గర్భవతి చిరుతపులి_ Telugu Stories- Stories in Telugu – Panchatantra Kathalu

అది ఒక పెద్ద అడవి అడవిలో ఎన్నో రకాల పక్షులు జంతువులు నివసిస్తున్నాయి. అందులో ఒక గర్భవతి అయిన చిరుతపులి కూడా ఉంటుంది అది చాలా మంచిది. ఒకరోజు ఒక వేటగాడు ఆ అడవి లోకి రావడం ఆ పులి గమనిస్తోంది. అప్పుడు తన మనసులో…. ఎవరు ఇతను నేను ఎప్పుడూ చూడలేదు. పైగా తన చేతిలో ఏదో వల ఉంది.

అని అనుకుంటూ ఉంటుంది. ఇంతలో ఆ వ్యక్తి ఆ వాలని అక్కడ పరిచి ఉంచి అక్కడనుంచి వెళ్ళి పోతాడు. అది అలా అనుకుంటూ దాన్ని చూస్తూ ఉండగా వెనుక నుంచి ఆ వ్యక్తి దానికి బాణాన్ని విసురుతాడు.
ఆ బాణం ఆ పులి కాలికి తగిలి గాయమవుతుంది. పాపం ఆ పులి భయంతో అలాగే అక్కడి నుంచి పరిగెడుతుంది ఆ వ్యక్తి కూడా దాని వెంట పరిగెడతాడు. ఇంతలో ఆ పులి కనపడకపోవడం తో అతను ఒక చోట నిలబడి…. చ దొరక్క దొరక్క దొరికింది అనుకున్నాను. భలేగా తప్పించుకుంది. ఇప్పుడు మార్కెట్లో దాని గోళ్లు చర్మం మంచి గిరాకీ ఉంది. ఎలా అయినా పట్టుకుంటాను కోట్లకు అధిపతి అయిపోతాను వదిలిపెట్టను నిన్ను అనీ అనుకుంటూ అక్కడనుంచి వెళ్ళి పోతాడు పాపం ఆ పులి ఒక చోట దాక్కొని …. అయ్యో భగవంతుడా నా కాలికి చాలా పెద్ద గాయం అయింది. చాలా నొప్పిగా ఉంది అని అనుకుంటూ దేవుని ప్రార్థిస్తూ తన నోటి ద్వారా ఆ బాణాన్ని తొలగించి వేస్తుంది.
ఆ తర్వాత అక్కడే చాలా ఆయాసపడుతూ నిద్రొస్తుంది. అలా చాలా సమయం అవుతుంది దానికి బాగా ఆకలి వేయడంతో నిద్రనుంచి మేలుకొని….. భగవంతుడా తినడానికి ఏమన్నా దొరికేలా చెయ్ లేదంటే నేను ఆకలితో అల్లాడి పోవాల్సి ఉంటుంది.
అని అనుకుంటూ ఆహారం కోసం వెతుక్కుంటూ వస్తుంది ఆ సమయంలోనే ఆ వేటగాడు అతను వేసిన వలలో ఏదన్నా జంతువు పడిందేమో అని వస్తూ ఉంటాడు.
ఇంతలో మళ్లీ ఆ పులి అతని కంట పడుతుంది. కానీ ఆ పులి అతని గమనించదు. అతను….. ఇదే మంచి అవకాశం తప్పించుకుపోయిదనుకొన్నది మళ్లీ దొరికింది. అంటూ తన చేతిలో ఉన్న బాణాన్ని మళ్లీ విసురుతాడు. ఆ బాణం గురి తప్పి పక్కన చెట్టుకి తగులుతుంది. దానిని గమనించిన చిరుతపులి….. అమ్మో వీడు మళ్లీ వచ్చేశాడు నన్ను వదిలేలా లేడు భగవంతుడా నేను ఏం చేయాలి అంటూ ఆ గాయమైన కాళ్ళతోనే పాపం ఎంతో బాధపడుతూ పరుగులు తీస్తుంది. అతను కూడా దాని వెంట పరిగెడతాడు కొంత దూరం వెళ్లిన తర్వాత అది మళ్లీ కనపడకుండా వెళ్ళిపోతుంది. అతను…. అరే ఇది మళ్లీ తప్పించుకుంది అని అక్కడనుంచి వెళ్ళి పోతాడు ఆ చిరుతపులి మాత్రం అలా భయంతో పరిగెడుతూ పక్క గ్రామం లోకి వెళుతుంది. అక్కడ ఒక చోట నిలబడి…. అమ్మ నాకు చాలా దాహంగా ఉంది. ఇక్కడ ఎక్కడైనా నీళ్లు దొరికితే బాగుండు. అని అటు ఇటు తిరుగుతూ ఉండగా దానికి ఒక పెద్ద చెరువు కనబడుతుంది. ఆ చిరుత పులి చెరువు దగ్గరకు వెళ్లి నీటిని తాగుతూ ఉండగా. దానిని ఒక ఆమె చూసి పరుగుపరుగున ఊర్లోకి వెళ్లి….. అడవి నుంచి చిరుత పులి వచ్చింది. అందరూ జాగ్రత్తగా ఉండండి చిన్న పిల్లల్ని బయటకు రానివ్వకండి. అంటూ పెద్ద పెద్దగా కేకలు వేస్తోంది. ఆమె మాటలు విన్న కొందరు వ్యక్తులు. ఆమె దగ్గరకు వచ్చి…. ఏంటి నువ్వు చెప్పింది నిజమా ఎక్కడుంది. ఆ చిరుత పులి
ఆమె…. ఎక్కడో కాదు ఆ మంచి నీటి చెరువు దగ్గరే ఉంది నేను నా కళ్ళారా చూశాను.
అందుకు వాళ్లు కొన్ని కర్రలు తీసుకొని …. వెళ్దాం పదండి ఊరు నుంచి దాన్ని తరిమికొడదాం. అంటూ అక్కడికి వెళ్తారు అప్పటికే బాగా అలసి పోయిన అక్కడ చెట్టు దగ్గర విశ్రాంతి తీసుకుంటూ ఉంటుంది.
అప్పుడే కొందరు వ్యక్తులు అక్కడికి వెళ్లి కర్రలతో దానిపై దాడి చేయడానికి ప్రయత్నిస్తుండగా ఆ పులి వాళ్లని చూసి బెంబేలెత్తి పోతుంది. అది తన మనసులో… ఓరి దేవుడా ఏంటి వీళ్లు ఇంతమంది నా వెంట పడ్డారు. దయచేసి నన్ను ఏం చేయకండి నేను ఎవరిని ఏమి చేయను. దయచేసి నన్ను వదిలి పెట్టండి అంటూ తలలో అనుకుంటూ భయపడుతూ అక్కడి నుంచి పరుగులు తీస్తుంది. ఆ మనుషులు దాన్ని వెంటపడుతూ కొడుతూ ఉంటారు. పాపము దెబ్బలకు తట్టుకోలేక అది పెద్ద పెద్దగా అరుస్తూ ప్రాణభయంతో పాడైపోయిన ఒక ఇంట్లో దాక్కుంటుంది. ఆ మనుషులు అంతా దాని కోసం వెతికి…. ఎక్కడికో తప్పించుకున్నట్లు ఉంది ఇంకా తిరిగి ఊర్లోకి రాదు భయపడిపోయింది అనుకుని వెళ్ళిపోతారు.
ఆ పులి చాలా ఏడుస్తూ….. నేను అసలు వీళ్ళని ఏమన్నా నని. నేను ఎదురుతిరిగితే వాళ్ళ పరిస్థితి ఏంటి నేను క్రూరమైన మృగాన్ని కానీ. అనవసరంగా ఎవరిని ఏమీ అనను ఎవరి ప్రాణాలు తీయను. కానీ వీడు నన్ను క్రూరమృగం గానే చూస్తున్నాను.
నేను అడవిలో ఉంటే అక్కడ స్వేచ్ఛ లేదు. గ్రామం లోకి వస్తే ఇక్కడ స్వేచ్చ లేదు. ఇంక నేను ఎక్కడికి వెళ్లాలి అంటూ బోరున ఏడుస్తుంది. అలా చాలా సమయం గడిచిపోతుంది పాపం గాయాలతో ఆ పులి అల్లాడి పోతుంది కాలికి తగిలిన బాణం గాయం నుంచి రక్తం కారుతూనే ఉంటుంది.
పాపం ఆ పులి… భగవంతుడా నాకు చాలా ఆకలిగా ఉంది ఏదో విధంగా నాకు సహాయం చెయ్యి. మీకు పుణ్యం ఉంటుందనీ దేవున్ని ప్రార్థిస్తూ ఉంది. ఇంతలో అక్కడికి ఒక బిచ్చగాడు వస్తాడు. అతన్ని చూసిన పులిభయంతో ఒకచోట నొక్కుతుంది.
ఆ బిచ్చగాడు ఒక దీపాన్ని వెలిగిస్తారు. అప్పుడు అతనికి అక్కడ రక్తపుమడుగులో కనబడతాయి. అతను….. ఏంటి ఈ రక్తపు మడుగులు ఎవరో ఇక్కడికి వచ్చారు. అంటూ దీపం పట్టుకుని అటూ ఇటూ చూస్తూ ఉండగా ఆ చాటున పులితో కనబడుతుంది. దానిని చూసిన అతను పెద్దగా…. పులి పులి పులి అని కేక వేస్తాడు.
వెంటనే ఆ పులి బయటకు వచ్చి…. అయ్యా దయచేసి ఎవర్ని పిలవకండి నేను మిమ్మల్ని ఏమీ చేయను నన్ను నమ్మండి. ఇప్పటికే నన్ను అందరూ కొట్టి చిత్రహింసలు పెట్టారు. దయ చేసి నన్ను వదిలేయండి.నేను కొంచెం సేపు ఇక్కడే ఉండి వెళ్ళిపోతాను నేను నడవలేని పరిస్థితిలో ఉన్నాను అంటూ ఏడుస్తూ సైగ చేస్తుంది.
ఆ బిచ్చగాడు ఆ పులి పై ఉన్న గాయాలు రక్తాన్ని చూసి జాలిపడి….. అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు. ఎవరు నిన్ను ఇంతగా బాధించారు. అప్పుడు ఆ చిరుతపులి జరిగిన విషయం అంతా చెబుతుంది. దానిని విన్న బిచ్చగాడు అయ్యో పాపం ఎంత పెద్ద కష్టం వచ్చి పడింది అని అనుకుంటాడు.
ఆ తరువాత చిరుతపులి…. అయ్యా నీ దగ్గర ఏమన్నా తినడానికి ఉంటే ఇవ్వు. నా కడుపులో బిడ్డ ఆకలితో అల్లాడి పోతున్నాడు.
అప్పుడు బిచ్చగాడు… నా దగ్గర తినడానికి ఏమీ లేదు అంతా అయిపోయింది. అయినా నువ్వు మాంసాన్ని తినే దానివి . అన్న ని ఎలా ముట్టుకుంటావ్వూ.
ఆ చిరుత పులి నవ్వుతూ….. ఆకలేస్తే పులి గడ్డి తింటుంది అన్న సామెత విన్నారు కదా.
నాకు చాలా ఆకలిగా ఉంది. దయచేసి ఏదైనా ఉంటే పెట్టండి.
బిచ్చగాడు…. నిన్ను చూస్తే జాలేస్తుంది కానీ నిన్ను దగ్గరికి చేరదీస్తే నన్ను చంపేస్తా వని భయమేస్తుంది.
చిరుత పులి…. భయపడకండి నా కడుపులో పెరుగుతున్న బిడ్డ మీద ఒట్టు. నేను మిమ్మల్ని ఏమీ చేయను. నాకంటూ ఒక మనసు ఉంది ఆకలి తీర్చిన వా డి ప్రాణాలు తీసే అంతా పాపిష్టి దాన్ని కాదు. దయచేసి నా బాధను అర్థం చేసుకోండి.
బిచ్చగాడు సరే అని చెప్పి బయటకు వెళ్ళి తన దగ్గర ఉన్న డబ్బులు తో ఆహారాన్ని తీసుకొస్తాడు అలాగే ఆ పులి పై ఉన్న గాయాలు తగ్గడానికి మందు మరియు కట్టు గుడ్డలను తీసుకొస్తాడు.
ఆ చిరుత పులి కి ఆహారాన్ని పెడతాడు అది ఆహార o మొత్తాన్ని తినేస్తుంది. ఆ బిచ్చగాడు ఆ పులి గాయాలపై మందు రాసి కట్టు కడతాడు. ఆ పులి చాలా సంతోషపడుతూ…. నీకు చాలా కృతజ్ఞతలు నా ఆకలి తీర్చారు. నేను క్రూర మృగం ఏ కానీ ఆకలి దప్పికలు నాకు కూడా ఉంటాయి. కానీ దానిని ఎవరూ అర్థం చేసుకోక నన్ను చాలా ఇబ్బంది పెట్టారు.
కానీ మీరు మాత్రం నా బాధని అర్థం చేసుకున్నా రు మీకు జన్మ జన్మ రుణపడి ఉంటాను. అందుకు అతను సంతోష పడతారు కానీ తన మనసులో మాత్రం కొంత భయం ఉంటుంది అలా రోజులు గడిచాయి ప్రతిరోజు అతను ఆహారాన్ని తీసుకొచ్చి ఆ పులికి అందిస్తూ ఉంటాడు. అలా కొన్నిరోజులకి ఇద్దరూ మంచి స్నేహితులు గా మారి పోతారు. ఎప్పటిలాగే బిచ్చగాడు బయటకు వెళ్ళ ఆ పులితో…సరే మిత్రమా నేను వెళ్లి వస్తాను నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పి వెళ్తాడు దానిని గమనించిన ఒక వ్యక్తి…. ఈ ముష్టివాడు ఎవరి తో మాట్లాడుతున్నాడు అని ఆ పాడైపోయిన ఇంటిలో తొంగి చూస్తాడు. అప్పుడు అతనికి ఆ పులి కనపడుతుంది. అతను భయపడుతూ ఊర్లోకి వెళ్లి జరిగిన విషయం చెప్తాడు. దాన్ని విన్న వాళ్లు ….. ముందు ఆ బిచ్చి గాడు ఎక్కడున్నాడు వెతకండి అంటూ అతన్ని వెతకడం ప్రారంభిస్తారు. ఇంతలో ఆ బిచ్చగాడు కనిపిస్తాడు. అందరూ అతన్ని పట్టుకొని….. ఏరా మేము పులి పోయింది అని అనుకుంటే నువ్వు దానికి ఆహారం పెట్టి పోషిస్తున్నా వా ఎవర్ని చంపడానికి . ఎవరిపై దాన్ని ఉసిగొల్పి డానికి చెప్పు. అంటూ అతన్ని చితకబాదారు అతను….. అయ్యా ఒకసారి నా మాట వినండి కొట్టకండి ఎందుకు నన్ను కొడుతున్నారు నేను చేసిన తప్పేంటి.
వాళ్లు…. తప్ప తప్పనర ఒక క్రూరమృగం ని పెంచుతున్నావు. అది కనక ఎదురుతిరిగింది అంటే ఊర్లో ఒక్కరు కూడా మిగలరు. అందర్నీ ఎముకలతో సహా నమిలి మింగేస్తుంది.
బిచ్చగాడు…. అలా అయితే ఆ పులి వెంట మీరు పడినప్పుడు. అది ఎదురు తిరిగేది అలా చేయలేదు అంటే దాని స్వభావం ఏంటిది అర్థం కాలేదా మీకు.
వాళ్లు…. ఏరా మాటలు బాగా మాట్లాడుతున్నావు. నాలుగిల్లీ అడుక్కొని తిన్న భోజనం కదా . ఆ మాత్రం పౌరుషం ఉంటుంది.
బిచ్చగాడు…. అవునయ్యా నాలుగిళ్ళు ఆడుకుంటాను. కానీ నాకు మంచి మానవత్వం ఉంది. ఆలోచించే జ్ఞానం ఉంది.
మిలాగా నేను ప్రవర్తించడం లేదు .
మంచిచెడులు తెలుసుకొని దాన్ని పెంచుతున్నాను. అని అంటాడు అందుకు వాళ్లు కోపంతో…. ఏరా మాకు ఏదో సమాధానం చెప్తావా అంటూ అందరూ చితకబాదారు. అతడు గాయాలతో అక్కడే కుప్పకూలిపోయాడు.
ఆ తర్వాత వాళ్లు కర్రలు తీసుకొని మళ్ళీ ఆ పులిని తరిమికొట్టడానికి ఇంటికి వెళ్తారు.
ఆ పులి విశ్రాంతి తీసుకుంటూ ఉండగా. వాళ్లు కర్రలతో దాన్ని పై దాడి చేస్తారు.
ఆ పులి భయంతో అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఎటు వెళ్ళలేక సతమతమవుతోంది. అక్కడి వాళ్లు ఆ పులి ఎక్కడ మీద పడుతుందో అని భయంతో దాన్ని కొడుతూనే ఉంటారు.పాపం ఆ పులి ఎటూ తప్పించుకోలేక అక్కడే ఉండిపోతుంది వాళ్ళు ఇష్టమొచ్చినట్టుగా దాన్ని కొడతారు. పాపం ఆ పులి దెబ్బలకి నీరసంతో పడిపోతుంది. వాళ్లు ఆ పులి చనిపోయింది అని. దాని కాలు పట్టుకుని రోడ్డుపై యిడ్చుకుంటూ వెళ్తూ ఉంటారు. పాపం ఆ పులి తన మనసులో ఎంతో బాధను అనుభవిస్తూ…. భగవంతుడా నేను వీళ్ళకి ఏమి అన్యాయం చేశాను. నన్ను ఇలా వేధిస్తున్నారు. నా చావు నువ్వు ఇక్కడే రాశి పెట్టినట్టు ఉన్నావు. కానీ నా బిడ్డ ఏం పాపం చేసింది భూమ్మీద పడకుండానే దాన్ని కూడా పైకి తీసుకు వెళ్తున్నావ్వి. అంటూ తనలో భోరున ఏడుస్తూ దేవుని ప్రార్ధిస్తుంది. అలా వాళ్ళు ఆ పులిని రోడ్డుపై తీసుకువెళుతూ దూరంగా విసిరి కొడతారు. ఆ తర్వాత అక్కడి నుంచి అందరూ వెళ్లిపోతారు. కొంత సమయం తర్వాత ఆ బిచ్చగాడు ఆ రోడ్డుపై రక్తపు మడుగు ని చూసుకుంటూ ఆ పులిని చేరుకుంటాడు. పాపం ఆ పులి చనిపోయి కనబడ్డం చూసి అతను ఏడుస్తూ…. అయ్యో గర్భవతి అని కూడా చూడకుండా అన్యాయంగా నీ ప్రాణాలు తీశారు నువ్వు ఏమి అన్యాయం చేసిన వాళ్ళకి.అలాంటి వాళ్లకి దేవుడు ఖచ్చితంగా ఏదో ఒక శిక్ష విధిస్తాడు విధించాలి అని నేను కోరుకుంటున్నాను అంటూ బోర్న్ ఏడుస్తాడు ఏదేమైనా అన్యాయంగా ఒక మోదీజీ ప్రాణాలు చేయడం అనేది చాలా పొరపాటు. ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *