నాగిని కాపాడగలదా 10_ Telugu Stories- Stories in Telugu – Panchatantra Kathalu

గర్భవతి నాగిని పదో భాగం లో శ్రీ కన్య తల్లి ఇంటి లోపలికి వెళ్లి తలుపు వేసుకుంది. దానంత చూసిన వాళ్ళు చాలా కంగారు పడుతూ ఉంటారుఆ తర్వాత ఏం జరిగిందో ఈ భాగంలో చూద్దాం.

బయట ఉన్న వాళ్ళు ఎందుకు తలుపు కొట్టిన తీయకపోవడంతో. స్వామీజీ తన శక్తితో తలుపులు తెరుస్తాడు ఆమె ఒక చోట కూర్చొని తన తల బాదుకుంటూ ఉంటుంది.
వెంటనే శ్రీ కన్య అక్కడికి వెళ్లి….అమ్మ ఎందుకు నువ్వు అలా బాధ పడుతున్నావు నేను కూడా నీ కూతురినే కదా. నువ్వు ఇలా బాధపడుతూ చేయడానికి ప్రయత్నిస్తే నీకంటే ముందు నేను చనిపోతాను అంటూ ఏడుస్తుంది. ఆ మాటలు విన్న శ్రీ కన్య తల్లి చాలా బాధపడుతూ…. సరే అమ్మ ఇంకెప్పుడు నేను అలా చేయను నన్ను అందరూ క్షమించండి. భగవంతుడు ఇచ్చిన అప్పుడే నాకు గర్భం ఇస్తాడు. ఆ బాధను మరిచిపోవడానికి నువ్వు ఉన్నావు కదా. అంటూ ఆమె కూడా బాధపడి శ్రీ కన్నను హత్తుకుంటుంది.
అలా రోజులు గడిచాయి. ఒక రోజు ఉదయం
భైరవుడు ఊరి నుంచి ఏదో ఒక పెద్ద బాక్స్ ని తీసుకొని వస్తాడు. ఆ బాక్స్ లో ఏముందో తెలుసుకుందాం అని శ్రీ కన్య దాన్ని తెరిచి చూస్తుంది. అందులో రకరకాల స్వీట్లు చాలా ఉంటాయి. దాన్ని చూసి శ్రీ కన్య….. భైరవ దీనిని ఎక్కడ నుండి తీసుకొచ్చావు.
అందుకు భైరవ…. శ్రీ కన్య నేను ఊర్లోకి వెళ్ళాను అక్కడ ఒక వ్యక్తి అందరికీ పండగ సందర్భంగా వీటిని అందరికీ పంచుతూ ఉన్నాడు నాకు కూడా ఇచ్చాడు నేను తీసుకుని వచ్చాను.
ఆమె చాల సంతోషపడుతూ…. అబ్బా ఎన్ని రోజులు అవుతుందో ఇలాంటి స్వీట్లు తినీ
అని వాటిని తీసుకొని అక్కడి నుంచి పరుగులు తీస్తోంది. భైరవ ఆమె వెంట పడతాడు శ్రీ కన్య bairavaa కి కనపడకుండా ఒకచోట దాక్కుంది…ఇప్పుడు భైరవ కు ఏమీ లేకుండా నేను తినేస్తాను. అంటూ మొత్తం స్వీట్లు తినేస్తుంది. ఆ తర్వాత ఆమె ఒక చోట పడుకొని.. అమ్మ అయ్యా నా కడుపు బాగా వుబ్బి పోయింది నేనిప్పుడు ఎటు వెళ్ళలేని పరిస్థితి. అమ్మ అయ్యా అనుకుంటూ అక్కడే పడుకుంటుంది.
అప్పుడే భైరవ ఆమెను చూసి…. శ్రీ కన్య నాకు పెట్టకుండా మొత్తం తిన్నావు ఇప్పుడేమో ఆపసోపాలు పడుతున్నావ్వ.
శ్రీ కన్య….అయ్యో భైరవ నాకెందుకో అన్ని తినాలనిపించింది అందుకే నీకు పెట్టలేకపోయాను. నన్ను క్షమించు అని అంటుంది.
భైరవ….విశ్రాంతి తీసుకో నేను అలా వెళ్లి ఇలా వచ్చేస్తాను.
అందుకు ఆమె సరే అంటుంది భైరవ అలా వెళ్తూ ఉండగా ఇంతలో తన తల్లి కనబడుతుంది. తల్లి భైరవ తో…. భైరవ శ్రీ కన్య ఎక్కడికివెళ్ళింది పొద్దున్నుంచి కనపడటం లేదు.
భైరవ…. అమ్మ మీరు కంగారు పడాల్సిన పనిలేదు బాగా తిని అక్కడ పంది లాగా పడుకుంది .
అందుకు ఆమె శ్రీ కన్య దగ్గరకు వెళుతుంది శ్రీ కన్య ఎటూ కదలకుండా పడుకోవడం చూసి….. అయ్యో శ్రీ కన్య ఏంటి నువ్వు ఉన్న స్వీట్లు మొత్తం తిన్నావా అంట. ఇప్పుడేమో కదలకుండా అలాగే కూర్చుండిపోయావ్వ.
శ్రీ కన్య…. అవునమ్మా నేను ఎటు కదలిక పోతున్నాను. కొంచెం సేపు నాకాక అంతా అదే సర్దుకుంటుంది నువ్వు వెళ్ళు నేను వస్తాను అని చెబుతుంది. తల్లి సరే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది.
కొంత సమయం తర్వాత శ్రీ కన్య….. ఈ సీట్లో ఏమన్నా కలిపారా ఏంటి. ఆకలి తెగ మండిపోతుంది ఇప్పుడే ఇంత తిన్నాను.
చచ్చాను రా భగవంతుడా. అంటూ అక్కడి నుంచి ఆపసోపాలు పడుతూ మళ్ళీ ఇంట్లోకి వస్తుంది. ఆమె ఇంట్లో ఉన్న పండ్లు అన్నీ తింటుండగా అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు భైరవుడు…. ఏమైంది నీకు ఇప్పుడే అంత తిన్నావు మళ్లీ ఇప్పుడు తింటున్నాను. అది కడప లేక చెరువా. వామ్మో ఈ తిండి చూస్తుంటే నన్ను కూడా తిని లాగా ఉన్నావే.
నాకు ఎందుకు వచ్చిన గొడవ నేను వెళ్ళిపోతున్నాను అంటూ అక్కడి నుంచి బయటకు వెళ్తుంది.
తల్లి…. ఏమైంది శ్రీ కన్యా నీకు అలాగా తింటున్నావ్వి.
శ్రీ కన్య…. ఏమో అమ్మా నాకు తెలీదు చాలా ఆకలిగా ఉంది. ఏంటో నాకు అయోమయంగా ఉంది.ఉన్న ఆహార పదార్థాలు అన్నీ తినేస్తూ ఉంటుంది.
కొంత సమయం తర్వాత భైరవ….. శ్రీ కన్య నీ ఆకలి తీరిందా. శ్రీ కన్య ఎక్కడ ఉన్నావు.
అప్పుడు శ్రీ కన్య…. ఇదిగో మిత్రమా నేను ఈ చెట్టు మీద జామకాయలు తింటున్నాను.
నువ్వు కూడా త్వరగా రా. ఇద్దరం కలిసి జామకాయలు తిందాం.
ఆమె మాటలు విని భైరవ ఆమె వైపు చూస్తూ…. ఓరి దేవుడో దీనికి ఏదో అయింది అందుకే ఇలా ఇంత వింతగా ప్రవర్తిస్తుంది.
ఇప్పుడే నాగిని దగ్గరికి వెళ్లి జరిగిన విషయం చెప్పాల్సిందే.
అని అనుకొని పరుగు పరుగున నాగిని దగ్గరికి వెళుతుంది.
అప్పుడు నాగిని భైరవతో….. ఏమైంది నీకు ఎందుకు అలాగా కంగారుపడుతూ వచ్చావు.
అప్పుడు బాయ్ రా బాబు జరిగిన విషయం అంతా చెప్తాడు.
దానిని విన్న నాగిని పెద్దగా నవ్వుతూ….. అది ఏమీ కాలేదు కానీ నేను చెప్పినట్టు చెయ్యి. నేను కొన్ని పండ్లు ఇస్తాను ఆ పండ్లు ఆమెచేత తినిపించు. ఆ తర్వాత అంతా సర్దుకుంటుంది. అని చెప్తుంది అందుకు భైరవ సరే అన్నాడు.
ఆ తర్వాత నాగిని కొన్ని పండ్లను ఇస్తుంది.
వాడిని తీసుకొని బయట వాళ్ళ ఇంటికి తిరిగి వెళ్తాడు. అప్పుడే అక్కడ శ్రీ కన్య… భైరవ నేను సుబ్బరంగా ఇంట్లో ఉన్న అన్నిటినీ తినేసాను. కానీ నేను ఎందుకు తింటున్నానో నాకు అర్థం కావడం లేదు.
ఇంకా నాకు ఆకలి వేస్తే ఉంది అవును ఏంటది .
నాకు ఇవ్వు వాటిని నేను తింటాను అని భైరవ దగ్గర పండ్లు లాక్కుని అమాంతం అన్నిటినీ ఆవురావురుమంటూ తినేస్తుంది.
అప్పుడు ఆమె కింద పడుకొని….. అమ్మో నా పొట్ట రెండు చెక్కలయ్యేలా గా ఉంది. ఏంట్రా బైరవ ఇది ఏం తీసుకొస్తున్నావూ.నువ్వు నాకోసం నాకు చాలా ఇబ్బందిగా ఉంది అంటూ పెద్దగా కేకలు వేస్తూ ఉంటుంది.
ఇంతలో ఆమె పొట్ట పెద్దదిగా మారిపోతుంది.
దాన్ని చూసిన భైరవ చాలా ఆశ్చర్యపోతూ….. అమ్మో ఏంటి నీ పోట్ట అంత పెద్దగా అయిపోయింది. అది పగిలి పోతుందా .
అని అంటుంది అందుకు శ్రీ కన్యా చాలా భయపడుతూ…. భైరవ ఇది అంతా నీవల్లే అయ్యింది. నువ్వే నన్ను ఇలా చేసావు అంటూ ఏడుస్తూ ఉంటుంది.
అప్పుడే నాగిని అక్కడికి నమ్ముకుంటే వచ్చి…. శ్రీ కన్య నువ్వు తిని తిని ఇంత పెద్ద పోటనీ పెంచుతామని అసలు అనుకోలేదు.
శ్రీ కన్య….. అమ్మ నాగిని నేను కూడా అనుకోలేదు. వీడే నాకు పొద్దున స్వీట్లు తీసుకు వచ్చాడు అప్పుడు నుంచి నాకు ఇలా జరుగుతూనే ఉంది. అందుకు నాగిని… నువ్వేం కంగారు పడుకో నీకు ఇప్పుడు ఏం కాదు అని అంటుంది . అలా అన్న వెంటనే తన పొట్ట తగ్గిపోతుంది.
దానిని చూసిన శ్రీ కన్య చాల సంతోషపడుతూ…. అసలు పొట్ట ఎందుకు వచ్చింది ఎందుకు తగ్గింది అసలు నాకు ఎందుకు ఇలా పిచ్చ ఆకలేస్తుంది . ఏంటి ఈ మాయ నాకు ఏమీ అర్థం కావడం లేదు.
అప్పుడు నాగిని…. ఆ సీట్లో ఏదో మందు కలిపినట్లు ఉన్నారు. ఆ సీట్లు ఎన్ని తిన్నా ఇంకా మళ్ళీ మళ్ళీ తినాలనిపించ డాడికి.
వ్యాపారం చేసుకోవడానికి ఇదొక కొత్త పద్ధతి. ఈ విధంగా మనిషులను మోసం చేస్తున్నారు
ఇంకా ఆ పొట్ట సంగతి అంటావా నువ్వు ఇంకా మీరు తింటే మీ పొట్ట అలా పెరిగి పోతుంది అని చెప్పడానికి అలా చేశాను.
ఇప్పుడు ఇంకా ఆకలి వేస్తుందా.
శ్రీ కన్య…. లేదు లేదు ఆకలి వేయడం లేదు. అని చెప్తుంది అందుకు నాగిని నవ్వుకుంటూ
ఉంటుంది శ్రీ కన్య బైరవ ఇద్దరు….. అమ్మ నాగిని ఇక్కడ అడవిలో రకరకాల రుచికరమైన పండ్లు తేనె పట్టు దొరుకుతాయి కదా మనం వాటిని తెచ్చుకుందామా.
నాగిని…. మళ్లీ ఏమైంది మీకు ఇద్దరికీ ఆకలేస్తుందా.
అందుకు వాళ్ళిద్దరూ…. లేదు లేదమ్మా మేము అడుగుతున్నాము. మనం ఇక్కడికి వచ్చి చాలా రోజులు అవుతుంది కానీ అడవి మొత్తం తిరిగి చూసింది లేదు. ఒకసారి అడవి మొత్తం చూడాలని ఉంది. అని అంటారు అందుకు నాగిని….. సరే తప్పకుండా వెళ్దాం బయలుదేరండి.అని అంటుంది ముగ్గురు కలిసి అక్కడున్న అదే మొత్తాన్ని తిరిగి చూస్తారు రకరకాల పండ్లు తేనెపట్టు లాంటివి అన్నిటిని స్వీకరిస్తారు. వాళ్ళు ముగ్గురు ఒకచోట కూర్చుని హాయిగా వాటన్నిటినీ ఆరగిస్తారు. అలా వాళ్ళు తినడం పూర్తయిన తర్వాత తిరిగి ఇల్లు చేరుకుంటారు.
ఇక ఆరోజు వాళ్ళు చూసిన చేసిన పనుల గురించి చెప్పుకుంటూ సంతోషంగా నిద్రలోకి జారుకుంటారు.
ఆ రోజు గడిచి పోతుంది శ్రీ కన్య లేచి స్వామిజి దగ్గరకు వెళ్తుంది.
స్వామీజీ…. శ్రీ కన్య ఏంటమ్మా ఇంత పొద్దున్నే ఇక్కడికి వచ్చావు.
శ్రీ కన్య స్వామి కి నమస్కారం చెప్పు… స్వామి మనం ఎక్కడ ఎన్ని రోజులు ఉండాలి నాకు నా స్నేహితులు గుర్తుకొస్తున్నారు. నాకు వాళ్లని చూడాలని ఉంది దయచేసి ఒక్కసారి నన్ను వాళ్ల దగ్గరికి తీసుకొని వెళ్తారా.
ఎందుకు స్వామీజీ….. తప్పమ్మ ఎందుకు అలాగా ఆలోచిస్తున్నావు. మనం ఇక్కడికి వచ్చిన కారణం ఏంటి వాళ్ళందరికీ దూరంగా ఉండడం కోసమే కదా. మనం ఇక్కడ ఉన్న సంగతి ఎవరికీ తెలియక పోవడమే మంచిది.
దయచేసి నన్ను ఈ ప్రశ్న గురించి అడిగి బాధ పెట్టకు.
శ్రీ కన్య….కానీ స్వామి నాకు వాళ్ళందరూ గుర్తుకు వస్తున్నారు దయచేసి ఒకసారి నన్ను వాళ్ళ దగ్గరికి పంపించండి.
స్వామీజీ…. శ్రీ కన్య ఒకసారి చెప్తే అర్థం చేసుకోవాలి తల్లి అవన్నీ కుదరవు. దయచేసి వెళ్ళు అని గట్టిగా చెప్పాడు.
ఆ మాటలు విని శ్రీ కన్యా చాలా బాధపడుతూ ఇంటికి తిరిగి వచ్చి ఒక చోట కూర్చొని ఏడుస్తు…… ఏంటో ఎవరు నన్ను పట్టించుకోవడం లేదు. నాకేమో నా స్నేహితుల దగ్గరికి వెళ్ళాలని ఉంది. వీళ్ళేమో ఇలా చెప్తున్నారు నేను ఏం చేయాలి.
అంటూ చాలా బాధపడుతుంది ఆ రోజు రాత్రి ఆమె బాధతో గడిచిపోతుంది ఆ మరుసటి రోజు ఉదయం తన పనులు తాను చేసుకుంటూ మనసులో వాళ్ళ స్నేహితులు గురించి ఆలోచిస్తూ ….. నాకు ఇప్పుడు అనిపిస్తుంది అప్పట లాగే నాకు మా శక్తులు ఉంటే బాగుండు అని . అప్పుడైతే నేను ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళవచ్చు. నా స్నేహితులతో మాట్లాడవచ్చు సంతోషంగా వాళ్లతో ఆడుకోవచ్చు.బావుండేది ఇప్పుడంతా నాకు అస్సలు నచ్చలేదు. ఇక్కడ నాకు ఎంతమంది తోడు ఉన్నా నేను ఒంటరిగానే ఉన్నది అనిపిస్తుంది ఎందుకో ఏమిటో.
అని వాళ్ళ స్నేహితుల గురించి ఆలోచిస్తూ దిగులు పడుతూ ఉంటుంది. చాలా రోజులు గడుస్తున్నాయి.చాలా బాధ పడుతూ ఉంటుంది ఒక రోజు ఉదయాన్నే ఆమె
ఇంట్లో కనబడదు అప్పుడు బైరవ ఆమెను వెతుక్కుంటూ ….. శ్రీ కన్య శ్రీ కన్య ఎక్కడికి వెళ్ళిపోయావు. నువ్వు ఎక్కడా కనిపించకపోవడంతో నేను చాలా కంగారు పడుతున్నాను. ఎక్కడున్నావో చెప్పు అంటూ ఆమె కోసం వెతకడం మొదలుపెడుతుంది.
ఆ తర్వాత ఏం జరిగిందో తరువాయి భాగంలో చూద్దాం.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *