గర్భవతి మేనత్త 4_ Telugu Stories- Stories in Telugu – Panchatantra Kathalu Kattapa kathalu

మూడో భాగంలో వసంతతో బాబాయ్ అక్కడికి వచ్చి ఆమెతో కిరణ్ అనే వ్యక్తి గురించి చెబుతూ ఉంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో ఈ భాగంలో తెలుసుకుందాం.

ఆ మాటలన్నీ వింటున్నా వసంత …. బాబాయ్ ఆలోచించడానికి ఏమీ లేదు.దయచేసి ఈ మాట గురించి ఎవరితో అనకండి నలుగురు నాలుగు విధాలుగా నవ్విపోతారు.
ఆ మాటలు వింటున్న అతను ….. ఇందులో నవ్వడానికి ఏముంటుందమ్మ.నీకు ఒక మంచి జీవితాన్ని అతను ప్రసాదిస్తున్నాడనీ అందరూ గొప్పగా అతని గురించి చెప్పుకుంటారు.
ఆ మాటలన్నీ అప్పుడే రజనీ చాటుగా వింటుంది ఆమె తన మనసులో…. నిజమే మాకు మగదిక్కు లేదని అందరూ అలుసుగా చూస్తున్నారు.
మాక్కూడా తోడు ఉంటే మాకు కష్టాలు ఉండవు. అనీ అనుకోని అక్కడి నుంచి వెళ్లి పోతుంది. వసంత వాళ్ళ బాబాయ్ తో…. బాబాయ్ నా నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదు దయచేసి ఈ విషయాన్ని అతనికి చెప్పండి అని అతన్ని పంపి చేస్తుంది.
రజిని సరాసరి వాళ్ళ మేనత్త ఇంటికి వెళ్లి వాళ్ళ మేనత్త తో ఆ ఇంట్లో జరిగిన విషయమంతా చెప్పి వాళ్లతో …. నిజమే కదా అత్త మాక్కూడా ఎవరైనా తోడు ఉంటే బాగుంటుంది. ఇంత మంచి అవకాశం మా అమ్మ వద్దంటోంది. మీరైనా మా అమ్మకి చెప్పండి మీ మాట వింటుంది ఏమో.
అని అంటుంది. అందుకు మేనత్త….. సరే అమ్మ చెప్తాము. అని రజనీతో కలిసి ఇంటికి వెళ్తుంది. అక్కడ కళ్యాణి వసంత తో….. వదిన ఇందాక మీరు మాట్లాడుకుంటూ అన్ని మాటలు రజిని విన్నది ఆ విషయమే నాకు చెప్పింది. అందుకే హడావిడిగా బయలు దేరి వచ్చాను. నీకు మగ తోడు అవసరం కదా. అన్నిటికీ ఆ భగవంతుడే ఉన్నాడు అనుకోని నా మాట విని అతన్ని పెళ్లి చేసుకో. అని అంటుంది అందుకు ఆమె…. ఏంటి కళ్యాణి నువ్వు మాట్లాడేది. ఈ విషయం సమాజానికి తెలిస్తే నవ్వి పోతుంది. నాకు ఇష్టం లేదు నన్ను బలవంతం చేయొద్దు.
అప్పుడు ఆమె…. వదిన నేను ఎందుకు చెప్తున్నాను విను నీకు రజనీకి ఆయన తోడుగా ఉంటాడు. మీరు సమాజంలో తల ఎత్తుకొని బ్రతకొచ్చు. అందరికీ మీరు ఆదర్శం గా ఉంటారు. అంతేగాని ఎవరు తప్పుగా అర్థం చేసుకోరు ఎవరు మీ వైపు వేలెత్తి చూపారు అంటూ నచ్చ చెబుతుంది.
అప్పుడు ఆమె దాని గురించి ఆలోచిస్తూ ఉండగా ఇంతలో కిరణ్ అక్కడికి వచ్చాడు.
కిరణ్ ఆమెతో… చూడు వసంత నేను నిన్ను చేసుకోవాలనుకున్నాను. నాకు చాలా డబ్బు ఉంది. చాలా పేరుంది. నేను నిన్ను పెళ్లి చేసుకుని నీకు మంచి జీవితాన్ని ఇస్తాను. నిన్ను పాపని బాగా చూసుకుంటాను. నా మాట నమ్ము అని ప్రాధేయపడతాడు.
అందుకు ఆమె సరే అంటుంది. కొన్ని రోజులు గడిచాయి మంచి ముహూర్తం లో వాళ్ళిద్దరికీ పెళ్లి జరిగి పోతుంది.
రజిని కిరణ్ వసంత ముగ్గురు సంతోషంగా ఉంటారు అలా ఉండగా ఒకరోజు కిరణ్…. వసంత నా జీవితం చాలా సంతోషంగా ఉంది కదా కొన్ని రోజులు మనం ఎక్కడికైనా వెళ్లొద్దామా.
వసంత…. ఎక్కడికి వెళ్దాం
కిరణ్…. ఎక్కడికైనా దూరంగా మనిద్దరం మాత్రమే ఉండేలాగా వెళ్దాం.
వసంత…. అయ్యో మన ఇద్దరం అంటే ఎలా మరి రజినీ సంగతేంటి.
అందుకు అతను…. కొన్ని రోజులే కదా వాళ్ళ అత్త వాళ్ళ ఇంట్లో వదిలి పెడతాం. మనం తిరిగి వచ్చిన తర్వాత మళ్లీ ఇక్కడికి వస్తుంది కదా.ఏమంటావు అని అడుగుతాడు అందుకు ఆమె సరే అంటుంది. రజిని వాళ్ళ మేనత్త ఇంట్లో వదిలి పెడతారు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ వేరే ఊరికి వెళ్తారు. వాళ్లు కార్ లో హాయ్ తిరుగుతూ సంతోషంగా వాళ్ళ కాలం గడుపుతూ ఉంటారు. అక్కడ రజనీ తన మేనత్త కూతురు తో ఆడుకుంటూ సంతోషంగా గడుపుతూ ఉంటుంది రోజులు గడిచాయి. వాళ్ళు ఇంకా తిరిగి రాకపోవడంతో కళ్యాణి కి అనుమానం వచ్చి తన భర్తతో…. ఏమండీ వెళ్ళినవాళ్ళు ఇంతవరకూ తిరిగి రాకపోవడం ఏంటి నాకు ఎందుకు అనుమానం గా ఉంది. అని అంటుంది అందుకు అతను…. సరే ఒకసారి ఫోన్ చేసి చూడు.
అందుకామె…. వాళ్లు ఏమనుకుంటారో అని ఆగుతున్నాను లేదంటే ఎప్పుడో చేసేదాన్ని.
భర్త… ఏం కాదు ఒకసారి ఫోన్ చేసి చూడు అని అంటాడు అందుకు ఆమె సరే అని చెప్పి ఫోన్ చేస్తుంది కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది
వాళ్లు చాలా కంగారుపడుతూ….. ఒకసారి వెళ్లి చూస్తే పోతుంది అని ఆ ఇంటికి వెళ్తారు.
అక్కడ అతను ఆమెను కొడుతూ…. నీకు ఎన్ని సార్లు చెప్పాను. రజిని మాట ఇక్కడ మాట్లాడొద్దని ఒకసారి చెప్తే నీకు అర్థం కావడం లేదా. అదంతా చూసిన కళ్యాణి మరియు ఆమె భర్త….. ఎందుకు ఆమెని ఆలా కొడుతున్నారు ఏం జరిగింది. అని అడుగుతారు అతను ఏం మాట్లాడకుండా అక్కడనుంచి వెళ్ళి పోతాడు .
కళ్యాణి వసంతతో….. అసలేం జరిగింది వదిన మి ఇద్దరి మధ్య ఎందుకు గొడవ మొదలైంది.
అప్పుడు ఆమె ఏడుస్తూ…. ఏం లేదు కళ్యాణి మేము కొద్ది రోజులు సంతోషం గడుపుదాం అనుకున్నాము కదా. నిజానికి ఆయన నన్ను రజనీ దూరం చేయడానికి చూస్తున్నాడు. ఆయన పెళ్లికాకముందు మనకి చెప్పింది అంతా అబద్ధం.కేవలం నన్ను పెళ్లి చేసుకోవడానికి మాత్రమే ఆయనకు ఇష్టం రజినీ చూసుకోవడం కాదు. ఆ విషయమే నాతో అన్నాడు.
మేమిద్దరం అక్కడ ఏకాంతం గా ఆ సమయంలో అతను నాతో…. వసంత ఇప్పుడు మన ఇద్దరం చాలా సంతోషంగా ఉన్నాము కదా. మధ్యలో రజిని ఎందుకు. రజిని మన బిడ్డ కాదు. మనకి బిడ్డ పుట్టిన తర్వాత మనం సంతోషంగా ఉండొచ్చు. నా మాట విని రజినినీ వాళ్ళ మేనత్త దగ్గర వదిలిపెట్టు.
అని అన్నాడు ఆ మాటలు విన్న నేను…. ఏం మాట్లాడుతున్నారు మీరు. నన్ను రజనీని బాగా చూసుకుంటాను అన్నారు కదా మరి ఇప్పుడు ఎందుకు ఈ లా మాట్లాడుతున్నారు .
కిరణ్…. అసలు నిన్ను పెళ్లి చేసుకోవడం కోసమే ఇదంతా నాటకం ఆడను నాకు రజనీని చూసుకోవడం ఏ మాత్రం ఇష్టం లేదు మరి మీరు సంతోషంగా ఉండాలి.
అని తేల్చి చెప్పాడు అందుకు నేను ఏడుస్తూ…. అలా అయితే నేను రజినీ తోనే ఉంటాను .వదిలి పెట్టి నేను ఇక్కడికి తిరిగి వచ్చాను. అతను కూడా నా వెనక ఇక్కడికి వచ్చాడు. నేను రజనీని తీసుకురావడం కోసమే మీ దగ్గరికి బయలుదేరబోతున్నాను. ఇందులో అతను నన్ను అడ్డుకుని చిత్రహింసలు పెడుతున్నాడు. అంటూ బోరున ఏడుస్తుంది కళ్యాణి భర్త…. అతని ఇదంతా కావాలనే చేశాడని నాకు అస్సలు అర్థం కాలేదు. అక్కయ్య మనo ఇంటికి వెళ్లి పోదాం పదండి .
అప్పుడే కిరణ్ అక్కడికి వచ్చి….. ఎక్కడికి వెళ్ళేది మర్యాదగా మీరు ఎక్కడి నుంచి వెళ్లండి లేదంటే నేనేం చేస్తానో నాకు తెలియదు అంటూ పెద్ద పెద్దగా అరవడం మొదలు పెడతాడు. అదే ఒక అప్పుడు చూసి వాళ్లు భయపడి అక్కడినుంచి వెళ్ళిపోతారు
ఇంటిదగ్గర రజిని…. మామయ్య అత్తయ్య మా అమ్మ నాన్న వచ్చారా. అని అమాయకంగా అడుగుతుంది అందుకు వాళ్ళకి ఏం చెప్పాలో అర్థంకాక…. ఇంకా రాలేదమ్మా వచ్చినవెంటనే నిన్ను తీసుకు వెళతారని ఫోన్ చేశారు అప్పటివరకు నువ్వు ఇక్కడే ఉండొచ్చు. అని అంటారు అందుకు ఆమె…. మరి ఏం పర్వాలేదు మావయ్య నేను పాప తో ఆడుకుంటూ సంతోషంగా ఉన్నాను.
అని అక్కడి నుంచి వెళ్లి పోతుంది వాళ్ళిద్దరు ఒకరికి ఒకరు చూసుకుని చాలా బాధపడుతుంది….. మనం తప్పు చేశాము. వసంతని కిరణ్ కి ఇచ్చి పెళ్లి చేయకుండా ఉండాల్సింది. ఇప్పుడు రజనీ కారణంగా ఆమె కూడా చాలా ఇబ్బంది పడుతుంది. వాడు మనిషి లాగా ప్రవర్తించడం లేదు పశువు లాగా ప్రవర్తిస్తున్నాడు. అంటూ బాధపడుతూ చెప్తూ ఉండగా. కళ్యాణి… అవునండి పెద్ద పొరపాటు చేసాము మనం పోలీస్ కేసు పెడతాం. చచ్చినట్టు అతను దారికి వస్తాడు.
భర్త…. అతని దగ్గర డబ్బు చాలా ఉంది . అతనికి తెలిసిన వాళ్లు కూడా చాలామంది ఉన్నారు. కేసు పెట్టిన మనకి సరైన న్యాయం జరుగుతుందని నమ్మకం జరుగుతుందన్న నమ్మకం లేదు.
అని అనుకుంటూ మాట్లాడుకుంటూ ఉండగా రజినీ దాన్ని అంతా విని …. అంటే నాన్నకి నన్ను చూసుకోవడం ఇష్టం లేదన్న మాట. నా వల్ల అమ్మని ఇబ్బంది పెడుతున్నాడు. నా వల్ల అందరికీ కష్టాలే అసలు నేనంటూ లేకపోతే ఏ గొడవ ఉండదు. అనుకుని బాధపడుతూ ఉంటుంది. ఆ రోజు అందరూ నిద్రిస్తుండగా రజిని నిద్రనుండి లేచి వాళ్ళ అత్తయ్య దగ్గరకు వెళ్లి. ఆ పాదాలకి నమస్కరించి….. అత్తయ్య మీరు నన్ను ఇప్పటిదాకా చాలా బాగా చూసుకున్నారు నా వల్ల మీ అందరికీ కష్టాలే. అందుకే మీ అందరికీ దూరంగా మా అమ్మ నాన్న దగ్గరికి వెళ్లి పోతున్నాను. ఇలా చేస్తున్నందుకు నన్ను క్షమించండి. అంటూ అక్కడి నుంచి ఏడ్చుకుంటూ బయటకు వస్తుంది. ఆమె రాత్రి వేళ రోడ్డు మీదకు వస్తుంది అటూ ఇటూ చూస్తూ ఉండగా . ఎదురుగా ఆమెకు ఒక కారు వేగంగా రావడం గమనిస్తుంది. ఆమె…. అమ్మ నాన్న నేను మి దగ్గరికి వచ్చేస్తున్నాను అక్కడ మనం అందరం సంతోషంగా ఉందా. అంటూ వాళ్ళ అమ్మానాన్న నీ గుర్తు తెచ్చుకుంటుంది అప్పుడే అక్కడికి కారు రాగానే ఆ కారుకు అడ్డంగా పరిగెడుతుంది.
ఆ కారు వ్యక్తి ఆమెను ఢీ కొంటాడు.
రజిని చాలా పెద్దగా అరిచి కింద పడిపోతుంది. ఆమె రక్తపు మడుగులో గిలగిలా కొట్టుకుంటూ ఉంటుంది ఆ కారులో ఉన్న వ్యక్తి అక్కడికి వచ్చి ఆమెను చూసి చాలా కంగారుగా…. జాగ్రత్త పోయింది అంటూ ఆమెను కారులో తీసుకెళ్లి హాస్పిటల్లో చేరుస్తాడు. అక్కడ డాక్టర్….. అయ్యో ఏమైంది రజినీకి. అని అడుగుతాడు అందుకు అతను జరిగిన విషయం చెప్తాడు.
ఆమె చాలా బాధ పడుతూ…. ఇలా జరగడం ఇది రెండోసారి ఎందుకు రజనీకి అన్నీ నష్టాలే. భగవంతుడా అంటూ భగవంతుని ప్రార్ధిస్తూ ఆమెకు చికిత్స మొదలుపెడుతుంది. ఆమెకు చికిత్స చేయడం పూర్తయిపోతుంది.
ఆమె బయటకు వచ్చి అతనితో…. ప్రాణానికి ఏం ప్రమాదం లేదు. సరైన సమయానికి తీసుకువచ్చారు. ఈ విషయం వాళ్ళ అత్త మావయ్య కి తెలియజేస్తాను. మీరు వెళ్ళండి.
అంటాడు అందుకు అతను…. ఈ పాప గురించి నాకు పూర్తి వివరాలు కావాలి.
అని అడుగుతాడు అందుకు ఆమె…. ఎందుకండీ అని ప్రశ్నిస్తుంది అందుకు అతను…. నీకు వివరంగా చెప్తాను ముందు ఈ అమ్మాయి గురించి నాకు పూర్తిగా చెప్పండి. అందుకు ఆమె తనకు తెలిసిన కొంత ఈ విషయాన్ని అతనికి తెలియజేస్తుంది. దాన్ని విన్న అతను చాలా ఆశ్చర్యపోతాడు. ఆరోజు గడిచిపోతుంది ఆ మరుసటి రోజు ఉదయం కళ్యాణి రజనీ కోసం వెతుకుతూ ఉంటుంది. కానీ రజనీ ఎక్కడా కనిపించదు. ఆమె చాలా కంగారు పడుతూ తన భర్తకి చెప్తుంది. దాన్ని విన్న అతను కూడా చాలా కంగారు పడుతూ వెతకడం మొదలు పెడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తర్వాతి భాగంలో చూద్దాం.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *