గర్భవతి మేనత్త 5_ Telugu Stories- Stories in Telugu – Panchatantra Kathalu Kattapa kathalu

నాలుగో భాగం లో రజిని హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఉంటుంది. ఆమె ఎక్కడికి వెళ్లిందో అని వాళ్ళ అత్త మామయ్య వెతుకుతూ ఉంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో ఈ భాగంలో చూద్దాం. కళ్యాణి ఆమె భర్త ఇద్దరు రజనీ కోసం వెతుకుతూ ఉండగా. రజినినీ హాస్పటల్ లో చేరిన వ్యక్తి వాళ్ల దగ్గరకు వచ్చి జరిగిన విషయం చెప్తాడు.

దానిని విన్న కళ్యాణి ….. అయ్యో భగవంతుడా ఎంతపని జరిగిపోయింది. త్వరగా పదానికి హాస్పిటల్ కి వెళ్దాం. అంటూ కంగారు పడుతూ ముగ్గురు కలిసి హాస్పటల్కి బయలుదేరుతారు.
ముగ్గురు అక్కడికి వెళ్లినప్పటికీ అక్కడ రజనీ కనిపించదు. వాళ్లు ఆమె గురించి డాక్టర్ అడుగుతారు డాక్టర్…. ఏమో అండి నేను ఇక్కడే ఉన్నాను ఆమె విశ్రాంతి తీసుకుంటోంది ఇంతలోనే ఏమైపోయిందో నేను చూడలేదు అంటూ సమాధానం చెబుతుంది. కళ్యాణి ఆమె భర్త ఆ ధనవంతులైన వ్యక్తి ముగ్గురు ఆమె కోసం వెతకడం మొదలు పెడతారు.
దాన్ని అంత దూరం నుంచి గమనిస్తున్న. రజిని ఏడుస్తూ…. అయ్యో భగవంతుడా నువ్వు మళ్లీ నన్ను ఎందుకు బతికించావ్వు. వీళ్ళు నా కోసం కంగారుపడి వెతుకుతున్నారు. నేను మళ్ళీ వాళ్ళకి కనిపించి వాళ్ళకి సుఖం లేకుండా చేయలేను. నా బతుకు నేను బతుకుతా అంటూ చాలా బాధపడుతూ వాళ్లకు కనిపించకుండా అటుగా పరుగులు తీస్తుంది.
వాళ్ళు ఆమె కోసం వెతుకుతూ ఉంటారు ఆమె మాత్రం ఎక్కడా కనపడదు అలా రోజులు గడిచాయి. రజిని ఆ గాయాలతో నే నడుచుకుంటూ ఒక చిన్న పల్లెటూరు కి చేరుకుంటుంది.
ఆమె ఒక చోట కూర్చొని …. చాలా దాహంగా ఉంది. భగవంతుడా ఇక్కడ ఎక్కడైనా నీళ్లు దొరికితే బాగుండు. అనుకుంటే భగవంతుని ప్రార్ధిస్తూ ఉండగా అటుగా మల్లిక అనే అమ్మాయి మంచి నీటిని బాటిల్ తీసుకుని వెళుతూ ఉంటుంది.
దాన్ని చూసిన రజిని….. ఓ అమ్మాయి ఇటు చూడు ఇటు చూడు అంటూ కేకలు వేస్తోంది.
మల్లికా రజనీని చూసి అక్కడికి వచ్చి… ఏం కావాలి ఎందుకు నన్ను పిలిచావ్వు.
రజిని….నాకు చాలా దాహంగా ఉంది నీ చేతిలో ఉన్న నీటిని ఇస్తావా అని జాలిగా అడుగుతుంది. ఎందుకు మళ్ళక … ఇదిగో తీసుకో అంటూ తన చేతిలో ఉన్న బాటిల్ ని ఇస్తుంది.
రజిని నీటిని తాగి తన దాహాన్ని తీర్చుకుంటుంది.
అప్పుడు మల్లికా ఆమెతో…. నువ్వు ఎవరో ఇక్కడ ఒంటరిగా ఎందుకు కూర్చున్నావ్. పైగా తలకి కట్టు గాయాలు ఏంటి .
మీది ఏ ఊరు అని అడుగుతుంది.
రజిని చాలా బాధ పడుతూ … నాకు అమ్మానాన్న ఎవరు లేరు. నేను చాలా దూరం నుంచి వస్తున్నాను. వచ్చే దారిలో చిన్న ప్రమాదం జరిగింది . హాస్పిటల్లో కట్టు కట్టారు . ఆ తర్వాత నడుచుకుంటూ ఇంటికి వచ్చాను ఇక్కడ ఏదైనా పని దొరికితే పని చేసుకుని బతుకుతాను. నాకు డబ్బు కూడా అవసరం లేదు రెండు పుట్ల అన్నం పెడితే అదే చాలు. అని చాలా జాలిగా అడుగుతుంది మల్లికా…. అయ్యో బాధపడకు నీగురించి మా అమ్మకి చెప్తాను నేను మా పొలం దగ్గరికి వెళ్తున్నాను మా అమ్మ అక్కడే ఉన్నారు మా అమ్మకు నీ గురించి చెప్తాను నాతో పాటు వస్తావా. అని అడుగుతుంది అందుకు రజిని సరే అంటుంది. ఇద్దరూ కలిసి ఆ పొలం దగ్గరికి వెళ్తారు. అక్కడ అ మల్లికా తన తల్లికి రజిని గురించి చెప్తుంది.
అప్పుడు తన తల్లి ఆమెపై జాలిపడి…. బాధ పడకమ్మా నిన్ను నా బిడ్డ లాగా చూసుకుంటాను. పెళ్లి ఆ చెట్టు కింద కూర్చో . కాసేపటి తర్వాత అందరం కలిసి అన్నం తిందాం.
అందుకే రజనీ సరే అని చెప్పి అక్కడే ఉన్న చెట్టు కింద కూర్చుంది.
ఆ తర్వాత వాళ్లిద్దరూ ఏం చేస్తున్నారఅ
ని చూస్తూ ఉండగా మల్లిక ఎద్దు లాగా కావిడీ వేసుకొని పొలం దున్నుతూ ఉంటుంది తన తల్లి ఆమెకు సహాయం చేస్తూ వెనుక ఉంటుంది. దాన్ని చూసిన రజనీ కళ్ళ వెంబడి నీళ్ళు తిరుగుతాయి. ఆమె వెంటనే వాళ్ల దగ్గరికి వెళ్లి….. అమ్మ ఏంటి ఇలా కష్టపడుతున్నారు మీకు సాగు చేయడానికి ఎద్దుల కానీ టాక్టర్ కానీ లేదా.
అందుకు మల్లిక తల్లి రమాదేవి…. లేదమ్మా
మాకు ట్రాక్టరు ఎద్దులు చాలా ఉండేది కానీ పోయిన సంవత్సరం వీళ్ళ నాన్న పంటలు వేశాడు. పంట చేతికి వస్తుంది అన్న సమయానికి తీవ్ర వరదలు వచ్చి పంటంతా నేలపాలు అయ్యింది. పొలం మీద చాలా అప్పు చేశాడు నా భర్త వాటిని తీర్చడం కోసం ఎద్దుల నీ ట్రాక్టర్ ని అమ్మేశాడు. ఇంకా చాలా అప్పు మిగిలింది. అప్పులవాళ్ళు ఇంటి మీదకు రావడం తో ఏం చేయాలో అర్థం కాక నా భర్త పురుగుల మందు తాగి చనిపోయాడు. అంటూ బోరున ఏడుస్తుంది.
ఆ మాటలు విన్న రజిని చాలా బాధ పడుతూ…. అయ్యో ఊరు కొండమ్మ. బాధపడకండి. అని అంటుంది అందుకు మల్లి కా…. బాధ పడితే ఏం చేయాలి. మాకు చచ్చేంత ధైర్యం లేదు బతకాలి అంటే అప్పులు తీర్చాలి. అప్పులు తీర్చాలి అంటే పొలం సాగు చేయాల్సిందే. అందుకే ఇలా కష్టపడుతున్నాము అంటుంది.
రజిని…. మీ కష్టాల్లో నేను కూడా పాలు పంచుకుంటాను. నన్ను కూడా పొలం సాగు చేయనివ్వండి.
రమాదేవి… వద్దమ్మ ఈ కష్టం నీకెందుకు పైగా నువ్వు చాలా నీరసంగా ఉన్నావు ఒంటినిండా గాయాలు ఉన్నాయి.వద్దు తల్లి వద్దు నువ్వు వెళ్ళి విశ్రాంతి తీసుకో. మా తంటాలు మేము పడతాము.
రజిని…. లేదమ్మా నేను కూడా మీతో ఉంటున్నాం అంటే మీ కుటుంబ సభ్యులనే కదా నన్ను కూడా సహాయం చేయండి కాదు అనకండి అని బ్రతిమిలాడు తుంది.
అందుకు ఆమె కాదు అన్న లేకపోవడంతో మల్లికా రజిని ఇద్దరూ కలిసి పొలాన్ని దున్నడం మొదలు పెడతారు.
అలా వాళ్ళు ఇద్దరూ చాలా సమయం వరకు పొలాన్ని దున్నుతారు.
ఆ తర్వాత ముగ్గురు ఒకచోట కూర్చొని భోజనం చేస్తారు అప్పుడు రమాదేవి…. అమ్మ నీ పేరేంటో చెప్పలేదు.
అందుకు ఆమె… నా పేరు రజిని. అని అంటుంది అందుకు ఆమె…. మంచి పేరు . నువ్వు చాలా మంచి దానివి నీ కన్న తల్లిదండ్రులు ఎక్కడున్నారో కానీ నీలాంటి కూతురుని కన్నందుకు వాళ్లు చాలా అదృష్టవంతులు నిన్ను చూసి వాళ్ళు చాలా సంతోష పడతారు.
రజిని…. సంతోషపడే వాళ్లేమో . కానీ దాన్ని చూసే లోపే భగవంతుడు నా నుంచి వాళ్లని దూరం చేశాడు. అంటూ బోరున ఏడుస్తుంది రమాదేవి…. అయ్యో బాధపడకు తల్లి. ఎవరూ లేకపోతే ఏమి నేనున్నాను కదా నన్ను ఓ తల్లి లాగా భావించు. నేను ఈరోజు నుంచి నీకు తల్లిని. అటు ధైర్యం చెబుతుంది. ఆ మాటలు విన్న రజిని చాలా సంతోషపడుతుంది. ఆ తర్వాత మళ్లీ వాళ్లు వాళ్ళ పని చేసుకుంటారు సాయంత్ర వేల కావడంతో ముగ్గురు కలిసి అక్కడి నుంచి ఇంటికి వెళ్తారు. ఇంటిదగ్గర వాళ్ళు చాలా సేపు కబుర్లు చెప్పుకుని అందరూ కలిసి భోజనం చేసి విశ్రాంతి తీసుకుంటారు.
ఆ రోజు అలా గడిచి పోతుంది.
ఆ మరుసటి రోజు ఉదయం రజిని అందరికంటే ముందు లేచి ఇంటి పనంతా చేస్తుంది. అలాగే వంట పని కూడా తయారు చేస్తూ ఉంటుంది అప్పుడే . రమాదేవి నిద్ర నుంచి లేచి…. రజిని ఏంటమ్మా ఇంత పొద్దున్నే లేచి పని మొత్తం చేస్తున్నావు.
రజిని…. మరేం పర్వాలేదు అమ్మ నాకు ఉదయాన్నే లేవడం అలవాటు. మీరు కావాలంటే విశ్రాంతి తీసుకోండి పని అంతా అయిపోయింది. కొంచెం సేపు ఉన్న తర్వాత మనం పొలానికి వెళ్లొచ్చు.
ఆ మాటలు విన్న రమాదేవి చాలా సంతోషపడుతుంది….. నా బంగారు తల్లి నువ్వు నా కడుపున ఎందుకు పుట్టలేదని బాధ పడుతున్నాను. మల్లికా కూడా ఇలాగే చేసేది. కానీ ఆమె ఆరోగ్య పరిస్థితి ఈ మధ్య సరిగా లేదు. అయినప్పటికీ కుటుంబం కోసం కష్టపడుతూనే ఉంది ఈ కష్టం నుంచి భగవంతుడు ఎప్పుడు మమ్మల్ని గట్టేక్కిస్తాడో ఏమో.
అంటూ చాలా బాధపడుతుంది రజిని…. మంచి రోజులు తప్పకుండా వస్తా యి అమ్మ
అప్పటి వరకూ ఎదురు చూస్తూ ఉండాలి.
అని ఆమెకు ధైర్యం చెబుతుంది. కొన్ని రోజులు గడిచాయి .ఆ ముగ్గురు వాళ్ళ వాళ్ళ పనులు చేసుకొని .
భోజనం తీసుకొని మళ్లీ పొలానికి వెళ్తారు అక్కడ వాళ్ళ పని చేసుకుంటూ ఉండగా.
జమీందారు కారులో రజిని వెతుక్కుంటూ వస్తాడు. రజినీ పొలాన్ని దున్నుతుచూసిన ఆ వ్యక్తి చాలా ఆశ్చర్య పోతూ కారు నుంచి దిగి అక్కడి కి వెళ్తాడు.
అతన్ని చూసిన రజినీ చాలా ఆశ్చర్యపోతుంది. అతను రజనీ దగ్గరికి వచ్చి….రజిని నువ్వు ఎక్కడున్నావ్ రా మీ అత్తయ్య మావయ్య నీ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మనం అక్కడికి వెళ్దాం పద.
రజిని…. నేను వచ్చి మా అత్తయ్య మావయ్యకి భారం కావాలని అనుకోవడం లేదు. ఇక్కడే ఉన్నాను అంటే ఈ కుటుంబానికి నేను తోడుగా ఉంటాను ఈ కుటుంబానికి నేను చాలా అవసరం.
దయచేసి నేను ఎక్కడ ఉన్న సంగతి కూడా మీరు చెప్పకండి. మీకు పుణ్యం ఉంటుంది.
అందుకు ఆ వ్యక్తి…. చెప్పాను కానీ నేను నీ కోసమే ఇక్కడికి వచ్చాను.
రజిని…. కానీ నాకోసం ఎందుకు.
జమీందారు… చూడమ్మా రజిని నేను నీ గురించి పూర్తిగా తెలుసుకున్నాను నాకు బిడ్డలు ఎవరూ లేరు. మీ అత్తయ్య మామయ్య ని ఒప్పించి న్నిన్ను దత్తత తీసుకుందాం అనుకుంటున్నాను.
నాతో వస్తావు కదా.
ఆ మాటలు విన్న రజిని…. వద్దు నేను ఎక్కడికి రాను. నాకు ఇక్కడే చాలా బాగుంది. ఇదిగో ఈ ఒక్క ఎకరం దున్నము అంటే
పని పూర్తవుతుంది. మమ్మల్ని పని చేసుకొ ఇవ్వండి దయచేసి మీరు వెళ్లిపోండి .
అని అంటుంది అందుకు అతను….. సరే వెళ్తాను కానీ ముందు ఈ విషయం చెప్పు. నువ్వు ఎందుకు ఇంతగా కష్టపడుతున్నావ్ అసలు వాళ్ళు ఎవరు నీకు వాళ్లకు సంబంధం ఏంటి. అని అడుగుతాడు అందుకు ఆమె జరిగిన విషయం అంతా చెబుతుంది.
ఆ మాటలు విన్న అతను చాలా బాధపడుతూ… అయితే సరే నేను వాళ్లకి కావలసిన డబ్బులు ఇస్తాను నువ్వు నాతో పాటు వస్తావా.
అందుకు ఆమె మనసులో….. డబ్బు ఇస్తా అంటున్నాడు. ఆ డబ్బుతో ఈ కుటుంబం చేసినప్పుడు తొలగిపోతుంది ఈ కుటుంబం చాలా సంతోషంగా ఉంటుంది.
అని అనుకొని అతనితో….సరే అయితే నేను మీతో పాటు వస్తాను వాళ్ళకి డబ్బులు ఇవ్వండి. అని అడుగుతుంది అందుకు అతను వెంటనే ఒక పెట్టి నిండా డబ్బు తీసుకొని వచ్చి . రమాదేవితో….. ఈ డబ్బు తీసుకోండి ఈ డబ్బు మీకు చాలా ఉపయోగపడుతుంది.
అందుకు రమాదేవి… మీరు ఎవరో నాకు తెలియదు మీరు ఎందుకు నాకు సహాయం చేస్తున్నారో నాకు తెలియదు వచ్చారు ఆ అమ్మాయికి ఏదో మాట్లాడారు అసలు ఎవరు ఏంటో నాకు ఏమీ అర్థం కావడం లేదు.
అందుకు అతను జరిగిన విషయం అంతా పూర్తిగా చెబుతాడు.
అతని మాటలు విన్న ఆమె చాలా ఆశ్చర్యపోతూ రజనీతో….. రజిని నువ్వు ఇంత చిన్న వయసులో . ఎంత పెద్ద మనసుతో ఆలోచించావు. నీకు చాలా కృతజ్ఞతలు అంటూ ఆమెను హత్తుకుంటుంది. అతను వాళ్ళకి డబ్బులు ఇస్తాడు ఆ డబ్బులు చూసిన వాళ్లు చాలా సంతోష పడతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తరువాయి భాగంలో చూద్దాం.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *