గర్భవతి మేనత్త_ Telugu Stories- Stories in Telugu – Panchatantra Kathalu Kattapa kathalu

కృష్ణాపురం అనే ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో వసంత ఆంజనేయులు అనే భార్య భర్తలు ఉండేవాళ్ళు. వాళ్లకి రజనీ అనే ఒక కూతురు ఉండేది. వసంత రజినీ కన్నతల్లి కాదు. రజనీ కన్నతల్లి నా ప్రమీల రజనీ చిన్నతనంలోనే చనిపోవడంతో ఆంజనేయులు రజిని ని పెళ్లి చేసుకున్నాడు. వసంత రజినినీ సరిగ్గా చూసుకునేది కాదు. ఆమె అక్కడ ఎన్నో కష్టాలు పడుతూ తన జీవితాన్ని గడుపుతూ ఉంటుంది. ఆ కుటుంబం గడవడం కోసం ఆ భార్యాభర్తలిద్దరూ కూరగాయల వ్యాపారం చేసుకుంటూ ఉండేవాడు.

అలా వ్యాపారం చేసుకోగా వచ్చిన డబ్బుతో వాళ్ళ కుటుంబం గడిచిపోతూ ఉండేది.
అలా రోజులు గడిచాయి ఒకరోజు రజిని మేనత్త అయిన కళ్యాణి గర్భవతి కావడంతో పుట్టింటికి వస్తుంది.
ఆమెను చూసిన వాళ్ళ అన్నయ్య మరియు రజిని చాలా సంతోష పడతారు కానీ వసంత మాత్రం తన మనసులో…. అబ్బా మాకు తినడానికి తి కాణం లేదు అనుకుంటే . ఈమె వచ్చి పడింది హాస్పిటల్ ఖర్చులు. ఈమెకి పండ్లు మందులు ఎన్నో అవుతాయో ఏమో.
అనుకుంటూ చాలా అసూయ పడుతూ ఉంటుంది.
కాళీ రజనీ మాత్రం చాల సంతోషపడుతూ అత్త దగ్గరే ఉంటుంది. ఆమె రజనీపై చాలా ప్రేమ చూపిస్తూ ఉంటుంది దాన్ని చూస్తున్నా
వసంత మాత్రం కడుపుమంటతో రగిలిపోతుంటే ఉంది.
అలా రోజులు గడిచాయి . ఆంజనేయులు ఆరోగ్యం పాడైపోయి హఠాత్తుగా మరణిస్తాడు. వాళ్లు ఆ మరణాన్ని చూసి చాలా బోరున ఏడుస్తూ ….. భగవంతుడు ఎందుకు నాకు ఈ కర్మ. నేనేం చేశాను అని చెప్పి నా భర్త ని తీసుకెళ్లి పోయావు.
అంటూ భార్య బోరున విలపిస్తూ ఉంటుంది.
దాన్ని చూసిన వాళ్లు కూడా చాలా బాధపడుతూ ఉంటారు. ఆ పాప రజిని….. నాన్న ఒకసారి లే నన్నా ఒక్కసారి లే నాన్న ఒక్కసారి లే. అంటూ ఏడుస్తుంది.
వాళ్ల చెల్లి కూడా చాలా బాధ పడుతూ ఉంటుంది. అలా రోజులు గడిచాయి వసంత ఒకరోజు కళ్యాణి తో …… అమ్మ మహాతల్లి నువ్వు ఏ ముహూర్తాన ఇక్కడ అడుగు పెట్టావో కానీ. నా భర్త ప్రాణాలు తీసుకెళ్ళి పోయావు. చి చి ఆ కడుపులో ఉన్న బిడ్డ బయటకు వస్తే ఇంకా ఎన్ని అనర్ధాలు జరుగుతాయో ఏమో నేను ఒక్క క్షణం కూడా ఇక్కడ వుండను ఈ పాపిష్టి జీవితం బతికే కన్నా. ఎక్కడికన్నా వెళ్లి చావడం నయo అంటూ ఆమెను వదిలేసి. అక్కడి నుంచి తన పుట్టింటికి వెళ్ళిపోతుంది.
కళ్యాణి….. అయ్యో భగవంతుడా నేనేం చేయాలి. నేను ఇంటికి తిరిగి వెల్ల కూడదు.
అందుకు అందరూ అరిష్టం అంటారు. అంటూ బోరున విలపిస్తూ ఉంటుంది.
అప్పుడు రజిని…. అత్త ఎందుకనగా బాధపడుతున్నావు ఎవరు లేకపోతే ఏమైంది నేను ఉన్నా కదా. బాబు పుట్టిoతవరకు నేనే చూసుకుంటాను. నువ్వు దిగులుపడకు నాన్న బ్రతికి ఉంటే నిన్ను ఇలాగే వదిలేసి వెళ్లాడు కదా. నువ్వు బాధపడకు అత్త . అన్నీ నేనే చూసుకుంటాను.
అంటూ చెప్తుంది ఆ మాట విని ఆమె భోరున ఏడుస్తూ…. అమ్మ రజిని చిన్నదానివే అయినా నీ కాళ్ళు మొక్కాలి. మీ పెద్ద మనిషికి నా జోహార్లు తల్లి. అంటూ చాలా బాధపడుతుంది ఆ మరుసటి రోజు రజిని కూరగాయల బండి తోసుకుంటూ…. కూరగాయల అమ్మ కూరగాయలు కూరగాయలు తల్లి కూరగాయలు.అంటూ కేకలు వేస్తూ కూరగాయలు అమ్ముతూ ఉంటుంది.
అలా కూరగాయలు అమ్మి వచ్చిన డబ్బుతో
వాళ్ళ మేనత్త కు కావలసిన మందులు పండ్లు తీసుకుని వెళుతుంది.
దాన్ని చూసిన కళ్యాణి చాలా సంతోష పడుతూ ఆనందభాష్పాలు కురిపిస్తూ….. అమ్మ నేను అంటే నీకు ఎంత ప్రేమ.
నీ సవతి తల్లి నిన్ను నన్ను ఇద్దర్ని వదిలి పెట్టి వెళ్ళిపోయింది. ఇప్పుడు నువ్వే నాకు తల్లిలాగా అన్నీ చూసుకుంటావు నా అన్నయ్య చాలా అదృష్టవంతుడు.
ఆయన పై లోకం నుంచి నిన్ను చూసి గర్వపడుతూ ఉంటాడు. అంటూ ఆమెను కౌగిలించుకొని ఏడుస్తుంది.
రజిని… బాధ పడుకో అత్త ఇంకా ఎందుకు బాధ పడుతున్నావు. నువ్వు బాధపడి పైనున్న నాన్న ను కూడా బాధ పెడుతున్నావు . దయచేసి నువ్వు బాధ పడదు. అంటు నచ్చ చెబుతూ ఉంటుంది రోజులు గడిచాయి. ఆమె ప్రతిరోజూ కూరగాయల అమ్ముకొని ఇంటికి తిరిగి వస్తూ తన అత్తకు కావాల్సిన పండ్లు మందులు తీసుకెళ్తాను ఉంటుంది అలాగే ఒక రోజు
తన కూరగాయలు అమ్ముకొని. మందులు పండ్లు తన బండి మీద పెట్టుకుని ఇంటికి తిరిగి వస్తూ ఉంటుంది. మార్గ మధ్యలో మేఘాలు బాగా కంముకుపోతాయి.
వర్షం పడే లాగా ఉంటుంది దాన్ని చూసిన రజనీ తన మనసులో…. అయ్యో పెద్ద వర్షం పడే అలాగే ఉంది ఈ రోజు కూరగాయలు అమ్మడం బాగా ఆలస్యమయింది చీకటి పడుతుంది అని నేను కంగారు పడుతూ ఉంటే. ఇక్కడ వర్షం మొదలయ్యేలా ఉంది.
అని అనుకుంటూ ఉండగానే జోరున నా పెద్ద వర్షం మొదలవుతుంది. ఆమె పరిగెడుతూ చెట్టునీడకి వెళ్తుంది.
ఇంటిదగ్గర వాళ్ళ అత్తయ్య ఆమె కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. ఇంతలో ఆమెకు ప్రసవవేదన మొదలవుతుంది.
ఆమె పెద్దగా అరుస్తూ….. ఎవరైనా ఉన్నారా కాపాడండి నాకు నొప్పులు వస్తున్నాయి ఎవరైనా ఉంటే దయచేసి కాపాడండి. అంటూ కింద పడి గిలగిలా కొట్టుకుంటూ ఉంటుంది.
ఇక్కడ వర్షం లో చిక్కుకుపోయి రజిని చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది.
రజిని కి ఎందుకో తన మనసులో….. అయ్యో నేను ఇక్కడే ఆగిపోతే మా అత్తయ్య చాలా భయపడుతూ కంగారు పడుతూ ఉంటుంది.
పైగా నెలలు నిండాయి కదా ఏదైనా జరగకూడనిది జరిగితే అమ్మో. అలా జరగదు
నేను నడిచి వెళ్లిన మహా అయితే జలుబు జ్వరం వస్తుంది ఏమో కదా అంతకంటే ఏం కాదు. ఈ వర్షం చూస్తే ఇప్పుడలా తగ్గిలాగా లేదు. దేవుడి మీద భారం వేసి ముందుకు సాగుతాను అంటూ తన బండిని తోసుకుంటూ ఇంటికి వెళ్తుంది.
ఇంటిదగ్గర వాళ్ళ అత్తయ్య నొప్పులతో బాధపడుతూ ఉండడం చూసి చాలా కంగారు పడుతూ ….. అత్త అత్త ఏమైంది అత్త.నొప్పులు వస్తున్నాయా నేను ఎవరినైనా పిలుచుకు వస్తాను.
అంటూ చుట్టుపక్కల ఇంటికి పరిగెడుతుంది అక్కడ ఇంటి వాళ్ళు ఎవరు కూడా ఆమెకు సహాయం చేయడానికి ఇష్టపడరు ఎందుకంటే.నిండు చూలాలు ఇంట్లో అడుగు పెట్టిన తర్వాత దారుణం జరిగిందని.
అది పెద్ద పాపం అని .చుట్టుకుంటుంది అని ఎవ్వరు కూడా సహాయం చేయరు.
పాపం రజిని చాలా ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది. అప్పుడే ఆమెకు గంగవ్వ గుర్తుకొస్తుంది. ఆమె పరుగు పరుగున గంగవ్వ దగ్గరికి వెళ్లి….. అవ్వ అవ్వ మా అత్త నొప్పులతో చాలా ఇబ్బంది పడుతుంది ఎవరు కూడా మా ఇంటికి రావడానికి ఇష్టపడడం లేదు. దయచేసి నువ్వు మా అత్తకు సహాయం చెయ్యి . లేదంటే మా అత్తయ్య కూడా చనిపోతుంది నీ కాళ్లు పట్టుకుంటానవ్వ.
అంటూ భోరున విలపిస్తుంది.
ఆ మాటలు విన్న అవ్వకు కు జాలి కలిగి…
రజిని బాధ పడుకో నేను ఉన్నా వెళ్దాం పద అంటూ ఇద్దరూ కలిసి ఇంటికి వస్తారు.
గంగవ్వ ఆమెతో….. అమ్మ కొంచెం సేపు ఓపిక పట్టు. సుఖప్రసవం అవుతుంది అంటూ ఆమెకు ధైర్యం చెబుతూ ఉంటుంది.
బిడ్డ అడ్డం తిరిగాడు అని ఆమెకు అర్థం కావడంతో…. అమ్మ రజిని లోపల బిడ్డ అడ్డం తిరిగాడు ఇక్కడే ఉంటే తల్లి బిడ్డ ఇద్దరికీ ప్రమాదమా తొందరగా హాస్పిటల్కు తీసుకు వెళ్లాలి. అని చెబుతుంది ఆ మాటలు విన్న రజనికి కాలు చేయి ఆడదు.
అంకు ఏం చేయాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉండగా అప్పుడు ఆమె…. అవ్వ నాకు సాయం పట్టు. నేను కూరగాయల బండి మీద మా అత్తని తీసుకొని హాస్పిటల్ కి వెళ్తాను అంటూ ఆమె చేత సాయం పట్టించుకోని కూరగాయల బండి పైన ఆమెను పడుకోబెట్టి బండినీ తోసుకుంటూ హాస్పిటల్ కి చేరుకుంటుంది.
అప్పుడే అక్కడున్న డాక్టర్ మౌనిక ఆమెను చూసి హాస్పటల్ లోపలికి తీసుకువెళ్లి వైద్యాన్ని మొదలు పెడుతుంది.
అప్పుడు రజనీ బయట నిలబడి ….. అయ్యా భగవంతుడా నాకు అమ్మానాన్న ఎవరూ లేరు. మా అత్తయ్య అంటే నాకు చాలా ఇష్టం అది కూడా నేనంటే ఇష్టం నువ్వు ఆమెకి ఏం కాకుండా చూడు. ఆమెకు ఏదైనా అయితే నేను పూర్తిగా అనాదిగా అయిపోతాను.
లోపలున్న బిడ్డ తల్లి ఇద్దరు క్షేమంగా ఉండేలాగా చూడు అంటూ భగవంతుని ప్రార్ధిస్తూ ఉంటుంది.
కొంత సమయం తర్వాత డాక్టర్ మౌనిక బయటకు వచ్చి రజినీతో….. పాప నువ్వు ఎవరో కానీ సరైన సమయానికి ఆమెను తీసుకు వచ్చావు లేదంటే ఇద్దరు చనిపోయే వాళ్లు. ఇంతకీ ఆమె ఎవరు.
రజిని…. మా అత్తయ్య అంటూ జరిగిన విషయం చెప్తుంది.
దాన్ని విన్న డాక్టర్ చాలా ఆశ్చర్య పోతూ…. సమాజంలో ఇలాంటి మనుషులు ఇంకా మూఢనమ్మకాలతో బ్రతుకుతున్నారు కానీ అవ్వ చాలా మంచిది అలాగే నీ గుండె ధైర్యానికి ఒప్పుకోవచ్చు చాలా మంచి పని చేశావు. అంటూ ఆమెను పోగొడుతుంది.
రజిని… డాక్టర్ మా అత్తయ్య కు ఏం కాలేదు కదా.
ఆమె…. మీ అత్తయ్య కు ఒక పాప పుట్టింది.
ఇద్దరూ క్షేమంగా ఉన్నారు నువ్వు వెళ్లి చూడొచ్చు.
అని అంటుంది అప్పుడు రజినీ చాలా సంతోష పడుతూ… డాక్టర్ గారు కానీ నా దగ్గర డబ్బులు లేవు నీకు డబ్బులు కావాలి అంటే నేను నా కూరగాయల వ్యాపారం చేసుకుంటూ కొద్దికొద్దిగా ఇస్తాను. సరేనా అందుకు ఆమె….పాప నాకు డబ్బులు ఏమీ అవసరం లేదు నువ్వు ఒక్క రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది నా సొంత హాస్పిటల్ పేదలకి నేను ఉచితంగానే వైద్యం చేస్తూ ఉంటాను. సరేనా అవన్నీ మర్చిపోయి లోపలికి వెళ్ళిన మీ అత్తనీ చూడు
అని అంటుంది అందుకామె సరే అని సంతోష పడుతూ అత్త దగ్గరికి వెళుతుంది.
వాళ్ళ అత్త చేతులెత్తి నమస్కరించిన…. రజిని నీకు దండాలు సరిపోవూ. నన్ను బిడ్డని కాపాడావు నీకు చాలా కృతజ్ఞతలు. అంటూ కంటతడి పెట్టుకుంది రజిని ఆమెను పట్టుకొని…. అత్త అలా మాట్లాడకు నాకు నువ్వు తప్ప ఎవరు లేరు కదా. నువ్వు సంతోషంగా ఉంటేనే నేను కూడా సంతోషంగా ఉంటాను. అని అంటుంది ఇద్దరు ఆ బిడ్డను చూసి సంతోష పడుతూ ఉంటారు.
రెండు రోజులు గడిచాయి ఆ తర్వాత అందరూ ఇంటికి తిరిగి సంతోషంగా వెళ్ళిపోతారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *