గుమ్మడి కాయలో మాయా పిల్లడు Telugu Stories | Telugu Moral Stories | Telugu Kathalu | Fairy Tales

ఒక ఊరిలో అనురాధ అనే ఒక పేద మహిళా ఉండేది, ఆమెకు ఒక కూతురు ఉండేది ఆమె పేరు మౌని, మౌని చాలా చురుకైన అమ్మాయి,  తన తల్లికి ఎప్పుడు చేతి సహాయంగా ఉండేది, అనురాధ మరియు మౌని లకు ఒకరంటే ఒకరికి అమితమైన ప్రేమ ఒకరిని విడిచి ఒకరు ఉండగలిగే వారుకాదు, వాళ్లకి వంశపారంపర్యంగా వస్తున్న కొంత భూమి ఉండేది, దాంట్లో ఎన్ని పంటలు వేసినా దాన్ని పండించడానికి ఎంత  కష్టపడినా పంట చేతికి వచ్చేటప్పడికి వాళ్ళు పెట్టిన పెట్టుబడి కంటే కొంత వరకే లాభం వచ్చేది. ఒకేరోజు అనురాధ తన పొలం దగ్గర కూర్చొని  తనలో  ఇలా అనుకుంటుంది.

అనురాధ : నేను ఎంత కష్టపడినా ఎంత పని చేసినా కూడా ఏంటి ఎప్ప్పుడు పొలం లో పంట నేను ఆశించినంత పండడమేలేదు , ఒకవేళ పండినా అమ్మేటప్పుడు ధర మాత్రం పలకడం లేదు, ఇలా అయితే మా పేదరికం పోయేది ఎప్పుడు, నేను పేదరికం లో ఉన్నానని నా బిడ్డ జీవితాన్ని కూడా ఈ పేదరికానికి అంకితం చేయాలా ఏంటి? ఎలా ఎలాగైనా సరే నేను నా పేదరికాన్ని దూరం చేసుకోవాలి. ఇక లాభం లేదు నేను కూలి పనులు చేసి అయినా సరే కొంత డబ్బులు సంపాదించాలి అని అనుకుంటుంది.

ఇంతలో అక్కడికి మౌని కూడా వస్తుంది.

తల్లిని చూసిన తరువాత మౌని ఇలా అంటుంది.

మౌని : అమ్మ ఏంటమ్మా నువ్వు ఇక్కడ ఉన్నావు, ఈ కోసం ఎక్కడెక్కడో వెతుకుతున్నాను, నీకొక మంచి విషయం చెప్పాలి అని అంటుంది.

అనురాధ : మంచి విషయమా ఏంటమ్మా అది?

మౌని : అమ్మ మొన్న మా స్కూల్ కి వ్యవసాయం దాని ప్రాముఖ్యత గురించి చెప్పడానికి కొందరు అద్దికారులు బయట నుంచి వచ్చారు, వాళ్ళ తో నేను మన భూమి గురించి చెప్పాను, ఏ పంట వేసినా సరిగా పండడం లేదని అప్పుడు వాళ్ళు మామ భూమిలో కొంత మట్టిని తీసుకురమ్మంటే తీసుకెళ్ళాను, వాళ్ళు దానిని పరీక్షించి మన పొలం లో మంచి గుమ్మడికాయలు అయితే చాలా గొప్ప దిగుబడి వస్తుందని చెప్పారు, మనం ఇప్పుడు మంచి గుమ్మడి కాయల పంట వేద్దాం అమ్మ అని అంటుంది.

అనురాధ : ఎన్ని రకాల పంటలు వేసినా లాభం లేనప్పుడు దీంతో మాత్రం ఏమి ఉపయోగం ఉన్నటుందమ్మా అని అంటుంది.

మౌని : అమ్మ  మనం ఇప్పటి వరకు ఎన్నో రకాల పంటలు వేసి సరిగా పండక, లేదా పంట పాడయ్యి ఎన్నో సార్లు నష్టాలు చూసాం కదా ఇప్పుడు ఒక్కసారికి  గుమ్మడికాయల పంట వేసి చూడా ఒకవేళ మంచి గానే లాభం వచ్చింది అనుకో మనకి మంచిది, లేదా ఏమి రాలేదు అనుకూ ఎప్పటిలాగానే ఉంటాము, మన జీవితాల్లో పెద్ద తేడా ఏమి  ఉండదు కదా అమ్మ, ఈ ఒక్కసారికి వేసి చూద్దాం అమ్మ అని అంటుంది.

అనురాధ : సరే నీ మాట మాత్రం ఎందుకు కాదనాలి వస్తే లాభం లేదంటే ఎప్పటి బ్రతుకులే అని అంటుంది  అనురాద్ధా

కొన్ని రోజుల్లోనే అనురాధ మౌని కలిసి గుమ్మడి కాయల పంట వేస్తారు, మొక్కలు చాలా బాగా పెరుగుతాయి. పంట అంత పెద్దగా పెరగడం చూసిన మౌని ఇలా అంటుంది.

మౌని : అమ్మ ఈ సారి పంట బాగా పెరిగేలా ఉంది, ఇదిగో ఇదే పంటలో మొదటి కాయ దీనిని మనమే కోద్దామా అమ్మ అని అని ఒక గుమ్మడి కాయని తీసుకువస్తుంది.

అనురాధ : సారె అమ్మ అన్ని అనుకూలంగా జరిగితే మన జీవితం లోనే అత్యంత గొప్పగా పండిన పంట ఇదే అవుతుంది, దీనికి తోడు మంచి మద్దతు ధర పలికితే మనం ఉన్న పళంగా ధనవంతులం అయిపోవచ్చు, సరే నీ కోరిక మేరకు మొదటి కాయను నువ్వవే కొయ్యి అని అంటూ కత్తి మౌని చేతికి ఇస్తుంది అనురాధ.

మౌని కత్తితో గుమ్మడి కాయను కోయగానే అందులో నుంచి ఒక పిల్లవాడు బయటకు వస్తాడు, మౌని ఆశ్చర్యపోతూ పిల్లవాడిని చేతుల్లోకి తీసుకుంటుంది, అనురాధ కూడా ఆశచరపోతూ గుమ్మడి కాయలో చూడగానే ఇంకొక పిల్లవాడు ఉంటాడు, అతన్ని కూడా అనురాద చేతుల్లోకి తీసుకోగానే గుమ్మడి కాయ ముక్కలో నుంచి బంగారు నాణాలు బయటకు వస్తూ ఉంటాయి, అది అంత జరగడం చూసిన మౌని ఇలా అంటుంది,

మౌని : అమ్మ ఇదంతా నిజమేనా నాకు నమ్మబుద్ది కావడం లేదు, కనీసం నమ్మేలా కూడా లేదు, మా స్కూల్కి ఎవరో రావడం ఏంటి, మనల్ని గుమ్మడి తోట పెట్టమనడం ఏంటి ? నేను మొదటి కాయ వెతికి వెతికి తీసుకురావడం ఏంటి? అందులోనుంచి ఇలా ఇద్దరు పిల్లలు వాళ్ళతో పాటు ఇంతలా బంగారం రావడం ఏంటి ? ఇదంతా నాకేదో మాయ లా కనిపిస్తుంది అమ్మ అని అంటుంది.

అనురాధ : అంత అమ్మ దేవుడి లీలలు ఎవరికీ అర్ధం కావు, నాకు తెలిసి ఈ ఇద్దరు పిల్లలు భూమి మీదకు రావడం వలన దైవ కార్యాలు ఏవైనా జరగాల్సిఉందేమో అందుకే దేవుడు ఇలా వీళ్ళని పంపించాడు, అలాగే వీలని చూసుకోవడానికి ఇంత సంపద కూడా ఇచ్చాడు అని అంటుంది. అప్పటి నుంచి అనురాధ మౌని ఇద్దరు మాయా పిల్లలని ఎంతో ప్రేమగా, దేవుడి పుత్రులు అన్న విధంగా చూసుకుంటూ ఉంటారు,

ఈ అసంవత్సరం వాళ్ళ పంట కూడా చాలా గొప్పగా పండింది, ఏఈ ఒక్క లాభం తో అనురాధ మౌని ధనవంతులు అయిపోయారు.

షార్ట్ స్టోరీ

అనురాధ అనే ఒక పేద మహిళా కి మౌని అనే ఒక కూతురు ఉండేది, వాళ్లకు వంశ పారపర్యంగా వచ్చిన కొంత భూమి కూడా ఉండేది, దాంట్లో వాళ్ళు కొన్ని సంవత్సరాలుగా పంటలు పండిస్తున్నా పెద్దగాలాభం వచ్చింది లేదు, ఒకసారి మౌని సీప్పిన మాట ప్రకారం ఆ భూమిలో గుమ్మడితోట వేశారు, పంట బాగానే పండింది, ఒకేరోజు మౌని ఒక గుమ్మడికాయని తీసుకొచ్చి కోయగా అందులో ఇద్దరు పిల్లలు వస్తారు బీవాళ్ళతో పాటు బంగారం కూడా వస్తుంది, మౌని అనురాద ఆ పిల్లల్ని ప్రేమగా చూసుకుంటూ ఉంటారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *