గర్భవతి కోతి మిక్సర్ జ్యూస్_ Telugu Stories- Stories in Telugu – Panchatantra Kathalu

ఒకరోజు ఒక గర్భవతి అయిన కోతి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంది. ఆ కోతికి ఒక మిక్స్ జ్యూస్ కనబడుతుంది. దాన్ని చూసి నా గర్భవతి కోతి…. ఏంటిది భలేగా ఉంది దీనిని మా ఇంటికి తీసుకెళ్తే మా అమ్మ చాలా సంతోష పడుతుంది అని అనుకొని ఆ మిక్సర్ ని తీసుకొని తన ఇంటికి వెళ్తుంది అక్కడ లక్ష్మి ఆ గర్భవతి కోతిని చూసి…. ఎక్కడిది ఈ మిక్సీ నీకు మళ్ళీ ఎవరిదైనా తీసుకొచ్చావా అసలు నీకు రోజు రోజుకి అల్లరి పనులు దొంగ పనులు ఎక్కువైపోయాయి. మర్యాదగా ఆ మిక్సర్ నీ ఎవరి దగ్గర తీసుకోవచ్చా వాళ్ళకి ఇచ్చి రా పో.

కోతి… నేను ఎవరి దగ్గర దొంగిలించ లేదు. ఇది నేను వస్తుంటే దారిలో కనిపించింది. అందుకే ఇక్కడికి తీసుకు వచ్చాను నువ్వు సంతోష్ పడతావ్ అనుకుంటే నా పైన రంకెలు చేస్తున్నావ్ ఏంటి అంటూ సైక చేస్తుంది.
అందుకు లక్ష్మి…. నువ్వు చెప్పేది నిజమేనా నాకెందుకు నమ్మబుద్ధి కావటం లేదు.
కోతి ఏడుస్తూ….. నేను అసలు నిజమే చెప్పాను అంటావా ఎందుకు ప్రతి సారి నన్ను అలా అంటావు. నేను నిజంగా నిజమే చెప్తున్నాను.
లక్ష్మి….. సరే అయితే మంచి పని చేసావు లే. అని ఆ మిక్సినీ తీసుకుని లోపలికి వెళ్ళి పోతుంది. అలాగా కొన్ని రోజులు గడిచాయి లక్ష్మి భర్త ఒకరోజు లక్ష్మితో…. లక్ష్మి ఇది ఎండాకాలం ఎక్కడ పనులు ఉండవు మనం ఏదైనా వ్యాపారం మొదలు పెట్టుకోవడం మంచిది ఏ వ్యాపారం అయితే బాగుంటుంది.
లక్ష్మి…. దోసెల వ్యాపారం పునుగులు బజ్జి. అలాంటివి ఏదైనా పెడదామా.
భర్త… వేసవికాలం కాబట్టి అది పెద్దగా అమ్ముడు పోవు. పండ్ల వ్యాపారం పెడదామా.
లక్ష్మి….. ఆ మంచి ఆలోచన పండ్లతో పాటు పండ్లరసం వేసవికాలం కాబట్టి ఖచ్చితంగా దాహంతో ఉంటారు మనుషులంతా. ఎక్కువగా తిరిగే చోటు చూసుకొని వ్యాపారం పెట్టమంటే. డబ్బే డబ్బు.
భర్త…. మంచి ఆలోచన కానీ వచ్చిన వాళ్ళకి వచ్చినట్టుగా ఇవ్వాలి. దానికి ఒక మంచి మిక్సీ తీసుకొస్తాను.
లక్ష్మి… వద్దండి మా ఇంట్లో మిక్సీ ఉంది అంటూ జరిగిన విషయం అంతా చెబుతుంది.
భర్త దానిని మన కోతి మంచి పని చేసింది.
ఇంకెందుకు ఆలస్యం రెండు రోజుల్లో వీలు చూసుకొని వ్యాపారం మొదలు పెడదాం. అని అనుకుంటారు అనుకున్న విధంగానే రెండు రోజులు గడిచాయి వాళ్ళు ఒక మంచి ప్రదేశం చూసుకొని పండ్ల వ్యాపారం తో పాటు పండ్ల రసం వ్యాపారం కూడా మొదలుపెడతారు.
ఆ గర్భవతి కోతి వచ్చిన వాళ్లందరికీ ఆ పండ్ల రసాన్ని అందిస్తుంది. అలాగే వాళ్లు తాగిన గాజు గ్లాస్ ని శుభ్రం చేస్తుంది. కోతి పనులు చేయడం వచ్చిన వాళ్లకు అందించడం అనేది వాళ్లకి మరియు వినియోగదారులకు కూడా చాలా సంబరంగా అనిపిస్తుంది. అలా వాళ్ల వ్యాపారం చాలా చక్కగా సాగుతుంది.
ఒక రోజు సాయంత్రం వేళ భార్య భర్తలు ఇద్దరు కూర్చొని వచ్చిన డబ్బుని లెక్కపెట్టుకుంటూ ఉంటారు. లక్ష్మి…. ఏమండీ చాలా మంచి లాభం వచ్చింది అండి. అసలు ఇంత మంచి లాభం వస్తుందని అస్సలు అనుకోలేదు ఇదంతా మన కోతి వల్లే.
భర్త…. అవును లక్ష్మి ఎందుకంటే ఆ కోతి పనులు చేయడం చూసి చాలామంది దాన్ని కోసం వచ్చి మరి ఇ జ్యూస్ తాగుతున్నరు.
ఇంతలో కోతి అక్కడికి వచ్చి….. అవునా నా అయితే నేను ఈ మధ్య బాగా పనులు చేస్తున్న అన్నమాట. అని సైగ చేస్తుంది అందుకు వాళ్ళు…..అవును ఈ మధ్య చాలా బాగా పని చేస్తున్నావు అల్లరి కూడా తగ్గించావ్వు. ఇప్పుడు నువ్వు మాకు మంచి పని మనిషివి అంటూ నవ్వుతారు అప్పుడప్పుడు ఆ కోతి కూడా నవ్వుతూ…. అవును అయితే మరి కొన్ని రోజుల్లో మరో పని వాడు కూడా వస్తాడు అది ఎవరో కాదు నాకు పుట్టబోయే బిడ్డ. అంటూ ఎంతో ఆనంద పడుతూ గెంతులేస్తూ అక్కడి నుంచి వెళ్లి పోతుంది. అలా ఆ భార్యాభర్తలు ఇద్దరూ వాళ్ళ వ్యాపారం చూసుకుంటూ ఉంటారు ఆ కోతి వాళ్ళకి సహాయం చేస్తూ ఉంటుంది వాళ్ళు లేనప్పుడు. ఆ కోతి మిక్సీ చేసి ఆ జ్యూస్ ని అందిస్తూ ఉంటుంది అలా రోజులు గడిచాయి ఒకరోజు ఆ భార్యాభర్తలిద్దరూ ఆ కోతితో…. చూడమ్మా మేము ఇద్దరం అలా హాస్పిటల్ దాకా వెళ్లి వస్తాము. నువ్వు వచ్చిన వాళ్ళకి జాగ్రత్తగా జ్యూస్ నీ అందించు వాళ్ళని అల్లరి చేయకు సరేనా.
అందుకు కోతి…. నేను అల్లరి మానేసి ఎన్నో రోజులు అవుతుంది. నేనేమీ అలా చెయ్యను మీరు ధైర్యంగా వెళ్లి రండి అంటూ సైక చేస్తుంది. సరే అని చెప్పి వాళ్ళిద్దరూ అక్కడనుంచి వెళ్ళి పోతాడు. ఆ కోతి ఒకటి అక్కడ కూర్చొని ఉంటుంది. ఇంతలో ఒక మంత్రగాడు ఆ కోతి దగ్గరకు వచ్చి…. ఎవరూ లేరా ఒక కోతిని పెట్టి వెళ్లారు. ఆ వ్యక్తిని చూసిన కోతి అతనితో….. అయ్యగారు చెప్పండి నేనే ఉన్నాను ఇక్కడ నీకు ఏం కావాలో నేను ఇస్తాను అంటూ సైగ చేస్తుంది.
అందుకు అతను….. భలే తెలివైన దానిలా ఉన్నావ్ అందుకే మీ యజమానిని నిన్ను ఎక్కడో చూసినట్లు ఉన్నాడు అది సరే గానీ మంచి జ్యూస్ తయారు చేసి ఇవ్వు.
అందుకు ఆ కోతి సరే అని చెప్పి మిక్సీలో పండ్లను వేసి జ్యూస్ తయారు చేసి అతనికి ఇస్తుంది. దానిని తీసుకొని అతను తాగి… చాలా బాగా చేశావ్ మరొకటి ఇవ్వు. అంటూ మరో రెండు మూడు గ్లాసులు జ్యూస్ ని తాగుతాడు. అతడు అలా తాగిన తర్వాత…. కోతి వైన మనిషి కంటే భలేగా రుచిగా తయారుచేసావు. అన్ని సరిగ్గా సరిపోయినాయి. అంటూ అక్కడి నుంచి వెళ్ళి పోతూ ఉండగా ఆ కోతికి అతన్ని అడ్డుకుని…. అయ్యగారు డబ్బులు ఇవ్వడం మర్చిపోయారు. డబ్బులు ఇచ్చి వెళ్లండి అంటూ అతన్ని సైక చేసి అడుగుతుంది.
అప్పుడు అతను… ఏంటే ఎవర్ని పట్టుకుని డబ్బులు అడుగుతున్నా వో తెలుసా.
కోతి…. మీరు ఎవరైతే నాకెందుకు న్యాయం ప్రకారం. మీరు జ్యూస్ని తాగారు దానికి డబ్బులు అడుగుతున్నాను. దయచేసి డబ్బులు ఇవ్వండి. అందుకు అతను….. ఏంటే కోతి చాలా ఎక్కువ చేస్తున్నావ్ అంటూ దాన్ని కాలితో ఈడ్చి తంతాడు. పాపం ఆ కోతి దూరంగా వెళ్లి పడి ఏడుస్తూ…. అయ్యో భగవంతుడా ఏంటి వ్యక్తిలా ప్రవర్తిస్తున్నాడు. మా వాళ్లు ఇప్పుడే కొంచెం నాలుగు రాళ్ళు వెనకేసుకు ఉంటున్నాడు. ఇతను చేసిన పని వల్ల వాళ్ళకి నష్టమే కదా. నేను అలా కానివ్వను అంటూ మళ్ళీ అతని దగ్గరికి వెళ్లి…… అయ్యా డబ్బులు ఇచ్చి వెళ్లండి దయచేసి డబ్బులు ఇచ్చేయండి ఈరోజు నా దగ్గరికి ఎవ్వరూ రాలేదు మీరే మొదటి బోని. దయచేసి డబ్బులు ఇచ్చి వెళ్లండి. అంటూ ప్రాధేయ పడుతోంది.
అప్పుడు ఆ వ్యక్తికి బాగా కోపం వచ్చి…. నా గురించి నీకు అర్థం కావట్లేదు కదా నేనేం చేస్తానో చూడు. అంటూ ఆ కోతిని శపిస్తాడు. వెంటనే ఆ కోతి చిన్నదాని గా మారిపోతుంది.
ఇక ఆ వ్యక్తి అక్కడనుంచి వెళ్ళి పోతాడు కోతి ఎంతో బాధపడుతూ….
అయ్యో భగవంతుడా ఈ దుర్మార్గుడు నన్ను ఈ విధంగా చేసి వెళ్ళాడు. అయ్యో అంటూ బాధపడుతూ ఉంటుంది కొంత సమయానికి
భార్యాభర్తలిద్దరూ ఆ దుకాణం దగ్గరికి వస్తారు. అప్పుడు లక్ష్మి…. ఈ కోతి ఎక్కడికెళ్ళింది దుకాణాలన్నీ వదిలిపెట్టి. దీనికి అంత ముఖ్యమైన పని ఏముంటుంది. అసలు దీనికి కొంచెం కూడా బాధ్యత లేదు.
దీనికి అల్లరి తగ్గింది అనుకున్నాను కానీ ఏ మాత్రం తగ్గలేదు. భర్త…. సరే సరే కాని మనుషులే చెప్పింది చెప్పినట్టు చేయడం లేదు ఆ మూగ జీవి ఏం చేసింది. అనుకుంటూ ఉండగా ఒక వ్యక్తి అక్కడికి వచ్చి జ్యూస్ ని అడిగి తీసుకొని తాగి వెళ్ళిపోతాడు. అలా వాళ్ళు ఇద్దరు వ్యాపారంలో మునిగి పోతారు ఆ కోతి ఆ పండ్ల మీదే నిలబడి ఏడుస్తూ… అమ్మ నేను ఎక్కడికి వెళ్ళలేదు ఒకసారి నన్ను చూడు అమ్మా నన్ను ఒక వ్యక్తి ఇలా చేసి వెళ్ళిపోయాడు అమ్మ అమ్మ నన్ను చూడమ్మా అంటూ కంటతడి పెట్టుకుంటుంది. పాపం దాని ఆ కోతి ఆకారం చిన్నగా ఉండడంతో. ఆ కోతి మాటలు కానీ దాని ఆకారం కానీ ఎవరికీ కనిపించదు. అది రాత్రంతా అక్కడ ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది తన తల్లికి తన ఇక్కడే ఉన్నాను అని చెప్పడం కోసం కానీ ఏం లాభం లేదు. అలా సాయంత్రం గడిచిపోతుంది ఆ భార్యాభర్తలు ఇద్దరూ వాళ్ళ దుకాణాo మూసివేసి ఇంటికి వెళ్తారు. పాపం ఆ కోతి ఆ దుకాణంలోనే చిక్కుకుపోయి ఎంతో బాధపడుతూ ఉంటుంది. ఇంటికి వెళ్ళిన భార్య భర్తలు ఇద్దరూ ఒకరితో ఒకరు…. ఏవండీ మన కోతి ఎక్కడికి వెళ్ళినట్టు కొంపదీసి ఎవరన్నా పట్టుకెళ్లారు అంటారా.
భర్త… అలా ఏం జరగదు. నువ్వు ధైర్యంగా ఉండు రేపు మొత్తం నేను వెతికి చూస్తాను అని ధైర్యం చెప్తాడు కానీ అతని మనసులో…. భగవంతుడా ఆ కోతికి ఏం కాకుండా చూడు.
అని దేవుని ఆ మరుసటి రోజు ఉదయాన్నే లక్ష్మీ తన వ్యాపారం చేసుకుంటూ ఉంటది. ఆమె భర్త మొత్తం తిరిగి కోతి జాడ తెలియక మళ్లీ ఆ వ్యాపారం దగ్గరికి వస్తాడు అప్పుడు లక్ష్మి… ఏమైందండీ కోతి జాడ కనపడలేదా.
భర్త…. చాలా చోట్ల తిరిగాను లక్ష్మి .కానీ ఎక్కడా కోతి జాడ కనిపించలేదు. లక్ష్మీ చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలో ఒక ఆమె అక్కడకు వచ్చి…. అమ్మ పండ్ల రసం ఒకటి ఇవ్వండి అని అడుగుతుంది ఆమె సరే అనీ ఆ పండ్లను తీసుకుంటుంది అక్కడే ఆ కోతి కూడా నిద్రిస్తూ ఉంటుంది. పొరపాటున ఆ మిక్సీలో కోతి ఉండిపోతుంది. మెలుకువ వచ్చిన కోతి…. అమ్మ నేను ఇక్కడ ఉన్నాను మిక్సీలో నువ్వు గనుక దీన్ని తిప్పితే నా ప్రాణాలు పోతాయి అమ్మ. అంటూ పెద్ద పెద్దగా ఏడుస్తూ ఉంటుంది. లక్ష్మి స్విచ్ వేయబోయే ముందు కరెంట్ పోవడంతో లక్ష్మీ వచ్చిన ఆమెతో…. కరెంట్ పోయింది ఒక పది నిమిషాల్లో వస్తుందేమో కొంచెం సేపు అలా కూర్చోండి. ఉంటుంది ఆమె సరే అని చెప్పి అక్కడ కూర్చుంటుంది. ఆ కోతి అక్కడి నుంచి బయటపడి…. భగవంతుడా ఒక్క క్షణం నా గుండె ఆగిపోయింది ఈరోజు ఎలాగైనా మా అమ్మకి నేను కనపడాలి సిందే. అంటూ ఆమె చేయి దూకుతుంది. దానిని గమనించిన ఆమె భర్త…. లక్ష్మీ ఏం టొ పురుగు పాకుతుంది అంటూ ఆమె చేతి పై ఉన్న అక్కో తిని పురుగు అనుకొని విసిరేస్తాడు . పాపం ఆ కోతి ఒక మూలన పడుతుంది. అది ఏడుస్తూ…. నేనేం చేయాలి రా భగవంతుడా నువ్వే నాకు సాయం చెయ్యి. అనుకుంటూ ఉంటుంది ఆ రోజు రాత్రి సమయం . ఆ భార్య భర్తలు ఇంటి దగ్గర ఆ కోతి గురించి బాధపడుతూ….. ఏమండీ మన కోతి తిరిగి మన దగ్గరికి రాదు అంటారా. నాకు చాలా భయంగా ఉందండి అంటూ ఏడుస్తుంది. అతను కూడా ఆమెకు ధైర్యం చెబుతూనే బాధపడతాడు. వాళ్ళిద్దరూ అలా బాధ పడుతూ ఉండగా ఆ మంత్ర గాడు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు అప్పుడు అతని కళ్ళలో కోతి కనిపించి….. దయచేసి నన్ను మామూలు స్థితికి తీసుకు రండి. నేను మీకు ఏం పాపం చేశాను ఏమి అన్యాయం చేశాను. నేను గర్భవతిని. నాకు ఎన్నో ఆశలు ఉన్నాయి నా బిడ్డ మీద. మీకు ఇది న్యాయం అనిపిస్తుందా దయచేసి నన్ను మామూలు స్థితికి తీసుకు రండి అంటూ బోరున ఏడుస్తుంది. ఆ మంత్రగాడు ఒక్కసారిగా నిద్రనుంచి మేలుకొని…. అయ్యో పాపం ఆ కోతి చాలా బాధపడుతుంది నేను చేసింది తప్పే.ఆ రోజు డబ్బులు ఇవ్వకపోవడం చాలా తప్పు ఆవేశంలో దాన్ని అలా మార్చడం మరింత తప్పు రేపు ఉదయాన్నే వెళ్లి దాన్ని మామూలు స్థితికి తీసుకురావాలి.అని అనుకుంటాడు ఆ మరుసటి రోజు ఉదయాన్నే భార్యాభర్తలిద్దరూ వ్యాపారం చేసుకుంటూ ఉంటారు అప్పుడే ఆ మంత్ర గాడు అక్కడికి వస్తాడు. లక్ష్మి….. ఏం కావాలి అండి అని అడుగుతుంది.
అతను…. నాకేం వద్దమ్మా మీ కోతి నీ కాపాడడం కోసం వచ్చాను.
అందుకు ఆ భార్యాభర్తలిద్దరూ ఆశ్చర్యంగా….. మా కోతి గురించి నీకెలా తెలుసు అని అడుగుతారు.
అందుకు అతను చాలా బాధపడుతూ జరిగిన విషయమంతా చెప్పాడు. ఆ విషయం విన్న భార్యాభర్తలిద్దరూ చాలా బాధపడతాడు వెంటనే అతను అంతా వెతికి ఆ కోతిని అట్టి దాన్ని మామూలు స్థితికి తీసుకు వస్తాడు. దాన్ని చూసిన భార్యాభర్తలిద్దరూ చాలా సంతోష పడతారు. కోతి కూడా చాలా సంతోషపడుతుంది. ఆ మంత్రగాడు…. నేను చేసిన తప్పుని క్షమించండి అంటూ వాళ్ళకి డబ్బులు ఇచ్చి అక్కడనుంచి వెళ్ళి పోతాడు. మళ్లీ వాళ్ల కుటుంబం లోకి సంతోషం తిరిగి వస్తుంది . ఈ కథ గనుక నీకు నచ్చినట్లైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *