గర్భవతి తల్లి బాధ_ Telugu Stories- Stories in Telugu – Panchatantra Kathalu

అది ఒక అందమైన పల్లెటూరు. అక్కడ సీత అనే అమ్మాయి ఉండేది.ఆ అమ్మాయి చాలా అమాయకురాలు. కానీ చాలా మంచిది అలాగే అందంగా కూడా ఉంటుంది. ఆమెకు చిన్నతనంలోనే తల్లి మరణించడంతో ఆమె తండ్రి సింగయ్య ఆమెని అల్లారుముద్దుగా పెంచుకున్నాడు. అయినప్పటికీ సింగయ్య కు మద్యం సేవించే ఒక్క చెడు అలవాటు ఉండేది. ఆ విషయం గురించి సీత ఎన్నిసార్లు చెప్పిన ఆమె మాట అస్సలు వినడు ఒకరోజు సీతా తన తండ్రితో ఏడుస్తూ…. నాన్న ఎందుకు తాగి తాగి మీ ఆరోగ్యాన్ని చెడగొట్టుకుంటారు. ఇలా చేస్తే అమ్మ లాగే మీరు నాకు దూరం అయి నేను ఒంటరిగా మిగిలి పోతాను. నేను ఒంటరిగా మిగిలిపోవడం మీకు ఇష్టమైతే అలాగే చెయ్యండి నేను ఏమీ అనను అని చాలా ఏడుస్తుంది ఆ మాటలు విన్న అతను కూడా ఏడుస్తూ… సీత నువ్వు బాధపడకు నేను ఇంకెప్పుడు తాగను తల్లి .నీ మీద ఒట్టు. అని చెప్పి అక్కడ నుంచి బయటికి వెళ్తాడు. అతను బయటికి వెళ్లి ఎప్పటిలాగే తాగి మళ్ళీ ఇంటికి తిరిగి వస్తాడు. దాన్ని చూసి న సీత చాలా బాధపడుతూ …. నాన్న తాగను అని చెప్పి మళ్ళీ ఎందుకు తాగి వచ్చారు నేను చనిపోయిన నీకు ఇష్టమే అనుకుంటా. నాపైన ఒట్టు వేసి కూడా ఇలా చేస్తున్నారు అంటూ కంటతడి పెట్టుకుంది. ఆమె మాటలు విని విన్నట్టుగా అతను పట్టించుకోకుండా వెళ్ళి విశ్రాంతి తీసుకుంటాడు అలా రోజులు గడిచాయి సింగయ్య ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. అతను ఒక రోజు తన కూతురు ని పిలిచి…. అమ్మ నాకు ఇంక ఈ భూమ్మీద నూకలు చల్లి పోయాయి. నేను కన్నుమూసే లోపు నీ పెళ్లి చూడాలనుకుంటున్నాను. మీ మేనమామ కుమారుడు లోకేష్ నిన్ను ఇష్ట పడుతున్నాడు.

కాదనకుండా అతన్ని పెళ్లి చేసుకో. అని బ్రతిమిలాడాడు అందుకు ఆమె సరే అని చెప్పి అతన్ని పెళ్లి చేసుకుంటుంది ఆమె కు పెళ్ళయిన కొన్ని రోజులకే తన తండ్రి చనిపోతాడు. తన తండ్రి చనిపోయినందుకు ఆమె చాలా బాధపడుతుంది అప్పుడు లోకేష్ ఆమెతో… సీత బాధ పడుకో నేను ఉన్న కదా నాలోనే మీ నాన్న నీ చూసుకో. సరేనా నీకు ఏ అవసరమైనా నన్ను అడుగు మొహమాటం పడొద్దు. కొన్ని రోజులు గడిస్తే నీకు కూడా ఇక్కడ అంతా అలవాటు అయిపోతారు. మా అమ్మ చాలా మంచిది నిన్ను బాగా చూసుకుంటుంది అలాగే మన నాన్న కూడా. అంటూ ఆమెని ఓదారుస్తాడు అలా కొన్ని రోజులు గడిచాయి.
ఒకరోజు లోకేష్ రాత్రి సమయంలో తన ఇంటికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో కారు ఢీకొని అక్కడికక్కడే అతను చనిపోతాడు.
అతను చనిపోయాడు అని తెలుసుకున్న తల్లి తండ్రి భార్య కన్నీరుమున్నీరుగా బాధపడుతూ ఉంటారు. ఆ మరుసటిరోజు సీత చాలా బాధ పడుతూ …. భగవంతుడా ఏంటి నాకు ఈ కష్టాలు అంటూ ఏడుస్తూ ఉండగా సృహ తప్పి కింద పడిపోతుంది. దానిని చూసిన ఆమె అత్తయ్య సరోజా… అయ్యో కోడలికి ఏదో అయింది . అంటూ కంగారుగా డాక్టర్ ని ఇంటికి తీసుకు వస్తుంది.
డాక్టర్ ఆమెను పరీక్షించి …. మరి ఏం పర్వాలేదు ఇప్పుడు ఈమె గర్భవతి జాగ్రత్తగా చూసుకోండి. అసలుకే చాలా బలహీనంగా ఉంది. ఆ తర్వాత మీ ఇష్టం అంటూ సమాధానం చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అప్పుడు ఆ అత్త….. ఏమ్మా ఎలాగోలా నిన్ను వదిలించుకోవాలి అనుకుంటే. మళ్లీ ఒక దరిద్రాన్ని ఇంటికి తీసుకు వస్తున్నావా తల్లి. అంటూ అసహ్యించుకొని ఆమెను తిడుతూ ఉంటుంది. ఆమె మాటలు వింటున్నా సరోజ భర్త … ఎందుకు సరోజా సంతోషించాల్సoది పోయి ఎందుకు అలా కోడల్ని తిడుతున్నావ్.
నీకు మతి కానీ పోలేదు కదా.
భార్య… మీరు కొంచెం సేపు నోరు మూసుకొని ఉంటారా. ఈ మహాతల్లి ఏమంటా మన ఇంట్లో అడుగు పెట్టిందో కానీ. బంగారo లాంటి మన బిడ్డని పొట్టన పెట్టుకుంది. పుట్టినప్పుడే తల్లిని పొట్టన పెట్టుకుంది. అసలు ఇంతటి నష్ట జాతకురాలనీ తెలిసి కూడా పాపం అని జాలి పడి. మన వాడికి ఇచ్చి పెళ్లి చేశాను. అసలు ఇది ఇంత నష్ట జాతకరాలని తెలిస్తే ఇంతవరకూ వచ్చేది కాదు. తొందరపడి దీని ఇచ్చి పెళ్లి చేసి బంగారం లాంటి బిడ్డను పోగొట్టుకున్నాం. చి అంటూ చీదరించుకుని అక్కడి నుంచి వెళ్లి పోతుంది. ఆమె ఆ మాటలకి చాలా బాధ పడుతూ ఉండగా తన మామయ్య… ఊరుకో తల్లి బాధపడక మీ అత్తయ్య గురించి నీకు తెలిసిందేగా. ప్రేమి కలిగిన కోపం వచ్చినా ఇలాగే ప్రవర్తిస్తూ ఉంటుంది. వాడు చనిపోయాడని బాధ పడుతుంది కానీ నిన్ను తిట్టాలని కాదు. దాని మాటలు ఏం పట్టించుకోకు. జరిగిందంతా మర్చిపోయి పుట్టబోయే బిడ్డ గురించి ఆలోచించఅమ్మ. సరే కథ తల్లి నువ్వు బాధ పడకమ్మా అంటూ ఆమెను బుజ్జగించి అతను కూడా అక్కడనుంచి వెళ్ళి పోతాడు. నెలలు గడుస్తున్నది ఆమె ఆ గర్భం తోనే ఇంటి పనులు అన్నీ చేస్తూ ఉంటుంది.ఒక రోజు రాత్రి సమయంలో వంట పని చేస్తుండగా పొరపాటున ఆమె చెయ్యి తగిలి పక్కనే ఉన్న జాడి కిందపడి పగిలి పోతుంది ఆ శబ్దానికి తన అత్తయ్య వచ్చి దాన్ని చూసి….. ఒసేయ్ ఒసేయ్ పాపిష్టి దాన అది మా అమ్మ పోతూ పోతూ నాకు జ్ఞాపకం గా ఇచ్చి పోయింది. దాన్ని కూడా నాశనం చేసావు కదా. నిన్న అసలు ఏం చేయాలి అంటూ కోపంగా ఆమెను కొడుతుంది. సీత చాలా బాధ పడుతూ… అత్తయ్య వద్దు అత్తయ్య కొట్టకండి అత్తయ్య. పొరపాటున చెయ్యి తగిలి కింద పడిపోయింది. కొట్టకండి అత్తయ్య నొప్పిగా ఉంది. అంటూ ఎంతగా ప్రాధేయపడినా ఆమె మాత్రం గర్భవతి అని కూడా జాలి లేకుండా ఆమెను కొడుతుంది. ఆమె అరుపులు విన్న తన మామయ్య అక్కడికి వచ్చి…. ఒసేయ్ saroja ఎందుకే ఆ పిల్లని చితకబాదుతున్నావు. వదిలేయ్ఏ పాపం నిండు చూలాలు. ఏదో పొరపాటు జరిగిపోయింది అంటుంది గా. అంటూ అడ్డుపడతాడు. సరోజ చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్లి పోతుంది. తన మామయ్య…. ఊరుకో తల్లి సీతా అని నీకు పేరు పెట్టినందుకు. ఆ సీతమ్మ తల్లి కష్టాలన్నీ నీకే వచ్చాయి. నీ పరిస్థితి చూస్తూ ఉండి కూడా ఒక విగ్రహం లా ఉండిపోయాను.నేను చేతకాని వాడిలాగా అయిపోయారు నీ భర్త బతికి ఉంటే బాగుండేది. నన్ను క్షమించు అమ్మ నేను నీకు ఏం చేయలేకపోతున్నాను. అంటూ కన్నీరు కార్చుకుంటూ అతను బయటకు వెళ్తుండగా.
దానిని చూసిన అతని భార్య…. ఇంత రాత్రివేళ ఎక్కడికి వెళ్తున్నారు.
భర్త…. ఇక్కడే ఉండి ఈ అన్యాయాన్ని నేను చూడలేను. దాన్ని రోజు అలా చిత్రహింసలు పెట్టే బదులు కొంచెం విషం ఇచ్చి దాన్ని చంపేస్తే అయిపోతుంది. అది ఈ రోజు నీ చేతిలో చస్తూ బ్రతుకుతూ దానిని చూస్తూ నేను బాధ పడుతూ ఇక్కడ ఉండ లేను నువ్వు మారిన రోజు నేను ఇంటికి తిరిగి వస్తాను. అప్పటివరకు నా మొఖం కూడా చూపించను. అంటూ అక్కడనుంచి వెళ్ళి పోతాడు.
ఆమె ఎంత పిలిచినా వెనక్కి తిరిగి రాడు.తన భర్త వెళ్లిపోయాడని కోపంతో మళ్ళీ కోడలు దగ్గరికి వెళ్లి …. అమ్మ మహా తల్లి ఇంటికి వచ్చి ఎన్ని ఘనకార్యాలు చేస్తున్నావమ్మ.నా బిడ్డను దూరం చేశావు కట్టుకున్న భర్తను దూరం చేశావు. ఈ నీచమైన బ్రతుకు బ్రతక పోతే ఏ ఏట్లో అయినా దూకి చావచ్చుగా. ఇంకా ఎంతకాలం అని ఇలా మమ్మల్ని కాల్చుకు తింటావు. ముదనష్టపు దానా చి చి అని తిడుతుంది. పాపం సీత ఆ మాటలకు చాలా ఏడుస్తూ… అత్తయ్య నావల్ల తప్పు జరిగి ఉంటే నన్ను క్షమించండి. నేను వెళ్ళిపోతాను మీ అందరికి దూరంగా వెళ్ళిపోతాను. అంటూ కన్నీరు కారుస్తోంది.
అత్త… నా కు కూడా కావలసింది అదే వెళ్ళిపో ఇంకెప్పుడు తిరిగి రాకు చచ్చిందనుకుంటాం. అని అంటుంది అంత రాత్రి వేళ సీత ఎంతో బాధపడుతూ తన ఇంటి నుంచి నడుచుకుంటూ వెళ్తుండగా అప్పుడే జోరుగా వర్షం పెద్దపెద్ద ఉరుములు పెద్ద గాలి మొదలవుతుంది. ఆ వర్షంలో అంత రాత్రి వేళ ఆ గాలికి ఆ తల్లి నడవలేక ఎటు వెళ్లాలో అర్థం కాక ఒక చెట్టు దగ్గర కూర్చొని…. భగవంతుడా ఎందుకు నాకు ఇలాంటి రాత రాశావు. పుట్టినపుడు తల్లి నీ దూరం చేశావు. పెరిగి పెద్దయిన తర్వాత నా తండ్రిని దూరం చేశావు. చివరికి కట్టుకున్న భర్తను కూడా దూరం చేశావ్వు ఇన్ని చూస్తూ నేను ఎలా బ్రతికు డమంటావు. నన్ను కూడా తీసుకెళ్ళు నీకు ఇలాంటి దరిద్రమైన బతుకు నాకెందుకు అంటూ తన తలని బాదుకుంటూ చనిపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది తన తల నుంచి రక్తం కారుతూ ఉంది ఇంతలో ఆమెకి పురిటి నొప్పులు ప్రారంభమవుతాయి. ఆమె ఎంతో వేదన పడుతూ…. అమ్మ ఈ నొప్పి నేను తట్టుకోలేక పోతున్నాను. భగవంతుడా నన్ను కాపాడు అమ్మ అమ్మ అంటూ కన్నీరు పెట్టుకుంటూ పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటుంది. చుట్టూ ఎవరూ ఉండరు చీకటి అంతటి దౌర్భాగ్య స్థితిలో ఆ తల్లి ఎంతో వేదన పడుతూ ఉంటుంది. ఆమె అలాగే ఎంతోసేపు ప్రసవవేదన పడుతూ…. నా భర్త కాని తండ్రి కాని బ్రతికి ఉంటే నాకు ఇలాంటి పరిస్థితి వచ్చి ఉండేది కాదు. ఇలాంటి దుస్థితి ఏ తల్లికి రాకూడదు పగవాడికి కూడా రాకూడదు. అంటూ పెద్ద పెద్దగా ఏడుస్తూ ఉంటుంది. అలా చాలా సమయం వరకు ఆమె ఎంతో బాధను భరించి ఒక బిడ్డకి జన్మనిస్తుంది. ఆ బిడ్డ నీ చూసుకొని ఆ తల్లి ఎంతో మురిసిపోతూ…. భగవంతుడా నా బిడ్డ నీ అయినా నా జాగ్రత్తగా చూసుకునే శక్తిని బలాన్ని నాకివ్వు నా లాగ నా బిడ్డ కష్టాలు పడకూడదు. దయచేసి నా బిడ్డకి మంచి జీవితాన్ని ప్రసాదించు అంటూ కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఉంటుంది. ఆ వర్షంలోనే ఆ తల్లి ఆ బిడ్డని పట్టుకొని ఎంతగానో కృంగిపోతే ఉంటుంది చాలా సమయం నిస్సహాయ స్థితిలో ఎవరైనా సహాయం చేస్తారేమో అని ఆ దేవుని ఈ విధంగా వేడుకుంటూ ఉంటుంది….. భగవంతుడా నాకు సహాయం చెయ్యి నా బిడ్డ వర్షంలో తడిసి పోతుంది.సహాయం కోసం ఎవరైనా పంపించు నీకు పుణ్యం ఉంటుంది . అని పెద్ద పెద్దగా ఏడుస్తూ ఉంటుంది ఆ తల్లి అలా ఏడుస్తూ ఉన్నట్టుండి ఉన్నట్టుండి ఆ తల్లికి గురపూవాతం వచ్చి కింద గిలగిలా కొట్టుకుంటూ …. కాపాడండి ఎవరైనా నన్ను కాపాడండి. ఎవరైనా నన్ను కాపాడండి భగవంతుడా నా బిడ్డ నీ నా నుంచి దూరం చేయకు కాపాడండి. ఎవరైనా నా బిడ్డని కాపాడండి అంటూ పెద్ద పెద్దగా అరుస్తూ ఆమె కన్నుమూసింది. పుట్టిన ఆ పసికందు తల్లి పాల కోసం ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి కార్ లో ఒక వ్యక్తి వస్తాడు . అతను ఆ తల్లి బిడ్డను చూసి తన కారుని పక్కగా అందులో నుంచి దిగి వచ్చి వర్షం లో తడుస్తున్న బిడ్డను తీసుకుని…. అయ్యో పాపం ఈ బిడ్డ తల్లి చనిపోయినట్టు ఉంది. బిడ్డ పాపం వర్షంలో తడిసిపోతుంది.ఎవరో ఏంటో అని జాలి తలుస్తూ ఆ బిడ్డను తీసుకుని అక్కడనుంచి తన ఇంటికి వెళ్ళి పోతాడు. ఆ బిడ్డని చూసిన అతని భార్య…. ఎవరండీ ఈ పాప ఎందుకు ఇక్కడికి తీసుకు వచ్చారు. అని అడుగుతుంది అతను…. ఎవరో నాకు తెలియదు పాపం రోడ్డు పక్కన వర్షంలో తన తల్లి చనిపోయింది. బిడ్డ ఆకలితో ఏడుస్తూ నా కంట పడింది అందుకే ఉండబట్టలేక తీసుకొని వచ్చాను.
భార్య…. మంచిపని చేశారు పాపం ఏ తల్లి కన్న బిడ్డ కానీ మన ఒడిలో చేరింది ఎంత ముద్దుగా ఉందో. మనకు ఎటు పిల్లలు లేరు గా ఆ భగవంతుడే మనకు బిడ్డని ప్రసాదించాడనుకుందాం. అని అంటుంది అతను ముందు పాపకి పాలు పట్టు ఎంతో సేపటినుంచి గుక్కపట్టి ఏడుస్తూ నే ఉంది. పైగా వర్షంలో తడిసింది కదా తలని బాగా తుడువు.అని అంటాడు ఆమె వెంటనే పాలు తీసుకొచ్చి ఆ పాపకి తాగిస్తుంది. ఆ పాప యొక్క తలని తుడుస్తుంది. పాపకి పాలు తాగించడం తో ఆ ఏడుపు అంతా ఆపి ప్రశాంతంగా నిద్ర దాన్ని చూసిన వాళ్ళిద్దరూ ఊపిరి ఊపిరి దేవుడి దయ వల్ల ఆకలి తీరినట్టు ఉంది . ప్రశాంతంగా నిద్ర పోతుంది. అని అనుకుంటారు అలా దేవుడు తన తల్లిని దూరం చేసిన ఆ తల్లి బాధని మొర విన్న దేవుడు మంచి కుటుంబం లోనికి ఆ బిడ్డను పంపించి గొప్ప పని చేశాడు. అప్పట్నుంచి ఆ బిడ్డని వాళ్ళు చాలా చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటారు ఈ కథ గనుక నీకు నచ్చినట్లైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *