గర్భవతి కోతి బాధ_ Telugu Stories- Stories in Telugu – Panchatantra Kathalu

అది ఒక అందమైన పెద్ద పల్లెటూరు.ఆ పల్లెటూరు పక్కనే పట్నం కూడా ఉండేది. ఆ పల్లెటూర్లో శివయ్య అనే ఒక వ్యక్తి ఉండేవాడు అతని దగ్గర ఒక కోతి ఉండేది ప్రతిరోజు అతను ఆ కోతిని వెంట పెట్టుకొని. పట్టణంలో కి వెళ్లి దానిచేత సర్కస్ చేస్తూ ఉంటాడు. శివయ్య … రావాలి బాబు రావాలి చూడాలి బాబు చూడాలి ఈ కోతి చేసే వింతలు. అంతా ఇంతా కాదు ఈ కోతి చేసే సర్కస్ చూస్తే మీకు మతిపోతుంది అంటూ కేకలు వేస్తూ ఉంటాడు. చాలామంది చుట్టూ గుమిగూడి ఆ కోతి చేసే చేష్టలను సర్కస్ చూస్తూ ఉంటారు. అలా వచ్చిన వాళ్ళు ఎంతో కొంత డబ్బులు ఇచ్చి వెళుతూ ఉంటారు. అలా వుండగా ఒక రోజు శివయ్య భార్య ….. ఏవండీ మన కోతి ఇప్పుడు గర్భవతి. ఇంకా దానితో కొన్ని రోజులు సర్కస్ చేయించండి. అది ఇంటి పట్టునే ఉండి బాగా తింటే అదే చాలు మీరు మాత్రం ఆ సర్కస్ ఏదో ఒక పని చేయండి.

శివయ్య… ఓస్ అంతేకదా నేను ఏదో ఒక పొలం పని చేసుకుంటాను అని. నువ్వు మన కోతిని జాగ్రత్తగా చూసుకో అది గనుక పిల్లలు పెడితే నాకు చాలా ఆనందం అలాగే దానితో కూడా సర్కస్ చేస్తాను. అంటూ ఆనంద పడుతూ ఉంటాడు. అలా కొన్ని రోజులు గడిచాయి. శివయ్య భార్య ఆ కోతిని కట్టివేసి దానికి కావలసిన ఆహార పదార్థాలు ఇస్తూ ఉండేది కానీ ఆ కోతి దానిని తినకుండా తన మనసులో ఏదో దిగులుగా ఆలోచిస్తూ….. నాకు బయట ప్రపంచాన్ని చూడాలనుంది. నేను అందరి కోతి లాగే అటూ ఇటూ గెంతుతూ నాకిష్టం వచ్చిన పండ్లను తింటూ.ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ నా కడుపులో ఉన్న బిడ్డకు ఆ అందాల గురించి చెబుతూ ఆనంద పడాలని ఉంది. కానీ నేను ఎప్పుడు ఎక్కడ ఇబ్బందిగా ఉన్నా నాకు ఇక్కడ ఏమీ తినాలని లేదు. అనిల్ దిగులుగా ఆలోచిస్తూ ఉంటుంది.
అప్పుడు దాని కడుపులో పిల్ల…. అమ్మ మనం ఎప్పుడు ఎక్క డే ఉంటామా కొత్తగా ఏమీ ఉండదా. బయట చెట్ట్లు భలే అందంగా ఉన్నాయి నాకు అక్కడ అటు ఇటు గెంతలని ఉంది నువ్వు గెన్తావుఅనుకో నీ కడుపులో నేను కూడా గెంతుతాను పదమ్మ బయటికి వెళ్దాం.అని అంటుంది ఆ మాటలకి ఆ తల్లి కి ఏం చేయాలో అర్థం కాదు ఎందుకంటే దాన్ని కట్టేసి ఉండటంతో అది అలా ఏడుస్తూ అక్కడే ఉండిపోతుంది. ఇంతలో అక్కడికి శివయ్య వస్తాడు శివయ్య తన భార్యతో….. ఏంటి మన కోతి ఎలా ఉంది బాగా ఆహారం తీసుకుంటుందా.
భార్య…. ఏమో అండి అసలు ఆహారం తీసుకోవటం లేదు ఎందుకో చాలా దిగులుగా కనిపిస్తుంది. ఓహో అవునా అంటూ దాని దగ్గరికి వెళ్తాడు. ఆ కోతి అతన్ని చూడగానే చాలా ప్రేమగా అతని మీదికి వస్తుంది. ఆ కోతి కళ్ళ వెంబడి నీళ్ళు చూసిన అతను… అయ్యో ఏమైంది నీకు ఎందుకు అలా బాధ పడుతున్నావు. నీకు ఇక్కడ అంతా బాగానే ఉంది కదా మంచి ఆహారం ఉంది ఇంకెందుకు అలా బాధ పడుతున్నావు.
అందుకు కోతి అతనివైపు దిగులుగా చూస్తుంది.
భార్య… ఏవండీ ఒక వేళ ఈ కోతికి అటూ ఇటూ తిరగలని ఉందేమో. మనం వదిలేస్తామా అది స్వేచ్ఛగా అలా తిరిగి వస్తుంది. ఆ మాటలు విన్న కోతి చాలా సంతోషపడుతూ చప్పట్లు కొడుతుంది.
శివయ్య దాన్ని చూసి… ఓహో ఇదా నీ బాధ సరే అయితే నీ ఇష్టం వచ్చినంత సేపు బయట హాయిగా తిరిగి రా. అని ఆ కోతి కట్టు విప్పేస్తాడా. అది చాలా సంతోషంగా నవ్వుకుంటూ. వెళ్తుంది అది అలా చాలా సంతోషంగా నవ్వుకుంటూ తన కడుపులో ఉన్న బిడ్డ తో…. చూడమ్మా ఇది ఎంత అందంగా ఉందో. ఇదంతా దేవుడు అందమైన సృష్టి. నువ్వు నా కడుపులో నుంచి బయటకు వచ్చిన తర్వాత నాలాగే హాయిగా ఆడుకోవచ్చు.అంటూ ఆ చెట్టు కొమ్మ మీద నుంచి ఈ చెట్టు కొమ్మ కి గెంతుతూ చాలా సంతోష పడుతూ ఉంటుంది.అలా చాలా సమయం వరకు ఆడుకున్న తరువాత దానికి బాగా ఆకలేస్తుంది. అప్పుడు దానికి దగ్గరలో ఒక జామ తోట కనిపిస్తుంది. కోతి: నా బంగారు తల్లికి ఆకలేస్తుందా. అదిగో అక్కడ జామపళ్ళు కనిపిస్తున్నాయి. ఇప్పుడే మనం వెళ్లి వాటిని తిందాం సరేనా కదా వెళ్దాం అంటూ తన కడుపులో ఉన్న బిడ్డ తో చెప్పి ఆ జామ తోట లోకి వెళుతుంది. అక్కడ జామకాయలు తింటూ…. చాలా బాగుంది కదా నాన్నా. అంటూ ఆనంద పడుతూ ఉంటుంది ఇంతలో ఆ తోట యజమాని అయిన సింగయ్య అక్కడికి వచ్చాడు ఆ కోతిని చూసి ఒక పెద్ద కర్ర తీసుకొని…. వుష్ వుషు మాయదారి కోతులు మాయదారి కోతులు అప్పుడే పడ్డాయి పళ్ళు సరిగ్గా రా నే రాలేదు వీటికి మాత్రం ఈ పళ్ళ మీద కళ్లు పడ్డాయి. పోవే పో అంటూ దాన్ని తరుముతూ ఉంటాడు. అతన్ని చూసిన కంగారులో కోతి అటూ ఇటూ గెంతుతూ…. అయ్యో నేను వెళ్ళిపోతాను నేను వెళ్లిపోతాను నన్ను కొట్టకండి. నేను కేవలం నాలుగు పళ్ళు మాత్రమే తిన్నాను .నేను పంట పొలాలను నాశనం చేయడానికి రాలేదు అని మనసులో అనుకుంటూ ఎటు పరిగెత్తాలో తెలియక చాలా భయపడుతూ ఉంటుంది. అతను ఆ కర్ర తీసుకుని మరింత భయపెట్టడం తో. ఆ కోతి ఆ చెట్టు నుంచి పక్కనే ఉన్న కరెంటు తీగల మీదకి దూకుతుంది. పాపం ఆ కరెంటు తీగల మీద దూకడంతో ఆ కోతి విలవిలలాడుతూ ….. అమ్మ అమ్మ నా బిడ్డ అమ్మా నా బిడ్డ. అంటూ పెద్ద పెద్దగా ఏడుస్తూ ఎంతో బాధను అనుభవిస్తూ. గిలగిలా కొట్టుకుంటూ ఉంటుంది.
లోపల ఉన్న బిడ్డ కూడా…అమ్మ నాకు నొప్పి పుడుతుంది అమ్మ నాకు చాలా నొప్పి పుడుతుంది అమ్మ. అమ్మో అమ్మో. అమ్మ అంటూ కేకలు పెడుతుంది. అలా కోతి చాలా తన ప్రాణం కోసం పోరాడి పోరాడి చివరికి మృత్యువు చేతిలో ఓడిపోతుంది.అది ఒక్కసారిగా తన ప్రాణాలు విడిచి తోట కి అటువైపుగా కింద పడిపోతుంది.
దాన్ని చూసిన యజమాని….. అయ్యో యో ఎంతపని జరిగిపోయింది పాపం ఆ కోతి గర్భవతి అనుకుంటా. చ నేను చాలా పెద్ద పొరపాటు చేశాను. మహా అయితే ఆ కోతి ఎన్ని పండ్లు తింటుంది. నేను దాన్ని అలా బాధపెట్టకుండా ఉండాల్సింది. నేను చేసిన పొరపాటు వల్ల. ఒక నిండు ప్రాణం నా కళ్ళముందే పోవడం చాలా బాధగా ఉంది.
అయ్యో భగవంతుడా నన్ను క్షమించు. ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేదు.
అని కంటతడి పెట్టుకొని అక్కడినుంచి ఇంటికి వెళ్తాడు.
చాలా సమయం తర్వాత శివయ్య ఆ కోతి రాక కోసం ఇంటి దగ్గర ఎదురు చూస్తూ ఉంటాడు. ఎంతసేపటికీ ఆ కోతి రాకపోవడంతో…. ఏమే ఏంటి మన కోతి ఇంకా ఇంటికి రాలేదు. మనని మర్చిపోయిదా ఏంటి. అసలు ఏమైపోయింది ఎక్కడికి వెళ్ళినా త్వరగానే ఇంటికి వస్తుంది. ఇంతవరకు రాకపోవడం ఏంటబ్బా.
భార్య….అయ్యో అది బయటికి వెళ్లి చాలా రోజులు అవుతుంది అది గర్భవతి అయిన దగ్గర్నుంచి నేను ఒక్కసారి కూడా దానిని బయటికి పంపించలేదు. ఇప్పుడు ఒక్కసారిగా బయటికి వెళ్ళింది కదా. అందుకే త్వరగా ఇంటికి రాలేదు కొంచెం సేపు ఎదురు చూడండి అదే వస్తుంది.
సార్ శివయ్య సరే అని మరి కొంత సేపు ఎదురు చూస్తాడు ఎంతసేపటికి కోతి రాకపోవడంతో అతను చాలా కంగారు పడుతూ…. ఏమే నేను అలా బయటకు వెళ్లి మన కోతి ఎక్కడ ఉందో చూస్తాను.
భార్య…. ఎక్కడ వెతుకుతారు అండి అదే వస్తుంది మీరు ఎక్కడికి వెళ్ళకండి.
శివయ్య….. ఏమోనే నాకు ఎందుకో చాలా భయంగా ఉంది మా మనసు అసలు ఊరుకోవడం లేదు. నా సంతోషం కోసమే నా ఊరికే అలా వెళ్ళి చూస్తాను.
అని చెప్పి బయటికి వెళ్లి అటూ ఇటూ చూస్తూ…. సీతమ్మ ఓ సీతమ్మ ఎక్కడున్నావ్ తల్లి నీకు ఇల్లు గుర్తుందా లేదా. మమ్మల్ని మర్చిపోతావా ఏంటి. ఎక్కడున్నావ్ నువ్వు నువ్వు దాగుడుమూతలు ఆడుతున్నావ్ అని నాకు అర్థం అయింది మర్యాదగా వస్తే చాలా బాగుంటుంది మనం త్వరగా ఇంటికి వెళ్ళిపోదాం చీకటి పడుతుంది కదా.
అని కేకలు వేస్తూ వెతుకుతూ ఉంటాడు.
అలా చాలా సమయం వెతికిన తర్వాత. అతనికి ఎందుకో అనుమానం వచ్చి ఆ తోట వైపుగా వెళ్తాడు. ఆ తోట కి వెళ్లే మార్గంలోనే ఆ కోతి చనిపోయి కనిపిస్తుంది. దాన్ని చూసి అతను… అమ్మ సీతమ్మ ఏమైంది తల్లి మా తల్లి ఏమైంది తల్లి ఒకసారి లేమ్మా బంగారు తల్లి కదా లేమ్మా . అంటూ పెద్ద పెద్దగా ఏడుస్తూ ఆ కోతిని పిలుస్తూ ఉంటాడు.
అతడు చాలా సమయం వరకు అక్కడే కూర్చుని ఎంతో బాధపడుతూ కోతిని ఒడిలో పెట్టుకొని ఏడుస్తూ ఉంటాడు.
అక్కడ అతని భార్య తన భర్త రాకపోవడంతో అతన్ని వెతుక్కుంటూ వస్తుంది. ఇంతలో రోడ్డుపైన ఆ కోతిని ఒడిలో పెట్టుకొని కూర్చుని ఏడుస్తూ కనపడటంతో పరుగుపరుగున అక్కడికి వెళ్లి… ఏమైందండీ ఏమైందండీ సీతమ్మకి అమ్మ సీతమ్మ బుజ్జి తల్లి లేమ్మా. అమ్మ పిలుస్తుంది నాన్న నీ కోసం ఏడుస్తున్నాడు తల్లి. నాన్న అంటే నీకు ఇష్టం కదా ఒకసారి లే. సీతమ్మ ఇదిగో నీకు ఇష్టమైన పండ్లు తీసుకు వస్తాను లే తల్లి. నా బంగారు తల్లి లేమ్మా. అంటూ ఆమె కూడా కన్నీరు మున్నీరుగా ఏడుస్తుంది.
శివయ్య…. ఇంకా మన సీతమ్మ మనకి లేదు. అసలు పొద్దున నేను బయటకు పంపించకుండా ఉండాల్సింది ఇదంతా జరిగేది కాదేమో. నా సొంత కూతురు లాగా పెంచుకున్నాను. నా బంగారు తల్లి ని. నీవల్ల నా కుటుంబం ఎన్నో సంవత్సరాల నుంచి ఆకలి అంటూ జరగదు. మా ఆకలి తీర్చిన దేవతవి. అమ్మ సీతమ్మ ఒక్కసారి లే తల్లి. అంటూ కన్నీరుమున్నీరవుతారు ఆ భార్యాభర్తలు ఇద్దరూ అలా చాలా సేపు అక్కడ ఏడ్చి ఏడ్చి కొంత సమయం తర్వాత ఆ కోతి ని తీసుకొని దహన సంస్కారం చేస్తారు.
భార్య…. నీ రుణం తీర్చుకునే అవకాశం మాకు దొరికిందనే లోపే మాకు దూరంగా వెళ్ళిపోయావా తల్లి. అందరికీ నువ్వు జంతువే కావచ్చు మా దృష్టిలో మాత్రం మా కన్నబిడ్డ తో సమానం. కన్నబిడ్డ దూరమైతే ఎలా ఉంటుందో నువ్వు దూరమైతే మాకు అంత కంటే ఎక్కువ బాధగా ఉంది. భగవంతుడా నీకు ఎన్నో మాయ శక్తులు ఉన్నాయి. నువ్వు తలుచుకుంటే ఏదైనా చేయగలవు. ఈ సీతమ్మని మనిషిగా మార్చి నాకు పుట్టబోయే బిడ్డ గా చెయ్యి. అలా అయినా నా సీతమ్మ రుణం తీర్చుకుంటా ము అంటూ బాధపడుతుంది.
శివయ్య కూడా చాలా బాధ పడుతూ…. ఊరుకో మన చేతుల్లో ఏమీలేదు. జీవితమే ఒక రంగస్థలం ఎవరు ఎవరికి సొంతం కాదు. ఈ బంధాలు బంధుత్వాలు తాత్కాలికమే. మనం ఆ జ్ఞాపకాలు తో బ్రతికి ఉండడం తప్ప చేసేది ఏమీ లేదు.అంటూ ఆమెను ఓదార్చి అక్కడినుంచి తీసుకొని వెళ్ళి పోతాడు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *