గర్భవతి కోతి బాధ 6_ Telugu Stories- Stories in Telugu – Panchatantra Kathalu

చిన్న చింతలపూడి అనే ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో బసవయ్య అతని తల్లి సారమ్మ నివసిస్తూ ఉండేవాళ్ళు బసవయ్య కు తన తల్లి అంటే చాలా ఇష్టం ఆమె నీ చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు తన ఇల్లు గడవడం కోసం అతను ఊరూరు తిరిగి అద్దాలు అమ్ముకునేవాడు.

అలా వుండగా ఒక రోజు అతను ఊరు మొత్తం తిరిగి బాగా అలసిపోయి. ఒక చెట్టు దగ్గర విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు. ఆ చెట్టు పైన ఒక గర్భవతి అయిన కోతి అతన్ని చూసి కిందకు దిగి వచ్చి…. అబ్బో అద్దాలు భలే ఉన్నాయే అని అనుకొని ఒక అద్దాన్ని తీసుకొని చెట్టు పైకి వెళ్లి పోతుంది. ఆ కోతి అద్దంలో ముఖాన్ని చూసుకుంటూ …. ఆహా నేను ఎంత అందంగా ఉన్నాను. ఈ ప్రపంచంలో నా అంత అందగత్తె ఎవరు లేరు. దేవుడా ఎందుకయ్యా నాకు ఇంత అందం ఇచ్చావ్. అని అనుకుంటూ మురిసి పోతూ ఉంటుంది కొంత సమయానికి మళ్ళి ఒక వేళ నా అంత అందంగా ఉండాలంటే పుట్టబోయే నా బిడ్డే ఉంటాడు. అని మాట్లాడుకుంటుండగా బసవయ్య కు మెలుకువ వస్తుంది అతను లేచి చూసి …. అరే ఇక్కడ మూడు అబద్ధాలు ఉండాలి కదా మరో అద్దం ఎవరు తీసుకెళ్లిపోయారు. అంటూ అటూ ఇటూ చూస్తాడు అప్పుడే అతనికి కోతి కనబడుతుంది. బసవయ్య…. ఏ కోతి మర్యాదగా ఆ అద్దాన్ని నాకు తిరిగి ఇచ్చేయ్. ఆ కోతి…. నేను ఇవ్వను అన్నట్టుగా తల ఊపుతుంది. బసవయ్య కోపం వచ్చి ఒక కర్ర తీసుకొని….. మర్యాదగా దానివ్వు లేదంటే ఈ కర్రతో నిన్ను కొడతాను. అని అంటాడు అయినప్పటికీ ఆ కోతి ఇవ్వను అన్నట్టుగా తలని ఊపుతోంది. అందుకు ఆ బసవయ్య కోపంతో కర్రని విసిరేస్తాడు అప్పుడు ఆ కర్ర సరాసరి వెళ్లి కోతికి తగులుతుంది తన చేతిలో ఉన్న అద్దం కిందపడి పగిలి పోతుంది.
బసవయ్య అద్దం వైపు చూస్తూ… అయ్యో బంగారం లాంటి అద్దాన్ని పగల కొట్టింది గా. చి చి ఈరోజు లేచిన వేళా బాలేదు అనుకుంటా అని అనుకొని అక్కడనుంచి వెళ్ళి పోతాడు.
ఆ కోతి…. అబ్బా వీడు ఎంత గట్టిగా కొట్టాడు.
ఈసారి ఎప్పుడైనా కనిపించాలి అప్పుడు వీడి పని చెప్తా. అని తనలో అనుకుంటుంది.
అలా రోజులు గడిచాయి ఒక రోజు ఒక వ్యక్తి ముసుకు వేసుకొని తన చేతిలో ఏదో ఒక సంచి తీసుకొని పరుగుపరుగున వస్తూ ఉంటాడు అతని వెనక … పట్టుకోండి దొంగ దొంగ అంటూ ఇద్దరు వ్యక్తులు పరుగులు తీస్తూ ఉంటారు. ఆ ముసుగులో ఉన్న వ్యక్తి అక్కడే ఉన్న చెట్టు చాటున దాక్కున్నాడు దానిని అంత చూస్తున్న కోతి తనలో …. వీడెవడో దొంగలా ఉన్నాడు వీడిని వాళ్ళకి పట్టించాలి. అని అనుకొని ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటుంది.
దానిని గమనించిన ఆ వ్యక్తి తన ముసుగు తీసి…. వద్దు వద్దు నువ్వు శబ్దం చేయకు వాళ్ళు ఇక్కడికి వస్తారు. అని అంటాడు ఆ వ్యక్తిని చూసి న కోతి తన మనసులో…. అయ్యబాబోయ్ ఇతను అద్దాలు అమ్ముకునే వ్యక్తి. ఇతను వ్యాపారి కాదన్నమాట దొంగ.
ఆరోజు నన్ను కొట్టాడు గా ఇప్పుడు నా చేతికి దొరికాడు అని అనుకొని మరింత పెద్దగా శబ్దాలు ప్రారంభిస్తుంది. అప్పుడు బసవయ్య… నీకు దండం పెడతాను నువ్వు శబ్దం చేయకు. వాళ్ళు ఇక్కడికి వస్తే నన్ను బ్రతకను ఇవ్వరు. నీకు పుణ్యం ఉంటుంది అని చేతులు నమస్కరించి ఆ కోతిని ప్రాధేయపడతాడు.
అతన్ని చూసిన కోతి…. ఏంటి వ్యక్తి ఇంతల బ్రతిమిలాడాడు తున్నాడు. అసలు అతను దొంగిలించింది ఏమై ఉంటుంది అని అనుకొని అతని చేతిలో దానిని లాక్కుంటుంది అందులో పండ్లు ఉంటాయి. అప్పుడు ఆ కోతి ఆశ్చర్యంగా అతనివైపు చూస్తుంది.
బసవయ్య… ఏమైంది అలా చూస్తున్నావ్ నేను దొంగిలించింది వాటినే డబ్బు నగలు కాదు. అప్పుడు ఆ కోతి ….. కానీ ఎందుకు అన్నట్టుగా చేయి ఊపుతూ సైకలు చేస్తుంది.
కోతి భావాన్ని అర్థం చేసుకున్నా బసవయ్య…. మరి ఏం లేదు. నేను ఒక పేదవాడిని మా అమ్మకి జబ్బు చేసింది నేను సంపాదించిన నా సంపాదన ఆమె ముందు ఖర్చులకు నా కుటుంబం గడవడానికి సరిపోతుంది. డాక్టర్ గారు బలమైన ఆహారం పండ్లు తినాలి లేదంటే మా అమ్మ నాకు దక్కదని చెప్పాడు.
సమయానికి నా చేతిలో డబ్బులు కూడా లేవు ఏం చేయాలో అర్థం కాక ఈ పని చేశాను. అంటూ కన్నీళ్లు పెట్టుకుంటాడు. అతని కన్నీరు చూసి న కోతికి చాలా జాలి కలిగి…. అయ్యో నువ్వు బాధపడకు నేను నీకు సహాయం చేస్తాను. వీటిని వాళ్లకి తిరిగి ఇవ్వు అని సైకల్ చేస్తుంది . అందుకు అతను సరే అని చెట్టు చాటు నుంచి బయటకు వచ్చి….. ఏమండీ ఏమండీ మీ పళ్ళు ఇక్కడే ఉన్నాయి. అని పిలుస్తాడు. ఇద్దరు వ్యక్తులు అక్కడికి వచ్చి…. ఆ దొంగ వెధవ ఎక్కడున్నాడు.
బసవయ్య…. అతని ని నేను గట్టిగా పట్టుకున్నాను. కానీ నా నుంచి తప్పించుకొని. వెళ్ళిపోయాడు. అందుకు అతను…. చాలా కృతజ్ఞతలండి ఎలా అయితే మీ ఆ పండ్లు నా చేతికి వచ్చాయి. నేనే చాలా కష్టం తో పని చేసుకుంటున్న వాడిని . ఇలాంటి దొంగలు ఉంటే మాలాంటి వాళ్ళం ఎలా బ్రతుకుతాo. అని అనుకొని అతనికి కృతజ్ఞతలు చెప్పుకుంటాడు అప్పుడే ఆ కోతి అక్కడికి రావడంతో దాన్ని చూసి ఆ కోతికి ఒక పండును ఇచ్చి అక్కడనుంచి ఆ ఇద్దరు వ్యక్తులు వెళ్ళిపోతారు.
అతని మాటలు విన్న బసవయ్య తన మనసులో….అయ్యో నేను ఎంత పెద్ద పొరపాటు చేశాను అతను కూడా నాలాగే చాలా కష్టపడి పని చేసుకున్నాడట. నేను ఒకడి కష్టాన్ని దోచుకోవాలి అనుకున్నాను చాచా అని బాధ పడతాడు. అతని బాధను చూసిన కోతి. పరుగు పరుగున అక్కడి నుంచి వెళ్లి చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్క చెట్టు దగ్గరకు ఎందుకు వెళ్ళి చెట్టుకున్న పండ్లను కోసుకొని అతని దగ్గరకు వచ్చి అతనికి వాటిని ఇస్తుంది. వాటిని తీసుకున్న అతను చాల సంతోషపడుతూ …. నీ రుణం ని ఈ జన్మలో మర్చిపోలేను. అని దానికి కృతజ్ఞతలు చెప్పి ఆ పండ్లను తీసుకొని తన తల్లి దగ్గరికి వెళ్తాడు అక్కడ తన తల్లికి జరిగిన విషయమంతా చెప్పాడు. ఆ తల్లి చాలా బాధ పడుతూ…. ఎందుకు బాబు నా గురించి నువ్వు అలా ఆలోచిస్తున్నావ్. ఆ దేవుడు నన్ను తొందరగా తీసుకెళ్లిన బావుండేది. నేను నీకు సరైన చదువు చెప్పి చ లేదు సరి కదా నావల్ల నువ్వు దొంగ తనం కూడా చేశావు ఇదంతా నా కర్మ అంటూ ఏడుస్తుంది. బసవయ్య…. అమ్మా నన్ను క్షమించు కేవలం ఇదంతా నిన్ను బ్రతికించడం కోసమే చేశాను. ఇంకా ఇలాంటి పొరపాటు ఎప్పుడు చేయను. అంటూ కంటతడి పెట్టుకుంటాడు. ఆ తల్లి కూడా కంటతడి పెట్టుకొని…. ఆ కోతి బలే సహాయం చేసింది.
దేవుడు ఏదో ఒక రూపంలో మనల్ని ఆదుకున్నాడు.అని అనుకుంటూ ఉండగా ఆ కోతి అప్పుడు అక్కడికి వస్తుంది. దాన్ని చూసిన వాళ్ళు ఇద్దరూ చాలా ఆశ్చర్యపోతారు. అప్పుడు ఆ కోతి…. నేను మీ అమ్మని చూడాలని వచ్చాను అని సైకలు చేస్తూ ఉంటుంది. దాని సైకల్ అర్థం కాని అతని తల్లి …. బసవయ్య ఆ కోతి ఏమంటుంది. బసవయ్య… బహుశా అది నిన్ను చూడడం కోసం వచ్చింది అనుకుంటా అమ్మ ఆ విషయం చెప్తుంది అనుకుంటా.
అప్పుడు కోతి అవునన్నట్లుగా తల ఊపుతుంది. అప్పుడు ఆ తల్లి…. నా తల్లి నా తల్లి నువ్వు నోరులేని దానివే నా మనుషుల మీద ఎంత ప్రేమ చూపిస్తున్నావో. నిన్ను చూస్తే నాకు చాలా ముచ్చటగా ఉంది అమ్మ చూస్తే గర్భవతి లాగా ఉన్నావు. ఇదిగో ఈ పండ్లు తిన్నమ్మ అని పండు చేతికి ఇస్తుంది.
కోతి …. మీరు తినండి నాకు వద్దు నేను చాలా నేను తింటూ ఉంటాను. అన్నట్టుగా దాన్ని ఆమె కి తిరిగి ఇస్తుంది. ఆమె….. చాలా గుణవంత మైన కోతి లా ఉంది. అని అనుకుంటూ ఉంది ఆ రోజు నుంచి ఆ కోతి ప్రతిరోజు ఆమెకు పండ్లను తీసుకొచ్చి ఇస్తూ ఉంటుంది. బసవయ్య ఎప్పట్లాగే తన వ్యాపారానికి వెళుతూ ఉంటాడు అలా చాలా రోజులు గడిచాయి. ఆ కోతి పూర్తిగా బసవయ్య ఇంట్లోనే పెరుగుతూ ఉంటుంది.
దాన్ని చూసిన చుట్టుపక్కల వాళ్ళు అంతా బసవయ్య గురించి ఈ విధంగా గుసగుసలు చెప్పుకుంటూ ఉంటారు….. బసవయ్య కి తల్లి కి చూసుకోవడానికే సరిగ్గా తిండి ఉండదు. అది సరిపోదు నట్టుగా కోతి ని తీసుకు వచ్చి పెంచుకున్నాడు. ఇలాంటివన్నీ అతనికి అవసరమా. మింగ మెతుకులేదు కాని మీసాలకు సంపంగి నూనె అన్నారంట అలా ఉంది ఈయన వాలకం.
మరో ఆమె….. నిజమే వదినా నువ్వు చెప్పింది పైగా ఆ కోతి గర్భవతి. రేపు పిల్లల్ని కంటే. వాటినీ కూడా ఈయనే చూసుకోవాలి.
డబ్బు లేనప్పుడు ఇవన్నీ చేయడం ఎందుకో. అన్నట్టుగా సూటిపోటి మాటలు అంటూ ఉంటారు వాటన్నిటిని బసవయ్య విన్న విన్నట్టుగా గాలికి వదిలేస్తాడు. ఆ విషయం గురించి ఆ కోతి చాలా బాధ పడుతూ ఉంటుంది. కోతి బాధని అర్థం చేసుకున్న బసవయ్య…. చూడు వాళ్ళు ఎవరో ఏదో అన్నారని నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నువ్వు మాకు ఎంతగా సహాయం చేస్తున్నావు వాళ్ళకేం తెలుసు మాకు మాత్రమే తెలుసు. అని అంటాడు కానీ ఆ కోతి మాత్రం తన మనసులో…. బసవయ్య ని తిట్టిన వాళ్ళు అంతా మళ్ళీ పొగిడే ఎలా చేయాలి. అని అనుకుంటుంది అనుకున్న విధంగానే ఆ మరుసటి రోజు ఉదయాన్నే లేచి ఇంటి ముందు చీపురుతో శుభ్రంగా ఊడ్చి నీళ్లు జరుగుతుంది. దాన్ని చూసి నా చుట్టుపక్కల వాళ్ళు అంతా ఆ కోతిని అలా చూస్తూ ఉంటారు. ఆ కోతి ముగ్గు కూడా వేస్తుంది. ఆ కోతి చేస్తున్న పనులు చూడటం కోసమే వాళ్లంతా బసవ ఇంటికి వచ్చి ఆశ్చర్యంగా చూస్తూ…. అరే కోతి భలే ముచ్చట గా పనిచేస్తుంది.అని చెప్పుకుంటూ ఉండగా అప్పుడే బసవయ్య ఇంటి లోపలి నుంచి బయటకు వస్తాడు అక్కడ మనుషులు చూసినవా బసవయ్య ఏం జరుగుతుందో అన్నట్టుగా చూస్తాడు ఆ కోతి పనులు చేయడం చూసి తాను కూడా ఆశ్చర్యపోతారు. అప్పుడే అక్కడున్న వాళ్ళు… బసవయ్య నువ్వు తెచ్చిన కోతి బలే గా పనిచేస్తుంది. చూస్తుంటే చూడముచ్చటగా ఉంది. కొంచెం ఆలస్యమైనా భలే మంచి కోతి ని తీసుకొచ్చి పెంచుకున్నావు. నువ్వు బలే తెలివైనవాడివి ఆ కోతి నీ కంటే ఎక్కువ తెలివి గలది గా ఉంది. అంటూ అతన్ని ఆ కోతిని మెచ్చుకుంటూ అక్కడ్నుంచి వెళ్ళిపోతారు. అప్పుడు అతను తన మనసులో… వీళ్ళంతా భలే ఉన్నారు. మొన్నటిదాకా ఏమో నన్ను తిట్టారు ఈరోజు ఏమో ఇలా పొగుడుతున్నారు. అవకాశవాదులు అంటే వీళ్ళనే అంటారనుకుంటా. అని అనుకొని ఆ కోతితో…. నీకు మరోసారి కృతజ్ఞతలు చెప్పుకోవలసిందే. నన్ను తిట్టిన వాళ్ళ చేత పొగి డేలా చేశావు. అని అంటాడు అందుకు కోతి….హా..హా. నవ్వుతూ మా బసవయ్య నీ తిడుతుంటే ఊరుకుంటానా. అన్నట్టుగా పైకి చేస్తుంది దాన్ని చూసిన అతను పెద్దగా నవ్వుతూ దాని నీ లోపలి తీసుకెళ్ళి పోతాడు.
ఆ విధంగా ఆ గర్భవతి కోతి ఆ ఇంట్లోనే బసవి తో ఉంటూ చాలా సంతోషంగా తన జీవితాన్ని గడుపుతుంది. బసవయ్య తన తల్లి కూడా ఆ కోతి చేష్టలకి ఆనంద పడుతూ ఉంటారు. ఈ కథ గనుక నీకు నచ్చినట్లైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *