గర్భవతి కోతి బాధ 3_ Telugu Stories- Stories in Telugu – Panchatantra Kathalu

అది ఒక పెద్ద అందమైన అడవి. ఆ అడవిలో ఒక గర్భవతి అయిన కోతి ఉండేది.

అది ఆ అందమైన అడవిలో సంతోషంగా తన జీవితాన్ని గడుపుతూ అటూ ఇటూ దొర్లుతూ హాయిగా జీవిస్తుంది ఒకరోజు అది విశ్రాంతి తీసుకొని తన కడుపులో ఉన్న బిడ్డ తో…. నీకు నా కడుపులో చాలా సంతోషంగా ఉందని నాకు తెలుసు. నువ్వు గనక బయటికి వచ్చావంటే. ఇక్కడ గొప్ప గొప్ప అందాలని. చల్లని వాతావరణాన్ని చల్లని గాలిని ప్రకృతిని ఆస్వాదించవచ్చు. నేను నీకోసం ఎదురు చూస్తూ ఉన్నాను. నీతో ఆడుకోవాలి ఈ అడిగి మొత్తం తిరిగి gola gola చేయాలి అంటూ ఎన్నెన్నో కలలు కంటుంది.
అలా రోజులు గడిచాయి ఆ గర్భవతి అయినా కోతి ఒక బిడ్డకి జన్మనిస్తుంది.
ఆ బిడ్డ తన తల్లితో చాలా చక్కగా ఆడుకుంటూ, అడివిలో అటూ ఇటూ గెంతుతూ ప్రకృతిని ఆస్వాదిస్తూ. చాలా సంతోషంగా గడుపుతున్న సమయంలో ఆ అడవిలో ఇద్దరు మనుషులు ఇలా మాట్లాడుకుంటారు….. సర్ ఈ అడివి ని చూశారు కదా. మనం అనుకున్న ప్రాజెక్టు ఎక్కడ పడుతుంది సార్. ఈ అడవి మొత్తం అన్ని తీసేసి మా ఊరికి ఊరికి వెళ్లడానికి ఒక పెద్ద హైవే నిర్మిస్తున్నాం.
. రెండో వ్యక్తి….. కానీ దానివల్ల అడవి మొత్తాన్ని నర కలిసి వస్తుంది కదా మరో మార్గమే లేదా.
….. సర్ ఉంది కానీ అది చాలా దూరంగా ఉంటుంది ప్రజలు వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడతారు. అప్పుడు మనం అంత పెద్ద రోడ్డు అటువైపుగా వేసినా ఉపయోగం ఉండదు.
……. కానీ అడవిని నరకడం వల్ల జంతువులు అన్నీ ఎక్కడికి వెళ్లి పోతాయి చాలా ఇబ్బంది పడతారు కదా.
…….. సార్ వాటి గురించి ఆలోచిస్తూ ఉంటే మనం బ్రతకలేం సార్.
…… సరే ఏదో ఒకటి కానివ్వండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతారు.
వాటన్నిటిని ఆ చెట్టు మీద నుంచి వింటున్నా కోతులు చాలా బాధ పడుతూ ఉంటాయి అప్పుడు పిల్ల కోతి…… అమ్మ అయితే ఇంకా మనం అడవిలో ఉండకూడదా. ఈ అడవి లేకపోతే మనకు ఆహారం ఎవరు పెడతారు. మనం ఉండాలంటే ఎవరితో ఉండాలి ఎక్కడికి వెళ్లాలి అమ్మ. నాకు చాలా భయంగా ఉంది అమ్మ.
తల్లి కోతి…. భయపడకు నా నా నేనున్నా కదా అని చెప్పి తన బిడ్డను తీసుకుని తన స్థావరానికి వెళ్తుంది.
అలా కొన్ని రోజులు గడిచాయి. ఆ వ్యక్తుల అనుకున్న విధంగానే రోడ్డుని నిర్మించడం కోసం అడివి మొత్తాన్ని నరికేశారు అక్కడ ఉన్న పక్షులు జంతువులు వాటి వాటి దారి చూసుకున్నాయి.
ఆ తల్లి కోతి …. భగవంతుడా ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్లాలి. నా బిడ్డని నన్ను నువ్వే కాపాడాలి. అంటూ ఆ బిడ్డని తీసుకొని ఒక చెట్టు దగ్గరికి వెళ్లి పోతుంది. కొన్ని రోజుల్లోనే అక్కడ రోడ్డు పూర్తయిపోతుంది వాహనాలన్నీ ఆ రోడ్డు మీద వెళుతూ ఉన్నాయి. అడవి మొత్తాన్ని కొట్టివేయడం తో ఆ తల్లీబిడ్డలు రెండు ఆకలితో అలమటిస్తూ ఉంటాయి.
పిల్ల కోతి…. అమ్మ అ నాకు చాలా ఆకలిగా ఉంది. మనం తిండి తిని ఎన్నో రోజులు అవుతుంది అమ్మ నాకు ఆకలవుతుంది అమ్మ. తినడానికి ఏమన్నా ఇవ్వమ్మా.
కోతి… సరే నాన్న మనం ఆ రోడ్ అవతలివైపు కి వెళ్దాం ఏమన్నా తినడానికి దొరుకుతుందేమో చూద్దాం. అని ఆ కోతులు 2 చిన్నగా నడుచుకుంటూ వెళుతూ ఉంటాయి ఇంతలో రోడ్డుకి అవతలివైపు. ఒక పండ్ల వ్యాపారి పండ్ల అమ్ముతూ కనిపిస్తాడు.
దాన్ని చూసిన పిల్లకోతి… అమ్మ అక్కడ చూడమ్మా తినడానికి చాలా రక రకాల పండ్లు ఉన్నాయి త్వరగా వెళ్దామా. అని ఆ తల్లి చేతిని విడిచిపెట్టి రోడ్డుకి అడ్డంగా పరుగులు తీస్తోంది.
తల్లి….. వద్దు నాన్నా నువ్వు వెళ్ళద్దు నేను వస్తాను ఆగు. అంటూ తల్లి కోతి తన బిడ్డ వెంబడి పరుగులు తీస్తుంది ఇంతలో ఎవరూ ఊహించని పెద్ద ప్రమాదం జరిగి పోయింది. ఏంటంటే ఆ రోడ్డు మీద ఉన్న కారు అకస్మాత్తుగా ఆ బిడ్డని ఢీ కొంటుంది. కారు ఢీ కొనడంతో ఆ బిడ్డ… అమ్మ అంటూ పెద్దగా అరిచి గాల్లోకి లేచి ఒక్కసారిగా కింద పడి రక్తం కక్కుతూ కొన ఊపిరితో….. అమ్మ అమ్మ అంటూ ఏడుస్తూ ఉంటాడు. ఆ కారు దాన్ని దాటేసి వెళ్ళిపోతుంది.
ఆ బిడ్డ నీ చూసి ఆ తల్లి ఎంతో విలవిలలాడుతూ…. నా బంగారు తల్లి నీకేం కాదమ్మా నేను ఉన్నాగా. నా బంగారు తల్లి అయ్యో భగవంతుడా. అంటూ ఎంతో కన్నీరు పెట్టుకుంటూ ఆ బిడ్డని హత్తుకుంటుంది. ఆ బిడ్డ తన అమ్మ ఒడిలోనే కన్నుమూస్తాడు. ఆ తల్లి దాన్ని చూసి కన్నీరుమున్నీరుగా పెద్ద పెద్దగా ఏడుస్తూ. దేవుని మొరపెట్టుకుంటే ఉంటుంది.
దాన్ని చూస్తున్నా ఆ పండ్ల వ్యాపారి…. అయ్యోయ్యో ఎంతపని జరిగిపోయింది. ఈ అడవిని కొట్టేసి రోడ్డు ఏమంటు వేశారు. ఇలా రోజుకు ఒక జంతువు ఎలా బస్సు కిం దొ కారు కింద పడి చనిపోవాసీవస్తుంది. దేవుడా వీటిని నువ్వే కాపాడాలి స్వామి అనుకొని అతను చాలా బాధపడతాడు.
తర్వాత ఆ కోతి ఆ బిడ్డని తీసుకొని దూరంగా మట్టి ప్రాంతంలో దాని కప్పేస్తుంది.
అప్పుడు ఆ కోతి ఒకటే నిర్ణయించుకుంటుంది అదేంటంటే…. నా బిడ్డ చనిపోయినట్టు అక్కడ ఎవరు మరణించడానికి వీల్లేదు. నేను నా వల్ల తగినంత సాయం చేస్తాను. వాహనాన్ని అంత వేగంగా ఎందుకు నడుపుతారో వీళ్లు. వాటి వేగాన్ని తగ్గించి అదుపులో గనుక వచ్చి ఉంటే నా బిడ్డ బ్రతికేది. అంటూ ఏడుస్తూ ఆ మరుసటి రోజు ఆ రోడ్డుపై ట్రాఫిక్ పోలీస్ లాగా ఒక బోర్డు ని పట్టుకొని ఉంటుంది ఆ బోర్డుపై నిదానమే ప్రధానం అని రాసి ఉంటుంది. దాన్ని చూస్తున్న ప్రజలంతా వింతగా…. ఏంటి కోతి చాలా వింతగా ఉంది. ఒక ట్రాఫిక్ పోలీసు చేయాల్సిన పని కోతి చేస్తుంది.
ఆ మాటలు వింటున్న పండ్ల వ్యాపారి…. అవునండి పాపం నిన్న తన బిడ్డ ని కోల్పోయిన ది. అందుకే ఇదంతా చేస్తున్నట్టుంది. అని దాని గురించి గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. అలా రోజులు గడిచాయి. ఒకరోజు ఆ కోతి ఆ రోడ్డు పైకి వెళ్తుండగా రోడ్డు పక్కన పొదల్లో ఒక మనిషి గాయాలతో పడి కొన ఊపిరితో కొట్టుకుంటూ… దాహం దాహం ఎవరైనా నన్ను కాపాడండి ఎవరైనా ఉంటే నన్ను కాపాడండి అంటూ చాలా చిన్నగా నీరసంగా పలుకుతూ ఉంటాడు. అతన్ని చూసిన కోతి…. అయ్యో పాపం ఆ మనిషికి గాయం తగిలి కొనఊపిరితో కొట్టుకుంటున్నడు. నేను ఏంచేయాలి భగవంతుడా. అతన్ని ఏదో ఒక విధంగా కాపాడు అనుకుంటున్న సమయంలో
ఆ రోడ్డు కి అవతలివైపు ఉన్న ఆ పళ్ళ వ్యాపారి అప్పుడే అక్కడికి వచ్చి తన వ్యాపారం మొదలు పెట్టడానికి ఆ పండ్లను సర్దుకుంటూ ఉంటాడు.
అప్పుడా కోతి అతన్ని చూసి పెద్ద పెద్దగా అరుస్తూ…. త్వరగా రండి ఇక్కడ మనిషి ప్రాణం పోయేలా ఉంది. అంటూ తన లో అనుకుంటూ బయటకి అతని రమ్మని సైకిల్ చేస్తుంది. దాన్ని చూసిన అతను… అరే ఈ కోతిని సైకల్ చేస్తుంది. ఏంటి అంటే ఏదో ప్రమాదం అనుకుంటా అని పరుగు పరుగున రోడ్డు దాటి ఆ కోతి దగ్గరికి వస్తాడు.
అప్పుడు ఆ కోతి ఆపదలో ఉన్న మనిషిని చూపిస్తుంది. దాన్ని చూసిన అతను అయ్యో. యో అని వెంటనే ఆంబులెన్స్ కి కాల్ చేస్తాడు. క్షణాల్లో ఆ అంబులెన్స్ అక్కడికి వచ్చి అతని తీసుకొని వెళ్ళి పోతుంది.
ఆ పండ్ల వ్యాపారి కోతి తో…. చాలా గొప్ప పని చేస్తున్నావ్ నువ్వు. నిన్న ట్రాఫిక్ పోలీస్ లాగా అందరికీ నిదానమే ప్రధానం అని చెప్పావు ఈరోజు ఆ మనిషి ప్రాణాలను కాపాడాడు. నీకు నేను సలాం చెయ్యకుండా ఉండలేకపోతున్నాను.
కోతి కన్నీరు పెట్టుకుంటూ…. ఎవరి ప్రాణమైన ప్రాణమే నా బిడ్డ నీ కోల్పోయి నేను ఎంత బాధ పడుతున్నానో నాకు తెలుసు. అలాగే వాళ్లకి కూడా తల్లిదండ్రులు భార్య పిల్లలు ఉంటారు కదా. వాళ్లు అతని కోసం విలువలను ఆడతారు. అసలు ఇక్కడ ఉన్న అడవి ని కనుక తొలగించక పోయినట్లయితే.మా జంతువులు చాలా బాగుండేవి ఇక్కడ మనుషుల ప్రాణాలు కూడా పోయేవి కాదు. అని తనలో అనుకుంటూ ఎంతో బాధపడుతూ ఉంటుంది దాన్ని చూసిన ఆ వ్యక్తి….. నీ కన్నీటి బాధ ఏంటో నాకు అర్థమైంది. ఈ అడవులు నీ కొట్టకుండా ఉన్నట్లయితే నువ్వు నీ బిడ్డ తో అడవిలో సంతోషంగా ఉండే నీ బిడ్డ నీకు దూరమయ్యే వాడే కాదు అనుకుంటా. కానీ విధి రాత ని ఎవరు తప్పించలేరు గా అంతా పై వాడు రాసినట్లే జరుగుతుంది. చూడు నీకు ఆకలి అయితే నా దగ్గర కి వచ్చి నీ కావాల్సిన పండ్లు తిని వెళ్ళు. అని ఆ కోతికి అర్థమయ్యేలా చెప్పి ఆ రోడ్డుని దాటి తన వ్యాపారం చేసుకుంటాడు . ఆ కోతి అలాగే ఏడుస్తూ మళ్లీ ఆ బోర్డ్ ని తీసుకొని రోడ్డు దగ్గర నిలబడుతుంది.
అలా ఆ కోతి ఆ రోడ్డు దగ్గరే ఉండి ప్రజలకి చాలా మందికి సహాయం చేస్తూ. ఉంటుంది గుడ్డి వాళ్ళ ని రోడ్డు దాటించడం ముసలి వాళ్ల కు దాహం లాంటి మనుషులు చేసే పనులు అన్నీ కోతి చేస్తుంది. కోతి చేసే పనులను చూసి మనుషులందరూ ఆశ్చర్య పోతూ ఉంటారు. ఆ కోతిని చూసి వాళ్లు కూడా చైతన్యం తెచ్చుకొని. వాళ్లకు తగినట్టుగా సహాయం చేస్తూ ఉంటారు. అలా ఆ పండ్ల వ్యాపారి కూడా ఆ కోతి తో స్నేహం చేస్తూ ఆ కోతి ద్వారా చాలా మంచి పనులు చేస్తూ అతను కూడా వాళ్ళకి సహాయపడుతూ తన జీవితాన్ని హాయిగా కొనసాగిస్తారు. ఇక ఆ రోజు నుంచి ఆ కోతి తన బిడ్డ లేదు అన్న సంగతిని మర్చిపోవడానికి ప్రయత్నిస్తు తన కాలాన్ని గడుపుతూ ఉంటుంది. ఆ కోతి బాధను మనం చూశాం కదా. ఒక కోతి కాదు చాలా జంతువులు అడవుల్ని కొట్టడం వల్ల ఇలాగే బాధ వాటికి తినడానికి తిండి ఉండటానికి కనీస స్వేచ్ఛ కూడా లేదు. అందుకే వీలైనంత వరకూ అడవులను నరకకుండా కాపాడుకుందాం చెట్లను పెంచుదాం. వన్య జంతువులనీ కాపాడుకుందాం. వృక్షో రక్షిత రక్షితః.
ఈ కథ గనుక నీకు నచ్చినట్లైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *