గర్భవతి 12 కోతులు | Telugu Kathalu | Bedtime Stories | Panchatantra kathalu | Fairy Tales

రామాపురం అనే గ్రామం ఎప్పుడు కోతుల బాధతో సతమతమవుతూ ఉండేది. అలా ఉండగా ఆ ఊరిలో రాజమ్మ అనే మహిళ ఉండేది. ఆమెకి పెళ్లి అయ్యి చాలా సంవత్సరాలు అవుతున్నా పిల్లలు పుట్టడం లేదని ఎంతో బాధపడుతుంటారు, ఒకరోజు రాజమ్మ పక్కన ఇంట్లో ఉండే ప్రమీల అనే మహిళ దగ్గరికి వెళ్తుంది.

ప్రమీల :- ఏమమ్మా రాజమ్మ నీకు కొంచమైనా ఆలోచన ఉందా? శుభమా అని ఈరోజు మా ఇంట్లో మాకొడుకు పుట్టిన ఆరోజు వేడుకలు జరుగుతుంటే పిల్లలు జిల్లాలు లేని బొడ్రాలువి నీవు మా ఇంటికి వచ్చి మా వాడిని  ఆశీర్వదించుదామని వచ్చ్చావా? నీ ఆశీర్వాదాలు వా వాటికి తగులుతాయా? నీ లాంటి వాలు ఎదురు పడితే అపశకునాలు జరుగుతూనే ఉంటాయి, నిన్ను మా వాలు ఎవరో తెలియక పిలిచి ఉంటారు, నీకు కావలసిన ఆహారాన్ని మీ ఇంటికి పంపిస్తాను కానీ నువ్వు ఇక్కడ నుండి తక్షణమే వేళ్ళు అని అంటుంది ఆ మాటలకు రాజమ్మ ఎంతో బాధ పడుతుంది. అక్కడ జరిగిన విషయానంతా ఇంటికి వెల్లి తన భారత కుమార్ కి చెబుతుంది.

రాజమ్మ మాటలు విన్న కుమార్

కుమార్ :_ చూడు రాజమ్మ, మనకి పిల్లలు పూటడం కోసం ఎన్నో పుణ్యక్షేత్రాలు తిరిగాము, ఈంతో మంది వైద్హ్యులని కలిసాము, అయినా లాభం లేకుండా పోయింది, పిల్లల కోసం ఆ దేవుడి మీద భారం వేసి మనం ఎదురు చూడం తప్ప మన చేసేది ఏమి లేదు అని అంటాడు.

అలా ఉండగా ఆమెకి పెళ్లి అయిన చాలా సంవత్సరాల తరువాత ఆమె గర్భవతి అవుతుంది. రాజమ్మ గర్భవతి అయ్యిందని రాజమ్మ భర్త కుమార్ ఎంతో సంతోషపడతాడు.

కుమార్ :- రాజమ్మ మనం ఎన్నో రోజులుగా పిల్లల కోసం తిరగని  పుణ్యక్షేత్రాలు లేవు, దేవుడు మనపై దయ ఉంచి ఇప్పటికైనా నిన్ను కరుణించాడు, ఇక నిన్ను ఊరిలో ఎవరు ఊరిలో బొడ్రాలు అని అవమానించరు. మనం చేయని తప్పుకి ఇన్ని రోజులు ఎంతో బాధ పడ్డాము, ఇక ఊరందరి ముందు మనం దర్జాగా తిరగొచ్చు, ఇక ఎవరు ఏమంటారో అని తల దించుకుని తిరగాల్సిన ప్పని లేదు ఐ  అంటాడు

రాజమ్మ ; అవునండి నేను గర్భవతిగా అయినా తరువాత నాకు తెలియని సంతోషంలో నాకు నేనే చాలా కొత్తగా అకనిపిస్తున్నాను అని అంటుంది. అలా కుమార్, రాజమ్మ ఎంతో ఆనందంగా రోజులు గడుపుతూ ఉంటారు, అనుకోకుండా ఒకేరోజు కుమార్ రాజమ్మ దగ్గరికి వచ్చి

కుమార్ :-రాజమ్మ నేను ఒక అత్యవసర పని మీద వేరే ఊరు వెళ్లవలిసి వస్తున్నది, నేను మల్లి తిరిగి రావడానికి ఒక వారం పట్టవచ్చు, నువ్వు ఇప్పుడు గర్భిణివి నన్ను వదిలి వెళ్లడం నాకు ఇష్టం లేదు కానీ రేపు పుట్టబోయే బిడ్డ కోసం ఆలోచించి ఇప్పుడు నేను వెళ్ళవలసి వస్తుంది, అసలే మన ఊరిలో కోతుల బాధ ఉంది నువ్వు జాగరత అని చెప్పి వేరే ఊరు ప్రయాణ అవుతాడు కుమార్

రాజమ్మ :- నేను జాగ్రత్తగానే ఉంటానండి మీరే వేరే వేరే ఊళ్లు వెళ్తున్నారు అక్కడ ఆహరం నిద్ర ఎలా ఉంటుందో, అక్కడ పరిస్థితులు ఎలా ఉన్న సరైన సమయానికి తిని సమయానికి పడుకోండి అని చెబుతుంది రాజమ్మ

అలాగే అని చెప్పి కుమార్ వెళ్ళిపోతాడు.

కుమార్ వెళ్ళుపోయిన రోజు రాజమ్మ ఏంతో బాధ పడుతూ తన కడుపులో పెరుగుతున్న బిడ్డని చూసుకుంటూ పడుకుంటుంది. ఉదయం లేవగానే రాజమ్మ కి ఏదో అలికిడి వినిపిస్తూ ఉంటుంది. ఆ అలికిడికి రాజమ్మ నిద్రలేచి అలికిడి వినిపించే వైపుగా వేళ్తుంది.

అప్పుడే అక్కడో ముసలి కోతి కూర్చుని ఎదో తింటూ కనిపిస్తుంది , ఆ ముసలి కోతిని చూసిన రాజమ్మ

రాజమ్మ : ఓ ముసలి కోతి ఇక్కడికి ఎందుకు వచ్చావు, ఎంత ధైర్యం ఉంటె నా దగ్గరికి వచ్చి నిల్చొని ఉంటావు అని అరుస్తుంది రాజమ్మ ఎంతో కో[అనగా

ముసలికోతి ;- అమ్మ నేను ఓక అనాధని, నాకు బంధువులు అంతో ఎవరూ లేరు, అడవిలో దొరికిన ఫాంలమో పండో తింటూ తిఱుగుతూ బ్రతికేదానిని, కానీ ఇప్పుడు అడవులు అన్ని కొట్టివేయడం వల్ల  మా లాంటి ప్రాణులకి తిండి తిప్పలు లేక ఇక తప్పక ఇలా ఇలమీద పది దోచుకు తినవలసి వస్తుంది. అని అంటుంది

ఆ ముసలి కోతి చెప్పిన మాటలు ఏమాత్రం చెవుకు ఎక్కించుకొని రాజమ్మ ఒక పొడవైన కర్రని తీసుకొని ఆ ముసలి కోతి తలపైనా బలంగా కొడుతుంది. ఆ దెబ్బకు ముసలి కోతి గిల గిలా కొట్టుకొని పడిపోతుంది కోసం ప్రాణాలతో ఉన్న కోతి గర్భవతి రాజమ్మతో

కోతి :- ఓయ్ రాజమ్మ నేను నిన్ను బ్రతిమి లాడుకుంటూ ఉన్నప్పటికీ నేను ఓకే ఆముసలి కోతిని అనే జాలి కూడా లేకుండా నన్ను చచ్చేలా కొట్టావు, ఇలా ఒక ప్రాణిని హింసించే నీకు ఇంకొక జీవితాన్ని ఇచ్చే అర్హత లేదు, ఇప్పుడు నేను ఏమి చేస్తానో చూడు అని చెప్పు తన చేతితో రాజమ్మ కడుపు పై ఎదో చేసి మాయం అవుతుంది.

అప్పుడు రాజమ్మ కడుపులో ఎలాంటి మార్పులు రాక పోవడంతో ముసలి కోతి చనిపోయే ముందు బాధకి ఎదో అన్నదిలే అని కొట్టి పారేస్తుంది రాజమ్మ

అలా కొన్ని రోజలు గడుస్తాయి, రాజమ్మకి పురిటి నొప్పులు వస్తాయి, వెంటనే కుమార్ దగ్గరలో ఉన్న ఒక పెద్ద అహొస్పిటల్ కి తీసుకెళ్తాడు రాజమ్మని

ఆ కాన్పులో రాజమ్మ 12 కోతి పిల్లలకి జన్మని ఇస్తుంది అది చూసి వైద్యులు మరియు కుమార్ ఎంతో ఆశ్చర్యపోతారు.

ఆ 12 కోతి పిల్లలని చూసిన రాజమ్మకి ముసలి కోతి మాటలు గుర్తుకు వస్తాయి

కుమార్ ;- ఏంటి రాజమ్మ ఇలా జరిగింది? మనకి కోతి పిల్లలు పుట్టడం ఏంటి ?

రాజమ్మ :- ఇదంతా నేను చేసిన పొరపాటే అండి, నేను గర్భవతిగా ఉన్నప్పుడు ఒక ముసలి కోతి మన ఇంటికి వచ్చినప్పుడు నేను కర్రతో కొడితే అది చనిపోయింది, అది చనిపోతూ పోతు నాకు ఈ శాపం ఇచ్చి పోయింది, అప్పుడు నేను పట్టించుకోలేదు ఇలా అవుతుందని అస్సలు అనుకోలేదండి అని ఏడుస్తుంది రాజమ్మ

కుమార్ :- సరేలే ఎలాగయితే ఏంటి కోతులైన మనుషులైన నీ కడుపునా పుట్టిన పిల్లలే కదా? ఎవరైనా మన పిల్లలే కదా, ఇప్పటినుండి ఆ చనిపోయిన ముసలి కోతి ఇచ్చిన శాపమే వరంలా భావించి ఈ కోతి పిల్లలే మనం పిల్లలుగా భావించి పెంచుకుందాము అని అంటాడు కుమార్

ఆ నాటి నుంచి ఆ పన్నెండు కోతి పిల్లలనే అపురూపంగా పెంచుకుంటూ ఉంటారు రాజమ్మ కుమార్

Add a Comment

Your email address will not be published. Required fields are marked *