గర్భవతి మేనత్త 2_ Telugu Stories- Stories in Telugu – Panchatantra Kathalu Kattapa kathalu

మొదటి భాగంలో కళ్యాణి ఒక పాపకి జన్మనిస్తుంది. పాపనీ చూసిన కళ్యాణి రజిని ఇద్దరూ చాలా సంతోష పడతారు. ఆ తర్వాత ఏం జరిగిందో ఈ భాగంలో చూద్దాం.ఆ తర్వాత పాపను తీసుకుని ఇద్దరూ హాస్పటల్ నుంచి ఇల్లు చేరుకుంటారు.

కళ్యాణి బాగోగులు రజిని చూసుకుంటూ ఉంటుంది. రోజులు గడిచాయి వాళ్ళిద్దరూ చాలా ప్రేమగా ఒకరికి ఒకరు తోడుగా ఉంటారు. ఒక రోజు కల్యాణి… అమ్మ రజిని నువ్వు మళ్ళీ చాలా బాగా చూసుకున్నావు.
ఇంకా నేను మీ మావయ్య దగ్గరికి వెళ్తాను.
నువ్వు ఒంటరిగా ఇక్కడ ఉండడం అస్సలు మంచిది కాదు నాతో పాటు వచ్చేస్తావా.
రజిని…. లేదు అత్తయ్య నేను ఇక్కడే ఉంటాను.
మా నాన్న ఎన్నో జ్ఞాపకాలు ఈ ఇంటిలో మిగిల్చి వెళ్ళాడు వాటినే తలచుకుంటూ ఇక్కడే బతికేస్తాను. అంటూ ఎంతో బాధతో చెప్తుంది.
అందుకు కళ్యాణి….. అది కాదు రజిని ఈ ఇంటిని ఎవరికైనా అమ్మేస్తే డబ్బు వస్తుంది. ఆ డబ్బుతో మనం ఏదైనా వ్యాపారం మొదలు పెడదాం. నీ బరువు బాధ్యతలన్నీ మీ మావయ్య చూసుకుంటాడు. నువ్వు సంతోషంగా చదువుకోవచ్చు. అని వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు సవితి తల్లి అయిన వసంత అక్కడికి వచ్చి… ఒసేయ్ కళ్యాణి నా కొంప కే. ఏసురు పెట్టాలనుకుంటున్నావా.
చిన్నపిల్లనీ చేసి మోసం చేద్దామని చూస్తున్నావా ఇల్లు ఎవరి పేరు మీద ఉందో నీకు తెలుసా.
అందుకు కళ్యాణి….. వదిన వదిలేసి వెళ్ళిపోయింది దానికి మళ్లీ ఎందుకు తిరిగి వచ్చారు . కేవలం ఈ ఇల్లు కోసమే కదా వచ్చింది.
అందుకు ఆమె…. అవును ఇల్లు కోసమే వచ్చాను . నువ్వు వచ్చావు. అంత నష్టమే మాకు. ఇంకా ఏమి తిందామని ఇక్కడ ఉన్నావు వెళ్ళు ఇంకా అంటూ కఠినంగా మాట్లాడుతుంది.
అందుకు కల్యాణి… వెళ్తాను వదిన. అంటూ రజినీతో….వెళ్దాం పద మీ మామయ్య నిన్ను బాగా చూసుకుంటాడు.
అందుకు రజిని…. అత్తయ్య అమ్మ వచ్చింది కదా ఇంకా నేను ఇక్కడే ఉంటాను.
అందుకు వసంత….. ఎందుకే దరిద్రపు మోహము దాన నా దగ్గర నువ్వు. నీ పాటికి నువ్వు వెళ్తేనే మంచిది. దరిద్రం నీ ఎవడు ఇంట్లో ఉంచుకోరు. రెండు దరిద్ర లే ఇంకా వెళ్ళండి అంటూ కట్టుబట్టలతో బయటకు పంపించేస్తుంది.
వాళ్ళిద్దరూ చాలా బాధపడుతూ అక్కడినుంచి వాళ్ళ ఇల్లు చేరుకుంటారు.
అక్కడ కళ్యాణి భర్తకు కళ్యాణి జరిగిన విషయమంతా చెప్తుంది.
దాన్ని విన్న అతను చాలా కోపంగా… ఇంత జరుగుతుంటే నువ్వేం చేస్తున్నావ్ ఒక ఉత్తరం ముక్క కూడా రాయలేదు. కనీసం నా దగ్గర ఫోన్ ఉంది కదా కాయిన్ బాక్స్ లో రూపాయి వేసి ఫోన్ చేయాల్సింది.
అందుకు ఆమె…. ఇక్కడ మాటలు అక్కడ ఎందుకు అన్న ఉద్దేశంతో నేను చెప్పలేదండి.
అందుకు అతను… సరే లోపలికి వెళ్ళండి అంటూ వాళ్లని లోపలికి వెళ్ళమని అని చెప్తాడు. వాళ్లు లోపలి కి వెళ్తారు అలా రోజులు గడిచాయి. వాళ్ళ మావయ్య వాళ్ళ కూతురుతో ఆడుకోవటం చూసిన రజిని తన మనసులో చాలా బాధ పడుతూ….. నాన్న నాకు మీరు గుర్తొస్తున్నారు మీరు ఉంటే ఎంత బాగుండేది నా జీవితం. నేను ఏం పాపం చేశానో నాకు దేవుడు ఇంత పెద్ద శిక్ష విధించాడు. తల్లి తండ్రి లేని అనాధను చేశాడు అంటూ తలుచుకోని తలుచుకోని ఏడుస్తూ బాధపడుతుంది.
ఆమె ఒక బాధను గమనించిన అత్త….. ఊరుకో రజిని ఎందుకు అలా బాధ పడుతున్నావు. బాధపడకు అమ్మ నాన్న గుర్తుకు వస్తే వాళ్ళని మా ఇద్దరి లో చూసుకో .
అని చెప్పి ఆమెను ఓదారుస్తూ ఉంటుంది అప్పుడే వసంత అక్కడికి వచ్చి భోరున ఏడుస్తూ…. అమ్మ నా తల్లి రజిని నేను ఎంత పెద్ద తప్పు చేశానో. నన్ను అందరూ క్షమించాలి. మీ పట్ల నేను చాలా అసహ్యంగా ప్రవర్తించాను. చిన్న పిల్ల అని చూడకుండా రజనీనీ ఎన్నో కష్టాలు పెట్టాను.
ఇంకెప్పుడు అలా జరగదు నాకు బుద్ధి వచ్చింది. భర్త కలలో కనపడి రజనీ గురించి చాలా బాధపడుతున్నాడు. అందుకే నేను ఉండబట్టలేక ఇక్కడికి వచ్చాను నేను రజిని ని తీసుకొని వెళ్ళిపోతాను.
అందుకు భార్య భర్త ఇద్దరూ ఒకరి వైపు ఒక చూస్తూ అలా నిలబడిపోతారు అప్పుడు కళ్యాణి భర్త కళ్యాణ్ …. చూడండి అక్కయ్య మీరు మీ తప్పు తెలుసుకున్నారు కదా మీ అమ్మాయి ని తీసుకు వెళ్ళండి. కానీ ఒక్కటి మాత్రం గుర్తు పెట్టుకోండి చిన్న పిల్లలు దేవుడితో సమానం. వాళ్లని హింసిస్తే దేవుని హింసించి నట్టే.
అని అంటాడు అందుకు ఆమె చాలా బాధపడుతూ …. చెప్పాను కదా ఇంకెప్పుడూ నావల్ల పొరపాటు జరగదు . నేను రజనీని బాగా చూసుకుంటాను.అని చెప్పి అక్కడ నుంచి రజనీనీ తీసుకొని ఇంటికి వెళ్ళిపోతుంది. ఆ రోజు రాత్రి ఆ తల్లి కూతురు ఇద్దరూ నిద్రపోతారు ఆరోజు రాత్రి గడిచి పోతుంది.
ఆ మరుసటి రోజు ఉదయం వసంత నిద్రలేచి… ఒసేయ్ మొదారష్ట పు దానా ఇంకా నిద్ర లేవ లేదా ఏంటి. ఇంటిపని వంటపని ఎవడు చేస్తాడే మహారాణి లాగ పడుకున్నావ్వు. నీ అంటూ బక్కెట్ నిండా నీళ్లు తీసుకొచ్చి ఆమెపై కుమ్మరిస్తుంది.
వెంటనే రజిని నిద్రనుంచి మేలుకొని…. అయ్యో అమ్మ ఎందుకు ఇలా నా బట్టలు తడిపే సావు.
అందుకు ఆమె… నోరు మూసుకొని లేచి పనులు అన్నీ చెయ్.
అందుకు ఆమె … అమ్మ నేను కాసేపు పడుకుంటాను.
అందుకు ఆమె చాలా కోపంగా ఒక కర్ర తీసుకొని. రజిని కొడుతూ. … నిద్ర మత్తు పోవాలి. పని చేసేంతవరకు ఇలా కొడుతూనే ఉంటాను అంటూ తన ఇష్టం వచ్చినట్టుగా కొడుతూ ఉంటుంది.
అప్పుడు రజనీ ఏడుస్తూ…. అమ్మ కొట్టకు దయచేసి నన్ను కొట్టకు. నీకు పుణ్యం ఉంటుంది నాకు చాలా నొప్పిగా ఉంది అంటూ ఏడుస్తుంది.
అప్పుడు వసంత… అలా రా దారికి పని చెయ్ పో అంటూ ఆమెని కసురుకుంది ఆమె సరే అని చెప్పి ఇంటి ముందు శుభ్రం చేస్తుంది ఆ తర్వాత బట్టలన్నీ శుభ్రం చేసి ఇంటి బయట ఆర వేస్తుంది ఇంటి పని వంట పని కూడా తానే స్వయంగా చేస్తుంది.
ఆమె చాలా బాధ పడుతూ… మా అమ్మ మారిపోయింది అని చాలా సంతోషపడ్డాను. కానీ ఇలా ఎందుకు చేస్తుందో నాకు అర్థం కావడం లేదు.అంటూ బాధపడుతూ వుండగా అప్పుడే ఆమె అక్కడకు వచ్చి…. ఏంటే తెగ ఆలోచిస్తున్నావు.
మా అమ్మ మారి పోయింది కదా మళ్లీ ఎందుకు నన్ను ఇలా చిత్రహింసలు పెడుతుంది అనే నా.
హా.హా ఇలా చేయడానికి మూడు ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. సవతి తల్లి పిల్లను ఇంటి నుంచి బయటికి గెంటేసింది అనే మాట నాకు రాకూడదు. రెండోది నాకు పనులు చేసి పెట్టడానికి పని మనిషి ఎవరూ లేరు. అందుకే ఇక్కడికి నిన్ను తీసుకు వచ్చాను. ఇంక మూడవది…. ఇంకా మిగిలి ఉన్న ఆస్తులన్నింటినీ నేనే యజమానురాలు కావాలి. అందుకు నీ సంతకం కూడా అవసరం కానీ ఇప్పుడు కాదు 18 సంవత్సరాలు దాటేంత వరకు ఓపిక పట్టాలి దరిద్రాన్ని .
అంటూ ఆమెతో చెబుతూ ఉండగా అప్పుడే వాళ్ళ అత్త అక్కడకు వచ్చి దానిని అంతా విని….. చి చి నువ్వు మారిపోయావు అనుకుని చాలా సంతోషపడ్డాను అందుకే ఇక్కడికి వచ్చాను. నిజానికి నువ్వు చెప్పిన మాటల్లో ఏ ఒక్కటి వాస్తవం లేదని నాకు అర్థమైంది. నువ్వు చిత్రహింసలు పెడతావ్ అన్న భయంతోనే నేను ఇక్కడికి వచ్చాను.
ఛీ ఇంత లాగా ఒక ఆడది ప్రవర్తిస్తుంది అంటే నాకే సిగ్గుగా ఉంది.
అందుకు ఆమె… ఎవతివే నువ్వు మర్యాద ఇక్కడినుంచి వెళ్ళు. ఇక్కడ ఎవరున్నారు అని వచ్చావు. మర్యాదగా వెళ్ళు.
అందుకు కళ్యాణి…. నీ అంత గొప్ప నటి నువ్వు సినిమా ప్రపంచంలోనే కాదు ఎక్కడ ఉండరు. నీలాంటి ఆడదాని నరికి పోగులు పెట్టాలి. ముసలి కన్నీరు కార్చి ఎంత నటించావు. చి చి .
అంటూ ఆమెను అసహ్యంగా మాట్లాడుతుంది అందుకు ఆమె చాలా కోపంగా….. ఏం కుస్వావే . అంటూ ఆమెను కొడుతుంది.
ఆమె చాలా బాధ పడుతూ…. వదిన ఈ ఒక్కటే ఎందుకు జరగలేదా అనుకున్నాను అది కూడా జరిగిపోయింది చాలా మంచిది.
కానీ నీ స్వార్థం కోసం పసి పిల్లల్ని అడ్డంపెట్టుకుoతున్నవ్వు. ఇంకా అలా జరగనివ్వను రజనీ నేను తీసుకెళ్ళిపోతాను.
అంటూ ఆమె చేయి పట్టుకొని తీసుకు వెళ్తూ ఉండగా. ఆమె….
చూడు కళ్యాణి నా బిడ్డ నా దగ్గరే ఉంటుంది. అందులో ఎలాంటి మార్పు ఉండదు. కాదు కూడదని నువ్వు తీసుకువెళ్తే నా ప్రాణాలు తీసుకుంటాను.
అందుకు ఆమె…. ఆ పని చెయ్యి పీడా వదిలిపోతుంది అంటూ రజిని తీసుకొని వెళ్తుండగా.
వసంత కోపం వచ్చి తన చేతిలో ఉన్న కత్తిని కళ్యాణి పై విసురుతుంది అది గురి తప్పి రజనీ కాలికి తగిలిన గాయం అయి రక్తం కారుతూ ఉంటుంది.
రజినీ బాధపడుతూ…. మా నొప్పి నొప్పి. అబ్బా అంటూ అరుస్తూ ఉంటుంది.
దాన్ని చూసిన కళ్యాణి కోపంగా…. ఇప్పుడు నీ కళ్ళు చల్లబడయ్యా. ఎందుకు ఇంత ద్వేషాన్ని పెంచుకుంన్నావో నాకు అర్థం కావడం లేదు. నీవల్ల పసి ప్రాణం ఎంత అల్లాడి పోతుంది. నువ్వు మాత్రం కనికరం లేకుండా ప్రవర్తిస్తున్నావు.
అంటూ ఆమెను తిడుతూ రజిని ఎత్తుకుని
హాస్పిటల్ తీసుకెళ్తుంది రజనీ ఏడుస్తూ…. అత్త నాకు బ్రతకాలని వుంది. నా రక్తం చాలా పోయింది నీరసంగా ఉంది అత్త. దయచేసి నన్ను బ్రతికించు. నేను బాగా చదువుకోవాలి మా నాన్న కోరుకున్నట్టుగా డాక్టర్ కావాలి.
దయచేసి నన్ను కాపాడు అత్తయ్య అంటూ కన్నీరు కారుస్తోంది.
ఆమె మాటలకి కళ్యాణి చాలా ఏడుస్తూ….. అయ్యో పిచ్చిదానా నీకు ఏం కాదు. నువ్వేం భయపడకు నీకు తగిలింది చిన్న గాయం ప్రాణాలకు ప్రమాదం ఉండదు. అంటూ సర్దిచెప్పి హాస్పిటల్ తీసుకుంటుంది.
అక్కడ వైద్యురాలు ఆ పిల్లని గుర్తుపట్టి…ఏం జరిగింది కళ్యాణి అని అడుగుతుంది అప్పుడు ఆమె జరిగిన విషయం చెప్తోంది.
వైద్యురాలు…అయ్యో పాపం మరేం పర్వాలేదు నేను చూసుకుంటాను. అని లోపలికి తీసుకు వెళుతుంది కొంత సమయం తర్వాత బయటకు వచ్చి…. రక్తం చాలా పోయింది వెంటనే రక్తం ఎక్కించాలి . లేదంటే రజిని ప్రాణాలతో దక్కదు. ఏ పాజిటివ్ బ్లడ్ immediately కావాలి . మా దగ్గర ఆ గ్రూప్ఆ బ్లడ్ లేదు.
అని చెప్తుంది అందుకు ఆమె చాలా కంగారు పడుతూ….. అయ్యో డాక్టర్ ఇప్పటికిప్పుడు బ్లడ్ అంటే ఎక్కడ దొరుకుతుంది.
అని కంగారు పడుతూ ఉంటుంది.
డాక్టర్…మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక్కోండి. నేను కూడా ప్రయత్నిస్తాను.
అని అంటుంది అందుకు ఆమె సరే అని చెప్పి తన భర్త కి ఫోన్ చేసి జరిగిన విషయం చెప్తుంది.
దానిని విన్న అతను చాలా కంగారు పడుతూ
హాస్పిటల్ దగ్గరికి చేరుకుంటాడు ఆ తర్వాత ఏం జరిగిందో తరువాయి భాగంలో చూద్దాం.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *