చలికాలంలో పేద పిల్లల కష్టాలు | Telugu Stories | Telugu Kathalu | Banana Dreams TV Telugu

అది భయంకరమైన చలి కాలం అవ్వడం తో ఊరి జనాలందరూ ఎవరిళ్ళలో వాళ్ళు బయటకు రాకుండా ఉంటున్నారు, యాడ్ ఈఊరిలో బాలు కీర్తి అనే ఇద్దరు అనాధ పిల్లలు కూడా ఉండేవారు, వాళ్లకి ఒక ఉండడానికి ఒక ఇల్లు లేక చలిని తట్టుకునే శక్తి లేక నానా కష్టాలు పడుతూ ఉంటారు, అలా ఉండగా ఒక రోజు బాలు కీర్తి తో ఇలా అంటాడు,

బాలు : అక్క ఇక నా వల్ల కావడం లేదక్కా, ఇది ఎం చలికాలంలో ఏమో కానీ మనం ప్రాణాలు తీయడానికే వచ్చినట్టుగా ఉంది, ఇక తట్టుకోవడం నా వల్ల కావడం లేదు అని అంటాడు

కీర్తి : ఏమి చేద్దాం తమ్ముడు చలి నుంచి తల దాచుకోవడానికి మనకి ఒక ఇల్లు కూడా లేదు, ఇలాంటి పరిస్థితుల్లో మన ఒంట్లో శక్తి ఉన్నంత వరకు  మనం చలిని ఎదురుకోవడం తప్ప మనం ఇంకా చేయగలిగింది ఏమి లేదు అని అంటుంది

అలా రోజులు గడుస్తూ ఉంటాయి

అలాటి ఒక రోజు బాలు కీర్తి దగ్గరికి వచ్చి ఇలా అంటాడు

బాలు : అక్క మనకి చలి నుంచి కష్టాలు  తప్పినట్టే మనకి కూడా ఒక ఇల్లు కొనుక్కునే అవకాశం వచ్చింది అని అంటాడు

కీర్తి ” ఏంటి తమ్ముడు నువ్వు మాట్లాడేది, మనకి ఒక సొంత ఇళ్ల నువ్వు మాట్లాడేది నిజమేనా అని అంటుంది

బాలు : అవునక్క మనకి నిజంగానే ఇల్లు ఉండబోతుంది,

కీర్తి : ఎలా తమ్ముడు మనకి ఇల్లు ఎలా వస్తుందో చెప్పు అని అంటుంది

బాలు : అక్క మన ఊరిలో ఆనంద్ అనే పెద్ద మనిషి ఉన్నాడు కదా, అతను ఈ ఊరి నుంచి వెళ్లి పట్నం లో స్థిరపడాలి అనుకుంటున్నాడు అంటా అందుకోసం తనకి ఇక్కడ ఉన్న ఆస్తుల పొలాలు అన్ని అమ్మి వెళ్ళాలి అనుకుంటున్నదంటా అందుకోసం ఇంటిని కూడా బేరం పెట్టాడు, ఆ విషం నాకు వడ్డీ వ్యాపారం చేసే వీరయ్య చెప్పాడు, అతను మనకి తక్కువ డబ్బులకు ఇప్పిస్తానని చెప్పాడు అని అంటాడు

కీర్తి : ఇల్లు కొద్నుక్కోవడం అంటే డబ్బులతో కూడుకున్న పని కదా, అంత డబ్బు మరి నీ దగ్గర ఎక్కడిది అని అడుగుతుంది

బ;లు : అదా వీరయ్య తనకి తెలిసిన ఒక మేస్త్రి దగ్గర పనికి చేర్పిస్తాను అన్నాడు, వీరయ్య మొదట ఆనంద్ అడిగిన డ్బంతా కట్టేసి నేను పని చేస్తున్నపుడు రోజు వచ్చిన డబ్బులతో సగం డబ్బులు తీసుకొని మిగిలిన సగము నాకు ఇస్తానని చెప్పాడు అని అంటాడు

కీర్తి : నువ్వు పని చేసిన డబ్బులతో సగం డబ్బులు తీసుకోవడం బాగానే ఉందిలే కానీ ఇలా ఎన్నిరోజులు కట్టాలంటా అని అడుగుతుంది

బాలు : 4 సంవత్సరాలు అక్క అది కూడా ప్రతిరోజు పని పోతేనే అని ఆటాడు

వీరయ్య డబ్బులు ఆనంద్ కి ఇచ్చి బాలు కీర్తి తో మాట్లాడుతూ ఉంటాడదు

వీరయ్య : బాలు కీర్తి చూడండి మీ ఇల్లు ఇది దీనికోసం ఇప్పటినుంచి మీరు కష్టపడాల్సి ఉంటుంది, మీ కష్టాలు చూసి మీ డబ్బులు నేను కట్టాను ఇప్పటినుంచి మీరు నాకు కట్టాల్సి ఉంటుంది, ఏరా బాలు నువ్వు క్రమం తప్పకుండా మేస్త్రి దగ్గర పనికి పోవాల్సి ఉంటుంది, అలా నాలుగు సంవత్సరాలు, అని చెప్పి కొత్త ఇంట్లో బాలు కీర్తిని వదిలేసి వెళ్ళిపోతాడు,

కీర్తి : తమ్ముడు చివరకు మనం కూడా ఒక ఇంట్లోకి వచ్చ్హాము, నేను నా జీవితం లో ఓక ఇల్లు కట్టుకుంటాము అని అనుకోలేదు, అని అంటుంది

కీర్తి మాటలకు బాలు కూడా ఎంతో సంతోషిస్తాడు

అలా కొన్ని రోజులు గడుస్తూ ఉంటాయి బాలుకీర్తి కొనుక్కున్న కొత్త ఇల్ల్లు కొద్దీ కొద్దిగా పాడవడం మొదలవుతుంది

అలా ఇల్లు పాడవ్వడం చూసి బాలు కీర్తి ఎంతో బాధపడుతూ ఉంటారు

బాలు : అక్క మనం ఎంతో ఆశతో ఇల్లు కొనుక్కున్నాం కానీ మన ఆశలన్నీ అడియాశలు అయ్యాయి, నేను వెళ్లి వీరయ్య ని అడిగి వస్తాను అక్క ఇంతటి గురించి అని అంటాడు బాలు

ఇంతలో వీరయ్య అక్కడకి నడుచుకుంటూ వస్తాడు

వీరయ్య రావడం గమనించ్చిన బాలు అతని దగ్గరికి వెళ్ళి ఇలా అంటాడు

బాలు : అంకుల్ మంచి ఇల్లు అని చెప్పి మాతో కొనిపించారు, కొని 10 రోజులు కూడా కావడం లేదు ఇల్లు మొత్తం కూలిపోతూ ఉంది, పైన ఉన్న పైకప్పు నుంచి ఎండా చలి వర్షం అన్ని వస్తున్నాయి లోపలకి ముఖ్యానంగా ఆ మూడింటి నుంచి తప్పించుకోవడానికే కదా ఇల్లు ఉండేది అని అంటాడు

వీరయ్య : ఎండయ్యో ఇది బాగానే ఉంది ఎదో అనాధ పిల్లలు మీరు కష్టపడుతుంటే చూడలేక డబ్బులు ఇచ్చి మరి ఇల్లు కాంపించడమే నీ తప్పయింది కదా అయినా ఇల్లు ఎలా ఉన్నది అనేది నాకు అనవసరం, మీరు నాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తే నేను వెళ్ళిపోతాను అని ఖరాకండిగా మాట్లాడి వెళ్ళిపోతాడు

బాలు కీర్తి తప్పక అదే ఇంట్లో ఉంటూ చలి అయినా వర్షం అయినా ఇంట్లోకి వస్తూ ఉండడం తో చలికి వణుక్కుంటూ వర్షానికి తుడుచుకుంటూ ఉంటూ ఉంటారు

అలా కొన్ని రోజులు గడుస్తూ ఉంటాట్టయి

ఆ ఇంటి అసలు యజమాని అయినా ఆనంద్ పొలాల అమ్మకం లో ఎదో తడబాటు జరిగిందని తెలుసుకొని ఆ ఊరికి వస్తాడు, బాలు కీర్తి ఉంటున్న యింటిగ్దగ్గరకు వస్తాడు, ఆ ఇంట్లో బాలు కీర్తి ఉండడం చూసిన ఆనంద్ ఇలా అంటాడు

ఆనంద్ : హమ్మయ్య పిల్లలు నాకు మిమ్మల్ని ఇలా నా ఇంట్లో చూడడం నాకు ఎంతో ఆనందంగా ఉంది, ఇలా ఎవరైనా పేదలకు లేకా మీ లాంటి అనాధలకు ఈ ఇల్లు చాలా తక్కువ ధరకి దొరక్కలనేదే నా కోరొఇక మీరు ఇలా ఇంట్లో ఉండడం నాకు ఎంతో ఆనందంగా ఉంది అని అంటాడు

కీర్తి : తక్కువ ధరకు ఇచ్చారా? కానీ మేము చాలా ఎక్కువ డబ్బులు పెట్టి కొనుక్కున్నాము, ఆ డబ్బులు కట్టడానికికి మా తమ్ముడు 4 సంవత్సరాలు సగం కూలి డబ్బులు తీసుకుంటూ ఉన్నాడు, అని అంటుంది

ఆనంద్ : ఎక్కడో ఎదో పొరపాటు జరిగింది నేను పట్నం వెళ్లే హడావిడిలో ఉండడం వల్ల ఈ ఇంటి బాధ్యత వీరయ్య చేతిలో పెట్టాను అతను మిమ్మల్ని మోసం చేసి ఎక్కువ డబ్బులు కొనుక్కునేలా చేసి మీరు ఇచ్చిన డబ్బులని అతను వాడుకొని ఉంటాడు నేను కనుక్కుంటాను  అని అంటాడు

ఆనంద్ చెప్పినట్టే వీరయ్యనిఇంటికి పిలిచి బాలు కీర్తి ముందే ఇల్లు అమ్మకం గురించి మాట్లాడతాడు, వీరయ్య చేసిన మోసాన్ని భయటపెడతాడు ఆనంద్

వీరయ్య తప్పు ఒప్పుకున్నా తరువాత ఆనంద్ ఇలా అంటాడు

ఆనంద్ : వీరయ్య నువ్వు వీళ్ళ దగ్గర ఎంత డబ్బు ఎక్కువ తీసుకున్నావో అదంతా వాళ్ళకి తిరిగి ఇచ్చేయ్ అలాగే పసి పిల్లలలయిన వీళ్ళని మోసం చేసినందుకు ఇల్లు బాగు చేసి ఇవ్వాల్సిన భాద్యత కూడా నీదే అని అంటాడు

ఆనంద్ చెప్పినట్టు గానే వీరయ్య ఇల్లు బాగుచేసి ఇస్తాడు అప్పటి నుంచి బాలు కీర్తి తమ సొంత ఇంట్లో ఎంతో ఆనందంగా జీవిస్తుంటారు

1 మినిట్ స్టోరీ

ఒక ఊరిలో బాలు కీర్తి అనే ఇద్దరు అనాధ పిల్లలు ఉంటారు, వాళ్లకి సొంత వాళ్ళు అనే వారు ఎవరు లేరు. అది చలి కాలం అవ్వడం తో ఇద్దరు ఉండడానికి ఇల్లు లేకపోవడంతో బయట కష్టాలు పడుతూ ఉండేవారు, అలా ఉండగా ఒకరోజు వీరయ్య మోసం చేసి ఒక పాత కాలపు ఇంటిని బాలు కీర్తి లతో ఎక్కువ డబ్బులకి  కొనిపిస్తాడు, ఆ ఇల్లు పాడవుతున్న కొద్దీ బాలు కీర్తిలకు వీరయ్య చేసిన మోసం బయట పడుతుంది, ఇంకా కొంత మందితో కలిసి వీరయ్యని నిలదీయగా అతని తప్పును ఒప్పుకొని డబ్బులు తిరిగి ఇచ్చేస్తాడు వీరయ్య, అప్పటినుంచి బాలు కీర్తి ఎంతో ఆనందంగా జీవిస్తుంటారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *