని రోజులు నీకు ఏమవుతుందో అని భయపడ్డాను ఆ భగవంతుడు నా మొర విన్నాడు. అందుకు వినయ్…… మీ మాతృప్రేమను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. నా తల్లి ప్రేమ ఎలా ఉంటుందో నేను చూడలేదు. కానీ మీరు చూపించే ప్రేమ చూస్తుంటే తల్లి ప్రేమ అంటే ఇదేనేమో అనిపిస్తుంది మీకు చాలా కృతజ్ఞతలు. అంటూ కంటతడి పెట్టుకుంటాడు. ఆ కోతి కూడా….. ఏం పర్వాలేదు బాధపడకు నేను మీ అమ్మని అనుకో అమ్మ అని పిలువు నన్ను కూడా.
అని అంటుంది. అప్పుడు వినయ్….. అమ్మ నాకు ఆకలిగా ఉంది తినడానికి ఏమన్నా పెట్టు అని ప్రేమగా అడుగుతాడు. అప్పుడు ఆ కోతి ఈ తినడానికి రకరకాల పండ్లు తీసుకు వచ్చి అతనికి ఇస్తుంది. వాటిని ప్రశాంతంగా అతను తిన్నాడు. కోతి…. సరే బాబు నువ్వు కొంచెం సేపు విశ్రాంతి తీసుకో అని అంటుంది అందుకు అతను సరే అని చెప్పి అక్కడే విశ్రాంతి తీసుకుంటాడు. ఆ కోతి అతని తల నిమురుతూ అత న్ని నిద్ర పుచ్చుతుంది.
అలా ఆ రోజు కూడా గడిచిపోయింది.
ఆ మరుసటి రోజే వినయ్ కోతి దగ్గరకు వచ్చి…. అమ్మ నేను కూడా ఈరోజు నుంచి ఇక్కడే ఉంటాను మా ఊరిలో నివసించడం నాకస్సలు ఇష్టం లేదు. నేను కూడా నీతో పాటే ఉంటాను.
అప్పుడా కోతి…. సరే బాబు నీ ఇష్టం నువ్వు ఇక్కడ ఉంటే నాకు కూడా చాలా సంతోషంగా ఉంటుంది.నువ్వు ప్రతిరోజు అక్కడ నుంచి ఇక్కడికి రావడం కూడా నీకు ఇబ్బందే కదా.
అదే నువ్వు గనక ఇక్కడే ఉండి పోతే ఎలాంటి బాధ ఉండదు నేను జాగ్రత్తగా చూసుకుంటాను.
అందుకే వినయ్…. సరే అమ్మ నేను ఇప్పుడే నా బట్టలు సర్దుకుని ఇక్కడికి వచ్చేస్తాను. ఆ కోతి…. సరే నేను కూడా వస్తాను నీకు కొంచెం తోడుగా ఉంటుంది కదా పనుల్లో సహాయం చేస్తాను. ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఆ ఇంటికి వెళ్తారు అక్కడ బట్టలన్నీ సర్దుకుని బయటకు వస్తూ ఉండగా ఊరి పెద్ద చూసి ,…. ఎక్కడికి వెళ్తున్నావు వినయ్.
వినయ్…. నాకు ఇక్కడ ఉండడం ఏ మాత్రం ఇష్టం లేదు. అందరూ నామీద స్వార్థబుద్ధి చూపించారు నేను వెళ్ళిపోతాను. ఇదిగో ఈమె నా తల్లి అంటూ అతను చూపిస్తాడు ఆ కోతి ఆనందభాష్పాలతో అతనిని తీసుకొని
అక్కడి నుంచి అడవిలో ఉన్న ఇంటికి వెళ్లి పోతారు. ఆ రోజు నుంచి కోతి మరియు వినయ్ ఇద్దరూ అక్కడే సంతోషంగా వాళ్ళ జీవితాలు గడుపుతారు. ఆ విధంగా అక్క గర్భవతి కోతి వినయ్ తల్లి గా మారి తన బాగోగులు చూసుకుంటూ ఉంటుంది తల్లి ప్రేమ అంటే ఇదే కాబోలు. ఈ కథ గనుక మీకు నచ్చినట్లైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి.
.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *