గర్భవతి తల్లి బాధ 2_ Telugu Stories- Stories in Telugu – Panchatantra Kathalu

గర్భవతి తల్లి బాధ మొదటి భాగంలో సీతా ఒక బిడ్డకి జన్మనిచ్చిన చనిపోతుంది ఆ బిడ్డని ఒక వ్యక్తి తీసుకొని వెళ్ళి పోతాడు ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకుందాం సీతా శవం వర్షంలో తడుస్తూ తెల్లవార్లు అలాగే ఉండిపోతుంది ఆ మరుసటి రోజు ఉదయాన్నే ఒక వ్యక్తి సీతను చూసి…. సీత లాగా ఉంది అయ్యో పాపం అంటూ పరుగుపరుగున వెళ్లి తన అత్తగారికి …… అమ్మ అమ్మ మీ కోడలు సీత అక్కడ చనిపోయి ఉంది పాపం రాత్రంతా వర్షం లోనే ఉన్నట్టుంది. చూస్తే చాలా జాలిగా ఉందమ్మా త్వరగా వెళ్ళండి.

అత్త….. నాకు కోడలా అంటూ ఎవరూ లేరు.ఎవరు అనాధ శవాన్ని చూసి నా కోడలు అంటావేంటి నీకేం పని పాట లేదా మర్యాద గా ఎక్కడి నుంచి వెళ్లి. పాపం ఆ మాటలు విన్న ఆ వ్యక్తికి ఏం మాట్లాడాలో అర్థం కాక అక్కడనుంచి వెళ్ళి పోతాడు. అప్పుడే అక్కడికి ఆమె భర్త సీత శవాన్ని తీసుకొని అక్కడికి వచ్చి తన భార్యతో….. చూడవే చూడు పాపిష్టి దాన. సూటిపోటి మాటలతో దాని హృదయాన్ని గాయపరిచారు ఇప్పుడు మనిషి లేకుండా చేసావు. అంటూ పెద్ద పెద్దగా అరుస్తూ ఏడుస్తాడు. ధనం అంతా చూస్తున్న ఆమెకు కొంచెం కూడా జాలి కలగదు.
భర్త….కనీసం శవాన్ని చూసి అయినా నువ్వు జాలి పడటం లేదు కదా పశువా!? పశువా అని వాటిని అవమానించినట్టు ఉండిద్ది. పశువుల నీ కంటే వందరెట్లు నయం. అంటూ ఆమెను తిడుతూ సీత శవంతో…. అమ్మ సీత నన్ను క్షమించు. నాకు కోడలు కాకుండా ఉన్నట్టయితే మేనకోడలు లాగే మిగిలి పోయే దానివి. ఎక్కడైనా సంతోషంగా ఉండే దానివి.
నువ్వు నా ఇంటికి కోడలిగా వచ్చి నీ ప్రాణాన్ని బలితీసుకుంది నన్ను క్షమించు అంటూ కన్నీరుమున్నీరుగా ఏడుస్తూనే ఉంటాడు అలా చాలా సమయం గడిచిపోతుంది.
ఆ తర్వాత మళ్లీ ఆమెను తీసుకొని…. ఇది ఇల్లు కాదు స్మశానం . దెయ్యం తిరుగుతున్న స్మశానం. నా కోడలన్ని పొట్టనపెట్టుకున్న స్మశానం అంటూ పెద్ద పెద్దగా అరుస్తూ ఆమె శవాన్ని తీసుకొని స్మశానం లో కి వెళ్లి తానే స్వయంగా పూడ్చి పెడతాడు. ఇంత జరుగుతున్నప్పటికీ అత్త మనసులో కొంచెం కూడా జాలి దయ కానీ ఏమీ లేదు. ఆమె ఏం మాట్లాడకుండా ఆమెకి ఏమీ తెలియదు అన్నట్టుగా ఒక రాతి విగ్రహం లాగా నిలిచి ఉంటుంది కొన్ని సంవత్సరాలు గడిచాయి.
సీత మామయ్య అయిన నాగయ్య ఎండకి అలసిపోయి ఒక ఇంటి దగ్గర కూర్చొని చాలా నీరసంతో…. దాహం తల్లి ఎవరైనా నా దాహం తీర్చే అండి. బాబు ఎవరైనా నా దాహం తీర్చు అండి. మీకు పుణ్యం ఉంటుంది అని అడుగుతూ ఉంటాడు ఇంతలో ఆ ఇంటి లోపల ఉన్న ఆమె బయటకు వస్తుంది ఆమె ఎవరో కాదు సీత కు పుట్టిన బిడ్డని తీసుకొచ్చిన జమిందార్ కుటుంబం. ఆమె అతనితో…. అయ్యో చూస్తే పెద్దవాళ్ళు ఉన్నారు. లోపలికి రండి కాసేపు విశ్రాంతి తీసుకోండి. అంటూ అతన్ని లోపలకి తీసుకొని మంచినీళ్లు ఇచ్చి అతని దాహం తీరుస్తుంది. అతడు అక్కడే కొంచెం సేపు విశ్రాంతి తీసుకుంటాడు కొంత సమయం తర్వాత అతను నిద్ర లేచి ఆమెతో….. అమ్మ నూరేళ్లు చల్లగా ఉండు తల్లి నా ప్రాణాన్ని నిలిపావు. వెళ్లి వస్తాను తల్లి. అంటూ అక్కడినుండి వెళుతుండగా ఆమె…. అయ్యో బయట ఎండ చాలా ఎక్కువగా ఉందండి. మీరు కాస్త ఇక్కడ ఏమన్నా తిని చల్ల పూట బయలుదేరండి.
కాదనకండి అని అంటుంది అందుకు అతను సరే అమ్మా అంటాడు. ఆమె లోపలికి వెళ్లి భోజనం తీసుకొని వచ్చి ఆయనకు వడ్డిస్తోంది అతడు ఆవురావురుమంటూ భోజనం తింటూ ఉంటే ఆమె తన మనసులో… అయ్యో ఈ పెద్దాయన కు ఎవరూ లేరు అనుకుంటా ఎంత ఆకలి మీద ఉన్నా డో అందుకే ఆవురావురుమంటూ తింటున్నాడు పాపం అని అనుకుంటూ ఉంటుంది అతను భోజనం చేసిన తర్వాత ఆమె ….. పెద్దాయన మీది ఏ ఊరు. ఎక్కడి నుంచి వచ్చారు ఎవరైనా బంధువులు ఉన్నారా ఇక్కడ.
ఆయన ఏడుస్తూ…. లేదమ్మా నా కంటూ ఎవరు లేరు ఉన్న ఒక్కగానొక్క కొడుకు చనిపోయాడు. నా భార్య గయ్యాళి తనంతో నా కోడలు చనిపోయింది. నేను ఇంటి నుండి వచ్చేసాను నాకంటూ ఎవరూ లేరు నేను అనాధను. అని చెప్తాడు.
ఆమె అతనిపై జాలిపడి…. అయ్యో ఎవరూ లేరు అంటున్నారు మీకు అభ్యంతరం లేకపోతే మీరు మాతో పాటే ఉండొచ్చు. అందుకు అతను ఆలోచిస్తూ ఉండగా లోపల నుంచి తన కూతురు బయటకు వచ్చి…. అమ్మ నేను కాలేజ్ కి వెళ్లి వస్తాను. అని అంటుంది ఆమెని చూసిన నాగయ్య… అమ్మ సీత అమ్మ సీత నువ్వు ఇంకా బతికే ఉన్నావా తల్లి. నేను నమ్మలేకపోతున్నాను ఇదంతా కల లాగా ఉంది.
అందుకు ఆమె తల్లి….. ఏమండీ ఏం మాట్లాడుతున్నారు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నారు ఆమె నా కూతురు శ్రీలత.
శ్రీలత…. ఎవరమ్మా ఈయన నన్ను పట్టుకుని సీత అంటున్నాడు.
ఆమె…. మనకు తెలిసిన అతని లే.
నాగయ్య… నన్ను క్షమించు తల్లి అచ్చం నువ్వు చనిపోయిన నా కోడలు సీత లాగే ఉన్నావు అందుకొని అలా అన్నాను తప్పుగా అనుకో కమ్మ.
శ్రీలత… మరి ఏం పర్వాలేదు తాతయ్య సరే అమ్మ ఇంక నేను వెళ్లి వస్తాను అని చెప్పి శ్రీలత అక్కడి నుంచి వెళ్లి పోతుంది.
నాగయ్య… మనుషులు పోలిన మనుషులు ఏడుగురు ఉంటారనేది. నిజమే అనుకుంటా. కానీ అమ్మాయి తాతయ్యా అని పిలుస్తుంటే నా మనవరాలిని ఉండి ఉంటే ఇలాగే పిలుస్తాదైమో అని అనిపిస్తుంది.
ఇంతలో ఆమె…. ఏమైందండీ ఏంటి ఆలోచిస్తున్నారు.
నాగయ్య…. ఏం లేదమ్మా. నా వల్ల మీకు శ్రమ ఎందుకు నేను వెళ్తాను.
ఆమె…. దయచేసి నా మాట వినండి. మాకు కూడా పెద్ద దిక్కు అంటూ ఎవరూ లేరు. మీరు మాకు తోడుగా ఉండి ఉంటే మాకు చేదోడుగా ఉంటుంది. కాదనకండి అంటూ అడుగుతుంది ఆమె పదేపదే అడగడంతో అతను సరే అని చెప్పి అక్కడే ఉండిపోతాడు. సాయంత్రం ఎలా అవుతుంది. కాలేజీ కి వెళ్ళిన శ్రీలత తిరిగి ఇంటికి వస్తుంది ఆ రోజు వాళ్ళ ముగ్గురు భోజనం చేసి అలా తీరిగ్గా కూర్చుంటారు అప్పుడు నాగయ్య…. ఏమ్మా మీ భర్త వచ్చినప్పుడు నుంచి కనబడలేదు ఎక్కడికి వెళ్ళాడు.అని ఆమె అడగ్గా ఆమె సమాధానం చెప్పబోతుoడగ గా ఇంతలో
శ్రీలత…. అయ్యో తాతయ్య మా నాన్నకి ఎప్పుడు పని పని ఎప్పుడు వెళ్తారో తెలియదు ఎప్పుడు వస్తారో కూడా తెలియదు. మా నాన్న ఒక్క రోజు ఇంట్లో ఉన్నాడు అంటే ఆ రోజు సూర్యుడు పడమట ఉదయించిన టే. అని చెప్తుంది అలా వాళ్ళు అందరూ సరదాగా కాసేపు మాట్లాడుకొని.
అందరూ విశ్రాంతి తీసుకుంటారు మరుసటి రోజు ఉదయమే నాగయ్య లేచి తోట పని చేస్తూ ఉండగా. అప్పుడే కార్ లో శ్రీలత నాన్నగారు అయినా అశోక్ వస్తారు. అశోక్ కారు నుంచి దిగి ఇంట్లోకి వెళుతుండగా నాగయ్య చూస్తాడు నాగయ్య… నమస్కారం బాబు అంటూ నమస్కారం చేస్తాడు. అశోక్ కూడా నమస్కారం చేస్తూ ఇంట్లో పనికి వెళ్తాడు అప్పుడే ఆమె భార్య అతనికి ఎదురు వస్తుంది. ఆమె అతన్ని చూసి… రండి రండి ఇదేనా రావడం అంతా కులాసా అనే కదా ప్రయాణం బాగా జరిగింది కదా.
అశోక్…. బానే జరిగింది కానీ ఇంతకీ నా కూతురు ఎక్కడ.
ఆమె…. ఈరోజు కాలేజీ కి సెలవు అట ఇంకా నిద్ర కూడా లేవలేదు.
అశోక్… నా బంగారు తల్లి చదివి చదివి అలిసిపోయి ఉంటది లే పడుకో నీవ్వు. అది సరే కానీ బయట తోట పని చేస్తున్న వ్యక్తి ఎవరు.
ఆమె జరిగిన విషయమంతా చెబుతుంది.
అశోక్…. సర్లే ఎవరు లేరు అంటున్నావు గా మనతో పాటే ఒక ముద్ద తింటాడు.
ఆమె… ఏమండీ అది సరే కానీ అన్నట్టు అసలు విషయం చెప్పడం మర్చిపోయాను.
అశోక్ చాలా ఆసక్తిగా ఆశ్చర్యంగా…. ఏంటది భవాని త్వరగా చెప్పు.
భవాని…. ఏం లేదండి నిన్న అతను మన అమ్మాయిని చూసి సీత నువ్వు బ్రతికే ఉన్నావా అంటూ ఏదో మాట్లాడాడు.
ఆ మాటలు విన్న నాకు చాలా భయం వేసిందoడి.
అశోక్… ఎందుకు భయం. మనం శ్రీలత కన్న తల్లిదండ్రులను కాదని నీకు నాకు తప్ప ఎవరికి తెలియదు.
ఆమె… అవునండి అది నిజమే కానీ. ఆ వచ్చిన అతను బంధువులో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉండొచ్చు. మన అమ్మాయిని ఎక్కడ మన నుంచి దూరం చేస్తాడు అని భయం వేసింది. కానీ అతను మాటలను విని తర్వాత కొంచెం కుదుట పడ్డాను లెండి. అందుకు తను సరే సరేలే అలాంటివి మనసులో ఏం పెట్టుకోకు. అని అంటాడు. దానంత చాటుగా నాగయ్య వింటాడు. అప్పుడు అతను చాలా సంతోష పడుతూ తన మనసులో… దేవుడున్నాడు సీత నుంచి దూరం చేసిన నా మనవరాలిని పెద్ద జమీందారీ కుటుంబంలో పెంచుతున్నాడు. ఇప్పుడే ఆ అమ్మాయి నా మనవరాలు అని చెప్పేసాను.అని అనుకొని లోపలికి వెళ్తుండగా మళ్లీ అతను ఒక్కసారిగా నిలబడి …. వద్దు వద్దు నేను అలా చేయను అలా చేస్తే నా మనవరాలు కి వాళ్ళ సొంత తల్లి దండ్రుల కాదని తెలిసిపోతోంది. ఇన్ని సంవత్సరాలు వాళ్లు ఎంతో జాగ్రత్తగా నా మనవరాలు పెంచారు. నేను నిజం అని చెప్పి దానిని అంతా నాశనం చేయలేను. అనిఅనుకుని చాలా బాధపడుతూ ఉంటాడు మళ్ళీ కొంత సమయానికి నేనెందుకిలా బాధ పడడం నా మనవరాల్ని హాయిగా ఇక్కడే చూసుకోవచ్చు కదా అని ఆ నిజాన్ని ఎవరికీ చెప్పకుండా తనలోదాచుకున్నాడు. అలా రోజులు నడుస్తున్నవి నాగయ్య పూర్తిగా ఆ ఇంట్లో మనిషి గా మారిపోయాడు అందరికీ తలలో నాలుక అయిపోయాడు. శ్రీలత అయితే అతన్ని తాతయ్య తాతయ్య అంటూ చాలా బాగా అతనితో కలిసి పోతుంది నాగయ్య ఆమె ప్రతిసారి తాతయ్య అని పిలుస్తూ ఉండడం విని ఎంతగానో మురిసి పోతూ …. భగవంతుడా నేనే నిజంగానే మీ తాతయ్యా అని చెప్పాలని ఉంది కానీ చెప్పలేను ఏదేమైనా ఇన్ని సంవత్సరాల తర్వాత నా మనవరాలిని నాకు దగ్గర చేశావు. నీకు చాలా కృతజ్ఞతలు. చెప్పు కాక పోయినా నా మనవరాలు సంతోషమే నాకు చాలా ముఖ్యం.నా మనవరాలు కి మంచి భర్త వచ్చి ఆమెకు ఎలాంటి కష్టం లేకుండా చూసుకునే అత్తమామలు రావాలి తన తల్లి పడిన కష్టం ఎవ్వరు పడకూడదు నా మనవరాలు అసలు పడకూడదు. ఈ మనవి ఆలకించి తండ్రి. కన్నుమూసి లోపు ఆ ముచ్చట కూడా తీర్చు అని ఆ దేవుని ప్రార్థిస్తూ ఉంటాడు. నాగయ్య ఆ దేవుని ఎలా ప్రార్థిస్తున్నాడు ఆమెకు ఎలాంటి భర్త రాబోతున్నాడో. తన తల్లి కి జరిగిన అన్యాయం ఎవరికి జరగకూడదని ఆమె తాతయ్య కోరుకున్నట్టుగా జరుగుతుందో లేదో ఆమె జీవితం ఎలా గా మారబోతుంది. ఎలా ఉంటుందో ఏమో అంతా పైవాడి దయ. మనం కూడా శ్రీలత విషయం లో మంచి జరగాలని కోరుకుందాం. అసలు ఏం జరగబోతుందో అనేది కూడా తరువాయి భాగంలో తెలుసుకుందాం.ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *