జైన్టు డాగ్ మ్యాజిక్_ Telugu Stories- Stories in Telugu – Panchatantra Kathalu

సింహాచలం అనే ఒక చిన్న గ్రామం ఉండేది.గ్రామంలో ప్రజలు పొలం పనులు చేసుకుంటూ ఎంతో సంతోషంగా ఉంటారు.

మా ఊర్లో ఒక ముసలి వ్యక్తి అయిన ప్రభాకర్ ఉంటాడో అసలు జంతు ప్రేమికుడు. అతను ఒక రోజు పక్క ఊరి నుంచి నడుచుకుంటూ వస్తుంటే పెద్ద వర్షం కురుస్తుంది. అతను ఒక చెట్టు కింద నిలబడి…. అబ్బా ఇప్పుడే ఇంత పెద్ద వర్షం పడాల ఇప్పుడు నేను ఎలా
ఇంటికి తిరిగి వెళ్లాలి. అనుకుంటూ ఉండగా దూరంలో ఒక చిన్న కుక్కపిల్ల అరుస్తూ ఆ వర్షంలో తడుస్తూ చలికి వణుకుతూ కనబడుతుంది. దానిని చూసిన అతను….
అయ్యో పాపం కుక్క పిల్ల చలికి వణికి పోతుంది . అంటూ దాని దగ్గరకు వెళ్లి దగ్గరకు తీసుకుంటాడు. కొంత సమయం తరువాత వర్షం ఆగిపోతుంది అతను వెంటనే ఆ కుక్క పిల్లని తీసుకోని తన ఇంటికి వెళ్తాడు. దానికి ఆహారం పెట్టి చాలా చక్కగా చూసుకోవడం మొదలుపెడతాడు. అలా రోజులు గడిచాయి
ఆ కుక్కపిల్ల పెద్దదవుతుంది. ఆ సమయంలోనే ప్రభాకర్ ఆరోగ్యం సరిగ్గా ఉండక జబ్బు చేసి మంచాన పడ్డాడు. ఆ విషయమై కుక్క చాలా బాధపడుతు…. ఏమైంది నీకు భగవంతుడా మా యజమానికి ఏం కాకుండా చూడు. అంటూ కన్నీరు కారుస్తోంది అతను కూడా దాని వైపు చూస్తూ… నాకు ఎంతో మంది ఉన్నప్పటికీ ఒక్కరు కూడా నా బాగోగులు చూసింది లేదు. పాపం అని నిన్ను చే రా తీసినందుకు నా కోసం కన్నీళ్లు కారుస్తూ దేవుని ప్రార్థిస్తున్నాను.
నాకు ఇది చాలు అనుకుంటూ సంతోషపడుతూ కన్నుమూసాడు.
ఆ కుక్క అతని వైపు చూస్తూ భోరున ఏడవడం ప్రారంభిస్తుంది. అలా రోజులు గడిచాయి ఆ కుక్కకి ఒక పూట అన్నం కూడా దొరకక వీధిన పడుతుంది. దాని శరీరమంతా గజ్జి రావడం అలాగే అది చూడటానికి అసహ్యంగా తయారవుతుంది. పాపం అది ఒక రోజు రాత్రి ఆకలితో అల్లాడి పోతుంది….భగవంతుడ నాకు చాలా ఆకలిగా ఉంది. ఎవరైనా ఒక ముద్ద అన్నం పెడితే బాగుండు అంటూ అటూ ఇటూ చూస్తూ ఒక ఇంటి ముందుకు వెళ్లి ఆకలితో అరవడం మొదలు పెడుతుంది ఇంట్లో ఉన్న ఒక ఆమె కర్ర తీసుకొని వచ్చి ….. పో పో మాయదారి కుక్క ఎక్కడి నుంచి దాపురించిం దో. ఆ ప్రభాకర్ పోతూ పోతూ దీని వీధి లో పడేసి పోయాడు. ఒకటే అరుపులు ఏడుపులు నిద్ర కూడా ఉండటం లేదు . అంటూ కర్ర నీ దాని పైకి విసిరేస్తోంది.
పాపం ఆ కర్ర ఆ కుక్క కాలికి తగిలి ఏడుస్తూ కుంటుకుంటూ….. అబ్బ భగవంతుడా ఎందుకు వీళ్ళు నన్ను ఇలాగే కొడుతున్నారు అసహ్యించుకుంటున్నారు నేను ఏం పాపం చేశాను. నాకు మా యజమాని ఉంటే ఇదంతా జరిగేది కాదు. అంటూ భోరున ఏడవడం మొదలుపెడుతుంది. ఆ అరుపులు వినలేక మరి కొందరు బయటకు వచ్చి…. చాయ్ చాయ్ మా ఇంటి ముందుకొచ్చి ఏడుస్తున్నావు . మాకు లేనిపోని దరిద్రాన్ని అంటగట్టి లనుకుంటున్నావా అని దాన్ని తరిమేస్తారు. అలా రోజులు గడిచాయి ఆ కుక్క ఆకలితో అల్లాడి పోతుంది. అది వీధులు పైన అటూ ఇటూ తిరుగుతూ వచ్చే పోయే వాళ్ళ వైపు ఆశగా ఏమన్నా పెడతారని చూస్తూ ఉంటుంది. ప్రతి ఒక్కరూ దాన్ని చూసి అసహ్యించుకుంటూ తరిమి కొడుతూ ఉంటారు. పాపం ఒకరోజు ఆ కుక్క ఒంటరిగా కూర్చుని ఏడుస్తూ….భగవంతుడా నేను ఎవరికి ఏమి అన్యాయం చేశాను ఇలాగా పుట్టడం నా తప్పా. నువ్వు సృష్టించిన సృష్టి లోనే కదా నేను కూడా ఉంది. అలాంటప్పుడు నన్ను వీళ్లంతా ఎందుకు అసహ్యించుకుంటున్నారు నేను చేసిన తప్పేంటి. అంటూ బోరున ఏడుస్తుంది.
అప్పుడే ఒక స్వామీజీ అటుగా రావడం గమనిస్తుంది అతన్ని చూసిన ఆ కుక్క భయంతో అక్కడినుంచి పక్కకు వెళుతుంది.
ఆ స్వామీజీ దాని వాలకాన్ని గమనించి ఆ కుక్క వైపుగా వెళ్తాడు. ఆ కుక్క స్వామీజీని చూసి భయపడుతూ….అయ్యా నేను నిన్ను ఏం చేయలేదు కదా ఎందుకు నా వెంట పడుతున్నారు నన్ను కొట్టకు నా దగ్గర ఓపిక లేదు తిండి తిని ఎన్నో రోజులు అవుతుంది నేను నీరసంతో ఉన్నాను నువ్వు ఒక్క దెబ్బ కొట్టావ్ అంటే నేను చచ్చిపోతాను. అని ఏడుస్తూ బాధపడుతుంది.
దాని భావాన్ని అర్థం చేసుకున్న స్వామీజీ…. బాధ పడకు భయపడకు నేను నీకు సహాయం చేయడం కోసం వచ్చాను నిన్ను బాధించడం కోసం కాదు. అసలు ఎందుకు ఇలాగ బాధపడుతున్నావు. ఏం జరిగింది.
కుక్క ఏడుస్తూ….. అయ్యా స్వామి నేను కూడా ఈ సృష్టిలో ఒక జీవిని. ఒక మహానుభావుడు నా పై దయతలిచి ఇంటికి తీసుకెళ్ళి ఒక ముద్ద అన్నం పెట్టాడు. అతనికి నేను జన్మ జన్మ రుణపడి ఉంటాను అతనే ఉంటే నన్ను ఎవరు అసహ్యించుకునే వాళ్ళు కాదు. ఆయన కాలం చేసి నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు నేను ఇప్పుడు ఒంటరిదాన్ని . మనుషులు ముందు అసహ్యకరమైన జీవిని. అంటూ బోరున ఏడుస్తుంది.
స్వామీజీ…. బాధపడకు నేను నీకు సహాయం చేస్తాను. నువ్వు నాతో పాటే నా ఆశ్రమంలో నే ఉండొచ్చు. అందుకు ఆ కుక్క చాలా సంతోష పడుతూ….. ధన్యురాలు స్వామి మీరు చెప్పిన మాటతో నా జన్మంతా ధన్యమైపోయింది. అని చాలా సంతోషపడుతుంది ఆ తర్వాత కుక్క స్వామిజి తో పాటు తన ఆశ్రమానికి వెళుతోంది. అక్కడ దానికి రుచికరమైన ఆహార పదార్థాలు ఉంటాయి. దానికి ఇష్టం వచ్చినట్టుగా అక్కడే ఉంటూ హాయిగా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది అలా రోజులు గడిచాయి ఒకరోజు ఒక ఆమె స్వామీజీని చూడడానికి వస్తుంది. అప్పుడే ఆశ్రమంలో కుక్క ఆమెకు ఎదురవుతుంది.
దానిని చూసి చి చి ఈ కుక్క కనబడక పోతుంటే . చచ్చిపోయిన అనుకున్నాను ఇంకా ఇక్కడే ఉందా . శుభమా అని చెప్పి స్వామి దర్శనం కోసం వెళ్తున్నాను. ఇలా ఎదురయింది ఏంటి అపశకునం జరుగుతుందో ఏమో అని అనుకుంటూ కానీ తిడుతూ ఉంటుంది ఆ మాటలు విన్న కుక్క తన మనసులో… ఎందుకు నాకు ఈ కర్మ వీళ్ళు ఇంకా నువ్వు ఎందుకు అసహ్యించుకుంటున్నారు అని చాలా బాధపడుతూ అక్కడి నుంచి వెళ్లి పోతుంది.
అప్పుడే స్వామీజీ బయటికి వస్తాడు. ఆమె స్వామీజీకి నమస్కారం చేస్తూ…. స్వామి ఆశ్రమంలో ఆవుల్ని పెంచడం చూశాను కానీ. ఇలా వీధిన పోయే కుక్కల ను పెంచడం ఏంటి స్వామి. పైగా అది చూడటానికి అసహ్యంగా ఉంది. అది రాత్రి సమయాల్లో మా వీధిలో అరుస్తుంటే ఎన్నిసార్లు చీ కొట్టి తరిమేశానో.
దానిని మళ్లీ ఇక్కడ చూడడం నాకు అస్సలు ఏమాత్రం నచ్చలేదు స్వామి.
స్వామీజీ….. నువ్వు అంతగా అసహ్యించు కోడానికి అది చేసిన తప్పేంటి అమ్మా. వికారంగా ఉండడం మా లేక ఆకలి కోసం కేకలు వేయడం మా. మనుషుల కంటే కుక్క చాలా విశ్వాసం గా ఉంటుంది. ఒక్క ముద్ద అన్నం పెడితే తోకని ఊపుకుంటూ నీ చుట్టే తిరుగుతుంది.అది మీ నిద్ర పాడు చేయడానికి అలా చేయలేదు ఆకలితో బాధపడుతూ అలా కేకలు వేసింది అంతే.
ఆ మాటలకి ఆమెకు ఏం చెప్పాలో అర్థం తప్పై పోయింది స్వామి క్షమించండి అంటూ అక్కడి నుంచి వెళ్లి పోతుంది.
అప్పుడు ఆ కుక్క బాధపడుతూ స్వామి దగ్గరకు వెళ్లి…. స్వామి నాకు మీ మాయ ముక్తిని ప్రసాదించండి నా ఈ బ్రతుకు బ్రతకాలని లేదు. దయచేసి నాకు ముక్తిని ప్రసాదించు స్వామి అంటూ పెద్ద పెద్దగా ఏడుస్తూ స్వామి నీ ప్రాధేయ పడుతుంది.
స్వామీజీ…. బాధపడకు ప్రతి ఒక్క జన్మకు ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది. కచ్చితంగా ఆ రోజు వస్తే నీ గొప్పతనం నీ ప్రతిభ అందరు గుర్తిస్తారు. ఆ రోజు కోసం ఎదురు చూస్తూ ఉండు నీకు అంతా మంచే జరుగుతుంది.
అంటూ దాన్ని ఆశీర్వదిస్తాడు.
ఆ కుక్క…. అంటే ఏంటి స్వామి అప్పటివరకు నేను ఇలాగా అందరి చేత మాటలు పడాల్సిందే నా.
స్వామీజీ….. నా నోటా ఏదైనా పలుకు వచ్చింది అంటే అది ఖచ్చితంగా మంచి కోసమే. అందరు నిన్ను మెచ్చుకునే రోజు వస్తుంది నీకు నేను వరాన్ని ఇచ్చేశాను.
ఎవరైనా కష్టంలో ఉన్నప్పుడు నీ రూపం భారీగా మారి వాళ్ళకి సహాయం చేసే అవకాశం నీకు ఉంది. దాని నువ్వు ఖచ్చితంగా ఉపయోగించుకుంటావ్వూ నలుగురు నిన్ను మెచ్చుకుంటారు ఇది తథ్యం.
అని అంటాడు కుక్క చాలా సంతోష పడుతూ…. ధన్యురాలిని స్వామి అంటుంది.
అలా రోజులు గడిచాయి ఒక రోజు ఆ ఊరిలో
ఒక హెలికాఫ్టర్ ఒకచోట చిక్కుకుపోయి కనబడుతుంది లోపల ఉన్న వాళ్లు…. కాపాడండి ఎవరైనా మమ్మల్ని కాపాడండి దీన్ని బయటకు తీయండి అంటూ కేకలు వేస్తారు ఊరి ప్రజలంతా అక్కడ చేరుకొని…. అయ్యో లోపల మనుషులు ఉన్నట్టున్నారు. పాపం ఇప్పుడు దానికి ఏం చేయాలి. అంటూ చెప్పుకుంటూ వింతగా దాన్ని చూస్తూ ఉంటారు కానీ ఎవరు వాళ్ళకి సహాయం చేయరు. లోపల ఉన్న వాళ్లు ప్రాణభయంతో కొట్టుకు లడుతూ ఉంటారు.
కొందరు వ్యక్తులు అక్కడ ఒక పెద్ద త్రాడు తీసుకువచ్చి దానికి కత్తి లాగే ప్రయత్నం చేస్తారు కానీ. అది వాళ్ళ వల్ల కాదు. వాళ్లు దాన్ని బయటకు లాగడానికి ప్రయత్నిస్తారు.
చాలా సమయం అయిపోతుంది కానీ
దానిని వాళ్లు కొంచెం కూడా కదమ లేరు.
అప్పుడే ఆ కుక్క అక్కడికి వస్తుంది. దాన్ని చూసిన ప్రజలంతా…. చి చి మాయదారి కుక్క ఎక్కడ ఏం జరిగినా ముందు ఇది మాత్రం ఉంటుంది. ఊళ్ళో పెళ్ళికి కుక్కల హడావిడి లాగా. ఎప్పుడు ఏం జరుగుతుందా ఏం తిందామని ఆవురావురుమంటూ సొంగ కార్చుకుంటూ చూస్తూ ఉంటుంది. పోవే అంటూ దాన్ని తరుముతూ ఉంటారు.
ఆ కుక్క….అయ్యో ఎందుకు నన్ను అలాగే అసహ్యించుకుంటున్నారు నేను సహాయం చేయడం కోసమే వచ్చాను ఒక నిమిషం ఆగండి అంటూ సైగా చేస్తున్నప్పటికీ అక్కడ ఉన్న వాళ్ళు మాత్రం దానిని తరిమి కొడతారు. ఆ కుక్క దూరంగా నిలబడి…అబ్బా లోపల ఉన్న వాళ్ళు ప్రాణభయంతో అల్లాడిపోతున్నారు ఈ మనుషులు ఎందుకు నన్ను సహాయం చేయ నివడంట్లేదు. అంటూ గుబులుగా తిరుగుతూ ఉంటుంది అప్పుడే ఆ కుక్కకి స్వామీజీ చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి.
అది తన మనసులో …. స్వామీజీ నాకు ఒక వరాలు ఇచ్చాడు నేను ఈ విధంగా ఉంటే వాళ్లను అసహ్యించుకుంటారు. నా రూపాన్ని మార్చు కుంటాను అప్పుడే నేను సహాయం చేయడానికి వచ్చాను అని వాళ్ళకి నిజంగా అర్థమవుతుంది. అంటూ మనసులో స్వామీజీని ప్రార్థిస్తుంది. అలా ప్రార్థించిన వెంటనే ఆ కుక్క ఆకారం చాలా పెద్దది గా మారిపోతుంది. దాని ఆకారం చూసిన ప్రజలంతా ఆశ్చర్యపోతూ…. ఓరి భగవంతుడా ఉన్నట్టుండి ఎంత పెద్ద గా మారింది. అనుకుంటూ ఆ కుక్క నడుచుకుంటూ అక్కడికి వెళుతుంది. అక్కడ ఉన్న తాడుని హెలికాఫ్టర్ కి కట్టి తన నోటితో బలంగా దానిని లాగుతుంది. అక్కడ ఉన్న వాళ్ళు…. ఎంత బలం దీనికి సునాయసంగా లాగుతుంది. ఓరి భగవంతుడా ఏంటి ఈ వింత. అది అనుకుంటూ ఉంటారు. ఆ కుక్క హెలికాఫ్టర్ ని బలంగా లాగి దానిని బయటకు తీస్తుంది. లోపల ఉన్న వాళ్లు బయటకు వచ్చి. ఆ కుక్కలు చూసి…. చాలా కృతజ్ఞతలు నీకు మా ప్రాణాలు కాపాడావు. అంటూ చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను . అక్కడ ఉన్న వాళ్లు కూడా చప్పట్లతో…. భలే మంచి పని చేశావు నువ్వు అంటూ దాన్ని మెచ్చుకుంటూ ఉంటారు. దానిని అంతా చూసిన కుక్క చాలా సంతోష పడుతూ…. భగవంతుడా ఈనాటికీ మనుషులంతా నన్ను మెచ్చుకుంటున్నారు. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇదంతా నీ కృప స్వామీజీ కృప. కానీ తన నోటి ద్వారా బలంగా హెలికాప్టర్లు లాగడంతో దానికి నోటికి పెద్ద గాయం తగిలి రక్తం కారు కుంటూ కింద పడిపోతుంది. దానిని చూసిన ప్రజలు…. అయ్యో ఏమైంది ఈ కుక్కకు నోటి ద్వారా రక్తం వస్తుంది అయ్యో పాపం అంత బలమైన వస్తువు లాగడంతో దానికి ఏదో అయింది.
అనుకుంటూ ఉంటారు ఉన్నట్టుండి ఆ కుక్క పెద్దగా అరిచి చనిపోతుంది.
అక్కడ ఊరి ప్రజలంతా… అయ్యో పాపం ఇన్ని రోజులు మనం ఆ కుక్క ని అసహ్యించుకున్నా ము. పాపం ఇది ఎంత పెద్ద మేలు చేసింది లోపల ఉన్న వాళ్ల ప్రాణాలు కాపాడింది. మనం దీనిపట్ల తప్పుగా ప్రవర్తించాను అని అంటూ వాళ్ళు చాలా బాధ పడతారు. అదే ఊర్లో దానికి ఒక పెద్ద విగ్రహం కట్టి పాల అభిషేకాలు కూడా చేస్తారు.
దానిని అంతా చూస్తున్న స్వామీజీ…. పిచ్చి వాళ్ళు బతికి ఉన్నప్పుడు ఒక గుక్కెడు పాలు పోసినట్టు అయితే అది చాలా సంతోష పడేది బతికి ఉన్నప్పుడు ఏమో ఛీ అన్నారు వాళ్లకి మేలు చేసేటప్పటికి విగ్రహాలు కట్టి పాలాభిషేకాలు చేస్తున్నారు. ఎప్పుడు మారుతారు ఏమో అనుకుంటూ వెళ్ళిపోతాడు. నిజమే కదా అది బ్రతికి ఉన్నప్పుడు గుప్పెడు పాలు పోసినట్లు అయితే ఎంతో బాగుండేది. ఇప్పుడు బిందెడు బిందెడు పాలు వృధా చేయడం తప్ప ఉపయోగం ఏమీ లేదు.ఈ కథనానికి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *