గర్భవతి కోతి – వినాయకుడు | Telugu Kathalu | Bedtime Stories | Panchatantra kathalu | Fairy Tales

వినాయక చవితి సంబరాలు జరుగుతున్న రోజు అందరూ ఎంతో ఆనందంగా ఉంటారు అక్కడ పెద్ద ప్రసాదాలు తీసుకొని సంతోషంగా ఉంటారు . వాళ్ళందర్నీ దూరం నుంచి చెట్టు మీద ఒక గర్భవతి అయిన కోతి గమనిస్తూ తన మనసులో….. గణపయ్య కూడా అక్కడికి వెళ్లాలని ఆశగా ఉంది ఎందుకంటే అక్కడికి వెళితే నాకు నా కడుపులో ఉన్న బిడ్డ కీ కొంచెం పెట్టక పోతార అని నమ్మకం .  కానీ దైవాన్ని తలచుకుని నెమ్మదిగా అక్కడికి చేరుకుంటుంది ఆ గర్భవతి కోతి అక్కడ ఉన్న వాళ్ళు కోతి ని చూసి ….. రేయ్ కోతి వచ్చింది అక్కడ ఉన్నది ఏమన్నా పట్టుకు పోతుందేమో చూడండి చూడండి తరిమి కొట్టండి అని కేకలు వేస్తారు . ఇంకా అక్కడ ఉన్న వాళ్ళు కోతిని అక్కడ నుంచి తరిమి కొడతారు. పాపం కోతి ఎంతో బాధపడుతూ తిరిగి చెట్టు మీద కి వెళ్ళిపోతుంది. కోతి తన తన మనసులో…. అయ్యా గణపయ్య నీకు తెలిసింది ఏమీ లేదు నేను కడుపునిండా తిని మూడు రోజులు అవుతుంది నా బిడ్డ నేను అల్లాడి పోతున్నాము. ఎండలు కారణంగా అడవి కాలిపోయింది ఎన్నో జంతువులు కాలిపోయాయి . ఆ రోజే నన్ను నా బిడ్డను కూడా అందులో  దహనం చేసిన కట్టే సరిపోతుంది ఎందుకు కాపాడి ఈ ఊరు తీసుకొచ్చావో నాకు అర్థం కాలేదు.

అంటూ ఏడుస్తూ ఉంటుంది . ఇంతలో వినాయకుడు అక్కడ ప్రత్యక్షమయ్యే ఆ చెట్టు మీద కూర్చుంటాడు. వినాయకుడిని చూసిన కోతి ఎంతగానో సంతోషపడుతూ ….. వచ్చావా గణపయ్య  నన్ను కాపాడడానికి వచ్చావా స్వామి . ఇక నాకు మోక్షం కలిగించినా ఎలాంటి అభ్యంతరం లేదు. మీ దర్శన భాగ్యం తో  నాకు కనుల పండుగ చేశావు స్వామి అని అంటుంది. వినాయకుడు కోతి ని దీవించి…… చూడకండి బ్రతకడానికి చాలా కారణాలు ఉన్నాయి మీ ఆకలి నేను తీరుస్తాను . కానీ నువ్వు జీవితకాలమంతా ఒకరి ఆకలి తీర్చాల్సిన సమయం వచ్చింది. అందుకు కొద్దీ ఆశ్చర్యంగా ….ఎవరూ స్వామి

ఏంటి నాకు ఏమీ అర్థం కావట్లేదు అని అడుగుతుంది వినాయకుడు మొదట వీటిని తిను అని చెప్పి కొన్ని ఆహార పదార్థాలను ప్రత్యక్షం చేసి తినమని చెబుతాడు . ఆ గర్భిణీ కోతి చాలా సంబరపడిపోతూ దానిని తింటుంది . కోతి సంతోషంగా తిన్న తర్వాత వినాయకుడు తనతో పాటుగా కోతిని మాయం చేసి ఒక చోటికి తీసుకు వెల్తాడు అక్కడ ఒక ఇంట్లో ఒక అవిటి అమ్మాయి అయినా బేబీ  ఉంటుంది.

కోతి  పాపను చూసి….. గణపయ్య ఎవరు ఆ పాప పాపం కాలు లేదు . తానొక్కటే కష్టపడి పనిచేస్తుంది తల్లిదండ్రులు ఎవరూ లేరా.

గణపయ్య…. ఆమె తల్లిదండ్రులకు కాలం చెల్లింది. ఈమెకు కాలు పోయింది వీళ్ళందరూ నా భక్తులు. ఆమె తల్లిదండ్రులు చనిపోయారు అని ఆమె కాలు యాక్సిడెంట్లో పోయింది అని నన్ను అసహ్యించుకుంటుంది. కానీ  ఏది ఎప్పుడు ఎలా జరగాలో అంతా ముందుగానే నిర్ణయించబడుతుంది. పూర్వజన్మ తప్పు ఒప్పులను ఈ జన్మలో శిక్షను అనుభవించాల్సి వస్తుంది . అని అంటాడు అందుకు నిజమే గణపయ్య అని కోటి సమాధానం చెబుతుంది ఆ తర్వాత గణపయ్యా… చూడు మారుతి నువ్వు పాపకు దగ్గరవ్వాలి ఆమెకు సహాయం చేయాలి నీకు ఎప్పుడు ఏ అవసరం ఉన్నా నన్ను మనసులో తలుచుకో నీకు ఏది కావాలంటే అది లభిస్తుంది . ఆ పాప ను జాగ్రత్తగా చూసుకో. అందుకు కోతి సరే అంటుంది.

వినాయకుడు…. అన్నట్టు మారుతీ ఆ పాప భోజనం చేసి మూడురోజులు అవుతుంది . నువ్వే ఆమెకు భోజనం తినే లాగా చేయాలి. అందుకు కోతి సరే అంటుంది. ఇక గణపయ్యా అక్కడినుంచి మాయమై పోతాడు. ఆ తర్వాత కోతి ఆ ఇంట్లో కి వెళ్తుంది కోతి ని చూసిన పాప….. అమ్మ కోతి కాపాడండి కాపాడండి ఎవరైనా కాపాడండి అంటూ కేకలు వేస్తోంది కోతి…. పాపా నేను నిన్ను ఏమీ చేయను బయట చాలా ఎండగా ఉంది కదా కడుపు లో ఒక బిడ్డ ఉంది నేను అక్కడ ఎక్కువ సేపు ఉండలేకపోతున్నాను. అందుకే కాసేపు తలదాచుకుందామని ఇక్కడికి వచ్చాను. అని అంటుంది అందుకు పాప భయాన్ని విడిచిపెట్టి ….. అవునా సరే అయితే నువ్వు అక్కడే ఉండు అని అంటుంది. కోతి సరే అని చెప్పి పాప చేత ఎలా అయినా ఆహారం తినిపించాలి అని ….. పాప నాకు చాలా ఆకలిగా ఉంది. పాప తినడానికి నా దగ్గర ఏమీ లేదు నన్ను క్షమించు అని అంటుంది. కోతి…. నా దగ్గర ఉంది కానీ నాతో పాటు కలిసి తినే వాళ్లు నా స్నేహితులు కానీ ఇప్పుడు ఇక్కడ ఎవరూ లేరుగా అంటూ ఏడుస్తుంది అందుకు పాపా …. అయ్యో బాధపడకు నేనున్నా కదా నీతో పాటు కలిసి తింటాను అని అంటుంది కోతి…. నిజంగా నువ్వు చాలా మంచి దానివి అని చెప్పి భోజనం ఆమె ముందు పెడుతుంది కొంచెం ముందు పెట్టుకుంటుంది. కోతి ఇదివరకే తినడంతో అక్కడ తింటున్నట్టు పాప కడుపు నిండా తృప్తిగా భోజనం చేస్తుంది.

ఇక చాలా సేపు కోతి పాప తో మాట్లాడుతుంది. పాపా తన బాధ మొత్తాన్ని చెప్పుకొని చాలా బాధ పడుతూ…. భగవంతుడు లేడు అందుకే నాకు ఇలాంటి పాత వచ్చింది అంటూ ఏడుస్తుంది. కోతి ఎన్నోసార్లు భగవంతున్ని మేప్పు చేసి మాట్లాడినా కూడా పాప మనసు కొంచెం కూడా మారదు. కోతి ఆ మాట ఈ మాట చెప్పి అక్కడే ఉండటానికి సిద్ధమైపోతుంది . ఆ రోజు నుంచి కోతి అక్కడే ఉండి పాపను చూసుకుంటే కడుపు నింపుతుంది  గణపయ్య సంతోషపడ్డాడు . ఎప్పటికైనా పాపా లోకంలో ఉన్న నిజాన్ని తెలుసుకుంటుంది.  వాళ్లని దీవించి అక్కడినుంచి మాయమైపోయాడు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *