గర్భవతి మేనత్త 6_ Telugu Stories- Stories in Telugu – Panchatantra Kathalu Kattapa kathalu

ఐదో భాగం లో రజనీ యొక్క గొప్ప మనసుకి . ఆ కుటుంబం ఆమెను హత్తుకొని కృతజ్ఞతలు చెప్పుకుంటుంది. ఆ జమీందారు వాళ్ళకు డబ్బులు ఇస్తాడు వాళ్లు చాలా సంతోష పడతారు ఆ తర్వాత ఏం జరిగింది ఈ భాగంలో చూద్దాం. ఆ జమీందారు జగదీష్ …. రజిని ఇంకా బయల్దేరుదాం పద . అని అంటాడు అందుకు రజిని సరే అని చెప్పి వాళ్ళతో…. అమ్మ మీకు చాలా కృతజ్ఞతలు. ఇన్ని రోజులు నన్ను చాలా ప్రేమతో చూసుకున్నారు అలాగే నాకు చాలా సంతోషంగా ఉంది మీ కష్టాలు తీరిపోయి నందుకు. నీకు నేను వెళ్లి వస్తాను.

ఆ మాటలకి వాళ్ళు కి సంతోషంగా ఉన్నా ఆమె వెళ్తున్న అందుకు మాత్రం చాలా బాధ పడతారు. రజనీ వాళ్లకి వీడ్కోలు చెప్పి అతనితో కలిసి కారులో వెళ్ళిపోతుంది.
ఆ ఇల్లు చూసినా మీరు చాలా ఆశ్చర్య పోతూ అతనితో….సార్ ఇంత పెద్ద ఇంట్లో మీరు అక్కడే ఉంటారా.
అందుకు అతను…. లేదు నేను నా భార్య ఇద్దరం ఉంటాం.
రజిని… మీకు అసలు భయం వేయదా మీరు ఇద్దరే ఉంటున్నారు.
అందుకు అతను పెద్దగా నవ్వుతాడు ఇంతలో జగదీష్ భార్య సాహితీ అక్కడికి వచ్చి…. రజిని నువ్వేనా చాలా బాగున్నావు అంటూ ఆమెను హత్తుకుంటుంది. అలా రోజులు గడిచాయి రజిని అక్కడ చాలా సంతోషంగా ఉంటుంది. కానీ ఆమెకు మాత్రం ఏదో కోల్పాయను అన్న బాధ ఉండిపోతుంది.
ఆమె…. మా అత్త మావయ్య చాలా మంచివాళ్ళు. కానీ వాళ్ళుకి దూరంగా వచ్చేసాను . క్షమించండి అత్తయ్య మావయ్య అంటూ ఏడుస్తూ బాధపడుతుంది.
ఇది ఇలా ఉండగా అక్కడ వాళ్ళ అత్త భర్తతో…. ఏవండీ ఇంతవరకు రజనీ ఎక్కడుందో తెలియలేదు . జగదీష్ గారు వెతుకుతాను అని చెప్పారు ఆయన కూడా కనిపించలేదు. ఆ గాయాలతో రజనీ ఎంత బాధ పడుతుందో అసలు ఏం జరిగింది అని నాకు చాలా ఆందోళనగా ఉంది. అంటూ ఏడుస్తూ ఉండగా జగదీష్ అక్కడికి వచ్చి …. అయ్యో ఎందుకమ్మా అలా బాధ పడుతున్నావు . రజిని మా ఇంటి దగ్గర చాలా సురక్షితం గా ఉంది అంటూ జరిగిన విషయం చెప్తాడు. ఆ మాటలు విన్న వాళ్ళిద్దరూ చాలా సంతోష పడతారు.
కళ్యాణి….. అయితే మమ్మల్ని తీసుకువెళ్లండి . నేను రజిని నీ చూడాలి.
అందుకు జగదీష్…. లేదు మిమ్మల్ని చూస్తే మళ్ళీ ఇంటిలోనుంచి పారిపోతుంది. మీరు అమ్మాయిని తీసుకెళ్తారాని భయం . అందుకే కొన్ని రోజులు సద్దుమణిగిన తరువాత మిమ్మల్ని తీసుకెళ్తాను. అని చెప్తాడు అందుకు వాళ్లు సారి అంటారు వీళ్ళ విషయం ఇలా ఉండగా. అక్కడ వసంత తన భర్తతో…. మీకిది భావ్యం కాదు నన్ను పెళ్లి చేసుకున్న కారణం నా బిడ్డను కూడా చూసుకుంటాను అని చెప్పి ఎందుకు ఇంత మోసం చేశారు.చంపేయండి లేదా నా బిడ్డను కూడా ఇక్కడకు తీసుకురండి . అంటూ ఏడుస్తుంది భర్త…. నీకు ఎన్నిసార్లు చెప్పినా పదేపదే ఎందుకు ఈ విషయాన్ని తీసుకు వస్తున్నావు.
మరోసారి మాట్లాడావంటే నిజంగా నిన్ను చంపేస్తాను.
ఆమె…. నేను కూడా అదే అడుగుతున్నాను నన్ను చంపేయండి.పసిబిడ్డ ని వదిలేసి వేరే పెళ్లి చేసుకోండి అని లోకము నన్ను సూటిపోటి మాటలతో చంపకు ముందే నన్ను చంపేయండి ….చంపేయండి .!? అంటూ బోరున ఏడుస్తుంది?
అతను ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి లోపలికి వెళ్తాడు అతను అటు ఇటు తిరుగుతూ ….. ఈ వసంత నేను చెప్పిన మాట అసలు వినడం లేదు. ఈమెను చంపడం కాదు అసలు ఆ రజిని చంపితే కానీ ఈ సమస్య తీరదేమో. అది చెప్తే గానీ ఇది మారదు. అది పోతే ఇక ఏ గొడవా ఉండదు . సంతోషంగా మేమిద్దరం ఉండొచ్చు .
అనుకుంటాడు ఆరోజు రాత్రి సమయంలో ఇద్దరు దొంగలు అనిపిస్తాడు కిరణ్.
కిరణ్ దొంగలకు రజిని ఉన్న ఫోటోనీ ఇచ్చి…. ఈ అమ్మాయి మన పక్క ఊరి లోనే ఉంటుంది. అమ్మాయిని చంపేస్తే మీ ఇద్దరికీ చెరొక లక్ష రూపాయలు ఇస్తాను అని అందుకు వాళ్లు….. తప్పకుండా చేస్తాము. అని అంటారు కిరణ్ పూర్తి వివరాలు చెప్పి వాళ్లని పంపిస్తాడు. ఆ దొంగ ఇద్దరూ ఆ పక్క గ్రామానికి బయలుదేరుతారు. వాళ్ళిద్దరూ కళ్యాణి ఇంట్లోకి తెలియకుండా ప్రవేశిస్తారు రజనీ కోసం మొత్తం వెతుకుతారు. కానీ రజిని ఎక్కడా కనపడక పోవటంతో వాళ్లు ఇద్దరూ బయటికి వచ్చి ….. ఏంట్రా ఆ పిల్ల ఎక్కడా కనబడటం లేదు.ఆ పిల్లల చంపకపోతే డబ్బు రాదు. ఏం చేద్దాం.
అందుకు మరో దొంగ…… అసలు మన వచ్చిన ఇల్లు సరైందా కాదా అని తెలుసుకోవాలి. ఒకవేళ సార్ అయింది అయితే ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళిందో తెలుసుకోవాలి.ఉదయం కానీ అసలు పూర్తి వివరాలు తెలుసుకుందాం .
అని అక్కడ నుండి వెళ్ళిపోతారు ఆ మరుసటి రోజు ఉదయమే మా ఊర్లో వాళ్ల ద్వారా అసలు ఏం జరిగిందో మొత్తం తెలుసుకుంటారు. దాంతో అంతా విని వాళ్ళు… ఈ విషయం కిరణ్ గారికి చెప్తాం ఆయన ఏమంటాడో విని ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. అని అనుకొని తిరిగి కిరణ్ దగ్గరికి వెళ్తారు. అక్కడ కిరణ్ కి జరిగిన విషయం చెప్తాడు. కిరణ్…. మీరు ఏదైనా చేయండి ఆ అమ్మాయి మాత్రం ప్రాణాలతో ఉండకూడదు. వాడు ఇంటికి వెళ్ళినా సరే దాన్ని తీసుకురండి. ఆ రజిని శవాన్ని నా భార్య చూడాలి. ఈ రాత్రికే పనిచేసి ముగించుకుని రండి.
అని అంటాడు అందుకు వాళ్లు సరే అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయారు దాన్నంతా చాటుగా వసంత వింటుంది దానిని గమనించిన కిరణ్. ఆమె వైపు ఏమీ తెలియనట్టు గా చూస్తాడు వసంత…. మీరు అసలు మనుషులేనా. అన్యాయంగా పసి బిడ్డ ప్రాణాలు తీయాలి అనుకుంటున్నారు. రజినీ మీకు ఏమి అన్యాయం చేసిందని. దయచేసి వాళ్ళని ఆగమని చెప్పండి. మీకు పుణ్యం ఉంటుంది అంటూ ఏడుస్తూ ప్రాధేయ పడుతోంది. అందుకు కిరణ్…. రజని లేకపోతే మనం సంతోషంగా ఉంటాం. లేదంటే నువ్వు రజనీ కావాలని పదేపదే నన్ను ఏం హింసిస్తున్నావ్. అందుకే ఇదే సరైన
అని కోపం గా చెప్తాడు అందుకు వసంత…. జరగనివ్వను అంటూ అక్కడి నుంచి పరిగెడుతుంది. కిరణ్ ఆమె వైపు పరుగులు తీసి ఆమెను పట్టుకొని ఇంటికి బలవంతంగా తీసుకొస్తూ ఉంటాడు.
వసంత…. వదలండి దయచేసి నన్ను వదలండి నా బిడ్డ ప్రాణాలు తీయకండి. నా బిడ్డను కాపాడు కోవాలి భగవంతుడా అంటూ ఏడుస్తూ రోదిస్తుంది.
అతనికి ఏ మాత్రం ఆమె ని పట్టించుకోకుండా బలవంతంగా ఇంటికి తీసుకెళ్లి ఇంట్లో ఉంచి తాళం వేస్తాడు.
వసంత…. తలుపు తీయండి తలుపు తీయండి మీకు పుణ్యం ఉంటుంది నా బిడ్డని ఏం చేయొద్దు అని చాలా బాధపడుతుంది.
ఆ రోజు రాత్రి సమయం అవుతుంది ఆ దొంగ ఇద్దరు ఆ అమ్మాయి ఉంటే జాడను తెలుసుకుని ఆ ఇంట్లోకి వెళ్తారు.
అక్కడ జగదీష్ సాహితీ రజినీ నిద్రపోతూ ఉంటారు అంత పెద్ద ఇంటిని చూసి…. అమ్మ ఎంత పెద్ద ఇల్లు రా చూస్తుంటే వీళ్ళు బాగా డబ్బున్న వాళ్ళ లాగే ఉన్నారు.
అందుకు మరో దొంగ….. నిజమే కానీ అమ్మాయిని తీసుకెళ్దాం పద.కానీ గోతం కానీ ఏం తీసుకు రాలేదు ఏం చేద్దాం.
మరి దొంగ….ఇదిగో నా దగ్గర ఈ కర్ర పొందగా పిల్లకి నోరు కాళ్లు చేతులు కట్టేసి ఈ కర్రకు కట్టుకొని తీసుకెళ్దాం.
అని అంటాడు అందుకు తను సరే అని చెప్పి ఆమె కాళ్లు చేతులు కట్టేసి ఆ కర్రకు పెట్టుకొని ఇద్దరు కర్రనీ భుజాలపై వేసుకొని ఆమెను మోసుకొని తీసుకొస్తారు.
వాళ్ళిద్దరూ అలా కొంచెం దూరం వెళ్ళిన
తర్వాత ఒక దొంగ…. అరేయ్ నాకు ఒక మంచి ఆలోచన వచ్చింది రా. చంపేస్తే కిరణ్ లక్ష రూపాయలు ఇస్తాడు. కిడ్నాప్ చేశాము అని చెప్పి వీళ్ళ ఇంట్లో బెదిరిస్తే వీడు అంతకంటే ఎక్కువ డబ్బులు ఇచ్చే లాగే ఉన్నాడు ఎందుకంటే ఈ వ్యక్తి కిరణ్ కంటే బాగా డబ్బున్న వాళ్ళ లాగా ఉన్నాడు.
అందుకు మరో దొంగ…. అవును అదే సరైంది. ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు.
అని అనుకొని ఆమెను ఒక పాడైపోయిన ఇంటి లోకి తీసుకు వెళ్తారు అక్కడ ఆమెను బంధిస్తారు. రజిని చాలా భయపడుతూ…. ఎవరు మీరు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకు వచ్చారు నేను మా ఇంటికి వెళ్ళిపోతాను దయచేసి నన్ను వదిలి పెట్టింది అంటూ ఏడుస్తుంది వాళ్ళ …. నువ్వు మాట్లాడావంటే చంపేస్తాము. అరవకుండా నోరు మూసుకొని కూర్చో. అని ఆమెను బెదిరిస్తారు.
ఆ దొంగ లో ఒక దొంగ…. అది సరే కానీ నేను ఒక ఉత్తరం రాస్తాను అది వాళ్ళ ఇంటి ముందే పెడతాను అంటూ అటు ఇటు చూడగా అతనికి ఒక కాగితం కనపడుతుంది.
ఆ తర్వాత అతను తన వేలిని కోసుకొని వచ్చిన రక్తంతో ఈ విధంగా ఉత్తరం రాస్తాడు…. మీ అమ్మాయి రజనీ మా దగ్గరే ఉంది. మీ అమ్మాయి ప్రాణాలతో మీకు కావాలి అంటే . మాకు 15 లక్షల డబ్బు కావాలి ఎవరికి తెలియకుండా నేను చెప్పిన చోటికి రావాలి ఆ చోటు ఏంటనేది మరో ఉత్తరంలో రాస్తాను ఈ విషయం ఎవరికైనా తెలిసినచో మీ అమ్మాయి ప్రాణాలతో దక్కదు. అని రాస్తాడు ఇదిలా ఉండగా.
వసంత ఇంటి కిటికీ ని బద్దలు కొట్టుకొని
బయటకు తప్పించుకొని పరుగులు తీస్తూ
కళ్యాణి ఇంటికి బయలు దేరుతుంది.
అలా ఆమె ఇంటికి చేరేటప్పటికి తెల్లవారిపోతుంది . అంతా కళ్యాణ్ తో జరిగిన విషయమంతా చెప్తుంది.
వాళ్లు చాలా కంగారు పడుతూ జగదీష్ ఇంటికి బయలు దేరుతారు. వీళ్లు అలా వెళ్తూ ఉండగా ఆ దొంగ వాళ్ల ఇంటి ముందు ఉత్తరాన్ని వుంచి అక్కడి నుంచి తిరిగి వస్తూ ఉండగా వీళ్ళని చూస్తాడు వాళ్లను చూసి భయంతో ఒక చోట దాక్కుంటాడు.
ఇంతలో పెద్ద గాలి రావడంతో ఆ ఉత్తరం పక్కకు వెళ్లి పోతుంది. వాళ్లు జగదీష్ ఇంటికి వస్తారు జగదీష్ వాళ్ళు రజినీ ఎక్కడికెళ్ళింది అంటూ కంగారు పడుతూ ఉండగా.
వాళ్లు వచ్చి జరిగిన విషయమంతా చెప్తారు.
దానిని విన్నవాళ్ళు చాలా కంగారు పడుతూ ఆమె కోసం వెతకడం మొదలు పెడతారు.
వాళ్లు అలా వెళ్లిన వెంటనే దొంగ ఆ పరుగులు తీస్తూ మరో దొంగ దగ్గరికి వెళ్లి జరిగిన విషయం చెప్తాడు.
ఆ దొంగ…. సరే ఏం కంగారుపడకు అసలు ఇక్కడ ఈ ఇల్లు ఉందని ఎవ్వరికీ తెలియదు.
కొన్ని రోజులు మనం బయటికి వెళ్లకుండా ఉందాం. ఆ ఉత్తరం పక్కకి వెళ్ళిపోయింది కదా వాళ్లు కచ్చితంగా ఆ ఉత్తరం చదివి లాగా నేను చేస్తాను అని అంటాడు.
వాళ్లంతా రజనీ కోసం వెతికి ఆమె ఎక్కడా దొరక్కపోవడంతో నిరాశ చెందుతారు అప్పుడు జగదీష్…. అయితే మనం కిరణ్ మీద కేసు పెడదాం.
అని అంటాడు వసంత…. వద్దు వద్దు దయచేసి అలా చేయొద్దు మన కుటుంబం పరువు మనం తీసుకున్న వాళ్లమవుతాం.
అని అంటుంది.
జగదీష్…. మరి ఏం చేయాలి. అని మాట్లాడుతుండగా ఇంతలో ఉత్తరం వాళ్ళ కాళ్ళముందు పడుతుంది. జగదీష్ వెంటనే అవసరం చదువుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తర్వాతి భాగంలో చూద్దాం.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *