గర్భవతి కోతి రాకెట్_ Telugu Stories- Stories in Telugu – Panchatantra Kathalu

అది ఒక చిన్న గ్రామం ఆ గ్రామంలో వినయ్ అనే ఒక బొమ్మల వ్యాపారి ఉండేవాడు. అతడు ప్రతి రోజు తన షాప్ దగ్గరికి వెళ్లి బొమ్మలు అమ్ముకుంటూ ఉండేవాడు. ఒకరోజు వినయ్…. అసలు ఈ బొమ్మల వ్యాపారం పెట్టి తప్పు చేశాను అని పిస్తోంది. అందరూ చూడటానికి వచ్చే వాళ్లే కానీ కొనేవాళ్ళు కనపడరు. ఇంకా నాలుగు రోజులు చూస్తాను. బేరం సరిగ్గా లేకపోతే పొలం పని చేసుకోవడం మంచిదనిపిస్తుంది.

అని అనుకుంటూ ఉండగా అక్కడికి ఒక గర్భవతి ఆయన కోతి వస్తుంది. ఆ కోటి వినయ్ తో ….. మిత్రమా నేను ఎన్నో రోజుల నుంచి. ఎక్కడున్నావ్ బొమ్మలను చూస్తున్నాను నాకు చాలా బాగా నచ్చాయి.
నిజం చెప్పాలంటే అదిగో నీ వెనకాల కనబడుతుంది రాకెట్ బొమ్మ. అ ది అయితే మరీ మరీ నచ్చింది. దయచేసి ఆ బొమ్మ నాకు ఇవ్వవా. కావాలంటే కొంచెం సేపు వాడుకుని మళ్ళీ తిరిగి ఇచ్చేస్తాను. అని సైగ చేస్తోంది .
వినయ్….. ఓసోస్ ఇదేదో బానే ఉంది . నాకే బేరాలు లేక అల్లాడుతుంటే . మధ్యలో నువ్వొచ్చి ఊరకనే బొమ్మలు కావాలా అంటావేంటి. వెళ్ళు వెళ్ళు బొమ్మలు లేవు ఏమి లేవు అయినా. ఆ బొమ్మ అమ్మడానికి కాదు. దాన్ని ఎంతోకాలంగా ప్రదర్శన కోసమే ఉంచుతున్నాను.
కోతి…. అయితే ఈ బొమ్మలని నేను అమ్మి పెడతాను. అప్పుడు నాకు ఆ రాకెట్ బొమ్మనీ ఇస్తావా. అందుకు అతను….హా..హా..హా ఏంటి నువ్వు బొమ్మలు అమ్ముతావా . మనిషిని నేను అమ్ముతుంటే నే ఎవరు కొనడం లేదు. కోతి వి నువ్వు అమ్మితే కొంటారా.
కోతి ….. లేదు నేను నిజంగానే అన్ని డబ్బులు తీసుకు వస్తాను.
ఆ వ్యక్తి….. డబ్బులు తీసుకు వస్తావా లేక ఉన్న బొమ్మలు అన్ని తీసుకొని పరిగెడతావ.
కోతి… నిజంగా నన్ను నమ్మండి ఒక్క అవకాశం ఇచ్చి చూడండి. అని బతిమిలాడితు సైగ చేస్తుంది .
అందుకు వినయ్ కి ఆ కోతి పై నమ్మకం కలిగి సరే అని కొన్ని బొమ్మలు ఇస్తాడు. ఆ కోతి ఆ బొమ్మల్ని తీసుకొని రోడ్డుపై అమ్ముతూ ఉంటుంది. చాలామంది కోతి చేసే చేష్టలకు నవ్వుకుంటూ. ఆ బొమ్మలను కనుక్కొని డబ్బులు ఇచ్చి వెళ్ళి పోతూ ఉంటారు.
అలా సాయంత్రానికి ఆ బొమ్మలు అమ్మి డబ్బు సంపాదిస్తున్నది కోతి. ఆ రోజు సాయంత్రం వినయ దగ్గరికి వెళ్లి…. ఇదిగో ఒక్క బొమ్మ కూడా మిగలకుండా అమ్మేశాను. ఇదిగో డబ్బులు తీసుకో ఇప్పుడైనా ఆ రాకెట్ బొమ్మ దయచేసి ఇవ్వవా. అందుకు వినయ్…. సరే నువ్వు నాకు చాలా మంచి సహాయం చేశావు ఇంత చేసినా నీకు కేవలం బొమ్మ ఎందుకు ఇవ్వలేదు ఇప్పుడే ఇస్తా అని ఆ రాకెట్ బొమ్మని ఇస్తాడు.
ఆ కోతి ఎంతో సంతోషంతో ఆ రాకెట్ బొమ్మ ని తీసుకొని అక్కడి నుంచి వెళ్లి పోతుంది అది ఒక చెట్టు దగ్గర కూర్చుని ఆ రాకెట్ బొమ్మ తో ఆడుకుంటూ ఉంటుంది. ఇంతలో ఆ రాకెట్ బొమ్మ పెద్దగా మారిపోతుంది.దాని ఆకారం చూసిన కోతి చాలా భయంతో దూరంగా వెళ్ళి దాక్కుంటుంది. అప్పుడు ఆ రాకెట్….. మిత్రమా ఎందుకు అంత దూరంగా వెళ్లిపోయావు. నేను నిన్ను ఏం చేయను.
దగ్గరకు రా. రాకెట్ మాట్లాడటం చూసిన కోతి చాలా ఆశ్చర్యపోతూ….. ఎవరు నువ్వు నువ్వు ఎలా మాట్లాడగలుగుతున్నావు.
రాకెట్…. నేను మాయ రాకెట్ ని. పాపం ఆ విషయం యజమానికి తెలియదు. అయినా ఇన్ని సంవత్సరాలకు నన్ను బయటికి తీసుకు వచ్చినందుకు నీకు చాలా కృతజ్ఞతలు.
అందుకు గర్భవతి కోతి రాకెట్ దగ్గరకు వచ్చి…. ఓ అవునా నా కాని నాకు ఇది అంతా ఒక కల లాగ అనిపిస్తుంది.
రాకెట్… ఇదంతా ఓ కల కాదు నిజం.
గర్భవతి కోతి… అయితే మిత్రమా మనం ఒకసారి గాల్లో అలా తిరిగి వద్దామా.
రాకెట్…. ఓ తప్పకుండా మిత్రమా వెళ్దాం పద.అని రాకెట్ అంటుంది వెంటనే కోతి ఆ రాకెట్ పై కూర్చుంటుంది. రాకెట్ గాల్లో కి లెగుస్తుంది. ఆకాశంలో మేఘాలు దాటుకుంటూ వెళ్ళడం చూసిన కోతి….. అబ్బా ఎంత బాగుందో అని అనుకుంటూ ఉంటుంది ఆ రాకెట్ ….. ఇంకా చాలా ఉంటుంది మిత్రమా. అని అంటుంది అలా వాళ్ళు వెళ్తుండగా కింద ఆ కోతికి ఒక అడవి కనబడుతుంది. ఆ అడవిని చూసిన కోతి…. అబ్బా ఎంత బావుందో ఆడవి. మిత్రమా ఒకసారి ఆడవి లోపలికి వెళ్ళి వద్దాం పద.
రాకెట్…. సరే మిత్రమా వెళ్దాం పద అంటూ అడవి లోకి వెళ్తారు. అక్కడ కోతి….. అబ్బా ఈ అడవిలో రంగురంగుల పువ్వులు కాయలు చాలా ఉన్నాయి. అంటూ ఎంతో ఆనందంతో ఆ ఆడవి మొత్తాన్ని తిరుగుతూ పండ్లని కోసుకొని తింటూ సంతోష పడుతూ ఉంటుంది. ఇంతలో దానికి …… కాపాడండి ఎవరైనా నన్ను కాపాడండి. అంటూ కేకలు వినబడతాయి. వెంటనే ఆ కోతి. … ఎవరో ప్రమాదంలో ఉన్నట్టున్నారు. అది అనుకోని రాకెట్ దగ్గరకు వచ్చి …..మిత్రమా వెంటనే ఆ అరుపులు ఎక్కడ వినబడుతున్నాయి అక్కడికి తీసుకు వెళ్ళు. అని రాకెట్ పై కూర్చుంటుంది. ఆ రాకెట్ అక్కడ నుంచి ఆరుపులు వినపడుతున్న ప్రదేశానికి వెళుతుంది. అక్కడ ఒక వ్యక్తిని కింద పడిపోయి కనబడతాడు. వెంటనే ఆ కోతి రాకెట్ నుంచి దిగి చూడగా అతని కాలి పై గాయమయ్యే ఉంటుంది. దాన్ని చూసిన కోతి… అయ్యో ఇతన్ని పాము కాటు వేసి నట్టు ఉంది. ఇప్పుడు ఏం చేయాలి.
రాకెట్…. మిత్రమా నువ్వు కంగారు పడకు నేనున్నాగా నా మాయలతో దాన్ని తొలగించి చేస్తాను. అని చెప్పి అతనికి ఉన్న గాయాన్ని విషాన్ని తొలగిస్తుంది. అతను వెంటనే కోలుకొని వాళ్లతో….. సమయానికి వచ్చి నా ప్రాణాలు కాపాడారు. లేకపోతే నా భార్య బిడ్డలు ఇద్దరూ అన్యాయమై పోయేవాళ్ళు.
ఆ భగవంతుడిని మి రూపంలో వచ్చి కాపాడాడు. మీకు కృతజ్ఞతలు అనీ అంటాడు.
కోతి….. మరేం పర్వాలేదు కానీ మీరు వంటరిగా ఇక్కడికి ఎందుకు వచ్చారు.
అతను ఏడుస్తూ….. మాది చాలా పేద కుటుంబం. పనులు ఉన్నప్పుడు నా భార్య నేను ఇద్దరం కలిసి పనికి వెళ్లేవాళ్లం. ఇప్పుడు పనులు లేవు కదా అందుకే అడవికి కట్టెలు కొట్టడానికి వచ్చాను. ఇంతలో ఇది జరిగింది.
కోతి…. అయ్యో పాపం బాధపడకండి మీకు కూడా దేవుడు మంచి రోజులు ఇస్తాడు. తప్పకుండా మంచి రోజులు మీకు కూడా వస్తాయి.
రాకెట్…. ఎప్పుడు రావడం కాదు మిత్రమా. ఇప్పుడే వస్తాయి అని బంగారం ప్రత్యక్షం చేస్తుంది. దానిని చూసిన అతను చాలా ఆశ్చర్య పోయి సంతోషంగా…. మీకు చాలా కృతజ్ఞతలు ఇప్పుడు మా కుటుంబం చాలా సంతోషంగా జీవిస్తాం. అని అంటాడు.
ఆ కోతి రాకెట్ ఇద్దరు…. జాగ్రత్త గా ఆ బంగారం తీసుకొని ఇంటికి వెళ్ళు. ఇక మేము బయలుదేరుతున్నాం. అని ఆ కోతి రాకెట్ పైకి.. వెళ్ళొస్తాను బాయ్ అంటుంది. ఆ వ్యక్తి వాళ్ళకి బాయ్ చెప్పి ఆ బంగారమంతా మూట కట్టుకొని అక్కడనుంచి వెళ్ళి పోతాడు. ఆ కోతి రాకెట్లు గాలిలో ఎగురుతూ ఇలా మాట్లాడుకుంటాయి. కోతి…. మిత్రమా నీకు ఎన్నో మాయలు ఉన్నాయి ఆ కోతికి బాలే సహాయం చేశావు. అతని ముఖంలో ఎంత సంతోష వచ్చిం దొ. ఇంక వాళ్ల జీవితం సుఖమయం అయిపోతుంది.
రాకెట్…. అవును మిత్రమా నువ్వు చెప్పింది. నాకు కూడా సంతోషంగా ఉంది. అని వాళ్లు మాట్లాడుకుంటూ ఉండగా ఒక ఆమె …. దొంగ పట్టుకోండి దొంగ నా మెడలో గొలుసు తీసుకెళ్ళి పోతున్నాడు. అంటూ పెద్ద పెద్దగా కేకలు వేస్తూ అతని వెంట పడుతుంది. ఆమె అతని వెంట పడడం గమనించిన కోతి… మిత్రమా ఎవరో ఆడ ఆమె అతని వెంట పడుతుంది. బహుశా దొంగ ఏమో పద వెళ్లి అతని పట్టుకుందాం. అని అంటుంది రాకెట్ చాలా వేగంగా వెళ్లి అతని ముందు ఆగుతుంది. రాకెట్ పై కోతిని రాకెట్ ని చూసిన అతను చాలా ఆశ్చర్య పోతూ ఉంటాడు.
ఇంతలో ఆమె వచ్చి అతన్ని పట్టుకుంటుంది.
ఆ దొంగ….. వదిలేయండి దయచేసి నన్ను వదిలేయండి. మీ గొలుసు మీకు కావాలి అంతేగా. తీసుకోండి అంటూ ఆ గొలుసు ఇచ్చేస్తాడు. ఆమె రాకెట్ ,కోతితో….. బలే సమయానికి వచ్చి దొంగని పట్టించారు మీకు చాలా కృతజ్ఞతలు. అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ కోతి ఆ దొంగ తో…. కాళ్లు చేతులు బాగానే ఉన్నాయి గా ఏదైనా పని చేసుకొని బ్రతకొచ్చు గా. ఇలా దొంగతనం చేసి బ్రతక పోతే క ఏమవుతుంది అంటూ సైగా. చేస్తుంది. అప్పుడు ఆ వ్యక్తి పెద్దగా ఏడుస్తూ…. మీరు చెప్పింది నిజమే కానీ నేను దొంగని కాదు. రోజు కూలి పని చేసుకునే కూలీ వాడిని. నా భార్య హాస్పిటల్ లో ఉంది. ఆమెకు కిడ్నీ ఆపరేషన్ కు 10 లక్షలు కావాలని చెప్పారు.ఇప్పుడున్న పరిస్థితిలో నా ఇల్లు అమ్ముకున్న 1000000 రాదు. ఏం చేయాలో అర్థం కాక ఇలా దొంగతనం చేయాల్సి వచ్చింది. అంటూ బోర్న్ ఏడుస్తాడు.
అప్పుడు రాకెట్…. బాధపడకు నేను నీకు సహాయం చేస్తాను. అని చెప్పి అతనికి బంగారు నాణేలు ఇచ్చి….. వీటి నీ అమ్మి డబ్బు గా మార్చి నీ భార్యకు ఆపరేషన్ చేయించండి. అతను చాలా సంతోషపడుతూ… మీకు చాలా కృతజ్ఞతలు. ఇప్పుడే ఆ పని చేస్తాను అని చెప్పి అక్కడి నుంచి వాటిని తీసుకొని సంతోషంగా వెళ్తాడు.
గర్భవతి కోతి…. పాపం మనుషులకి ఎన్నో కష్టాలు. అవి భరిస్తూనే వాళ్ళు వాళ్ళ జీవితాన్ని గడుపుతున్నారు. ఒక్కొక్కరిదీ ఒక్కొక్క కష్టం. ఏదేమైనా ఈ మనుషులు చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది మిత్రమా. రాకెట్….. బాధపడి ఏం ప్రయోజనం లేదు మిత్రమా. ఆ భగవంతుడు
చేతిలో వీళ్లంతా కీలుబొమ్మలు. ఆయన ఆడినట్టు గా వీళ్ళు ఆడుతూ ఉంటారు. అంతేగాని ఎవరి చేతిలో ఏదీ ఉండదు.
కోతి… అవును మిత్రమా ఈ సృష్టిలో ప్రతి జీవి ఆయన చేతిలో ఒక బొమ్మ లాంటిదే. అని అంటుంది. కోతి,… సరే పద మిత్రమా వెళ్దాం ఇంకా పని దాని పై కూర్చుని వెళుతూ ఉండగా కోతి….. మిత్రమా నువ్వు వాళ్ళిద్దరికీ సహాయం చేశావు కానీ ముఖ్యమైన వ్యక్తికి సహాయం చేయడం మర్చిపోయావు.
రాకెట్…. ఎవరా వ్యక్తి.
కోతి…. ఎవరు ఏంటి ఎన్ని సంవత్సరాలు నిన్ను దాచి ఉంచిన వినయ్. అతడే కదా నిన్ను ఇన్ని రోజులు సురక్షితంగా దాచాడు.
రాకెట్…. అవును అతను దాచిపెటడం వలనే నేను ఇన్ని రోజులు ఇక్కడ ఉండిపోవాల్సి వచ్చింది. లేదంటే ఎప్పుడో ఇక డ నుంచి వెళ్లిపోయే దాన్ని.
కోతి… అవును మిత్రమా అసలు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు. నీకసలు ఎన్ని మాయలు ఎలా తెలుసు.
రాకెట్…. మాది వేరే గ్రహం నేను భూలోకం ని చూద్దామని వచ్చాను. మా గ్రహంలో ఉన్న వాళ్లందరికీ ఎన్నో మాయలు ఉంటాయి. నేను ఈ భూలోకానికి వచ్చిన తర్వాత చిన్న ఆకారంలో మారాను. ఆ తర్వాత అనుకోకుండా అతని చేతిలో పడ్డాను ఇంకా అంతే అక్కడే బందీగా ఉన్నాను.
కోతి…. అవునా పాపం వినయ్ కూడా ఎన్నో కష్టాల్లో ఉన్నాడు. నువ్వు అతనిపై దయ చూపించావు అంటే. అతని జీవితం కూడా మారిపోతుంది.
రాకెట్…. సరే ఇప్పుడే అక్కడికి వెళ్దాం పదా అంటూ ఇద్దరూ కలిసి అక్కడికి వెళ్తారు.
వినయ్ షాప్ ముందు రాకెట్టు రాకెట్ పై కోతిని చూసి ఆశ్చర్యపోతాడు. అప్పుడు కోతి… ఆశ్చర్య పోకు అంటూ జరిగిన విషయమంతా చెప్తుంది. దాన్నంతా విన్న వినయ్…… అయ్యో ఆ విషయం నాకు తెలియక ఇన్ని రోజులు నిన్ను బంధించాను నన్ను క్షమించు.
రాకెట్….. అందులో ఏముంది మిత్రమా నీకు మాత్రం ఏం తెలుసు. సరే నీకు కూడా నేను ఒక బహుమతి ఇస్తాను. అంటూ అతనికి ఎన్నో బంగారు నాణేలు ఇస్తుంది.
వాటిని చూసిన అతను చాలా సంతోష పడుతూ ఆ రాకెట్ కి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. ఆ రాకెట్…. సరే మిత్రులారా నేను వెళ్ళే సమయం వచ్చేసింది. ఇక నేను వెళ్లి వస్తాను. అంటూ రాకెట్ అక్కడి నుంచి వెళ్లి పోతుంది. వినయ్ కోతి తో.,.. మిత్రమా నువ్వు మాత్రం నాకు ఈ రోజు చేసిన పనికి మర్చిపోలేను. ఉదయం బొమ్మలమ్మి డబ్బు సంపాదించావు. ఇప్పుడు రాకెట్ వల్ల ఎంతో ధనవంతులు చేశావు ఇదంతా నీ వల్లే సాధ్యం అయింది. మీకు చాలా కృతజ్ఞతలు.
కోతి…. అయితే మిత్రమా ఇప్పుడు నీ షాప్ లో ఉన్న ఏదో ఒక బొమ్మని నాకు ఇస్తావా.
వినయ్…. ఒక్కటే ఏం కర్మ మొత్తం షాప్ ఏ నీది. అది అంటాడు అందుకు కోతి చాలా సంతోష పడుతూ అక్కడున్న బొమ్మల తో ఆడుకుంటూ సంతోషపడుతుంది. ఇక ఆరోజు నుంచి వినయ్ చాలా ధనవంతుడు అవుతాడు. అతను ఆ గర్భవతి కోతిని కూడా తనతో పాటే పెంచుకుంటూ దానికి కావాల్సిన ఆహారాన్ని అందిస్తూ సంతోషంగా జీవిస్తారు. ఈ కథ వెనుక మీకు నచ్చినట్లైతే లైక్ చేయండి . షేర్ చేయండి కామెంట్ చేయండి.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *