గర్భవతి చిరుతపులి_ Telugu Stories- Stories in Telugu – Panchatantra Kathalu

అక్షర పురం అనే ఒక పెద్ద గ్రామం ఉండేది ఆ గ్రామంలో శంకర్రావు అనే ఒక పెద్ద ధనవంతుడు ఉండేవాడు. అతడికి ప్రియా అనే 20 సంవత్సరాల అమ్మాయి కూడా ఉంది. ఆ అమ్మాయి అంటే అతనికి చాలా ఇష్టం ఆమెను ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. ఆమె ఏది అడిగిన కాదు అనుకుం డా దానిని చేసేవాడు. అలా ఉండగా ఒక రోజు ఆమె తన తండ్రి దగ్గరికి వచ్చి… నాన్న నాకు ఒకసారి అడవి కి వెళ్ళాలని ఉంది పక్క ఊరిలో పెద్ద అడవి ఉంది కదా నాన్న ఒక సారి అక్కడికి వెళ్దామా. అందుకు అతను…సరే అమ్మ నువ్వు అడిగితే నేను ఎప్పుడైనా కాదన్నానా మన కారులో వెళ్దాం. ఎందుకు ప్రియా చాలా సంతోషపడుతూ….. సరే నాన్నా మరి ఇప్పుడే బయలుదేరాం.

పదండి అంటూ ఇద్దరు కలిసి కారులో అడవిలో తిరుగుతూ ఉంటారు ఇంతలో ఒక గర్భవతి అయిన చిరుతపులి వాళ్ల కంట పడుతుంది దాన్ని చూసిన ప్రియా చాలా సంతోషపడుతూ ….అబ్బా నాన్న ఇప్పుడు చూసారా ఎంత అందంగా ఉందో దాని వంటి మీద మచ్చలు చాలా బాగున్నాయి. పులిని సినిమాలో చూడటం తప్ప ఇంత దగ్గరగా ఎప్పుడూ చూడలేదు. నాకు చాలా బాగా నచ్చింది.
అందుకు అతను….. నచ్చిందా అమ్మా. నీకే కాదు నాకు కూడా చాలా బాగా నచ్చింది.
అని ఆ అడవి మొత్తం తిరిగి అక్కడ ఉన్న అందాలన్నీ ఆస్వాదిస్తారు.
ప్రియా….నాన్న అసలు ఇక్కడ అందమైన రకరకాల చెట్లు తప్పా ఏ ఒక్క జంతువు కూడా లేదు ఆ ఒక్క చిరుతపులి తప్ప.
కానీ వచ్చినందుకు మాత్రం నేను ఆ పులిని చూశాను నాకు చాలా సంతోషంగా ఉంది.
అని చెప్తుంది ఆమె మాటల్లో తన తండ్రి వింటూ ఆమె కూడా సంతోష పడుతూ ఉంటాడు. అలా ఇద్దరూ కలిసి ఇంటికి తిరిగి వెళ్ళిపోతారు. ఆ విధంగా ఆరోజు గడిచిపోతుంది ఆ మరుసటి రోజు ఉదయమే
ప్రియా తండ్రి నిద్రిస్తున్న ఆమె దగ్గరకు వచ్చి … ప్రియా ఒకసారి లేమ్మా బయట నీ స్నేహితురాలు నీ కోసం ఎదురు చూస్తుంది.
అని ఆమెనీ లేపుతాడు ప్రియా నిద్రలేచి….
ఎవరు నాన్న అమృత వచ్చిందా కానీ ఇంత పొద్దున్నే ఎందుకు.
అందుకు అతను…. ఎందుకో ఏమిటో నువ్వే వెళ్లి అడుగు అని అంటాడు.ఆమె సరే నిద్ర లేచి బయటకు వస్తుంది ఆమె అటూ ఇటూ చూస్తూ ఉండగా ఆమెకు అక్కడ ఎవరు కనపడరు . ఇంతలో ఆమె…. ఏంటి నాన్నా అమృత వచ్చింది అన్నావు. ఎక్కడ.
తండ్రి…. అమృత అనే నేను నీకు చెప్పలేదు నీ స్నేహితురాలనీ చెప్పాను అదిగో అక్కడ బోనులో నీకోసం ఎదురు చూస్తుంది చూడు.
ఆమె ఆశ్చర్యంగా అటు వైపు చూస్తుంది ఆ బోనులో గర్భవతి అయినా చిరుతపులి ఉంటుంది. దానిని చూసి ఆమె చాలా సంతోష పడుతూ తండ్రితో…. నాన్నా నేను అసలు అనుకోలేదు ఇది నా ఇంటికి వస్తుందని మీకు చాలా థాంక్స్ నాన్న అని అంటుంది. అందుకు అతను…. నా బంగారు తల్లి మనసులో ఏముందో ఆమాత్రం అర్థం చేసుకోలే నా నువ్వు ఎంతో బాగుంది అంటే చాలు అది ఎంత ఖర్చు అయినా మన ఇంట్లో నీ ముందు ఉంటుంది నాకు సంతోషం కంటే ఏది ముఖ్యం కాదు అని అంటాడు అందుకామె చాలా సంతోషపడుతుంది. అలా ఆ చిరుత అక్కడే బందీగా ఉండిపోతుంది.పాపం అక్కడ ఎవరు దానికి ఏమి ఇచ్చినా తినేది కాదు చాలా దిగులుగా ఉండేది. పాపం అది తన మనసులో…. స్వేచ్ఛ లేని జీవితం ఎవరికీ ఉండకూడదు. ప్రకృతి లో హాయిగా తిరిగే నన్ను తీసుకువచ్చి ఇక్కడ బంధించారు అసలు ఏమీ లేదు అంటూ భోరున ఏడుస్తూ ఉంటుంది చాలా రోజులు గడిచాయి అది సరిగ్గా ఏమి తినక పోవటం తో. చాలా బలహీనంగా అయిపోతుంది. అలా ఉండగా ఒకరోజు అది దిగులుగా ఉండటం చూసిన ప్రియా ఆ రోజు రాత్రి సమయం దాని దగ్గరకు వెళ్లి బోనులో ఉన్న చిరుతపులి దగ్గరకు వెళ్లి….. ఇక్కడ నీకు అంతా చాలా బాగుంటుంది మూడు పూటల భోజనం లభిస్తుంది మీ కడుపు పూర్తిగా నిండుతుంది.
ఎందుకు నువ్వు అంత దిగులుగా ఉన్నావు.నువ్వు మొదటిరోజు వచ్చినప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది కానీ రోజురోజుకీ నువ్వు చాలా దిగులుగా కనబడుతున్నావ్ నాకు అది ఏమాత్రం నచ్చలేదు.
అందుకు ఆ గర్భవతి చిరుత ఏడుస్తూ….అడవిలో స్వేచ్ఛగా తిరుగుతూ న నన్ను ఇక్కడికి తీసుకు వచ్చారు. నాకు ఇక్కడ ఏ మాత్రం అస్సలు బాలేదు. దయచేసి నన్ను ఇక్కడి నుంచి పంపించేయండి. మీకు పుణ్యం ఉంటుంది.అంతకుమించి చెప్పడానికి నా దగ్గర మాటలు కూడా లేవు దయచేసి నా మీద జాలి చూపించండి అంటూ బోరున ఏడుస్తుంది.
అందుకు ఆమె…. అయితే నువ్వు ఇక్కడ ఉండడం నీకు ఇష్టం లేదా.
చిరుత…. నాకు ఏమాత్రం ఇష్టం లేదు.
అందుకు ఆమె… సరే నిన్ను పంపించేస్తాను బాధపడకు.
అ చిరుత చాలా సంతోషంగా ….. మీకు చాలా కృతజ్ఞతలు అని అంటుంది వెంటనే ఆమె ఆ బోను ని తెరుస్తుంది ఆ చిరుత చాలా సంతోషంగా అక్కడ నుండి పరిగెడుతుంది.
చిరుత పరిగెత్తడం చూసిన తండ్రి తప్పించుకుని పరిగెడుతుంది అనుకొని …. రేయ్ శివయ్య మల్లయ్య ఆ చిరుతపులి తప్పించుకొని పరిగెడుతుంది ఊరిలో జనాల మీద పడుతుందేమో త్వరగా వెళ్ళి దాన్ని పట్టుకొని రండి అంటూ కేకలు వేస్తాడు ఆ మాటలు విన్న వాళ్ళిద్దరూ వల ను తీసుకొని దాని వెంట పరిగెడతారు.
శంకరరావు కూడా దాని వెంట పరిగెడతాడు దాన్ని చూసి న ప్రియా…..నాన్న ఒక్క నిమిషం ఆగండి నేను చెప్పేది వినండి నాన్న ఒక్క నిమిషం ఆగండి నేను చెప్పేది వినండి అంటూ కేకలు వేస్తూ ఆమె కూడా అతని వెంట పరిగెడుతుంది. పాపం ఆ చిరుత చాలా భయం తో అడవి వైపు పరిగెడుతు….. ఎలా అయినా ఇక్కడి నుంచి తప్పించుకోవాలి లేదంటే వాళ్ళ ఆ నరకంలో నన్ను బంధించే చేస్తారు.అంటూ వేగంగా పరిగెడుతూ ఉంటుంది పాపం దానికి కడుపులో బిడ్డ కారణంగా అది చాలా దూరం పరిగెత్తి అలిసిపోయి …. అమ్మ ఇంక నావల్ల కాదు నేను పరిగెత్త లేక పోతున్నాను. అంటూ ఒక చోట ఆయాసంతో నిలబడుతుంది వెంటనే ఆ ఇద్దరు వ్యక్తులు దానిపైన బలమైన వల విసురుతారు. ఆ పులిని ఆవల లో తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండగా…. ఆ ఇద్దరు వ్యక్తులు అది ఎక్కడ తప్పించుకుంటుందఅన్న భయంతో కర్రలతో దాన్ని కొడుతూ ఉంటారు.
పాపం ఆ పులి చాలా పెద్దగా అరుస్తూ…. వద్దు దయచేసి నన్ను కొట్టండి మీకు పుణ్యం ఉంటుంది. నేను మీ దగ్గరికి తిరిగి వచ్చేస్తాను దయచేసి కొట్టకండి నా బిడ్డ లోపల అల్లాడి పోతున్నాడు . అంటూ పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటుంది ఇంతలో శంకర్రావు అక్కడికి వచ్చి…… ఎంత ధైర్యం దీనికి చిరుత పులి అయితే ఎవరికి ఎక్కువ అడవికి ఏమో. మన గ్రామానికి నేనే పులి. తప్పించుకుంటావా ఆ నీ అంటూ కాలుతో బలంగా దానిని తంతాడు.
అప్పుడే ప్రియా దాన్ని చూసి… నాన్న ఎందుకు దానిని అలా హింసిస్తున్నారు. వదిలేయండి దాన్ని. అంటూ దాని దగ్గరికి వెళుతుంది.
అప్పటికే వాళ్ళు దాన్ని చితక బాధ టంతో అది ప్రాణ భయంతో వణుకుతూ. ఒంటినిండా గాయాలతో కనపడటంతో ప్రియా కి తన కంటిలో గిర్రున నీళ్ళు తిరిగాయి. ఆమె ఏడుస్తూ…. అసలు మీరు మనుషులా పశువులా ఒక గర్భవతి అయిన జీవిని పట్టుకొని ఇంతగా హింసిస్తున్నారు మిమ్మల్ని కూడా ఇలాగే చిత్రహింసలు పెట్టాలి. మీకు కొంచెం కూడా జాలి లేదు.
అందుకు వాళ్ళలో సింగయ్య….. ఏంది అమ్మ గారు అట మాట్లాడతారు. అయ్య గారు చెప్పింది కదా మేము చేసాము.
అందుకు ఆమె చాలా కోపంగా…. నిజమే మిమ్మల్ని ఏం లాభం. మా నాన్నని అనాలి.
ఎందుకు నాన్న ఇలా చేస్తున్నావు. అసలు నేను దీన్ని విడిచి పెట్టాను. పాప o ఈ చిరుత ఒక్కరోజులోనే ఎంత దిగులు పెట్టుకుంది నాకు అర్థం అయింది అందుకే దీన్ని దగ్గరికి
వెళ్ళి అడిగాను. పాపం అది దాని బాధ చెప్పుకుంటే దాని బాధను అర్థం చేసుకొని నేను అలా చేశాను. పాపం అన్యాయంగా దీనిని చిత్రహింసలు పెడుతున్నారు అందుకు తండ్రి ….. ప్రియా నేను నీకు సంతోషం కోసమే కదా కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టి దీన్ని దీనిని ఇంటికి తీసుకు వచ్చాను.
అప్పుడు ఆమె….మీలాంటి తండ్రి దొరకడం నాకు చాలా అదృష్టం నాన్న కానీ నా సంతోషం కోసం ఈ జీవి స్వేచ్ఛ నేను హరించ లేను.
దయచేసి దాన్ని వదిలేయ్ అని చెప్పు నాన్న.
అందుకు అతను …. సరే రా దాన్ని తీసుకెళ్లి జాగ్రత్తగా అడవిలో విడిచి పెట్టండి.
అప్పుడు ఆమె….. ఒక్క నిమిషం ఆగు సింగయ్య నువ్వు ఇంటికి వెళ్లి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకుని రా. ఇన్ని గాయాలతో అది ఎంతగా అల్లాడి పోతుందో త్వరగా వెళ్ళు అతను సరే అని చెప్పి అక్కడి నుంచి ఇంటికి వెళ్లి బాక్స్ తీసుకొని. తిరిగి అక్కడికి వస్తాడు ఆమె వెంటనే ఆ బాక్స్ తీసుకుని ఆ చిరుత పులి గాయాలపై మందు నీ రాసి . దానితో…. ఇదంతా నా వల్లే జరిగింది నన్ను క్షమించు అంటూ ప్రాధేయ పడుతోంది.
ఆ తర్వాత వాళ్ళిద్దరూ దానిని విడిచిపెడతారు. అది పాపం చిన్నగా కుంటుకుంటూ అక్కడి నుంచి వెళ్తుంది. అక్కడ
ప్రియా తన తండ్రి తో…… నిజంగా ఆ పులి చాలా మంచిది నాన్న.ఎందుకంటే మీరు అంతగా ఇబ్బంది పెట్టినా కూడా అది మీకు ఎదురు తిరగలేదు అది ఎదురు తిరిగినట్లు అయితే ఏం జరిగేదో ఊహించలేము.
అందుకు అతను…. నిజమే అమ్మ నేను అంత లోతుగా ఆలోచించలేదు కానీ పాపం అది చాలా మంచిది. నేను అలా చేసి ఉండకూడదు అని బాధపడుతూ అక్కడి నుంచి ఇద్దరూ ఇంటికి తిరిగి వెళ్ళిపోతారు.
అలా కొన్ని రోజులు గడిచాయి ఎందుకో ప్రియా కి ఆ పులిని చూడాలని అనిపిస్తుంది.
అందుకని ఆమె తన తండ్రికి తెలియకుండా.
అడివి కి వెళ్తుంది అక్కడ ఆ పు లి నీ కోసం వెతుకుతూ ఉంటుంది కానీ ఎక్కడా పులి కనిపించకపోవడంతో చాలా కంగారుగా…. అయ్యో భగవంతుడా ఈ పులి ఎక్కడికి వెళ్ళిపోయింది. ఆరోజు కొట్టిన దెబ్బకి తనకు ఏమి కాలేదు కదా దానికి ఏం కాకుండా చూడు భగవంతుడా అంటూ దేవుని ప్రార్థిస్తూ ఉండగా ఆ పులి ఒక చోట విశ్రాంతి తీసుకుంటూ కనబడుతుంది దాన్ని చూసి చాలా సంతోషంగా ఆ పులి దగ్గరికి వెళుతుంది. అప్పుడు ఆ పులి కి ఒక కన్ను లేకుండా ఉంటుంది దాన్ని చూసి నా ప్రియా…. అయ్యో ఏమైంది నీ కంటికి ఏం జరిగింది. పైగా నీ రెండో కంటికి రక్తం వస్తుంది అసలు ఏం జరిగింది. పాపం ఆ పులి చాలా ఏడుస్తూ …. మేము అంటే అందరికీ చులకనే. అందరిదీ ఏదో ఒక అవసరం మాతో. ఆరోజు నేను ఎన్నో గాయాలతో అడవిలో తిరుగుతూ ఉన్నాను . గాయాలు మారుతున్నది అన్న సమయంలో ఒక వ్యక్తి నా వెంట పడ్డాడు . అతడు నన్ను ఎన్నో విధాలుగా పట్టుకోవడానికి ప్రయత్నించాడు. నేను అక్కడి నుంచి పరుగులు తీశాను అతను బాణాలు విసిరాడు అతను వేసిన బాణాలు నా తోక కు తగిలి నా తో క కూడా ఇరిగి పోయింది. అంటూ ఏడుస్తుంది. పాపం ఆ పులికి తో క కూడా లేదు . దానిని చూసిన ప్రియా మరింత బాధపడుతూ…. అయ్యో ఎంతపని జరిగిపోయింది. ఆ కంటికి ఏం జరిగింది.
పులి…. అతను నేను దొరక్కపోవడంతో నా మీద రాయి విసిరాడు అది సరిగ్గా నా కంటికి తగిలి నా కన్ను పోయింది. ఈ కంటి కూడా గాయం అయింది నాకు కళ్ళు సరిగ్గా కనిపించడం లేదు. నేను ఎలాగోలా తప్పించుకున్నాను. ఆ రోజు నుంచి నాకు సరిగ్గా కళ్ళు కనపడడంలేదు నేను తిండి తిని సరిగ్గా వారం రోజులు పైన అవుతుంది.
నాకు చాలా ఆకలిగా ఉంది నా కడుపులో బిడ్డ ఆకలి ఆకలి అంటూ అల్లాడి పోతున్నాడు.
ఇంక నా ప్రాణం ఇవాళ రేపు అన్నట్టుగా ఉంది అంటూ ఏడుస్తుంది. ఆ మాటలు విన్న ప్రియా చాలా బాధ పడుతూ….. అయ్యో బాధపడకు ఆరోజు నేను నిన్ను అలా వదిలి పెట్టకుండా ఉన్నట్టయితే ఇదంతా జరిగింది కాదేమో అనిపిస్తుంది. మంచి ఆలోచిస్తే చెడు జరిగింది అన్నట్టుగా ఉంది. ఇదంతా నా వల్లే నన్ను క్షమించు. ఒక్కసారి చేసిన తప్పు కి నువ్వు ఎన్నో ఇబ్బందులు పడుతున్నావ్వూ. నువ్వు ఏమి బాధ పడకు నేను ఉన్నా కదా నువ్వు ఎక్కడైనా విశ్రాంతి తీసుకో నేను ఇంటికి వెళ్ళి ప్రతిరోజు నీ కోసం ఆహారం తీసుకొస్తాను.
అందుకు ఆ పులి చాలా సంతోషపడుతూ.
….. చాలా సంతోషం త్వరగా పని చెయ్యండి ఇ నీకు పుణ్యం ఉంటుంది నా బిడ్డని బతికించుకోవాలి నేను. అని భోరున ఏడుస్తూ ఉంటుంది ప్రియా సరే అని చెప్పి అక్కడి నుంచి తన ఇంటికి వెళ్లి దానికి కావాల్సిన ఆహారాన్ని తీసుకొని అక్కడికి పెళ్లి దానికి ఆహారాన్ని అందిస్తుంది.
ఆ పులి దాన్ని తిని చాలా సంతోషపడుతూ…. ఈ జన్మలో నీకు రుణపడి పోయాను. అంటూ ఆమెకి కృతజ్ఞత చెప్పుకుంటుంది ప్రియా…. ఇంకా నువ్వు ఏం బాధ పడుకో నేను చేసిన తప్పు నీ నేనే సరిదిద్దు కుంటాను. నీకు ప్రతిరోజు ఆహారం నేను అందిస్తాను. అని అంటుంది అలా ప్రతిరోజూ ప్రియా ఎవరికి తెలియకుండా అడవికి వెళ్లి ఆ పులికి ఆహారాన్ని అందిస్తూ ఉంటుంది ఇలా కొన్ని రోజులు గడిచాయి. ఆ పులి కోలుకుంటుంది అది చాలా సంతోషంగా జరిగింది అంతా మర్చిపోయి అక్కడే హాయిగా జీవిస్తూ ఉంటుంది. దాన్ని చూసిన ప్రియ కూడా చాలా సంతోష పడుతూ…. భగవంతుడా నేను చేసిన తప్పును క్షమించు. ఆ తప్పును సరి దిద్దుకున్న ననే అనుకుంటున్నాను. అని సంతోషపడుతూ భగవంతుని ప్రార్థిస్తుంది అలా ఆ చిరుతపులి ప్రియుల మధ్య చాలా స్నేహ బంధం ఏర్పడుతుంది ఆమె ప్రతి రోజూ దానికి ఆహారాన్ని అందిస్తూ దానితో గడుపుతూ చాలా సంతోషంగా గడుపుతుంది దానంత తెలుసుకున్న తండ్రి తన లో…. ఇప్పుడు ఇద్దరూ చాలా సంతోషంగా ఉన్నారు ఆ పులికి స్వేచ్ఛ లభించింది అలాగే నా బంగారు తల్లికి దానితో ఉండాలి అన్న కోరిక కూడా తీరింది. అంటూ అతను కూడా చాలా సంతోష పడతాడు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *