గర్భవతి చిరుతపులి 2_ Telugu Stories- Stories in Telugu – Panchatantra Kathalu

అది ఒక చిన్న పట్టణం పట్టణం లో ఒక పాడైపోయిన పెద్ద జంతు ప్రదర్శనశాల ఉంటుంది.

ఆ ప్రదర్శనశాలలో జంతువులు ఏమీ ఉండేవి కాదు.అది పూర్తిగా పాడైపోయింది ఎందుకంటే ఆ యజమాని ముసలి వాడు కావడంతో దాన్ని వేరే వాళ్ళకి ఎవరికైనా అమ్మాలని అనుకుంటాడు. అలా రోజులు గడిచాయి. అతని దగ్గరికి డబ్బున్న వ్యక్తి అయినా సంపత్ వస్తాడు అతనితో…. నమస్కారమండి నేను మీరు ఇచ్చిన అడ్వటైజ్మెంట్ నీ పేపర్ లో చూశాను. ఉదయం కాల్ చేసింది నేనే.
అందుకు అతను….. మీరేనా చెప్పండి. ఆ జంతుప్రదర్శనశాలను తీసుకోవడానికి మీకు అంగీకారమే నా. సంపత్…. అందుకోసమే కదండీ డబ్బు తో సహా ఇక్కడికి వచ్చారు ఇదిగో మీరు అడిగిన 30 లక్షలు. అని చెప్పి తనతో పాటు తీసుకొచ్చిన సూట్ కేస్ నేను అతనికి ఇస్తాడో ఆ వ్యక్తి సూట్ కేస్ నీ తెరచి చూసి లెక్క పెట్టుకొని అంతా కరెక్ట్ గానే ఉంది.
నేను దానికి సంబంధించిన పేపర్లు తీసుకొస్తాను అని లోపలికి వెళ్లి వాటిని తీసుకొని వస్తాడు. ఆ వ్యక్తి ఆ కాగితాలు తీసుకుని …. చాలా థ్యాంక్స్ అండీ.
మీరు పోతూ పోతూ నాకు మంచి బహుమతి ఇచ్చి వెళ్తున్నారు. అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది.
అందుకే అతనికి ఏమీ అర్థం కాక… ఏమంటున్నావ్ బాబు. అంటూ ఉండగా ఆ వ్యక్తి తనతో పాటు తీసుకు వచ్చిన ఒక పెద్ద ఇనుప కడ్డీతో అతని తలపై బలంగా కొడతాడు. ఆ వ్యక్తి అక్కడికక్కడే చనిపోతాడు ఆ తర్వాత సంపత్ ఆ కాగితాల్లో ఆ డబ్బు మొత్తాన్ని తీసుకొని అక్కడనుంచి వెళ్ళి పోతాడు. అదంతా చాటునుంచి చూస్తున్నా అతని యొక్క పని వాడైన రంగయ్య అక్కడికి వచ్చి….. అయ్యో
బాబు గారు ఎంత పని జరిగిపోయింది వాడు అసలు మనిషే కాదు. అన్యాయంగా మిమ్మల్ని పొట్టన పెట్టుకున్నాడు డబ్బు ఆస్తి కోసం ఇలాంటి పనులు చేస్తారని అనుకోలేదు అయ్యో భగవంతుడా ఎంతపని జరిగిపోయింది. నేను రావడానికి భయం వేసింది. అంటూ బోరున ఏడుస్తూ ఉంటాడు.
అలా చాలా సమయం వరకు అతను ఏడ్చిన తరువాత తన మనసులో…. అయ్యా నేను మీ శవం పైన ఆమె చేస్తున్నాడు వాణ్ణి చంపి మీ ఆత్మకు శాంతి కలిగిస్తాను. అని చెప్పి అక్కడ నుంచి అడవి మార్గం నుంచి జంతుప్రదర్శనశాల కి వెళుతుండగా మార్గ మధ్యలో సంపత్ ఒక చోట నిలబడి…. అలా చూస్తూ ఉంటారు ఏంట్రా దాని వెంట పడి పట్టుకోండి ఆ చిరుత పులి ని అంటూ అరుస్తూ ఉంటాడు దాన్ని చూసిన రంగయ్య…. దొరికావు రా నీ దగ్గర పనిలోకి చేరతాను నీ ప్రాణాలు తీస్తాం రా.
అని అనుకుంటూ ఉంటాడు.
సంపత్ పంపించిన ఇద్దరు వ్యక్తులు ఆ గర్భవతి చిరుతపులి వెంట పడుతూ ఉంటారు గర్భవతి చిరుతపులి తనలో…. అయ్యో యో భగవంతుడా వీళ్ళిద్దరూ ఎక్కడినుంచి దాపురించాయా రు. నా వెంట పడుతున్నారు అయ్యో నేను ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితి నా కడుపులో బిడ్డ ఉన్న కారణంగానే ఎక్కువ దూరం పరిగెత్తి లేక పోతున్నాను నాకు చాలా ఆయాసంగా ఉంది అనుకుంటూనే స్పృహ తప్పి కింద పడిపోతుంది వెంటనే ఆ ఇద్దరు వ్యక్తులు ఆ పులిని పట్టుకొని సంపత్ దగ్గరికి తీసుకొని వస్తారు.
దాన్ని చూసిన సంపత్…. వారెవ్వా ఎలాగైతేనేమి సాధించారు. దానిని కట్టివేసి నా కారులో వెనుకాల వేయండి అని అంటాడు అందుకు వాళ్లు సరే అని చెప్పి ఆ పులిని కట్టివేసి ఆ కారు లో ఉంచుతారు.
ఆ తర్వాత ఇద్దరూ అతని దగ్గరికి వచ్చి….బాబు గారు దీన్ని పట్టుకోడానికి చాలా కష్టపడ్డాను మీరు కొంచెం ఎక్కువ డబ్బులు ఇవ్వాలి.
అందుకు అతను…. ఎక్కువ డబ్బులు ఇస్తాను అని చెప్పి తుపాకీతో ఇద్దరిని కాల్చి చంపేస్తాడు.
ఆ తర్వాత అతను నవ్వుకుంటూ…హా..హా హా నేను ఎంతో మంది ప్రాణాలు తీసి ఈ స్థాయిలో ఉన్నాను. నాకు డబ్బుతో ముడిపెట్టకూడదు. నేను ఇస్తే తీసుకోవాలి నాకు ఎదురు అడిగితే నచ్చదు అని అనుకొని కారు నీ తీసుకొని వెళ్ళి పోతాడు దాని అంతా చూస్తున్న రంగయ్య …. చి చి వీడు అసలు ఎంత దుర్మార్గుడు. అన్యాయంగా మనుషుల ప్రాణాలు తీసుకున్నాడు. వీడికి భూమ్మీద బ్రతికి అర్హత లేదు వీడిని చంపాల్సిందే.
అని అనుకుంటూ నడుచుకుంటూ ఆ జు దగ్గరికి వెళ్తాడు. ఆ జు దగ్గర సంపత్ ఆ పులినీ ఒక బోనులో బంధిస్తాడు ఆ పులి సృహ నుంచి మేల్కొని అటూ ఇటూ చూస్తూ తనలో…. అయ్యో నన్ను ఈ నరకంలో తీసుకొచ్చి పడేసారు. ఇలా జరగడం ఇది రెండోసారి భగవంతుడా ఒకసారి తప్పించావ్వూ. మళ్లీ తీసుకొచ్చి ఈ నరకంలోనే పడేసావ్ ఇది నీకు న్యాయమా అంటూ కన్నీరు కారుస్తూ ఏడుస్తుంది.
అప్పుడే అక్కడికి రంగయ్య వచ్చి సంపత్ తో…. బాబు గారు నమస్కారం నేను ఒకప్పుడు ఈ జూ లో నే పని చేశాను ఆ తర్వాత దూరంగా వెళ్ళిపోయాను మా యజమాని ఎక్కడ ఉన్నాడో కూడా నాకు తెలియదు ఇక్కడే ఉండాలని వచ్చాను. తమరు ఎవరు బాబు.
అందుకు అతను… ఇప్పుడు నేను ఈ జూకి యజమాని నీ అని అంటాడు అందుకు రంగయ్య….అవునా బాబు ఇక్కడ నాకు ఏదైనా పని ఉంటే ఇవ్వండి బాబు నాకు డబ్బులు కూడా వద్దు. నాకు ఒక ముద్ద అన్నం పెడితే చాలు. అదే పదివేలు బాబు.
అందుకు సంపత్ తన మనసులో…. వీడెవడో మనకు ఉపయోగపడే లాగే ఉన్నాడు. అన్నమే కదా పెట్టొచ్చు లే అని అనుకొని అతనితో సరే ఇక్కడే జాగ్రత్త ఇప్పుడు చూసుకుంటూ ఉండు అని అంటాడు. అలా ఆ రోజు గడిచి పోతుంది. రంగయ్య ఎలా అయినా సంపత్ ని చంపాలనుకొంటాడు
ఆ మరుసటి రోజు ఉదయాన్నే సంపత్ ఒక పెద్ద కర్ర, మరియు బంతిని తీసుకొని ఆ పులి బోనులోకి వెళ్లి ఆ బంతిని అక్కడనుంచి …. రా ఈ బంతి పై ఎక్కువ అని దాన్ని కర్రతో కొడుతూ దానిని బలవంతంగా ఆ బంతి పైన ఎక్కించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు.
అది చాలా భయపడుతూ అటు ఇటు తిరుగుతూ… అయ్యో దయచేసి నన్ను కొట్టకండి దయచేసి నన్ను కొట్టకండి అయ్యో భగవంతుడా నన్ను కొట్టద్దు కొట్టద్దు అంటూ భయపడుతూ అటు ఇటు తిరుగుతూ బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది సంపత్ మాత్రం దాన్ని కొడుతూనే ఉంటాడు ఇంతలో
రంగయ్య అక్కడకు వచ్చి…… బాబు గారు దాన్ని మరింతగా కొట్టకండి అది చనిపోయే లా ఉంది పాపం గర్భవతి. వదిలేయండి నేను దానికి సర్కస్ చేయడం నేర్పిస్తాను అని అంటాడు.
అందుకు సంపత్…. సరే చాలా జాగ్రత్తగా దీనికి సర్కస్ చేయడం నేర్పించు అది నేర్చుకునేంత వరకూ పచ్చి నీళ్లు కూడా దానికి అందించ వద్దు.
అని బయటికి వెళ్ళిపోతాడు రంగయ్య పాపం ఆ పులిని చూసి జాలి పడుతూ …. పాపం గర్భవతి అని కూడా చూడకుండా ఎలాగ హింస పడుతున్నాడో. అని అనుకుంటూ ఒక కర్ర తీసుకొని ఆ పులి బోనులోకి వెళ్తాడు ఆ పులి భయంతో ….అయ్యా మీకు పుణ్యం ఉంటుంది దయచేసి నన్ను విడిచి పెట్టండి నా కడుపులో ఉన్న బిడ్డ ఆకలితో అల్లాడి పోతుంది కనీసం తినడానికి ఏదైనా ఇవ్వండి . కనీసం గుక్కెడు నీళ్లు అయిన ఇవ్వండి మీకు
పుణ్యం ఉంటుంది అంటూ కన్నీరు కారుస్తూ ప్రాధేయ పడుతూ సైగచేసి అడుగుతుంది.
పాపం ఆ పులి బాధని అర్థం చేసుకున్న రంగయ్య భోజనం తీసుకువచ్చి ఆ పులికి అందిస్తాడు. వెంటనే ఆ పులి ఆహారం తిని తన కడుపు నింపుకుంది.
ఆ తర్వాత అది… అయ్యా నీ మేలునీ నేను ఈ జన్మలో మర్చిపోలేను. నా బిడ్డ ఆకలి తీర్చారు మీరు మీకు రుణపడి ఉంటాను.
అని అంటూ బాధపడుతుంది రంగయ్య ఆ పులి పై ఉన్న గాయాలు చూసి బాధపడుతూ…. అయ్యో చాలా గాయం అయింది నీకు. నేను మందు రాస్తాను అని చెప్పి మందు తీసుకువచ్చి ఆ పులి గాయాలపై రాస్తాడు. పాపం ఆ పులి కలిసిపోవడంతో అక్కడే విశ్రాంతి తీసుకుంటుంది .ఆ మరుసటి రోజు సంపత్ అక్కడికి వచ్చి… రంగయ్య ఎంతవరకు వచ్చింది నీ ట్రైనింగ్ కొంచమైన నేర్చుకుందాం లేదా.
రంగయ్య…. అయ్యా ఆ పులి చాలా బలహీనంగా ఉంది అయ్యా. అందుకే నేనే విశ్రాంతి తీసుకుంటుందనీ దానిని కదిలించలేదు.
అందుకు సంపత్ చాలా కోపంగా… నేను చెప్పింది చెయ్యకపోతే నువ్వు ఇక్కడ అవసరం లేదు. అని ఒక కర్ర తీసుకొని ఆ పులి బోను లోకి వెళ్లి ఆ పులితో ….. లెగవే పై లే అంటూ కర్రతో దాన్ని కొడుతూ దాన్ని చిత్రహింసలు పెడతాడు. పాపం ఆ పులి చాలా బాధ పడుతూ…వద్దు వద్దు దయచేసి నన్ను కొట్టొద్దు నీకు పుణ్యం ఉంటుంది. దయచేసి నన్ను కొట్టకండి అంటూ ప్రాధేయ పడుతూ ఏడుస్తూ ఉంటుంది.
పాపం రంగయ్య దాన్ని చూస్తూ ఏమీ చేయలేక తన మనసులో బాధపడుతూ ఉంటాడు ఇంతలో ఒక సంపత్ స్నేహితుడైన పవన్ అక్కడికి వస్తాడు.
సంపత్ పవన్ ని చూసి దానిని కొట్టడం మానేసి పవన్ దగ్గరికి వెళ్తాడు ఆ తర్వాత ఇద్దరూ ఒకచోట కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. రంగయ్య పులి దగ్గరికి వెళ్తాడు ఆ పులి ఎంతో జాలిగా అతని వైపు చూస్తూ….
అయ్యా నీకు పుణ్యం ఉంటుంది దయచేసి నన్నుఇక్కడి నుంచి విడిచిపెట్టు నేను వెళ్ళిపోతాను నేను ఈ బాధలు భరించలేక
పోతున్నాను అంటూ ఏడుస్తూ ప్రాధేయ పడుతుంది రంగయ్య దాన్ని చూస్తూ చాలా బాధపడుతూ…. అయ్యో నీకు సహాయం చేయాలన్న నేను చెయ్యలేకపోతున్నాను ఆ దుర్మార్గుడు నా ప్రాణాలు కూడా తీస్తాడు . నేనేం చేయలేను అంటూ బాధపడుతూ బయటకు వస్తాడు ఇంతలో పవన్ సంపత్తులు మాట్లాడుకుంటాం వింటాడు.
పవన్ సంపత్తితో ….. రేయ్ సంపత్ ఏంట్రా పులి చర్మం కావాలని ఎంతో మంది అడుగుతున్నారు నువ్వు పులి తీసుకొచ్చావు దాన్ని ఎప్పుడు అమ్ముతావు.
సంపత్…. లేదురా అది గర్భవతి దానికి పిల్లలు పుట్టిన తర్వాత దీన్ని అమ్ముదాం అని అనుకుంటున్నాను అంతవరకు ఇక్కడే ఉంటుంది.
ఆ మాటలు విన్న రంగయ్య…. అయ్యో వీడు దీనిని కూడా చంపుతా అంటున్నాడు. అయ్యో భగవంతుడా ఇప్పుడు నేను ఏం చేయాలి అని ఆలోచిస్తూ ….. నా ప్రాణం పోయినా పర్వాలేదు పాపం ఆ తల్లి బిడ్డలు క్షేమంగా ఉంటే చాలు అని అనుకొని ఆ పులి బోను ని తెరిచి దానితో…… త్వరగా ఇక్కడినుంచి పారిపో అని అంటాడు ఆ పులి … మీకు చాలా కృతజ్ఞతలు అంటూ రంగయ్యకు కృతజ్ఞతలు చెప్పుకొని అక్కడ నుంచి పరుగులు తీస్తూ ఉంటుంది. అప్పుడే దానిని గమనించిన సంపత్….. రంగయ్య పులి పారిపోతుంది రా ఏం చేస్తున్నావ్ రా అంటూ అక్కడికి వస్తాడు.
సంపత్ చాలా కోపంగా… రేయ్ నిజం చెప్పు బోనులో ఉన్న పులి ఎలా బయటకు వచ్చింది నువ్వే తప్పించావ్వూ కదా అంటూ అతన్ని చితకబాదాడు . ఆ తర్వాత పులి వెంటపడుతూ ఉంటాడు ఆ పులి అడవిలోకి పరిగెడుతుంది.
అప్పుడే అక్కడ ఒక వేటగాడు కనపడతాడు
అతను ఆ వేటగాడి తో… నువ్వు అప్పుడు నాకు ప్రాణాలతో పట్టిస్తే నువ్వు కోరిన డబ్బులు ఇస్తాను. అని అంటాడు ఆ వేటగాడు వెంటనే ఆ పులి వెంట పడుతూ బాణాన్ని విసురుతాడు. ఆ బాణం దానికి తగిలి గాయమయ్యే…. అయ్యో భగవంతుడా
ఎందుకు నాకీ కష్టం ఒకదాని తర్వాత ఒకటి నన్ను హింసిస్తూ నే ఉన్నాయి. నువ్వు నన్ను చంపాలని అనుకుంటే ఒకేసారి చంటి ఇలా చిత్రహింసలు మాత్రం పెట్టకు నీకు పుణ్యం ఉంటుంది అని ఏడుస్తూ భగవంతుని ప్రార్థిస్తుంది. సంపత్ ఆ వేటగాడి తో…. రేయ్ వెధవ నేను ప్రాణాలతో కావాలి అంటే దానిపై బాణం విసిరావే ఏంట్రా అంటూ అతన్ని కొడతాడు.సంపత్ ఆ వేటగాడు ఒకరితో ఒకరు చూసుకోకుండా పక్కనే ఉన్న ఊబిలో కూరుకు పోతారు. వాళ్ళిద్దరూ కాపాడండి కాపాడండి అంటూ అరుస్తూ ఉంటారు.
అప్పుడే రంగయ్య అక్కడికి చేరుకుంటాడు. అప్పటికే వాళ్ళిద్దరూ ఆ ఊబిలో మునిగిపోయి మరణిస్తారు.
ఆ పులి చిన్నగా రంగయ్య దానిని చేరుకొని
దానికి ఉన్న బాణాన్ని తొలగించి …. ఇంక నువ్వు నిర్భయంగా బ్రతకవచ్చు. నిన్ను చంపాలనుకున్న వాళ్లని ఆ భగవంతుడు భూమ్మీద లేకుండా చేశాడు.
పులి చాలా ఏడుస్తూ….. అయ్యా మీకు ఎంతో రుణపడి ఉంటాను. నాకు ఎక్కడా సురక్షిత లేదు నాకు మీరే దైవం మీరే నా రక్షణ నన్ను మీతో పాటే తీసుకువెళ్ళండి. కాదనకండి అని ప్రాధేయ పడుతూ ఏడుస్తుంది.
అందుకు రంగయ్య సరే అని చెప్పి ఆ పులిని తీసుకొని తన యజమాని ఇంటికి వెళ్తాడు. అక్కడ యజమాని పటం ముందు…. అయ్యా నా చేతికి మట్టి అంటకుండా భగవంతుడు వాడిని మట్టి కలిపేశాడు నీ ఆత్మకు శాంతి కలిగిందని నేను భావిస్తున్నాను. అని అంటాడు ఆ రోజు నుంచి ఆ పులిని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ దానితో సంతోషంగా గడుపుతారు. ఆ పులి కూడా తన జీవితంలో జరిగిన చేదు జ్ఞాపకాలు అన్నింటినీ మర్చిపోయి సంతోషంగా జీవిస్తుంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *