గర్భవతి కోతి బాధ 5_ Telugu Stories- Stories in Telugu – Panchatantra Kathalu

అది మధ్యాహ్నం 12 గంటల సమయం. సోమయ్య గర్భవతి అయిన కోతిని తరుముకుంటూ వస్తాడు. ఆ కోతి తన మనసులో…. అయ్యో భగవంతుడా నేను ఆయన చేతికి చిక్కకుండా ఉండేలా చూడు. అని దేవుని ప్రార్థిస్తూ ఒకచోట ఎవరికీ కనపడకుండా దాక్కుంటుంది. ఇంతలో సోమయ్య అటూ ఇటూ చూస్తూ ఉంటాడు. అప్పుడు అక్కడే పండ్ల వ్యాపారం చేసుకుంటున్న గిరిజ అతన్ని చూసి… ఏమైందండీ దేని కోసం వెతుకుతున్నారు.

సోమయ్య….. ఏం లేదు గిరిజ ఇటు కోతి వచ్చిందేమో అని.
గిరిజ….. ఏంటి సోమయ్య గారు మీరు కోతిని పెంచుకుంటున్నారు.
సోమయ్య…. పెంచుకోవడం పాడ గిరి జా . మాకు అరటి తోటలు ఉన్నాయి కదా. రోజు ఆ కోతి నా అరటిపళ్ళ నీ దొంగలించి తీసుకెళ్తుంది. అందుకనే కొంచెం దూరంగా తరిమేసే ఇక రాదేమో అని దాని వెంట పడుతున్నాను.
గిరిజ…. అవునా ఇటువైప్పు అయితే ఎటువంటి కోతి రాలేదు. అని చెప్తుంది అతను సరే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు
అప్పుడే ఆ కోతి…. భగవంతుడా ఈ రోజు ఐతే ఆయన్నుంచి తప్పించుకున్నాను. పరిగెత్తి పరిగెత్తి నా కడుపులో ఉన్న బిడ్డ అలిసిపోయినట్లు ఉన్నాడు కాసేపు విశ్రాంతి తీసుకోవాలి అని అనుకొని కొంచెం నడుచుకుంటూ వెళ్తుంది అప్పుడే పండ్లు అమ్ముతున్న గిరిజ దగ్గర ఏ చెట్టు ఉంటుంది ఆ చెట్టు ఎక్కి కూర్చుంది. ఆ కోతిని చూసిన గిరిజా…. అమ్మో ఈ కోతి ఇక్కడికి వచ్చినట్టుంది. ఈ పండ్ల నీ పాడు చేయకుండా ఉంటే అదే చాలు. అది అనుకుంటూ ఉంటుంది అప్పుడే ఆ కోతి ఆ పండ్లను చూసి ఆమె దగ్గరకు వెళ్లి …… ఒక పండు ఇవ్వవా అన్నట్టుగా చేయి చాచి అడుగుతుంది. దాన్ని చూసిన ఆమె …. దీనికి ఒక సారి అలవాటు చేస్తే ప్రతి సారి ఇక్కడికి వస్తది అనుకుంటా. అని చెప్పి దాన్ని తరిమికొడుతుంది ఆ కోతి ఒక పండును తీసుకొని పరిగెడుతుంది.
గిరిజ…. అమ్మో ఎంత తెలివి గల కోతి పండు తీసుకొని భలే తప్పించుకు పోయింది. అని అనుకుంటుంది ఈ రోజు కూడా ఆ కోతి అలాగే అక్కడ పండు ని దొంగతనం చేసి తీసుకుని వెళుతూ ఉంటుంది. ఆ గర్భవతి కోతి చేస్తున్నా పని ఆ గిరిజన ఏ మాత్రం నచ్చదు. అలా రోజులు గడిచాయి ఒకరోజు పండ్ల వ్యాపారం చేసుకునే టప్పుడు girija భర్త వెంకట అక్కడికి వస్తాడు. వెంకట్ ఆమెతో… girija girija ఇంటికి మీ అన్నయ్య వచ్చాడు. వ్యాపారం నేను చూసుకుంటా కానీ. నువ్వు వెళ్ళు. అని అంటాడు అందుకు గిరిజా… సరే అండి మీరు జాగ్రత్తగా ఉండండి ఇక్కడికి కోతి వచ్చి దొంగతనంగా పండ్లు తీసుకెళ్తా ఉంటుంది . జాగ్రత్త ఒకవేళ అది వస్తే వస్తే దాన్ని తరిమికొట్టండి. అని చెప్తూ ఉంటుంది ఇంతలోనే ఆ గర్భవతి అయిన కోతి అక్కడకు వచ్చి అక్కడే ఉన్న డబ్బు సంచీనీ
తీసుకొని పరుగులు తీస్తుంది. దాన్ని చూసిన గిరిజ…. ఒసేయ్ ఒసేయ్ ఒసేయ్ అవి పండ్లు కాదే డబ్బులే. అంటూ అరుస్తూ ఏమండీ మీరు ఇక్కడే ఉండండి నేను దాన్ని వెంబడించి డబ్బు సంచి తీసుకొస్తాను. అని చెప్పి దాని వెంట పడుతుంది ఆ కోతి అలా పరిగెత్తి పరిగెత్తి ఒక చిన్న గుడిసె లోకి వెళుతుంది.
దాన్ని చూసిన girija కూడా ఆ గుడిసెలో కే వెళుతుంది. అక్కడ ఒక ముసలావిడ మంచం పై పడుకొని దాహం దాహం ఆకలి అంటూ అలమటించి పోతూ ఉంటుంది. దాన్ని చూసిన గిరిజ అయ్యో పాపం… ముసలావిడ చాలా ఇబ్బంది పడుతున్నట్లు ఉంది. అంటూ ఇంట్లో అటూ ఇటూ చూస్తూ ఉంది అక్కడ ఎక్కడ నీళ్లు చుక్క కూడా ఉండవు.వెంటనే ఆ కోతి తన చేతిలో ఉన్న డబ్బులు అన్నీ గిరిజా కి ఇస్తుంది. girija ఆ సంచి తీసుకొని పక్కనె వున్న దుకాణంలోకి వెళ్లి మంచి నీటిని అలాగే ఆమె తినడానికి దోసెలు తీసుకొని వస్తుంది.
గిరిజన తానే స్వయంగా ఆమెకి దాని తినిపిస్తుంది. ఆ ముసలావిడ కొంచెం ఓపిక తెచ్చుకుని లెగిసి కూర్చొని…. నీకు చాలా కృతజ్ఞతలు తల్లీ సమయానికి నా ప్రాణాలు కాపాడావు. గిరిజ… నాది ఏం లేదండి ఈ కోతి నన్ను ఇక్కడికి తీసుకు వచ్చింది. ఇది మీ పెంపుడు కోతి నా ఇది లేకపోతే నేను అసలు ఇక్కడికి వచ్చే దాన్ని కాదు ఈ కోతిని ప్రాణాలు కాపాడింది. అప్పుడు ఆ ముసలావిడ పోతున్న దగ్గర తీసుకొని ఏడుస్తూ….. నిజానికి ఇది నా పెంపుడు కోతి కూడా కాదు. నా కన్నబిడ్డ లు నాకోసం ఈ చిన్న గుడిసెలు కట్టించి ఎవరి పాటికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఒంటరిగా నేను ఒక్కదాన్నే ఉంటున్నాను. వచ్చిన పెన్షన్ డబ్బులతో రోజులు గడుపుకుంటున్నాను. అలా వుండగా ఒక రోజు ఈ కోతి …. దయచేసి నాకు ఏమన్నా తినడానికి పెట్టరా.నా కడుపులో బిడ్డ ఆకలి ఆకలి అంటూ అల్లాడి పోతుంది. నేను ఎక్కడికి వెళ్ళినా అందరు నన్ను తరిమి కొడుతున్నారు. దయచేసి మీ దగ్గర ఏది ఉంటే అది తినడానికి ఇవ్వండి కాదు మీకు పుణ్యం ఉంటుంది అంటూ ఏడుస్తూ సైకల్ చేస్తూ తన బాధను వ్యక్తం చేసింది. ఆ మాటలు విన్న … అయ్యో పాపం చూస్తే గర్భవతిలా ఉంది పాపం ఆకలవుతుంది అనుకుంటా అని జాలి పడి దానికి ఒక ముద్ద అన్నం పెట్టాను. పాపం ఆకలి మీద ఉన్న కోతి ఆవురావురుమంటూ తిని…. అమ్మ మీకు చాలా కృతజ్ఞతలు నా కడుపులో ఉన్న బిడ్డ బ్రతికించావ్వు. నువ్వు కనుక లేకపోతే నేను నా బిడ్డ ఆకలితో చనిపోయే వాళ్ళం. అంటూ కన్నీరు కారుస్తూ
నాకు కృతజ్ఞతలు చెప్పుకొని అక్కడినుంచి వెళ్లిపోయింది . ఆ తర్వాత రోజు నుంచే నాకు ఒంట్లో సరిగా ఉండటం లేదు. నీరసంతో నా పని నేను చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నాను.
అప్పుడే ఈ కోతి నా దగ్గరకు వచ్చి… అమ్మ ఏమైంది నీకు. చూస్తే చాలా నేర్పుగా ఉన్నట్టున్నారు. అని జాలి పడుతూ సైకలు చేస్తూ ఏదేదో చేస్తుంది. కొంత సమయానికి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. నేను ఒంటరిగా చాలా బాధ పడుతూ…. ఆకలి అమ్మ ఆకలి భగవంతుడా ఎందుకు ఇంకా ఈ ముసలి ప్రాణాన్ని బ్రతికి ఇస్తున్నావు.త్వరగా నీ దగ్గరికి తీసుకెళ్ళి పో అంటూ ఎంతో ఆకలితో అల్లాడి పోతున్న సమయంలో ఈ కోతి మళ్ళీ తిరిగి నా దగ్గరికి వస్తూ కొన్ని అరటి పండ్లు తీసుకు వచ్చి…. అమ్మ ఇదిగో ఈ అరటిపళ్ళు తిన్నమ్మ. అంటూ నాకు స్వయంగా తానే తినిపించింది. ఆ రోజు నుంచి నాకు ఒంట్లో సరిగ్గా లేదు నేను మంచం మీదే ఉన్నాను ఈ కోతి నాకు రోజు అరటి పళ్ళు తీసుకువస్తుంది.
గత రెండు రోజుల నుంచి అరటిపండ్లు బదులు మామిడి పండు జామ పండు తీసుకొస్తుంది. నేను చాలా సార్లు అడిగాను ఎక్కడినుంచి తీసుకొస్తున్నవ్వని కానీ సమాధానం మాత్రం చెప్పలేదు. ఒక్కపూట అన్నం పెట్టి నందుకు ఇన్ని రోజుల నుంచి ఈ కోతి నాకు బతకడానికి తిండి పెడుతుంది.
అంటూ కన్నీరు కారుస్తోంది ఆ మాటలు విన్న గిరిజ తన లో…. అయ్యో ఈ కోతి నీ నేను అపార్థం చేసుకున్నాను. ఈ ముసలావిడ కోసం నా దగ్గర ఈ పండ్లను దొంగతనం చేస్తుందన్నమాట. అయ్యో పాపం చాలా మంచి కోతి లా ఉంది. అనుకుంటూ ఉండగా ఆ కోతి గిరిజ దగ్గరకు వచ్చి…. అమ్మ నన్ను క్షమించండి కేవలం మా అమ్మ ని బతికించుకోవడం కోసమే. నేను మీ దగ్గర పండ్లు ని దొంగతనం చేశాను. పండ్లతో మా అమ్మ ఆకలి సరిగా తీరడం లేదు. ఈరోజు మరి ఆమె పరిస్థితి అస్సలు బాలేదు నాకు భయం వేసి మీ డబ్బు సంచిని తీసుకొస్తే మీరు నా వెంటపడతారనీ అప్పుడు మా అమ్మ పరిస్థితి నీకు అర్థమవుతుందని ఇలా చేశాను నన్ను క్షమించండి. అంటూ సైకలు చేస్తూ బాధపడుతూ చెప్తుంది. ఆ కన్నీటి బాధలు చూసిన గిరిజా మనసు చాలా తరుక్కుపోతుంది. ఆమె ఆ కోతితో…. నువ్వే నన్ను క్షమించు అమ్మ .నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. నువ్వు చేస్తుంది చాలా మంచి పని కన్న బిడ్డలు కూడు పెట్టని తల్లికి . ఒక్కపూట అన్నం తిని ఎంత విశ్వాసం చూపిస్తున్నావు. ఈమె కన్నా బిడ్డల కంటే నువ్వే వంద రెట్లు మేలు. నువ్వే ఆమెనీ తల్లి లాగా చూసుకుంటున్నావి. ఈ మూగ జీవునీ చూసి నీ కొడుకులు బుద్ధి తెచ్చుకుంటే బాగుండు. ఆ మాటలకి ఆ ముసలావిడ చాలా బాధ పడుతూ….భగవంతుడు కొన్నిటిని దూరం చేసిన కొన్నిటిని దగ్గర చేస్తాడు. ఈ కోతికి నన్ను దగ్గర చేశాడు నాకు ఈ కోతిని దగ్గర చేశాడు. అంటూ ఏడుస్తూ కన్నీరు కారుస్తోంది ఆ కోతి కూడా ఆమెను చూసి ఆమెను హత్తుకొని కన్నీరు పెట్టుకుంటుంది. ఆ కోతి ఆమె పట్ల చూపిస్తున్న ప్రేమ ఆ ముసలావిడ ఆ కోతి పట్ల చూపిస్తున్న ప్రేమను చూసి గిరిజ చాలా సంతోషపడుతుంది అప్పుడు గిరిజ…. అమ్మ మీరు ఏమి అనుకోకపోతే నేను మీకు ఎంతో కొంత సహాయం చేస్తాను. కాదనకుండా తీసుకోండి అంటూ తన చేతిలో ఉన్న డబ్బు సంచనీ ఆ ముసలాడికి ఇస్తుంది అందుకు ఆమె…. వద్దమ్మా ఇప్పుడు దాక నువ్వు చేసిన మేలు చాలు. మేమిద్దరం ఎలాగోలా బతుకుతాము.
నాకు డబ్బులు వద్దు నీ ప్రేమకి చాలా కృతజ్ఞతలు తల్లి అంటుంది. సరే అయితే ఓ పని చేయండి అమ్మ మీరు మీ ఇంటి బయట కూర్చొని పండ్లను అమ్ముకుని జీవనం కొనసాగించండి. నా దగ్గర ఉన్న పండ్లను కొన్ని పంపిస్తాను వాటిని అమ్ముకోండి లాభం వచ్చిన తర్వాత నా పండ్ల డబ్బు నాకు తిరిగి ఇవ్వండి ఈదైనా కాదనకుండా చేయండి. అప్పుగా ఇస్తున్నా అనుకోండి. అందుకే ఆ కోతి….నేను మీతో పాటు వస్తాను ఆ పండ్లు నాకు ఇవ్వండి నేనే పండ్లు అమ్మి మా అమ్మని జాగ్రత్తగా చూసుకుంటాను అని అంటుంది ఆ కోతి సైకిల్ కి గిరిజా చాలా ముచ్చట పడుతూ. అయితే నువ్వు నాతో పాటు రా నీకు పండ్లు ఇచ్చి పంపిస్తాను అంటూ అక్కడికి తన పండ్ల వ్యాపారం దగ్గరికి వెళుతుంది. అక్కడ ఒక చిన్న బుట్టలో పండ్లని పెట్టి ఆ కోతికి ఇస్తుంది ఆ కోతి వాటిని తీసుకొని…. నీకు చాలా కృతజ్ఞతలు అమ్మ నేను వెళ్లి వస్తాను. అంటూ కంటతడి పెట్టుకొని తన ఇంటికి తిరిగి వస్తుంది అక్కడ ఆ ముసలావిడ ఆ కోతి తో కలిసి పండ్లను అమ్ముతూ ఉంటుంది ఆ కోతి కూడా ఒక బుట్టలో పెట్టుకుని పండ్లు అమ్ముతూ డబ్బు సంపాదిస్తుంది చాలా విచిత్రంగా అందరూ….. కోతి పండ్లు అమ్ముతుంది అంటూ. ఆశ్చర్యపోయి దాన్ని చూడటం కోసమే వచ్చి.దాని దగ్గర పండు కొనుక్కొని వెళుతూ ఉంటారు అలా ఆ కోతి చేసిన పనితో ఆ ముసలావిడ జీవితం మారిపోయింది. ఆ తర్వాత ఆ ముసలావిడ గిరిజ దగ్గరికి వెళ్లి ఆమె డబ్బులు ఆమెకు తిరిగి ఇచ్చి… అమ్మా నీకు చాలా మరోసారి కృతజ్ఞతలు. నా చేత పండ్ల వ్యాపారం పెట్టి చావు. బతుకు మీద ఆశ లేని నాకు బతుకు మీద ఆశ కలిగించవు.
గిరిజ…. ఇదంతా నేను చేసిందేమీ లేదు అదిగో ఆ మూగ జీవి ఇదంతా చేసింది.మీరు కృతజ్ఞతలు చెప్పాలనుకుంటే మూగ జీవికి చెప్పండి నాకు కాదు. ఆ కోతి చేసిన పని నుంచి చూసైనా మనుషులు మారితే నాకు అదే ఆనందం. అని అంటుంది ఆ ముసలావిడ కోతిని పట్టుకొని…. నా బంగారు తల్లి వచ్చే జన్మంటూ ఉంటే నువ్వే నా కూతురు లాగా నా కడుపులో పుడితే నీ రుణం తీర్చుకుంటా ను. అంటూ కంటతడి పెట్టుకుంటుంది ఆ కోతి దాన్ని చూసి…. వద్దమ్మా ఏడవకు మన అందరం చాలా సంతోషించాల్సిన రోజులు వచ్చేశాయి. నీవల్లే కదా నా బిడ్డకి నాకు ఒక నీడ దొరికింది మూడు పూట్ల కడుపు నిండా తిండి దొరికింది. అందుకు నీకే నేను కృతజ్ఞతలు చెప్పుకోవాలి అంటూ సైకల్ చేస్తూ ఆనందభాష్పాలు కురిపిస్తుంది. ఆ విధంగా ఆ ముసలావిడ కోతి ఇద్దరూ పండ్ల వ్యాపారం చేసుకుంటూ వాళ్ల జీవితాన్ని చాలా సంతోషం గా గడుపుతుంటారు ఈ కథలో నీతి ఏమిటంటే.జంతువులు మనుషుల పట్ల ఎంత ప్రేమ చూపిస్తుందో యు మనం తెలుసుకున్నాం కానీ ఈ రోజుల్లో చాలామంది తల్లిదండ్రుల్ని విడిచిపెట్టి వాళ్లని దిక్కులేని వాళ్లు చేస్తున్నారు. మనం ఇలాంటి మూగజీవులు చూసి అయినా మార్పు తెచ్చుకోవాలి. కన్న వాళ్లు ప్రేమను అర్థం చేసుకోవాలి అసలు వాళ్లంటూ లేకపోతే మన జీవితాలు ఎక్కడ ఉంటాయి. చెప్పండి. ఈ కథ గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *