చందమామ దొంగతనం 2 Telugu Story – Telugu Kathalu -Telugu Fairytales – Kattappa Kathalu | Fairy tales

రంగాపురం అనే గ్రామం ఉంది. అది ఒక పెద్ద గ్రామము ఆ గ్రామానికి ఆనుకొనే ఒక పెద్ద అడవి ఉండేది. ఆ అడవిలో ఒక పిరికి దెయ్యం నివసిస్తుండేది. దానికి మనుషులన్న, జంతువులన్నా చచ్చేంత భయం. ఆ దెయ్యానికి భయం తో పాటు ఆకలి కూడా ఎక్కువే, ఆకలిని తట్టుకోలేక ఊరిలో ప్రజలందరూ పడుకున్న తరవాత మెల్లగా చప్పుడు కాకుండా ఎవరో ఒకరి ఇంట్లో దూరి, గుట్టు చప్పుడు కాకుండా ఉన్నదేదో తినేసి తిరిగి అడవిలోకి వెళ్లిపోయేది, కానీ పౌర్ణమి నాడు చంద్రుడు ప్రకాశవంతంగా వెలగడం వల్ల ఈ పిరికి దెయ్యానికి ఊరిలోకి వెళ్లి ఎవరింట్లో అయినా ఏదైనా తినాలంటే ఆ ఇంటి వాళ్ళు లేస్తారేమో అని తెగ భయపడిపోయేది, ఆ భయ్యం వల్ల ఆ దెయ్యం  పౌర్ణమి నాడు పస్తులు ఉండక తప్పేది కాదు.

అదే ఊరిలో రమేష్ అనే ఒక వ్యక్తి ఉండేవాడు, అతనికి ఒక కూతురు ఉండేది, ఆమె పేరు చిన్నారి, చిన్నారి ఎంతో తెలివైన పిల్ల, వాళ్ళ నాన్నకి పొలం పనులలో చేదోడు వాదోడుగా ఉంటూనే చదువులో ఎప్పుడు ముందు ఉండేది. కానీ చిన్నారికి మూడు పూటలా ఆహారం పెట్టడం కోసం రమేష్ రోజు పగలు రాత్రి అని తేడా లేకుండా ఎంతో కష్టపడేవాడు, అయినప్పటికీ వాళ్లకి ఒక్కొక రోజు తినడానికి ఇబ్బంది అయ్యేది కూడా, ఇలా ఉన్నదాంట్లో తింటూ, లేని నాడు పస్తులు పడుకుంటూ జీవనం గడిపేస్తుంటారు రమేష్ తన కూతురు చిన్నారి తో

ఇంతలో ఒకరోజు చిన్నారి పుట్టిన రోజు దగ్గరికి వస్తుంది. అప్పుడు చిన్నారి రమేష్ తో

చిన్నారి :- నాన్న ఇంకో రెండు రోజుల్లో నా పుట్టిన రోజు ఉంది కదా? నా ఫ్రెండ్స్ అందరు పుట్టిన రోజు వేడుకలకి నన్ను ఇంకా మిగిలిన నా ఫ్రెండ్స్ ని పిలిచి కేక్ కటింగ్ చేసి ఎంతో ఘనంగా జరుపుకుంటారు, కానీ మనకు అవన్నీ లేవు కదా నాన్న, అమ్మ ఉంది ఉంటె అవన్నీ ఉండేవా నాన్న అని అడుగుతుంది చిన్నారి. ఆ ప్రశ్నలకి సమాధానం ఎలా చెప్పాలో అర్ధం కాలేదు రమేష్ కి

రమేష్ :- చిన్నారి, నువ్వన్నట్టు మీ ఫ్రెండ్స్ అందరు పుట్టినరోజు వేడుకలు చాలా ఘనంగా జరుపుకున్నారు నిజమే కానీ వాళ్ళ నాన్నలు ఎంతో ధనవంతులు అమ్మ, నా దగ్గర అంత ఘనంగా చేసే అన్ని డబ్బులు కాదుకదా ఇప్పటికి ఇప్పుడు కావాలంటే ఒక్క రూపాయి కూడా   లేదు తల్లి, అయినా మన లాంటి పేద వాళ్లకి అలాంటి వేడుకలు కుదరవమ్మ అలాంటి ఆలోచనలు ఏమి పెట్టుకోకుండా అవెళ్లి పడుకో అని చిన్నారికి నచ్చ చెప్పి పంపిస్తాడు రమేష్

కానీ రమేష్ కి మాత్రం చిన్నారికి ఏదైనా తీసుకురావాలని ఉన్నాప్పటికీ ఏమి చేయలేని పరిస్థితుల్లో ఉన్నాడు.

రమేష్ :- అయ్యో దేవుడా ఏంటి నాకు ఈ కర్మ, నా కూతురు లేక లేక అడిగిన ఒక్క కోరికను కూడా నేను తీర్చలేక పోతున్నానే, ఏంటి నాకి దుస్థితి, కూతురు అడిగిన ఒక చిన్న కోరికని కూడా తీర్చలేని నాలాంటి తండ్రి ఉంటె ఎంత పోతే ఎంత అని తెగ భాధ పడిపోతాడు.

ఎలాగైనా సరే నా కూతురు కోసం ఎదో ఒకటి చేయాలి అని ఆలోచించుకుంటూ  ఉంటాడు.

ఉదయం లేచిన వెంటనే రమేష్ తన స్నేహితుడైన విమల్ దగ్గరికి వెళ్లి మల్లి కొన్ని రోజుల్లో వడ్డీ తో సహా తిరిగి ఇచ్చేస్తానని చెప్పి కొంత డబ్బు అప్పుగా తెస్తాడు. అప్పుగా తెచ్చిన డబ్బుని చూస్తూ రమేష్ ఇలా అనుకుంటాడు

రమేష్ :- చిన్నారి నన్ను అడిగిన ఒక్క మాట కోసం నాకు తోచినంతలో నా వంతుగా ఎదో ఒకటి చేయాలి అనుకుంటున్నాను, నా దగ్గర ఉన్న ఈ డబ్బుతో మంచి మంచి ఆహారం తీసుకువస్తాను, చిన్నారి లేవగానే వీటన్నిటిని చూసి ఎంతో సంతోషిస్తుంది, అని అనుకోని మంచి మంచి పిండివంటలు అన్ని చేయించి వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి చిన్నారికి తెలియకుండా దాచాలి అనుకుంటాడు

రమేష్ :- ఇప్పుడే ఈ పిండి వంటలన్నీ మన దగ్గర ఉన్నాయి అని చిన్నారికి చెప్పను, రేపు తాను చూడగానే తన కళ్ళల్లో ఆనందం నేను చూడాలి అని అనుకోని ఆ పిండి వాంబితాలన్నీ ఒక గదిలో పెట్టి వెళ్లి పడుకుంటాడు రమేష్

ముందు రోజు పౌర్ణమి అవ్వడంతో ఎమితినకుండా ఉన్న ఆ దెయ్యానికి ఎంతో ఆకలి వేస్తుంది, ఆకలి కదుపుతూ ఊరిలోకి వచ్చిన దెయ్యానికి రమేష్ వాళ్ళ ఇంటినుంచి గుమగుమలాడే వాసన వస్తూ ఉంటుంది

దెయ్యం :- ఏంటి ఈ ఇంటిలోకి ఎన్ని సార్లు పోయినా కూడా ఎప్పుడూ గిన్నెలన్నీ కాలీగా ఉండేవి, ఇప్పుడు ఈ ఇంట్లోనుండి గుమగుమలాడే వాసన వస్తుంది,, ఏదైతే మనకేంటి ఆకలితో చచ్చి దెయ్యమై నేనే మల్లి చచ్చిపోయేలా ఉన్నాను, ముందుగా వెళ్లి ఆ వంటల పని పట్టాలి అని అనుకున్నదే తడువుగా ఇంటిలోకి దూరి[పోతుంది దెయ్యం, పొద్దున్న దాకా కూర్చుని ఆ వంటలన్నీ ఎంతో రుచిగా ఉండడం తో  నడవలేంత ఎక్కువగా తింటుంది. అంత తిన్న తరువాత కదలలేక అక్కడే పడుకుంటుంది దెయ్యం.

తెల్లారి రమేష్ చిన్నారికి ఆశ్చర్యం కలిగిద్దాం అనుకున్న రమేష్ కి నిరాశే మిగులుతుంది

రమేష్ :- అమ్మ చిన్నారి  నిన్నంతా కష్టపడి నీకోసం ఎన్నో రకాల పిండి వంటలు చేయించాను, ఇప్పుడు అవన్నీ ఎవరో తినేశారు, ఇప్పుడు ఏమి చేయాలో నాకు అర్ధం కావట్లేదు తల్లి అని ఏడుస్తూ రమేష్ వేరే గదిలోకి వెళ్ళిపోతాడు, ఆ మాటలకూ స్పృహలోకి వచ్చిన దెయ్యం చిన్నారిని చూసి భయపడుతూ ఉంటుంది, అప్పుడు చిన్నారి

చిన్నారి :- ఇంత ఎక్కువ వంటలన్నీ నువ్వు ఒక్కదానివే తినేసావంటే నువ్వు ఎంత ఆకలితో ఉన్నవో నాకు అర్ధమవుతుంది, నన్ను చూసి కూడా నువ్వు దాక్కుంటున్నావంటే నువ్వు ఒక పిరికి దేయ్యనివి, నేన్ను నిన్ను ఏమి చేయను బయటకు రా అని దెయ్యాని పిలుస్తుంది చిన్నారి

చిన్నారి మాటలకు సంతోషపడిన దెయ్యం చిన్నారి దగ్గరికి వచ్చి తన ఆకలి గురించి, భయాల గురించి మొత్తం చిన్నారికి చెబుతుంది

అప్పుడు చిన్నారి పెద్దగా నవ్వుతూ

చిన్నారి :- ఇంత చిన్న దానికే నువ్వు ఇంత భయపడుతున్నావా> నీకు నేనొక సలహా చెప్తాను విను, నీకు రాత్రి సమయం లో చంద్రుడి వెలుతురు రావడం వల్లే కదా నీకు ఈ ఆకలి కష్టాలు. నా మాట విని నిండు పున్నమి రోజు చంద్రుడిని దొంగతమ్ చేసి ఈ ఊరికి చాలా దూరంగా వదిలేసి రా అప్పుడు ఈ ఊరిలో అసలు వెలుతారన్నదే రాదు దానివల్ల నీళ్లు ఎలాంటి భయాలు ఉండవు అని చెబుతుంది

ఆ సలహా దెయ్యానికి ఎంతో నచ్చి ఆ రోజు రాత్రే చంద్రుడిని దొంగతనం చేసి పడవలో పెట్టుకొని నదిలో ప్రయాణం చేసి చాలా దూరంగా వదిలేసి వస్తుంది. ఆ రోజు నుంచి ఆ ఊరిలో రాత్రి సమయాల్లో అసలు వెలుతురు అనేదే వచ్చేది కాదు, దాంతో దెయ్యానికి తిండి కష్టాలు తొలగి పోయాయి, ఆ రోజునుంచి దెయ్యం మరియు చిన్నారి మంచి స్నేహితులుగా మారారు, ఎప్పుడైనా ఏదైనా మంచి వంటకం దొరికితే దెయ్యం చిన్నారికి కూడా తీసుకువచ్చి ఇచ్చేది, ఈ విదంగా చందమామ ని దొంగిలించిచిన్నారి , దెయ్యం ఆకలి కష్టాలు తీర్చుకున్నారు

Add a Comment

Your email address will not be published. Required fields are marked *