గర్భవతి మేనత్త 8_ Telugu Stories- Stories in Telugu – Panchatantra Kathalu Kattapa kathalu

ఏడో భాగం లో జగదీష్ రజనీకి దొంగిలించిన వ్యక్తులిద్దర్ని పనిలో ఉంచుకుంటాడు.దాన్ని చూసి రజిని కూడా చాలా సంతోషపడుతుంది అందుకు వాళ్లు కూడా సంతోష పడతారు. రోజులు గడిచాయి రజనీ ఆ ఇంట్లో చాలా సంతోషంగా ఉంటుంది.

ఆ దొంగలు ఇద్దరు కూడా ఆ ఇంట్లో సంతోషంగా జీవిస్తూ ఉంటారు. ఒకరోజు ఆ దొంగ ఇద్దరూ తోట పని చేసుకుంటూ ఉంటారు.ఇంతలో రజిని వాళ్ల దగ్గరికి వెళ్లి వాళ్లతో….. బాబాయ్ నేను కూడా మీకు సహాయం చేయనా. అని అంటుంది అందుకు వాళ్ళు ఆమె మాటలకి ఆశ్చర్యపోయి….. ఏంటమ్మా నువ్వన్నది బాబా యా . ఎంత చక్కగా పిలిచావు తల్లి. అందరూ మమ్మల్ని దొంగా దొంగా అని పిలిచేవాళ్ళు. మా పేర్లు కూడా మేం మర్చిపోయాము.కానీ ఒక్కసారిగా నువ్వు బాబాయ్ అని పిలిస్తే చాలా సంతోషంగా ఉందమ్మా. అంటూ ఒకరు కంటతడి పెట్టుకున్నాడు.
మరొకరు …. నిజమే తల్లి నువ్వు చాలా మంచి దానివి. ఇంత చిన్న వయసులోనే దేవుడు నీకు పెద్ద మనసుని ఇచ్చాడు . నీ లాంటి దానిని మేము దొంగిలించినందుకు సిగ్గుగా ఉంది. అంటూ బోరును ఏడుస్తారు.
ఆమె … అయ్యో బాబాయ్లు ఎందుకు ఈ బాధ పడుతున్నారు మీరు చేసిన పని వల్లే కదా . మనందరం ఇక్కడ సంతోషంగా ఉన్నాము .
బాధపడకండి అంటూ ఓదారుస్తుంది.
అందుకు వాళ్లు కూడా…. నువ్వు చెప్పింది నిజమే తల్లి అంటూ కంటి నీటిని తీర్చుకుంటారు. ఆ రోజు గడిచిపోతుంది .
ఆ మరుసటి రోజు ఉదయం యధావిధి గా పని చేసుకుంటూ ఉంటారు. రజిని వాళ్లతో మాట్లాడకుండా వాళ్ళ ముందు దిగులుగా కూర్చుని ఉంటుంది.
దాన్ని గమనించిన వాళ్ళు. ఆమె వద్దకు వెళ్లి…. ఏమైంది ఈరోజు చిట్టితల్లి ఏం మాట్లాడకుండా కూర్చుంది . ఏం జరిగింది అని అంటారు.
అందుకు ఆమె ఏం మాట్లాడకుండా కూర్చుంటుంది. ఇంతలో ఒకరు…. అలా మౌనంగా ఉంటే ఏం జరిగిందో మాకు ఎలా తెలుస్తుందమ్మ.
రజిని…. బాబాయ్ అమ్మ నాన్న బయటికి పంపించడం లేదు నాకు ఆడుకోవాలని ఉంది . ఏం చేయాలో అర్థం కావడంలేదు.
అని అంటుంది అందుకు వాళ్ళు…. ఓస్ అంతేకదా . మాతో ఆడుకో మేము ఇద్దరం ఉన్నాం కదా.
ఇందుకు ఆమె… బలే బలే అయితే సరే ఆడుకుందాం ఏం మాట్లాడాలి అంటూ కొంచెం సేపు ఆలోచించి…. దాగుడుమూతలు ఆడుకుందాం. అని అంటుంది అందుకు వాళ్లు సరే అంటారు. వారిలో ఒకడు…. అయితే మీ ఇద్దరి వెళ్లి దాక్కోండి నేను మిమ్మల్ని పట్టుకుంటాను. అని అంటాడు అందుకు వాళ్ళిద్దరూ సరే అని అక్కడి నుంచి పరుగులు తీస్తారు. వాళ్ళు అలా పరుగులు తీసి దూరం దూరంగా దాక్కుంటారు. అప్పుడు రజిని ఒక చెట్టు పైకి ఎక్కి కూర్చుంటుంది.
ఆ దొంగ చెట్టు వెనకాల దాక్కున్నాడడు.
మరో దొంగ వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేయడానికి వెతకడం మొదలు పెడతాడు.
చాలా సమయం పడుతుంది వాళ్ళు ఇద్దరు ఎక్కడా కనపడక పోవటంతో అతను…. ఎక్కడికి వెళ్ళిపోయారు వీళ్లు భలే వింతగా ఉంది. నేను ఎక్కడున్నా సరే వీళ్ళని మాత్రం పెట్టుకోవాల్సిందే. అనుకుంటూ అలా తిరుగుతూనే ఉంటాడు చాలా సమయం అవుతుంది చెట్టు కింద కూర్చున్న రజిని…. అబ్బా చాలా ఆకలవుతుంది . ఎంత సమయం అని నేను ఇక్కడ కూర్చోవాలి. భగవంతుడా ఆట పేరుతో పొద్దున్నే పెద్ద పొరపాటు చేశాను అడుక్కుంటూ బాధపడుతుండగా దూరంలో ఒక ఆవిడ అట్లు పోస్తూ కనబడుతుంది.
దాన్ని చూసిన రజిని…. అబ్బ వేడివేడిగా దోశలు. ఇప్పుడే వెళ్లి అమాంతం తినేయాలని ఉంది చూస్తుంటే నోరూరిపోతుంది. కానీ చెట్టు దిగితే మల్లయ్య బాబాయ్ నన్ను పట్టేసుకుంటారు అని భయం .ఏం చేయలేని పరిస్థితి అంటూ వాటి వైపు అలా చూస్తూ ఉంటుంది . కింద ఉన్న దొంగ సుబ్బయ్య …. చెట్టుపై ఉన్న రజనీతో…. చిట్టితల్లి ఆకలిగా ఉందా . చాలా సమయం అయ్యింది కదా. నాకు మాత్రం చాలా ఆకలిగా ఉంది.
అక్కడ చూడు వేడి వేడి దోసలు వేస్తుంది ఆమె. నాకు నోరుఊరిపోతోంది వెళ్దాం పద.
రజిని… నాక్కూడా చాలా ఆకలిగా ఉంది బాబాయ్ నేను కూడా దాని గురించి ఆలోచిస్తున్నాను పద వెళ్లి ఒక పట్టుపడదం.
అని అనుకొని ఇద్దరు కలిసి ఆ దోస్తుల అమ్మే ఆమె దగ్గరికి ఉంటారు ఆమె వాళ్లను చూసి…. రండి బాబు రండి తాజా తాజా వేడి వేడి దోసలు. అందుకు వాళ్లు… చెరొక ప్లేట్ ఇవ్వు అని అడుగుతారు. ఆమె సరే అని చెప్పి వాళ్లకి దోస్తులు ఇస్తుంది వాళ్లు వాటిని తింటూ చాలా….అబ్బా చాలా చాలా బాగున్నాయి అని ఒక దాని తర్వాత ఒకటి తింటూనే ఉంటారు. అలా కొంత సమయానికి వాళ్లకి తినడం పూర్తయిపోతుంది.
ఆమె…. ఇద్దరు కలిసి వంద రూపాయలకి తిన్నారు. డబ్బులు ఇవ్వండి. అని అడుగుతుంది అందుకు అతను…. అంతేగా అని చెప్పి జేబులో చెయ్యి పెడతాడు. కానీ జేబులో ఒక్క రూపాయి కూడా ఉండదు.
అతను ….అయ్యో డబ్బులు కనిపించడం లేదు ఏంటి ఎక్కడో వంద రూపాయల కాగితం
పోయినట్టుంది. అని అంటూ త్వర్లు ఆడుతాడు .
ఆమె కోపంగా…. నేను ముందే అనుకున్నాను మీ మోకాలు చూస్తుంటే దొంగ మొఖం లాగా ఉన్నాయి అని.మర్యాదగా డబ్బులు కట్టి వెళ్ళండి లేదంటే నేను ఏం చేస్తున్నానో నాకే తెలియదు.
అతను…. ఏమమ్మా మాటలు కొంచెం జాగ్రత్తగా రా నీవు డబ్బులు ఎకోటి వెళ్లే వాళ్ళలాగా ఉన్నామా . మా ఇల్లు ఎక్కడే డబ్బులు తీసుకొని వస్తాము.
అని చెప్పి అక్కడి నుంచి ఇద్దరు వెళ్తూ ఉండగా ఆమె…. కావాలంటే నువ్వు ఒక్కడివే వెళ్లేవా పాపనీ మాత్రం ఇక్కడే ఉంచు అని గట్టిగా అంటుంది. అందుకు అతను…. సరే నీకు బాగా అనుమానం పేచ్చ అనుకుంటా
అని అంటూ రజినీతో….. అమ్మ నేను డబ్బులు తీసుకొని వస్తాను నువ్వు ఎక్కడికి వెళ్ళను ఇక్కడే ఉండు. అని ఉంటాడు అందుకామె సరే అని తల ఊపుతుంది.
అతను అక్కడనుంచి వెళ్ళి పోతాడు .
అతడు నడుచుకుంటూ వెళ్తుండగా దారిలో
మల్లయ్య కనిపిస్తాడు అతను మల్లయతో జరిగిన విషయమంతా చెప్తాడు .
మల్లయ్య…. ఓస్ అంతేనా నా దగ్గర డబ్బులు ఉన్నాయిలే పద వెళ్లి ఇచ్చేద్దాం . అని అక్కడికి వెళ్తారు అప్పుడు అక్కడ రజనీ దోసెలు వేస్తూ ఉంటుంది. దాన్ని చూసిన సుబ్బయ్య…. ఏ అమ్మ మా అమ్మాయి చేత పని చేస్తున్నావు.
అందుకు ఆమె… నేను చేయమని చెప్పలేదు . రజినీ నేను చేస్తుంది . మీరు వచ్చేటప్పటికి ఇక్కడున్న ప్లేట్లు అన్నీ కూడా శుభ్రం చేసింది.
నేను ఇలాంటి మంచి అమ్మాయిని ఎక్కడ చూడలేదు. అంటూ ఏడవడం మొదలు పెడుతుంది.
సుబ్బయ్య…. అయ్యో ఇప్పుడు ఎందుకలా ఏడుస్తున్నావు నేను నిన్ను ఏమీ అనలేదు కదా. అందుకు ఆమె… నేను ఏడుస్తుంది అందుకు కాదు ఇన్ని సంవత్సరాలుగా నేను ఒంటరిగా జీవిస్తున్నాను నన్ను పలకరించిన వాళ్లే లేరు. వచ్చిన వాళ్ళు ఎవరైనా తినేసి డబ్బులు ఇచ్చి వెళ్ళిపోతారు. నన్ను ప్రేమగా పలకరించిన వాళ్ళు లేరు నా అనేవాళ్లే నాకు లేరు . కానీ నన్ను పెద్దమ్మ అని పిలిచింది.
ఇంతటి సంస్కారం ఉన్న అమ్మాయి నీ ఎక్కడా చూడలేదు .ఏ కన్న తల్లి బిడ్డ కానీ నూరేళ్లు చల్లగా ఉండాలి . అని అంటూ చాలా ఆనంద భాష్పాలు కురిపిస్తుంది.
రజిని…. అయ్యో ఊరుకో పెద్దమ్మ . నేనున్నా కదా రోజు నేను నీ దగ్గరికి వస్తాను. నీతో కబుర్లు చెప్తాను నీ తో ఆడుకుంటాను .
నువ్వు ఎవరు లేరు అని బాధ పడకు . అని ఆమెకు ధైర్యాన్ని చెప్తుంది.
దాన్ని విన్న వాళ్ళంతా చాలా ఆశ్చర్యపోతారు .
మల్లయ్య…. సరే ఇదిగో డబ్బులు తీసుకో. నీ డబ్బులు ఇవ్వడానికి ప్రయత్నిస్తుండగా ఆమె… డబ్బులు ఏమీ అవసరం లేదు . కూతురు దగ్గర ఎవరైనా డబ్బులు తీసుకుంటారా. ఇంకా వెళ్ళండి అంటూ రజిని దగ్గరకు తీసుకొని…. అమ్మ రజిని రోజు నిజంగా నా దగ్గరికి వస్తావు కదా .
అని అడుగుతుంది రజిని… తప్పకుండా వస్తాను పెద్దమ్మ నువ్వేమీ బాధపడకు సరేనా.
అంటే అందుకు ఆమె చాలా సంతోషపడుతుంది ఆ తర్వాత అందరూ కలిసి ఇంటికి వెళ్తారు ఇంటి దగ్గర జగదీష్ …. ఎక్కడికి వెళ్లారు పొద్దున్నుంచి నేను మీ అందరి కోసం వెతుకుతున్నాను.
ఇంకా ఒక్క క్షణం మీరు రావడం ఆలస్యమైతే పోలీసులు మన ఇంటికి వచ్చే వాళ్ళు.
అని అంటాడు అందుకు మల్లయ్య సుబ్బాయ జరిగిన విషయమంతా చెప్తారు .
దాన్ని విన్న జగదీష్ చాలా ఆశ్చర్య పోతూ …. నిజంగా రజిని నువ్వు మా కడుపు ఎందుకు పుట్టలేదని మేము చాలా బాధపడుతున్నాము. ఇంత మంచి మనిషి ఇచ్చే దేవుడు తల్లిదండ్రులు దూరం చేసి తప్పు చేశాడు . వాళ్లు ఉన్నట్టయితే నిన్ను చూసి ఎంతగానో మురిసిపోయే వాళ్ళు .
నీ వినయం నీ సంస్కారం తోనే అందర్నీ ముక్కులీ చేస్తున్నావు . అంటూ కొంత బాధ పడుతూ చెప్తాడు
మల్లయ్య…. ఎందుకు బాబా గారు మీరు బాధపడుతుంది. రజినీ తల్లిదండ్రులు లేరు కాబట్టి రజినీ మన దగ్గరికి వచ్చింది. లేదంటే అక్కడ ఉండేది కదా మనకు ఇతడి భాగ్యం దొరికేది కాదు కదా అందుకు దేవునికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. అని అంటాడు అందుకు సుబ్బయ్య… నిజమే కదా అయ్యగారు .
అందుకు జగదీష్…. సరిగ్గా చెప్పారు . అంటూ రజిని లోపలికి వెళదామా అని అంటాడు.
అప్పుడే తల్లి…. ఒక్క నిమిషం ఆగు రజిని నీకు దిష్టి తీస్తాను . లేదంటే నా బంగారు తల్లికి దిష్టి తగులుతుంది. అంటూ . ఆమెకు దిష్టి తీస్తూ…. ఇరుగు దిష్టి పొరుగు దిష్టి నా దిష్టి ఊర్లో ఉన్న వాళ్ళందరూ దిష్టి పోవాలి .
అంటూ దిష్టి తీస్తుంది.
ఆ తర్వాత ఆమె లోపలికి వెళుతుంది .
ఆ పూట అలా గడిచిపోయింది.
రాత్రి సమయం అందరూ కలిసి భోజనం చేస్తారు. మల్లయ్య సుబ్బయ్య ఇద్దరు కూడా భోజనం చేసి వాళ్లతో…. బాబు గారు ఇంకా మేము ఇంటికి బయలుదేరాతము.
అని అంటారు . అందుకు జగదీష్…. సరే జాగ్రత్తగా వెళ్ళండి . ఇదిగో ఈ డబ్బు తీసుకోండి. అంటూ డబ్బులు ఇస్తాడు వాళ్ళు ఆశ్చర్య పోతూ…. ఇంకా నెల కాలేదు కదా అయ్యా డబ్బులు ఎందుకు.
జగదీష్…. పోయిన నెలలో ఐదు రోజులు పని చేశారు కదా. ఐదు రోజులకి ఇస్తున్నాను.
నీకు నెలకి మంచి జీతం భోజనం ఉంటుంది .
అని అంటాడు. అందుకు వాళ్ళు చాల సంతోషపడుతూ అతనికి కృతజ్ఞతలు చెప్పుకొని డబ్బులు తీసుకొని వెళ్ళి పోతారు.
ఇక ఇంట్లో వాళ్లంతా హాయిగా విశ్రాంతి తీసుకుంటారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *