గర్భవతి కోతి వినాయకుడు_ Telugu Stories- Stories in Telugu – Panchatantra Kathalu

అది ఒక పల్లెటూరు ఆ పల్లెటూర్లో సారమ్మ అనే ఒక వృద్ధురాలు ఉండేది. ఆమెకు వినాయకుడు అంటే చాలా ఇష్టం. ప్రతిరోజూ ఆ వినాయకుని ప్రార్ధిస్తూ…. స్వామి గణపయ్య. మా అందరిని నువ్వే కాపాడాలి ఇలాంటి కష్టం వచ్చినా నువ్వే మాకు దిక్కు.

ప్రజలందరిని చల్లగా చూడు స్వామి.అని వినాయకుడి ప్రార్థిస్తూ ఉండగా ఇంతలో జోరుగా వర్షం కురుస్తుంది అప్పుడు ఒక గర్భవతి ఆయన కోతి అక్కడకు వస్తుంది అది వర్షంలో తడిచి చలికి వణికి పోతుంది దాన్ని చూసిన సారమ్మ…. అయ్యో పాపం చూస్తే గర్భవతి కోతి లా ఉంది పాపం చలికి బాగా వణికిపోతుంది అని దగ్గరకు వెళ్లబోతుండగా ఆ కోతి ఆమెను చూసి భయపడి….. అమ్మ అమ్మ నన్ను కొట్టకండి. బయట బాగా వర్షం పడుతుంది ఈ చలికి నేను తట్టుకోలేను నేను గర్భవతిని. నా లోపలున్నపిల్లోడు కూడా చాలా ఇబ్బంది పడుతున్నాడు. వర్షం తగ్గిన తర్వాత నేను వెళ్లి పోతున్న అమ్మ అంటూ ఏడుస్తూ సైకల్ చేస్తుంది. ఆ కోతి బాధని అర్థం చేసుకున్న సారమ్మ…. భయపడకు నేను నిన్ను ఏం చేయను. నువ్వు ఇక్కడే ఉండొచ్చు అని దాని చేతికి అరటి పండ్లు ఇస్తుంది ఆకలి మీద ఉన్న కోతి దాన్ని ఆవురావురుమంటూ తింటుంది. అలా రోజులు గడిచాయి ఆ కోతి ప్రతిరోజు సారమ్మ దగ్గరకు వచ్చి ఆమె ఇచ్చిన పండ్లను తిని వెళ్తూ ఉంటుంది అలా ఇద్దరు మధ్య స్నేహం కుదురుతుంది . ఆ గర్భవతి కోతి కూడా సారమ్మకు తోడుగా అక్కడే ఉంటుంది. ఒకరోజు సారమ్మా కోతితో…. చూడు పద్మ ఈరోజు నిన్ను ఒకచోట తీసుకెళ్తాను దాన్ని చూసిన తర్వాత నువ్వు కూడా చాలా ఆనంద పడతావ్వు.
కోతి… ఏంటది ఇప్పుడే చెప్పు అన్నట్టుగా సైక చేస్తుంది.
సారమ్మ…. వెళ్తున్నాం గా అక్కడే చూద్దువు కానీ పద. అంటూ కోతిని తన అరటి తోట లోకి తీసుకు వెళ్తుంది.
అక్కడ సారమ్మ…. చూడు పద్మ ఇదంతా మన తోట. ఈ సంవత్సరం ఆ గణపయ్య దయవల్ల విరగ కాసింది . ఇక మన సమస్యలు కూడా తీరిపోతాయి. అందుకు ఆ కోతి చాలా సంతోషపడుతుంది.ఇక ఇద్దరూ కలిసి తిరిగి ఇంటికి వెళ్తారు ఆ రోజు రాత్రి సమయం ఇద్దరు విశ్రాంతి తీసుకుంటుండగా.
జోరుగా వర్షం పెద్ద గాలి వస్తుంది. ఆ గాలి వానకి సారమ్మ పంటంతా నేల కూలిపోతుంది. ఆ మరుసటి రోజు ఉదయాన్నే లేచి చూడగా పెద్ద గాలి వాన వచ్చిన సంగతి అర్థమవుతుంది. ఆమె వెంటనే ఆ కోతిని తీసుకొని పరుగుపరుగున తోట దగ్గరకు వెళ్తుంది. తోట మొత్తం కూలిపోయి ఉంటుంది దాన్ని చూసిన సారమ్మ ఎంతో బాధపడుతూ తన ఇంటికి తిరిగి వచ్చి వినాయకుని తో.. అయ్యా గణపయ్య ఈ సంవత్సరం పంట బాగా పండింది అనుకున్నాను. ఇంతలోనే ఈ ఘోరం జరిగిపోయింది. చేసిన అప్పు తిరిగి పోతుంది అనుకుంటే మళ్లీ అప్పుల సమస్య మీద పడుతుంది అంటూ ఏడుస్తుంది.
పాపం ఆ కోతికి ఏం చేయాలో అర్థం కాక…అయ్యా గణపయ్య ఇప్పుడు నేనేం చేయాలి మా అమ్మా ఇలా బాధ పడుతుంది.
అని అక్కడి నుంచి అరటి తోట లోకి వెళ్లి ఒక అరటి గలని తీసుకొని బజార్లో కి వెళ్తుంది. ఆ కోతి ఆ పచ్చి అరటి పళ్లను వచ్చే పోయే వాళ్ళ ముందు చూపిస్తూ ఉంటుంది. అవి పచ్చి అరటి పళ్ళు కావడంతో ఆ కోతి దగ్గర ఎవరూ వాటిని కొనుగోలు చెయ్యకపోగా వింతగా చూస్తారు. ఆ కోతి అప్పుడు చాలా బాధపడుతూ తన మనసులో…. అయ్యా గణపయ్య నేను మా అమ్మకు సహాయం చేద్దాం అనుకున్నాను. కానీ ఈ అరటి పళ్ళు ఎవరూ కొనడం లేదు నేనేం చేయాలి. అంటూ ఏడుస్తూ ఉండగా ఒక వ్యక్తి అక్కడ కు వచ్చి ఆ కోతి దగ్గర ఉన్న అరటి గలను తీసుకొని
ఆ కోతికి డబ్బులు ఇస్తాడు. ఆ కోతి చాలా సంతోషపడుతుంది. అప్పుడు ఆ వ్యక్తి… చూడు ఈ పచ్చ అరటి పళ్ళు నాకు ఇప్పుడు చాలా కావాలి. ఇంకా నీ దగ్గర ఉన్నాయా.
కోతి ఉన్నాయి అన్నట్టుగా తల ఊపుతుంది.
అతను…. అయితే సరే నీ యజమాని దగ్గరికి నన్ను తీసుకువెళ్ళు. నేనే వాళ్ళతో మాట్లాడి వీటిని కొనుగోలు చేస్తాను సరేనా. అందుకు కోతి సరే అని చెప్పి అతన్ని తన ఇంటికి తీసుకు వెళుతుంది. ఆ వ్యక్తి ఆమెతో….. చూడండమ్మా ఈ కోతి వల్ల నేను ఇక్కడికి వచ్చాను. అంటూ జరిగింది చెప్పి…. ఇప్పుడు నాకు ఈ పచ్చి అరటి పండ్లు చాలా అవసరం నేను ఒక నాటు మందు తయారు చేయాలనుకుంటున్నాను. మీరు మీ పంట పొలాన్ని కనుక చూపిస్తే నేను వాటిని కొనుగోలు చేస్తాను.
అందుకు ఆమె చాలా సంతోష పడుతూ తన మనసులో.. అయ్యా గణపయ్య ఏదో ఒక రూపంలో నాకు సాయం చేస్తావని తెలుసు.
ఇప్పుడు ఈ మనిషి రూపంలో సాయం సాయం చేయడానికి పంపించినటున్నావు.
అని చాలా సంతోషపడుతుంది. ఆ తరువాత అతన్ని తీసుకొని ఆ తోట దగ్గరకు వెళ్తుంది. అక్కడ ఆమె…. ఇదే బాబు నిన్న పడిన వర్షం వల్ల ఇలా అయ్యింది మీ కావాల్సింది తీసుకుని నాకు ఎంతో కొంత డబ్బు ఇవ్వండి. అని అంటుంది. వెంటనే ఆ అరటి చెట్లు అన్నీ ఒక్కసారిగా నిలబడతాయి.తోటంతా మళ్లీ మామూలు స్థితికి వస్తుంది దాన్ని చూసిన ఆమె ఏం జరుగుతుందో అన్నట్టుగా ఆశ్చర్యంగా అతనివైపు చూస్తుంది అతను గణపయ్య గా మారడం చూసిన ఆమె… గణపయ్య నువ్వు మనిషి రూపంలో సాయం చేయడానికి వచ్చావా స్వామి. అని అంటుంది. గణపయ్య… అవును సారమ్మ నన్ను నమ్మిన భక్తులకు నేను అన్యాయం చెయ్యను కదా. అందుకే నీ కోసం వచ్చాను ఇదంతా నీ ప్రార్థన ఫలం అలాగే నువ్వు పెంచుకుంటున్న ఈ కోతి. అని అంటాడు అందుకు ఆమె చాలా సంతోషపడుతుంది అప్పుడు కోతి స్వామికి నమస్కరిస్తూ…. స్వామి నాకు చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని చూడడం. మళ్లీ మా అమ్మ ముఖంలో సంతోషం తీసుకొచ్చారు స్వామి. అంటూ స్వామిని ప్రార్థిస్తుంది. ఆ తర్వాత గణపయ్యా… సుఖశాంతులతో ఇద్దరూ వర్ధిల్లండి. కష్ట కాలం లో నన్ను తలుచుకుంటే నేను మీ ముందు ప్రత్యక్షమవుతాయి. అని చెప్పి అక్కడ నుండి మాయమై పోతున్నాడు గణపయ్య.అక్కడినుంచి మాయమైపోయిన వెంటనే అక్కడ కొంత బంగారు నాణేలు కనబడతాయి. ఆ బంగారం నాణ్యాలు తీసుకుని మరోసారి గణపయ్యకు కృతజ్ఞతలు చెప్పుకొని. ఆ కోతి సారమ్మ ఇద్దరూ అక్కడి నుంచి సంతోషంగా వెళ్ళిపోతారు. ఆ విధంగా గణపయ్య సారమ్మ కుటుంబంలో కష్టాన్ని తొలగించి. సంతోషాన్ని తీసుకొస్తాడు. ఆ రోజు నుంచి సారమ్మ కోతి ఎలాంటి బాధలు లేకుండా సంతోషంగా జీవిస్తూ ఆ గణపయ్య సేవలు చేసుకుంటూ ఉంటారు.ఈ కథ గనుక మీకు నచ్చినట్లైతే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *