గర్భవతి మేనత్త 7_ Telugu Stories- Stories in Telugu – Panchatantra Kathalu Kattapa kathalu

కింది భాగంలో జగదీష్ కి ఒక ఉత్తరం దొరుకుతుంది. అతను ఆ ఉత్తరంలో ఉన్నది చదువుతాడు. దాన్ని చదివి అక్కడ ఉన్న వాళ్లందరికీ ఆ విషయాన్ని చెప్పాడు. దాన్ని విన్న వాళ్లు చాలా ఆశ్చర్య పోతూ ఉంటారు. జగదీష్ భార్య …… అయ్యో ఎలా అయినా రజిని కాపాడండి. వాళ్లకు అసలు ఏం కావాలో కనుక్కోండి. వాళ్లు డబ్బు కోసమే ఇదంతా చేస్తున్నారు. అని అంటూ బాధపడుతుంది.

అదంతా దూరం చేసుకున్న దొంగ…. ఆ దారిలో కి వచ్చారు ఇక రెండవ ఉత్తరాన్ని కూడా వాళ్ళ దగ్గరకు చేర్చాలి. అని అక్కడి నుంచి వెళ్లి మరో ఉత్తరాన్ని తయారు చేస్తాడు. దాన్ని కూడా తీసుకు వెళ్ళి వాళ్ళ ఇంట్లో విసిరి అక్కడి నుంచి పరుగులు తీస్తాడు. ఆ ఉత్తరం చూసిన జగదీష్ దాంట్లో ఏముంది అంత చదువు తాడు…
నువ్వు 10 లక్షల రూపాయలు తీసుకొని ఊరిబయట ఉన్న స్మశానం దగ్గరికి రావాలి.
కేవలం ఒక్కడివే రావాలి ఎవరన్నా వచ్చారా మీ పాప ప్రాణాలతో దక్కదు.
అని ఉంటుంది.
దాన్ని చదివిన అతను…సరే నేను వాళ్లకి కావలసిన డబ్బు తీసుకొని స్మశానం దగ్గరికి వెళ్తున్నను. అని చెప్పి అక్కడి నుంచి ఒక పెట్టినీ తీసుకొనీ స్మశానానికి వెళ్తాడు. అక్కడ జగదీష్…. మీరు తీసుకురమ్మన్నా డబ్బులు తీసుకు వచ్చాను. దయచేసి పాపని ఏం చేయకండి. అని పెద్ద పెద్దగా కేకలు వేస్తారు.
ఆ దొంగ ఒక చెట్టు దగ్గర నిలబడి…. మీ చేతిలో ఉన్న పెట్టిన అక్కడ పెట్టి అటు తిరిగి నిలబడండి. అని ఒక స్వరం వినపడుతోంది.
సరే అని చెప్పి అతని చేతిలో ఉన్న పెట్టి నీ దూరంగా విసిరి కొట్టి వెనక్కి తిరిగి నిలబడతాడు. దాన్ని గమనించిన దొంగ ఆ చెట్టు దగ్గర నుంచి ముందుకు వచ్చి ఆ పెట్టనీ తీసుకుంటాడు. అందులో ఎంత డబ్బు ఉందో అని తెరిచి చూస్తాడు. ఆ పెట్టె ఖాళీగా ఉంటుంది. వెంటనే జగదీష్ అతని వైపు తిరిగి అతనికి ఓక తుపాకీ చూపించి….. కదిలవో కాల్చి పడేస్తాను.
ఆ దొంగ భయపడుతూ …..హా హా కాదు నేను ఒక్కడినై కాదు నాతో పాటు నా సహాయకుడు ఇంకొకడున్నడూ. నన్ను కాల్ ఇస్తే వాడు ఆ అమ్మాయి ని చంపేస్తాడు.
అయినా ఇంత మోసం చేస్తావు కదా . అని మాట్లాడుతూనే తన చేతిలో ఉన్న పెట్టెను అతనిపై విసిరికొడతాడు. వెంటనే తన చేతిలో ఉన్న తుపాకీ దూరంగా పడుతుంది.
ఆ దొంగ అక్కడి నుంచి పరుగులు తీస్తాడు.
జగదీష్ కూడా ఆ దొంగ వెంట పరుగులు
తీస్తాడు. ఆ దొంగ జగదీష్ కంటే చాలా దూరంగా పరుగులు తీసి మరో దొంగ ఉన్నచోటికి చేరుకుంటాడు.
అతను ఆ దొంగ తో…..రే ఆ డబ్బు ఉన్నవాడు ఇటే వస్తున్నాడు. అనుకున్నదంతా విఫలం అయిపోయింది.
ఆ దొంగ…. మరి ఇప్పుడు ఎలా ఏం చేద్దాం చెప్పు.
ఆ దొంగ…. ముందు ఆ తలుపులన్నీ మూసివేసి ఆ కుర్చీకి ఈ అమ్మాయిని కట్టి వేద్దాం. అని అంటాడు అందుకు అతను సరే అని చెప్పి అక్కడున్న తలుపులు మూసేస్తారు కానీ కిటికీ మాత్రం చిన్న సందు ఉంటుంది.
అప్పుడే జగదీష్ ఆక్కడ చేరుకుంటాడు.
లోపలున్న దొంగ… ఏ జమీందారు నువ్వు గనక లోపలికొస్తే ఈ పాపని చంపేస్తాం.
అంటూ రజనీని కొడతారు.
రజిని….. అంకుల్ నన్ను కాపాడండి.
నన్ను కాపాడండి అంటూ అరుస్తుంది.
జగదీష్…. రేయ్ మిమ్మల్ని వదిలి పెట్టను మర్యాదగా రజినీ వదిలిపెట్టండి లేదా మీ ప్రాణాలు ఇస్తాను.
అందుకు అతను…. జమిందార్ కనపడుతున్నాయి కదా కొట్టి కొట్టి ఇలాగే చంపేస్తాము.
రజిని… వద్దు నన్ను పెట్టకండి దయచేసి నన్ను కొట్టకండి. అంటూ కేకలు వేస్తుంది.
జగదీష్ కి ఏం చేయాలో అర్థం కాదు.
తను ఆ కిటికీ లో నుంచి చూసి గన్ను గురిపెట్టి…. మర్యాదగా అమ్మాయి ని వదిలి పెట్టండి లేదా నా చేతి లో బలి అవుతారు.
వాళ్ళు అమ్మాయి కట్లు విప్పేసి ఆమెను పట్టుకొని…. కాల్ చు ఇప్పుడు కాల్ చూ. అంటూ ఆ అమ్మాయి ని అడుగు పెడతారు.
జగదీష్ ఏం చేయలేక అలాగే ఉంటాడు.
అప్పుడు అనుకోకుండా ఒక పోలీస్ అధికారి అటుగా రావడం జగదీష్ గమనిస్తాడు.
జగదీష్ వెంటనే అతని దగ్గరకు పరుగు పరుగున వెళ్లి జరిగిన విషయం చెప్తాడు.
ఆ పోలీస్ అధికారి దాని వెనక భాగానికి అక్కడ ఉన్న తలుపు ని బద్దలు కొట్టి తన చేతిలో ఉన్న తుపాకీని చూపించి….. కదిలారు కాల్చి పడేస్తా ను . జాగ్రత్త పడ్డాడు.
జగదీష్ లోపలికెళ్ళి పాపనీ తీసుకుంటాడు.
వాళ్ళిద్దర్నీ జైలు కి తీసుకు వెళ్ళాడు. ఆ పోలీస్ అధికరి జగదీష్ పాప కూడా అక్కడికి వెళ్తారు.
జగదీష్ పోలీసు అధికారితో…. సార్ నిజంగా మీరు బలే సమయానికి వచ్చారు పాప ప్రాణాలు కాపాడారు. చాలా థ్యాంక్స్ అంటూ కృతజ్ఞతలు చెప్పుకుంటారు.
పోలీస్ అధికారి…. అది నా బాధ్యత.
అని అంటాడు. అప్పుడు లోపల ఉన్న ఒక దొంగ….. సార్ ఇదంతా చెయ్యమంది ఆ కిరణ్
అంటూ జరిగిన విషయమంతా చెప్తడు.
దాన్ని వ్విన్న పోలీస్ అధికారి….. అయితే ఇప్పుడు ఆ కిరణ్ నా చేతులు అయిపోయాడు. జగదీష్… సార్ కిరణ్ ఏమి అనకండి ఇది మా ఫ్యామిలీకి సంబంధించిన విషయం . మళ్లీ చాలా పెద్ద గొడవలు అవుతాయి సార్.
పోలీస్ అధికారి… అలాగా అతన్ని వదిలేయకూడదు అతని ఇక్కడికి తీసుకు వస్తాను. అని చెప్పి అక్కడ నుంచి కిరణ్ ఇంటికి వెళతాడు. అక్కడ కిరణ్ తో….. కిరణ్ నువ్వు రజనీ అనే పాప ని చంపడానికి. దొంగలని పురమాయించావ్వు. నిజమే కదా నిజాన్ని ఒప్పుకో లేదంటే కథ మరోలా గా ఉంటుంది. అందుకు అతను ఏం మాట్లాడకుండా అలా నిలబడిపోతాడు.
పోలీస్ అధికారి…. ఏం మాట్లాడట్లేదు అంటే . ఏదో ఉండే ఉంటుంది పద స్టేషన్కి వెళ్దాం అంటూ అతన్ని స్టేషన్కు తీసుకు వెళ్తాడు .
అక్కడ కిరణ్….. తను చేసిన నిజాం అంతా ఒప్పుకుంటాడు.
జగదీష్…. s.I గారు మీరు ఒప్పుకున్నాడు కదా. మందలించి వదిలేయండి. అంటాడు సరే అంటాడు ఆ తర్వాత పోలీస్ అధికారి ఆ దొంగలను ….. మీ మీద ఇంతకుముందు చాలా కేసులు ఉన్నాయి. మిమ్మల్ని మాత్రం వదిలిపెట్టేది లేదు.
అప్పుడు ఆ దొంగలో ఒక దొంగ ….. అయ్యా పోలీస్ గారు ఏ పని చేయడానికి పని దొరకక పోవడంతో ఇలా చేస్తున్నాము. అంతే కానీ నిజంగా ఆ పిల్లని మేము చంపాలని అనుకోలేదు. అతని డబ్బు తీసుకొని పిల్లనీ ఎక్కడ అయినా దూరంగా వదిలేద్దాం అనుకున్నాము.ఆ ఉద్దేశంతోనే ఆ ఇంటికి వెళ్ళాము అక్కడ ఉన్న అంత పెద్ద ఇల్లు చూసి డబ్బు కోసం ఆశపడి ఇలా చేశాను అంతే కానీ పాపని చంపాలన్న ఉద్దేశం మాకు లేదు.
మరో దొంగ….ఎస్సై గారు మిమ్మల్ని నమ్మండి మేము దొంగలమే కానీ మనుషులు చంపేంత కిరాతకులం కాదు కాదు. మా బిడ్డల సాక్షిగా
చెప్తున్నామ్ము. మేము అదే అనుకున్నాము.
మమ్మల్ని వదిలేయండి. ఇంకా దొంగ పనులు చెయ్యము.
ఆ మాటలు విన్న జగదీష్…. ఎస్సై గారు వాళ్ళనీ మాకు అప్ప చెప్పండి నేను తీసుకెళ్తాము. అని అంటాడు. అందుకు ఎస్ ఐ సరే అంటాడు.
అందరూ కలిసి జగదీష్ ఇంటికి వెళ్తారు. వసంత
రజిని చూసి చాల సంతోషపడుతూ ఆమెను హత్తుకొని….అమ్మ రజిని వచ్చావా తల్లి నీకు ఇంకా లేదు గా. అంటూ కంటతడి పెట్టుకుంది .
కళ్యాణి కూడా ఆమెను పట్టుకొని… రజిని నీకేం కాలేదుగా. అంటూనే ఆ దొంగలను చూసి…. ఈ వెధవలని ఎందుకు ఇక్కడికి తీసుకు వచ్చారు .
జగదీష్… అమ్మ కళ్యాణి ఒక రెండు నిమిషాలు ఆగు తావా అసలు ఏం జరిగింది మొత్తం వివరంగా చెప్తాను ముందు విళ్ళతో మాట్లాడనివ్వు. అని వసంత మరియు కిరణాలతో….
చూడండి మీ ఇద్దరి మధ్య గొడవకు కారణం రజిని. మాకు పిల్లలు పుట్టే అవకాశం లేదు అందుకే రజిని మేము పెంచుకుంటాం.
ఆమె ఇక్కడ చాలా సంతోషంగా ఉంటుంది మీకు కూడా గొడవలు ఉండవు ఏమంటారు ఆలోచించండి.
అందుకు వసంత తన మనసులోని…. రజనీ ఎక్కడైనా సంతోషంగా ఉండడమే నాకు కావాలి ఆమె ప్రాణాలతో ఉంటేనే అంతే చాలు. అని అనుకొని జగదీష్ తో….. సరే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు.
పాప జాగ్రత్త జాగ్రత్తగా చూసుకోండి.
కిరణ్….నేను చేసిన దానికి చాలా సిగ్గుపడుతున్నాను తప్పు నాదే. నా మనసు మారింది. కానీ నా కళ్ళ ముందే ఉంటే నేను చేసిన తప్పు పదేపదే నాకు గుర్తుకు వస్తుంది . దానికంటే పాప మీ దగ్గర ఉండడమే చాలా మంచిది. చేసిన దానికి చాలా సిగ్గు పడుతూ మీ అందరికీ క్షమాపణ చెప్పుకుంటున్నాను.
అంటూ కంటతడి పెట్టుకున్నాడు.
అని అంటాడు అందుకు వాళ్లు… బాధపడకండి మీ తప్పు మీరు తెలుసుకున్నారు కదా. అంటూ అతన్ని ఓదారుస్తారు.
ఆ తర్వాత వసంత…. సరే ఇంక మేము ఇక్కడ నుంచి వెళ్తము. పాప మాత్రం జాగ్రత్త అని చెప్పి అందరికీ వీడ్కోలు భార్యభర్తలిద్దరు అక్కడనుంచి వెళ్ళి పోతాడు.
అప్పుడు జగదీష్ కళ్యాణి వాళ్ళతో …. విన్నారు కదా వాళ్ళు ఏం చెప్తారు. పాపని మా దగ్గర ఉంచుకోవడం లో మీకు ఎలాంటి అభ్యంతరం లేదు కదా అని అడుగుతాడు.
కళ్యాణి…. రజిని చాలా మంచిది. చిన్నతనం నుంచే ఎన్నో కష్టాలను అనుభవించింది.
ఆమె ఎక్కడున్నా సంతోషంగా ఉండడమే నాకు కావాలి. బాగా చదివించండి మా రజిని పెద్ద స్థాయిలో చూడాలి. అని అంటుంది.
జగదీష్…. తప్పకుండా చూస్తారు.
కళ్యాణి ఆమెను హత్తుకొని…… రజిని బాగా చదువుకో అమ్మా నిన్ను చూడడానికి మేము అప్పుడప్పుడు వస్తూనే ఉంటాము .
కానీ కంటతడి పెట్టుకుంటే చాలా బాధపడుతూ… వెళ్లి వస్తాము అని చెప్పి తన భర్తతో కలిసి అక్కడి నుంచి వెళ్లి పోతుంది.
ఆ తర్వాత జగదీష్ ఆ దొంగలతో…. చూడండి మా ఇంట్లో పని వాళ్ళు లేరు. మేము పని వాళ్ళ కోసం వెతుకుతున్నాము. మీరు మీ యొక్క బుద్ధి మార్చుకోండి నీతిగా బతకాలను ఉంటే. మా ఇంట్లో పని ఇస్తాను. అందుకా దొంగలు జగదీష్ కి నమస్కరించి…. అయ్యా మీరు ఎంత గొప్ప మనసు ఉన్న వాళ్ళు మాకు అర్థమయింది. దొంగల కి పిలిచి మరి ఇంట్లో ఉండడానికి అవకాశం కల్పిస్తున్నారు.మేము ఒక్క పొరపాటు కూడా చేయము మీ నమ్మకాన్ని వమ్ము చేయము . ఇక్కడే ఉండి పని చేసుకొని మా కుటుంబాన్ని పోషించుకుంము. అంటారు
జగదీష్…. సరే ఈ రోజే మీరు పనిలో చేరండి ఇంటి పనులు తోటపని ఇద్దరు చూసుకోండి.
అందుకు వాళ్ళు చాల సంతోషపడుతూ ఆయనకు కృతజ్ఞతలు చెప్పుకొని అక్కడి నుంచి బయటకు వెళ్తారు.
జగదీష్ రజనీతో…. చూడని ఇంక నువ్వు మమ్మల్ని అమ్మ నాన్న అని పిలవాలి. సరేనా మేమే నీకు అమ్మ నాన్న .
రజిని చాల సంతోషపడుతూ వాళ్ళిద్దరినీ హత్తుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తర్వాతి భాగంలో చూద్దాం.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *