గర్భవతి తల్లి బాధ 3_ Telugu Stories- Stories in Telugu – Panchatantra Kathalu

గర్భవతి తల్లి బాధ రెండవ భాగంలో నాగయ్యకు శ్రీలత తన మనవరాలి తెలిసిపోతుంది. కానీ ఆ నిజాన్ని అతను తనలోనే దాచుకొని ఆమె మంచి కోరుకుంటాడు. అలా రోజులు గడిచాయి ఒకరోజు నాగయ్య తోట పని చేస్తూ ఉండగా. ఎవరో కొంతమంది వ్యక్తులు ఒక ఆమెని తరుముకుంటూ …. దొంగది పట్టుకొని దాన్ని పట్టుకొని దాన్ని . పట్టుకుని దాన్ని అంటూ కేకలు వేస్తూ కర్రలతో ఆమె వెంట పడతారు. ఆమె ….. నన్నేం చెయ్యొద్దు నాకు ఆకలిగా ఉంది అని దొంగతనం చేశాను. నన్ను వదిలేయండి అంటూ కేకలు వేస్తూ వస్తుంది. ఆమె అవతారం చూడడానికి పిచ్చిదాని లాగా ఉంటుంది. ఆ గొడవని గమనించిన నాగయ్య ఆమెను చూసి… సరోజ లాగా ఉంది. అంటూ ఆమె దగ్గరికి వెళ్లి ఆమెనీ పట్టుకుంటాడు saroja…. వదిలేయండి నన్ను ఏం చెయ్యొద్దు. నన్ను కొట్టొద్దు నన్ను కొట్టొద్దు దయచేసి నన్ను కొట్టొద్దు కావాలంటే ఇది మీరే తీసుకోండి అంటూ తన చేతిలో ఉన్నా బ్రెడ్ ప్యాకెట్ ని విసిరి కొడుతుంది . ఇంతలో వాళ్ళు అక్కడికి వచ్చి…. మంచి పని చేశారు దీని పట్టుకొని.ఇది దొంగతనం చేసి పారిపోతుంది అంటూ కొట్టడానికి ప్రయత్నిస్తుండగా అతను అడ్డుకొని…. బాబు వదిలేయండి. పిచ్చా ఆమె ఏదో తెలియక చేసింది . అంటూ ఆ బెడ్ ప్యాకెట్ వాళ్ళకి ఇచ్చి నచ్చ చెప్పి అక్కడి నుంచి వారిని పంపించి చేస్తాడు. అతడు ఆమెను చూస్తూ ఏడుస్తూ…. సరోజ నేను సరోజ నీ భర్తని గుర్తుకొచ్చానా. నిన్ను ఈ పరిస్థితిలో చూస్తానని అనుకోలేదు. సరోజ నన్ను గుర్తుపట్టావా నేను నీ భర్తని అంటూ ఏడుస్తూ ఉంటాడు ఆమె భయం భయం గా అతని వైపు చూస్తూ….. నన్ను కొట్టొద్దు నన్నేం చెయ్యొద్దు అంటూ ఏడుస్తుంది. అలా ఇద్దరు ఏడుస్తూ ఉండగా శ్రీలత అక్కడికి వస్తుంది. శ్రీలత వాళ్లను చూసి…. తాతయ్య ఈమె ఎవరు ఎందుకు మీరు ఏడుస్తున్నారు ఏం జరిగింది. అని అడుగుతుంది అందుకు అతను…. ఈమె నా భార్య అమ్మ . ఇంట్లో చిన్నచిన్న గొడవల వలన నేను ఇంట్లో నుంచి బయటకు వచ్చాను. మళ్లీ ఈ జన్మలో దీని మొఖం చూడకూడదు అనుకున్నాను కానీ ఆ భగవంతుడు దీన్ని ఇలా కలుసుకునే ఎలా చేశాడు. అంటూ బోర్న్ఏడుస్తాడు. అందుకు శ్రీలత… అయ్యో తాతయ్య బాధపడకండి ఆమె ముందు లోపలికి తీసుకు రండి. అని అంటుంది. అందుకు తను సరే అని చెప్పి ఆమెను లోపలికి తీసుకు వెళుతూ ఉండగా ఆమె శ్రీలత వైపు అలా చూస్తూ ఉండగా ఆమెకు ఏదో గుర్తుకు వస్తున్నట్లుగా అనిపిస్తు ఆమెను గట్టిగా పట్టుకొని….. అమ్మ సీత నన్ను క్షమించు. నేను నిన్ను కొట్టాను చిత్రహింసలు పెట్టాను. అంటూ పెద్ద పెద్దగా ఏడుస్తూ ఉంటుంది శ్రీలతకు ఏమీ అర్థం కాదు.

ఆమెకు మళ్లీ మతిస్థిమితం రావడం చూసిన నాగయ్య….. సరోజ ఇటు చూడు నా వైపు చూడు సరోజా. నీకు మళ్ళీ గతమంతా గుర్తుకు వచ్చింది. ఇటు చూడు నేను నీ భర్తని.
అంటూ ఆమె చెబుతూ ఉంటాడు ఆమె మాత్రం అతని గుర్తు పట్టదు. శ్రీలత … సరే నేను మీ సీతనే ముందు లోపలికి వెళ్దాం పద అంటూ ఆమె లోపలి తీసుకెళుతుంది. అక్కడ తన తల్లిదండ్రులకి జరిగిన విషయమంతా చెప్తుంది. దాన్ని విన్న వాళ్లు నాగయ్యతో…. మరేం పర్వాలేదు నాగయ్య మీ భార్య నీ మంచి ఆసుపత్రిలో మేం చూపిస్తాము నువ్వు దిగులు పడకు అని అంటారు. శ్రీ లతా కు మంచి వస్త్రాలు ధరింపచేసి శుభ్రపరుస్తుంది.
ఆ రోజు రాత్రి అందరూ భోజనం చేసి నిద్రిస్తూ ఉంటారు శ్రీలత మాత్రం నిద్ర నుంచి లేచి అటూ ఇటూ తిరుగుతూ…. మొదట నాగయ్య తాత నన్ను చూసినప్పుడు సీత అని అన్నాడు. ఇప్పుడు ఈ మతిస్థిమితం లేని ఆమె కూడా తన భర్త ని గుర్తు పట్టకుండా నన్ను చూసి సీత అంటుంది. అసలు ఆ సీత కి నాకు ఉన్న సంబంధం ఏంటి. నిజమేంటో నేను తెలుసుకోవాలి. అని అనుకుంటుంది ఆ మరుసటి రోజు ఉదయాన్నే అశోక్ నాగయ్యతో…. నాగయ్య ఈరోజు నా స్నేహితురాలు ఫారం నుంచి ఆమె పెద్ద గొప్ప డాక్టర్ . ఇక ఆమె ఇక్కడే ఉంటుందట ఈరోజే నేను భవాని ఇద్దరం కలిసి నీ భార్యను హాస్పటల్ తీసుకు వెళ్లి చూపిస్తాము. ఇల్లు జాగ్రత్త శ్రీలత ఇంకా నిద్ర లేవ లేదు లేస్తే ఆసుపత్రికి వెళ్లానని చెప్పు అని చెప్పి అందరూ కలిసి కారులో వెళ్ళిపోతారు.
అతను తోట పని చేస్తూ ఉండగా శ్రీలత బయటకు వచ్చి…. నాగయ్య తాత అమ్మ నాన్న ఎక్కడికి వెళ్లారు. ఇంట్లో ఎవరూ కనిపించడం లేదు ఏంటి.
నాగయ్య….నా భార్యను తీసుకొని హాస్పిటల్ కి వెళ్ళారా అమ్మ ఇప్పుడే వస్తామని చెప్పమన్నారు . అందుకామె సరే అంటూ అతని దగ్గరకు వచ్చి… నాగయ్య తాత నేను ఒక విషయం గురించి అడుగుతాను నువ్వు నిజం చెప్పాలి.
నాగయ్య…. ఏంటో అడుగు తల్లి చెప్తాను.
శ్రీలత….. సీతా మీ కోడలు అన్నారు కదా ఆమె చనిపోయింది అన్నారు అసలు ఎందుకు చనిపోయింది ఎలా చనిపోయింది మీ భార్యను కూడా చూసి సీత అని అంది మతిస్థిమితం లేని ఆమె సీత అని నన్ను పిలిచింది అంటే దానికి బలమైన కారణం ఉండే ఉంటుంది. ఆ నిజం ఏంటో మీరు చెప్పాలి. అందుకు అతను శ్రీలతకు ఏం చెప్పాలో అర్థం కాదు. అతను అటూ ఇటూ దిక్కులు చూస్తూ ఉంటాడు. అప్పుడు శ్రీలత…
తాత నువ్వు ఎందుకలా కంగారు పడుతున్నావా నాకు అర్థం కావడం లేదు అసలు నిజం ఏంటో చెప్పండి నాకు నిజం తెలుసుకోవాలని ఉంది. మీరు చెప్పకపోతే నా మీద ఒట్టే. అని ఉంటుంది అందుకు అతను పెద్దగా ఏడుస్తూ జరిగిన విషయమంతా చెప్పేస్తాడు దాన్ని విన్న శ్రీలత…. తాత నువ్వు చెప్పింది అంతా నిజమా నేను నమ్మలేకపోతున్నాను.
అందుకు అక్షరాల నిజం తల్లి అని అంటాడు అప్పుడు ఆమె. తాత అంటూ అతన్ని కౌగిలించుకొని ఏడుస్తూ ఉంటుంది.
అందుకు నాగయ్యను ఆమెని ఓదారుస్తూ….
అసలు ఈ నిజం నీకు తెలియకూడదు అనుకున్నాను కానీ తెలియచెప్పిలా చేశావు.
శ్రీలత…. నిజం నిప్పులాంటిది తాతయ్య ఇప్పుడు కన్నా బయట పడుతుంది మీరు నిజం చెప్పి మంచి పని చేశారు. ఇంతలో శ్రీలతకు ఫోన్ వస్తుంది ఆమె ఇంట్లోకి వెళ్లి ఫోన్ తీసుకొని…. హలో నాన్న చెప్పండి.
అశోక్…. అమ్మ శ్రీలత వెంటనే నువ్వు నాగయ్యను వెంటపెట్టుకుని హాస్పిటల్ దగ్గరికి రా. అందుకు ఆమె…. సరే నాన్న ఇప్పుడే వస్తాను. అని చెప్పి నాగయ్యతో… తాత నాన్న ఎందుకో మనిద్దరి హాస్పిటల్ దగ్గరికి రమ్మని చెప్తున్నాడు. ఒకసారి వెళదాం పద అని చెబుతుంది అతను…. సరే అమ్మ వెళ్దాం కానీ నేను చెప్పిన నిజం మీ అమ్మ నాన్నకు మాత్రం తెలియని ఇవ్వకు వాళ్ళు ఆ నిజం నీకు తెలియకూడదు అని నిన్ను కన్న కూతురు లాగా పెంచుకుంటున్నారు. వాళ్లకా తృప్తినివ్వ. అందుకు శ్రీలత….. సరే తాత నేను ఎప్పటికీ చెప్పను. ముందు అక్కడికి వెళ్దాం పదా అంటూ ఇద్దరు కలిసి నడుచుకుంటూ హాస్పిటల్కి బయలుదేరుతారు ఇదిలా ఉండగా. అక్కడ హాస్పిటల్లో saroja…. నన్ను వదిలెయ్యండి నన్ను సీత దగ్గరకు పంపించండి దయచేసి నన్ను వదలండి. నేను సీతకు అన్యాయం చేశాను.
అంటూ పిచ్చి పిచ్చిగా కేకలు వేస్తూ ఉంటుంది.
డాక్టర్ రమణి ఆమెతో… సీత వస్తుంది అని ఆమెకు సర్దిచెప్పి మత్తు ఇంజక్షన్ ఇస్తుంది ఆమెఆ మత్తు కి నిద్రపోతుంది ఇంతలో వాళ్ళిద్దరూ అక్కడికి చేరుకుంటారు డాక్టర్ వాళ్లని చూసి నాగయ్యతో…. చూడండి మీ భార్య శ్రీలత ను చూసి సీత సీత అంటుంది సీత మీ కోడలనీ అశోక్ వాళ్ళు నాకు చెప్పారు. అసలు ఆమె ఎందుకు చనిపోయింది. అందుకు నాకు ఏం చెప్పాలో అర్థంకాక సతమతమవుతున్న ఉంటాడు తనలో…. ఓరి భగవంతుడా ఎలాంటి కష్టం తీసుకువచ్చి పెట్టావు. నా నోట మనవరాలికి నిజం చెప్పావు ఇప్పుడు వీళ్లకు కూడా. నిజం నా నోటే చెప్పించడానికి చూస్తున్నావ్ నేనేం చేయాలి. భగవంతుడా అనుకుంటూ ఉంటాడు డాక్టర్….. ఏంటి ఏం మాట్లాడటం లేదు మీ భార్య మీకు దక్కాలి అంటే ఆ మళ్లీ మామూలు స్థితికి రావాలి అంటే ఏంటో మీరు చెప్పండి ఎందుకు సందేహిస్తున్నారు ఉన్నది ఉన్నట్టు నిజం చెప్పండి.
ఆమె పదేపదే అతన్ని బలవంతపెట్టడంతో నాగయ్య నిజం చెప్ప కుండా ఉండలేక పోతున్నాడు. అసలు ఏం జరిగిందో మొత్తం డాక్టర్కి వివరిస్తాడు. దాన్ని విన్న అశోక్ భవాని నువ్వు చాలా ఆశ్చర్యపోతారు. భవాని అయితే చాలా ఏడుస్తూ… నా బిడ్డకి ఏ నిజమైతే తెలియకూడదనుకున్నానో ఆ నిజం అంతా తెలిసిపోయింది. అంటూ బోర్న్ ఏడుస్తుంది.
నాగయ్య… నన్ను క్షమించమ్మా నిజం చెప్ప కుండా ఉండలేక పోయాను.
అశోక్…. మరి ఏం పర్వాలేదు నాకు భగవంతుడు ఎలా ఆడిస్తే మనం అలాగే ఆడాలి. పోనీలే మీ మనవరాలు మీ దగ్గరికి చేరుకుంది. అంటూ ఉండగా సరోజ సృహా నుంచి మేల్కొని…. పెద్ద పెద్దగా అమ్మ సీత ఎక్కడున్నావమ్మా. నన్ను క్షమించమ్మా నన్ను చంపేయి తల్లి. అంటూ పెద్ద పెద్ద ఏడుస్తుంది ఇంతలో. ఆమె అరుపులు విన్న వాళ్ళంతా ఆమె వైపు చూస్తూ ఉంటారు. డాక్టర్ శ్రీలత తో… ఇప్పుడు అందరి కంటే నువ్వే ఆమె వ్యాధిని నయం చేయ గలరు ఇప్పుడు నువ్వు శ్రీలత వి కాదు నీ తల్లి సీత లాగా ఆ ముందు నటించు. అని ఆమె దగ్గరికి పంపిస్తుంది శ్రీలత ని చూసిన ఆమె…. వచ్చావా అమ్మ సీత నన్ను నన్ను క్షమించు తల్లి అంటూ ఏడుస్తుంది. అప్పుడు శ్రీలత…. నాయనమ్మ నేను మీ మనవరాలు శ్రీ లత ని సీతనీ కాదు.
మా అమ్మ ఎప్పుడు చనిపోయింది నీకు గుర్తు లేదా. అంటూ ఆమెకి పదేపదే ఆ విషయం గురించి చెప్తుంది.
ఆ విషయం వెంటనే ఆమెకు గతమంతా ఒక్కసారి గా గుర్తొస్తుంది. ఆమె.. అవును సీత నా వల్ల చనిపోయింది. నువ్వెవరమ్మా అచ్చం సీత లాగే ఉన్నావు నా మనవరాలు అని చెప్తున్నావు ఇదంతా నిజమేనా. శ్రీలత …. అవును నిజమే నాయనమ్మ నేను నిజంగా నీ మనవరాలిని. అప్పుడు ఆమె ఏడుస్తూ శ్రీలత ను గట్టిగా పట్టుకొని…. అమ్మ నన్ను క్షమించు నువ్వు కడుపులో ఉన్నప్పుడు మీ అమ్మని ఎన్నో చిత్రహింసలు పెట్టాను. అలాంటిది అత్త ఎవరికీ ఉండకూడదు. నేను ఎంత పాపిష్టి దాన్ని నో. అందుకే దేవుడు నాకు మతి స్థిమితం లేకుండా చేసి ఎన్ని రోజులు రోడ్లపై అడుక్కునై లా చేశాడు. నీవు మీ అమ్మ పట్ల చేసిన తప్పుకి నన్ను క్షమించమ్మా అంటూ బోరున ఏడుస్తుంది.
శ్రీలత… ఊరుకో నాయనమ్మ ఊరుకో అని అది చెప్తుంది ఇంతలో నాగయ్య కూడా అక్కడికి వెళ్తాడు అతన్ని చూసిన ఆమె చాలా సంతోషపడుతూ…. ఏవండీ నన్ను క్షమించండి నేను మిమ్మల్ని అనరాని మాటలు అన్నాను. నన్ను క్షమించండి అంటూ బాధపడుతున్న అందుకు నాగయ్య కూడా బాధపడుతూ…. ఊరుకో సరోజా పడుకో అంటూ వదిలేస్తాడు అలా మన ముగ్గురు ఏడుస్తూ బాధ పడుతూ ఉండగా అశోక్ భవానీలు …. ఇంకా శ్రీలతకు మన అవసరం లేదు. వాళ్ల నాయనమ్మ తాతలు బాగా చూసుకుంటారు. అని ఎంతో బాధపడుతూ అక్కడినుంచి వెళ్ళిపోతుండగా. నాగయ్య వాళ్లను చూసి….బాబు గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు మీ కూతుర్ని వదిలేసి వెళ్లిపోతారు.
శ్రీలత….. ఏంటి నాన్నా నన్ను వదిలేసి వెళ్ళిపోతరా.
నాగయ్య…. బాబు నిజానికి మా మనవరాలు అయినా ఎన్ని సంవత్సరాలు కంటికి రెప్పలాగా కన్న బిడ్డ లాగా పెంచుకున్నారు.
ఇప్పుడు మిమ్మల్ని విడగొట్టడానికి నాకు అర్హత లేదు మీ బిడ్డను మీరు తీసుకెళ్లండి.
అంటూ ఆమెని వాళ్ళక్క అప్పు చెప్తాడు.
అందుకు భవాని….. నీ మంచి మనసుకి చాలా కృతజ్ఞతలు. అసలు మేము వెళ్లడం కాదు అందరం కలిసి కుటుంబం లాగా ఉండిపోదాం అప్పుడు మాకు కూడా సంతోషంగా ఉంటుంది మీకు సంతోషంగా ఉంటుంది కాదనకండి.అంటూ ప్రాధేయ పడుతోంది అందుకు వాళ్లు సరే అని అంటారు. ఇక అందరూ కలిసి ఆ డాక్టర్కి కృతజ్ఞతలు చెప్పుకొని అక్కడినుంచి ఇంటికి వెళ్తారు. ఇక ఆరోజు నుంచి అందరూ ఒక కుటుంబం లాగా కలిసిపోయి సంతోషంగా జీవిస్తారు. ఈ కథ గనుక మీకు నచ్చినట్లైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *