గర్భవతి మేనత్త 3_ Telugu Stories- Stories in Telugu – Panchatantra Kathalu – Kattapa kathalu

రెండో భాగంలో రజనీకి తీవ్రమైన గాయం కావడంతో. కళ్యాణి హాస్పిటల్ తీసుకెళ్తుంది. అక్కడ జరిగిన విషయమంతా తన భర్తకు చెబుతుంది అతను హాస్పిటల్ దగ్గరికి వస్తాడు. అతను కళ్యాణి తో…

ఏ పాజిటివ్ బ్లడ్ నాది వెంటనే ఇచ్చేస్తాను. అని అంటాడు.
ఆ మాటలు విన్న కళ్యాణి చాలా సంతోషపడుతుంది. అతను రజనీకి బ్లడ్ ని దానం చేస్తాడు. అలా ఆ రోజు గడిచిపోతుంది.
రజనీ ఆరోగ్యం మెరుగుపడాలని కళ్యాణి భగవంతుని ప్రార్ధిస్తూ…. భగవంతుడా ఇంత చిన్న వయసులో రజనీకి ఎందుకు ఇన్ని కష్టాలు పెట్టావు. ఆమె తట్టుకోగలదా స్వామి . ఎలా అయినా నువ్వే ఆమె ప్రాణాలు కాపాడాలి. అంటూ దేవున్ని ప్రార్థిస్తూ ఉంటుంది ఆమె భర్త ఆమెతో…. నువ్వేం కంగారు పడకు. రజినీకి ఏమీ కాదు ఇంత దారుణానికి ఒడిగట్టిన ఆ వసంత పని చెప్తాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుండగా. ఆమె…. వద్దండి ఆమెను కదిలించవద్దు ఆమె అసలు మంచిది కాదు .
మనిషి ప్రాణాన్ని తీయడానికి సిద్ధ పడిందంటే ఆమె మనసు ఎంత కఠినoగా ఉందో అర్థమవుతుంది.
ఇంతలో డాక్టర్ అక్కడికి వచ్చి…..ఆమెకు రక్తాన్ని ఇచ్చి ఆ ప్రాణాలు కాపాడారు. కొంచెంసేపు తర్వాత ఆమె సృహలోకి వస్తుంది. నేను వెళ్లి చూడొచ్చు.
అని అంటుంది ఎందుకు వాళ్లు చాలా సంతోష పడతారు. కొంత సమయం గడుస్తుంది.
వాళ్ళిద్దరూ రజనీ దగ్గరికి వెళ్తారు.
రజిని ఏడుస్తూ…. అత్త నేను ఇంక మా అమ్మ దగ్గరికి వెళ్లాను నన్ను నీతో పాటే తీసుకువెళ్ళండి. అంటూ చాలా బాధ పడుతూ చెప్పింది.
అందుకు ఆమె… తప్పకుండా తీసుకెళ్తాను తల్లి. అని ఆమెకు ధైర్యం చెబుతుంది.
కొంత సమయం తర్వాత వసంత అక్కడికి వస్తుంది. వసంతం చూసిన వాళ్ళు చాలా కోపంగా ఉంటారు. వసంత…. అయ్యో భగవంతుడా నా వల్ల ఎంత పెద్ద పొరపాటు జరిగిపోయింది. నేను ఇంత పెద్ద పొరపాటు చేస్తాం అని అనుకోలేదు అంటూ బోరున ఏడుస్తుంది.
తను చూసిన కళ్యాణి….. ఇలా పైపైన నటించడానికి కొంచెమైనా సిగ్గు ఉండాలి.
ఇంత కసాయి దానికి అనుకోలేదు వదిన. నీకు మనిషిని చంపడానికి చేతులెలా వచ్చాయి.
నిన్ను చంపితే మీకు వచ్చే ఆనందం ఏమిటి.
అందుకు వసంత ఏడుస్తూ…. అమ్మ కళ్యాణ్ నన్ను క్షమించు ఏదో ఆవేశంలో అలా చేశాను. ఇంత జరుగుతుందని అస్సలు ఊహించలేదు . ఒక్కసారికి నన్ను క్షమించండి. అని బోర్న్ ఏడుస్తుంది. అప్పుడు కళ్యాణి భర్త…. అక్కయ్య ఇంక చాలు దయచేసి ఇక్కడి నుంచి వెళ్లండి మీ లాంటి వాళ్ళ నీడ కూడా మాకు వద్దు. ఆ ఇల్లు వూన్న డబ్బుతో
మీరే ఊరేగండి. రజిని మేము తీసుకెళ్లి పెంచుకుంటాం.
అందుకు వసంత….. లేదు బాబు లేదు నేను తీసుకెళ్తాను. ఆమెను కంటికి రెప్పలాగా నేను చూసుకుంటాను.అని అంటుంది ఆ మాటలు అన్నీ వింటున్నా రజిని ….. మామయ్య నన్ను మాత్రం మా అమ్మ దగ్గరికి పంపించవద్దు ఆమె నన్ను చంపేస్తుంది. అంటూ భయంతో వణికిపోతూ ఏడుస్తుంది.
వాళ్ళిద్దరూ ఆమెకు సర్దిచెప్పారు. కొంచెం సమయం తర్వాత వాళ్ళిద్దరూ వసంతని అక్కడ నుంచి పంపించేస్తారు.
రోజులు గడిచాయి రజినీ హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకు వెళ్తారు. వాళ్ల మామయ్య అత్తయ్య నన్ను బాగా చూసుకుంటారు.
వాళ్లకు పుట్టిన పాప ని కళ్యాణి అత్తయ్య జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది.
అలా ఉండగా ఒకరోజు కళ్యాణి అత్తయ్య….. అమ్మ కళ్యాణి రజనీ ఆరోగ్యం కుదుట పడింది కదా ఇంకా ఇంటికి పంపించండి ఇక్కడ ఎందుకు.
ఆమె..,. అత్తయ్య ఆమె ఎప్పుడు ఇంకా మన దగ్గరే ఉంటుంది ఇంటికి వెళితే. ఆ రాక్షసి బిడ్డని చంపేస్తుంది.
ఆమె…. అలా అని చెప్పి ఇక్కడే ఉంచుతారా ఎక్కడి వాళ్ళు అక్కడే ఉండటం చాలా మంచిది.
అప్పుడు కళ్యాణి…. అత్తయ్య రజిని చాలా మంచిది మీకు అక్కడ జరిగిన విషయం తెలియదు. మా వదిన నన్ను ఒంటరిగా వదిలేసి వెళితే అన్ని నెలలో నన్ను కంటికి రెప్పలా కాపాడుకొని రజిని. నా బిడ్డ ప్రాణాలు నా కాపాడింది ఆమె లేకపోతే మేమిద్దరం ఇప్పుడు ఇలా ఉండే వాళ్ళం కాదు.
ఎవరు ఏం చెప్పినా నేను రజినీ ఎక్కడికి పంపించను. ఆమె ఇక్కడే ఉంటుంది ఇక్కడ చదువుకుంటుంది.
అందుకు అత్తయ్య…. సరే అమ్మ నీ ఇష్టం కానీ ఆ వసంత వచ్చి గొడవ చేయకపోతే అంతే చాలు.అంటూ అక్కడి నుంచి వెళ్లి పోతుంది రోజులు గడిచాయి వసంత ఊరి పెద్దనీ తీసుకుని వాళ్ళ ఇంటికి వస్తుంది అక్కడ ఆ ఊరి పెద్ద వాళ్లతో… చూడండి ఆమె మీతో పాటు ఇక్కడ ఉండడం వసంత ఒప్పుకోవడంలేదు తల్లి బిడ్డ దగ్గరే ఉండాలి.
కళ్యాణి…. నిజమే కానీ కసాయి తల్లి దగ్గర ఏ బిడ్డ బ్రతక దు. సవతి తల్లి కాబట్టే ఇన్ని కష్టాలు పెడుతుంది. ఇప్పుడే ఆమె కోరుకుంటోంది. స్వర్గం అంచుల దాకా వెళ్లి వచ్చింది.మళ్లీ ఆక్కడికి వెళితే సరా సరి నరకంలోకి నేనే పంపించాను దాన్ని అవుతాను. నేను మాత్రం పంపించను.
ఊరిపెద్ద… అలా మాట్లాడితే ఎలా ఇప్పుడు వసంత ఒక్కటే ఒంటరిగా ఉంటుంది . తోడు ఎవరు లేరు ఆ బిడ్డ అన్నా ఉంటే తోడుగా ఉంటుంది. నా మాట విని ఆమెను పంపించండి.
అప్పుడు రజిని అక్కడికి వచ్చి…. మీకు దండం పెడతాను. నేను ఎక్కడికి వెళ్ళను నేను మా అత్తయ్య దగ్గరే ఉంటాను. నన్ను మాత్రమే అక్కడికి పంపించి వద్దు మా అమ్మ నన్ను చంపేస్తుంది. అంటూ ఏడుస్తూ చెప్తుంది .
ఆ మాటలు విన్న కళ్యాణి ఊరి పెద్ద తో….. చూశారుగా రజిని ఎలాగ భయపడుతోందో. అంటే ఆమె ఎంత కఠినంగా ప్రవర్తించే ఒక చిన్నపిల్ల ఇంతగా భయపడుతుందని. అంటూ జరిగిన విషయం చెప్తోంది.
అంతా విన్న ఊరిపెద్ద…. అమ్మ వసంత బిడ్డకు ఇష్టం లేకుండా నువ్వు బలవంతంగా తీసుకెళ్ళిన ఆమె నీ దగ్గర ఉండదు.
నా మాట విని ఇంక మనం వెళ్దాం పద.
ఆమె… కావాలంటే మీరు వెళ్ళండి నేను మాత్రం.ఇక్కడి నుండి నా బిడ్డనీ నేను తీసుకు వెళతాను.
అని అంటుంది. అందుకు ఊరిపెద్ద సరే అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు.
వసంత వాళ్ళ ఇంటి బయట కూర్చుని నిరాహార దీక్ష చేపడుతుంది.
అలా రెండు రోజులు గడిచాయి ఆమె ఆహారం నీళ్లు ముట్టుకోకుండా అక్కడ పడిపోతుంది.
అప్పుడు కళ్యాణి….. వదిన వదిన లే అంటూ ఆమెను పైకి లేపి…. కొంచెం నీళ్ళు తాగు.
అంటారు ఆమె…. నా బిడ్డని నాతోపాటు పంపిoతవరకు. నేను పచ్చి నీళ్లు కూడా ముట్టను. అని అంటుంది.
అందుకు ఆమె….. అరే వదిన నువ్వు నీళ్లు తాగు కొంచెం అన్నం తిను నేను రజనీని ఒప్పించి నీతో పాటు పంపిస్తాను.
అందుకు ఆమె….. నేను నిజంగా నేను మారిపోయాను. ఇంకెప్పుడు రజిని నీ ఒక్క మాట కూడా నన్ను నీ కాళ్లు పట్టుకుంటాను దయచేసి రజనీనీ నాతోపాటు పంపించు.
అని ప్రాధేయపడింది అందుకు ఆమె…చెప్పాను కదా పంపిస్తాను ముందు లోలల్ కి వెళ్దాం పద అంటూ ఆమెను లోపలికి తీసుకు వెళుతుంది. ఆమెకు భోజనం తినిపించిన తర్వాత. కళ్యాణి ఆమె భర్తతో…. ఏమండీ ఏం చేద్దాం మా వదిన నిజంగానే మారిపోయింది అంటారా. ఆమె వాలకం చూస్తుంటే నాకు మారిపోయినట్టి ఉంది.
భర్త… ఆమె అంతగా బాధపడుతుంది అంటే ఆమె తప్పు తెలుసుకొని బిడ్డను చక్కగా చూసుకుందాం అనుకుంటూ తన తప్పు సరిదిద్దుకో ఉంటుందేమో. ఒక అవకాశం కల్పిద్దాం ఈసారి తప్పు చేస్తే మాత్రం ఊరి పెద్దలు కాదు ఏకంగా పోలీస్ స్టేషన్ కి అప్ప చెబుతాను. అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు.
దాన్ని అంతా విన్న రజిని….. అమ్మో మా అత్తయ్య మావయ్య మా అమ్మ దగ్గరికి నన్ను పంపించి ఇలాగే ఉన్నారు. నేను ఆ నరకంలోకి వెళ్ళను. అక్కడికి వెళ్ళడం కంటే నేను చచ్చి పోవడం. చాలా మంచిది అనుకొని బాధపడుతూ ఉంటుంది.
అప్పుడే కళ్యాణి రజిని దగ్గరకు వచ్చి…. రజిని మీ అమ్మ మారిపోయింది కానీ నీ కోసం చాలా బాధపడుతుంది. నువ్వు ఆమె దగ్గరే ఉండు. ఆమెను నిన్ను బాగా చూసుకుంటుంది .సరేనా.రజిని…. అత్తయ్య మీకు నన్ను చంపేయాలని ఉంటే చంపేయండి. మీ చేతిలో సంతోషంగా చచ్చిపోతాను. అంతేకాని బలవంతంగా నన్ను మాత్రం అక్కడికి పంపించవద్దు మీ కాళ్లు పట్టుకుంటాను అంటూ ఆమె కాళ్ల పెట్టుకుంటుంది.
దాంతో చూస్తున్నా వసంత చాలా బాధపడుతుంది…. నా కూతురు నన్ను నమ్మటం లేదు. నేను మారిపోయాను నిజంగా నేను మారిపోయాను. నేను మారిపోయాననీ మీకు ఎలా చూపించాలి. అంటూ బాధ పడుతూ పరుగులు తీస్తూ …..నేను చచ్చిన తర్వాత నా శవాన్ని చూసి నా ప్రేమ నిజమని నమ్మండి అంటూ అక్కడే ఉన్న బావి లోకి దూకుతుంది. దాన్ని చూసిన కళ్యాణి భర్త వెంటనే బావిలోకి దిగి ఆమెను బయటకు తీసుకు వస్తాడు. ఆమె పొట్ట ను గట్టిగా వత్తి నీటిని బయటికి తీస్తారు.
ఆమె దగ్గుతూ…. ఎందుకు నన్ను కాపాడు తమ్ముడు నేను చచ్చిపోతే నా కూతురు నన్ను నమ్మేదిఏమో. ఏ తల్లికి ఇలాంటి కష్టం రాకూడదు.నేను తప్పు చేశాను అది నేను ఒప్పుకుంటున్నాను. చేసిన తప్పు సరిదిద్దుకోవడం కోసమే నాకు అవకాశం కల్పించమని అడుగుతున్నాను.
నా కూతురీ నాతోపాటు పంపించండి మీకు పుణ్యం ఉంటుంది . అంటూ ఏడుస్తుంది అదంతా చూస్తున్నా రజిని తన తల్లిని హత్తుకొని…. అమ్మ నన్ను క్షమించు కేవలం మీ వల్ల భయం తో నేను అలా మాట్లాడాను నువ్వు ఇలా చేస్తావని అనుకోలేదు. నన్ను క్షమించమ్మా. అంటూ ఏడుస్తుంది అందుకు తల్లి సంతోషపడుతూ…. ఇప్పటికైనా నా ప్రేమ నీకు అర్థం అయిందా అమ్మ అదే చాలు.
అంటూ సంతోషపడుతుంది ఆ రోజు గడిచి పోతుంది. ఆ మరుసటి రోజు ఉదయం
ఆ తల్లీ కూతుళ్లు ఇద్దరూ వాళ్లతో…. ఇంక మేము వెళ్ళొస్తాము. అని అంటారు అందుకు వాళ్ళు జాగ్రత్తలు చెబుతారు.
ఇంకా ఆ తర్వాత తల్లీ కూతుళ్లు ఇద్దరూ అక్కడినుంచి బయలుదేరుతారు. వాళ్లు ఇంటికి వచ్చిన తర్వాత. వసంత ఆమెను చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటుంది.
ఆమె కూడా తన తల్లితో చాలా సంతోషంగా జీవితాన్ని గడుపుతుంది. అలా రోజులు గడచాయి ఒకరోజు ఒక వ్యక్తి వాళ్ళ ఇంటికి వస్తాడు అతను వసంత తో….. అమ్మాయి మనసంతా నీ కూతురు ఎక్కడుంది.
అందుకు వసంత… చెప్పండి బాబాయ్ నా కూతురు ఆడుకోడానికి బయటికి వెళ్ళింది.
చాలా రోజుల తర్వాత ఇక్కడికి వచ్చారు ఎందుకు.
అందుకు అతను….. నీకు ఒక శుభవార్త చెప్పడానికి వచ్చాను తల్లి.
అందుకు ఆమె…. ఏంటది బాబాయ్ చెప్పు.
ఎందుకు అతను…. పక్క ఊర్లో కిరణ్ అనే ఒక ధనవంతుడు ఉన్నాడు. అతను నిన్ను చూశాడఅంట. అది నిన్న బాగా ఇష్టపడతాడు. ఆ విషయం చెప్పమని ఇక్కడికి పంపించాడు.
అందుకు ఆమె చాలా…. బాబాయ్ ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థం అర్థమవుతుందా నాకు పెళ్లయింది . నా భర్త చనిపోయాడు. నాకు ఒక కూతురు ఉంది.
అవన్నీ తెలిసి కూడా మీరు నాతో ఇలా మాట్లాడం అస్సలు బాలేదు.
అందుకు అతను…. అవన్నీ అతనికి తెలుసు అమ్మ. అందుకు అతను అంగీకరించాడు కూడా అయినా ఆ పాప నీకు పూట్టలేదు కదా . నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో
నీ మంచి కోసమే చెప్తున్నా నువ్వు అతన్ని చేసుకుంటే. నిన్ను పాపని బాగా చూసుకుంటాడు. ఆలోచించుకో అని అంటాడు ఆ తర్వాత ఏం జరిగిందో తరువాయి భాగంలో చూద్దాం.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *