గర్భవతి తల్లి బాధ 4_ Telugu Stories- Stories in Telugu – Panchatantra Kathalu

గర్భవతి తల్లి బాధ మూడో భాగం లో. శ్రీలత వాళ్ళ నాయనమ్మ తాతలతో అలాగే పెంచిన తల్లిదండ్రులతో కలిసి హాయిగా జీవిస్తూ ఉంటుంది. అలా రోజులు గడిచాయి. ఒకరోజు శ్రీలత తండ్రి చాలా సంతోషంగా ఇంటికి వచ్చి…..అందరూ ఎక్కడున్నారు ఒకసారి నా దగ్గరకు రండి అని పెద్దగా పిలుస్తూ ఉంటాడు . అందరూ అక్కడకు వస్తారు. భార్య…. ఏమైంది అండి అంత సంతోషంగా ఉన్నారు. అతను…. ఎందుకు ఇంత సంతోషం అంటే నా బంగారు తల్లి కి ఒక మంచి సంబంధం తీసుకొచ్చాను అబ్బాయి ఆస్తిపరుడు. చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోయినా ఎంతో కష్టపడి పైకి వచ్చాడు. అమ్మాయికి ఈడు జోడు. అంటూ ఒక ఫోటో నీ చూపిస్తాడు.అబ్బాయి ఫోటో చూసి అందరూ చాలా బాగున్నాడు అబ్బాయి అని మెచ్చుకుంటారు. అందరికీ అబ్బాయి చాలా బాగా నచ్చాడు ఇంతలో శ్రీలతా…. నాన్న అప్పుడే నాకు పెళ్లా.

తండ్రి…. అబ్బాయి చూసిన తర్వాత నువ్వు కూడా కాదు అని చెప్పావు అని ఫోటోనీ చూపిస్తాడు. ఫోటోలు చూసిన శ్రీలత కూడా సిగ్గుపడుతూ లోపలికి వెళ్లి పోతుంది.
అందరూ నవ్వుకుంటూ…… అమ్మాయికి కూడా ఇష్టం ఇంకా త్వరలోనే ముహూర్తాలు పెట్టి చేద్దాం అని అనుకుంటారు. అనుకున్న విధంగానే ఇద్దరికీ పెళ్ళి జరిగిపోతుంది. అప్పగింతలప్పుడు తల్లిదండ్రులు ఆ అబ్బాయితో…. చూడు బాబు అల్లారుముద్దుగా పెంచుకున్నాము. నువ్వే మా అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోవాలి.
నవీన్ (పెళ్ళికొడుకు)…… మీరెవరు బాధపడకండి నేను మీ అమ్మాయిని చాలా జాగ్రత్తగా చూసుకుంటాను.
తాతా నాయనమ్మ…….. బాబు ఇకనుంచి నువ్వే అన్ని అవ్వాలి . తెలిసీ తెలియక ఏమైనా పొరపాటు చేస్తే ఏమీ అనుకోకు. మా బంగారాన్ని నీ చేతిలో పెడుతున్నాం అంటూ కంటతడి పెట్టుకుంటారు. అలా అందరూ ఏడుస్తుండగా శ్రీలత కూడా ఏడుస్తూ అందరినీ కౌగిలించుకొని …. అమ్మ నాన్న మీరు బాధపడకండి నేను వెళ్ళొస్తాను తాతయ్య నాయనమ్మల బాగా చూసుకోండి అని ఎంతో బాధతో అక్కడి నుంచి వెళ్లి పోతుంది. కొత్త ఇల్లు కొత్త కాపురం శ్రీలతకు అంతా కొత్తగా ఉంటుంది. నవీన్ శ్రీలత ని చాలా బాగా చూసుకుంటూ ఉంటాడు అలా రోజులు గడిచాయి ఒకరోజు నవీన్ చాలా బాధపడుతూ ఇంటికి వస్తాడు. శ్రీలత….. ఏమైంది అండి అలా ఉన్నారు. ఏం జరిగింది.
నవీన్ చాలా కోపంగా ….. శ్రీలత కొంచెంసేపు మాట్లాడకు . నేను చాలా కోపంగా ఉన్నాను.
శ్రీలత….అయ్యగారి కోపానికి కారణం ఏంటో తెలుసుకుందాం అనే కదా ఇక్కడికి వచ్చాను.
నవీన్ చాలా కోపంగా …… చెప్తుంది నీకు కాదా నిన్ను ఏమంట పెళ్లి చేసుకున్నాను కానీ. ఆ రోజు నుంచి నాకు మనశ్శాంతి లేదు నీ వల్ల కోట్ల నష్టం . నువ్వు ఎంత నష్ట జాతకురాలు అంటే నా లైఫ్ లోకి అడుగు పెట్టానో లేదో నా డబ్బంతా నాశనమైపోయింది నా బిజినెస్ అంతా లాస్ అయ్యాను అంటూ ఆమెను చితకబాదాడు. పాపం శ్రీలత ఏడుస్తూ అలా ఉండి పోతుంది తర్వాత నవీన్ అక్కడనుంచి వెళ్ళి పోతాడు. శ్రీలత ఇంట్లో కూర్చుని ఏడుస్తూ…. నేనేం చేశాను బిజినెస్ లాస్ అవ్వడానికి కారణం నేనేనా. నేనెలా అవుతాను.భగవంతుడా మమ్మల్ని నువ్వే మా కష్టాలనుంచి గట్టెక్కించసిది . అంటూ దేవుని ప్రార్థిస్తున్నా అలా రోజులు గడిచాయి. ఆమె గర్భవతి అయింది ఆ విషయం తన భర్తకు చెప్పాలని ఎంతో ఆశగా అతని దగ్గరికి వెళుతుంది. ఆ విషయం అతనికి చెప్పబోయే లోపే నవీన్ చాలా కోపంగా ఇంట్లో నుంచి బయటికి వెళ్తాడు. అతను ఆ రోజు సాయంత్రం తిరిగి వచ్చినప్పుడు ఆ విషయాన్ని చెబుతుంది. అతను మద్యం సేవించడంతో …… ఏంటమ్మా ఒక నష్ట జాతకఉరాలితో వేగలేక పోతున్నాను.
నువ్వు మళ్ళీ ఇంకొక దాన్ని తీసుకొచ్చి పెడుతున్నావా. అంటూ ఆమె మళ్ళీ కొడతాడు అలా ప్రతిరోజూ ఆమెకి దిన దిన గండం లా గడిచిపోతూ ఉంటుంది కొన్ని సమయాల్లో ఇద్దరిమధ్య పెద్ద పెద్ద గొడవలు అవుతూనే ఉంటాయి తన భర్త నవీన్….. మర్యాదగా నీ కడుపులో ఉన్న బిడ్డ ను తొలగించ్యియి. ఇప్పుడు మనం ఉన్న పరిస్థితికి పిల్లలు ఎవరూ వద్దు. అంటూ ఎంతో కోపంగా ఆ పై విరుచుకు పడతాడు . శ్రీలత ఉండబట్టలేక…. చావనైనా చస్తాను కానీ బిడ్డను మాత్రం నా చేతులతో చంపలేని చంపను కూడా. అయితే నిన్ను చంపేస్తాను.
శ్రీలత….. చంపేయండి అందుకే కదా నన్ను పెళ్లి చేసుకుంది మీరు. మా అమ్మ నన్ను నన్ను ఎంతో అల్లారుముద్దుగా పెంచా రు. నేను ఇక్కడ నరకం అనుభవిస్తున్న సంగతి తెలిస్తే వాళ్లు కుమిలిపోతారు అందుకే నీ గురించి ఎప్పుడూ వాళ్ళు ఫోన్ చేసినా మంచిగానే చెప్పకు వచ్చాను. మీకు కట్న కానుకలు ఇచ్చి పెళ్లి చేసింది నన్ను చంపడానిక అంటూ బోరున ఏడుస్తుంది. నవీన్ అక్కడ్నుంచి కోపంగా ఇంట్లో కి వెళ్తాడు. అలా రోజులు గడిచే కొద్దీ వాళ్ల పరిస్థితి చాలా మారిపోతుంది ఉన్న కారు బంగ్లా అన్ని అమ్ముకోవాల్సి వస్తుంది. ఇప్పుడు వాళ్ళు ఒక చిన్న ఇంటిలో నివసిస్తున్నారు. శ్రీలతకు నవీన్ కు మధ్య మాటలు కూడా ఉండవు. ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం మానేస్తారు. ఒక ఇంట్లోనే బద్ద శత్రువుల్లా ఉంటారు. అలా వుండగా ఒక రోజు రాత్రి సమయం శ్రీలత ప్రసవ వేదనతో ఒక ఆడ బిడ్డను కంటుంది.
దాన్ని తెలుసుకున్న అతను చాలా కోపంగా శ్రీలత తో…. ఇప్పుడు నీకు తృప్తి గా ఉందా ఆడపిల్ల పుట్టింది.ఇప్పుడు మనo ఉన్న పరిస్థితి కి. పిల్లల్ని పెంచడం కుదరదు.
ఇప్పుడే నిన్ను ఏదో ఒక చెత్త బుట్టలో దీన్ని పడేసి వస్తాను.
శ్రీలత ఏడుస్తూ….. ఎందుకండీ అలా మాట్లాడతాడు ఆడపిల్ల ఇంటికి లక్ష్మీదేవి. మనకి మంచి రోజులు వస్తాయి నన్ను నమ్మండి.
నవీన్…. వచ్చిన మంచి చాలు నువ్వు ఏం చెప్పినా సరే ఈ బిడ్డ నాకు వద్దు అని చెప్పి ఆ బిడ్డను తీసుకొని బయటికి వెళ్లబోతుండగా.
శ్రీలత ఎంత వద్దు అని ఆపినా అతను ఆమె మాటలు పట్టించుకోకుండా ఆ బిడ్డ ని తీసుకొని వెళ్ళిపోతాడు. శ్రీలత ఏడుస్తూ… అయ్యో భగవంతుడా ఇది చూడ్డానికి నా ఇంకా నేను బ్రతికి ఉంది. నవమాసాలు మోసి బిడ్డను కనేందుకు నా బిడ్డ నీ రోడ్డుపై అనాధను చేస్తున్నాడు. అయ్యో అంటూ ఏడుస్తూ ఉంటుంది.
అతను ఆ బిడ్డను తీసుకుని ఒక చెత్తకుండీలో ఉంచి…. నీకు భూమ్మీద నూకలు ఉంటే ఎక్కడో ఒకచోట బ్రతుకుతావు. లేదంటే చస్తావు అని చెప్పి అక్కడి నుంచి కోపంగా వెళ్లబోతుండగా. అప్పుడే అతనికి ఒక ఫోన్ కాల్ వస్తుంది. అతను ఫోన్ లో ఈ విధంగా మాట్లాడతాడు…. ఏంటి మీరు చెప్పేది నిజమా. చాలా థాంక్స్ అండి అని చెప్పి ఫోన్ కట్ చేసి. ఆ బిడ్డ దగ్గరికి వెళ్లి చాలా సంతోషంగా ఆ బిడ్డను తీసుకుని ఇంటికి వెళ్తాడు. అక్కడ తన భార్య ఏడుస్తూ ఉండగా బిడ్డ ఏడుపు వినపడుతుంది వెంటనే ఆమె పైకి లేచి చూడగా తన భార్య బిడ్డనీ తీసుకురావడం చూసి చాలా సంతోష పడుతూ ఆ బిడ్డని తీసుకుంటుంది.
నవీన్…. శ్రీలత నన్ను క్షమించు శ్రీలత ఇన్ని రోజులు నా వల్ల నువ్వు ఎన్నో ఇబ్బందులు పడ్డావ్వు. నువ్వు అన్న మాట నిజమే ఆడపిల్ల ఇంటికి లక్ష్మీదేవి. నా బిడ్డ పుట్టిన వేళా విశేషం
మన ప్రాపర్టీ అంతా తిరిగి వచ్చింది.
అని సంతోష పడుతూ ఆమెని కౌగిలించుకున్నాడు. మళ్ళీ వాళ్ళకి పూర్వవైభవం వస్తుంది. పెద్ద బంగ్లా కారు అన్ని తిరిగి వస్తాయి మళ్ళీ వాళ్ళు ఉన్నత స్థాయిలో ఉంటారు అలా రోజులు గడిచాయి.
ఆ పాప పెరిగి పెద్దదవుతుంది ఆమెకు సిరి అని పేరు పెడతారు. నవీన్ కు సిరి అంటే ఎంతో ఇష్టం. ఆమెను బాగా చూసుకుంటూ ఉంటాడు. అలాగే ఎంతగా అయితే ఆమెను ప్రేమిస్తా డో అదే విధంగా తన కొత్త కారు ని కూడా అంతే విధంగా ప్రేమిస్తాడు. అలా రోజులు గడిచాయి . శ్రీ లతా తాత నాయనమ్మలు కాలం చేస్తారు ఆ విషయం తెలుసుకుని ఆమె చాలా బాధ పడుతూ ఉంటుంది. అలా వుండగా ఒక రోజు శ్రీలత తల్లి ఆమెను చూడడానికి ఇంటికి వస్తుంది. శ్రీలత చాలా సంతోషంగా…. అమ్మ ఎలా ఉన్నావ్ అమ్మ ఇన్ని రోజులకు గాను మీ కూతురు గుర్తొచ్చిందా. నాన్న ఏడమ్మా.
శ్రీలత తల్లి…. మీ నాన్న ఏదో పని ఉందని రాలేకపోయాడమ్మ. పోనీలే అమ్మ నువ్వైనా వచ్చావ్ నాకు అదే చాలు. అంటూ ఇద్దరూ లోపలికి వెళ్లి కూర్చుంటారు. అప్పుడే తన మనవరాలి బయటకు వస్తుంది. వాళ్ళ అమ్మమ్మ ని చూసి ….. అమ్మమ్మ అంటూ వెళ్లి కౌగిలించుకుంది.
వాళ్ళ అమ్మమ్మ….. నీ కోసం ఏం తెచ్చిండు చూడు అంటూ కొన్ని లడ్డులు ఆమెకు ఇస్తుంది. దాన్ని తీసుకొని వాళ్ళ మనవరాలు చాలా సంతోష పడు తుంది. ఆమె…. సరే సిరి నువ్వెలా బయట ఆడుకో. అని అంటుంది సిరి బయటికెళ్ళి ఆడుకుంటూ ఉంటుంది.
శ్రీలత వాళ్ళ అమ్మ.,….. చెప్పమ్మా ఎలా ఉంది నీ కాపురం. నవీన్ ఎక్కడికి వెళ్ళాడు.
శ్రీలత…. మా కాపురానికి ఏమి చాలా చక్కగా సాగిపోతుందమ్మ. నా భర్త ఏదో పని మీద బయటకు వెళ్ళాడు వచ్చేస్తాడు.
ఆమె తల్లి…. ఇదంతా చూస్తుంటే నాకు చూడముచ్చటగా ఉంది. మీ అమ్మమ్మ నాయనమ్మ కూడా బ్రతికి ఉంటే ఇంకా ఎంత సంతోష పడే వాళ్ళు. అని అంటుంది ఆ మాటలకి శ్రీలత చాలా బాధపడుతుంది.
అప్పుడు ఆమె తన జీవితంలో జరిగిన విషయం అంతా చెబుతుంది దాన్ని విన్న తల్లి…. ఇప్పుడు ఇలా బాధ పడుతున్నావు నీ తల్లిదండ్రులు గుర్తు రాలేదా అప్పుడు మాకు చెప్తే మేము ఏదో ఒక విధంగా సహాయం చేసే వాళ్ళం కదా. శ్రీలత …. ఎందుకమ్మా మీకు శ్రమ.ఆ ఇబ్బంది మీద పడ్డాం కదా ఇప్పుడు అంతా బాగుంది. చెప్పాలి కాబట్టి చెప్తున్నాను ఆ విషయం వదిలేసి అమ్మ. ఇంతలో అతని భర్త కారు హారన్ సౌండ్ వినపడుతుంది.
శ్రీలత…. ఆయన వచ్చినట్టున్నాడు.
అని అనుకుంటారు బయట నవీన్ తన కారు ఆపి ఉంచుతాడు. అతను అలా నడుచుకుంటూ ఉండగా సిరి నాన్నా అంటూ కౌగిలించుకుంది. అతను చాలా సంతోష పెడుతాడు ఆమె తర్వాత అక్కడి నుంచి వెళ్లి తన కారు మీద ఏదో గీతలు గీస్తూ ఉంటుంది దాన్ని చూసిన అతను చాలా కోపంగా…. సిరి ఎంత పని చేశావే అంత మంచి కారుని పాడు చేస్తావా అంటూ ఆమెని గట్టిగా కొడతాడు ఆమె అక్కడే ఉన్నా ఉన్న సువర్ణ మీద పడి తన రెండు కళ్ళు పోతాయి . ఆమె ఏడుస్తూ ఉండగా అతను చాలా కంగారుగా సిరి నీ హాస్పిటల్ తీసుకెళ్తాడు. కొంత సమయం తర్వాత డాక్టర్ అతని దగ్గరకు వచ్చి… సారీ అండి మీ అమ్మాయికి రెండు కళ్లు పోయాయి.
అంటాడు అతను బాధపడుతూ….. అమ్మ సిరి ఎంతపని జరిగిపోయింది . పనికిమాలిన కారు కోసం కన్నబిడ్డ కళ్ళు పోగొట్టను నేను కసాయి తండ్రి. నన్ను క్షమించు తల్లీ అంటూ బోర్న్ ఏడుస్తాడు. డాక్టర్…. బాధపడకండి వెళ్లి మీ అమ్మాయిని చూడండి.
అతను…. ఏ ముఖం పెట్టుకుని వెళ్ళి నా కూతుర్ని చూడమంటారు డాక్టర్. అంటూనే బాధపడుతూ ఆమె దగ్గరికి వెళ్తాడు అప్పుడు సిరి….. నన్ను నన్ను క్షమించు నాన్న నేను ఆ తప్పు చేయకుండా ఉండాల్సింది. ఆ కారు కి నావల్ల ఏమన్నా జరిగింద నాన్న ఇప్పుడు అది ఎలాగ పోతుంది.అంటూ అమాయకంగా అంటుంది ఆ మాటలు విన్న తండ్రి పెద్దగా ఏడుస్తూ…. అయ్యో భగవంతుడా నా బంగారు తల్లి నీ ఎంత పని చేశాను నా చేతులారా చి ..చి . ఇంత జరిగినా కూడా ఆ పసి మనసు కి ఏమీ అర్థం కాలేదు. మళ్లీ తిరిగి మాట్లాడిన మాటలు నన్ను సూదు ల్ల గుచ్చుతునాయి భగవంతుడా అంటూ ఏడుస్తాడు. సిరి…. నాన్న ఏమైంది నాన్న ఎందుకు ఏడుస్తున్నావు ఇంక నేను ఎప్పుడూ తప్పు చేయను. అంటూ సిరి కూడా ఏడుస్తుంది నవీన్ ఆమెను ఎత్తుకుని ఏడుస్తూ ఉంటాడు కొంత సమయం తర్వాత ఆమెను ఎంతో బాధతో అక్కడి నుంచి ఇంటికి తీసుకు వెళ్తాడు.ఈ కథ విన్నాక మీకు నచ్చినట్లైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి

Add a Comment

Your email address will not be published. Required fields are marked *