గర్భవతి కోతి దీపావళి పండుగ_ Telugu Stories- Stories in Telugu – Panchatantra Kathalu

అది ఒక అందమైన గ్రామం. ఆ గ్రామంలో శివయ్య వీరయ్య అనే ఇద్దరు వ్యక్తులు ఉండే వాళ్ళు ఇద్దరు కూడా ప్రతిరోజు

బట్టలు ఇస్త్రీ చేస్తూ వచ్చిన డబ్బుతో కుటుంబాన్ని గడుపుతూ ఉంటారు. అలా ఉండగా ఒక రోజు ఒక చెట్టు దగ్గర ఇద్దరు బట్టలను ఇస్త్రీ చేస్తూ ఉంటారు ఆ చెట్టుపైన ఒక గర్భవతి అయిన కోతి…. ఎన్నో రోజుల నుంచి వీళ్ళని చూస్తున్నాను. వాళ్లు ఆ బట్టల పై ఇస్త్రీ చేయడం చాలా సరదాగా ఉంది. నాకు కూడా అలాగా చేయాలని ఉంది. కానీ ఆ అవకాశమే రాలేదు. అనుకుంటూ బాధపడుతుంది. ఇంతలో వీరయ్య ఇస్త్రీ చేసిన బట్టలు తీసుకొని వాటిని ఇవ్వడానికి వెళ్తాడు. అదే మంచి అవకాశంగా భావించి నా కోతి భయం భయంగా కిందకి వస్తుంది ఆ కోతి
ఆ బట్టలు తీసుకొని ఇస్త్రీ చేస్తుండగా అప్పుడే వీరయ్య ….. ఉష్ ఉష్ పో పో మాయదారి కోతి. బట్టలు నాశనం చేయడానికి వస్తావా అంటూ కర్రతో దాన్ని కొడతాడు. పాపం ఆ కోతి చాలా బాధపడుతూ అక్కడినుంచి చెట్టు ఎక్కుతుంది. దానంత చూస్తున్నా శివయ్య..అరే వీరయ్య ఎందుకు ఆ కోతి అలా కొట్టావ్ పాపం చూడు అది ఎంత బాధ పడుతుందో. వీరయ్య… బాధపడితే పడ ఇవ్వు ఇక్కడ ఉన్న బట్టల కి ఏమన్నా అయితే జనం నా తాట తీస్తారు. అందుకు శివయ్య సర్లే అన్నట్టుగా అక్కడనుంచి వెళ్ళి పోతాడు. ఆ కోతి వాళ్ళిద్దరి మధ్య సంభాషణ విని ఊరకనుండి పోతుంది. అలా రోజులు గడిచాయి ఒకరోజు శివయ్య ఇస్త్రీ చేసిన బట్టలు యజమానికి ఇచ్చి వద్దాం అని తన ఇంటికి వెళ్తాడు. ఇంతలో ఆ కోతి …. ఈ మనిషి ఎక్కడికో వెళ్ళాడు. నేను వెళ్లి ఆ బట్టలు ఇస్త్రీ చేస్తాను, నా సరదా తీర్చుకుంటాను. అని అక్కడికి వచ్చి ఆ బట్టలు ఇస్త్రీ చేస్తూ ఉంటుంది దాన్ని అంతా చూస్తున్నా. వీరయ్య…. ఆ బాగా అయింది. ఆ శివయ్య మొన్న ఏదో పెద్ద నీతులు మాట్లాడా డుగా. ఇప్పుడు తెలుస్తుంది ఆ బాధ ఏంటో ఆ కోతి ఆ బట్టలన్నీ ఇస్త్రీ పెట్టె తో కాల్చి నాశనం చేస్తే ఇక ఊరివాళ్లంతా వాడిపై భగ్గుమన్నా టారు ఇక బేరం అంత నా సొంతం అవుతుంది. నాకు పోటీ లేకుండా పోతుంది.
అని అనుకుంటాడు ఇంతలో శివయ్య రానే వస్తాడు శివయ్య ఆ కోతి ని చూసి…. అయ్యో అయిపోయింది అంతా అయిపోయింది ఆ బట్టలన్నీ కాల్చి ఉంటది ఆ కోతి. ఈరోజుతో నా పని అయిపోయింది అంటూ వెళ్లి ఆ బట్టలను చూస్తాడు. ఆ బట్టలను ఆ కోతి చాలా చక్కగా ఇస్త్రీ చేస్తుంది. దాన్ని చూసిన శివయ్య ఆశ్చర్యపోయి… అరే భలేగా చేసావే. నేను ఒకటి అనుకుంటే నువ్వు ఇంకొకటి చేశావు చాలా బాగా చేశావు అంటూ ఆ కోతిని మెచ్చుకుంటాడు. ఆ కోతి చాలా సంతోషపడుతుంది. దానంత చూస్తున్నా విరయ్య కూడా ఆశ్చర్యపోతాడు. అప్పుడు శివయ్య ఆ కోతితో…. సరే నువ్వు నాతో పాటు వచ్చావంటే నీకు మూడు పూటల బువ్వ పెడతాను. చక్కగా నా దగ్గరే ఉంటూ నాకు సహాయం గా ఉండు మా ఇంటికి వస్తావా. అని అడుగుతాడు అందుకే ఆ కోతి సరే అని తల ఊపుతుంది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఆ ఇంటికి వెళ్తారు. అక్కడ ఇంట్లో శివయ్య భార్య మంచం పై పడుకొని ఉంటుంది. ఆమెను చూసిన కోతి…. ఎవరు ఆమె అని సైగ చేసి అడుగుతుంది. అందుకు శివయ్య…. ఆమె నా భార్య ప్రమీల. ఆమెకు జబ్బు చేసి కొన్ని నెలల నుంచి మంచం లోనే ఉంటుంది. అప్పుడు ఆ కోతి ఆమె దగ్గరికి వెళ్లి…. మీకేం కాదు మీరు త్వరలోనే కోలుకుంటారు. అని సై క చేస్తుంది అందుకు ఆమె….. నేను కూడా అదే కోరుకుంటున్నాను నువ్వు అన్నట్టు ఆ భగవంతుడు మా పై జాలి చూపించి నన్ను త్వరగా కోలుకునేలా చేస్తే బాగుండు. అవునండి ఇంతకీ ఈ కోతి ఎక్కడిది. ఎవరిది అని అంటుంది. అందుకు శివయ్య జరిగిన విషయమంతా చెప్తాడు. దాన్ని విన్న ప్రమీల…. పోనీలెండి మీ కొంచెం సాయంగా ఉంటుంది గా. అని అంటుంది ఇక ఆ రోజు నుంచి ఆ కోతి శివయ్య ఇంట్లోనే ఉంటూ వాళ్ళతో పాటే కలిసి తింటూ. బట్టలు ఉతకడం ఆ బట్టలు ఇస్త్రీ చేసి చక్కగా మడత పెట్టడం లాంటివి చేస్తుంది.కోతి చేసే పనులన్నీ ఆ ఊరి ప్రజలకి మొదట్లో వింతగా ఉంటాయి. ఆ తర్వాత పోనుపోను అందరికీ అలవాటైపోతుంది. ఇక ఊరి ప్రజలు పనికట్టుకుని మరీ ఆ కోతి దగ్గరకు వచ్చి అది చేసే పనులు చూడటం. అలాగే బట్టలు ఇవ్వడం ఇస్త్రీ చేయించుకోవడం లాంటి పనులు చేసేవాళ్ళు.
ఆ విషయం తెలుసుకున్న విరయ్య కు తన మనసులో దురుద్దేశం కలుగుతుంది. అతను… అరే ఈ కోతి పుణ్యమా అంటూ వాడు బలే సంపాదిస్తున్నాడు ఇంకా ఇది ఇలాగే సాగితే. నా బట్టలు నేను ఇస్త్రీ చేసుకోవడం తప్ప ఇక ఏదీ ఉండదు.
దీనికి త్వరలోనే ముగింపు పెట్టేయాలి అని అనుకుంటాడు అలా రోజులు గడిచాయి.
ఒకరోజు సరిత అనే ఒక ఆమె శివయ్య ఇంటికి వచ్చి….. శివయ్య శివయ్య అని పిలుస్తుంది శివయ్య భార్య ఆ కోతితో…. చూడమ్మా ఎవరు వచ్చినట్టున్నారు శివయ్య బయటికెళ్లాడు అని చెప్పు. అందుకు కోతి బయటికి వెళ్లి ఆమెతో…..శివయ్య బయటికి వెళ్లాడు ఇప్పుడే వస్తాడు మీరు కూర్చోండి అని సైగ చేసి చెప్తుంది.
అప్పుడు ఆమె… లేదు నేను త్వరగా ఇంటికి వెళ్ళాలి. నేను కొన్ని బట్టలు తీసుకు వచ్చాను వాటిని శుభ్రంగా ఉతికి ఇస్త్రీ చేయమని చెప్పు. సాయంత్రం వచ్చి వాటిని తీసుకుంటాను అని చెప్పి బట్టలు ఇచ్చి అక్కడి నుంచి వెళ్లి పోతుంది. అప్పుడు ఆ కోతి బట్టలు తీసుకొని శుభ్రంగా ఉతికి ఆరబెట్టి . లోపలికి వెళ్లి బట్టలు ఇస్త్రీ చేస్తూ ఉంటుంది. ఇంతలో శివయ్య ఇంటికి వస్తాడు.
శివయ్య కోతి ని చూసి…. అమ్మ నువ్వు గర్భవతి అయినా నా కోసం ఎంత కష్ట పడుతున్నావ్వు. ఒకప్పుడు నా భార్య చేదోడువాదోడుగా ఉండేది. ఆమె ఉన్నప్పుడు నా రెండుచేతులా సంపాదించే వాడిని.
ఆమె చెప్పడంతో డబ్బు మొత్తం ఆమె ఆరోగ్య ఖర్చులకు అయిపోయింది మళ్లీ నీ పుణ్యమా అంటూ. నాలుగు రూపాయలు చూడగలుగుతున్నాను నీకు చాలా కృతజ్ఞతలు తల్లి అంటూ కంటతడి పెట్టుకుంటాడు.
దానిని అంతా విన్న కోతి…. అయ్యో బాధపడకు శివయ్య దేవుడు నీ బాధను చూసే నన్ను నీ దగ్గరికి పంపినట్టు ఉన్నాడు.
నువ్వు బాధ పడుకో నేను బ్రతికున్నంత కాలం నీకు సహాయం చేస్తాను. అని అంటుంది అందుకు అతను చాలా సంతోష పడతాడు ఆ తర్వాత ఇద్దరూ కలిసి వాళ్ల ఇస్త్రీ బండిని తోసుకుంటూ చెట్టు దగ్గరికి వెళ్లి ఇస్త్రీ చేస్తూ ఉంటారు దానంత చూస్తున్నా వీరయ్య కళ్లల్లో నిప్పులు చెరుగుతూ ఉంటాయి. అతను దాన్ని అంతా చూసి ఓర్పు పట్టలేక పోతాడు.
అతను… నేను ఈ దృశ్యాన్ని చూడలేకపోతున్నాను. వాడు నాకంటే డబ్బు సంపాదించడం ఏంటి అది కూడా ఒక కోతిని అడ్డంపెట్టుకుని. నాకు అవకాశం రావట్లేదు ఒక మంచి అవకాశం వస్తే ఆ కోతి పని వాడి పని చెప్తాను. అని అనుకుంటూ ఉంటాడు.
ఆ విధంగా మరి కొన్ని రోజులు గడిచాయి. అందరూ పూర్తిగా విరయ్య సంగతే మర్చిపోయారు. ప్రతి ఒక్కళ్ళు శివయ్య దగ్గరికి వచ్చి బట్టలు ఇచ్చి వెళ్తారు. అప్పుడే దీపావళి పండుగ వస్తుంది. ఆ పండుగ రోజు శివ ఇంట్లో చాలా సంతోషంగా సందడి జరుగుతూ ఉంటుంది. రకరకాల పిండివంటలు ని కోతి మరియు శివయ్య స్వయంగా తయారు చేస్తారు. ఆరోజు శివయ్య కోతితో…. ఈ పండుగని ఇంత బాగా జరుపుకుంటారు అని నేను అనుకోలేదు.
నీ పుణ్యమా అంటూ నా భార్య ఆరోగ్యం కూడా చాలా మటుకు కుదుటపడింది.
కోతి….. నాక్కూడా చాలా సంతోషంగా ఉంది అమ్మ ఆరోగ్యం చాలా వరకు కుదుట పడడం అనేది.
భార్య…. అవును ఇది అంతా నీ పుణ్య o తల్లి
బతుకు మీద ఆశలు వదులుకున్న సమయంలో. ఆ భగవంతుడు నిన్ను పంపించి నా కుటుంబానికి నా భర్త కి సాయం చేశాడు. అంటూ సంతోషపడుతుంది ఆ తర్వాత ముగ్గురు కలిసి ఆ పిండి వంటలు తిని కూర్చుంటారు. అప్పుడు శివయ్య కోతి తో….సరే మనం వెళ్లి బాణాసంచాలు తీసుకొద్దాం పద సాయంత్రం మన ఇంటి ముందు హడావుడి జరిగిపోవాలి. కోతి సరే అంటూ అతనితో కలిసి వెళ్తుంది. అలా వెళ్తూ ఉండగా ఆ చెట్టు దగ్గర వీరయ్య ఇస్త్రీ చేస్తూ ఉంటాడు. శివయ్య వీరయ్య దగ్గరకు వెళ్లి… ఏంటి వీరయ్య పండగ పూట కూడా ఇలా పని చేస్తూ ఉన్నావు.
వీరయ్య…. తప్పదు కదా శివయ్య నాకంటూ సహాయం చేసే వాళ్ళు ఎవరు ఉన్నారు నీకంటే ఆ కోతి ఉంది. నా భార్య గర్భవతి కావడంతో పుట్టింటికి వెళ్ళింది. ఇంక నేను ఒక్కడినే కదా తప్పదు కష్టపడాల్సిందే. నాలుగు రూపాయల సంపాదిస్తేనే కదా నాకు ఉపయోగపడేది నా ఇంటి పరిస్థితి నీకు తెలిసిందేగా. ఉంటాడు అందుకు శివయ్య….. సరే సరే వీరయ్య ఎవరన్నా కష్టపడాల్సిందే కదా . మన కష్టానికి ఏదో ఒక రోజు మంచి ఫలితం వస్తుంది బాధపడకు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వీరయ్య….. వెళ్ళరా వెళ్ళు
ఎంత సంతోష పడుతున్నావ్వు రా ఆ కోతినీ చూసి. ఇదే, ఈ రోజే దానికి ఆఖరి రోజు. పండగ అనేది నా జీవితంలో లేకుండా చేశారు. ఈ రోజు నువ్వు లేవు అని నేను ఇక్కడికి వచ్చాను ఈరోజు కూడా నా బేరం అంతంత మాత్రంగానే ఉంది. చూస్తారా ఈరోజే మీ ఇద్దరి అంతు చూస్తాను అని అనుకుంటాడు.
ఇతను అంత కోపంగా అనుకుంటూ ఉంటాడు ఇది ఇలా ఉండగా .దారిలో వెళ్తున్నా శివయ్య కోతి ఒకరితో ఒకరు ఇలా మాట్లాడుకుంటారు. శివయ్య… పాపం వీరయ్యను చూస్తే జాలేస్తుంది.అతను అన్నది నిజమే కదా ఇప్పుడు నా కంటే నువ్వు సహాయం చేస్తున్నావ్ అతని సహాయం చేసే వారు లేరు అతని ఇంటి పరిస్థితి కూడా అంతంత మాత్రమే. కోతి… బాధపడకు శివయ్య నాకు పుట్టబోయే బిడ్డ ఉన్నాడు కదా వాడిని విరయ్య కు ఇస్తానులే అతని కష్టం తీరిపోతుంది. అందుకు శివయ్య…. ఇది చాలా మంచి మనసే. పోనీలే అలాగే చేద్దాం మనం. అని అనుకుంటూ ఇద్దరూ కలిసి బాణాసంచాలు తీసుకుని ఇంటికి తిరిగి వస్తారు. ఆ రోజు రాత్రి సమయం శివయ్య చాలా సంతోషంగా కాకరపువ్వొత్తులు వెలిగిస్తూ సంతోష పడుతూ ఉంటాడు కోతి చాలా భయపడుతూ ఉంటుంది శివయ్య…. ఏంటి అలా భయపడుతున్నావు నువ్వు కూడా వచ్చి వీటిని కాల్చు.
కోతి… అమ్మో నాకు చాలా భయం నేను రాను. నిప్పు ని చూస్తే నాకు భయం పైగా ఆ శబ్దాలు. అమ్మో నా వల్ల కాదు. అంటూ ఉండగా శివయ్య…. ఏం కాదు నేను ఉన్నా కదా అంటూ ఆ కోతికి కాకరపువ్వొత్తులు అందిస్తాడు ఆ కోతి అలా వాటిని పట్టుకొని సంతోష పడుతూ ఉండగా వీరయ్య వెనకనుంచి వచ్చి వాళ్లకు తెలియకుండా చిచ్చుబుడ్లు లని తీసివేసి అతని తయారు చేసిన చిచ్చుబుడ్లు ని అక్కడనుంచి వెళ్ళి పోతాడు. ఆ కోతికి టపాసులు మీద భయం పోయి అక్కడే ఉన్న చిచ్చుబుడ్డి తీసి వెలిగిస్తుంది అది ఒక్క సారిగా పేలి పెద్ద శబ్దం వస్తుంది ఆ శబ్దానికి శివయ్య అతని భార్య భయపడతారు. పాపం కోతి గుండె అయితే ఒక్కసారిగా ఆగిపోయి చనిపోతుంది. శివయ్య…. అయ్యో ఏమైంది అయ్యో. భగవంతుడా ఎంతపని జరిగిపోయింది నువ్వు వద్దు వద్దు అన్న నేనే బలవంతంగా. మీ చేత టపాసులు కల్పించాను. నిన్ను నేనే హత్య చేశాను అయ్యో భగవంతుడు నన్ను క్షమించు. అన్యాయంగా తల్లీబిడ్డల నీ పొట్టన పెట్టుకున్నను అంటూ అంటూ బోరున ఏడుస్తాడు. అతని భార్య కూడా…. అయ్యో భగవంతుడా ఎంతపని జరిగిపోయింది . అంటూ పెద్ద పెద్దగా ఏడుస్తూ ఉంటుంది ఆ దీపావళి వాళ్ళకి చేదు జ్ఞాపకంగా మిగిలిపోతుంది. అన్యాయంగా వీరయ్య ఆ గర్భవతి కోతిని పొట్టన పెట్టుకున్నాడు కానీ అతను చేసిన తప్పు కి ఏదో ఒక రోజు దేవుడు తప్పకుండా అతనికి శిక్ష విధిస్తాడు. ఈ కథ గనుక మీకు నచ్చినట్లైతే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *