చందమామ దొంగతనం | Telugu Kathalu | Bedtime Stories | Panchatantra kathalu |Comedy Videos |Fairy Tales

ఒకానొక కాలంలో విష్ణుపురం అనే గ్రామం ఉండేది, ఆ ఊరిలో ప్రజలతో పాటు ఒక దెయ్యం కూడా నివసిస్తుండేది, కానీ వాళ్ళతో నివసించేది దెయ్యం అని ఊరి ప్రజలెవరికి తెలియదు దానికి కారణం లేకపోలేదు, ఎందుకంటే ఆ దెయ్యానికి తన భయంకర రూపం మరియు శక్తులు కేవలం చంద్రుడు ఉన్నంత సేపు మాత్రమే ఉంటుంది, చంద్రుడు వచ్చేది రాత్రి సమయం లోనే కావడం తో ఆ దెయ్యాన్ని షికారు చేయడానికి ఏ అడ్డు ఆపు ఉండేది కాదు, మిగిలిన ఉదయం మొత్తం సాధారణ మహిళా లాగా జీవితం కొనసాగించేది, అలా ఉండగా ఒక నిండు పౌర్ణమి రోజ్జు ఆ దెయ్యాన్ని షికారుకు వెళ్ళాలి అనిపించింది.

దెయ్యం : హమ్మయ్య ఈరోజు పౌర్ణమి రోజు కావడం తో చంద్రుడు నిండుగా ఉన్నాడు, చంద్రుడు నిండుగా ఉన్నాడంటే నాకు స్వతంత్రం వచ్చినట్టే ఇక నేను హాయిగా బయటకు వెళ్లి దొరికిన వారికి దొరికినట్టు చంపేసి తినేయ్యోచ్చ్చు అని అనుకుంటుంది.

అలా అనుకుంటూ బయటకు వెళ్లిన దెయ్యానికి కొంత సేపటి తరువాత రాజు అనే ఒక వ్యక్తి కనిపిస్తాడు,

దెయ్యం : ఆహా మధ్య వయసు ఉన్న మగ వ్యక్తి చాలా రోజుల తరువాత దొరికాడు, ఇక ఈ రోజు నేను కడుపునిండా తినవచ్చు అని అనుకుంటూ రాజు దగ్గరకు వెళ్తుంది.

ఆ దెయ్యాన్ని చూసిన రాజు ఒక్కసారిగా భయపడుతూ

రాజు : ఆమ్మో దే దే దెయ్యం, ఇక నేను చచినట్టే రో, నా చావు నన్ను వెతుక్కుంటూ నా దగ్గరికే వస్తుంది, పారిపోరో అని పారిపోబోతాడు

ఇంతలో దెయ్యం వెనుక నుండి పట్టుకొని

దెయ్యం : ఏ రా ఎక్కడికి పోతావు నన్ను వదిలించుకొని పోయిన మొనగాడు ఇంకా పుట్టలేదు, రా రా అని లాక్కుంటుంది.

రాజు : మేడం మేడం దెయ్యం మేడం దయచేసి నన్ను వదిలేయండి, నన్ను వదిలేస్తే మీకు రోజు ఆహారం దొరకాలని రోజు గుడికి వెళ్లి కొబ్బరి కాయలు కొడతాను అని అంటాడు

దెయ్యం : ఏంట్రా నేనేమన్నా పిచ్చి దాన్ని అనుకున్నావా? ఈరోజు నోటి ముందు ఉన్న ఆహ్హారాన్ని వదిలేసి రోపు ఎప్ప్పుడో దొరికే దాన్ని గురించి ఆశపడతాను అనుకున్నావా? పిచోడా అని చెప్పి ఆ దెయ్యం రాజు గొంతు కొరికి రక్తం తాగి చంపేస్తుంది,

కొంత సేపటి తరువాత ఉదయం అవుతుంది, చంద్రుడు మెల్లిగా మాయమవుతూ ఉంటాడు, అలా చంద్రుడు మాయం అవ్వడం తో ఆ దెయ్యం సాధారణ మహిళా గా మారిపోతుంది,

రాజు చనిపోయిన స్థలం దగ్గర అప్పటికే జనాలు పోగవుతారు, అక్కడికి సాధారణ మహిళ రూపంలో ఉన్న ఆ దెయ్యం కూడా అక్కడికి వస్తుంది. దయ్యం సాధారణ మహిళగా ఉన్నప్పుడు స్వాతి అనే పేరుతో చలామణి అవుతూ ఉంటుంది.

ఆ రాజు చనిపోయిన దగ్గర ఉన్న మనుషులలో వీర అనే వ్యక్తి

వీర : చూడండి, ఇది కచ్చితంగా ఎవరో మనుషులు చేసిన పని అయి ఉండదు, కచ్చితంగా ఇది ఒక దెయ్యం పనే అయి ఉంటుంది. అని అంటాడు

స్వాతి : చూడండి ఇది దెయ్యం చేసిన పనే అని మీరు ఎలా చెప్పగలరు? ఇతనికి ఊరిలో చాలా మందితో గొడవలు ఉన్నాయి, వాళ్లలో ఎవరో చంపేసి ఉంటారు, అని చెప్పి వెళ్ళిపోతుంది. కొంత దూరం వెళ్లిన తరువాత

స్వాతి : ఆమ్మో ఆ వీర గాడు కొంచం అయితే కొంప ముంచే వాడు, ఆ రాజు గాడిని చంపింది నేనని తెలుస్తే ఇక ఊరిలో జనాలెవరు రాత్రి పూట దెయ్యం బయట తిరిగరు, అపుడు నా పరిస్థితి అంతే అనుకుంటుంది.

మర్నాడు రాత్రి స్వాతి దెయ్యం లా మారి ఊరిలో తిరగడానికి వెళ్తుంది. అక్కడ దెయ్యానికి ఇంకొక వ్యక్తి కనిపిస్తాడు అతనిని కూడా రాజు లాగానే చంపేస్తుంది.

దెయ్యం : హమ్మయ్య రెండు రోజుల నుంచి బలే పసందైన ఆహారం నాకు దొరుకుతుంది, ఇలా ప్రతి రోజు వస్తే ఎంత బాగుంటుందో, ల్కాని రేపు అమావాస్య చంద్రుడు ఉండడు, చంద్రుడు లేకపోతే నా శక్తులన్నీ మాయమవుతాయి, ఈ అమావాస్య ఎందుకు వస్తుందో ఏమో? నా లాంటి దెయ్యాల పరిస్థితి ఏంటి? ఆకలితో చావాలా ఏంటి? ఈ సమస్య రాకపోతే ఎంత బాగుండేదో, అనుకుంటూ ఉంటుంది

ఇంతలు దెయ్యానికి ఒక గొప్ప ఆలోచన వస్తుంది.

దెయ్యం : రోజు ఇలా చంద్రుడు వచ్చేది రానిది చూసుకొని ఊరిలోకి వెళ్లాల్సి వస్తుంది, ఒక వేళా చంద్రుడు రాకపోతే నా పరిస్థితి ఆకలితో పస్తులు ఉండాల్సిందే, ఇక సరే ఇంకా కొన్ని రోజుల్లో పౌర్ణమి వస్తుంది, ఆ రోజు చంద్రుడు నిండుగా ఉంటాడు, ఆ రోజు చంద్రుడి దగ్గరికి వెళ్లి దొంగతనం చేసుకురావలసిందే అని అనుకుంటుంది ఇంతలో పౌర్ణమి రాగానే వస్తుంది, దెయ్యం వెళ్లి చంద్రుడిని బందించేసి ఒక కుండలో పెట్టుకొని తీసుకు వస్తుంది, ఇక దెయ్యానికి చంద్రుడు రాకపోకలతో అమావాస్య పౌర్ణమి అని చూడ్డవలసిన అవసరం లేదు, అని కుండలో పెట్టిన చంద్రుడిని తీసుకొని ఊరంతా సమయం అనేది లేకుండా తిరిగి దొరికిన వాళ్ళని దొరికినట్టు తినేస్తూ ఉంటుంది. ఇక దెయ్యం ఆగడాలని అడ్డుకట్ట వేయాలని ఊరిలో కొందరు వ్యక్తులు కలిసి స్వమిజీ దెగ్గరికివెళ్తారు,

స్వామిజి దెగ్గరికి వెళ్లిన వ్యక్తులలో రమేష్ అనే వ్యక్తి

రమేష్ : స్వామిజి మా ఊరిలో దెయ్యం ఆగడాలు మితి మీరు పోతున్నాయి, దానికి చంద్రుడు ఉంటేనే శక్తులు ఉంటాయి, అమావాస్య రోజు చంద్రుడు ఉండడం లేదని చంద్రుడిని దొంగతనం చేసుకొని వచ్చి కుండలో దాచి పెట్టి ఆ చంద్రుడి సహాయంతో అందరిని చంపుతూ ఉంది అని చెబుతాడు

స్వామిజి : దీనిని ఎలా పరిష్కరించాలో నాకు తెలుసు మీరందరు నన్ను ఆ దెయ్యం ఉండే ప్రదేశానికి తీసుకెళ్లండి అని అంటాడు,

దెయ్యం ఇంటి దగ్గరికి వెళ్లిన స్వామిజి ఆ దెయ్యం చంద్రుడిని కుండలో చంద్రుడిని బందించి ఉంచండం చూసి ఆశ్చర్య పోతాడు

వెంటనే ఊరి వాళ్ళతో

స్వమిజీ : చూడండి ఈ దెయ్యం బాధ మీకు వదలాలంటే ఒకటే పరిష్కారం, దెయ్యాన్ని చంద్రుడిని దూరం చేయాల, దెయ్యం శాశ్వతంగా చంద్రుడిని చూడకుండా చేయాలి, నేను ఈ దెయ్యాన్ని ఒక సీసాలో బందించి ఒక బావి లో వేస్తాను, మీరు ఆ బావిని శాశ్వతంగా వాడకూడదు అని చెప్తాడు దానికి ఊరి వాళ్ళు కూడా సరే అంటుటారు,

అనుకున్నట్టు గానే స్వామిజి ఆ దెయ్యాన్ని ఒక సీసాలో బందించి బావి లో పడవేసి ఆ బావిని శాశ్వతంగా మూసి వేస్తాడు, తరువాత చంద్రుడిని దెయ్యం బండికన్నా లోంచి విడిపిస్తాడు.

ఊరికి దెయ్యం నుండి విముక్తి కలిగినందుకు ఊరి ప్రజలందరూ ఎంతగానో సంతోషిస్తారు, స్వామిజి కి కృతజ్ఞతలు చెప్పుకుంటారు,

Add a Comment

Your email address will not be published. Required fields are marked *