గర్భవతి కోతి రెండో భాగం_ Telugu Stories- Stories in Telugu – Panchatantra Kathalu

ఒక అందమైన పల్లెటూరు అక్కడ రంగమ్మ అనే ఒక ఆమె రోడ్డుకి దగ్గర్లో దోసెలు వ్యాపారం చేస్తూ ఉంటుంది. అప్పుడు అక్కడికి బిచ్చగాడైన రాజు వచ్చి….. అమ్మ తిండి తిని రెండు రోజులు అవుతుంది. చాలా ఆకలిగా ఉంది అమ్మ ఏమన్నా ఉంటే పెట్టవా. నా దగ్గర ఇప్పుడు డబ్బులు కూడా లేవు నీకు ఇవ్వడానికి. నా మీద దయ చూపించు తల్లి. అని చాలా జాలిగా అడుగుతాడు రంగమ్మ… పో పో వయ్య పొద్దున్నే దాపరీస్తారు. ఇంక బోనీ కూడా కాలేదు . పో వయ్య అంటూ చిగురించు కుంటుంది. రాజు అక్కడ్నుంచి వెళ్ళిపోయి ఒకచోట కూర్చుంటాడు. అక్కడే ఒక చెట్టు దగ్గర గర్భవతి అయిన కోతి చాలా ఆకలితో ఉండి: అమ్మ నాకు చాలా ఆకలిగా ఉంది. నా కడుపులో బిడ్డకు కూడా ఆకలేస్తుంది. ఈ రోజు కనుక ఏమి తినకపోతే నేను నీరసంతో చనిపోతాను. భగవంతుడా నాకు ఏదో ఒక దారి చూపించు. నేను బ్రతికినంత కాకపోయినా నా బిడ్డ బ్రతికే ఎంత ఆహారం ఇస్తే చాలు నీకు పుణ్యం ఉంటుంది అని దేవుని ప్రార్థిస్తూ అటు ఇటు చూస్తుంది. అప్పుడే ఆ చెట్టు కింద రంగమ్మ దోసెలు వేస్తూ కనిపిస్తుంది. వెంటనే ఆ కోతి ఆమె దగ్గరికి వెళ్లి ఆమె జాలిగా చూస్తూ ఉంటుంది రంగమ్మ కోతి వైపు చూసి చూడనట్టుగా ఉంటుంది. అప్పుడు కోతి ముందుకు వెళ్లి …. అమ్మ ఆకలి అవుతుంది కొంచెం తినడానికి ఏమన్నా పెట్టండి నా కడుపులో బిడ్డ పెరుగుతున్నాడు. నా మీద కొంచెం దయ చూపించు తల్లి. అంటూ తన పొట్టవైపు చూపిస్తు సైకలు చేస్తుంది. దాన్ని చూస్తున్న రంగమ్మ…. ఒసేయ్ కోతి ముండా మనుషులకి నేనే దానం చేసి జంతువులకి నేనే దానం చేసి ఇక నేను ముష్టి ఎత్తుకోవాలి. పొద్దుపొద్దున్నే వచ్చేస్తున్నారు గా వెళ్ళు వెళ్ళు అంటూ ఒక పెద్ద కర్ర తీసుకుని విసిరేస్తుంది కోతి పై విసిరేస్తుంది.

కోతికి కర్ర తగిలి …. అమ్మ అమ్మ వద్దు కొట్టొద్దు నేను వెళ్ళిపోతాను. అంటూ పెద్ద పెద్ద ఆడుకుంటూ ఏడుస్తూ అక్కడి అటు ఇటు తిరుగుతూ ఉంది దాన్ని చూస్తున్న బిచ్చగాడు…. చి ఈమెకి కొంచెం కూడా జాలి లేదు. మనుషులకే టు పెట్టట్లేదు కనీసం జంతువుల మీద కూడా జాలి చూపించడం లేదు. అనుకుంటూ ఉండగా ఒక వ్యక్తి రాజు దగ్గరకు వచ్చి ఒక రొట్టెని దానం చేస్తాడు.
రాజు దానిని తీసుకొని కొంచెం తిని కొంచెం ఆ కోతికి ఇద్దామని అనుకుంటాడు. అప్పుడే ఆ కోతి రాజు చేతిలో ఉన్న రొటీ నీ చూసి తానే స్వయంగా అతని దగ్గరకు వచ్చి…. నా కడుపులో ఉన్న బిడ్డ కి ఆకలి అవుతుంది. నాకు తినడానికి ఏమన్నా పెట్టండి. అంటూ తన పొట్టవైపు చూపిస్తు జాలిగా అడుగుతుంది. దాన్ని చూసిన బిచ్చగాడు చాలా జాలిపడి దానికి ఆ మిగిలిన సగం రొట్టెను ఇచ్చి అక్కడి నుంచి తన ఇంటికి బయలు దేరుతాడు.ఆ కోతి ఆ రొట్టెను తినేసి రాజు వెంటే వెళుతుంది. దానిని గమనించిన రాజు ఇదేంటి ఈ కోతి నా వెంటే వస్తుంది. అని ఒకచోట నిలబడతాడు. ఆ కోతి కూడా అక్కడే నిలబడి పోతుంది. రాజు మళ్లీ దాని వైపు చూస్తూ కూర్చుంటాడు. దాన్ని చూసిన కోతి కూడా అక్కడే కూర్చుంటుంది. అప్పుడు రాజు ఆ కొత్త దగ్గరకు వెళ్లి…. ఏంటి నువ్వు నా వెంటే వస్తున్నావు ఏం కావాలి నీకు. నా చేతిలో ఉన్న రొట్టెని ఇచ్చాను కదా. ఇంక నా దగ్గర తినడానికి ఏమీ లేదు. ఇంక నువ్వు వెళ్ళు. అని అంటాడు అప్పుడు కోతి…. నేను నీతోనే వస్తాను నేను ఎక్కడికి వెళ్ళను అంటూ అటూ ఇటూ తలని ఊపుతుంది.
అప్పుడు రాజు ….. సరే నాతో పాటే వస్తావా మా ఇంట్లో ఉంటావా. అని అడుగుతాడు అప్పుడు కోతి సరే అంటూ తల ఊపుతుంది.
రాజు ఆ కోతిని తన భుజాలపై ఎక్కించుకొని… నాక్కూడా తోడు ఎవరు లేరు ఇక ఈ రోజు నుంచి నాకు నువ్వు నీకు నేను అని దాన్ని తన పూరి గుడి కి తీసుకు వెళ్తాడు.
అక్కడ రాజు….. అయినా నాకు ఈరోజు ఆ రంగమ్మ నీ పట్ల చేసిన దాన్నిచూస్తే నాకు చాలా బాధగా ఉంది. ఆమె ఎటు మనుషులకు సాయం చెయ్యద్దు . కనీసం నోరులేని జీవలకు కూడా సాయం చేయడం లేదని అదే నా బాధ. నేను నిర్ణయించుకున్నాను. నేను కూడా నా దగ్గర ఉన్న డబ్బులతో దోసెలు వ్యాపారం మొదలు పెడతాను. అని ఇల్లు మొత్తం వెతుకుతాడు అతనికి అక్కడ కొంచెం అక్కడ కొంచెం డబ్బులు కనిపిస్తాయి. ఆ డబ్బులు తీసుకొని ఒక మంచి చొక్కా ని కనుక్కొని ఇంటికి తిరిగి వస్తాడు ఈ రోజు తాను అనుకున్న విధంగానే రంగమ్మ కొట్టుకు దగ్గరలోనే అతను కూడా దోశలు వ్యాపారం మొదలు పెడతాడు. రంగమ్మ ఆరోజు ఎందు కో తన వ్యాపారాన్ని పెట్టదు.అది అతనికి చాలా కలిసివస్తుంది అతడు దోసెలు వేస్తూ ఉండగా ఆ కోతి వచ్చిన వాళ్లకి సర్వే చేస్తూ ఉంటుంది. దాన్ని చూస్తున్న ప్రజలు…. అరే ఆశ్చర్యంగా ఉంది కోతి బలే అందరికీ అందిస్తుంది.వింతగా ఉందే అంటూ చాలా మంది ఆ వింతను చూడటానికి వచ్చి దోషుల్ని ఆర్డర్ చేసి ఆ కోతి చెప్పించుకొని మరీ తింటూ ఉంటారు.
ఆ కోతి వాళ్ళ చెప్పింది చెప్పినట్టుగా సక్రమంగా విని ఆ ప్లేట్ ను వాళ్లకు అందిస్తుంది. అలా రాజు మధ్యాహ్నం వరకూ వ్యాపారం చేస్తూ ఉన్నాడు తన దగ్గర ఉన్న పిండి కాస్త అయిపోతుంది. ఇక అతను సామాన్లు మొత్తం తీసుకొని కోతి తో పాటు ఇంటికి వెళ్తాడు. అతడు ఇంటికి వెళ్లి డబ్బులు ఇస్తుండగా చాలా డబ్బులు కనిపిస్తాయి. అప్పుడు కోతితో…. ఏ ముహూర్తంలో నాకు కనిపించవు కానీ నీవల్ల బిచ్చగాడైన నేను వ్యాపారస్తుడు గా మారిపోయాను. ఇదంతా నీ వల్లే జరిగింది. నీకు చాలా కృతజ్ఞతలు.
అని చెప్పుకుంటాడు అప్పుడా కోతి కన్నీళ్లు పెట్టుకుంటూ…. నేనే మీకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి ఎందుకంటే నేను గర్భవతిని ఆకలితో అలమటిస్తున్న నాకు. మీరు తింటున్న దానిలో ఏ మాత్రం ఆలోచించకుండా నాకు సగం ఇచ్చారు. అంటూ ఏడుస్తూ తన పొట్ట పై చేయి వేసి తనకు అర్థమయ్యేలా చెప్తుంది.
రాజు…. హూ నాకు అర్థమైంది ఇప్పుడు నువ్వు గర్భవతి వా అందుకే నీ పొట్ట అలాగే ఉంది. అయితే నువ్వు ఈ సమయంలో నీకు మంచి ఆహారం కావాలి అంటూ బయటకు వెళ్ళిన ఆ కోతికి కావాల్సిన రకరకాల పండ్లను తీసుకొని తన గుడిసె కి తిరిగి వస్తాడు.
వాటన్నిటినీ చూసిన కోతి చాలా ఆనందంతో ఆ పండ్లను ఆవురావురు మంటూ తింటూ రాజు వైపు చూస్తూ…. ఇలాంటి ఆహారం నేను ఎప్పుడూ చూడలేదు తినలేదు. దేవుడు చాలా గొప్పవాడు చాలా మంచివాడు. మనకు అవసరమైన వాళ్లని కచ్చితంగా వాళ్ల దగ్గరికి చేరుస్తాడు.నన్ను మీ దగ్గరికి చేర్చినట్టు గానే మీరే లేకపోతే నేను ఈ భూమ్మీద ఉండను నా బిడ్డ ఈ భూమ్మీద ఉండడం. మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను అని చేతులు ఎత్తి దండం పెడుతు ఆనంద భాష్పాలు కురిపిస్తుంది.
దాన్ని చూసిన రాజు కూడా కరిగిపోయి…. తప్పు నాన్న నువ్వు అలా చేయకూడదు. ఇప్పుడు నువ్వు నా బిడ్డ తో సమానం. తల్లిదండ్రి అన్న తర్వాత ఇలాంటి ఉండకూడదు ఇక రేపటి నుంచి ఒక పని చేద్దాం నువ్వు దోస్తులు వేయి నేను తర్వాత చేస్తాను. అప్పుడు కోతి నవ్వుతూ ఉంటుంది.
రాజు… మరేం పర్వాలేదు నువ్వు అటు ఇటు తిరగడం మంచిది కాదు కదా. నీకు దోసలు ఎలా వేయాలో నేను నేర్పిస్తాను. సరేనా అంటాడు అందుకు ఆ కోతి సరే అంటుంది ఆ మరుసటి రోజు దాన్ని ఒకసారి దోసలు ఎలా వేయాలో నేర్పిస్తాడు వెంటనే దాన్ని చూసి అది కూడా చాలా అద్భుతంగా దోశలు వేయడం మొదలు పెడుతుంది. అక్కడ ఉన్న ప్రజలకు అందరూ కోతి దోశలు వేయడం చూసి… అరే నిన్నేమో అందరికీ వడ్డించింది ఈరోజు ఏమో ఏకంగా దోస్తులే వేస్తోంది.ఈ కోతి బలే పనులు చేస్తుంది అంటూ వింతగా చూస్తూ అతని దగ్గరికి వచ్చి ఆ దోషాన్ని తింటూ ఉంటారు ఆ దోశలు చాలా రుచిగా ఉన్నాయి అని చెప్పుకుంటూ ఉంటారు.
దాన్ని అంతా చూస్తున్న రంగమ్మ… ఈ బిచ్చగాడు ఒక కోతి చేత వ్యాపారం మొదలు పెట్టి నాకు ఎంతో నష్టాన్ని కలిగిస్తా డా. నా సంగతి వీళ్ళకి పూర్తిగా అర్థం అయినట్లు లేదు.ఒసేయ్ కోతి ముండా నీ పని చెప్తా నే . అసలు నువ్వే లేకపోతే ఈ వ్యాపారం ఉండదు వాడు ఉండడు మళ్ళీ వాడు మొదటి లాగే ముష్టివెతుక్కోవాలి. అని ఆ కోతి మీద పగ పెంచుకుంటుంది. కొంత సమయం వాళ్ళిద్దరు తన వ్యాపారాన్ని ముగించుకొని ఇంటికి తిరిగి వెళతారు. కోతి …. ఈరోజు నేను దోసిలి వేసాను కదా. చాలా మంది మన దగ్గరికి వచ్చారు. దానిని చూసి నాకు చాలా సంతోషంగా ఉంది. అన్నీ చాలా సంబరపడుతూ అతనికి సైకలు చేస్తూ చెబుతోంది.
రాజు… నా కంటే నువ్వే ఎక్కువ ఆనందంగా ఉన్నావే. నువ్వు ఎప్పుడు ఇలాగే నవ్వుతూ సంతోషంగా ఉండాలి. అప్పుడే నాకు ఆనందం. అని ఆ కోతి నీ దగ్గరికి తీసుకుంటాడు అలా కొన్ని రోజులు గడిచాయి. రంగమ్మ ఒకరోజు మధ్యాహ్న సమయంలో రాజు గుడి దగ్గరకు వచ్చి కోతిని… ఇటు రా ఇటు రా అని పిలుస్తుంది.
కోతి ఆమెను చూసి ఆమె దగ్గరకు వెళ్తుంది.
రంగమ్మ…. నువ్వు చాలా మంచి దానివి పాపము రాజు కి ఎవరూ లేరు . నువ్వే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి రాజు చాలా మంచివాడు. నువ్వు కూడా చాలా మంచి దానివి అందుకే నీ కోసం నేను ఈ పండ్లు తీసుకు వచ్చాను. దీని తినమ్మా అంటూ ఒక పండు ని ఇస్తుంది కోతి ఆ పండును తీసుకొని తిని కిందపడిపోయి.. అమ్మ నొప్పి నొప్పి నొప్పి అంటూ పెద్దపెద్దగా గిలగిలా కొట్టుకుంటూ. కేకలు వేస్తూ ఉంటుంది దాన్ని చూసిన రంగమ్మ…. చా వవే కోతి ముండా నువ్వు తిన్న పండులో విషం కలిపాను. నువ్వు చచ్చిపో ఇక దాన్ని చూసి నాకు చాలా సంతోషం కలుగుతుంది. అంటూ దాని పై కనికరం లేకుండా ప్రవర్తిస్తుంది. ఆ కోతి ఎంతో బాధతో అమ్మ నొప్పి నొప్పి అంటూ అరుస్తూ ఉంటుంది. అరుపులు వింటున్న రాజు… అయ్యో ఏమైంది అంటూ ఆ కోతి దగ్గరికి కి పరుగులు తీస్తూ వస్తాడు. దానిని చూసిన రంగమ్మ…. అమ్ము ఈ బిచ్చగాడు వస్తున్నాడు అంటూ చాటుగా పరిగెడుతుంది.
రాజు ఆ కోతి దగ్గరకు వచ్చి…. ఏమైందమ్మా ఏమైంది అంటూ చాలా భయపడుతూ ఆ కోతిని తీసుకొని పశువుల హాస్పిటల్ కి పరిగెడతాడు. అక్కడ డాక్టర్ ఆ కోతి యొక్క పరిస్థితిని చూసి దానికి తగ్గ మందులు వాడు చాలా సమయం తర్వాత రాజు దగ్గరకు వచ్చి… అంతా బాగానే ఉంది. తల్లి ప్రాణానికి ప్రమాదం ఏమి లేదు కానీ లోపల ఉన్న బిడ్డ చనిపోయింది. అంటూ చెప్తాడు పాపం ఆ మాటలు విన్న రాజు తన లో…. అయ్యో భగవంతుడా ఎందుకిలా చేశావు ఆ తల్లి ఆ బిడ్డ కోసం ఎన్నో కలలు కంది.ఆ బిడ్డ గురించి ఆలోచిస్తూ నాకు ఎన్నిసార్లు కబుర్లు చెప్పిందో.అంటూ కంటతడి పెట్టుకున్నాడు ఇంతలో కోతి అతని దగ్గరకు వచ్చి సైకలు చేస్తూ….. రాజు రాజు నువ్వు ఏడవకు ఇదంతా చేసింది ఎవరో నాకు తెలుసు. నా బిడ్డ చనిపోవడానికి కారణం ఆ రంగమ్మ అంటూ ఏడుస్తూ సైకలు చేస్తూ అతని వెంట పెట్టుకొని రంగమ్మ దగ్గరకి వెళ్తుంది.
రాజు కోతి ని చూసిన రంగమ్మ చాలా ఆశ్చర్యంతో చూస్తూ ఉంటుంది.
రాజు…. ఏంటి అలా చూస్తున్నావ్ ఇంకా కోతి చనిపోలేదన్నా చనిపోయేది కానీ దేవుడు ఉన్నాడు కాబట్టి అది బ్రతికి ఉంది. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ తన బిడ్డను కోల్పోయి. బ్రతికున్న శవంలా గా ఇలా ఏడుస్తుందో చూడు.
రంగమ్మ… ఏమిటి నువ్వు మాట్లాడేది నాకు ఏమీ అర్థం కావడం లేదు. నీ కోతి నీ నేను ఎందుకు చెప్పాలి అనుకుంటున్నాను.
అప్పుడు కోతి….. నువ్వే నువ్వే నన్ను చంపాలని కొన్నావు. నాకు పండును ఇచ్చి నా బిడ్డని చంపేసావు. నేను మీకు ఏమి అన్యాయం చేశాను. నన్ను మోసం చేసి నా కడుపులో ఉన్న బిడ్డ ను చంపేసావు. నా బిడ్డ నాకు కావాలి నా బిడ్డ నేను చూసుకోవాలి ఆ బిడ్డ చేత అమ్మ అనిపించుకోవాలి అంటూ సైకలు చేస్తూ కన్నీరుమున్నీరుగా ఏడుస్తుంది.
రాజు…. చూశావుగాఆ తల్లి ఆవేదన. ఒక ఆడదాని వై ఉండి గర్భం తో ఉన్న కోతికి ఇలాంటి అన్యాయం చేస్తావా. నీకు నామీద కోపం ఉంటే నన్ను దండంచల్సిది లేదా ఆ విషము నాకు ఇవ్వాల్సింది. అంతేగాని నోరులేని జీవాల్ని చేసి ఆ తల్లికి బిడ్డను దూరం చేసావ్. ఇప్పుడు నువ్వు ఏం చేసినా ఆ తల్లికి బిడ్డను తీసుకురాలేము. ఛీ నువ్వు అసలు ఆడదానివేనా సంగతి మరచి పోయావు. మాతృ ప్రేమ విలువలు కుపూర్తిగా అర్థం లేకుండా చేశావు. స్త్రీ జాతి లో కొత్త జాతిని అనిపించావు. నువ్వు తులసివనంలో గంజాయి మొక్క లాంటి దానివి ఛీ. నీకు ఇలాంటివి ఎన్ని మాటలు చెప్పినా బుద్ధి రాదు. నీకు మేము అడ్డంగా ఉన్నాడు కదా నీ వ్యాపారం నువ్వు చేసుకో. నీకు ఎప్పుడూ మేము అడ్డంగా రా ను. ఇక ఎప్పుడూ ఆ కోతి జోలికి నా జోలికి రాకు. అయినా మేము ఇక ఈ ఊర్లో ఉండాలని నిర్ణయించుకోలేదు. ఇక నీకు పెద్ద దండం. అని అంటాడు ఆ మాటలు విన్న కోతి ఏడుస్తూ…. అమ్మ నాకు తెలుసో తెలియకో తప్పు చేసి ఉంటే నన్ను క్షమించు. కానీ నేను మాత్రం మిమ్మల్ని గుర్తు పెట్టుకుంటాను. నా బిడ్డను చంపిన హంతకురాలు మీరు ఇక వెళ్లి వస్తాను అంటూ పాదాలు పట్టుకుని కన్నీరుమున్నీరుగా ఏడుస్తుంది. దాన్ని చూసిన రంగమ్మ కూడా జాలి కలుగుతుంది. కానీ ఏం మాట్లాడ దాధు.
ఆ తర్వాత రాజు ఆ కోతిని తీసుకొని దూరంగా వెళ్ళి పోతావ్ ఆ కోతితో….. బాధపడకు తల్లి ఇదంతా నా వల్ల జరిగింది అనుకుంటా. అసలు నేను ఆ వ్యాపారం చేయకుండా ఉండాల్సింది.తప్పైపోయింది క్షమించు అంటూ కంటతడి పెట్టుకుంటూ దాన్ని తీసుకొని పక్క ఊరికి వెళ్ళి పోతాడు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *