గర్భవతి కోతి పెద్ద చేప_ Telugu Stories- Stories in Telugu – Panchatantra Kathalu

శ్రీలంక అనే ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో మల్లేష్ అనే ఒక వ్యక్తి ఉండేవాడు. మల్లేష్ ఒక రోజు తన పొలంలో భోజనం చేస్తూ ఉండగా. అక్కడికి ఒక పెద్ద కోతి వస్తుంది. ఆ కోతిని చూసిన మల్లేష్ చాలా భయపడ తు…. అమ్మో ఇది ఎక్కడ కోతి రా బాబు ఎంత పెద్దగా ఉంది. ఇది గనక కుస్తీల పోటీల్లో పాల్గొంటే దీనికి మొదటి ప్రైస్ వచ్చే లాగా ఉంది. అదీ దాని వాడకం అమ్ము చూడటానికి భయంకరంగా ఉంది.అంటూ భయపడతాడు ఇంతలో ఆ కోతి అతని ముందుకు వస్తుంది. దానిని చూసిన అతను చాలా భయపడుతూ. అక్కడినుంచి పరుగులు తీస్తాడు. ఆ కోతి అక్కడ ఉన్న ఆహారాన్ని మొత్తం తిని అక్కడి నుంచి వెళ్లి పోతుంది. మల్లేష్… ఓరి దేవుడా కొంచెం సేపు గనక ఉంటే నన్ను కూడా తినేసే దైమో.

మొత్తం ఆహారాన్ని తినేసింది కొంచెం కూడా మిగల్చకుండా. అని దాన్ని తిట్టుకుంటూ అక్కడనుంచి వెళ్ళి పోతాడు. అలా ఆ రోజు గడిచిపోయింది ఆ మరుసటి రోజు అతను పొలం పని చేసుకుంటూ ఉంటాడు. ఇంతలో ఆ గర్భవతి అయిన కోతి అక్కడికి వచ్చి అతను చెట్టు దగ్గర పెట్టినా ఆహారపదార్థాలు మొత్తాన్ని తినేస్తుంది. దానిని గమనించిన మల్లేష్….. ఓరి దేవుడా ఇది ఎక్కడి నుంచి వచ్చింది రా బాబు. ప్రతిరోజు నా కడుపు కాలుస్తుంది. అని అనుకుంటాడు పాపం మల్లేష్ కి ఆ రోజు కూడా తినడానికి ఏమీ ఉండదు. అలా ఆ రోజు కూడా గడిచిపోతుంది ఆ మరుసటి రోజు మల్లేష్….. ఈ రోజు కూడా ఆ పెద్ద కోతి నా దగ్గరికి వస్తుంది. ఇక్కడ ఉన్న ఆహారం అంతా తినేస్తుంది. నేను మళ్ళీ పస్తులు ఉండాలి. ఈరోజు మాత్రం నేను అలా జరగనివ్వను. అని అనుకొని ఆ ఆహారపదార్థాలు పక్కన పెడతాడు. ఆ తరువాత అతను వెళ్లి పొలం పనులు చేసుకుంటూ ఉంటాడు. ఇం తలో ఆ కోతి అక్కడికి వస్తుంది. అది ఆహారం కోసం అటూ ఇటూ వెతుకుతూ ఉంటుంది. దానికి ఆహారం ఎక్కడా కనిపించదు. దానిని అంతా గమనిస్తున్న మల్లేష్…. అది బాగా అయింది వెతుకు ఎక్కడ వెతికినా దొరకదు. అని నవ్వుకుంటూ ఉంటాడు అప్పుడు పెద్ద కోతి అతని ముందుకు వస్తుంది. దానిని చూసిన మల్లేష్…. వామ్మో ఆహారం దొరకలేదని నన్ను మింగేసేలా ఉంది అని అక్కడి నుండి పరిగెత్తాడు. ఆ కోతి అక్కడ పొలం పనులు చేస్తూ ఉంటుంది. మల్లేష్ దానిని అంత దూరం నుంచి చూస్తూ….. ఏంటి కోతి పొలం పనులు చేస్తుంది. దీని ఉద్దేశ్యం ఏమిటో నాకు ఏమీ అర్థం కావడం లేదు. అని అనుకుంటూ ఉంటాడు ఇంతలో ఆ కోతి పొలం పనులు అన్నీ ముగిస్తుంది. మల్లేష్ కోసం అటూ ఇటూ చూస్తుంది. మల్లేష్ చెట్టు చాటున దాగి ఉండడంతో అతను కనపడ డు.
ఆ కోతి పెద్దగా అరుస్తూ…. దయచేసి నా ఆకలి తీర్చే. దయచేసి నా ఆకలి తీర్చే నేను గర్భవతి కొంచెం తినడానికి ఏమన్నా ఇవ్వు. అంటూ పెద్ద పెద్దగా అరుస్తూ కన్నీరు కారుస్తూ సైక చేస్తుంది. దానంత గమనించిన మల్లేష్… అయ్యో పాపం దీనికి ఆకలేస్తుంది. పైగా గర్భవతి అనుకుంటా. పోనీలే చాలాసేపు కష్టపడి పని చేసింది. నా ఆహారం దాని కి ఇస్తే ఏం కాదు. అని అనుకొని ఆహారాన్ని తీసుకెళ్ళి ఆ కోతి దగ్గర పెట్టి అక్కడినుంచి పరిగెడతాడు.
ఆ కోతి ఆవురావురంటూ దాన్ని తిని. దూరంగా నిలబడిన మల్లేష్ వైపు చూస్తూ.,.. మిత్రమా నీకు చాలా కృతజ్ఞతలు. నాకు ఎంతో ఆకలిగా ఉంది. ఎక్కడ ఆహారం దొరకడం లేదు అందుకే నీ దగ్గర దొంగచాటుగా తింటున్నాను. ఈరోజు నాకు ఆహారం దొరకకపోవడంతో నువ్వు చేసే పని చేస్తే నాకు కొంచెం ఆహారం పెడతావని అలా చేశాను. నీకు చాలా కృతజ్ఞతలు అంటూ సైగ చేస్తుంది.
అందుకు అతను తన కంగారు ని పక్కన పెట్టి… ఓ అవునా బాధపడకు నీకు ఎప్పుడు ఆకలి వేసిన నా దగ్గరికి రా నీ కోసం రేపటి నుంచి నేను ప్రత్యేకంగా భోజనo తీసుకొస్తాను. అని అంటాడు అందుకు ఆ కోతి చాలా సంతోషపడుతుంది. ఆ మరుసటి రోజు కోతి అతని దగ్గరకు రాకపోవడంతో అతను… ఏమైంది కోతి కి మూడు రోజుల నుంచి వరుసగా వచ్చింది. ఈరోజు నేను భోజనానికి తీసుకు వస్తానని చెప్పిన రాలేదు ఏమై ఉంటుంది అని అనుకుంటూ తన పనులు చేసుకుంటాడు. ఇంతలో ఆ గర్భవతి చాలా కంగారుగా పరుగుపరుగున అక్కడికి వస్తుంది. మల్లేష్ … ఏమైంది నువ్వు ఎందుకు అంత కంగారు పడుతున్నావు. ఏం జరిగింది.
కోతి అతనికి ఏ సైకలు చెయ్యకుండా అక్కడున్న ఆహారపదార్థాలు చేత పట్టుకొని… నాకు త్వరగా రా అంటూ సై గ చేసి పరుగులు తీస్తుంది. దానిని చూసిన మల్లేష్ …. ఏమైంది అసలు ఏమైంది అంటూ పరిగెడుతూ అరుస్తూ ఉంటాడు.
కోతి….. నాతో రా నీకు అర్థమవుతుంది.
అని అంటుంది ఇద్దరూ కలిసి ఒక చెట్టు దగ్గరికి వెళ్తాడు అక్కడా ఒక స్వామీజీ చాల నీరసంతో కనపడతాడు.
దానిని చూసి మల్లేష్….. స్వామి బానే ఉందా మీకు అంతా. చాలా నీరసంగా కనబడుతున్నారు. ఇదిగో ఈ ఆహారం తీసుకోండి. అంటూ కోతి చేతిలో ఉన్న ఆహారాన్ని స్వామీజీకి అందిస్తాడు.
ఆకలి మీద ఉన్న స్వామి ఆహార మొత్తాన్ని తిని…. మీకు చాలా కృతజ్ఞతలు బాబు. నా ఆకలి తీర్చావు.
మల్లేష్…. నిజానికి నేను కాదు స్వామి ఈ కోతి నన్ను ఇక్కడికి తీసుకు వచ్చింది.
అందుకు అతను…. చాలా సంతోషం మీ ఇద్దరూ సుఖంగా ఉండండి. అని దీవిస్తాడు.
మల్లేష్…. స్వామి మీరు ఊరు తిరిగి ఉపన్యాసాలు చెప్తూ ఉంటారు కదా.
మీకు ఎన్నో మాయలు మంత్రాలు ఉన్నాయి అని అందరూ చెప్తూ ఉంటారు కదా. అది నిజమేనా స్వామి తప్పుగా అనుకోకండి తెలుసుకుందామని అడుగుతున్నాను.
స్వామీజీ…. నువ్వు అడగడంలో తప్పేమీ లేదు బాబు అందరికీ ఉన్న అనుమానాలు ఇవి. నాకు ఎన్నో మాయలు మంత్రాలు తెలుసు.
మల్లేష్…. స్వామి అన్ని మాయలు మంత్రాలు తెలుసు కదా. ఇంత ఆకలితో ఉండే బదులు నీ మాయ శక్తులతో ఏదో ఒక ఆహారాన్ని ప్రత్యక్షం చేసుకోవచ్చు కదా.
స్వామీజీ…. మీరు చెప్పింది నిజమే కానీ ఈ రోజు అమావాస్య మా స్వామీజీల మాయ మంత్రాలు పనిచేయవు ఎందుకంటే ఈరోజు దయ్యాలకు అధిక శక్తి ఉంటుంది దాని కోసమేనా శక్తి లేమి పనిచేయవు.
మల్లేష్…. అవునా స్వామి.!? అది సరే కానీ స్వామి మీరు ఎక్కడ ఉంటారు
స్వామీజీ….. నేను ఈ అడవి చివర ఆశ్రమం లో ఉంటాను నీకు ఎప్పుడు ఏ అవసరమైన నా దగ్గరికి రావచ్చు. ఇక నేను వెళ్లి వస్తాను అని ఆ కోతిని అతని దీవించి వెళ్ళిపోతాడు.
మల్లేష్ కోతితో. … ఈరోజు ఒక మంచి పని చేశావు ఒక ప్రాణాన్ని కాపాడతావ్వూ.
నువ్వు చాలా మంచి కోతి వి అని అంటాడు కోతి….. నీకు కూడా కృతజ్ఞతలు మిత్రమా నువ్వు కూడా చాలా మంచి వాడివి అని నవ్వుకుంటూ ఇద్దరూ పొలం దగ్గరికి వెళ్లి పొలం పని చేస్తారు. అలా కొన్ని రోజులు గడిచాయి ఆ కోతి కి మల్లేష్ తో మంచి స్నేహం ఏర్పడుతుంది. ఆ కోతి ప్రతిరోజు వచ్చి మల్లేష్ పొలం పనుల్లో సహాయం చేస్తూ అతని పెట్టింది తింటూ సంతోషంగా ఉంటుంది అలా రోజులు గడిచాయి మల్లేష్ పంట విస్తారంగా పండిపోయింది అతను చాలా సంతోషపడుతూ…. ఆహా ఈ సంవత్సరం నా పంట బాగా పండింది నాకున్న కష్టాలన్ని తీరిపోతాయి. అని అనుకుంటాడు కోతి కూడా చాల సంతోషపడుతూ…. అవును మిత్రమా ఇక నీ జీవితం మారిపోతుంది. నువ్వు ధనవంతుడిగా అవుతావు. నిన్ను చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది అని సైగ చేస్తుంది.
అలా ఆ రోజు గడిచి పోతుంది. ఆ ఈ రోజు రాత్రి జోరుగా వర్షం మొదలవుతుంది. ఆ వర్షం ఉరుములు మెరుపులు శబ్దాలు కి నిద్రిస్తున్న మల్లేష్ నిద్ర నుంచి లేచి….. ఓరి భగవంతుడా ఏంటి ఇలా జరిగింది. నా పంట అంతా నాశనం అయిపోతుంది. భగవంతుడా దయచేసి ఈ వర్షాన్ని ఆపు. నీకు పుణ్యం ఉంటుంది అని దేవుని ప్రార్థిస్తాడు.కానీ ఏం లాభం లేదు ఆ వర్షం అలా కురుస్తూనే ఉంటుంది అలా కుండపోతగా రెండు రోజులపాటు అలాగే కురుస్తుంది. అప్పుడు చెట్టు దగ్గర ఉన్న పెద్ద కోతి…. అయ్యో పాపం వర్షం బాగా కురుస్తుంది. మల్లేష్ పంట అంతా నాశనం అయిపోతుంది భగవంతుడా నువ్వేమన్నా చేయాలి. అనుకుంటూ బాధపడుతుంది. అలా రెండు రోజుల తర్వాత వర్షం అంతా ఆగిపోతుంది. మల్లేష్ తన పంట పొలం దగ్గరికి వెళ్లి చూస్తాడు. పంటంతా నాశనమై పోయి నీటిలో మునిగి పోతుంది.
అతను చాలా దుఃఖంతో అక్కడ నిలబడి బాధపడుతూ ఉంటాడు. అప్పుడే ఆ గర్భవతి కోతి అక్కడికి వస్తుంది. దాన్ని చూసిన మల్లేష్…. చూసావా మిత్రమా దేవుడు నా పైన కొంచెం కూడా జాలి చూపించలేదు.
ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు.
అన్నీ చాలా బాధపడుతూ కన్నీరు కలుస్తాడు.
కోతి…. అయ్యో మిత్రమా బాధపడకు
అసలు ఇలా జరుగుతుందని నేను కూడా ఊహించలేదు. అన్నీ సర్ది చెప్తుంది అప్పుడే ఆ కోతికి స్వామీజీ చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి. వెంటనే అది మల్లేష్ తో…..బాధపడకు మిత్రమా ఆరోజు స్వామీజీ ఏదైనా అవసరమైతే నా దగ్గరికి రా అని చెప్పాడు కదా. ఇప్పుడు నువ్వు చాలా కష్టాల్లో ఉన్నావు. స్వామీజీ దగ్గరకు వెళితే నీకష్టాలు తీరిపోతాయి వెళ్దాం పద. అంటూ అతన్ని తీసుకుని స్వామీజీ దగ్గరకు వెళ్తుంది.
అక్కడ మల్లేష్ స్వామీజీ కి జరిగిన నష్టం అంతా చెప్పుకుంటాడు. స్వామీజీ…. బాధపడకు నేను నీకు కచ్చితంగా సహాయం చేస్తాను. కానీ ఇది అమావాస్య ఘడియలు నీకు ఇప్పుడు ఇప్పుడు అయితే నేను చేయలేను కానీ నేను చెప్పబోయేది విను నువ్వు తూర్పు దిశగా ఎక్కడ ఆగకుండా ప్రయాణించు. అక్కడ నీకు పెద్ద చెరువు కనబడుతుంది. ఆ చెరువులో పెద్ద పెద్ద బంగారు చేపలు ఉన్నాయి. వాటిని నువ్వు సొంతం చేసుకున్నావ్ అంటే. నువ్వే కాదు నీ పది తరాలు కూర్చొని తిన్న ఆస్తి తరగదు.
అంత డబ్బు మీ సొంతం అవుతుంది.
ఆ మాటలు విన్న మల్లేష్ చాల సంతోషపడుతూ…. నీకు చాలా కృతజ్ఞతలు స్వామి ఇప్పుడే బయలుదేరాము.అని స్వామీజీ కి నమస్కారం చెప్పి కోతి, మల్లేష్ ఇద్దరూ అక్కడి నుంచి తూర్పు దిశగా ప్రయాణిస్తారు. అలా వాళ్ళు చాలా దూరం ప్రయాణించిన తర్వాత వాళ్లకి ఒక పెద్ద చెరువు కనబడుతుంది. దానిని చూసిన మల్లేష్…. అమ్మో చెరువు చాలా పెద్దగా ఉంది లోతు కూడా ఎక్కువే ఉంటుంది. నాకు ఈత కూడా సరిగ్గా రాదు. ఇందాక స్వామీజీ చెరువు గురించి చెప్తుంటే ఆతృతలో నాకు ఈత రాదు అన్న సంగతి మర్చిపోయాను.
కోతి…. అయ్యో మిత్రమా నువ్వు ఎందుకు అన్నిటికి కంగారు పడతావు నేనున్నా కదా.
నేను వెళ్లి ఆ చేపల్ని తీసుకొస్తాను. అని ఆ చెరువులోకి దూకుతుంది. ఆ కోతి ఆ చెరువులో ఈ నీటిలో తిరుగుతూ ఉంటుంది దానికి లోపల పెద్ద పెద్ద బంగారు చేపలు కనబడతాయి. వెంటనే ఆ కోతి ఒక బంగారు చేప ని తీసుకొని బయటకు వస్తుంది.
దానిని చూసిన మల్లేష్ చాలా ఆశ్చర్యపోతాడు. కోతి…. మిత్రమా ఒక్క నిమిషం ఆగు లోపల ఇంకా చాలా బంగారు చేపలు ఉన్నాయి. నేను వెళ్లి మరో చేప ని తీసుకొని వస్తాను. అని మళ్లీ చెరువులోకి దూకి వేటాడి ఒక చేపను పట్టుకొని బయటకు తీసుకొని వస్తుంది. దానిని చూసిన అతను చాలా సంతోషపడుతూ….మిత్రమా నీకు చాలా కృతజ్ఞతలు ఇక నా జీవితం మారిపోయింది. ఈ జన్మలో నీ రుణం తీర్చుకోలేను.
కోతి… అయ్యో అలా అయితే నేను కూడా నీకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి మన మధ్య అలాంటి ఉండకూడదు మనం స్నేహితులం కదా అని నవ్వుతుంది.
అందుకు మళ్ళీ కూడా నవ్వుతూ…. సరే ఇక వెళ్దాం పద. అంటూ ఇద్దరూ కలిసి ఆ చేపల్ని తీసుకొని వెళ్తారు. ఆ చేపల్ని అమ్మి వచ్చిన డబ్బుతో మల్లేష్ చాలా ధనవంతుడు అయిపోతాడు. ఆ కోతి కూడా మల్లేష్ తో పాటే వుంటూ సంతోషంగా జీవితాన్ని కొనసాగిస్తుంది. ఆ విధంగా మాయ చేపల పుణ్యమా అంటూ. మళ్లీ జీవితం మారిపోతుంది. ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇ షేర్ చేయండి కామెంట్ చేయండి.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *